2010–2019
ప్రభువు ఆత్మ నివసించే గృహము
2019 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము.


ప్రభువు ఆత్మ నివసించే గృహము

ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసము గల ప్రదేశముగా, ప్రేమతో నిండిన స్థలముగా మీ గృహమును చేయు ప్రయత్నాల యందు మీ గొప్ప ఆనందాలలో కొన్నింటిని మీరు కనుగొంటారు.

నా ప్రియమైన సహోదర, సహోదరీలారా, యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్దుల సంఘము యొక్క 189వ వార్షిక సర్వసభ్య సమావేశములో మీతో మాట్లాడుటకు ఆహ్వానించబడినందుకు నేను కృతజ్ఞత కలిగియున్నాను. 1830వ సంవత్సరంలో ఈ తేదీన, ప్రభువు యొక్క దర్శకత్వములో జోసెఫ్ స్మిత్ సంఘమును ఏర్పరచెను. అది ఫెయెట్, న్యూయార్క్‌లో విట్మర్ కుటుంబ గృహములో జరిగింది. ఆ రోజు ఆరుగురు సభ్యులు మరియు దాదాపు 50 మంది ఆసక్తిగల జనులు అక్కడ ఉన్నారు.

ఆ చిన్న సమూహము యెదుట నిలబడినప్పుడు ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ఏమి చెప్పెనో, ఎలా కనిపించెనో నాకు తెలియనప్పటికి, యేసు క్రీస్తు నందు విశ్వాసము గల ఆ జనులు ఏమని భావించారో నాకు తెలుసు. వారు పరిశుద్ధాత్మను అనుభవించారు, వారు పరిశుద్ధ స్థలములో ఉన్నారని వారు భావించారు. వారు ఏకమయ్యారని వారు భావించారు.

ఆ అద్భుతమైన భావనే మన గృహాలలో మనందరము కోరుకొనేది. అది పౌలు వర్ణించిన ”ఆత్మానుసారమైన మనస్సుతో”1 ఉండుట వలన కలిగే భావన.

నేడు ఇంకా ఎక్కువ తరచుగా ఆ భావన కొరకు మనం ఏవిధంగా అర్హులము కాగలము మరియు మన కుటుంబాలలో దీర్ఘకాలము ఉండుటకు దానిని ఏవిధంగా ఆహ్వానించాలో నాకు తెలిసినది మీకు బోధించుట నా ఉద్దేశమైయున్నది.. అనుభవము ద్వారా మీకు తెలిసినట్లుగా, దానిని చేయుట అంత సులభము కాదు. కలహము, గర్వము, పాపములను దూరంగా ఉంచాలి. మన కుటుంబాలలో ఉన్నవారి హృదయాలలో క్రీస్తు యొక్క నిర్మలమైన ప్రేమ రావాలి.

అది కష్టమైన సవాలు అని ఆదాము హవ్వ, లీహై శారైయా, లేఖనములనుండి మనకు తెలిసిన ఇతర తల్లిదండ్రులు కనుగొన్నారు. అయినప్పటికి మనకు తిరిగి ధైర్యము చెప్పుటకు మన కుటుంబాలలోను, గృహాలలోను బలపరచు సంతోషము యొక్క ప్రోత్సహించు ఉదాహరణలు కలవు. ఆ ఉదాహరణలు మనకు, మన కుటుంబాలకు అది ఏవిధంగా జరుగుతుందో మనం చూసేటట్లు చేస్తాయి. 4వ నీఫై నుండి వృత్తాంతమును మీరు జ్ఞాపకముచేసుకొండి:

”అప్పుడు, జనుల హృదయములలో ఉన్న దేవుని ప్రేమను బట్టి, దేశమందు ఎట్టి వివాదము లేకుండెను.

”ఎట్టి అసూయలు, జగడములు లేదా అల్లర్లు, లేదా జారత్వములు లేదా అబద్ధములు, లేదా హత్యలు లేక ఏవిధమైన కామత్వము లేకుండాయుండెను; నిశ్చయముగా దేవుని హస్తము చేత సృష్టించబడిన, జనులందరి మధ్య అంత కంటే సంతోషము కలిగిన జనులుండియుండరు.

