2010–2019
మీ యాజకత్వ వ్యూహగ్రంథము
2019 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము.


మీ యాజకత్వ వ్యూహగ్రంథము

క్రీస్తు యొక్క శిష్యునిగా మిమ్మల్ని మీరు ఎలా రుజువు చేసుకొంటారో మీ స్వంత వ్యూహగ్రంథమును రచించండి.

గత డిసెంబరులో, ప్రథమ అధ్యక్షత్వము ఇలా ప్రకటిస్తూ ఒక వ్యాఖ్యానమును జారీచేసారు, 11 సంవత్సరాల బాలురు, “వారికి పన్నెండు సంవత్సరాలు వచ్చే సంవత్సరము యొక్క జనవరి ప్రారంభములో … అహరోను యాజకత్వ పూరకమునకు … హాజరగుట ప్రారంభిస్తారు.”1

ఫలితంగా, ఈ సంవత్సరము మొదటి భాగములో, విస్మయము చెందిన 11 సంవత్సరాల బాలురు చాలామంది, తమ తరువాతి పుట్టిన రోజు వరకు ప్రాథమికలో ఉంటారని అనుకున్నారు కానీ ఇప్పుడు సంఘము యొక్క క్రొత్తగా నియమించబడిన పరిచారకులుగా ఆదివారము సంస్కారము అందిస్తున్నారు.

మార్పు వలన ఎవరు ఎక్కువ ఆశ్చర్యపడ్డారు---క్రొత్త పరిచారకులా లేక వారి తల్లిదండ్రులా అని నేను ఆలోచించాను. షుమారు 80,000 మందిగల ఈ పరిచారకులలో అనేకులు ఈ రాత్రి మనతో ఈ గొప్ప సమావేశ కేంద్రములో ఉన్నారు లేదా సాంకేతిక పరిజ్ఞానము ద్వారా పాల్గొనుచున్నారు. యాజకత్వము యొక్క గొప్ప సహోదరత్వమునకు స్వాగతము!

ఈ మార్పు ఈ సమావేశమును ఒక చారిత్రకమైనదిగా చేయును---అది బహుశా సర్వసభ్య సమావేశము యొక్క ప్రధాన సమావేశమును ఎప్పటికీ హాజరైన అహరోను యాజకత్వము గలవారి యొక్క అతిపెద్ద గుంపు. ఈ ప్రత్యేక సందర్భము యొక్క వెలుగులో, అహరోను యాజకత్వము యొక్క యువకులతో ప్రత్యేకంగా నేను ప్రసంగిస్తాను.

క్రీడల నుండి నేర్చుకొన్న పాఠాలు

విద్యార్ధులుగా ఉండుటకు అదనముగా, మీలో అనేకులు పాఠశాల వద్ద లేక పాఠశాల బయట క్రీడలతోపాటు వ్యక్తిగత పాఠములు, జట్లు, మరియు గుంపులు ద్వారా మీ ప్రతిభలు, ఆసక్తులు, మరియు అలవాట్లను కూడ వృద్ధి చేసుకొనుచున్నారు.

నా జీవితకాలమంతా క్రీడలను ఆనందించడం వలన, ఉన్నత స్థాయిలలో ఆడే స్థాయికి వారి క్రీడా సామర్ధ్యములను వృద్ధి చేసేవారిని నేను ఎల్లప్పుడు మెచ్చుకుంటాను. ఎవరైనా నిజంగా ఏవిషయంలోనైనా రాణించాలంటే, సహజ ప్రతిభతో పాటు గొప్ప క్రమశిక్షణ, త్యాగము మరియు లెక్కింపలేని గంటల శిక్షణ మరియు సాధన అవసరము. అటువంటి క్రీడాకారులు కొన్నిసార్లు కోచ్‌‌ల నుండి కఠినమైన విమర్శలను వింటారు మరియు భవిష్యత్తులో ఏదైన గొప్పదాని కొరకు ఇప్పుడు వారు కోరిన దానిని ప్రక్కన పెట్టటానికి సమ్మతిస్తారు.

