2010–2019
అద్భుతకార్యముల దినము ఆగిపోయినదా?
అక్టోబర్ 2017


అద్భుతకార్యముల దినము ఆగిపోయినదా?

దేవుని పిల్లలందరికి లభ్యమయ్యే ఆత్మీయ అద్భుతములపై మన మహోన్నతమైన దృష్టి ఉండాలి.

ఒక సంవత్సరము క్రితము, కాలిఫోర్నియా రాష్ట్రములో నియమించబడిన పనిమీద, నేను స్టేకు అధ్యక్షునితో కలిసి క్లార్క్, హాల్లీ ఫేల్స్ మరియు వారి కుటుంబాన్ని వారి ఇంటిలో దర్శించటానికి వెళ్లాను. ఇటీవల వారొక అద్భుతాన్ని అనుభవించారని నేను చెప్పబడ్డాను. మేము చేరుకున్నాక, క్లార్క్ నిలబడటానికి ప్రయాసపడుతున్నాడు మరియు అతడు మెడకు, నడుముకు, మరియు చేతులకు పట్టీలు వేసుకొనియుండి, మమ్మల్ని పలుకరించాడు.

రెండు నెలల క్రితం, క్లార్క్, అతని కొడుకు టై, మరియు దాదాపు 30 మంది ఇతర యువకులు మరియు నాయకులు షష్టా కొండ శిఖరానికి 14,180 అడుగులు (4,322 ), ఎక్కే, ఉన్నతమైన సాహసము కార్యముపై వెళ్లారు. మిక్కలి కష్టమైన దీర్ఘకాల నడక రెండవరోజున, ఎక్కినవారిలో అనేకమంది శిఖరమును చేరుకున్నారు---అది ఉత్కంఠమైన నెరవేర్పు, నెలల సిద్ధపాటు వలన సాధ్యము చేయబడింది.

ఆ రోజు శిఖరానికి చేరుకున్న మొదటి వ్యక్తులలో ఒకరు క్లార్క్. కాసేపు విశ్రాంతి తీసుకున్నాక, శిఖరము అంచున, అతడు నిలబడి నడవసాగాడు. అతడు నడుస్తున్నప్పుడు, అతడు జారి వెనక్కి పడిపోయాడు మరియు శిఖరపు అంచు పైగా పడిపోయి, దాదాపు 40 (12- మీ) అడుగులు క్రిందకు పడిపోయాడు మరియు తరువాత అదుపులేకుండా మరొక 300 అడుగులు (91మీ ) మంచు వాలు క్రిందకు పడిపోయాడు. ఆశ్చర్యకరముగా, కార్ల్క్ బ్రతికాడు, కానీ తీవ్రంగా గాయపడ్డాడు మరియు కదలలేక పోయాడు.

ఈ బాధాకరమైన ఘటన జరిగినప్పుడు క్లార్క్ అనుభవించిన అద్భుతాలు ఆరంభము మాత్రమే. అతడిని సమీపించుటకు చేరుకున్న కొందరిలో మొదటివారు “అనుకోకుండా అక్కడున్న” నడచినవారి గుంపులో కొండ ప్రమాదము నుండి కాపాడేవారు మరియు అత్యవసర వైద్య నిపుణులున్నారు. వారు వెంటనే క్లార్క్‌ను షాక్ కోసం చికిత్స చేసారు మరియు అతడిని వేడిగా ఉంచుటకు ప్రత్యేక దుస్తులను అందించారు. ఈ గుంపు ఒక క్రొత్త సంభాషణా సాధనమును పరీక్షించుటకు కూడ “అనుకోకుండా అక్కడున్నారు” మరియు సెల్ ఫోన్లు సిగ్నల్ రాలేని ప్రాంతము నుండి సహాయము కొరకు అత్యవసర మనవి పంపబడింది. ఒక గంట దూరము నుండి షాష్టా కొండమీదకు ఒక చిన్న హెలీకాప్టర్ వెంటనే పంపబడింది. విమానము యొక్క పరిమితులను మించి ఎత్తుకు ఆగుటకు ప్రమాదకరమైన గాలి పరిస్థితులతో ప్రయాసపడుతూ రెండుసార్లు కష్టమైన ప్రయత్నాలు విఫలమయ్యాక, పైలట్ మూడవసారి మరియు చివరిసారిగా ప్రయత్నించసాగాడు. హెలీకాప్టర్ వేరే కోణము నుండి సమీపించినప్పుడు, గాలులు మారుట “అనుకోకుండా సంభవించిది” మరియు గుంపు త్వరగా క్లార్క్‌ను పైలట్ వెనుక సీటు చిన్న గదిలోనికి త్వరగా మరియు బాధకరంగా లాగేసారు.

