2010–2019
లెక్కకు మించిన విలువ
అక్టోబర్ 2017


లెక్కకు మించిన విలువ

మన ఆత్మీయ విలువ యొక్క సత్యమును ద్రువీకరిస్తూ, పరిశుద్ధాత్మ యొక్క మధురమైన గుసగుసలను మనము తరచుగా చవిచూడగలము.

పశ్చిమ ఆఫ్రికాలో సీయార్రా లీయోన్ దేశమును సందర్శించుచుండగా, ఒక స్టేకు ప్రాథమిక నాయకురాలి చేత నిర్వహించబడిన ఒక సమావేశములో నేను పాల్గొన్నాను. మరియామా ఎంత ప్రేమ, కనికరము, మరియు విశ్వాసముతో నడిపించిందంటే, ఆమె చాలా కాలంగా సంఘ సభ్యురాలిగా ఉన్నదని ఊహించుట సులువైనది. కాని మారియమా, ఈ మధ్యనే మార్పు చెందినది.

చిత్రం
మారియమా మరియు ఆమె కుమార్తె

ఆమె చెల్లి సంఘములో చేరింది మరియు తనతోపాటు ఒక సంఘ తరగతికి హాజరుకమ్మని మరియామాను ఆహ్వానించింది. మరియామా ఆ సందేశముచేత లోతుగా ఆకట్టుకోబడింది. ఆ పాఠము పవిత్రత చట్టము గురించి. ఆమె మిషనరీలను తనకింకా బోధించమని అడిగింది మరియు త్వరలో ప్రవక్త జోసెఫ్ స్మిత్ గురించి సాక్ష్యమును పొందింది. ఆమె 2014లో బాప్తీస్మము తీసుకొన్నది, మరియు ఆమె కుమార్తె గత నెలలో బాప్తీస్మము తీసుకొన్నది. ఊహించండి, రెండు ప్రధాన బోధనలు మరియామా యొక్క మార్పుకు దారితీసినవి, పవిత్రత యొక్క చట్టము మరియు ప్రవక్త జోసఫ్ స్మిత్, ఆ రెండు విషయాలు ప్రపంచము తరచుగా అసంబద్ధమైనవిగా, కాలం చెల్లినవిగా, లేక అసౌకర్యమైనవిగా చూసేవి. కాని తాను వెలుగుకు ఆకర్షించబడిన చిమ్మెటవలె ఉన్నానని మరియామా సాక్ష్యమిచ్చింది. “నేను సువార్తను కనుగొన్నప్పుడు, నన్ను నేను కనుగొన్నాను.” ఆమె దైవిక సూత్రముల ద్వారా తన విలువను కనుగొన్నది. దేవుని కుమార్తెగా తన విలువ పరిశుద్ధాత్మ ద్వారా ఆమెకు బయల్పరచబడింది.

ఇప్పుడు భారతదేశము నుండి సింగ్ సహోదరీలను మనము కలుసుకుందాము. కుడివైపు దూరంగా ఉన్న రేణు, సంఘములో చేరిన ఐదుగురు సహోదరీలలో మొదటి వారు, ఈ ఆలోచనలను పంచుకొన్నది:

చిత్రం
సింగ్ సహోదరీలు

“నేను సంఘాన్ని పరిశోధించుట ప్రారంభించకముందు, నేను చాలా ప్రత్యేకమైన దానినని నేను నిజంగా భావించలేదు. నేను కేవలము అనేకమంది జనులలో ఒకరినని, ఒక వ్యక్తిగా నేను ఏదైనా విలువ కలిగియున్నానని నా సమాజము మరియు సంప్రదాయము నాకు బోధించలేదు. నేను సువార్తను నేర్చుకొని, మన పరలోక తండ్రి యొక్క కుమార్తెనని నేర్చుకొన్నప్పుడు, అది నన్ను మార్చివేసింది. హఠాత్తుగా నేను చాలా ప్రత్యేకంగా భావించాను---వాస్తవానికి దేవుడు నన్ను సృష్టించాడు మరియు నా ఆత్మ, నా జీవితాన్ని విలువ మరియు ఉద్దేశముతో సృష్టించాడు.