వృత్తి సంబంధమైన క్రీడల ఉన్నతస్థాయిలలో విజయాన్ని అనుభవించిన సంఘ సభ్యులు మరియు యాజకత్వము గలవారిని మనము ఎరుగుదుము. అనేక అద్భుతమైన మాదిరులు ఉన్నాయి, కానీ సమయము పరిమితము చేత ఇక్కడ కొన్ని మాత్రమే నేనివ్వగలను. ఈ క్రీడాకారులలో కొందరిని మీరు గుర్తించవచ్చు: బేస్‌బాల్‌లో జెరెమీ గుథ్రీ మరియు బ్రైస్ హార్పర్; బాస్కెట్ బాల్‌లో, జబారి పార్కర్ మరియు జిమ్మర్ ఫ్రెడిట్టి; సాకర్‌లో, రికార్డో రోజాస్; మరియు రగ్బీ లీగ్, విలియమ్ హొపాయేట్; మరియు ఫుట్‌బాల్‌లో టేసమ్ హిల్ మరియు డేనియేల్ సోరెన్‌సన్. ప్రతీఒక్కరు తన క్రీడకు ప్రాముఖ్యమైన తోడ్పాటులను చేసారు.

వారు తమ క్రీడలలో అత్యధికంగా విజయవంతంగా ఉండగా, ఈ క్రీడాకారులు తాము పరిపూర్ణులైన క్రీడాకారులు కాదని లేక పరిపూర్ణులైన మానవులు కాదని అంగీకరించుటకు మొదటివారు. మనలో ప్రతీఒక్కరి వలే, వారు తమ క్రీడయందు శ్రేష్టముగా ఉండుటకు--మరియు సువార్తను జీవించుటకు వారు కష్టపడి పనిచేస్తారు. వారు తొట్రిల్లిన యెడల పైకిలేస్తారు మరియు అంతము వరకు సహించుటకు ప్రయాసపడతారు.

వ్యూహగ్రంథమును అధ్యయనము చేయుము

జట్టుగా ఆడే క్రీడలలో, వ్యూహములు కొన్ని క్రీడా పరిస్థితుల కొరకు వృద్ధి చేయబడినవి మరియు ఒక వ్యూహగ్రంథముగా సంగ్రహించబడింది. క్రీడాకారులు ప్రతీ వ్యూహము కొరకు వారి పాత్రను మరియు ప్రత్యేక నియామకమును నేర్చుకొంటారు. విజయవంతులైన ఆటగాళ్ళు వ్యూహగ్రంథమును ఎంత సమగ్రంగా అధ్యయనము చేస్తారంటే ఒక వ్యూహము ఎంపిక చేయబడినప్పుడు, ఎక్కడికి వెళ్ళాలి మరియు ఏమి చేయాలో వారికి ఖచ్చితంగా, దాదాపు సహజంగా తెలుసు.

చిత్రం
వ్యూహగ్రంథముతో పాటు శిక్షకుడు

Photograph by Dave Kaup/REUTERS/stock.adobe.com

చిత్రం
వ్యూహగ్రంథము

అదేవిధంగా, యాజకత్వముగల మనము కూడా ఒక జట్టును—ఒక సమూహమును—మరియు ఒక వ్యూహగ్రంథమును—పరిశుద్ధ లేఖనాలు మరియు ఆధునిక ప్రవక్తల మాటలను కలిగియున్నాము.

మీ జట్టు సభ్యులను మీరు బలపరుస్తున్నారా?

మీ వ్యూహ పుస్తకమును మీరు ఎంత బాగా అధ్యయనము చేసారు?

మీకు అప్పగించబడిన పనిని మీరు పూర్తిగా గ్రహించారా?

చిత్రం
యాజకత్వ పూరకములు

వ్యతిరేకతను ఎదుర్కొనుట

సాదృశ్యమును ముందుకు తీసుకొనివెళ్ళుటకు, గొప్ప శిక్షకులు వారి జట్టు అదేవిధంగా వారికి వ్యతిరేకమైన వారి యొక్క బలములు మరియు బలహీనతలను ఎరుగుదురని మనము చూసాము. విజయము కొరకు ఉత్తమమైన అవకాశమును వారికిచ్చునట్లు వారు ఒక క్రీడా ప్రణాళికను ఏర్పరుస్తారు. మీ విషయమేమిటి?