”అక్కడ దొంగలు లేక హంతకులు, లేదా లేమనీయులు లేక ఏ విధమైన తెగలవారు లేరు, కాని వారు ఒక్కటిగా క్రీస్తు సంతానముగా, దేవుని రాజ్యమునకు వారసులుగా ఉండిరి.

”వారెంతో ధన్యులై యుండిరి! ఏలయనగా వారి పనులన్నిటిలో ప్రభువు వారిని ఆశీర్వదించెను; అవును ఒక నూటపది సంవత్సరములు గతించుపోవు వరకు కూడ వారు ఆశీర్వదింపబడి, వర్థిల్లిరి, క్రీస్తువద్ద నుండి మొదటి తరము గతించిపోయెను; దేశమంతటిలో ఏ వివాదము లేకుండెను.”2

మీకు తెలుసు, ఆ సంతోష సమయము నిరంతరము నిలవలేదు. 4వ నీఫై వృత్తాంతము ఒక మంచి జనుల సమూహములో జరిగిన ఆత్మీయ క్షీణత యొక్క అంతిమ లక్షణాలను వర్ణించును. ఇది ఒక విధానము అది వివిధ కాలాలలో మొత్తం జనులందరి మధ్య, సమూహాలలో మరియు అన్నింటికంటే విచారకరంగా కుటుంబాలలో కనిపించెను. ఆ విధానమును పఠించుట ద్వారా, మన కుటుంబములో ఉన్న ప్రేమభావాలను పరిరక్షించి, వాటిని ఏవిధంగా వృద్ది చేసుకోగలమో మనం చూడగలము.

సువార్త తెచ్చు పరిపూర్ణమైన శాంతిలో 200 సంవత్సరాలు జీవించిన తరువాత కనిపించిన క్షీణించు విధానము ఇదే:

గర్వము నెమ్మదిగా ప్రవేశించింది.

జనులు వారు కలిగియున్న దానిని ఇతరులతో పంచుకోవడం మానివేసారు.

వారు ఒకరికొకరు ఎక్కువ లేదా తక్కువ తరగతులలో చూడటం మొదలు పెట్టారు.

యేసు క్రీస్తు నందు తమ విశ్వాసములో వారు క్రమంగా క్షీణించుటకు మొదలుపెట్టారు.

ద్వేషించుటకు వారు మొదలుపెట్టారు.

వారు అన్ని విధములైన పాపములు చేయుటకు మొదలుపెట్టారు.

తెలివైన తల్లిదండ్రులు ఆ లక్షణాలు తమ కుటుంబ సభ్యుల మధ్య ప్రత్యక్షమైనప్పుడు గమనించుటకు తగినంత అప్రమత్తంగా ఉంటారు. అవును, వారు తప్పకుండా చింతతో ఉంటారు. కాని దాగియున్న అసలైన కారణము ఏమంటే సాతాను యొక్క ప్రభావము మంచి వారిని పాపము మార్గములోకి నడిపించి తద్వారా పరిశుద్ధాత్మ ప్రభావాన్ని కోల్పోయేలా చెయ్యడమని వారు తెలిసుకొంటారు. కాబట్టి ఆయన యొద్దకు రమ్మని ప్రభువు ఇచ్చిన ఆహ్వానాన్ని మరింత సంపూర్ణముగా అంగీకరించుటకు ప్రతి బిడ్డను, వారంతట వారిని నడిపించుటలోని అవకాశాన్ని తెలివైన తల్లి లేదా తండ్రి చూస్తారు.

