2010–2019
సంఘ అధికారులను ఆమోదించుట
2019 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము.


సంఘ అధికారులను ఆమోదించుట

ఇప్పుడు సంఘము యొక్క ప్రధాన అధికారులు, ప్రాంతీయ డెబ్బదులు, మరియు ప్రధాన సహాయక అధ్యక్షత్వములను ఆమోదించు ఓటు కొరకు నేను సమర్పిస్తాను.

యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘము యొక్క ప్రవక్త, దీర్ఘదర్శి మరియు బయల్పాటుదారునిగా అధ్యక్షులు రస్సెల్ మారియన్ నెల్సన్, ప్రథమ అధ్యక్షత్వములో మొదటి సలహాదారునిగా డాల్లిన్ హెర్రిస్ ఓక్స్ మరియు ప్రథమ అధ్యక్షత్వములో రెండవ సలహాదారునిగా హెన్రీ బెన్నియన్ ఐరింగ్ ఆమోదించుటకు ప్రస్తావించబడింది.

సమ్మతిగల వారు దానిని ప్రత్యక్షపరచవచ్చు.

వ్యతిరేకించు వారెవరైనా, దానిని ప్రత్యక్షపరచవచ్చు.

పన్నెండుమంది అపొస్తులుల సమూహము యొక్క అధ్యక్షునిగా డాల్లిన్ హెచ్. ఓక్స్ మరియు పన్నెండుమంది అపొస్తులుల సమూహము యొక్క తాత్కాలిక అధ్యక్షునిగా ఎమ్. రస్సెల్ బల్లార్డ్ మనము ఆమోదించుటకు ప్రస్తావించడమైనది.

సమ్మతిగల వారు, దయచేసి దానిని సూచించుము.

వ్యతిరేకించు వారెవరైనా దానిని ప్రత్యక్షపరచుము.

ఈ క్రిందివారిని పన్నెండుమంది అపొస్తులుల సమూహము యొక్క సభ్యులుగా మనము ఆమోదించుటకు ప్రస్తావించబడింది: ఎమ్. రస్సెల్ బాల్లార్డ్, జెఫ్రీ ఆర్. హాలండ్, డీటర్ ఎఫ్. ఉక్‌డార్ఫ్, డేవిడ్ ఎ. బెడ్నార్, క్వింటిన్ ఎల్. కుక్, డి. టాడ్ క్రిస్టాఫర్సన్, నీల్ ఎల్. ఆండర్సన్, రోనాల్డ్ ఎ. రాస్బాండ్, గారీ ఈ. స్టీవెన్‌సన్, డేల్ జి. రెన్‌లండ్, గారిట్ డబ్ల్యు. గాంగ్, మరియు యులిసెస్ సోరెస్.

సమ్మతిగల వారు, దయచేసి దానిని ప్రత్యక్షపరచుము.

వ్యతిరేకించువారు, దయచేసి దానిని సూచించుము.

ప్రథమ అధ్యక్షత్వములోని సలహాదారులు మరియు పన్నెండుమంది అపొస్తులుల సమూహమును ప్రవక్తలు, దీర్ఘదర్శులు మరియు బయల్పాటుదారులుగా మనము ఆమోదించుటకు ప్రస్తావించబడింది.

సమ్మతిగల వారు, దానిని ప్రత్యక్షపరచవచ్చు.

వ్యతిరేకమేదైనా ఉన్న యెడల, అదే సూచన ద్వారా చూపుము.

ప్రాంతీయ డెబ్బదులుగా వారి సేవ నుండి క్రింది వారిని మేము విడుదల చేయుటకు ప్రస్తావించడమైనది: ఎల్డర్లు విక్టోరినా ఎ. బాబిడా, ఎల్. టాడ్ బడ్జ్, పీటర్ ఎమ్. జాన్సన్, జాన్ ఎ. మెక్యున్, మార్క్ ఎల్. పేస్, జేమ్స్ ఆర్. రాస్‌బాండ్, మరియు బెంజెమిన్ ఎమ్. జి. థాయ్.

ఈ సహోదరులకు వారి సమర్పించబడిన సేవ కొరకు ప్రశంసను తెలియజేయుటలో మాతో చేరాలని కోరే వారు, చేతిని పైకెత్తుట ద్వారా ఆవిధంగా చేయవచ్చు.

సండే స్కూల్ ప్రధాన అధ్యక్షత్వముగా సహోదరుడు టాడ్ ఆర్. కాల్లిస్టర్, డెవిన్ జి. డర్రెంట్, మరియు బ్రైయాన్ కే. ఆష్టాన్‌ గార్లను హృదయపూర్వకమైన కృతజ్ఞతతో మేము విడుదల చేయుటకు ప్రస్తావించబడింది.

వారి అసాధారణమైన సేవ కొరకు ఈ సహోదరులకు ప్రశంసను తెలుపుటలో మాతో చేరాలని కోరు వారందరు, దయచేసి దానిని ప్రత్యక్షపరచుము.

ప్రధాన అధికారి డెబ్బదులుగా క్రింది వారిని మనము ఆమోదించుటకు ప్రస్తావించడమైనది: రూబెన్ వి. ఆల్లియడ్, జార్జ్ ఎమ్. ఆల్వారాడో, హాన్స్ టి. బూమ్, ఎల్. టాడ్ బడ్జ్, రికార్డో పి. జిమింజ్, పీటర్ ఎమ్. జాన్సన్ జాన్ ఎ. మెక్యుని, జేమ్స్ ఆర్. రాస్బాండ్, బెంజమిన్ ఎమ్. జెడ్. థాయ్, మరియు ఆలెన్ ఆర్. వాకర్.

