2010–2019
ప్రభువా, నా కన్నులు తెరవుము
అక్టోబర్ 2017


ప్రభువా, నా కన్నులు తెరవుము

మన రక్షకుని యొక్క కన్నుల ద్వారా మనము ఇతరులను చూడాలి.

సింహపు రాజు, ఆఫ్రికన్ సవన్నా గూర్చిన యానిమేషన్ చిత్రం. రాజైన సింహము తన కుమారుని రక్షించుచుండగా చనిపోయినప్పుడు, నిరంకుశ పాలకుడు సవన్నా యొక్క సమతుల్యతను నాశనము చేయుచుండగా, యౌవన  సింహము యువరాజు బహిష్కరించబడ్డాడు. ఒక గురువు యొక్క సహాయము ద్వారా రాజైన సింహము రాజ్యమును తిరిగి పొందుతాడు. సవన్నాలో గొప్ప జీవితపు చక్రములోని సమతుల్యత కలిగియుండాల్సిన అవసరతకు అతడి కన్నులు తెరవబడినవి. రాజుగా తన న్యాయమైన హక్కును పొందుతూ, యువ సింహము “నీవు చూసేదానిని దాటి చూడుము,”1 అనన సలహాను అతడు అనుసరించాడు.

మన తండ్రికి కలిగిన సమస్తమునకు వారసులగుటకు మనము నేర్చుకొన్నప్పుడు,మనము చూసే దానిని మించి చూడాలని సువార్త మనకు బోధిస్తుంది. మనము చూసే దానిని మించి చూచుటకు, రక్షకుడు ఇతరులను చూసినట్లుగా మనము వారిని చూడాలి. జనులు తమ సమస్త భిన్నత్వముతో సువార్త వల నిండియున్నది. మన ప్రపంచము, సంఘ సమూహములలో మరియు మన కుటుంబాలలో కూడా జనుల ఎంపికలు, మానసిక నేపథ్యములను మనము పూర్తిగా గ్రహించలేము, ఎందుకనగా వారెవరో మనము వారి గురించి పూర్తిగా గ్రహించుట అరుదు. సులువుగా ఊహించుటను మరియు మూసపద్ధతులను దాటి ఇప్పుడు మనకున్న స్వల్ప అనుభవము నుండి ఎక్కువ భావాన్ని అనుభవించాలి.

మిషను అధ్యక్షునిగా సేవ చేయుచుండగా, “నేను చూడగలదానిని మించి చూచుటకు,” నా కన్నులు తెరవబడినవి. ఒక యౌవన ఎల్డర్ తన కన్నులలో అనిశ్చయము మరియు భయముతో వచ్చాడు. ఒక ఇంటర్యూ కోసం మేము కలుసుకొన్నప్పుడు, అతడు “నేను ఇంటికి వెళ్లాలనుకుంటున్నాను” అని నిరాశతో చెప్పాడు. “మంచిది, మనము దీనిని సరిచేయవచ్చు,” అని నాకై నేను అనుకున్నాను. కష్టపడి పనిచేయమని, ఒక వారము దానిగురించి ప్రార్థించమని, మరియు నాకు ఫోను చేయమని నేను అతడికి సలహా ఇచ్చాను. ఒక వారము తరువాత, అదే సమయానికి అతడు ఫోను చేసాడు. అతడు ఇంటికి వెళ్లాలని ఇంకా కోరుతున్నాడు. ప్రార్థించమని, కష్టపడి పనిచేయమని, ఒక వారము తరువాత నాకు ఫోను చేయమని నేను మరలా అతడికి సలహా ఇచ్చాను. మా తరువాత ఇంటర్వూలో, సంగతులు మారలేదు. అతడు ఇంటికి వెళ్ళిపోవాలని పట్టుబట్టాడు.

