2010–2019
”రండి, నన్ను వెంబడించుడి”
2019 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము.


”రండి, నన్ను వెంబడించుడి”

యేసుక్రీస్తు మన పరలోకతల్లిదండ్రులు, మనం ప్రేమించేవారున్న గృహానికి తీసుకొనివెళ్లే నిబంధన మార్గాన్ని ఎంచుకోమని ఆహ్వానిస్తున్నారు.

నా ప్రియమైన సహోదర సహోదరీల్లారా, నా భార్య వెండీ, నేను ఈ సబ్బాతు ఉదయాన్న మీతో నుండుటకు సంతోషిస్తున్నాం. గత సర్వసభ్యసమావేశం నుండి ఎన్నో సంభవించాయి. కన్సెప్షియన్, చీలే; బర్రాన్కిల్లా, కొలంబియా; రోమ్, ఇటలీ లో నూతన దేవాలయాలు ప్రతిష్ఠించబడ్డాయి. ఆ పరిశుద్ధ సంఘటనలలో గొప్ప ఆత్మ కుమ్మరింపును మేము అనుభవించాం.

ఈ మధ్య మోర్మన్ గ్రంథాన్ని చదివి, సంతోషాన్ని, దాగిన నిధులను కనుగొన్న అనేక స్త్రీ (పురుషులను) నేను అభినందిస్తున్నాను. పొందిన అధ్బుతాలను గూర్చిన నివేదికలచే నేను ప్రేరేపించబడ్డాను.

11 సంవత్సారాల యువకులు ఎవరైతే ఇప్పుడు పరిచారకులుగా, ప్రతీ ఆదివారం అర్హతతో సంస్కారంను పంచుతున్నారో వారిని బట్టి నేను ఆశ్చర్యపడుతున్నాను. వారు 11 సంవత్సరాల యువతులు ఎవరైతే ఆత్రుతతో నేర్చుకుంటూ, బీహైవ్ లుగా సేవచేస్తున్నారో వారితో పాటు దేవాలయానికి వెళ్తారు. యువకులు, యువతులిరువురు సువార్త సత్యాలను స్వష్టతతో, ధృడవిశ్వాసంతో బోధిస్తున్నారు.

తమ తల్లిదండ్రులతో కలిసి వారి గృహాలలో సువార్తను బోధించుటకు, గృహం కేంద్రంగా, సంఘంచే ఆదరించబడే పాఠ్యప్రణాళికను అనుసరిస్తున్న పిల్లలు, యవ్వనులతో నేను ఉత్సహిస్తున్నాను.

ఒక శనివారం ఉదయాన్నే సంఘ పుస్తకాలలో ఒకదానిని తీసుకొని, “నేను నా ఆత్మను పోషించాలని“ బిగ్గరగా చెప్పిన నాలుగు సంవత్సరాల బ్లేక్ చిత్రపటాన్ని మేము పొందాం.

చిత్రం
బ్లేకు తన ఆత్మను పోషించుట

బ్లేక్, యేసుక్రీస్తు పునఃస్థాపించబడిన సువార్త సత్యాలను ఆరగిస్తూ తమ ఆత్మలను పోషించుకొనుటకు ఎంపిక చేసుకుంటున్న నీతో, మరియు ఇతరులతో మేము పులకరిస్తున్నాం. అనేకులు దేవాలయంలో సేవచేస్తూ, ఆరాధిస్తూ దేవుని శక్తిని వారి జీవితాలలో పొందుచున్నారని యెరిగుటకు మేము ఆనందింస్తున్నాం.

మీలో అనేకులు యెరిగియున్నట్లుగా, మా కుటుంబం మూడు నెలల క్రితం మా కుమార్తె వెండీ ఈ మర్త్యజీవితం నుండి వెడలిపోయినప్పుడు ఒక మృదువైన ఎడబాటును అనుభవించాం. ఆమె కేన్సర్ తో బాధపడుతున్న చివరి దినాలలో, తండ్రి-కూతుళ్ల వీడ్కోలు సంభాషణను చేయు అవకాశంతో నేను దీవించబడ్ఢాను.

