2010–2019
ప్రభువు రాకడకు సిద్ధపడుట
2019 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము.


ప్రభువు రాకడకు సిద్ధపడుట

యేసుక్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘం ప్రత్యేకమైన అధికారమివ్వబడి, ప్రభువు రెండవ రాకడకు అవసరమైన సిద్ధపాటులను సాధించుటకు అధికారమియ్యబడినది.

రెండు వారాలలో, మనం ఈస్టర్ ను జరుపుకోబోతున్నాం. పునరుత్థానము యేసుక్రీస్తు దైవత్వాన్ని, తండ్రియైన దేవుని యథార్ధతను నిరూపిస్తుంది. మన ఆలోచనలు రక్షకుని వైపు తిరిగి, “ఆయన సాటిలేని జీవితం, యెడతెగని ఆయన ప్రాయశ్చిత్తత్యాగం యొక్క గొప్పతనాన్ని“1 మనం ధ్యానం చేస్తాం. “ఆయన రాజులకు రాజుగా, … ప్రభువులకు ప్రభువుగా పాలించుటకు“ 2 తిరిగి రావడం గురించి కూడా మనం ఆలోచిస్తామని నేను నిరీక్షిస్తున్నాను.

కొంతకాలం క్రితం బ్యూనో ఎయిర్స్, అర్జెంటీనాలో, వివిధ రకాలైన మతవిశ్వాసాలకు చెందిన ఒక సమావేశంలో నేను పాల్గొన్నాను. తోటివారి పట్ల వారి ప్రేమ తప్పుపట్టలేనిది. వారు బాధలలోనున్న వారికి ఉపశమనం కలిగించుటకు, ప్రజలను పేదరికం, అణచివేతలనుండి పైకి లేవనెత్తుటకు నిశ్చయతతో ఉన్నారు. నేను ఆ సమావేశంలో ప్రాతినిధ్యం వహించిన అనేక విశ్వాసగుంపులతో కలిసి మానవతాదృక్పథంతో ఈ సంఘం చేసిన అనేక ప్రాజెక్టులపై ప్రతిబంబించాను. అటువంటి క్రీస్తునుపోలిన సేవలను సాధ్యం చేసిన యేసుక్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘ సభ్యుల దానగుణానికి నేను లోతైన కృతజ్ఞతను అనుభవించాను.

ఆక్షణంలో, పరిశుద్ధాత్మ రెండు విషయాలను ధృడపరచింది. మొదటిగా, భౌతిక అవసరతలకు పరిచర్య చేయుట ఆవశ్యకం, అది జరుగుతూనే ఉండాలి. రెండవది అస్సలు ఊహించనిదైనప్పటికీ శక్తివంతమైనది, స్పష్టమైనది. అది ఇదే: నిస్వార్ధమైన సేవకంటే ఎక్కువ, ప్రభువైన యేసుక్రీస్తు రెండవ రాకడకు లోకాన్ని సిద్దపరచడం అత్యధిక ప్రాముఖ్యతగలది.

ఆయన వచ్చినప్పుడు, అణచివేత, అన్యాయం తగ్గడమే కాదు గానీ, అవి పూర్తిగా ఆగిపోతాయి.

“తోడేలు గొఱ్ఱపిల్లయొద్ద వాసముచేయును, చిఱుతపులి మేకపిల్లయొద్ద పండుకొనును, దూడయు కొదమసింహమును కూడుకొనగా బాలుడు వాటిని తోలును. …

“నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హానిని, నాశనమును చేయదు, సముద్రము జలముతో నిండియున్నట్టు లోకము ప్రభువునుగూర్చిన జ్ఞానముతో నిండి యుండును.“3

పేదరికం, బాధలు తగ్గడమే కాదు, అవి అంతరించిపోతాయి:

“వారికి ఇకమీదట ఆకలియైనను దాహమైనను ఉండదు, సూర్యుని యెండయైనను ఏ వడగాలియైనను వారికి తగులదు.