ఉదాహరణకు, గర్వము విషయములో ఒక బిడ్డను పశ్చాత్తాపపడమని చెప్పుటకు మీరు పరిమితమైన విజయాన్ని పొందవచ్చును. మరింత ధారాళముగా వారికున్నవి పంచుకోమని పిల్లలను మీరు ఒప్పించవచ్చును. కుటుంబములో వేరొకరికంటే వారు ఉత్తములని భావించుట ఆపివేయమని వారిని మీరు అడుగవచ్చును. కాని ”యేసు క్రీస్తు నందు తమ విశ్వాసములో వారు క్రమంగా క్షీణించుటకు మొదలు పెట్టిరి” అని ఇంతకముందు నేను వివరించబడిన లక్షణాలను మీరు ఎదుర్కొనవచ్చును.

మీ కుటుంబము కొరకు మీరు కోరుకొను ఆత్మీయ స్థానమునకు వారు ఎదుగునట్లు మీరు నడిపించుటకు- మీరు కూడా వారితో ఉండుటకు పరిష్కారము ఉన్నది. యేసు క్రీస్తు వారి ప్రేమగల విమోచకుడని వారు విశ్వాసములో ఎదుగుటకు వారికి సహాయపడినట్లైతే, పశ్చాత్తాపపడుటకు వారు కోరికను కలిగియుందురు. వారు ఆవిధముగా చేసినట్లైతే, గర్వము వినయముతో భర్తీచేయబడుతుంది. ప్రభువు వారికి ఇచ్చినదానిని అనుభవించుటకు మొదలుపెట్టినప్పుడు, వారు మరింత దారాళముగా పంచుకోవాలనుకొంటారు. ప్రాధాన్యత లేదా గుర్తింపు కొరకు వారు పోటీపడటం క్షీణిస్తుంది. ద్వేషము ప్రేమచేత తరిమికొట్టబడుతుంది. చివరిగా, రాజైన బెంజిమెన్ చేత పరివర్తన చేయబడిన జనులకు చేసినట్లే, పాపము చెయ్యాలన్న శోధనకు బదులుగా మంచి చెయ్యాలన్న కోరిక వారిని బలపరుస్తుంది. రాజైన బెంజిమెన్ ప్రజలు చెడు చేయుటకు వారికి ఇక ఏమాత్రము కోరిక లేదని సాక్ష్యమిచ్చారు. 3

యేసు క్రీస్తునందు విశ్వాసమును పెంపొందించుట మీ కుటుంబము, మీ గృహములోని ఆత్మీయ క్షీణతను త్రిప్పివేయుటకు ఆరంభము. ఆత్మీయ క్షీణత యొక్క ప్రతి లక్షణము గురించి బోధించుట కంటే విశ్వాసమే వారిలో పశ్చాత్తాపమును మరింత అధికంగా తీసుకొనివచ్చును.

మాదిరి ద్వారా మీరు శ్రేష్టముగా నడిపించగలరు. యేసు క్రీస్తునందు, ఆయన సువార్తయందు విశ్వాసములో మీరు ఎదుగుటను కుటుంబ సభ్యులు, ఇతరులు తప్పక చూడవలెను. ఈ మధ్య మీకు గొప్ప సహాయము అందించబడింది. కుటుంబాలు మరియు వ్యక్తుల కొరకు ప్రేరేపించబడిన పాఠ్యప్రణాళికతో సంఘములో ఉన్న తల్లిదండ్రులు దీవించబడ్డారు. మీరు దానిని ఉపయోగించినట్లైతే, యేసు క్రీస్తునందు మీ విశ్వాసమును, మీ పిల్లల విశ్వాసమును నిర్మిస్తారు.

విశ్వాసములో ఎదుగుట

మోర్మన్ గ్రంథము మళ్లీ చదువమని అధ్యక్షులు రస్సల్ ఎమ్. నెల్సన్ ఇచ్చిన సలహాను మీరు అనుసరించగా రక్షకునియందు మీ విశ్వాసము వృద్ధి చెందెను. రక్షకుని గురించి చెప్పబడిన పదాలు, వచనాలను మీరు గురుతుపెట్టకున్నారు. యేసు క్రీస్తునందు మీ విశ్వాసము వృద్ధిచెందెను. కాని క్రొత్త మొక్క వలె, యేసు క్రీస్తునందు అటువంటి విశ్వాసము క్షీణించకుండా, మీరు దానిని వృద్ధి చేసుకొనుటకు లోతుగా ఆలోచించి, ప్రార్థించుటకు నిరంతర సంకల్పమును కలిగియుండాలి .