నేను ఆమె చేతులను పట్టుకొని, నేను తనను ఎంతగా ప్రేమిస్తున్నానో, ఆమెకు తండ్రిగా ఉన్నందులకు నేను ఎంత కృతజ్ఞుడనో ఆమెకు తెలియజేసాను. “నీవు దేవాలయంలో వివాహం చేసుకొని, విశ్వాసంతో నీ నిబంధనలను సన్మానించావు. నీవు, నీ భర్త ఏడుగురు పిల్లలను మీ గృహంలోనికి ఆహ్వానించారు, వారిని యేసుక్రీస్తుకు అంకితం చేయబడిన శిష్యులుగా, యోధులైన సంఘసభ్యులుగా, మంచిపౌరులుగా పెంచారు. వారు అదే పరిమాణం కలిగిన జీవితభాగస్వాములను ఎన్నుకున్నారు. నీ గురించి నీ తండ్రి చాలా చాలా గర్వపడుతున్నాడు. నీవు నాకు మిక్కిలి సంతోషాన్నిచ్చావు!“ అని నేను చెప్పాను.

ఆమె నెమ్మదిగా, “ధన్యవాదాలు, నాన్న“ అని సమాధానమిచ్చింది.

అది మాకొక మృధువైన, కన్నీటిపర్యంతమైన క్షణం. తన 67 సంవత్సరాలలో, మేము కలిసి పనిచేసాం, కలిసి పాడాం, తరచూ కలిసి మంచులో జారుతూ విన్యాసం చేసాం. కానీ ఆ సాయంత్రం, మేము నిబంధనలు, విధులు, విధేయత, విశ్వాసం, కుటుంబం, భక్తి, ప్రేమ, నిత్యజీవితం వంటి గొప్ప ప్రాముఖ్యత కలిగిన విషయాలను గూర్చి మాట్లాడుకున్నాం.

మేము మాకుమార్తెను ఎంతగానో కోల్పోయాం. అయినప్పటికీ, యేసుక్రీస్తు పునఃస్థాపించబడిన సువార్త వలన, మేము ఆమె గురించి అంతగా బాధపడం. దేవునితో మా నిబంధనలను సన్మానించుట కొనసాగించినప్పుడు, ఆమెతో తిరిగి నివసిస్తామనే నమ్మకంతో జీవిస్తాం. అంతవరకు, ప్రభువుని మేము ఇక్కడ సేవచేస్తుంటే, ఆమె అక్కడ -పరదైశులో ఆయనను సేవచేస్తుంది.1

అయితే, నేను నా భార్య పరదైశును ఈ సంవత్సరం దర్శించాం - అయితే అది ఆ పరదైశు కాదు -పేరడైస్, కాలిఫోర్నియా. మా కుమార్తె ఈ లోకంనుండి వెళ్లిపోయిన 40 గంటలకన్నా తక్కువ సమయంలో అక్కడకు దర్శించవలసిన అవసరం వచ్చింది. నా భార్య నేను, ఎల్డర్ కెవిన్ డబ్ల్యు. పీటర్సన్, ఆయన భార్య, జూన్, చీకో కాలిఫోర్నియా స్టేకు పరిశుద్ధులచే ఆహ్వానించబడ్డాము. కాలిఫోర్నియా చరిత్రలోనే అత్యంతనాశనకరమైన అగ్నిమంటల వలన విధ్వంసకరమైన నష్టాల నడుమ వారి గొప్ప విశ్వాసం, పరిచర్య, అక్కడ జరిగిన అద్భు తాలను గురించి నేర్చుకున్నాం.

అక్కడ ఉన్నప్పుడు. ఆ మంటలకు మొదటిగా ప్రతిస్పందించిన ధైర్యవంతులలో ఒకరైన జాన్, అను ఒక యౌవన పోలీసు అధికారితో చాలా సేపు మాట్లాడాం. నవంబరు 8, 2018న పేరడైస్ పై మంటలు, నిప్పులు ఎగసిపడుతూ పట్టణమంతా కమ్ముకున్న దట్టమైన పొగ, ఉపద్రవం వలే ఆస్థులను, సామాగ్రిని కబళించి, బూడిద కుప్పలు, నల్లని పొగగొట్టాలను తప్ప మరేమీ మిగల్చలేదు.

