2010–2019
ఆయన మనల్ని ప్రేమించినట్టే ఒకరి నొకరు ప్రేమించాలి
అక్టోబర్ 2017


ఆయన మనల్ని ప్రేమించినట్టే ఒకరి నొకరు ప్రేమించాలి

నిజమైన ప్రేమతో ఇతరులకు సేవ చేయుట మరియు క్షమించుట ద్వారా, మన మనము స్వస్థపరచబడగలము మరియు స్వంత సవాళ్ళను జయించుటకు బలమును పొందగలము.

చివరి రాత్రి భోజన సమయములో, రక్షకుడు తన శిష్యులకు ఒక క్రొత్త ఆజ్ఞ ఇచ్చాడు:

“మీరు ఒకరి నొకరు ప్రేమించవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను.

“దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురనెను.” 1

వారు ముందు చేస్తున్నా దానికన్నా అత్యధిక విస్తృతమైనది, గొప్పది మరియు ఎక్కువ దైవికమైనది ఏదైనా చేయుటకు రక్షకుని యొక్క శిష్యులు ఒక క్రొత్త ఆజ్ఞ ఇవ్వబడ్డారు. ఈ క్రొత్త ఆజ్ఞ మరియు ఆహ్వానము ముఖ్యమైన వాక్యములో సంక్షిప్తపరచబడింది, “నేను మిమ్మల్ని ప్రేమించినట్లుగా.”

ప్రేమ క్రియ కలిగియున్నది; ప్రేమ సేవ

“ప్రేమ లోతైన భక్తి, చింత మరియు అప్యాయతగల భావన. ఆయన పిల్లల కొరకు దేవుని యొక్క ప్రేమకు గొప్ప మాదిరి యేసు క్రీస్తు యొక్క అంతములేని ప్రాయశ్చిత్తఃము.”2 “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను,” “కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టినవానియందు విశ్వాసముంచు ప్రతీవాడును నశించక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.” 3 “దేవుని మరియు పొరుగువాని కొరకు ప్రేమ యేసు క్రీస్తు యొక్క శిష్యుల లక్షణము.”4

కొన్ని సంవత్సరాల క్రితం, మా పెద్ద మనవడికి నాలుగు సంవత్సరాలున్నప్పుడు, అతడు నా భార్యతో ఆడుకుంటున్నాడు. వారిద్దరూ నవ్వుకుంటూ సరదా గడుపుతుండగా, మా మనవడు ఆమెను అడిగాడు, “మామ్మా, నీవు నన్ను ప్రేమిస్తున్నావా?”

“అవును జోస్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను,” ఆమె అతనికి జవాబిచ్చింది.

అప్పుడతడు ఆమెను మరొక ప్రశ్న అడిగాడు: “నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నీకేలా తెలుసు?”

ఆమె తన భావాలను అతడికి వివరించింది మరియు అతడి కోసం ఆమె చేసిన వాటిని మరియు అతని కోసం చేయటానికి ఇష్టపడిన వాటిని ఆమె వివరించింది.

ఈ తరువాత నా భార్య జోస్‌ను ఈ లోతుగా ఆలోచింపజేసే పరిశోధన కలిపి, అదే ప్రశ్నలు అడిగింది: “నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నీకేలా తెలుసు?”

అమాయకమైన కాని నిజాయితీగల జవాబుతో అతడు చెప్పాడు, “నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఎందుకనగా అది నా హృదయములో నేను భావిస్తున్నాను.” ఆరోజు మరియు ఎల్లప్పుడు జోస్ తన మామ్మ పట్ల ప్రేమగల ప్రవర్తన ఆ ప్రేమ, క్రియలు అదేవిధంగా లోతైన భావనల కలయకను రుజువుచేస్తుంది.

“ఇదిగో, మీరు జ్ఞానమును నేర్చుకొనునట్లు ఈ విషయములను నేను మీకు చెప్పుచున్నాను. మీ తోటి ప్రాణుల యొక్క సేవలో మీరున్న యెడల మీరు మీ దేవుని యొక్క సేవలో మాత్రమే ఉన్నారని మీరు నేర్చుకొనవలెను,” 5 అని రాజైన బెంజిమెన్ బోధించాడు.

వేర్వరు పరిస్థితుల వలన ఎంతో బాధ కలిగిన నేటి లోకములో, సరదా ఎమోజీతో ఒక సందేశాన్ని పంపటం లేక “నేను నిన్ను ప్రేమిస్తున్నాను” మాటలతో ఒక మంచి చిత్రాన్ని పోస్టు చేయటం మంచిది మరియు విలువైనది. కానీ మనలో అనేకమంది చేయాల్సింది, మన మోబైల్ సాధనాలను ప్రక్కన పెట్టి, శారీరకంగా గొప్ప అవసరతలో ఉన్న ఇతరులకు సహాయపడాలి. సేవ లేకుండా ప్రేమ, క్రియలు లేని విశ్వాసమువలె ఉన్నది; అది మృతమైనది.