విశ్వాసములో వృద్ధిచెందే మీ మాదిరి మీ కుటుంబములో అందరి సభ్యులచేత ఇప్పుడు అనుసరించబడక పోవచ్చును. యౌవనుడైన ఆల్మా అనుభవమునుండి మీరు సమాధానమును, ప్రోత్సాహమును పొందవచ్చును పశ్చాత్తాపము, క్షమాపణల కొరకు అతని బాధాకరమైన అవసరతలో, అతడు యేసు క్రీస్తునుందు తన తండ్రికి గల విశ్వాసమును జ్ఞాపకము చేసుకొనెను. మీ పిల్లలు వారికి పశ్చాత్తాపము బాగా అవసరమైన గడియలలో వారు రక్షకునియందు మీ విశ్వాసమును జ్ఞాపకము చేసుకొందురు. అటువంటి క్షణము గురించి ఆల్మా చెప్పెను:

”నేను ఆ విధముగా వేదనతో, నా అనేక పాపముల జ్ఞాపకము చేత నేను బాధింపబడుచుండగా, లోక పాపముల కొరకు ప్రాయశ్చిత్తఃము చేయుటకు దేవుని కుమారుడైన యేసు క్రీస్తు రాకడను గూర్చి జనులకు నా తండ్రి ప్రవచించుట వినియుండినది నేను జ్ఞాపకము చేసుకొంటిని.

”ఇప్పుడు నా మనస్సునందు ఈ ఆలోచన రాగానే నేను నా హృదయమందు ఇట్లు మొరపెట్టితిని: ఓ యేసు, దేవుని కుమారుడవైన నీవు ఘోరదుష్ఠత్వములో, మరణము యొక్క నిత్య బంధకములచేత చుట్టబడియున్న నాపై కనికరము చూపుము.”

”అయితే నేను అలా తలంచినప్పుడు, నా బాధలను ఇక ఏ మాత్రము జ్ఞాపకము చేసుకొనకయుంటిని. నా పాపముల జ్ఞాపకము చేత నేను ఇక ఏ మాత్రము బాధింపబడకయుంటిని.”4

ప్రేమతో ప్రార్థించుట

విశ్వాసములో వృద్ధి చెందుటకు మీ మాదిరికి అదనముగా, ఒక కుటుంబముగా మీరు ప్రార్థన చేయుట మీ గృహాన్ని ఒక పరిశుద్ధ స్థలముగా చేయుటలో ముఖ్యమైన పాత్ర పోషించగలదు. సాధారణంగా కుటుంబము కొరకు ప్రార్థించుటకు అందరి తరఫున ఒక వ్యక్తి ఎంచుకోబడును. మోకరించి, ఆలకించుచున్న వారి తరఫున ఆ ప్రార్థన స్పష్టంగా దేవునికి చెయ్యబడినట్లైతే, వారందరిలో విశ్వాసము వృద్ధి చెందుతుంది. పరలోక తండ్రికి మరియు రక్షకుని కొరకు గల ప్రేమ యొక్క భావవ్యక్తీకరణలు వారు అనుభవించగలరు. ప్రార్థన చేయు వ్యక్తి కుటుంబ వలయములో మోకరించి ఉన్నవారిలో, అవసరతలో ఉన్నవారి పేర్లను ప్రస్తావించినప్పుడు, అందరూ అవసరతలో ఉన్నవారి యెడల, ప్రతి ఒక్క సభ్యుని యెడల ప్రేమను భావిస్తారు.