అది జరగటానికి నేను అనుమతించలేను. నేను అతడికి తన పిలుపు యొక్క పరిశుద్ధ స్వభావము గురించి బోధించసాగాను. “తనను తాను మరచిపోయి పని చేయమని”2 అతడిని నేను ప్రోత్సహించాను. నేను ఇచ్చిన సలహా ఏమైనప్పటికిని, అతడి మనస్సు మారలేదు. చివరకు నాకు పూర్తిగా అర్థము కాలేదని స్పురించింది. అప్పుడు నేను ఈ ప్రశ్న అడుగుటకు ప్రేరేపించబడ్డాను:“ఎల్డర్, నీకేది కష్టముగా ఉన్నది?” అతడు చెప్పినది, నా హృదయాన్ని గుచ్చుకొన్నది : “అధ్యక్షుడా, నేను చదవలేను.”

అతడికి చాలా ముఖ్యమని నేను భావించినది, అతడి అవసరాలకు అస్సలు సంబంధించదు. అతడికి ఎక్కువగా కావాలసినదేమనగా, నా తొందరపాటు లెక్కింపును మించి చూసి, ఈ ఎల్డర్ మనస్సులో ఉన్నదానిని నిజముగా చూచుట. నేను అతడిని సరిగా చూసి మరియు నిరీక్షణకు ఒక కారణమును ఇవ్వాల్సిన అవసరమున్నది. బదులుగా, నేను పెద్ద భారముగా మరియు నాశనము చేసే విధంగా చేసాను. ఈ సాహసముగల ఎల్డర్ చదవటం నేర్చుకున్నాడు మరియు యేసు క్రీస్తు యొక్క మిక్కిలి పరిశుద్ధుడైన శిష్యుడయ్యాడు. అతడు ప్రభువు మాటలకు నా కన్నులను తెరిచాడు: “మనుష్యులు లెక్క పెట్టువాటిని యెహోవా లక్ష్యపెట్టడు, యెహోవా హృదయమును లక్ష్యపెట్టును.”(1  సమూయేలు 16:7) )..

ప్రభువు యొక్క ఆత్మ మన దర్శనమును విశదపరచినప్పుడు ఎటువంటి దీవెన. సిరియన్ల సైన్యము వారి గుర్రములు మరియు రథములతో ఎలీషా ప్రవక్త పట్టణమును చుట్టుముట్టుటను అతడు మేల్కొని చూచుట మీకు గుర్తుందా? అతడి సేవకులు భయపడ్డారు మరియు అటువంటి కష్టమైన పరిస్థితిలో వారేమి చెయ్యాలని అడిగారు. ఈ జ్ఞాపకర్ధమైన మాటలతో చింతించవద్దని ఎలీషా అతడికి చెప్పాడు: “భయపడవద్దు మన పక్షమున ఉన్నవారు వారికంటె అధికులై యున్నారు,”(2  రాజులు 6: 16). ప్రవక్త దేనిగురించి మాట్లాడుతున్నాడో ఈ సేవకునికి తెలియలేదు. అతడు చూడగల దానిని మించి ఇతడు చూడలేకపోయాడు. అయినప్పటికిని, ఎలీషా దేవదూతల సమూహము ప్రవక్త యొక్క జనుల కొరకు యుద్ధము చేయుటకు సిద్ధపడుట చూసాడు. కనుక, ఈ చిన్నవాని కన్నులు తెరవమని ఎలీషా ప్రభువుకు ప్రార్థించాడు, “ఎలీషా చుట్టును పర్వతము అగ్ని గుఱ్ఱములచేత రథములచేత నిండియుండుట చూచెను”( 2  రాజులు 6:17).

