2010–2019
ఇది దేనికి దారితీస్తుంది?
2019 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము.


ఇది దేనికి దారితీస్తుంది?

మనకు గల ప్రత్యమ్నాయాలను చూసి, అవి దేనికి దారితీస్తాయో అని లోతుగా ఆలోచిస్తే, మనం ఉత్తమమైన ఎంపికలు చేసుకుంటాము మరియు నిర్ణయాలు తీసుకొంటాము.

పునఃస్థాపించబడిన యేసు క్రీస్తు సువార్త భవిష్యత్తు గురించి ఆలోచించుటకు మనల్ని ప్రోత్సహిస్తాయి. అది మర్త్య జీవితము యొక్క ఉద్దేశము మరియు అనుసరించవలసిన జీవితము యొక్క వాస్తవమును మనకు వివరించును. నేడు మన చర్యలకు దారి చూపించుట కొరకు భవిష్యత్తు గురించి గొప్ప ఉపాయాలను అది మనకు బోధిస్తుంది.

దానికి వ్యత్యాసముగా, కేవలం వర్తమానము గురించి మాత్రమే చింతించు వ్యక్తులు మనందరికి తెలుసు: ఈ రోజే ఖర్చు పెడదాం, నేడే అనుభవిద్దాం మరియు భవిష్యత్తు గురించి ఏ ఆలోచన వద్దు.

మనం ఎల్లప్పుడు భవిష్యత్తు గురించి అప్రమత్తముగా ఉంటే, మన వర్తమానము, భవిష్యత్తు సంతోషకరముగాా ఉంటాయి. మనం ప్రస్తుత నిర్ణయాలు తీసుకున్నప్పుడు, మనం ఎల్లప్పుడు “ఇది దేనికి దారి తీస్తుంది?“ అని ప్రశ్నించుకోవాలి.

I.

కొన్ని నిర్ణయాలు- ఏదో ఒకటి చెయ్యడం లేదా ఏమీ చెయ్యకుండా ఉండటం ఈ రెండిటి మధ్య చేసే ఎంపికలు. ఇటువంటి ఎంపిక గురించి ఒక ఉదాహరణను అనేక సంవత్సరాల క్రితం సంయుక్త రాష్ట్రాలలో ఒక స్టేకు సమావేశములో నేను విన్నాను.

ఆ సన్నివేశము అందమైన ఒక కళాశాల ఆవరణము. ఒక యౌవన విద్యార్థుల సమూహము గడ్డిపై కూర్చుండెను. ఈ అనుభవమును వివరించిన ప్రసంగీకుడు ఒక అందమైన చెట్లపై ఉండే ఉడుత పెద్ద కుచ్చుగల తోకతో ఒక అందమైన గట్టికలప చెట్టు మొదలులో ఆడుకోవడం వారు చూస్తున్నారని చెప్పాడు. కొన్నిసార్లు అది నేలపైకి దిగుతుంది, కొన్నిసార్లు చెట్టు మ్రాను పైన, క్రింద, చూట్టూ తిరుగుతూ ఉంటుంది. కాని ఆ పరిచయమున్న దృశ్యము ఎందుకు విద్యార్ధుల సమూహమును ఆకర్షించింది?

దానికి సమీపములో ఐరిష్ కుక్క ఒకటి గడ్డిపైన కూర్చొని ఉన్నది. విద్యార్థుల ఆశక్తికి అది లక్ష్యము కాగా, దానికి ఉడుత లక్ష్యముగా ఉండెను. చెట్టు చుట్టూ వలయలలో తిరుగుతున్న ఉడుత ఒక్క క్షణం కనిపించకపోతే, ఆ కుక్క కొన్ని అంగుళాలు ముందుకు ప్రాకి, యదాతదంగా తన చుట్టూ ఉన్న పరిసరాలపైన ఆసక్తి లేనట్లు తన సాధారణ భంగిమలో కూర్చొని ఉండేది. ఇదే విద్యార్థుల దృష్టిని ఆకట్టుకొన్నది. నిశ్శబ్ధంగా, కదలకుండా, వారి కళ్ళు రెప్ప వాల్చకుండా ఆ సంఘటనను చూస్తూ ఉన్నాయి, దాని ఫలితము మరింత తేటగా తెలుస్తుంది.

చివరకు, ఆ కుక్క ఆ ఉడుత పైకి దూకి, దాని పట్టుకొని, తన నోటిలో వేసుకొనెంత దగ్గరకు వచ్చింది. విద్యార్థులందరు విభ్రాంతితో ఉలికిపడి, ముందుకు వెళ్ళి, ఆ చిన్న జంతువును ఆ కుక్క నోటినుండి తీసివేసారు, కాని అప్పటికే ఆలస్యం అయ్యింది. ఆ ఉడుత మరణించింది.