“నా జీవితంలో నాకు సువార్త లేకముందు, నేను ఎవరికైనా ప్రత్యేకమైన దానినని ఇతరులకు రుజువు చేయటానికి నేనెల్లప్పుడు ప్రయత్నించాను. కాని నేను దేవుని కుమార్తెననే సత్యమును తెలుసుకొన్నప్పుడు, నేను ఎవరికి ఏమీ రుజువు చేయనవసరం లేదు. నేను ప్రత్యేకమైన దానినని నాకు తెలుసు. . . . మీరు ఏమీ కాదని ఎప్పుడూ అనుకోవద్దు.”

ఆయన ఈ మాటలను చెప్పినప్పుడు, అధ్యక్షులు థామస్  ఎస్. మాన్సన్ దానిని చక్కగా చెప్పారు: “ఆత్మ యొక్క విలువ ఏమనగా దేవుని వలే కాగల దాని సామర్ధ్యము.” 1

చిత్రం
తైనా

ఇటీవల ఇదే సత్యమును గ్రహించిన మరొక యువతిని కలుసుకొనుటకు నేను దీవించబడ్డాను. ఆమె పేరు తైనా. నేను ఆమెను సాల్ట్ లేక్ సిటీలో ప్రైమరీ పిల్లల హస్పిటలు వద్ద కలిసాను. తైనా కాన్సరుతో గుర్తించబడినప్పుడు, ఆమె ఉన్నత పాఠశాలలో జూనియర్ గా ఉన్నది. ఈమధ్యనే కొన్ని వారాల క్రితం చనిపోకముందు 18 నెలలుగా ధైర్యముగా యుద్ధము పోరాడింది. తైనా వెలుగు మరియు ప్రేమతో నిండియున్నది. ఆమె తన చిరునవ్వు, చిహ్నమైన డబుల్ థంప్సప్ ప్రసిద్ధి చెందింది. ఇతరులు అడిగినప్పుడు, “తైనా, నీవే ఎందుకు రోగివి కావాలి?” ఆమె జవాబు “నేనే ఎందుకు కాకుడదు?” తాను ఎంతగానో ప్రేమించిన రక్షకుని వలె తాను కావాలని తైనా కోరుకున్నది. మా సందర్శనలందు, ఆమె తన దైవిక విలువను గ్రహించిందని నేను తెలుసుకొన్నాను. ఆమె దేవుని యొక్క కుమార్తె అని తెలుసుకొనుట ఆమె చేసినట్లుగా అనుకూలమైన విధానములో తన అత్యధికమైన శ్రమను ఎదుర్కొనుటకు శాంతిని మరియు ధైర్యమును ఆమెకు ఇచ్చింది.

మనలో ప్రతి ఒక్కరికి మన దైవిక విలువను ఆత్మ నిర్ధారిస్తుందని మరియామా, రేణు, మరియు తైనా మనకు బోధిస్తున్నారు. మీరు దేవుని యొక్క కుమార్తె అని నిజముగా తెలుసుకొనుట మీ జీవితంలో ప్రతీ దశను ప్రభావితం చేస్తుంది మరియు ప్రతీరోజు మీరు ఇచ్చు సేవలో మిమ్మల్ని నడిపిస్తుంది. అధ్యక్షులు స్పెన్సర్ డబ్ల్యు. కింబల్ ఈ మహిమకరమైన మాటలలో వివరించారు:

“దేవుడు మీ తండ్రి. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన, పరలోకములో మీ తల్లి ఏ కొలతను మించి మీకు విలువిస్తున్నారు . . . . మీరు ప్రత్యేకమైనవారు. నిత్య జ్ఞానముచేత సృష్టించబడ్డారు, అది నిత్య జీవముపై హక్కును మీకిచ్చును.