చిత్రం
ఎలీషా మరియు పరలోకపు సైన్యము

తరచుగా మనము చూసే తేడాలను బట్టి మనము ఇతరులనుండి వేరు చేసుకుంటాము. మనలా ఆలోచించి, మాట్లాడి, ధరించి, మనలా చేసే వారి చుట్టూ మనము సౌకర్యంగా భావిస్తాము, మరియు విభిన్న పరిస్థితులు లేక నేపథ్యములనుండి వచ్చు వారితో మనము అసౌకర్యంగా భావిస్తాము. వాస్తవానికి, మనమందరము వేర్వేరు దేశాల నుండి వచ్చి మరియు వేర్వేరు భాషలు మాట్లాడమా? మన స్వంత జీవితపు అనుభవము నుండి విస్తారమైన పరిమితులున్నప్పటికినీ లోకమును మనము చూడమా? ఎలీషా ప్రవక్త వలె కొందరు ఆత్మీయ నేత్రాలతో చూస్తారు మరియు మాట్లాడతారు, మరియు కొందరు నా వలె చదువురాని నా మిషనరీతో నేను అనుభవించినట్లుగా ఉన్నదున్నట్లుగా చూచు దృష్టితో సంభాషిస్తారు.

మనము పోల్చుట, ముద్రవేయుట, మరియు విమర్శను ఆనందించే జనులున్న ప్రపంచంలో మనము జీవిస్తున్నాము. సామాజిక మీడియా యొక్క అద్దాల గుండా చూచుటకు బదులుగా, మనము హక్కుగా పొందగల దైవిక లక్షణాల కొరకు మనము లోపల వైపు చూడాల్సిన అవసరమున్నది. ఈ దైవిక లక్షణాలు మరియు ఆపేక్షలు పిన్ట్రస్ట్ లో చేర్చబడవు, లేక ఇన్ స్ట్రాగ్రామ్ పై పోస్టు చేయబడవు.

ఇతరులను అంగీకరించి, ప్రేమించుటకు మనము వారి ఆలోచనలను హత్తుకోవాలని దాని అర్థముకాదు. స్పష్టముగా, అది దయకు ఎన్నడూ అడ్డము కానప్పటికిని, సత్యము మన ఉన్నతమైన విధేయతను అదేశించును. ఇతరులను నిజముగా ప్రేమించుటకు మనము ఎప్పటికి పూర్తిగా గ్రహించని జనుల జీవితపు అనుభవాలు మరియు పరిమితుల యొక్క శ్రేష్టమైన ప్రయత్నాలను అంగీకరిస్తూ కొనసాగుతున్న ఆచరణ అవసరము. మనము చూచు దానిని మించి చూచుటకు రక్షకునిపై మనస్సాక్షిని దృష్టిసారించుట అవసరము.

చిత్రం
ఆల్-టార్రైన్ వాహనము

2016 మే 28, 16 సంవత్సరాల బ్యు రిచీ మరియు అతడి స్నేహితుడు ఆస్టిన్ కలరాడోలోని కుటుంబ పచ్చిక మైదానము వద్ద ఉన్నారు. బ్యు మరియు ఆస్టిన్ గొప్ప ఆశతో వారి మైదానములోని వారి ఆల్- టార్రైన్ వాహనాలన్నిటిలో ఎక్కారు. వారు అపాయకరమైన పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు, వాళ్ళు ఎంతో దూరము వెళ్ళలేదు, అప్పుడే విషాదము సంభవించింది. బ్యు నడుపుతున్న వాహనము హఠాత్తుగా బ్యును దాదాపు 400 పౌండ్ల (180  కేజీలు) స్టీలు క్రిందగా నెట్టివేస్తూ తిరగబడింది. బ్యు స్నేహితుడు ఆస్టిన్ అతడి వద్దకు వచ్చినప్పుడు బ్యు తన ప్రాణము కోసం పోరాడుట చూసాడు. అతడు వాహనమును తన స్నేహతునిపై నుండి తీసివేయటానికి శాయశక్తులా ప్రయత్నించాడు. అది కదలలేదు. అతడు బ్యు కోసం ప్రార్థన చేసాడు, మరియు సహాయము కొరకు పిచ్చిగా వెళ్ళాడు. చివరకు అత్యవసర సిబ్బంది వచ్చారు, కానీ కొన్ని గంటల తరువాత బ్యు చనిపోయాడు. అతడు ఈ మర్త్య జీవితం నుండి విడిపించబడ్డాడు.