“ఏలయనగా సింహాసన మధ్యనుండు గొఱ్ఱపిల్ల వారికి కాపరియై, జీవజలముల బుగ్గలయొద్దకు వారిని నడిపించును, దేవుడే వారి కన్నులనుండి ప్రతి బాష్పబిందువును తుడిచి వేయును.“4

నొప్పి, చావు యొక్క విచారం ముగిసిపోతాయి.

“ఆ దినాన్న బాలుడు అతడు వృద్ధుడగువరకు చనిపోడు; అతని జీవితకాలం ఒక వృక్షం యొక్క జీవితకాలంవలేనుండును;

“అతడు మృతినొందిప్పుడు అతడు నిద్రించడు కానీ అతడు కనురెప్పపాటులో మార్పుచెంది, కొనిపోబడును, అతని విశ్రాంతి మహిమకరమైనదగును.“5

కావున, మనం బాధలలో, విచారాలలో ఉన్నవారికి విశ్రాంతి కల్గించుటకు మనం చేయగల్గనవన్నీ చేద్ధాం, మరియు ఇంకా శ్రద్ధతో బాధ, చెడు కలిసి అంతరించిపోయేటువంటి అనగా “భూమి వినూతనం చేయబడి, పరదైసిక మహిమను పొంది, క్రీస్తు స్వయంగా భూమిపై పరిపాలించే“6 దినానికి అవసరమైన సిద్ధపాటులు చేయడానికి మనలను మనం సమర్పించుకుందాం. ఆరోజు ఒక విమోచన మరియు తీర్పుతీర్చు దినం. డర్హెం యొక్క ఆంగ్లికన్ భిషప్పు, డాక్టర్ ఎన్. టి. రైట్, క్రీస్తు ప్రాయశిత్తాన్ని, పునరుత్ధాన్ని, అవినీతిని అధిగమించు తీర్పును, అన్ని విషయాలను సరిగా నుంచు ప్రాముఖ్యతను చక్కగా వివరించారు.

ఆయన ఇలా చెప్పారు: “దేవుడు ఆయనచే నియమించబడిన ఒక మనుష్యునిచే లోకమునకు తీర్పుతీర్చబడు ఒక దినాన్ని ఆయన నిర్ణయించెను, దీని గురించి అందరికీ అభయాన్నిచ్చేందుకు ఆయన ఈ మనుష్యునిని చావునుంచి లేవనెత్తెను. నజరేయుడైన యేసును గురించిన సత్యాలు, మరిముఖ్యంగా మృతులనుండి ఆయన పునరుత్థానం, లోకం యాధృచ్చికం కాదు అని తెలియజేయుటకు ఇవ్వబడిన అభయముల పునాధియై యున్నవి. అది తప్పకుండా ఒక గందరగోళం; ప్రస్తుతకాలంలో మనం ధర్మాన్ని చేసినప్పుడు, తప్పకుండా కూలిపోయే భవనాన్ని నిర్మిస్తున్నట్లు, లేదా చెత్తకుప్పలో చేరవలసిన వాహనాన్ని బాగుచేస్తున్నట్లు మనం ధైర్యంగా ఉండలేకపోతున్నాం. దేవుడు యేసును మృతులనుండి లేవనెత్తినప్పుడు, అది ఒక అతిచిన్న కార్యం, దానిలో చివరిగా జరిగే అతిపెద్ద కార్యమైన తీర్పుతీర్చుట అనేది క్లుప్తంగా, ఒక విత్తనం వలే, ...అనగా అంతిమ నిరీక్షణను కల్గియున్న విత్తనం వలేయున్నది. దేవుడు ఊహించదగినంత శక్తివంతమైన విధంగా, నజరేయుడైన యేసే మెస్సియా అని ప్రకటించారు. ... గొప్ప వ్యంగ్యమైన చరిత్రలో, అనేక క్రూరత్వాలు, అధర్మాలు కలిసికూడుకొనుటకు సాధృశ్యమైన ప్రదేశంలో, గందరగోళాలను, అధర్మాల నన్నింటినీ తనపై మోయుటకు, వాటి శక్తిని అంతం చేయటానికి యేసు ఒక్కరే అంతటి క్రూరమైన, అవినీతికరమైన తీర్పును పొందారని చెప్పారు.“7