మీరు ఏ శోధనలకు అత్యధికంగా బలహీనంగా ఉన్నారో మీకు తెలుసు, మరియు అపవాది మిమ్మల్ని ఆపుటకు మరియు నిరాశపరచుటకు ఎలా ప్రయత్నిస్తాడో మీరూహించగలరు. వ్యతిరేకతను ఎదుర్కొన్నప్పుడు, ఎలా స్పందించాలో మీరు ఎరుగునట్లు, మీరు ఒక వ్యక్తిగత క్రీడా ప్రణాళికను మరియు వ్యూహగ్రంథమును ఏర్పరిచారా?

వివిధ నైతిక శోధనలను మీరు ఎదుర్కొన్నపుడు---ఇతరుల సమక్షములో లేక ఒంటరిగా ఒక తెరవైపు తేరి చూసినప్పుడు--మీ క్రీడా ప్రణాళికను మీరు ఎరిగియున్నారు. ఒక స్నేహితుడు మిమ్మల్ని మద్యము త్రాగమని లేక మత్తుమందులు ప్రయత్నించమని సూచిస్తే, మీ వ్యూహము తెలుసు. మీరు అభ్యసించారు మరియు ముందుగా ఎలా స్పందించాలో ఎరుగుదురు.

ఒక క్రీడా ప్రణాళికతో, ఒక వ్యూహగ్రంథము, మరియు మీ పాత్రను నెరవేర్చుటకు ఒక స్థిరమైన ఒడంబడికతో, ఆ శోధన మీపై తక్కువ నియంత్రణ కలిగియుంటుందని మీరు కనుగొంటారు. మీరు ఎలా స్పందిస్తారు మరియు మీరేమి చేస్తారో ఇదివరకే మీరు నిర్ణయాన్ని చేసారు. శోధనతో మీరు ఎదుర్కొన్న ప్రతీసారి మీరు నిర్ణయము చేయనవసరం లేదు.

ఇటీవల పన్నెండుమందిలో ఒకరు ఈ సూత్రమును వివరించే ఒక వృత్తాంతమును పంచుకున్నారు. ఉన్నత పాఠశాలలో ఒక యాజకునిగా, అతడు తన స్నేహితులతో సమయాన్ని గడుపుతున్నాడు. వాళ్లు తినటానికి ఆహారము కొన్న తరువాత, వారు ప్రయాణిస్తున్నపుడు, ఒక నిర్ధిష్టమైన సినిమాకు వెళ్లాలని ఎవరో సూచించారు. సమస్య ఏదనగా, అది తాను చూడకూడని సినిమా అని అతడు ఎరుగును. అతడు వెంటనే పరిస్థితిని బట్టి ఒత్తిడిని, ఆందోళనను అనుభవించినప్పటికినీ, అతడు దీని కొరకు ప్రణాళిక చేసాడు. అతడి యాజకత్వపు వ్యూహగ్రంథములో ప్రత్యేకంగా ప్రణాళిక చేయబడిన పరిస్థితి ఇది.

గట్టిగా ఊపిరి పీల్చుకొని తన ధ్యైర్యాన్ని కూడగట్టుకొని, అతడు, “ఆ సినిమా మీద నాకు ఆసక్తిలేదు. నన్ను ఇంటివద్ద దించండి,” అని చెప్పగా, దానిని వారు చేసారు. ఒక సాధారణమైన వ్యూహము ఒక విజయానికి నడిపించింది! సంవత్సరాల తరువాత, ఆ రాత్రి అతడితో ఉన్న స్నేహితులలో ఒకరు ఈ మాదిరి తన స్వంత జీవితంలో అదేవిధమైన పరిస్థితులను ధైర్యముగా ఎదుర్కొనుటకు అతడికి గొప్ప బలముగా ఉండుటకు రుజువు చేసిందని వివరించాడు.