ప్రేమయే క్షమాపణ

క్రీస్తు యొక్క శుద్ధమైన ప్రేమ, దాతృత్వము, 6  మనము అమలుచేసి మరియు సేవను అందించుటకు సహాయపడుటకు ప్రేరేపించటం మాత్రమే కాకుండా, పరిస్థితిని లక్ష్యపెట్టకుండా క్షమించుటకు బలమును కలిగియుండుటకు మనల్ని ప్రేరేపించును. నా జీవితాన్ని ప్రభావితం చేసి, మార్చిన ఒక అనుభవాన్ని నేను మీతో పంచుకోనా. ఈరోజు ఇక్కడున్న టెడ్ మరియు షారోన్, కూపర్ యొక్క తల్లిదండ్రులు, తొమ్మిది సంపత్సరాల క్రితం, వారి కుటుంబానికి జరిగిన దానిని పంచుకొనుటకు నాకు అనుమతినిచ్చారు. కూపర్ యొక్క తండ్రి టెడ్ దృష్టికోణము నుండి అనుభవాన్ని నేను చెబుతాను:

2008, ఆగష్టు  21, పాఠశాల యొక్క మొదటి రోజు, మరియు కూపర్ యొక్క అన్నలైన ఈవాన్, గార్రెట్, మరియు లోగాన్ అందరూ బస్సు ఎక్కటానికి బస్సు స్టాపు దగ్గర ఎదురుచూస్తున్నారు. నాలుగు  సంవత్సరాల కూపర్ తన సైకిల్‌పై ఉన్నాడు, నా భార్య, షారోను నడిచింది.

నా భార్య వీధి అవతల ఉన్నది మరియు దాటమని కూపర్‌కు సైగ చేసింది. అదే సమయములో, ఒక కారు చాలా నెమ్మదిగా ఎడమవైపు తిరిగింది మరియు కూపర్ మీదకు ఎక్కింది.

కూపర్ కారు చేత గుద్దబడ్డాడని ఒక పొరుగు వానినుండి ఒక ఫోను పిలుపు నాకు వచ్చింది. అతడిని చూడటానికి నేను త్వరగా వెళ్ళాను. కూపర్ ఊపిరి పీల్చటానికి ప్రయాసపడుతూ గడ్డిమీద పడి ఉన్నాడు, కానీ చూడదగని గాయాలేమీ లేవు.

నేను కూపర్ వద్ద మోకరించాను, “అంతా బాగానే ఉంటుంది. పట్టుకో.” ఆ క్షణంలో నా ప్రధాన గురువుల గుంపు నాయకుడైన నాతాన్, తన భార్యతో వచ్చాడు. మేము ఒక యాజకత్వ దీవెన ఇవ్వాలని ఆమె సూచించింది. మేము కూపర్ తలపై మా చేతులను ఉంచాము. ఆ దీవెనలో నేను ఏమీ చెప్పానో నాకు గుర్తులేదు, కానీ మా చుట్టూ ఉన్నవారి సమక్షమును నేను స్పష్టంగా గుర్తుంచుకోగలను, మరియు ఆ క్షణమందు కూపర్ చనిపోబోతున్నాడని నాకు తెలుసు.

కూపర్ హెలీకాప్టర్ చేత హాస్పిటల్‌కు తీసుకొనిపోబడ్డాడు, కానీ వాస్తవానికి, చనిపోయాడు. నా భూలోక బాధ్యత ముగించబడిందని మరియు కూపర్ ఆయన సంరక్షణలో ఉన్నాడని పరలోక తండ్రి నాతో చెప్పుచున్నట్లు నేను భావించాను.

హాస్పిటల్ వద్ద కూపర్‌తో మేము కొంత సమయాన్ని గడపగలిగాము. అక్కడి పనివారు అతడిని సిద్ధపరిచారు ఆవిధంగా మేము అతడిని ఎత్తుకొని వీడ్కోలు చెప్పాము మరియు అతడితో ఎక్కువ సమయము గడపటానికి మేము అనుమతించబడ్డాము.

ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు, తీవ్రమైన వేదన చెందిన భార్య, నేను ఒకరినొకరి వైపు చూసుకొని కారు నడుపుతున్న బాలుడు ఎవరని మాట్లాడసాగాము. అతడు మా వీధికి అవతల వైపు నివసిస్తూ, మా వార్డు సరిహద్దులలో ఉన్నప్పటికిని అతడిని మేము ఎరుగము.