“వ్యక్తిగా మీ విలువ గురించి మీ మనస్సులో ఏ ప్రశ్న ఉండనియ్యకుము. సువార్త ప్రణాళిక యొక్క మొత్తము ఉద్దేశము మీ మొత్తము సాధ్యతను చేరుకొనుటకు మీలో ప్రతిఒక్కరికి ఒక అవకాశమిచ్చుట, అది నిత్య అభివృద్ధి మరియు దైవత్వము యొక్క సాధ్యత.”2

రెండు ముఖ్యమైన మాటల మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరమును నన్ను ప్రత్యేకించి చూపనియ్యుము: విలువ మరియు యోగ్యత. అవి ఒకేవిధంగా లేవు. ఆత్మీయ విలువ అనగా పరలోక తండ్రి మనకు విలువ ఇచ్చినట్లుగా, మనకు మనం విలువిచ్చుట, లోకము మనకు విలువిచ్చినట్లుగా కాదు. మనము భూమి మీదకు రాకముందే మన విలువ తీర్మానించబడింది. “దేవుని యొక్క ప్రేమ అంతములేనిది మరియు అది శాశ్వతంగా సహించును.” 3

మరొకవిధంగా,యోగ్యత విధేయత ద్వారా సాధించబడును. మనము పాపము చేసిన యెడల, మనము తక్కువ యోగ్యత కలిగియుంటాము, కాని మనము ఎప్పటికీ విలువ లేనివారము కాదు! మనము పశ్చాత్తాపపడుట మరియు మన విలువ చెక్కు చెదరకుండా యేసు వలె ఉండుటకు ప్రయాసపడుటను కొనసాగిస్తాము. అధ్యక్షులు బ్రిగమ్ యంగ్ బోధించినట్లుగా: “స్వల్పమైనది, ఇప్పుడు భూమి మీద మిక్కిలి అల్పమైనది . . . ప్రపంచాలకు సమానమైన విలువను కలిగియున్నది.” 4

ఈ అద్భుతమైన సత్యమును లక్ష్యపెట్టకుండా, మనలో అనేకులు, అప్పుడప్పుడు, మన గురించి మనము ప్రతికూల ఆలోచనలు లేక భావాలతో, ఏవిధంగా పోరాడుచున్నాము? నేను పోరాడుచున్నాను. అది సులువైన ఉచ్చు. ప్రత్యేకంగా మన దైవిక స్వభావము మరియు ఉద్దేశము గురించి తప్పుడు ప్రాతినిథ్యమునకు వచ్చినప్పుడు, సమస్త అబద్ధములకు తండ్రి సాతాను. మన గురించి మనం అల్పంగా ఆలోచించుట మనకు సహాయపడదు. బదులుగా అది మనల్ని వెనక్కి ఉంచుతుంది. మనము తరచుగా బోధింపబడినట్లుగా, “మీ సమ్మతి లేకుండా ఏ ఒక్కరు మిమ్మల్నిఅల్పంగా భావించునట్లు చేయరు.”5 మనలో చెడు వాటిని వేరోకరి మంచివాటితో పోల్చుటను మనము ఆపగలము. “పోల్చుకొనుట సంతోషాన్ని దొంగిలించును.” 6

వ్యతిరేకంగా, మనము సుగుణమైన ఆలోచనలు కలిగియున్నప్పుడు, ఆయన మనల్ని విశ్వాసముతో, మీరు నిజముగా ఎవరని తెలుసుకొనుటకు విశ్వాసముతో కూడ దీవిస్తానని ప్రభువు మనకు అభయమిస్తున్నాడు. ఆయన మాటలు వినుటకు అత్యంత కీలకమైన సమయము ఇదివరకెన్నడూ లేదు: “సుగుణము మీ ఆలోచనలను నిరంతరము అలంకరించనియ్యుడి,” “అప్పుడు దేవుని సన్నిధిలో మీ విశ్వాసము బలమైనదగును; . . . మరియు  పరిశుద్ధాత్మ మీ నిరంతర సహవాసిగా ఉండును,”7 అని ఆయన అన్నారు.