ముందు నేను ప్రస్థావించిన బ్యునోస్ ఎరిస్ లోని సమావేశంలో ఉన్నప్పుడు, యేసుక్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘం ప్రత్యేకమైన శక్తినియ్యబడి, ప్రభువు రెండవ రాకడకు అవసరమైన సిద్ధపాటులను సాధించుటకు అధికారమియ్యబడినదని, ఆ ఉద్ధేశ్యము కొరకే అది పునఃస్థాపించబడిందని ఆత్మ నాకు స్పష్టం చేసింది. ఇంకెక్కడైనా ప్రవచించబడిన “పరిపూర్ణకాల యుగంగా“ దేనియందైతే దేవుడు “క్రీస్తులో అన్నింటినీ ఒక్కటిగా సమకూర్చుటకు“8 ఉద్దేశించెనో అట్టి ప్రస్తుతకాలాన్ని హత్తుకునే జనులను కనుగొనగలరా? ఆ రోజుకి సిద్దపడుటకు సజీవులు, మృతుల కొరకు సాధించవలసిన వాటిని సాధించు సామాజిక సంకల్పంను, ప్రభువును కలుసుకొనుటకు నిబంధన జనులను సమకూర్చుటకు, సిద్దపరచుటకు విస్తారమైన సమయాన్ని, నిధులను అప్పగించుటకు సమ్మతిగల సంస్థను మీరు ఇక్కడ కనుగొనలేకపోతే, ఇంకెక్కడా మీరు కనుగొనలేరు.

1831లో సంఘంతో మాట్లాడుతూ ప్రభువు ఇలా ప్రకటించారు:

“దేవుని రాజ్య తాళపుచెవులు నరునికి ఇవ్వబడ్డాయి మరియు అక్కడనుంచి సువార్త భూమి అంచులవరకు కొనిపోబడుతుంది. …

“ఆయన రాజ్యం భూమిపై విస్తరించునట్లు, దాని నివాసులు దానిని అంగీకరించునట్లు, మనుష్యకుమారుడు పరలోకం నుండి దిగివచ్చి, ప్రకాశవంతమైన మహిమను ధరించిన వాడై, భూమిపై స్థాపించబడిన దేవుని రాజ్యాన్ని కలుసుకొనుటకు రాబోయే దినాల కొరకు సిద్ధపడునట్లు ప్రభువుకు ప్రార్థించండి.“9

ఆ దినం కొరకు సిద్ధపడుటకు ఇప్పుడు మనం ఏమి చెయ్యాలి? మనం జనులుగా మనలను సిద్ధపరచడానికి; మనం ప్రభువు యొక్క నిబంధన జనులను సమకూర్చాలి; మన పితరులైన “తండ్రులకు చేయబడిన“ రక్షణ వాగ్ధానాన్ని విమోచించడానికి సహాయపడాలి.10 ఇదంతా ప్రభువు రాకడకు ముందే కొంచెం గణనీయమైన పరిమాణంలో జరగాలి.

మొదట, ప్రభువు రాకడకు అతిముఖ్యమైనది ఆయన వచ్చినప్పుడు భూమిపై ఆయనను కలుసుకోవడానికి సిద్ధపడియున్న జనులు. ఆ దినాన్న భూమిపై ఉన్నవారు “అల్పుని నుండి గొప్పవాని వరకు, … ప్రభుని జ్ఞానంతో నింపబడి, కన్నులతో చూచి, వారు స్వరాలనెత్తి, ఒక్కటిగా ఈ నూతన గీతాన్ని పాడెదరు: ప్రభువు సియోనును తిరిగి తెచ్చెను. … ప్రభువు అన్ని విషయాలను ఒక్కటిగా సమకూర్చి, పరలోకం నుండి సియోనును క్రిందకు దించి, క్రిందనున్న సియోనును ప్రభువే బయటకు తెచ్చెను.”11

