2010–2019
బలపరచు విశ్వాసము యొక్క శక్తి
2019 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము.


బలపరచు విశ్వాసము యొక్క శక్తి

బలపరచుటకు మీ చేతిని ఎత్తుట ద్వారా దేవుని సేవకులైన వీరందరిని బలపరుస్తామని మీరు దేవునితో ఒక వాగ్దానము చేస్తున్నారు.

యాజకత్వ నాయకులు వారు సేవ చేస్తున్నవారు కలిగియున్న బలపరచు విశ్వాసము కొరకు కృతజ్ఞత తెలపడం నేను చాలా సార్లు విన్నాను. వారి స్వరములలోని భావోద్వేగములను బట్టి, వారి కృతజ్ఞత లోతైనదని, నిజమని మీకు తెలుస్తుంది. తన సంఘములో తన సేవకులను బలపరుస్తున్నందుకు ప్రభువు యొక్క అభినందనను మీకు తెలియజేయుటయే నేడు నా ఉద్దేశము. మీ విశ్వాసముతో ఇతరులను బలపరచుటకు ఆ శక్తిని సాధనచేసి, దానిలో ఎదగాలని మిమ్మును ప్రోత్సహించుట కూడా నా ఉద్దేశము.

మీరు జన్మించకముందు అటువంటి శక్తిని మీరు ప్రదర్శించారు. మర్త్యత్వమునకు ముందు ఆత్మల ప్రపంచము గురించి మనకేమి తెలియునో గతంవైపు ఆలోచించండి. మన పరలోక తండ్రి తన పిల్లలకు ఒక ప్రణాళిక సమర్పించారు. మనం అక్కడ ఉన్నాము. మన ఆత్మ సహోదరుడైన లూసీఫర్, మనం ఎంపికచేసుకొనుటకు స్వేచ్ఛనిచ్చు ఆ ప్రణాళికను వ్యతిరేకించాడు. పరలోక తండ్రి యొక్క ప్రియమైన కుమారుడైన యెహోవా, ఆ ప్రణాళికను బలపరచెను. లూసీఫర్ తిరుగుబాటు చేసెను. యెహోవా యొక్క బలపరచు స్వరము ప్రభలెను మరియు మన రక్షకుడగుటకు ఆయన స్వచ్ఛందముగా ముందుకు వచ్చెను.

ఇప్పుడు మీరు మర్త్యత్వములో ఉన్నారు అనే వాస్తవము తండ్రిని, రక్షకుని మీరు బలపరిచారని మనకు అభయమిస్తుంది. మర్త్యత్వములో మీరు ఎదుర్కొను సవాళ్ళ గురించి మీకు అతి తక్కువ తెలిసినప్పటికి సంతోషకర ప్రణాళికను, దానిలో యేసు క్రీస్తు యొక్క స్థానమును బలపరచుటకు మీకు యేసు క్రీస్తునందు విశ్వాసము అవసరమయ్యెను.

ఈ జీవితములో కూడా దేవుని యొక్క సేవకులను బలపరచు మీ విశ్వాసము మీ సంతోషమునకు కేంద్రముగా ఉన్నది. మోర్మన్ గ్రంధము దేవుని వాక్యమా అని తెలుసుకొనుటకు ప్రార్థించమని మీకు ఇవ్వబడిన సుర్తపరిచారకుని సవాలును మీరు అంగీకరించినప్పుడు, ప్రభువు యొక్క ఆ సేవకుని బలపరచుటకు మీకు విశ్వాసముండెను. బాప్తీస్మము పొందమని మీకు ఇవ్వబడిన ఆహ్వానమును మీరు అంగీకరించినప్పుడు, దేవుని యొక్క వినయము గల సేవకుని మీరు బలపరిచారు.

మీ తలపై చేతులుంచి ”పరిశుద్ధాత్మను పొందుము” అని చెప్పుటకు ఒకరిని మీరు అనుమతించినప్పుడు, మెల్కీసెదెకు యాజకత్వము కలిగిన వానిగా అతడిని మీరు బలపరిచారు.

ఆ దినము నుండి కూడా, నమ్మకముగా సేవచేయుట ద్వారా మీకు యాజకత్వమును అనుగ్రహించిన ప్రతి వ్యక్తిని, మీకు ఆ యాజకత్వములో ఒక స్థానమునకు నియమించిన ప్రతివారిని మీరు బలపరిచారు.

ఆరంభములో మీ యాజకత్వ అనుభవము ఏమిటంటే మీరు బలపరచిన ప్రతిసారి ఒక దేవుని సేవకునిపైన నమ్మకముంచిన సాధారణమైన సందర్భము. ఇప్పుడు, మీలో చాలామంది పై స్థానానికి వెళ్ళారు, అక్కడ బలపరుచుటకు ఇంకా ఎక్కువ అవసరము.