మరుసటి రోజు మాకు చాలా కష్టమైనది మేము వేదనతో పూర్తిగా ముంచివేయబడ్డాము. నేను మోకారించాను మరియు నేను ఎప్పుడూ చేయని మిక్కిలి  మనఃపూర్వకమైన ప్రార్థన చేసాను. నా తీవ్రమైన వేదనను తీసివేయమని నా రక్షకుని పరలోక తండ్రి నామములో నేను అడిగాను. ఆయన ఆవిధంగా చేసారు.

తరువాత ఆరోజు మా స్టేకు అధ్యక్షత్వములో సలహాదారులు ఒకరు ఆ కారు నడిపిన---యువకునితో--- మరియు అతడి తల్లిదండ్రులతో సలహాదారుని ఇంటిలో కలుసుకొనుటకు ఏర్పాటుచేసారు. తలుపు తెరవబడినప్పుడు, మేము మొదటిసారి వారిని కలిసాము. “అతడి వద్దకు వెళ్ళుము,” మా బిషప్పు చెవిలో చెప్పాడు. షారోన్, నేను అతడిని గుంపుగా కౌగలించుకున్నాము. చాలాసేపు అన్పించినట్లుగా మేము కలిసి దుఃఖించాము. జరిగినదాని నిర్వచనము ప్రమాదమని మేము ఎరుగుదుమని మేము అతడితో చెప్పాము.

మేము చేసిన విధానము మరియు ఇంకా చేస్తున్నది నాకు, షారోనుకు అద్భుతమైనది. దేవుని కృప ద్వారా, మేము విశాలమైన బాటను, స్పష్టమైన బాటను, ఏకైక బాటను తీసుకోగలిగాము, మరియు ఈ మంచి యువకుడిని మేము ప్రేమిస్తున్నాము.

సంవత్సరాలుగా అతడికి మరియు అతడి కుటుంబానికి మేము చాలా దగ్గరయ్యాము. అతడు మాతో తన అత్యంత ప్రశస్తమైన మైలురాళ్ళను పంచుకున్నాడు. మేము తన మిషను కొరకు సిద్ధపడినప్పుడు, అతడితో పాటు మేము దేవాలయమునకు కూడా వెళ్లాము.7

సహోదర, సహోదరిలారా, మన పరలోక తండ్రి మనల్ని ప్రేమిస్తున్నారని టెడ్ నిస్సందేహముగా ఎరుగును. ఆవిధంగా తనను తాను క్షమించుకొని మరియు భారమును తీసివేసుకొనుట, క్షమించబడుట అంతే మాధుర్యమైనదని అతడు ఎరుగును. ఈ మాధుర్యత మన మిక్కిలి గొప్ప మార్గదర్శి యొక్క మాదిరి నుండి వచ్చును. మోర్మన్ గ్రంథములో, ఆల్మా రక్షకుని గూర్చి ప్రకటించారు, “ఆయన ప్రతీ రకమైన బాధలు మరియు శ్రమలు మరియు శోధనలు అనుభవించుచూ ముందుకు వెళ్ళును, మరియు ఇది, తన జనుల యొక్క బాధలు మరియు రోగములను ఆయన తనపైన తీసుకొనును అని చెప్పిన వాక్యము నెరవేరుటకు.”8

సహోదర, సహోదరిలారా, నిజమైన ప్రేమ మరియు క్షమాపణ యొక్క ఎంత అద్భుతమైన వృత్తాంతము. అదేవిధంగా, మనము ఇతరులకు సేవ చేసి మరియు క్షమించినప్పుడు సంతోషమును మరియు ఆనందమును మనము కలిగియుండగలము. మా మనుమలలో ఒకరైన జార్జ్ తరచుగా ఇలా చెప్తాడు, “మనది ఎటువంటి కుటుంబము?” “మనము సంతోషముగల కుటుంబము!” అని అతడు జవాబిస్తాడు.

అధ్యక్షులు థామస్  ఎస్. మాన్సన్ ఇలా మనకు సలహా ఇచ్చారు, “మనము మన జీవితాలను పరీక్షించుకోవాలి మరియు దయ, ప్రేమ, మరియు దాతృత్వము కలిగియుండుట ద్వారా రక్షకుని మాదిరిని అనుసరించుటకు తీర్మానించుకోవాలి.” 9

మన పరలోక తండ్రి మరియు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు మనల్ని ప్రేమిస్తున్నారని మరియు వారు మనల్ని ప్రేమిస్తున్నట్లుగా మనము ఒకరినొకరం ప్రేమించుటకు మనకు సహాయపడుటకు సమ్మతిస్తున్నారని నేనెరుగుదును. నిజమైన ప్రేమతో ఇతరులకు సేవ చేయుట మరియు క్షమించుట ద్వారా, మనము స్వస్థపరచబడతాము, మరియు మన స్వంత సవాళ్ళను జయించుటకు బలమును పొందగలము. ఆలాగుని నేను యేసు క్రీస్తు నామములో ప్రకటిస్తున్నాను, ఆమేన్.