గాయము కేంద్రము వద్ద క్లార్క్ పరీక్షించబడినపప్పుడు, అతడి మెడ, నడుము, ప్రక్కటెముకలో, మరియు చేతులలో పగుళ్ళు, పగిలిన ఊపిరితిత్తులు, మరియు అనేకచోట్ల తెగి, గీరుకుపోయాయి. ప్రసిద్ధి చెందిన నరముల శస్త్ర చికిత్స నిపుణుడు ఆరోజు ఉద్యోగ సమయములో ఉండుట “అనుకోకుండా జరిగింది,” అతడు సంవత్సరానికి కొన్నిసార్లు మాత్రమే ఈ హాస్పిటల్లో ఉంటాడు. వెన్నుముక మరియు కరోటిడ్ ధమనులకు అంత నష్టము జరిగి బ్రతికియున్న వారేవరిని తాను ఎన్నడూ చూడలేదని ఈ వైద్యుడు తరువాత వాఖ్యానించాడు. క్లార్క్ జీవించుటకు ఆశించబడుట మాత్రమే కాదు కానీ పూర్తిగా నయమగుటకు ఆశించబడ్డాడు. తనను తాను నాస్తికుడనని వివరిస్తూ, నరాలకు సంబంధించిన గాయములను గూర్చి అతడి శాస్త్రీయ శిక్షణ అంతటికి క్లార్క్ యొక్క స్థితి వ్యతిరేకమని మరియు ఒక అద్భుతముగా మాత్రమే వివరించబడునని శస్త్ర చికిత్స నిపుణుడు అన్నాడు.

క్లార్క్ మరియు హాల్లీ ఈ తీవ్రమైన వృత్తాంతమును పూర్తి చేసిన తరువాత, నాకు మాట్లాడటం కష్టమయ్యింది. ఇది స్పష్టమైన అద్భుతాల వలన మాత్రమే కాదు, కాని మిక్కిలి గొప్పదాని వలన. ఆ గదిలో హాల్లీ మరియు వారి తల్లిదండ్రుల చుట్టూ కూర్చోన్న ఐదుగురు అందమైన పిల్లలలో ప్రతిఒక్కరు ఎటువంటి సాక్ష్యమును కలిగియున్నారంటే ఆరోజు వారికేమి జరిగినప్పటికిని వారు అంగీకరించియుండేవారు మరియు వారింకా ఆత్మీయంగా అభివృద్ధి చెందేవారని--నాకు లోతైన భావన---ఆత్మీయ సాక్ష్యము కలిగింది. క్లార్క్ మరియు హాల్లీ మరియు వారి పెద్ద పిల్లలు టై మరియు పోర్టర్ ఈ రోజు సర్వసభ్య సమావేశ కేంద్రములో మనతో ఉన్నారు.

ఫేల్స్ కుటుంబము యొక్క అనుభవమును లోతుగా ధ్యానించుటలో, అనేకమంది ఇతరుల యొక్క పరిస్థితులను గూర్చి నేను ఎక్కువగా ఆలోచించాను. లెక్కలేనంతమంది విశ్వాసము నిండి, యాజకత్వపు దీవెనలు పొంది, అంతములేకుండా ప్రార్థించి, నిబంధన పాటించి, నిరీక్షణతో నిండి ఎన్నటికీ అద్భుతాలు రాని కడవరి దిన పరిశుద్ధులు మాటేమిటి? కనీసము వారు ఒక అద్భుతాన్ని గ్రహించారు. కనీసము ఇతరులు అద్భుతాలను పొందినట్లుగా కనబడిన విధానము.

