2010–2019
మన ముందున్న అవసరాలు
అక్టోబర్ 2017


మన ముందున్న అవసరాలు

మన స్వంత కుటుంబాల లోపల, మన స్నేహితుల మధ్య, మన వార్డులు మరియు మన సమాజములలోపల మనము తీర్చగల మిక్కిలి ముఖ్యమైన అవసరాలలో కొన్ని ఉన్నాయి

ఇటీవల దినములలో, మనము విస్తారమైన సంఖ్యలో ప్రకృతి వైపరీత్యాలను మెక్సికో, అమెరికా, ఆసియా లో, కరీబ్బియన్, మరియు ఆఫ్రికాలో చూసాము. ఇవి అవసరము లేక అపాయములో ఉన్న లేక కోల్పోయి న వారికి సహాయపడేందుకువేలమంది జనులలో ముందు అడుగువేసినప్పుడు అది వారిలోని శ్రేష్టమైన దానిని బయటకు తీసుకొనివచ్చింది. టెక్సాస్ మరియు ఫ్లోరిడాలో అనేకమంది ఇతరులతోపాటు యువతులు పసుపు రంగు కలిగిన సహాయపు హస్తములు అనే షర్టులను ధరించి మరియు ఇటీవల తుఫానుల తరువాత ఇండ్లలలోని చెత్తను శుభ్రపరచుటకు సహాయపడటం చూసి నేను పులకరించాను. అంత దూరము కాకపోతే, అనేక వేలమంది, అవసరత కేంద్రముల వద్దకు సంతోషముగా వెళతారు. బదులుగా, బాధను తగ్గించుటకు మీరు ఉదారమైన విరాళములను ఇచ్చారు. మీ ఔదార్యము మరియు కనికరము ప్రేరేపించేవి.

చిత్రం
అధ్యక్షులు ఐరింగ్త్ తో యువతులు

మనమెక్కడ ఉన్నప్పటికినీ---మన అందరికి ముఖ్యమైనది అని భావించి సేవ యొక్క ఒక ఆకృతి అంశం గురించి ఈ రోజున నేను చెప్పాలనుకుంటున్నాను. ఇటీవల సంఘటనల వార్తలను చూ చూసి, ఏమి చేయాలో తెలుసుకొనుటకు నిస్సహాయులుగా భావించిన వారికి, జవాబు వాస్తవముగా మన యెదుట ఉన్నది.

రక్షకుడు ఇలా బోధించెను, “తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దానిని పొగొట్టుకొనును, నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని రక్షించు కొనును. ”1 అధ్యక్షుడు థామస్  ఎస్. మాన్సన్ ఈ లేఖనము గురించి ఇలా చెప్పారు: “మనము ఇతరుల సేవలో మనల్ని పోగొట్టుకుంటే తప్ప మన స్వంత జీవితాలకి ఎక్కువ ప్రయోజనం లేదని రక్షకుడు చెప్తున్నారు అని నేను నమ్ముచున్నాను.” వారికై వారు జీవించువారు చివరకు శుష్కించి మరియు ఉపమానముగా వారి జీవితాలను పోగొట్టుకుంటారు, అయితే ఎవరికైతే ఇతరుల సేవలో వాటిని పోగొట్టుకుంటారో వారు ఎదిగి మరియు వర్దిల్లుతారు. -- ఇది వారి జీవితాలని కాపాడుతుంది.” 2