గృహములో కుటుంబ సభ్యులు నివసించనప్పటికి, ప్రార్థన వారిలో ప్రేమ బంధాలను నిర్మించగలదు. కుటుంబములో చేయు ప్రార్థన ప్రపంచమంతా చేరుకోగలదు. నా కుటుంబ సభ్యులలో ఒకరు నేను చేస్తున్న సమయములో, అదే విషయము కొరకు ప్రార్థించెనని అనేకసార్లు నేను నేర్చుకున్నాను. నాకైతే, ”కలిసి ప్రార్థించే కుటుంబము కలిసే ఉంటుంది” అనే పాత నానుడి ”కలిసి ప్రార్థించే కుటుంబము, వారు దూరముగానున్నప్పటికి కలిసే ఉంటుంది” అని చెప్పబడవచ్చును.

ఆరంభములోనే పశ్చాత్తాపమును బోధించుట

మనలో ఎవరు కూడా పరిపూర్ణులం కాము, మనోభావాలు సులభంగా దెబ్బతింటాయి కాబట్టి, ఆరంభములో, హృదయపూర్వకముగా మనం పశ్చాత్తాపపడితే కుటుంబాలు పరిశుద్ధమైన ఆశ్రయదుర్గములు కాగలవు. తల్లిదండ్రులు మాదిరిని చూపించగలరు పరుష పదాలు లేదా నిర్దయగల ఆలోచనల గురించి త్వరగా, హృదయపూర్వకముగా పశ్చాత్తాపపడవచ్చును. ”నన్ను క్షమించు” అనే సరళమైన పదము, గాయాలను మాన్పి, క్షమాపణను, ప్రేమను రెండిటిని ఆహ్వానించగలదు.

ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ క్రూరమైన దాడులను, ద్రోహులను, తన కుటుంబములో అభిప్రాయ బేధములను కూడా ఎదుర్కొన్నారు కాబట్టి ఆయన మనకు ఆదర్శముగా ఉన్నారు. దాడి చేయువారు మళ్ళీ దాడి చేస్తారు అని తెలిసికూడా ఆయన వెంటనే క్షమించారు. ఆయనను క్షమాపణ కొరకు అడిగారు, ఆయన దానిని ఉచితముగా ఇచ్చారు.5

పరిచర్యచేయు ఆత్మను అలవరచుకొనుట

ప్రతి ఒక్కరికి సువార్తను అందించాలని మోషైయ కుమారులు దృఢనిశ్చయంతో ఉన్నారు. పశ్చాత్తాపముతో వారికున్న వ్యక్తిగత అనుభవము వలన ఈ కోరిక కలిగెను. వారివలె ఏ వ్యక్తియైన పాపప్రభావము వలన శ్రమపడటం అనే ఆలోచనను వారు తట్టుకోలేక పోయారు. కాబట్టి వారి శత్రువులకు యేసు క్రీస్తు సువార్తను అందించుటకై అనేక సంవత్సరాల తిరస్కరింపు, కష్టాలు, ప్రమాదాలను వారు ఎదుర్కొన్నారు. ఆ క్రమములో, పశ్చాత్తాపము చెందిన అనేకులయందు సంతోషమును కనుగొని, యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము ద్వారా క్షమాపణ పొందుట వలన కలుగు ఆనందమును వారు అనుభవించారు.