గుండె పగిలిన అతడి తల్లిదండ్రులు వచ్చారు. ఆ చిన్న హాస్పిటల్ లో బ్యు యొక్క ప్రియమైన స్నేహితుడు మరియు కుటుంబ సభ్యులతో వారు నిలబడినప్పుడు, ఒక పోలీసు అధికారి గదిలో ప్రవేశించారు మరియు బ్యు యొక్క సెల్ ఫోనును అతడి తల్లికి అందించారు. ఆమె ఫోను తెరచింది మరియు బ్యు యొక్క డైలీ ఆలారంను చూసింది. సరదాని ప్రేమించి, మిక్కిలి సాహసముగల యౌవన కుమారుడు ప్రతీరోజు చదవటానికి ఉంచిన సందేశాన్ని ఆమె బిగ్గరగా చదివింది. అది ఇలా చెప్పబడింది, “ఈరోజు యేసు క్రీస్తును మీ జీవితంలో కేంద్రముగా ఉంచుటకు జ్ఞాపకముంచుకొనుము.”

తన విమోచకునిపై బ్యు యొక్క దృష్టి అతడు లేకపోవుటలో తన ప్రియమైన వారి విచారమును తగ్గించదు. అయినప్పటికిని, అది గొప్ప నిరీక్షణను మరియు బ్యు యొక్క జీవితము మరియు జీవితపు ఎంపికలకు అర్థమును ఇచ్చును. అది అతడి కుటుంబము మరియు స్నేహితులు అతడి అకాల మరణపు వేదనను మించి తరువాత జీవితంలోని సంతోషముగల వాస్తవాలను చూచుటకు అనుమతించును. అతడు ఎక్కువ విలువగా చూసిన విషయాన్ని వారి కుమారుని యొక్క కన్నుల ద్వారా చూచుటకు బ్యు యొక్క తల్లిదండ్రులకు ఎంత మృదువైనది.

సంఘ సభ్యులుగా, మనము రక్షణ నుండి దూరముగా మర్త్య నేత్రములతో చూసినప్పుడు, మనల్ని హెచ్చరించు వ్యక్తిగత ఆత్మీయ వరములతో మనము వరమివ్వబడ్డాము. ఆయనను ఎల్లప్పుడు జ్ఞాపకముంచుకుంటామని మరియు మనము ఎల్లప్పుడు ఆయన ఆత్మను మనతో కలిగియుంటామని యేసు క్రీస్తుపై నిరంతరము దృష్టిసారించుటకు మన వారాంతపు జ్ఞాపిక సంస్కారము (సి మరియు ని 20:77 చూడుముచూడుము). అయినప్పటికిని, కొన్నిసార్లు మనము జ్ఞాపకార్ధ భావనలను మరియు అలారమ్ నిర్లక్ష్యము చేస్తాము లేక కొన్నిసార్లు తాత్కాలికంగా ఆపివేస్తాము. మన జీవితాలలో యేసు క్రీస్తును కేంద్రముగా కలిగియున్నప్పుడు, మనము ఒంటరిగా గ్రహించే దానికన్నా విశాలమైన సాధ్యతలకు మన కన్నులు తెరవబడునట్లు ఆయన చేస్తాడు.

ఒక విశ్వాసురాలైన సహోదరి చేత అనుభవించబడిన కాపాడే ఆలారమ్ గురించి ఈ నిజముగా ఆసక్తి కరమైన లేఖను నేను పొందాను. తాను ఎలా భావిస్తున్నానో తన భర్త గ్రహించుటకు సహాయపడే ప్రయత్నములో, అతడు చెప్పినవి లేక ఆమెను విసిగించటానికి చెప్పిన విషయాల ఎలక్ట్రానిక్ జాబితాను ఆమె ఉంచసాగింది. సరైన సమయము వచ్చినప్పుడు, అతడు తన విధానాలను మార్చుకునేలా చేస్తాయని అతడితో పంచుకొనగల వ్రాతపూర్వకమైన రుజువును సంగ్రహించింది. అయినప్పటికిని, ఒక ఆదివారము సంస్కారము తీసుకొని రక్షకుని యొక్క ప్రాయశ్చిత్తఃముపై దృష్టిసారిస్తుండగా, తన భర్త గురించి ప్రతికూల భావనలను వ్రాసియుంచుట నిజముగా ఆమెనుండి ఆత్మను తరిమివేస్తుందని, మరియు ఆమె ఎన్నటికీ అతడిని మార్చలేదని గ్రహించింది.