వ్యూహగ్రంథములో పేజీలు

మీ వ్యూహగ్రంథములో మీరు చేర్చగల వ్యూహములను సిఫారసు చేయమని నా సహవాసులలో కొందరిని నేను అడిగాను. వారి ప్రేరేపించబడిన సూచనలలో ఇక్కడ కొన్ని ఉన్నాయి:

  • గొప్ప వెలుగు మరియు యేసు క్రీస్తును గూర్చి సాక్ష్యము కొరకు ప్రతీరోజు ప్రార్థించుము.

  • మీ తల్లిదండ్రులు, బిషప్పు, మీ యువకుల మరియు పూరకము యొక్క నాయకుల బోధనలను జాగ్రత్తగా వినుము.

  • అశ్లీల చిత్రములు మరియు దుర్నీతికరమైన సామాజిక మీడియా విషయమును మానివేయుము.

  • దేవునితో మీరు చేసిన వాగ్దానములు జ్ఞాపకముంచుకొనుము, మరియు వాటిని పాటించుటకు పనిచేయుము.

  • గొప్ప ప్రవక్తల వృత్తాంతములను అధ్యయనము చేయుము, మరియు వారి మంచి లక్షణాలను అనుకరించుము.

  • సేవ ద్వారా పరలోక తండ్రి యొక్క పిల్లలను దీవించుము.

  • మీరు కావాలని కోరే వ్యక్తిగా అగుటకు సహాయపడే మంచి స్నేహితులను వెదకుము.

  • కుటుంబ పరిశోధన యాప్‌లో నిపుణులు కమ్ము, మరియు మీ స్వంత కుటుంబ చరిత్రను పరిశోధించుము.

  • చెడు ప్రభావములను మీరు తప్పించుకోగల ప్రదేశములను ప్రణాళిక చేయుము.

  • మీ యాజకత్వ సమూహములోని ఇతర సభ్యులను ప్రేమించి, బలపరచుటకు సహాయపడుము.

మనము ఇప్పుడే చూసిన క్రీడాకారులతో కూడ నేను మాట్లాడాను. నిపుణులైన క్రీడాకారులుగా, వారు చేయుచున్న దానిచేత తమను తాము గుర్తించలేదు--బదులుగా, ప్రేమగల తండ్రి యొక్క కుమారులుగా మరియు దేవుని యాజకత్వముగల వారిగా వారు ఎవరో, గుర్తించుట ఆసక్తికరమైనదిగా నేను దానిని కనుగొన్నాను.

ఇప్పుడు వారి ఆలోచనను మనము విందాము:

  • ఇక్కడ జిమ్మర్ ఫ్రెడెట్ ఒక పరిచారకునిగా ఉన్నప్పుడు చిత్రము, ఇలా చెప్పును: “సువార్త యొక్క సత్యమును గూర్చి నా జ్ఞానము మరియు విశ్వాసముపై ఎక్కువగా ఆనుకొనుటకు నేను నేర్చుకున్నాను. ఇది … ఒక యోగ్యతగల యాజకత్వముగల వానిగా మరియు అన్నిటికి పైగా—ఒక మంచి మాదిరిగా ఉండుటకు నన్ను నడిపించింది.”

    చిత్రం
    ఒక పరిచారకునిగా జిమ్మర్ ఫ్రెడెట్
  • మనము ఈ చిత్రములో బ్రైస్ హార్పర్‌ను ఒక భర్త పాత్రలో చూస్తున్నాము. అతడు ఇలా వ్రాస్తున్నాడు: “పేరు, ఐశ్వర్యము, మరియు ఎమ్‌విపి ఆవార్డు నాకు సంతోషాన్ని కలిగిస్తాయని నేను అనుకున్నాను. ఏదో కోల్పోబడింది. అందుచేత, నేను . . . సిద్ధపడ్డాను మరియు దేవాలయములో (ప్రవేశించాను). ఇప్పుడు నేను పరలోక తండ్రి వద్దకు (తిరిగి) వెళ్లే మార్గములో ఉన్నాను మరియు ఒక నిత్య కుటుంబముు కలిగియున్నాను—అది లోకములో మిక్కిలి గొప్ప సంతోషము!”