ప్రభువు ఈ అదనపు సత్యమును ప్రవక్త జోసఫ్ స్మిత్‌కు బయల్పరచెను: “దేవుని నుండి పొందువాడు, అతడు దేవునికి ఘనతను ఇవ్వనిమ్ము; మరియు (దీవెనలు) పొందుటకు తాను యోగ్యునిగా దేవుని చేత భావించబడినందుకు అతడు సంతోషించనియ్యుము.” 8 ఈ వచనము వివరించినట్లుగా, మనము ఆత్మను అనుభవించినప్పుడు, మనము అనుభూతిచెందినది, మన ప్రేమగల పరలోక తండ్రి నుండి వచ్చిందని మనము గుర్తిస్తాము. మనల్ని దీవించినందుకు ఆయనను మనము అంగీకరించి, ఆయనను స్తుతిస్తాము. అప్పుడు పొందుటకు యోగ్యులుగా లెక్కించబడినందుకు మనము సంతోషిస్తాము.

ఒక ఉదయము మీరు లేఖనాలు చదువుతున్నారని, మీరు చదువుచున్నది సత్యమని ఆత్మ మీకు మృదువుగా మెల్లగా చెప్పుటను ఊహించుము. మీరు ఆత్మను గుర్తించగలరా మరియు ఆయన ప్రేమను అనుభవించి, పొందుటకు యోగ్యులని సంతోషించగలరా?

తల్లులారా, మీ నాలుగు సంవత్సరాల వాడు నిద్రపోయేముందు ప్రార్థన చేసినప్పుడు, అతడి ప్రక్కన మీరు మోకరించియుండవచ్చు. మీరు విన్నప్పుడు ఒక ప్రత్యేక భావనను మీరు అనుభవించుటను ప్రారంభిస్తారు. మీరు తన్మయతను మరియు శాంతిని అనుభవించియుండవచ్చు. భావన క్లుప్తమైనది, కాని ఆ క్షణమందు మీరు, పొందుటకు యోగ్యులుగా మీరు భావించబడ్డారని మీరు గుర్తిస్తారు. మన జీవితాలలో మనము విశాలమైన ఆత్మీయ ప్రత్యక్షతలను అరుదుగా పొందవచ్చు; కాని మన ఆత్మీయ విలువ యొక్క సత్యమును నిరూపిస్తూ, పరిశుద్ధాత్మ యొక్క మధురమైన గుసగుసలను చవిచూడగలము.

ప్రభువు ఇలా చెప్పినప్పుడు, మన విలువను, ఆయన గొప్ప ప్రాయశ్చిత్తః త్యాగము మధ్య సంబంధమును వివరించాడు:

“దేవుని దృష్టిలో ఆత్మల యొక్క విలువ గొప్పదని జ్ఞాపకముంచుకొనుము;

“ఏలయనగా ఇదిగో, మీ విమోచకుడైన ప్రభువు శరీరమందు మరణమును అనుభవించాడు; కాబట్టి మనుష్యులందరు పశ్చాత్తాపపడి ఆయన వద్దకు వచ్చునట్లు ఆయన మనుష్యులందరి యొక్క బాధను అనుభవించాడు.” 9

సహోదరిలారా, ఆయన మన కొరకు చేసిన దానిని బట్టి, “ప్రేమగల బంధనలచేత మనము ఆయనకు బంధింపబడియున్నాము.” 10 ఆయన అన్నాడు, “నేను సిలువపైన పైకెత్తబడునట్లు నా తండ్రి నన్ను పంపియున్నాడు, మరియు నేను మనుష్యులందరినీ నా వైపు ఆకర్షించుకొనునట్లు, నేను సిలువపైన పైకెత్తబడిన తరువాత.”11