క్షమాపణ వలన కలుగు ఆనందమును అనుభవించినప్పుడు, మన కుటుంబ సభ్యులలో సువార్తను పంచుకోవాలనే వారి కోరిక పెరుగుతుంది. సంస్కారములో పాలుపొందుచున్నప్పుడు వారు నిబంధనలను నవీకరించుకొన్నప్పుడు ఆ కోరిక కలుగవచ్చును. సంస్కార కూడికలో క్షమాపణ వలన కలుగు ఆనందమును పిల్లలు, తల్లిదండ్రులు భావించినప్పుడు మన గృహాలలో పరిచర్యచేయు ఆత్మ వృద్ధిచెందుతుంది. భక్తితో కూడిన వారి మాదిరి ద్వారా, ఆ సంతోషమును అనుభవించుటకు తల్లిదండ్రులు, పిల్లలు ఇరువురు ఒకరి కొకరు సహాయపడగలరు. ఆ సంతోషము మన గృహాలను సువార్తపరిచారక తర్ఫీదు కేంద్రాలుగా మార్చేంత దూరము తీసుకెళ్లగలదు. అందరు సువార్తపరిచారకులుగా సేవ చేసియుండక పోవచ్చు కాని సువార్తను పంచుకోవాలనే కోరికను అందరు కలిగియుంటారు, అది వారిని క్షమాపణను, సమాధానమును అనుభవించేలా చేస్తుంది. ప్రస్తుతము పూర్తి కాలము సేవ చేస్తున్నా లేకపోయినా, అందరు కూడా ఇతరులకు సువార్తను అందించుటలో సంతోషమును కనుగొనగలరు.

దేవాలయమును దర్శించుట

తల్లిదండ్రులు, పిల్లలు ఇరువురికి దేవాలయము అనేది పరలోక ప్రదేశాల కోసం ఒక భావనను వాటి కొరకు ప్రేమను సంపాదించుకొనుటకు గొప్ప అవకాశము. పిల్లలు చిన్నవయస్సులో ఉన్నప్పుడు అది మరిముఖ్యముగాా నిజము. పిల్లలు క్రీస్తు యొక్క వెలుగుతో జన్మిస్తారు. దేవాలయము పవిత్రమైనదని పసిబిడ్డ కూడా భావించగలదు. తల్లిదండ్రులు తమ చిన్న పిల్లలను ప్రేమిస్తారు కాబట్టి, తమ పిల్లలు శాశ్వతముగా తమ నిత్య కుటుంబము నందు ప్రేమను కలిగియుంటారు అనే ఆశకు దేవాలయము ప్రాతినిధ్యము వహించును.

మీలో కొంతమంది మీ గృహాలలో దేవాలయము యొక్క ఛాయాచిత్రాలను కలిగియున్నారు. భూమియంతటా దేవాలయాలు అధికమౌతున్నాయి గనుక, అనేకమంది తల్లిదండ్రులకు తమ కుటుంబాలతో దేవాలయాలను దర్శించుట సాధ్యమే. దేవాలయాలు నిర్మించబడినప్పుడు వాటిని సందర్శించే కార్యక్రమానికి కొంతమంది హాజరుకాగలరు. దేవాలయానికి దగ్గరలో లేదా దేవాలయములో ఉన్నప్పుడు వారేవిధముగా భావించారో తల్లిదండ్రులు పిల్లలను అడుగవచ్చును.

ప్రతి తల్లిదండ్రులు తమకు దేవాలయము ప్రాధాన్యతను గూర్చి తమ సాక్ష్యమును పంచుకోవచ్చును. అధ్యక్షులు ఎజ్రా టాఫ్ట్ బెన్సన్, తన తల్లి జాగ్రత్తగా ఆమె యొక్క దేవాలయ వస్త్రములను ఇస్త్రీ చేస్తుండగా చూడటం గురించి ఆయన తరచు మాట్లాడేవారు, ఆయనకు దేవాలయాలంటే ఇష్టము. 6 ఆయన బాలునిగా ఉన్నప్పుడు తన కుటుంబము గృహమును విడిచి దేవాలయము హాజరగుటకు వెళ్ళేటప్పుడు ఆయన వీక్షించడం గురించి ఆయనకున్న జ్ఞాపకాల గురించి మాట్లాడారు.

ఆయన సంఘ అధ్యక్షునిగా ఉన్నప్పుడు ప్రతి వారము అదే రోజున దేవాలయానికి హాజరయ్యారు. ఒక పూర్వికుని కొరకు ఆయన ఎల్లప్పుడు దేవాలయ కార్యమును చేసేవారు. అది చాలావరకు తన తల్లిదండ్రుల మాదిరి వలన కలిగింది.