    చిత్రం
    తన భార్యతో బ్రైస్ హార్పర్
  • ఈ చిత్రములో డేనియేల్ సోరెన్‌సన్ ఒక యాజకునిగా ఉన్నాడు, అతడు ఇలా చెప్పుచున్నాడు: “ఒక మంచి వ్యూహగ్రంథము ప్రతీ జట్టు సభ్యుని యొక్క ప్రతిభలు మరియు బలములను ఉపయోగించు ఒక ప్రణాళికను కలిగియున్నది. … యేసు క్రీస్తు యొక్క సువార్త బోధనలను నేను అధ్యయనము చేసి మరియు అభ్యసించినప్పుడు, యాజకత్వములో సేవ చేయుటకు నా బలములు ఎలా ఉపయోగించాలో నేను తెలుసుకోగలను.”

    చిత్రం
    ఒక మిషనరీగా డానియేల్ సోరెన్సన్
  • జెరెమి గుథ్రీ, ఇప్పుడు ప్రస్తుతము మిషను అధ్యక్షునిగా సేవచేయుచు, ఇలా పంచుకొన్నారు “12 సంవత్సరాల వయస్సుగల పరిచారకునిగా … ‘ఈ జీవితము … దేవుని కలుసుకొనుటకు సిద్ధపడే సమయము‘2 [అని] ఆత్మ నాతో సాక్ష్యము చెప్పినట్లు [నేను భావించాను]. ఆట ప్రణాళిక ఏమిటంటే క్రియ చేయునట్లు దేవునియందు విశ్వాసముంచుట [మరియు] రక్షకుని ద్వారా పశ్చాత్తాపపడుట. … వ్యూహగ్రంథము పరిశుద్ధ లేఖనాలలోను, సజీవులైన ప్రవక్తల ద్వారా కనుగొనబడును.”

    చిత్రం
    మిషను అధ్యక్షునిగా జెరెమి గుథ్రీ
  • జబారి పార్కర్ ఎల్డర్ స్థానానికి తన నియామకమందు ఉన్నప్పుడు ఇలా చెప్పుచున్నాడు: “నేను చిన్నవానిగా ఉన్నప్పుడు బాప్తీస్మము పొందుటకు ఆ నిర్ణయమును నేను చేయకపోతే, నేను ఎలా మారియుండే వాడినో నేనూహించలేను. … ప్రతీరోజు నన్ను నడిపించుటకు నా జీవితంలో దేవునిని కలిగియున్నందుకు నేను చాలా కృతజ్ఞత కలిగియున్నాను.”

    చిత్రం
    యాజకత్వ నియామకము సమయంలో జబారి పార్కర్
  • ఇక్కడ ప్రస్తుతము శాఖాధ్యక్షునిగా పనిచేయుచున్న రికార్డో రోజాస్ ఇలా చెప్పారు: “[దేవుని] యాజకత్వము ద్వారా [మనము] ఆయన కార్యములో సహాయపడగలము.“ ‘సత్యమును కాపాడుటకు బలముగాను, మంచి ధైర్యము కలిగియుండుటకు‘3 మనము పిలువబడ్డాము. ఆటమైదానములోను మరియు యాజకత్వము కలిగిన వానిగాను సఫలమగుటకు ఇది ఆయనకు సహాయపడింది.

    చిత్రం
    శాఖాధ్యక్షునిగా రికార్డో రోజాస్
  • ఈ చిత్రములో టేసమ్ హిల్ ఒక మిషనరీగా చూస్తున్నాము, అతడు క్రీస్తు యొక్క సువార్త తన జీవితంలో ఒక వ్యూహగ్రంథముగా సహాయపడిందని భావిస్తున్నాడు. అతడు పంచుకున్నాడు, “(దేవుని యొక్క) ప్రణాళికయందు విశ్వసించుట మరియు దానిలో నా పాత్రను నెరవేర్చుటకు నా శాయశక్తులా చేయుట, నా ప్రయత్నములతో దేవుడు సంతోషిస్తున్నాడని తెలుసుకొనుట నా జీవితంలో అమితమైన శాంతి మరియు సంతోషముగల భావన నాకు ఇచ్చింది.”