మనము మన చుట్టూ ఉన్న మనుషులు కన్నా మన చేతిలో ఉన్న ఫోన్ స్క్రీన్ మీద ఎక్కువ దృష్టి పెట్టె సంస్కృతి లో జీవిస్తున్నాము. మనము కళ్ళలోకి చూస్తూ నవ్వుతూ లేక అరుదుగా ముఖా ముఖి సంభాషణ ప్రత్యామ్నాయంగా ఫోన్ లో సందేశాలు పెడుతున్నాము. మనము ఒక స్నేహితుడి భుజము మీద చెయ్యి వేసి ప్రేమనను, చింతను మరియు స్పృశించదగిన ఆసక్తిని చూపు కంటే మనకు సాంఘిక ప్రసార మాధ్యమంలో ఉన్న “అనుచరులు” మరియు “ఇష్టాలు” గురించి ఎక్కువ ఆందోళన చెందుతున్నాము. యేసు క్రీస్తు యొక్క సువార్త సందేశము వ్యాప్తి కొరకు మరియు కుటుంబసభ్యులు మరియు స్నేహితులతో సంబంధము కలిగి ఉండుటకు ఆధునిక సాంకేతిక విజ్ఞానం ఎంత అద్భుతమైనదైనది అయినప్పటికీ, మనము మన స్వంత పరికరాలను వాడుటలో అప్రమత్తంగా లేకపోతే, మనము కూడా లోపలికి తిరిగి మరియు సువార్తను జీవించడం యొక్క సారము సేవ అని మర్చిపోతాము.

మీ యౌవనము మరియు యుక్త వయస్సులో ఉన్న మీ కొరకు నేను అద్భుతమైన ప్రేమను మరియు విశ్వాసమును కలియున్నాను. నేను మీరు సేవ చేయాలి మరియు ప్రపంచంలో ఒక వ్యత్యాసం తీసుకురావాలి అనే అనే మీ కోరికను నేను చూసాను మరియు భావించాను. అనేకమంది సభ్యులు సేవను వారి నిబంధనలు మరియు శిష్యత్వము యొక్క కేంద్రముగా ఉండుటకు పరిగణిస్తున్నారని నేను నమ్ముచున్నాను. కానీ కొన్నిసార్లు మనము ఇతరులకు సేవ చేసే గొప్ప అవకాశాలను పరధ్యానంలో కోల్పోతాము లేక మనము ప్రతిష్టాత్మక విధానములలో ప్రపంచమును మార్చటానికి మనము చూస్తున్నాము కాబట్టి మరియు మన స్వంత కుటుంబాల లోపల, మన స్నేహితుల మధ్య, మన వార్డులు మరియు మన సమాజములలోపల మనము తీర్చగల మిక్కిలి ముఖ్యమైన అవసరాలలో కొన్ని ఉన్నాయని మనము చూడలేము. ప్రపంచమునకు సగము వైపు ఉన్నవారి బాధను మరియు గొప్ప అవసరతలను మనము చూచినప్పుడు మనము సృశించబడుతున్నాము, కానీ తరగతిలో మన ప్రక్కన కూర్చోన్న వ్యక్తికి మన స్నేహము అవసరమని చూచుటకు మనము విఫలము కావచ్చు.

బర్టన్, స్టేక్ ఉపశమన సమాజ అధ్యక్షురాలు సహోదరి లిండా కె. బర్టన్, 1990 కాలంలో, అవసరతలో ఉన్న జనుల కొరకు ఆమె ఇతరులతో కలిసి పని చేసి బొంతలను సేకరించారు. “ఆమె మరియు ఆమె కుమార్తె బొంతలతో నిండి ఉన్న ట్రక్కును లండన్ నుంచి కొసావో కి నడిపారు. ఆ ప్రయాణంలో ఒక స్పష్టమైన ఆత్మీయమైన ముద్రను ఆ ఆమె హృదయములో లోతుగా తాకింది.పొందింది, ఆ ముద్ర ఏమిటంటే: “నీవు ఏదైతే చేసావో అది చాలా మంచి పని. ఇప్పుడు ఇంటికి వెళ్ళు, వీధికి అవతలి వైపు నడువుము, మరియు మీ పొరుగువారికి సేవ చేయి!”3

