2010–2019
సంఘ ఆడిటింగ్ విభాగ నివేదిక, 2018
2019 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము.


సంఘ ఆడిటింగ్ విభాగ నివేదిక, 2018

యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘము యొక్క ప్రథమ అధ్యక్షత్వమునకు

ప్రియమైన సహోదరులారా: సిద్ధాంతము మరియు నిబంధనల 120వ ప్రకరణం లో నమోదు చేయబడిన బయల్పాటు నిర్ధేశానుసారం, ప్రథమ అధ్యక్షత్వం, పన్నెండుమంది అపోస్తలుల కూటమితో కూడిన దశమభాగ వినియోగ సభ, సంఘ నిధుల వినియోగాన్ని ఆమోదిస్తుంది. సంఘ విభాగాలు ఆమోదించబడిన ఆదాయ వ్యయ అంచనాలు, అభిమతాలు, విధానాల ప్రకారం నిధులను వినియోగిస్తాయి.

సంఘ ఆడిటింగ్, విశ్వాస యోగ్యులైన నిపుణులతో, అన్ని సంఘ విభాగముల నుండి స్వతంత్రంగా , సంఘ ఆర్థికవనరులను సంరక్షించులాగున, పొందిన విరాళాలు, చేసిన ఖర్చుల గూర్చి సరియైన అభయాన్ని ఇచ్చు ఉద్దేశ్యంతో విమర్శనలు జరిపే బాధ్యతను కలిగియున్నది.

జరుపబడిన ఆడిట్ల ద్వారా, సంఘ ఆడిటింగ్ 2018 సంవత్సరానికి చెందిన, అన్ని భౌతిక సంబంధమైన విషయాలు, పొందిన విరాళాలు, చేయబడిన ఖర్చులు, సంఘ ఆస్థులు ఆమోదించబడిన సంఘ ఆదాయ వ్యయ అంచనాలు, అభిమతాలు, వాణిజ్య సాధనల ప్రకారం నమోదు చేయబడ్డాయని భావిస్తుంది. సంఘం దాని సభ్యులకు బోధించే ఆదాయ వ్యయ అంచనాలలోనే జీవించుట, అప్పును మానివేయుట, అవసరతగల సమయానికి దాచుకొనుట వంటి ఆచరణలను అనుసరిస్తుంది.

గౌరవనీయంగా నివేదించబడింది,

సంఘ ఆడిటింగ్ విభాగము

కెవిన్ ఆర్. జర్గెన్‌సన్

నిర్వాహణాధికారి