ప్రభువు పిలిచిన వారందరిని-వారిని ప్రభువు దేనికి పిలిచినప్పటికి- వారిని బలపరచాలా వద్దా అని మీరు ఎంపికచేస్తారు. ప్రపంచమంతటా జరుగు సమావేశాలలో ఆ ఎంపిక సంభవిస్తుంది. ఈ సమావేశములో కూడా అది జరిగింది. అటువంటి కూడికలలో దేవుని సేవకులైన స్త్రీ పురుషుల పేర్లు చదవబడతాయి మరియు బలపరచుటకు మీ చేతినెత్తమని మీరు ఆహ్వానించబడతారు. సహకార ఓటును మీరు నిలువరించవచ్చును లేదా మీ బలపరచు విశ్వాసమును ప్రతిజ్ఞ చేయవచ్చును. బలపరచుటకు చేతిని ఎత్తుట ద్వారా మీరు ఒక వాగ్దానమును చేస్తున్నారు. దేవుని సేవకులైన వీరందరిని బలపరుస్తామని మీరు దేవునితో ఒక వాగ్దానము చేస్తున్నారు.

మీవలె వీరు కూడా అసంపూర్ణమైన మనుష్యులు. మీ వాగ్దానాలు నిలబెట్టుకొనుటకు ప్రభువు వారిని పిలిచారనే స్థిరమైన విశ్వాసము అవసరము. ఆ వాగ్దానాలు నిలబెట్టుకొనుట వలన మీకు నిత్య సంతోషము కలుగును. వాటిని నిలబెట్టుకోకపోవడం వలన మీకును, మీరు ప్రేమించేవారికి దుఃఖాన్ని కలిగిస్తుంది - మీ ఊహాశక్తికి అతీతంగా నష్టము కూడా కలుగుతుంది.

మీ బిషప్పును, స్టేకు అధ్యక్షుడ్ని, సంఘ ప్రధాన అధికారాలను, ప్రధాన అధికారులను మీరు బలపరుస్తున్నారా అని మీరు అడుగబడి ఉండవచ్చును లేదా భవిష్యత్తులో మీరు అడుగబడతారు. ఒక సమావేశములో అధికారులను, నాయకులను బలపరచమని మీరు అడుగబడినప్పుడు అది జరుగవచ్చును. కొన్నిసార్లు బిషప్పు లేదా స్టేకు అధ్యక్షునితో మౌఖికపరీక్షలో అది జరుగవచ్చును.

నా ఉపదేశము ఏమంటే ముందుగానే మీరు జాగ్రత్తగా, ప్రార్థనాపూర్వకముగా ఆ ప్రశ్నలను మీకు మీరే ప్రశ్నించుకోండి. ఆవిధంగా చేసినప్పుడు, ఇటీవల మీ ఆలోచనలు, మాటలు, క్రియలను మీరు జ్ఞాకపము చేసుకోవచ్చును. ఏదో ఒక రోజు ఆయన మౌఖిక పరీక్ష చేయునని యెరిగియుండి, ఆయన మిమ్ములను మౌఖిక పరీక్ష చేసినప్పుడు మీరు ఏ సమాధానాలు ఇస్తారో వాటిని గుర్తుచేసుకొని, రూపించండి. ఈ విధమైన ప్రశ్నలను మీకు మీరు ప్రశ్నించుకోవడం ద్వారా మీరు సిద్ధపడగలరు.

  1. నేను బలపరుస్తానని ప్రతిజ్ఞ చేసిన వారిలో మనుష్య బలహీనత గురించి నేను ఆలోచించానా లేదా దాని గురించి మాట్లాడానా?

  2. ప్రభువు వారిని నడిపిస్తున్నారు అనే సాక్ష్యము కొరకు నేను వెతికియున్నానా?

  3. నేను నా మనస్సాక్షిగా, సద్భక్తిగా వారి నాయకత్వమును అనుసరించానా?

  4. వారు దేవుని సేవకులని నేను చూడగలిగిన సాక్ష్యము గురించి నేను మాట్లాడానా?

  5. వారిలో ప్రతి ఒక్కరి కొరకు పేరు పేరునా క్రమము తప్పకుండా ప్రేమ భావాలతో నేను ప్రార్థిస్తున్నానా ?

ఆ ప్రశ్నలు మనలో చాలామందిని కొంత అసౌకర్యానికి గురిచేసి, పశ్చాత్తాపము చెందవలసిన అవసరతకు దారితీస్తుంది. అవినీతిగా ఎవరికి తీర్పు తీర్చవద్దని దేవునిచేత మనం ఆజ్ఞాపించబడ్డాము కాని దానిని సాధన చేస్తున్నప్పుడు అది మానివెయ్యడం కష్టమని మనకు అర్థమౌతుంది. జనులతో పనిచేయుటకు దాదాపు మనం చేయు సమస్తము, వారిని అంచనావేయుటకు దారితీస్తుంది. మన జీవితాలలో దాదాపు ప్రతి దశలోను, మనల్ని మనం ఇతరులతో పోల్చుకుంటాము. అనేక కారణాలచేత దానిని మనం చేస్తాము, కొన్ని సరియైనవే కాని అది తరచు మనం విమర్శాత్మకముగా ఉండుటకు దారితీయును.