ప్రాచీనకాలంలో, దేవుడు నీతిగల పట్టణమైన సియోనును తన వద్దకు కొనిపోయెను.12 అలాకాకుండా, చివరి దినాలలో నూతన సియోను ప్రభువు రాకడలో ఆయనను స్వీకరించును.13 సియోను అనగా స్వచ్ఛమైన హృదయం కలిగి, అక్కడి జనులు ఒకే హృదయం, ఒకే తలంపు కలిగి, నీతిమత్వంలో నివసింతురు, వారి మధ్యన బీదవారెవరూ లేరు.14 ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్, “సియోనును నిర్మించుట మన యొక్క గొప్పలక్ష్యంగా మనం కలిగియుండాలి“15 అని చెప్పెను. మనం సియోనును మన గృహాలలో, వార్డులలో, శాఖలలో, స్టేకులలో ఐకమత్యం, దైవత్వం, దాతృత్వం16 ద్వారా నిర్మించగలం.

సియోను నిర్మాణం ప్రయాసకరమైన గడియలలోనే అనగా ప్రభువు సెలవిచ్చుచున్న “ఉగ్రత దినము, కాల్చివేయబడు దినము, దుఃఖపడి, ఏడ్చి, రోదించే నాశనకరమైన దినమున జరుగుతుందని; సుడిగాలి వలే భూమి మీదకు అది వచ్చునని మనం గుర్తించాలి.“17 అలాగున, స్టేకులలోకి సమకూర్చుట “ఆత్మరక్షణ కొరకు, తుఫాను నుండి రక్షణ కొరకు భూమియంతటిపై ఏమియు కలపబడకుండ క్రుమ్మరించబడబోవు దేవుని ఉగ్రతనుండి తప్పించుకొనుట కొరకు”18 జరుగును.

గతంలో లాగానే, మనం “ఉపవాసం చేయుటకు, ప్రార్థించుటకు, మన ఆత్మల సంక్షేమం కొరకు ఒకరితోనొకరు మాట్లాడుటకు, ... ప్రభువైన యేసు జ్ఞాపకార్థంగా రొట్టెను నీరును పాలుపంచుకొనుటకు, తరచూ కలుసుకుంటున్నాం.“19 గత అక్టోబరు సర్వసభ్యసమావేశంలో అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ వివరించినట్లుగా, “సభ్యులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు, ఆయన ప్రాయశ్చిత్తంపై వారి విశ్వాసాన్ని పెంపొందించుటలో, దేవునితో నిబంధనలను చేయుటలో, వాటిని పాటించుటలో, వారి కుటుంబాలను బలపరచి, ముద్రించుటలో సహాయపడుటయే సంఘం యొక్క ధీర్ఘకాల లక్ష్యం.“20 అదేవిధంగా, ఆయన దేవాలయనిబంధనలు, సబ్భాతును పరిశుద్ధంగా ఆచరించుట, గృహకేంద్రంగా సువార్తను ప్రతిదినం విందారగించుట, దానిని సంఘం యొక్క ఏకీకృత పఠనా పాఠ్యప్రణాళిక చే ఆదరించుట యొక్క ప్రాముఖ్యతను ఉద్ఘాటించారు. మనం ప్రభవు గురించి తెలుసుకోవాలని కోరుచున్నాము, మరియు ప్రభువును తెలుసుకోవాలని కోరుచున్నాము.21