ఆ సమూహములో ఏ ఒక్కరైనా ఏదో ఒక సమయంలో తమ చేతులు ఊపి లేదా గట్టిగా అరచి ఆ ఉడుతను హెచ్చరించి ఉండవచ్చు, కాని ఎవ్వరూ అలా చెయ్యలేదు. ఆ అనివార్యమైన పరిణామము అంతకంతకు దగ్గరయ్యే వరకు వారు కేవలం చూస్తూ ఉన్నారు. “ఇది దేనికి దారితీస్తుంది?“ అని ఏ ఒక్కరు అడగలేదు. ఊహించింది జరిగినప్పుడు దాని పరిణామాన్ని నివారించడానికి అందరు పరుగెత్తారు కాని అప్పటికే ఆలస్యం అయ్యింది. కన్నీటి పరితాపాన్ని మాత్రమ వారు ఇవ్వగలిగారు.

ఆ నిజమైన కథ ఒక విధంగా ఉపమానము వంటిది. మన జీవితాలలో, మన చుట్టూ ఉన్నవారి జీవితాలలో మరియు పరిస్థితులలో మనం చూసే విషయాలకు ఇది అన్వయించబడుతుంది. మనం ప్రేమించే వ్యక్తులు లేదా వస్తువులను ప్రభావితము చేయు బెదిరింపులు సమీపించుటను చూచినప్పుడు మాట్లాడుటకు లేదా చర్యచూపించుటకు లేదా నిశ్శబ్ధంగా ఉండిపోవుటకు మనకు ఎంపిక కలదు. “ఇది దేనికి దారితీస్తుంది?“ అని మనం ప్రశ్నించుకొనుట మంచిది. పరిణామాలు తీవ్రముగా, వెంటనే కలుగు సందర్భాలలో మనం ఏమి చెయ్యకుండా ఉండలేము. ఇంకా సమయము ఉన్నప్పుడే, మనం సరియై హెచ్చరికలు చెయ్యాలి లేదా సరియైన నివారణ ప్రయత్నాలు చెయ్యాలి.

నేను ఇప్పుడే వివరించిన నిర్ణయాలు తీసుకోవడానిక ఏదైనా చర్యతీసుకోవడం లేదా ఏ చర్య తీసుకోకుండా ఉండటం పైన ఆదారపడి ఉంటాయి. మరింత సర్వసాధారణమైన ఎంపికలు ఏవంటే ఒక చర్య లేదా మరొక చర్యకు మధ్య చేసేవి. వీటిలో మంచి లేదా చెడుకు చేయు ఎంపికలు కాని మరింత తరచుగా రెండు మంచి వాటి మధ్య చేయు ఎంపికలు. ఇది దేనికి దారితీస్తుంది అని అడుగుట కూడా ఇక్కడ కోరతగినది. రెండు మంచి వాటిమధ్య మనం అనేక ఎంపికలు చేస్తాము, వాటిలో తరచు మన సమయాన్ని ఏవిధంగా గడుపుతామో అనేది ఉంటుంది. వీడియో గేమ్ ఆడటం, అక్షరసందేశాలు పంపడం లేదా టీవీ చూడటం లేదా సెల్‌ఫోన్‌లో మాట్లాడటం వాటిలో చెడు ఏమీ లేదు. కాని “అవకాశ ధర“ అని మనం పిలిచేది వీటిలో ప్రతి ఒక్కదానికి ఉంటుంది, దాని అర్థం ఒక దానిని చెయ్యడానికి మనం సమయం కేటాయిస్తే, ఇంకొకటి చెయ్యడానికి మనం సమయం కోల్పోతాము. ఒక పని-దానికది పరిపూర్ణముగా మంచిదే అయినప్పటికి, దానిని చేయుటకు దానిపై మనం వెచ్చించు సమయము వలన మనం ఏమి కోల్పోతున్నామో దానిని మనం ఆలోచనా పూర్వకముగా పోల్చవలసిన అవసరం ఉన్నదిని మీరు చూడగలరని నేను నిశ్చయముగా చెప్పగలను.