నా సాక్ష్యము

ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసము గల ప్రదేశముగా, ప్రేమతో నిండిన స్థలముగా మీ గృహమును చేయు ప్రయత్నాల యందు గొప్ప ఆనందాలలో కొన్నింటిని మీరు కనుగొంటారు. సువార్త యొక్క పునఃస్థాపన వినయము గల గృహములో పఠించబడిన వినయము గల ప్రశ్నతో ప్రారంభమయ్యెను, సువార్త సుత్రాలను స్థాపించి, సాధన చేయుట కొనసాగించినప్పుడు అది మన గృహాలలో ప్రతి ఒక్క దానిలో కొనసాగగలదు. నేను చిన్నవాడిగా ఉన్నప్పటినుండి ఇదే నా ఆశ, ఇదే నా బలమైన కోరికగా ఉండెను. అటువంటి గృహాలను మీరందరు చూసారు. మీలో అనేకమంది ప్రభువు సహాయముతో వాటిని సృస్టించారు.

ఆ దీవెన కొరకు కొంతమంది పూర్ణ హృదయముతో ప్రయత్నించారు కాని అది ఇంకా అనుగ్రహించబడలేదు. మీకు నేనిచ్చే వాగ్దానము పన్నెండు మంది అపొస్తలుల కూటములోని ఒక సభ్యుడు నాతో చేసిన వాగ్దానము. మా ఉమ్మడి కుటుంబము చేసిన కొన్ని ఎంపికల వలన రాబోవు లోకములో మేము కలిసి ఉంటామా అనే సందేహమును కలిగియున్నానని ఆయనతో నేను చెప్పాను. నాకు గుర్తున్నంతవరకు ఆయన ఇలా చెప్పారు, ”నీవు ఒక తప్పు సమస్యను గురించి చింతిస్తున్నావు. నీవు సిలెస్టియల్ రాజ్యమునకు యోగ్యతకలిగి జీవించు, తరువాత కుటుంబ ఏర్పాట్లు నీవు ఊహించుకొనే దానికంటే మరింత అద్భుతముగా ఉంటాయి.”

మనము, మన కుటుంబ సభ్యులు నిత్య జీవమునకు అర్హులగుటకు మనం చెయ్యగలిగినదంతా ఈ మర్త్యత్వములో చేసిన ఎవరికైనా ఆ సంతోషకరమైన నిరీక్షణను ఆయన ఇస్తారని నేను నమ్ముచున్నాను. పరలోక తండ్రి యొక్క ప్రణాళిక సంతోషకరమైన ప్రణాళిక అని నేనెరుగుదును. శాశ్వతముగా కుటుంబములో ముద్రింపబడుటకు చేయగలగినదంతా చేసిన మనలో ప్రతివారికి ఆయన ప్రణాళిక దానిని సాధ్యము చేయునని నేను సాక్ష్యమిస్తున్నాను.

జోసెఫ్ స్మిత్‌కు పునఃస్థాపించబడిన యాజకత్వ తాళపుచేతులు విడిపోని క్రమములో అధ్యక్షులు రస్సల్ ఎమ్. నెల్సన్ కి అందించబడినవని నేనెరుగుదును. నేడు కుటుంబాలు ముద్రింపబడుటను ఆ తాళపుచేతులు సాధ్యము చేస్తాయి. తన ఆత్మీయ పిల్లలమైన మనలను పరలోక తండ్రి పరిపూర్ణమైన ప్రేమతో ప్రేమిస్తున్నారని నాకు తెలుసు. యేసు క్రీస్తు ప్రాయశ్చిత్తము వలన మనం పశ్చాత్తాపపడగలము, శుద్ధి చేయబడగలము, మన పరలోక తండ్రి, ఆయన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తుతో శాశ్వతముగా ప్రేమగల కుటుంబాలతో జీవించుటకు యోగ్యులము కాగలమని నేనెరుగుదును. ఆవిధంగా నేను యేసు క్రీస్తు నామములో సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.