మనకు సన్నిహితమైన వారి యొక్క మరియు మనము ఎక్కువగా ప్రేమించిన వారి యొక్క అవసరాలను నిర్లక్ష్యం చేసిన యెడల లోకమును కాపాడుట అది మనకు ఏ మేలు చేస్తుంది? మన చుట్టూ ఉన్న జనులుపడిపోతుంటే మనము గమనించకపోతే మనము ప్రపంచమును సరిచూచుటలో ఎంత విలువ ఉంది? వారి అవసరాలను తీర్చుకొనుటకు మనము బాగా సరిపోతామని ఎరిగి, పరలోక తండ్రి, మనము ఎవరికైతే ఎక్కువ అవసరమున్నామో వారికి దగ్గరగా ఉంచియుండవచ్చు.

చిత్రం
శారా మరియు ఆమె సహోదరి నడుస్తున్నారు

ప్రతిఒక్కరు క్రీస్తువంటి సేవను ఇచ్చే మార్గాలను ప్రతీఒక్కరు వెదకగలరు. నా సలహాదారిణి, సహోదరి కారోల్ ఎఫ్. మెఖాంకీ, ఆమె 10 సంవత్సరాల మనవరాలైన శారా గురించి చెప్పారు, ఆమె తన తల్లికి అనారోగ్యముగా ఉన్నదని తెలిసి, తన స్వంతంగా సహాయముగా ఉండాలని నిర్ణయించుకుంది. తన చిన్న చెల్లిని లేపి, బట్టలు తొడిగి, ఆమె పండ్లు తోమించి, ఆమె జుట్టు దువ్వి, మరియు అల్పాహారం తినుటకు సహాయపడింది, ఆవిధంగా ఆమె తల్లి అమ్మ విశ్రాంతి తీసుకొనగలదు. ఆమె అడగబడకుండా మౌనంగా ఈ సాధారణమైన సేవను చేసింది. ఎందుకంటే ఆమె ఒక అవసరమును చూసింది మరియు సహాయము చేయాలని కోరింది. శారా తన తల్లికి ఒక దీవెనగా మారటమే కాకుండా, తాను ప్రేమించు ఒకరి భారమును తేలిక చేసిందని ఎరుగుటలో ఆనందమును కూడా ఆమె అనుభూతి చెందిందని నా నిశ్చయము. అధ్యక్షులు జేమ్స్  ఈ. ఫౌస్ట్ అన్నారు: “ఇతరులకు సేవ చేయుట దాదాపు ఏ వయస్సులోనైనా ప్రారంభించబడవచ్చు . . . . అది గొప్ప స్కేలుపై ఉండనవసరములేదు, మరియు కుటుంబములోపల ఘనమైనది.”4

చిత్రం
శారా మరియు ఆమె సహోదరి ఒక పుస్తకమును చదువుతున్నారు

పిల్లలారా, ఇంట్లో సేవ చేసే విధానాల కొరకు మీరు వెదకినప్పుడు, మీ తల్లి తండ్రులు మరియు మీ కుటుంబ సభ్యులకు ఎంత అర్థవంతమైనదో మీరు గ్రహించారా ? యౌవన సంవత్సరములో ఉన్నవారికి, ప్రపంచమును మార్చుటకు విధానాల కొరకు మీరు వెదకినప్పుడు,మీరు మీ కుటుంబ సభ్యులను బలపరచడం మరియు సేవ చేయడం మీ అత్యంత ప్రధానమైన వాటిలో ఒకటిగా ఉండాలి. మీ తోబుట్టువుల పట్ల మరియు తల్లితండ్రుల పట్ల దయను మరియు అభిమానమునుచూపించుట ఐక్యతగల వాతావరణమును కల్పించుటకు సహాయపడును మరియు గృహములోనికి ఆత్మను ఆహ్వానించును. లోకమును మార్చుట మీ స్వంత కుటుంబమును బలపరచుటతో ప్రారంభమగును.