సియోనును నిర్మించుటలో మౌలిక యత్నమే ప్రభువు యొక్క చాలాకాలంగా చెదరగొట్టబడిన నిబంధనా జనులను సమకూర్చుట.22 “మేము ఇశ్రాయేలీయులు సమకూర్చబడుటను పది గోత్రాల పునఃస్థాపనను నమ్ముచున్నాము.“23 పశ్చాత్తాపపడి, క్రీస్తునందు విశ్వాసంతో, బాప్తీస్మం పొందువారందరూ ఆయన యొక్క నిబంధనాజనులు.24 ప్రభువు తానే తన రాకడకు ముందు, “ఇశ్రాయేలు వంశస్థులైన [ఆయన] జనులను సమకూర్చుటకు“26 లోకమంతా సువార్త ప్రకటించబడుతుందని25 “దాని తర్వాతే ముగింపు వస్తుందని“27 ప్రవచించారు. యిర్మియా ప్రవచనం నెరవేరుచున్నది:

“యెహోవా సెలవిచ్చునదేమనగా, నేను ఐగుప్తు దేశములో నుండి వారి పితరులకిచ్చిన దేశమునకు వారిని మరల రప్పించెదను గనుక రాబోవు దినములలో ఇశ్రాయేలీయులను రప్పించిన యెహోవా జీవముతోడని కాక;

“ఇకమీదట, ఉత్తరదేశములో నుండియు ఆయన వారిని తరిమిన దేశములన్నిటిలో నుండియు ఇశ్రాయేలీయులను రప్పించిన యెహోవా జీవముతోడని జనులు ప్రమాణము చేయుదురు.“28

అధ్యక్షులైన నెల్సన్ పునరుద్ఘాటించినట్లు, “[ఇశ్రాయేలీయులను] సమకూర్చుటయే భూమిపై నేడు జరుగుతున్న అతి ప్రాముఖ్యమైన కార్యం. దాని పరిమాణానికి, దాని ప్రాముఖ్యతకు, దాని ఘనతకు ఏదియు సరికాదు. నీవు ఎన్నుకున్నట్లైతే, … నీవు కూడా దానిలో పాలిభాగం పొందగలవు.“29 కడవరి-దిన పరిశుద్ధులు ఎల్లప్పుడూ దైవసేవాజనులైయున్నారు. వందల వేలమంది పునఃస్థాపన ప్రారంభం నుండి దైవసేవా పిలుపులకు స్పందించారు; వేలమంది ప్రస్తుతం సేవచేస్తున్నారు. ఎల్డర్ క్వింటిన్ ఎల్. కుక్ ఇప్పుడే బోధించినట్లుగా, మనం అందరం సరళమైన, సహజమైన మార్గాలలో, ప్రేమతో, ఇతరులను సంఘంలో, మన గృహాలలో మనతో కలిసి మన వారితో పాలిభాగస్తులు అగుటకు ఆహ్వానించగలం. మోర్మన్ గ్రంథం యొక్క ప్రచురణ సమకూర్చుట ప్రారంభమైందనుటకు సూచన.30 మోర్మన్ గ్రంథము సమకూర్చుటకు, మారుమనస్సునకు మూల సాధనమైయున్నది.

రెండవ రాకడ కొరకు సిద్ధపాటులో మన పితరులకు బదులుగా చేయబడు గొప్ప విమోచనాయత్నం కూడా ఆవశ్యకమైయున్నది. “భయంకరమైన ఆ మహాదినమైన“31, రెండవ రాకడకు ముందు, “యాజకత్వాన్ని... బయలుపరచుటకు,“ “పిల్లల హృదయములలో తండ్రులకు చేయబడిన వాగ్ధానాలను నాటుటకు“32 ప్రవక్తయైన ఏలియాను పంపిస్తానని ప్రభువు వాగ్ధానం చేశారు. వాగ్ధానం చేయబడినట్లుగా ఏలియా వచ్చారు. ఆ తేది ఏప్రిల్ 3, 1836; ప్రదేశం కర్ట్లాండ్, దేవాలయం. ఆ ప్రదేశంలో, ఆక్షణంలో ఆయన వాగ్ధానంచేయబడిన యాజకత్వాన్ని, మృతుల విమోచనకు, కాలానికి, నిత్యత్వాలన్నింటికీ భర్తలు, భార్యలు, అన్ని తరాల కుటుంబాలు కలిసుండడానికి తాళపుచెవులను అనుగ్రహించారు.33 ఇదిలేకుండా, సృష్టి ఉద్ధేశ్యం నిష్పలమయ్యేది, ఆ విధంగా, భూమి శపించబడేది లేదా ”పూర్తిగా వ్యర్థమయ్యేది.”34