చిత్రం
అగ్ని తర్వాత కూడికాగృహం

15 గంటలు, జాన్ వాహనాన్ని దట్టమైనచీకటిలో ఈటెలవంటి భయపెట్టే నిప్పురవ్వల మధ్య నడుపుతూ తన స్వంతజీవితాన్ని పణంగా పెట్టి ఒకరి తర్వాత ఒకరికి సహాయం చేస్తూ, ఒక్కొక్క కుటుంబాన్ని సురక్షిత ప్రదేశానికి తప్పించాడు. అంతటి కష్టతరమైన పనిలోకూడా, జాన్ ను నిలువునా కలచివేసిన ప్రశ్న: “నా కుటుంబం ఎక్కడ ఉంది?“ చాలా భాధాకరమైన ఘడియల తర్వాత, వారు సురక్షితంగా ఉన్నారని అతడు తెలుసుకున్నాడు.

జాన్ వృత్తాంతంలో అతడు తన కుటుంబం కొరకు కలిగిన చింత, మీ మర్త్యజీవితాల చివరికి చేరుకుంటున్నప్పుడు ”నా కుటుంబం ఎక్కడ ఉంది?” అని అడిగేవారికొరకు ఈ రోజు నన్ను మాట్లాడుటకు ప్రేరేపించింది. రాబోయే దినాన్న నీవు నీ మర్త్య నిర్ణయకాలాన్ని పూర్తిచేసి, ఆత్మలలోకానికి ప్రవేశించినప్పుడు, నీవు హృదయాన్ని నలిపివేసే ”నా కుటుంబం ఎక్కడ ఉంది?” అనే ప్రశ్నకు ముఖాముఖిగా తీసుకొనిరాబడతావు.

యేసుక్రీస్తు మన నిత్యగృహానికి వెళ్లే మార్గాన్ని బోధించును. ఆయన మన పరలోకతండ్రి యొక్క నిత్యత్వాన్నికి పురోగతి చెందే ప్రణాళికను మనందరికంటే బాగా యెరిగియున్నాడు. అందుకే, ఆయన వాటన్నింటికీ ప్రధానరాయిగా ఉన్నాడు. ఆయన మన విమోచకుడు, స్వస్థపరచువాడు, రక్షకుడై ఉన్నాడు.

ఆదాము అవ్వలు ఏదేను తోటనుండి వెళ్లగొట్టబడిన దినం నుండి క్రీస్తు అయిన యేసు ఆయనను వెంబడించుటకు ఎన్నుకొనినవారందరికీ సహాయం చేయుటకు తన బలమైన హస్తమును చాచియున్నాడు. అనేకరకాల ప్రజలచే చేయబడిన అన్ని రకాల పాపాలున్నప్పటికీ, ఆయన హస్తాలు అలాగే చాపబడ్డాయని లేఖనాలలో అనేకపర్యాయాలు నమోదు చేయబడింది.2

మన ప్రతి ఒక్కరిలోని ఆత్మ సహజంగా కుటుంబ ప్రేమ ఎల్లప్పటికీ ఉండాలని ఆశపడుతుంది. మీరు నిత్యం కలిసుండాలనుకుంటే మీకు కావలసిందంతా ప్రేమయే అని ప్రేమగీతాలు అసత్యమైన నిరీక్షణను శాశ్వతీకరిస్తాయి. మరి కొందరు యేసు క్రీస్తు పునరుత్థానం జనులంతా వారి మరణం తర్వాత వారు ప్రేమించేవారితోనే ఉండేలా చేస్తుందని తప్పుగా నమ్ముతారు.

సత్యమేమిటంటే, రక్షకుడే స్వయంగా ఆయన పునరుత్థానం ద్వారా నివసించిన ప్రతి మనుష్యుడు తప్పకుండా పునరుత్థానుడై ఎల్లప్పటికీ నివసించినప్పటికీ,3 మనం ఉన్నతస్థాయియైన మహోన్నతస్థితిని కోరుకుంటే ఇంకా అధికమైనవి అవసరమని చాలా స్పష్టం చేసెను. రక్షింపబడుట వ్యక్తగత విషయమైతే, మహోన్నతస్థితిని పొందుట కుటుంబ విషయమైయున్నది.