మన సేవ కొరకు దృష్టిసారించు మరొక ప్రాంతము మన వార్డు కుటుంబాలందు కావచ్చును. అప్పుడప్పుడు, మన పిల్లలు మనల్ని ప్రశ్న అడుగుతారు, “నేనుపరస్పరమునకు ఎందుకు వెళ్ళాలి? దానిలో పెద్దగా నేను ఏమీ పొందటంలేదు.”

నాకు ఒకవేళ మంచి తల్లి, తండ్రిగా నేర్పించే క్షణం దొరికినట్లైతే, నేను ఇలా జవాబిచ్చేదానను, “నువ్వు పరస్పరమునకు వెళితే ఎదో వస్తుంది అనిఏది నీవు ఆలోచించునట్లు చేస్తుంది?”

నా యౌవన స్నేహితులారా, మీరు హాజరు అయ్యే ప్రతీ సంఘ సమావేశములో ఎల్లప్పుడు, ఎవరోఒకరు ఒంటరిగా ఉండి, సవాళ్ళను ఎదుర్కొంటు ఉండి మరియు ఒక స్నేహితుడు అవసరమైన వారు ఉంటారు లేక అతడు లేక ఆమె చేర్చబడలేదని భావించేవారు ఉంటారని నేను మీకు ఖచ్చితముగా హామీ ఇవ్వగలను. ప్రతీ సమావేశమునకు లేక కార్యక్రమమునకు తోడ్పడుటకు ఏదైనా ముఖ్యమైన దానిని మీరు కలిగియున్నారు, మరియు మీ తోటివారి చుట్టూ చూడుము మరియు ఆయన చేసినట్లుగా పరిచర్య చేయాలని ప్రభువు మిమ్మల్ని కోరుతున్నారు.

ఎల్డర్ డి. టాడ్ క్రిస్టాఫర్సన్, ఇలా బోధించారు, “ప్రభువు ఒక సంఘమును కలిగియుండుటకు ప్రధానమైన కారణము, నిత్యజీవమునకు నడిపించు తిన్నని మరియు ఇరుకైన దారిలో” ఒకరినొకరిని ఆమోదించునట్లు పరిశుద్ధుల సమాజమును సృష్టించుట.” ఈ మతము స్వంతముతో మాత్రమే చింతించుటలేదు, బదులుగా, మనమందరము సేవ చేయుటకు పిలవబడ్డాము. మనము క్రీస్తు యొక్క కన్నులు, చేతులు, తల, పాదములు, మరియు శరీరము యొక్క మిగిలిన సభ్యులము.5

మనము వారపు సంఘ సమావేశములు విధులందు పాల్గొనుటకు, సిద్ధాతమును నేర్చుకొనుటకు, మరియు ప్రేరేపించబడేందుకు హాజరు అవుతాము, కానీ హాజరగుటకు మరొక చాలా ముఖ్యమైన కారణం ఏమిటంటే, వార్డు కుటుంబముగా మరియు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శిష్యులుగా, మనము ఒకరిని ఒకరు కావాలి కాయాలి, ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి, మరియు ఒకరినొకరు సేవ చేయుటకు మరియు బలపరచుటకు మార్గములను వెదకాలి మరియు ఒకరిని ఒకరు బలపరచుకోవాలి. సంఘములో ఇచ్చిన దాని గ్రహీతలము లేకు తీసుకొనువారము మాత్రమే కాదు, మనము ఇచ్చే వారము మరియు అందించే వారిగా ఉండాల్సినవసరమున్నది. యువతులు మరియు యువకులారా, తదుపరి పరస్పర సమావేశానికివెళ్ళినప్పుడు, ఫోన్ తీసి మీ స్నేహితులు ఎం చేస్తున్నారని చూడటానికి బదులుగా, చుట్టూ చుడండి మరియు “ఈరోజు నేను ఎవరికి అవసరము?” అని మిమ్మల్ని ప్రశ్నించుకోండి. ఒక తోటివారి జీవితమును సమీపించి, స్పృశించుటకు లేక మౌనంగా ప్రయాసపడుతున్న ఒక స్నేహితుడికి ప్రోత్సాహమును ఇచ్చుటకు మీరు ఆధారము కావచ్చు.