    చిత్రం
    శాఖాధ్యక్షునిగా టేసమ్ హిల్
  • ఈ చిత్రములో విలియమ్ హొపొయేట్, నాలుగు తరములలో భాగముగా తన కుమారుని యొక్క దీవెన వద్ద చూస్తున్నాము, సువార్త అతడికి “ప్రత్యర్ధి యొక్క వ్యూహాలను గుర్తించుటకు మరియు అగ్నిబాణములను ఎదిరించుటకు, ఇతరులకు ఉత్తమంగా సేవ చేయుటకు ఆత్మీయ సామర్ధ్యమును ఇచ్చునని,” చెప్పుచున్నాడు.

    చిత్రం
    శిశువు దీవెన సమయంలో విలియమ్ హొపొయేట్

మీ విషయమేమిటి? దేవుని యొక్క కుమారునిగా, ఆయన పరిశుద్ధ యాజకత్వముగల వానిగా, మీ ఉన్నతమైన మరియు పరిశుద్ధమైన గుర్తింపును మీరు గుర్తిస్తున్నారా? మనస్సులో ఈ నిత్య గమ్యమును ఉంచి , శోధన మరియు దుర్దశ కాలములందు మిమ్మల్ని నడిపించే యాజకత్వ వ్యూహ ప్రణాళికను మరియు మీ క్రీడా ప్రణాళికను ఏర్పరుచుము. ఆవేశంగా ఉండుట మరియు పరిరక్షించే వ్యూహములు రెండిటిని ఆలోచించుము.

ఆవేశంగా ఉండు వ్యూహములు సాక్ష్యములు బలపరచుటకు మరియు తిన్నని ఇరుకైన మార్గములో నిలిచియుండుటకు తీర్మానమును హెచ్చిస్తాయి క్రమమైన ప్రార్థన, లేఖన అధ్యయనము, సంఘానికి మరియు దేవాలయమునకు హాజరగుట, దశమ భాగము చెల్లించుట, మరియు యౌవనుల బలము కొరకు లో కనుగొనబడిన సలహాను అనుసరించుటను మాదిరులు కలిపియున్నవి.

పరిరక్షించు వ్యూహములు మీరు శోధనను ఎలా ఎదుర్కొంటారో ముందుగా ప్రణాళిక చేయుటను కలిపియున్నది. మీ వ్యక్తిగత ప్రమాణములతో రాజీపడుటకు శోధించబడినప్పుడు, మీరేమి చేయాలో ముందుగా మీకు తెలుసు.

దాని కొరకు మీకు ఒక వ్యూహగ్రంథము అవసరము.

ఈరోజు మీకు ప్రార్థన చేయాలని అనిపించకపోతే ఏమిటి? మీరు ఇదివరకే ప్రణాళిక చేసిన వ్యూహమును అమలు పరచుటకు సమయము.

మీ సాక్ష్యము బలహీనమవుతున్నట్లు మీరు భావిస్తున్నారా? దాని కొరకు మీకు ఒక వ్యూహమున్నది. ఏమీ చేయాలో మీకు తెలుసు.

దేవుని దృష్టిలో మనమందరం అత్యుత్తమ ప్రదర్శకులము

మీరు దేవుని యొక్క పరిశుద్ధ యాజకత్వమును వహించువారు. ఇనుప దండమును స్థిరముగా పట్టుకొనుటకు మీ నిబద్ధత మీరు ఏమి అవ్వాలని సృష్టించబడ్డారో ఆ నిత్య ప్రాణిగా మిమ్మల్ని మార్చును.

దేవుడు మిమ్ములను యెరిగియుండి, ప్రేమిస్తున్నారు. ఆయన మిమ్మల్ని దీవించును మరియు మీ అడుగులను నడిపించును.