“మంచిది, ఉత్తమమైనది, లేదా అత్యుత్తమమైనది“ అనే శీర్షికతో కొంత కాలం క్రితం నేను సందేశాన్ని ఇచ్చాను. ఆ సందేశములో ఒక విషయం కేేవలం మంచిది అనే కారణం దానిని చేయుటకు సరిపోదు. మనం చేయగలిగే మంచి పనుల సంఖ్య వాటిని చేయుటకు లభ్యమగు సమయము కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. కొన్నిసంగతులు మంచికంటే ఉత్తమమైనవి, మరియు ఈ సంగతులకు మన జీవితాలలో ఎక్కువ ప్రాధాన్యతను, ఎక్కువ సమయాన్ని వెచ్చించాలి . . . ఉత్తమమైనవి లేదా అత్యుత్తమమైనవాటిని ఎంపిక చెయ్యాలంటే మనం కొన్ని మంచి విషయాలను వదిలివెయ్యాలి.“ 1

దీర్ఘకాల దృష్టికోణముతో చూచుట ప్రస్తతము మనం తీసుకొను నిర్ణయాల యొక్క ప్రభావము మన భవిష్యత్తుపై ఏవిధంగా ఉంటుంది? చదువుకొనుట, సువార్తను పఠించుట, సంస్కారములో పాలుపంచుకొనుట ద్వారా, దేవాలయానికి హాజరగుట ద్వారా మన నిబంధనలను నూతన పరచుకొనుట అనే వాటి యొక్క ప్రాముఖ్యతను జ్ఞాపకముంచుకోండి.

II.

మనల్ని మనం ఏమని ముద్రవేస్తామో లేదా మనగురించి మనం ఏమి ఆలోచిస్తామో దానిని ఎంచుకొనుటకు “ఇది దేనికి దారితీస్తుంది?“ అనేది ముఖ్యము. అత్యంత ప్రాముఖ్యమైనది, మనలో ప్రతి ఒక్కరు నిత్య జీవము యొక్క గమ్యమునకు చేరుకోగల సామర్థ్యము కలిగిన దేవుని బిడ్డ. మన వృత్తి, జాతి, భౌతిక లక్షణాలు, లేదా ఘనతలతో కలిపి మరే ఇతర ముద్రయైనా నిత్య పరిభాషలో తాత్కాలికమైనది లేదా సాధారణమైనది. మీరు ప్రయత్నించే ఒక లక్ష్యమునకు పరిమితులు నియమించే పదాలతో మిమ్మును మీరు ముద్రవేసుకోవడం లేదా మీగురించి మీరు ఆలోచించడానిని ఎంచుకోవద్దు.

నా ప్రియమైన సహోదరులారా మరియు నేను ఇక్కడ చెప్పే విషయాలను పునర్విమర్శించి లేదాా చదివే సహోదరీలారా, మేము ఇచ్చే బోధనలు, ఉపదేశములు మీ నాయకులు ఎందుకు ఇస్తారో మీకు తెలుసని నేను ఆశిస్తున్నాను. మేము మిమ్ములను ప్రేమిస్తున్నాము మరియు మన పరలోక తండ్రి, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు మిమ్ములను ప్రేమిస్తున్నారు. మన కొరకు వారి ప్రణాళిక “గొప్ప సంతోషకర ప్రణాళిక“(ఆల్మా 42:8) ఆ ప్రణాళిక, వారి ఆజ్ఞలు, విధులు, నిబంధనలు ఈ లోకములోను, రాబోవు లోకములోను మిక్కిలి గొప్పదైన సంతోషమునకు మనల్ని నడిపించును. తండ్రి మరియు కుమారుని యొక్క సేవకులైన మేము, వారు పరిశుద్ధాత్మచేత మమ్ములను నడిపించగా మీకు బోధించి, ఉపదేశమిస్తాము. ఏది సత్యమో దానిని మాట్లాడి, “దేవుని యొక్క వరాలలో కెల్లా గొప్పవరమైన“(సిద్ధాంతము మరియు నిబంధనలు 14:7) నిత్యజీవమునకు మార్గముగా వారు పెర్కొన్న దానిని చేయుటకు మిమ్ములను ప్రోత్సహించుట తప్ప మాకు వేరే కోరిక లేదు.

III.

ప్రస్తుతము మనము తీసుకొను నిర్ణయాలు భవిష్యత్తుపైన ఏవిధమైన ప్రభావాన్ని చూపిస్తాయో ఇక్కడ మరొక ఉదాహరణ ఇస్తున్నాను. ఒక భవిష్యత్తు లక్ష్యమును సాధించుటకు ప్రస్తుతము త్యాగము చేయుటకు చేయు ఎంపిక చింతను కలిగిస్తుంది.