అధ్యక్షులు జార్జ్ క్యూ. కెనన్ ఒక హెచ్చరికను జారీచేసారు అది నా స్వంత హెచ్చరిక వలే మీకు ఇస్తున్నాను. ఆయన సత్యమును మాట్లాడారని నేను నమ్ముచున్నాను: ”దేవుడు తన సేవకులను ఎంచుకొనెను. వారిని ఖండించవలసిన అవసరం వస్తే, అది ఆయన ప్రత్యేకహక్కు అని ఆయన ఆరోపిస్తారు. వారిని గద్దించుటకు, నిందించుటకు దానిని మనకు వ్యక్తిగతముగా ఆయన ఇవ్వలేదు. విశ్వాసములో ఎంత బలవంతుడైనప్పటికి, యాజకత్వములో ఎంత ఉన్నతస్థితిలో ఉన్నప్పటికి ప్రభువు అభిషేకించిన వారిని గూర్చి చెడుగా మాట్లాడి, భూమిపైన దేవుని అధికారమును తప్పుపట్టి ఆయనకు అసంతోషాన్ని కలిగించకుండా ఏ మానవుడు ఉండలేడు. అటువంటి మనుష్యుని నుండి పరిశుద్ధాత్మ ఉపసంహరించుకొనును, మరియు అతడు అంధకారము లోనికి వెళ్ళిపోవును. ఇది వాస్తవం కాబట్టి, మనం జాగ్రత్తగా ఉండటం ఎంత అవసరమో మీకు తెెలియడం లేదా?”1

నా పరిశీలన ఏమిటంటే, ప్రపంచమంతటా ఉన్న సంఘ సభ్యులు సాధారణంగా ఒకరి కొకరు మరియు వారిపై అధికారము వహించేవారికి నమ్మకముగా ఉంటారు. అయినప్పటికి మనం చేసుకోగలిగిన, తప్పక చేసుకోవలసిన అభివృద్ధులు కొన్ని ఉన్నాయి. ఒకరినొరకు బలపరచుకొనుటకు మనం ఉన్నత స్థితికి ఎదుగ వచ్చును. దానికి విశ్వాసము, ప్రయత్నము అవసరము. ఈ సమావేశములో మనం అమలుపరచుటకు నేనిచ్చే నాలుగు సలహాలు ఇవే.

  1. ఉపన్యాసకులు సూచించే నిర్థిష్టమైన చర్యలను మనం గుర్తించి, వాటిని అవలంబించుటకు ఈ రోజే మొదలుపెట్టడం. ఆవిధంగా చేసినట్లైతే, వారిని బలపరిచే మన శక్తి పెరుగుతుంది.

  2. వారు మాట్లాడుచున్నప్పుడు, పరిశుద్ధాత్మ వారి మాటలను మనం ప్రేమించేవారిలో నిర్థిష్టమమైన కొంతమంది హృదయాలకు చేర్చాలని మనం వారికొరకు ప్రార్థించవచ్చును. మన ప్రార్థనకు జవాబు ఇవ్వబడెనని తరువాత మనం తెలుసుకొన్నప్పుడు, ఆ నాయకులను బలపరచు మన శక్తి అధికమగును.

  3. నిర్థిష్టమైన కొంతమంది ఉపన్యాసకులు వారి సందేశములు ఇచ్చినప్పుడు వారు దీవించబడి, ఘనపరచబడవలెనని మనం ప్రార్థించవచ్చును. వారు ఘనపరచబడుటను మనం చూచినప్పుడు, వారిని బలపరచుటకు విశ్వాసంలో మనం అభివృద్ధి చెందుతాము మరియు అది దీర్ఘకాలము నిలుస్తుంది.

  4. సహాయము కొరకు మనం చేయు మన వ్యక్తిగత ప్రార్థనలకు సమాధానముగాా వచ్చే ఉపన్యాసకుల సందేశాల కొరకు మనం ఆలకించవచ్చును. వాటికి సమాధానాలు వచ్చినప్పుడు మరియు అవి తప్పక వచ్చును, ప్రభువు యొక్క సేవకులందరిని బలపరిచే మన విశ్వాసమందు అభివృద్ధి చెందుతాము.