సంవత్సరాలుగా లేక దశబ్ధాలుగా లేక వారి మర్త్య జీవితకాలమంతా---శారీరకంగా, మానసికంగా, భావావేశంగా-- లోతైన బాధలు అనుభవిస్తున్నవారి మాటేమిటి? చాలా చిన్న వయస్సులో చనిపోయిన వారేమిటి?

రెండు నెలల క్రితం, రెండు దేవాలయ సిఫారసు కలిగిన వివాహితులైన దంపతులు, ముగ్గురు పూర్తి కాల మిషనరీ పిల్లలతో, మరియు వారి మధ్య మిగిలిన ఐదుగురు పిల్లలతో కలిసి, ఒక చిన్న విమానంలో, స్వల్ప సమయముతో ప్రయాణించారు. విమానమునకు ముందు క్షేమము కోసం వారు ప్రార్థించే ఉంటారని మరియు తీవ్రమైన యాంత్రిక సమస్యలను ఎదుర్కొని కూలిపోయినప్పుడు, తీవ్రంగా ప్రార్థించియుంటారని నా నమ్మకము. ఎవరూ బ్రతకలేదు. వారి విషయమేమిటి?

మోర్మన్ చేత అడగబడిన ప్రశ్నను అడుగుటకు మంచి జనులు మరియు వారి ప్రియమైన వారికి కారణమున్నదా: “అద్భుతకార్యముల దినము ఆగిపోయినదా?”1

కొన్నిసార్లు దైవిక జోక్యము ఎందుకున్నది మరియు కొన్నిసార్లు ఎందుకుండదు? వివరించుటకు నా పరిమితమైన జ్ఞానము సరిపోదు. కాని బహుశా ఒక అద్బుతమును సంభవింపచేసే దానిగురించి మనకు అవగాహన లేకపోవచ్చు.

తరచుగా మనము వైద్య విజ్ఞానము ద్వారా పూర్తిగా వివరించబడకుండా స్వస్థపరచబడుట లేక స్పష్టమైన ప్రేరేపణను వినుట ద్వారా తీవ్రమైన అపాయమును తప్పించుకొనినప్పడు ఒక అద్భుతముగా మనము వివరిస్తాము. అయినప్పటికిని, “మర్త్యులు గ్రహించని దైవిక శక్తి ద్వారా తేబడిన ప్రయోజనకరమైన ఘటనగా” 2 ఒక అద్భుతమును నిర్వచించుట, స్వభావములో మరింత శాశ్వతమైన విషయాలకు విశదపరచబడిన అవలోకనమును ఇచ్చును. ఈ నిర్వచనము ఒక అద్భుతమును పొందుటలో విశ్వాసము యొక్క ముఖ్యమైన పాత్రను ధ్యానించుటకు మనల్ని అనుమతించును.

“వారి విశ్వాసము తరువాత వరకు అద్భుతములను చేయలేదు,”3 అని మొరోనై బోధించాడు. “మనుష్యుడు విశ్వాసము ద్వారా బలమైన అద్భుతకార్యములను చేయునట్లు సాధనమును దేవుడు దయచేసి యుండెను,” 4 అని అమ్మోన్ ప్రకటించాడు. “ఏలయనగా నేను దేవుడను, . . . మరియు నా నామమును విశ్వసించు వారందరికి . . . . నేను అద్భుతములను చూపెదను,”5 అని ప్రభువు జోసెఫ్ స్మిత్ కు బయల్పరిచాడు.