మన రక్షకునితో ఈ బంధించే కలయకను రాజైన బెంజిమెన్ కూడా వివరించాడు: “మరియు ఇదిగో ఇది మరణమునకు తప్ప మనుష్యుడు సహించగలిగిన దాని కంటే అధికముగా కూడ, ఆయన శోధనలను మరియు శరీరము యొక్క బాధను, ఆకలి, దాహము మరియు అలసటను సహించును. ఏలయనగా ఇదిగో ప్రతి రంథ్రము నుండి రక్తము వచ్చును, ఆయన జనుల యొక్క దుర్మార్గము మరియు అసహ్యముల కొరకు అతని వేదన అంత గొప్పగా ఉండును.” 12  ఆ బాధ మరియు ఆ భాధ యొక్క ఫలితము మన హృదయాలను ప్రేమ మరియు కృతజ్ఞతతో నింపును. “ప్రపంచమువైపు మనల్ని లాగివేయు అంతరాయములను తీసివేసి, ఆయనను వెదకుటకు మన స్వతంత్రతను సాధన చేసినప్పుడు, ఆయన వైపు మనల్ని ఆకర్షించు సిలెస్టియల్ శక్తికి మన హృదయాలను మనము తెరుస్తాము.” 13 రక్షకుని కొరకు మరియు ఆయన మన కొరకు చేసిన దానిపట్ల మనము అనుభవించు ప్రేమ మన బలహీలనతలు, స్వీయ-అనుమానములు, లేక చెడు అలవాట్లకు మనమిచ్చు శక్తి గొప్పది అయితే, మన జీవితాలలో బాధను కలిగించు విషయాలను జయించుటకు ఆయన మనకు సహాయపడతాడు. ఆయన మననుండి మనల్ని రక్షిస్తాడు.

నేను పునరుద్ఘాటిస్తున్నాను: లోకము యొక్క ఆకర్షణ రక్షకుని యందు మనము కలిగియున్న విశ్వాసము మరియు నమ్మకము కంటే బలమైనది అయితే, అప్పుడు ప్రతీసారి లోకము యొక్క ఆకర్షణ ప్రబలును. మన ప్రతికూల ఆలోచనలపై మనము దృష్టిసారించి మరియు రక్షకుని పట్టుకొనుటకు బదులుగా, మన విలువను అనుమానించుటకు మనము ఎన్నుకొనిన యెడల, పరిశుద్ధాత్మ యొక్క భావనలు అనుభవించుట ఎక్కువ కష్టతరము అగును.

సహోదరిలారా, మనము ఎవరిమో కలవరపడవద్దు! మన దైవిక గుర్తింపును గుర్తించుకొని మరియు హత్తుకొనుటకు ఆత్మీయ ప్రయత్నము చేయుట కంటే ఆత్మీయంగా స్తబ్ధంగా ఉండుట తరచుగా సులువైనదిగా ఉండగా, ఈ కడవరి దినాలలో ఆ అతిలాలసత్వమును మనము అనుమతించలేము. సహోదరీలుగా మనము, “క్రీస్తునందు విశ్వాసముగా ఉండుము; . . . .క్రీస్తు (మనల్ని) పైకి లేపును గాక, ఆయన శ్రమ మరియు మరణము,   . . . మరియు ఆయన కనికరము, దీర్ఘశాంతము, మరియు ఆయన మహిమ, మరియు నిత్యజీవము యొక్క నిరీక్షణ, (మన మనస్సులందు) నిత్యము నిలిచియుండును గాక.”14  రక్షకుడు మనల్ని ఉన్నతస్థానమునకు లేవనెత్తినట్లుగా, మనము ఎవరమో ఎక్కువ స్పష్టముగా చూచుట మాత్రమే కాదు కానీ మనము ఎప్పటికీ ఊహించిన దానికంటే ఆయనకు దగ్గరగా ఉంటాము. యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో, ఆమేన్.