ఆగిపోయిన ఆమె హృదయములోని ఆత్మీయ ఆలారమ్ ఇలా చెప్పింది: “దానిని వదిలేయ్; అదంతా వదిలేయ్. ఆ వివరాలను తీసివెయ్యి. అవి సహాయపడవు.” తరువాత ఆమె వ్రాసింది, మరియు నేను దానిని వ్యాఖ్యానిస్తాను, “అన్ని గుర్తించి తీసివేయటానికి నాకు సమయము పట్టింది మరియు తీసివేయాటానికి ఇంకా ఎక్కువ సమయము పట్టింది. కాని నేను చేసినప్పుడు, ఆ ప్రతికూల భావనలన్నీ, ఆనంతంలో కలిసిపోయాయి. నా భర్త కొరకు మరియు ప్రభువు కొరకు---నా హృదయము ప్రేమతో నింపబడింది.” దమస్కుకు వెళ్ళు దారిలో సౌలు వలే, ఆమె తన దర్శనమును మార్చుకొన్నది. ఆమె కన్నుల నుండి పొలుసులు రాలిపోయాయి.

మన రక్షకుడు తరచుగా భౌతిక మరియు ఆత్మీయ అంధత్వముగల కన్నులను తెరిచాడు. దైవిక సత్యములకు మన కన్నులను తెరచుట మరియు మర్త్య అవివేకమునుండి స్వస్థపరచబడుటకు మనల్ని సిద్ధపరచును. గమనాన్ని సరిదిద్దుటకు లేక విస్తారమైన నిత్య అవలోకనము కొరకు అవసరతను హెచ్చరించు ఆత్మీయ “అలారంలకు” మనము ఆసక్తిని చెల్లించినప్పుడు, ఆయన ఆత్మను ఎల్లప్పుడు మనతో ఉండు సంస్కారపు వాగ్దానమును మనము పొందుతాము. కర్టలాండ్ దేవాలయములో జోసెఫ్ మరియు ఆలీవర్‌కు యేసు క్రీస్తు ద్వారా సమగ్ర నిజాలు బోధింపబడినప్పుడు ఇది జరిగింది, ఆయన మర్త్య పరిమితుల “తెర” “(వారి) మనస్సుల నుండి తీసివేయబడునని మరియు (వారి) మనోనేత్రములు తెరవబడుని” (సి మరియు ని 110:1), అని ఆయన వాగ్దానమిచ్చాడు.

యేసు క్రీస్తు యొక్క శక్తి ద్వారా, మనము ఉన్నదున్నట్లుగా చూచుట మించి మనము చూడగలుగుతామని నేను సాక్ష్యమిస్తున్నాను. మనము ఆయనను జ్ఞాపకముంచుకొని మరియు ఆయన ఆత్మను మనతో కలిగియున్నప్పుడు మన మనోనేత్రములు తెరవబడతాయి. అప్పుడు మనలో ప్రతిఒక్కరిలో ఉన్న దైవత్వము యొక్క గొప్ప వాస్తవము మన హృదయాలపై మరింత శక్తివంతంగా ముద్రవేయును. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.

వివరణలు

  1. From The Lion King 1½ (2004); outside North America, known as The Lion King 3: Hakuna Matata.

  2. Teachings of Presidents of the Church: Gordon B. Hinckley (2016), 201.