సమ్మతిగల వారందరు, దయచేసి దానిని ప్రత్యక్షపరచుము.

సమ్మతిగల వారు, దయచేసి దానిని సూచించుము.

క్రింది ప్రాంతీయ డెబ్బదులుగా క్రింది వారిని మనము ఆమోదించుటకు ప్రస్తావించడమైనది: సాల్మన్ ఐ. అల్చి, గుల్లెర్మొ ఎ. ఆలవ్వారెజ్, డెరన్ ఆర్. బార్నీ, జూలియస్ ఎఫ్. బర్రియంటోస్, జేమ్స్ హెచ్. బెక్కర్, కెవిన్ జి. బ్రౌన్, మార్క్ ఎస్. బ్రైస్, ఎ. మార్కొస్ కాబ్రాల్, డన్‌స్టన్ జి. బి. టి. చాదాంబుకా, ఆలన్ సి.కే. చ్యూయాంగ్, క్రిస్టియన్ సి. చిగ్బ్ందు, పాల్ ఎన్. క్లేటన్, కారిమ్ డెల్ వాల్లి, హిరొయుకి డొమాన్, మెర్నార్డ్ పి. డొనాటో, మార్క్ డి. ఎడ్డి, జెఖారి ఎఫ్. అవెన్స్, హెన్రీ జె. ఐరింగ్, సపెలి ఫాలాగొ జూ., డేవిడ్ ఎల్. ఫ్రెష్క్‌నెక్ట్, జాన్ జె. గాల్లిగొ, ఇఫ్రాన్ ఆర్. గార్షియా, రాబర్ట్ గార్డన్, మార్క్ ఎ. గాట్‌ఫ్రెడ్సన్, థామస్ హాన్నీ, మైఖేల్ జే. హెస్, గ్లెన్ ఎమ్. హాల్‌మ్స్, రిచర్డ్ ఎస్. హచిన్స్, టిటో ఇబానెజ్, అకినొరి ఇటో, జెరిమీ ఆర్. జాగ్గి, కెల్లీ ఆర్. జాన్సన్, క్రిస్టాఫర్ హైన్సు కిమ్, హెచ్. మొరొనై క్లైన్, ’ఇనాక్ ఎఫ్. కుపు, స్టీఫెన్ చీ కాంగ్ లాయ్, విక్టర్ డి. లాట్టారొ, టార్మొ లెప్పి, ఇట్జ్‌కోట్ల్ లొజానొ, కెవిన్ జె. లిథ్‌గో, ఎడ్గర్ పి. మోంటస్, ఎస్. ఈఫ్రమ్ మసాని, లూయీజ్ సి. డి. క్విరోజ్, ఇఫానొమిజానా రాసోలోన్‌డ్రైబ్, ఎడ్వార్డొ డి. రెసిక్, టోమాస్ జి. రొమాన్, రామన్ ఈ. సార్మింటో, జోనాతాన్ ఎస్. ష్మిట్, వాయ్ సికాహిమా, డెనిల్సన్ సిల్వా, లూయస్ స్పినా, కార్లోస్ జి. సఫ్‌రెట్, వోయ్ ఆర్. టావోలీ, సెర్గియో ఆర్గ్. వర్గాస్, మరియు మార్కస్ ఝార్సి

సమ్మతిగల వారందరు, దయచేసి దానిని ప్రత్యక్షపరచుము.

వ్యతిరేకించు వారెవరైనా.

సండే స్కూల్ ప్రధాన అధ్యక్షునిగా మార్క్ ఎల్. పేస్‌తో, మిల్టన్ డా రోచా కామార్గొ మొదటి సలహాదారునిగా మరియు జాన్ ఎరిక్ న్యూమాన్ రెండవ సలహాదారునిగా సేవ చేయుటకు మనము ఆమోదించుటకు ప్రస్తావించడమైనది.

సమ్మతిగల వారు దానిని ప్రత్యక్షపరచవచ్చు.

వ్యతిరేకించు వారేవరైనా దానిని సూచించుము.

మిగిలిన ప్రధాన అధికారులు, ప్రాంతీయ డెబ్బదులు, మరియు ప్రస్తుతము నియమించబడినట్లుగా ప్రధాన సహాయక అధ్యక్షత్వములను మనము ఆమోదించుటకు ప్రస్తావించబడింది.

సమ్మతిగల వారందరు, దయచేసి దానిని ప్రత్యక్షపరచుము.

వ్యతిరేకించు వారెవరైనా.

అధ్యక్షులు నెల్సన్, ఓటింగ్ గుర్తించబడింది. ప్రస్తావనలలో దేనినైనా వ్యతిరేకించు వారు తమ స్టేకు అధ్యక్షులను సంప్రదించాలని మేము ఆహ్వానిస్తున్నాము.

సహోదర, సహోదరిలారా, సంఘ నాయకుల తరఫున మీ నిరంతర విశ్వాసము మరియు ప్రార్థనల కొరకు మీకు మా కృతజ్ఞతలు.

క్రొత్త ప్రధాన అధికార డెబ్బదులు మరియు క్రొత్త సండే స్కూల్ అధ్యక్షత్వము వేదికపై వారి కుర్చీలను తీసుకోమని మేము ఇప్పుడు ఆహ్వానిస్తున్నాము.