కాలి, కొలంబియాలోని ఒక స్టేకు సమావేశములో, ఒక సహోదరి తాను, తాను చేసుకోబోయే భర్త ఏవిధంగా దేవాలయములో వివాహము చేసుకోవాలని కోరికి గలిగి యున్నారో మరియు వారికి సమీపములో ఉన్న దేవాలయము చాలా దూరములో పెరులో ఉన్నదని చెప్పింది. చాలా కాలం బస్సు చార్జీల కోసం వారు డబ్బులు కూడబెట్టారు. చివరకు వారు బగోట వెళ్ళే బస్సు ఎక్కారు కాని వారు అక్కడకు చేరుకొన్నప్పుడు, లిమా, పెరుకు వెళ్ళే బస్సులో సీట్లన్ని భర్తీచెయ్యబడినవని వారు తెలుసుకొన్నారు. వారు వివాహము చేసుకోకుండా తిరిగి ఇంటికి వెళ్ళవచ్చు లేదా దేవాలయములో కాకుండా వేరేచోట వివాహము చేసుకోవచ్చు. అదృష్టవశాత్తు వారికి ఇంకొక మార్గము ఉండెను. లిమాకు వెళ్ళె బస్సులో ఐదు పగళ్ళు, ఐదు రాత్రుళ్ళు పూర్తి ప్రయాణములో బస్సు యొక్క నేలపైన కూర్చొనుటకు సమ్మతిస్తే ఆ బస్సులో వారు ప్రయాణము చెయ్యవచ్చును. దానిని చెయ్యడానికి వారు ఎంచుకొన్నారు. కొంతమంది ప్రయాణికులు కొన్నిసార్లు నేలపైన ఒళ్ళు విరుచుకునే సమయంలో వారి సీట్లలో తమను కూర్చోనిచ్చినప్పటికి అది కష్టముగా ఉండెనని ఆమె చెప్పెను.

ఆ ప్రసంగములో నాకు ఏమి నచ్చిందంటే, ఈ విధంగా ఆమె మరియు ఆమె భర్త దేవాలయానికి వెళ్ళినందుకు ఆమె కృతజ్ఞతలు తెలిపింది ఎందుకంటే వారు సువార్త గురించి ఏమి భావించారో, దేవాలయములో వివాహము గురించి ఏమి భావించారో దానిని అది మార్చివేసింది. త్యాగము వలన కలుగు అభివృద్ధితో ప్రభువు వారికి ప్రతిఫలమిచ్చెను. త్యాగము లేకుండా దేవాలయానికి అనేక పరామర్శల కంటే, వారి ఐదు రోజుల దేవాలయ ప్రయాణము వారి ఆత్మీయతను నిర్మించుటకు చాలా విషయాలను సాధించింది అని కూడా ఆమె గమనించింది.

ఆ సాక్ష్యము విన్న తరువాత సంవత్సరాలలో, దేవాలయములో వివాహము చేసుకొనుటకు అవసరమైన త్యాగమును చేయకుండా - మరొక ఎంపిక చేసుకొని ఉంటే ఆ యౌవన జంట యొక్క జీవితము ఎంత వ్యత్యాసముతో ఉండేదోనని నేను ఆలోచించాను.

జీవితములో మనం లెక్కలేని ఎంపికలు చేసుకొంటాము, కొన్ని పెద్దవి, కొన్ని చిన్నవిగా కనిపించేవి. వెనుకకు తిరిగి చూస్తే, మన ఎంపికలలో కొన్ని మన జీవితములో ఎంత మార్పును తీసుకొని వచ్చెనో మనం చూడగలము. మనకు గల ప్రత్యమ్నాయాలను చూసి, అవి దేనికి దారితీస్తాయో అని లోతుగా ఆలోచిస్తే, మనం ఉత్తమమైన ఎంపికలు/నిర్ణయాలు తీసుకొంటాము. ఆవిధంగా మనం చేసినట్లైతే, ముగింపును మదిలో పెట్టుకొని మొదలు పెట్టండి అనే అధ్యక్షులు రస్సల్ ఎమ్. నెల్సన్ గారి ఉపదేశమును మనం అనసరించగలుగుతాము.2 మనకైతే, ముగింపు ఎల్లప్పుడు దేవుని వరములలో గొప్ప వరమైన నిత్యజీవమునకు దేవాలయము ద్వారా నిబంధన మార్గములో ఉన్నది.

యేసు క్రీస్తు గురించి మరియు ఆయన ప్రాయశ్చిత్తము యొక్క ప్రభావాల గురించి మరియు ఆయన యొక్క నిత్య సువార్త యొక్క ఇతర సత్యముల గూర్చి సాక్ష్యమిస్తున్నాను, యేసు క్రీస్తు నామములో, ఆమేన్.

వివరణలు

  1. డాలిన్ హెచ్. ఓక్స్, “Good, Better, Best,” Liahona, నవం. 2007, 104, 107.

  2. రస్సల్ ఎమ్. నెల్సన్, “As We Go Forward Together,” Liahona, ఏప్రిల్. 2018, 7 చూడండి.