రోమ్ ఇటలీ దేవాలయ ప్రతిష్ఠకు ముందు జరిగిన యౌవనుల ఆరాధనలో, వందల మంది యువకులు, యువతులు అధ్యక్షులు నెల్సన్ కు వారి పితరుల పేర్లతో సిద్ధం చేయబడిన కార్డులను చూపించారు. వారు దేవాలయం తెరువబడిన వెంటనే లోనికి ప్రవేశించి వారి పితరులకు ప్రత్యామ్నాయ బాప్తీస్మాలు ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నారు. అది ఎంతో మనోహరమైన క్షణం, అయినప్పటికీ మనకు ముందుగా వెళ్లిపోయిన తరాల కోసం సియోనును ఏర్పరచుటకు హెచ్చింపబడిన యత్నాలకు అది ఒక ఉదాహరణ.

ప్రభువుచే ఎన్నుకొనబడిన వారిని సమకూర్చుట, మృతులను విమోచించుట ద్వారా మనం సియోనును నిర్మించుటలో శ్రద్ధగా యత్నించినప్పుడు, మనం ఒక్కసారి ఆగి అది దేవుని కార్యమని, ఆయనే దానిని జరిగించుచున్నాడని జ్ఞాపకం చేసుకోవలెను. ఆయన ద్రాక్షతోట యజమానైయున్నాడు, మనం ఆయన సేవకులం. మనలను ఈ ”చివరిసారి” మనఃపూర్వకంగా పనిచేయమని ఆయన అడుగుచున్నారు, ఆయన కూడా మనతో పాటు పనిచేస్తారు.35 ఇంకా సరైనవిధంగా చెప్పాలంటే ఆయనతో పాటు పనిచేయుటకు మనలను అనుమతిస్తారు. పౌలు చెప్పినట్లుగా, ”నేను నాటితిని, అపొల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే.”36 ఆయనే ఆయన పనిని ఆయన కాలంలో త్వరితం చేస్తున్నాడు.37 ఒప్పుకోదగిన మన అసంపూర్ణమైన యత్నాలైన మన ”చిన్నిసాధనాలను” వినియోగించడం ద్వారా ప్రభువు గొప్ప సంగతులను సాధిస్తారు.38

ఆ గొప్ప, కడవరి యుగం, రక్షకుని మహిమకరమైన రాకడలో భూమిపైనున్న సియోను, పరలోకమందున్న సియోనుతో కలుసుకొవడం ద్వారా దాని ముగింపుకు నెమ్మదిగా చేరుకుంటుంది. ఆ దినానికి లోకాన్ని సిద్ధపరచుటకు యేసుక్రీస్తు సంఘం ప్రతిజ్ఞ పూనెను-మరియు సిద్ధపరుస్తుంది. కాబట్టి, ఈ ఈస్టర్ నందు, యేసుక్రీస్తు పునరుత్థానాన్ని, అది తేనున్న వాటిని నిజంగా జరుపుకొందాం: వెయ్యేండ్లు సమాధానముగా ఏలుటకు ఆయన తిరిగివచ్చుట, నీతిమంతమైన తీర్పు మరియు అందరికి పరిపూర్ణమైన న్యాయము, ఈ భూమిపైన జీవించిన వారందరికి అమర్త్యత్వము మరియు నిత్యజీవ వాగ్దానము. యేసు పునరుత్థానము అంతా సరిగా చేయబడుతుందనేది తప్పని అభయమైయున్నది. ఆ దినాన్ని త్వరితం చేయుటకు మనమంతా సియోను నిర్మాణంలో పనిచేద్ధాం. యేసు క్రీస్తు నామములో ముగిస్తున్నాను, ఆమేన్.