నెబుకద్నెజరు రాజు షద్రకు, మేషాకు, మరియు అబేద్నెగోలను అతడు ఏర్పరచిన బంగారు ప్రతిమను పూజించమని డిమాండు చేసాడు, “మీరు నమస్కరింపని యెడల . . . తక్షణమే మండుచున్న వేడిమిగల అగ్నిగుండములో మీరు వేయబడుదురు” అని బెదిరించాడు. తరువాత “నా చేతిలో నుండి మిమ్మును విడిపింపగల దేవుడెక్కడ నున్నాడు?”6 అని అతడు వారిని ఎగతాళి చేసాడు.

ఈ ముగ్గురు భక్తిగల శిష్యులు ఇలా చెప్పారు: “మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల యీ అగ్నిగుండములోనుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్ధుడు, ఒకవేళ ఆయన రక్షింపకపోయినను, రాజా, నీ దేవతలను మేము పూజింపము.”7

దేవుడు వారిని రక్షించగలడని వారు పూర్తి విశ్వాసము కలిగియున్నారు, “లేని యెడల,” వారు ఆయన ప్రణాళికయందు పూర్తి విశ్వాసమును కలిగియున్నారు.

అదేవిధంగా, ఎల్డర్ డేవిడ్  ఎ. బెడ్నార్ ఒకసారి యాజకత్వ దీవెన కావాలని మనవి చేసిన ఒక యువకుడిని ఇలా అడిగారు, “నీ పరిచర్యను కొనసాగించుటకు ఆత్మ లోకమునకు నీ యౌవనములో మరణము ద్వారా బదిలీ చేయబడుట మన పరలోక తండ్రి చిత్తమైతే, నీవు స్వస్థపడకుండా ఉండుటకు ఆయన చిత్తమునకు అప్పగించుటకు నీకు విశ్వాసమున్నదా?”8మనము శాశ్వతంగా స్వస్థపరచబడునట్లు మన భూలోక బాధలనుండి “స్వస్థపరచబడకుండా ఉండుటకు” మనకు విశ్వాసమున్నదా?

ధ్యానించుటకు కీలకమైన ప్రశ్న, “మన విశ్వాసమును మనము ఎక్కడ ఉంచుతాము?” మన విశ్వాసము నొప్పి మరియు బాధనుండి విడిపించబడుటపై మాత్రమే దృష్టిసారించబడిందా, లేక అది తండ్రియైన దేవుని, ఆయన పరిశుద్ధ ప్రణాళికపై యేసే క్రీస్తని మరియు ఆయన ప్రాయశ్చిత్తముపై స్థిరముగా ఆధారపడియున్నదా? నిత్యత్వము కొరకు మనము సిద్ధపడినప్పుడు, తండ్రి మరియు కుమారునియందు విశ్వాసము వారి చిత్తమును గ్రహించి మరియు అంగీకరించుటకు మనల్ని అనుమతించును.

ఈరోజు నేను అద్భుతములను గూర్చి సాక్ష్యమిస్తున్నాను.9 ఆయన స్వరూపము మరియు పోలికలో ఒక శరీరమును పొందుట, ఒక అద్భుతము. 10 రక్షకుని యొక్క వరము ఒక అద్భుతము. 11 యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తఃము ఒక అద్భుతము. 12 నిత్య జీవితము కొరకు సాధ్యత ఒక అద్భుతము.13

మన మర్త్య ఉనికియందు, భౌతిక భద్రత మరియు స్వస్థత కొరకు ప్రార్థించుట మరియు పనిచేయుట మంచిది కాగా, మన మహోన్నతమైన దృష్టి దేవుని పిల్లలందరికీ లభ్యమయ్యే ఆత్మీయ అద్భుతములపై ఉండాలి. మన స్వజాతి ఏదైనప్పటికిని, మన జాతీయత ఏదైనను, మనము పశ్చాత్తాపపడిన యెడల మనమేమి చేసినప్పటికిని, మనకేమి చేయబడినప్పటికిని---మనమందరం ఈ అద్భుతములకు సమాన ప్రవేశము కలిగియున్నాము. మనము జీవిస్తున్న అద్భుతము, మరియు మరిన్ని అద్భుతాలు ముందుంటాయి. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.