సంఘములో సేవచేసే వారిని బలపరుచుటలో మనం మెరుగుపడటంతో పాటు, అటువంటి శక్తిలో అభివృద్ది చెందుటకు మరొక స్థలము కలదని మనం నేర్చుకొంటాము. అది ఇంకా గొప్ప దీవెనలను మనకు తేగలదు. ఆ స్థలము మన గృహము మరియు కుటుంబములో ఉన్నది.

తన తండ్రితో గృహములో జీవించే యాజకత్వము కలిగిన ఒక యౌవనునితో నేను మాట్లాడుచున్నాను. మీ బలపరచు విశ్వాసమును భావించుట ఒక తండ్రికి ఏవిధంగా ఉంటుందో నా స్వంత అనుభవము నుండి మీకు చెప్పనివ్వండి. ఆయన ధైర్యముగా ఉన్నట్లు మీకు అనిపించవచ్చును. కాని మీకు తెలిసిన దానికంటే ఎక్కువ సవాళ్లు ఆయన ఎదుర్కొనుచు ఉండవచ్చును. కొన్నిసార్లు, ఆయన ఎదుట ఉన్న సమస్యలకు ఒక పరిష్కార మార్గాన్ని ఆయన చూడలేకపోవచ్చు.

ఆయనను మీరు ప్రశంసించడం వలన ఆయనకు కొంత సహాయము చేకూర్చును. ఆయన కొరకు మీరు కలిగియున్న ప్రేమ అయనకు మరింత మేలు చేయును. కాని అన్నింటికంటే ఎక్కువ సహాయము చేసేవి ఇలాంటి మాటలు: ”నాన్న, నేను నీ కొరకు ప్రార్థించాను, ప్రభువు నీకు సహాయము చేస్తారని నేను భావించాను. అంతా నీకు కలిసివస్తుంది. అవును, అది తప్పకుండా జరుగుతుంది.”

వ్యతిరేక దిశలో అటునుండి ఇటువైపుకు అనగా తండ్రి నుండి కుమారునికి వచ్చే అటువంటి మాటలు శక్తిని కలిగియుంటాయి. కుమారుడు బహుశా ఆత్మీయ విషయములో కూడా తీవ్రమైన తప్పు చేసినప్పుడు, అతడు ఓడిపోయాడని అనుకోవచ్చును. తన తండ్రిగా, ఆ గడియలో ఏమి చెయ్యాలో తెలుసుకొనుటకు ప్రార్థించిన తరువాత, పరిశుద్ధాత్మ మీ నోటిలో ఈ మాటలుంచినప్పుడు మీరు ఆశ్చర్యపోవచ్చును: ”కుమారుడా, నీ మార్గమంతటిలో నేను నీతో ఉన్నాను. ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నారు. ఆయన సహాయముతో నువ్వు నీ పూర్వవైభవాన్ని తిరిగి పొందవచ్చును. నువ్వు చెయ్యగలవని, నువ్వు చేస్తావని నాకు తెలుసు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను.”

కుటుంబములో మరియు యాజకత్వ సమూహములో ఒకరి నొకరు బలపరుచుకొనుటకు అధికమైన విశ్వాసము కలిగియుండుటయే ప్రభువు మనల్ని కోరుచున్న సీయోను నిర్మాణానికి మార్గము. ఆయన సహాయముతో, మనం చెయ్యగలము మరియు చేస్తాము. దానికి మన పూర్ణ హృదయముతో, మన పూర్ణ బలముతో, మన పూర్ణ మనస్సుతో, మన పూర్ణ శక్తితో ప్రభువును ప్రేమించుట మరియు మనల్ని మనం ప్రేమించుకొనుచున్నట్లే ఒకరి నొకరు ప్రేమించుట అవసరము.

క్రీస్తు యొక్క ఆ పరిపూర్ణ ప్రేమలో అభివృద్ధి చెందినప్పుడు, మన హృదయాలు సున్నితమగుతాయి. ఆ ప్రేమ మనల్ని వినయముగా చేసి, పశ్చాత్తాప పడుటకు నడిపించును. ప్రభువునందు, ఒకరి నొకరియందు మన నమ్మకము పెరుగుతుంది. తరువాత ఏకమగుటకు మనం ముందుకు సాగుతాము ఏలయనగా మనం ఏకము కాగలమని ప్రభువు వాగ్దానము చేయుచున్నారు. 2

పరలోక తండ్రికి మీరు తెలియునని, మిమ్ములను ప్రేమించుచున్నారని నేను సాాక్ష్యమిస్తున్నాను. యేసే సజీవుడైన క్రీస్తు. ఇది ఆయన సంఘము. మనం ఆయన యాజకత్వమును కలిగియున్నాము. దానిని సాధన చేయుటకు మన శక్తిలో ఎదుగుటకు, ఒకరినొకరు బలపరుచుకొనుటకు చేయు మన ప్రయత్నాలను ఆయన ఘనపరుస్తారు. ఇవిధంగా యేసు పరిశుద్ధ నామములో నేను సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.