మీరు ప్రత్యేకమైన వారు కాదని, మీరు అత్యుత్తమ నిర్వాహకులుగా ఉండుటకు సరిపోరని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. కానీ అది సత్యము కాదు. “లోకము యొక్క బలహీనమైన సంగతులు బయటకు వచ్చి, మరియు శక్తివంతమైన మరియు బలమైన వాటిని పగులగొట్టును”4 అని దేవుడు ప్రకటించుట మీకు తెలియదా?

కనుక, మీరు బలహీనముగా భావిస్తున్నారా? శుభాకాంక్షలు, మీరు కేవలము ఒక క్రీడలో పాల్గొనే క్రీడాకారుల జాబితాలో చేరారు!

మీరు ముఖ్యమైనవారు కాదని, అల్పమైనవారని భావిస్తున్నారా? దేవునికి అవసరమైనది మరియు ఉపయోగకరమైనది మీరే కావచ్చు.

చిత్రం
దావీదు మరియు గొల్యాతు

భయపెడుతున్న విరోధి, గొల్యాతుకు వ్యతిరేకంగా యుద్ధభూమిలోనికి అడుగుపెట్టిన దావీదు కంటే గొప్ప మాదిరి ఏమున్నది? ప్రభువుపై ఆధారపడి, ఒక క్రీడా ప్రణాళిక వ్యూహగ్రంథముపై ఆధారపడి, దావీదు తనను తానే కాదు, కానీ ఇశ్రాయేలు సైన్యమును రక్షించాడు!5 ప్రభువు వైపు ఉండుటకు మీ ధైర్యమును కూడగట్టుకున్నప్పుడు, దేవుడు మీతో ఉంటారని తెలుసుకొనుము. “దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధియెవడు?”6

ఆయన ద్వారములు తెరవగలడు మరియు మనకున్నాయని మనము ఎప్పటికీ ఎరుగని బలములు మరియు సామర్ధ్యములు కనుగొనుటకు మనకు సహాయపడగలడు.7

మీకు నమ్మకమైన శిక్షకులైన మీ తల్లిదండ్రులు, బిషప్పు, యువకుల నాయకులు చెప్పేది వినండి. వ్యూహగ్రంథమును నేర్చుకొనుము. లేఖనాలను చదువుము. ఆధునిక-దిన ప్రవక్తల మాటలను అధ్యయనము చేయుమ క్రీస్తు యొక్క శిష్యునిగా మిమ్మల్ని మీరు ఎలా రుజువు చేసుకొంటారో మీ స్వంత వ్యూహ పుస్తకమును ఏర్పరుచుము.

మీ ఆత్మను బలపరుచుటకు మరియు అపవాది యొక్క వలలను తప్పించుకొనుటకు మీరు ఉపయోగించు వ్యూహములు ముందుగా తెలుసుకొనుము.

దీనిని చేయుము మరియు దేవుడు మిమ్మల్ని ఉపయోగించును.

ఇప్పుడు, కొందరు సువార్త నుండి తమను తాము వేరు చేసుకొని మరియు దూరమవుతారు. కొందరు ఇతరులు చేస్తున్న దానిని గమనిస్తారు లేక చూడటానికి ఇష్టపడతారు కానీ పాల్గొనుటకు ఇష్టపడరు. శిక్షకుడు వారు పాల్గొనునట్లు చేయుటకు ప్రయత్నించినప్పటికినీ,తోటి జట్టు సభ్యునిగా మీరు కాపాడుటకు, సహాయపడుటకు మరియు వారిని ప్రేమించుటకు ఆహ్వానించినప్పటికి కొందరు పాల్గొనటానికి తిరస్కరిస్తారు.

మిగిలిన వారు పాల్గోవాలని కోరతారు---మరియు వారు పాల్గొంటారు. ముఖ్యమైనది ఏమనగా, వారెంత ప్రతిభ కలవారో ముఖ్యము కాదు కానీ పాల్గొనుటకు వారెంత సుముఖంగా ఉన్నారన్నది ముఖ్యమైనది. “దేవునికి సేవ చేయవలనను కోరిక మీరు కలిగియుంటే, మీరు పనికి పిలువబడతారు“I8 అనే లేఖనము వారికి తెలుసు కాబట్టి వారి సంఖ్య పిలవబడేవరకు వారు వేచియుండరు.