మీ చుట్టూ ఉండి, మీ సహాయము అవసరమైన వారిని చూపమని మరియు వారికి ఉత్తమంగా ఎలా సేవ చేయాలో మిమ్మల్ని ప్రేరేపించమని మీ పరలోక తండ్రిని అడుగుము. రక్షకుడు మిక్కిలి తరచుగా ఒక వ్యక్తికి ఒకే సమయములో పరిచర్యలు అందించాడని గుర్తుంచుకొనుము.

చిత్రం
ఈథన్ మరియు అతడి కుటుంబము

మా మనవడు ఈథన్‌కు పదిహేడు సంవత్సరాలు. ఈ వేసవికాలం అతని తల్లి మాదిరిచేత ప్రేరేపించబడి, ప్రతీరోజు ఎవరైనా ఒకరికి సేవ చేయుటకు ఒక అవకాశమును కలిగియుండుటకు అతడు ప్రార్ధన చేసాడని నేను కదిలింపబడ్డాను. మేము అతడి కుటుంబముతో సమయము గడుపుచుండగా, ఈథన్ తన తమ్ముడు మరియు చెల్లెలతో ఓపికగా, ప్రేమ, మరియు దయతో ఎలా చూస్తున్నాడు, మరియు ఇతరులను సమీపించుటకు మార్గములను వెదకుట, వారికి సేవ చేయుటకు అతడి కోరికను నేను గమనించాను. అతడి చుట్టూ ఉన్నవారిని ఎరిగి, వారికి సేవ చేయుటకు అతడి కోరికతో నేను ఆకట్టుకోబడ్డాను. అతడు నాకొక మాదిరిగా ఉన్నాడు. ఈథన్ వలె చేయుట----సేవ చేయుటకు మార్గములను కనుగొనుటకు ప్రభువును ఆహ్వానించుట---మన చుట్టూ ఉన్నవారి అవసరాలను చూచుటకు మన కన్నులను తెరచుటకు, ఆరోజు మనము అవసరమైన “ఒకరిని” చూచుటకు, మరియు అతడు లేక ఆమెకు ఎలా పరిచర్య చేయాలో తెలుసుకొనుటకు ఆత్మ అనుమతించును.

చిత్రం
ఈథన్ యొక్క చిత్రము

మీ కుటుంబము మరియు మీ వార్డు సభ్యులకు సేవ చేయుటకు అదనంగా, మీ ఇరుగు పొరుగు ప్రాంతములో మరియు సమాజములో సేవ చేసే అవాకాశాల కొరకు చూడండి. కొన్ని సార్లు ప్రధాన విపత్తు వచ్చిన తరువాత సహాయము కొరకు మనము పిలువబడతాము, కానీ రోజు రోజుకు మనము మన సొంత ప్రాంతములో అవకాశాల కొరకు చూడాలి మరియు అవసరతలో ఉన్నవారికి సహాయము అందించి లేవనెత్తుటకు ప్రోత్సహించ బడతాము. నేను ఈ మధ్యకాలములో తాత్కాలిక సవాళ్లు ఎదుర్కుంటున్న దేశంలో సేవ చేస్తున్న ప్రాంతీయ అధ్యక్షుడిచే ఆదేశించబడ్డాను, ఔదార్యముగల ఉపవాస కానుకలను ఇవ్వడం, సంఘము యొక్క మానవ సంక్షేమ సహాయక నిధికి తోడ్పడుట, మీరు నివసిస్తున్న మీ స్వంత సమాజములో ఉన్నవారికి సేవ చేయుటకు విధానముల కొరకు వెదకుము. ఈ సలహాను అనుసరించిన యెడల లోకము ఎంతగా దీవించబడునో కేవలము ఊహించుము.