ప్రభువు అడిగినది చేయుటకు మీరు సిద్ధపడియుండవచ్చు.

మీ యాజకత్వ వ్యూహగ్రంథమును పఠించి, అమలుపరిచినప్పుడు మీరు దీనిని చేస్తారు.

మార్గము వెంబడి మీరు తొట్రిల్లవచ్చు మరియు . . . అనేకనేక సార్లు విఫలము కావచ్చు. మీరు పరిపూర్ణులు కాదు; విఫలమగుట అర్హులగు ప్రక్రియలో భాగము, అది మీ స్వభావమును శుద్ధి చేయుటకు అనుమతించును మరియు ఉత్తమమైన, ఎక్కువ కనికరముగల విధానములో సహాయపడును. రక్షకుడు మరియు ఆయన అనంత ప్రయశ్చిత్తము మన తప్పిదాలను మనఃపూర్వక పశ్చాత్తాపము ద్వారా జయించుటకు ఒక మార్గమును ఏర్పరచెను.

గొప్ప క్రీడాకారులు వారి క్రీడలో చిన్న ఆకృతిని పరిపూర్ణంగా చేయటానికి వందల గంటలను వెచ్చిస్తారు. యాజకత్వముగల వారిగా, మీరు అదే వైఖరిని కలిగియుండాలి. మీరు విఫలమైనట్లైతే, పశ్చాత్తాపపడి దానినుండి నేర్చుకొనండి.ొ వచ్చేసారి ఉత్తమముగా చేయుటకు సాధన చెయ్యండి. చివరికి, అది మీ యిష్టము. మీరు వ్యూహగ్రంథమును నేర్చుకుంటారా?

ప్రభువుయందు నమ్మకముంచమని నేను మిమ్మును అర్థిస్తున్నాను. దేవుని యొక్క సర్వాంగ కవచమును ధరించుము9 మరియు క్రీడలో పాల్గొనుము.

ఉన్నత స్థాయిలలో నైపుణ్యముగల క్రీడలను ఆడేవారు తక్కువమంది ఉంటారు, కానీ శిష్యత్వమునకు వచ్చినప్పుడు, క్రీస్తును అనుసరించుటకు ఎన్నుకొనువారు అనేకమంది ఉంటారు.

వాస్తవానికి, అది ప్రభువు యొక్క విధానములు నేర్చుకొనుటకు, శిష్యత్వము యొక్క మార్గమును ప్రవేశించుటకు, మరియు దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము జీవించుటకు ప్రయాసపడుట---ఈ జీవితములో మీ నియమితకార్యము. దేవుడు మిమ్మల్ని బలపరచును మరియు మీరు ఆయనవైపు తిరిగినప్పుడు మిమ్మల్ని దీవించును. మీరు దీనిని చెయ్యగలరు ఎందుకంటే ఆయన దృష్టిలో మీరు అత్యుత్తమ ప్రదర్శకులు.

మీరు కలిగియున్న పరిశుద్ధ యాజకత్వమునకు యోగ్యతగా జీవించుటకు మరియు ప్రతీరోజు మీ పరిశుద్ధ పాత్రను నిర్వహించుటకు ప్రయాసపడుటకు మీరు ఒడంబడిక చేస్తారని నేను ప్రార్థిస్తున్నాను. ఆవిధంగా చేయుటకు సామర్ధ్యము మరియు కోరికతో నేను మిమ్మల్ని దీవిస్తున్నాను. మీరు కలిగియున్న యాజకత్వ శక్తిని గూర్చి, ప్రవక్తలను గూర్చి, మరియు మన రక్షకుడు, విమోచకునిగా ఆయన పాత్రను గూర్చి నా సాక్ష్యమును చేర్చుచున్నాను. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.