సహోదర మరియు సహోదరులారా, ప్రత్యేకముగాయువత, మీరు రక్షకుడైన యేసు క్రీస్తు వలె జీవించుటకు మరియు మీ నిబంధనలను జీవించేందుకు మీరు ప్రయాసపడుతున్నప్పుడు, బాధపడ్తున్నవారిని ఉపశమనమిచ్చుటకు కోరికలతో మీరు దీవించబడుటను మరియు తక్కువ దురదృష్టముగల వారికి సహాయపడుటకు కొనసాగిస్తారు. గొప్ప అవసరాలలో కొన్ని మీ ముందే ఉండవచ్చని గుర్తుంచుకొనుము . మీ సొంత గృహాలలో మరియు మీ సొంత కుటుంబాలలో సేవను ప్రారంభించుము. ఈ అనుబంధాలు శాశ్వతమైనవి కాగలవు. మీ కుటుంబ పరిస్థితులు పరిపూర్ణతకు తక్కువగా ఉన్నప్పటికిని, మీరు సేవ చేసే, బలపరచి, మరియు వారిని పైకెత్తు మార్గములను వెదకవచ్చు. మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే మొదలుపెట్టండి, వారు ఎలా ఉన్నారో ఆలానే ప్రేమించండి మరియు భవిష్యతులో మీరు కావాలనుకున్న కుటుంబము కొరకు సిద్ధపడుము.

మీ వార్డు కుటుంబాలలో ప్రేమ మరియు ప్రోత్సాహం అవసరమైన వారిని గుర్తించుటలో సహాయము కొరకు ప్రార్థించుము. మీరు సంఘమునకు వెళ్ళినప్పుడు “ఈ సమావేశమునుండి నేనేమి పొందుతాను”? అనే ప్రశ్నకు బదులుగా “ఈరోజు నా అవసరం ఎవరికీ ఉంది” “సహాయపడుటకు నేను ఏమి చేయాలి”? అని అడుగుము.

మీరు మీ సొంత కుటుంబాలను మరియు వార్డుసభ్యులను దీవిస్తుండగా, మీ స్థానిక సమాజములలోని వారిని దీవించేందుకు మార్గాలను వెదకండి. విస్తృతమైన సేవ లేక నెలలో కొన్ని గడియలుటలు మాత్రమే ఇవ్వగలిగిన సేవ అయినా, మీ ప్రయత్నాలు జీవితాలను దీవిస్తుంచును మరియు మీరు ఊహించని విధానాలలో మిమ్మల్ని దీవించును.

అధ్యక్షులు స్పెన్సర్  డబ్ల్యు. కింబల్ బోధించారు: “దేవుడు మనల్ని గమనించును, మరియు మనపై కావలి కాయును. కాని సాధారణంగా అది మరొక వ్యక్తి ద్వారా ఆయన మన అవసరాలను తీరుస్తారు.”6 ఆయన పిల్లల యొక్క అవసరాలను మనము తీర్చినప్పుడు మన పరలోక తండ్రి యొక్క కార్యమును నెరవేర్చుటలో పాల్గొను విశేషావకాశమును మరియు దీవెనను మనలో ప్రతిఒక్కరము గ్రహించెదము గాకు, యేసు క్రీస్తు నామములో నా ప్రార్థన, ఆమేన్.

వివరణలు

  1. లూకా 9:24.

  2. Thomas S. Monson, “What Have I Done for Someone Today? Liahona, Nov. 2009, 85.

  3. Linda K. Burton, “I Was a Stranger,” Liahona, May 2016, 15.

  4. James E. Faust, “Womanhood: The Highest Place of Honor,” Liahona, July 2000, 117.

  5. D. Todd Christofferson, “Why the Church,” Liahona, Nov. 2015, 108, 109.

  6. Teachings of Presidents of the Church: Spencer W. Kimball (2006), 82.