ప్రభువైన యేసు క్రీస్తు ఆయన ప్రవక్తతో చెప్పిన ఈ మాటలను ఆలకించండి: “అన్ని నిబంధనలు, ఒప్పందములు, ఒడంబడికలు, బాధ్యతలు, వాగ్దానములు, ప్రమాణములు, ఆచరణలు, సంబంధములు, సాంగత్యములు లేదా నిరీక్షణలు మృతుల పునరుత్థానము తరువాత ఎట్టి సామర్థ్యమును, వైశిష్ట్యమును లేదా బలమును కలిగియుండవు; ఈ ఉద్దేశము కొరకు చేయబడని ఒప్పందములన్నియు మనుష్యులు మరణించిన తరువాత అంతమగును.“4

కావున, నిత్యత్వమునకు మహోన్నతస్థిని పొందుటకు కుటుంబం ఏమి చేయాలి? మనం విశేషావకాశమునకు అర్హులగుటకు దేవునితో నిబంధనలు చేసి, వాటిని పాటించి, ఆవశ్యకమైన విధులను పొందాలి.

ఇది కాలం ఆరంభం నుండి సత్యంగానే ఉన్నది. లోకం సృజించబడినప్పటి నుండి, ఆదాము హవ్వ, నోవహు అతని భార్య, అబ్రహాం శారా, లీహై శరాయ, యేసుక్రీస్తుకు సమర్పించుకున్న ఇతర శిష్యులందరూ అవే నిబంధనలను దేవునితో చేసియున్నారు. బాప్తీస్మం వద్ద, దేవాలయంలో, ఈనాడు పునఃస్థాపించబడిన సంఘసభ్యులుగా మనం పొందే అవే విధులను వారు కూడా పొందియున్నారు.

రక్షకుడు బాప్తీస్మపు నీళ్లలోనికి ఆయనను వెంబడించమని, దేవాలయంలో అదనపు నిబంధనలు చేయడానికి, ఇంకా ముఖ్యమైన విధులను పొంది విశ్వాసనీయంగా ఉండుటకు ఆహ్వానిస్తున్నారు, ఇవన్నీ మన కుటుంబాలతో మహోన్నతస్థితిని పొంది దేవునితో ఎల్లప్పుడూ ఉండడానికి అవసరం.

నా హృదయవేదన ఏమనగా నేను ప్రేమించి, మెచ్చుకొని, గౌరవించే వారిలో అనేకులు ఆయన ఆహ్వానాన్ని తోసిపుచ్చుతున్నారు. యేసుక్రీస్తు “రండి, నన్ను వెంబడించండి“ అని పిలుస్తున్నప్పుడు, వారు ఆయన మనవులను ఉపేక్షిస్తున్నారు.5

దేవుడు ఎందుకు రోధిస్తున్నాడో నేను గ్రహించగలను.6 అటువంటి స్నేహితులు, బంధువులను గూర్చి కూడా నేను రోధిస్తాను. వారు కుటుంబానికి, సామాజిక బాధ్యతలకు తమను తాము అంకితం చేసుకొన్న మంచి స్త్రీపురుషులు. వారు వారి సమయాన్ని, శక్తిని, వనరులను ధారాళంగా ఇస్తారు. వారి యత్నాలకు లోకమే మేలైనది. కానీ వారు దేవునితో నిబంధనలు చేయకూడదని ఎంచుకున్నారు. వారిని వారి కుటుంబాలను ముద్రించి, ఎల్లప్పటికీ కలిపియుంచి, మహోన్నతపరచే విధులను వారు పొందలేదు.7

వారిని దర్శించి, ప్రభువు యొక్క సాధ్యంచేయు ఆజ్ఞలను పరిశీలించడానికి ఆహ్వానించాలని నేనెంతగా ఆశపడుచున్నాను. నేను రక్షకుడు వారిని ఎంతగా ప్రేమిస్తున్నాడో, నేను ఎంతగా ప్రేమిస్తున్నానో, నిబంధనలు పాటించు స్త్రీపురుషులు పొందే “పరిపూర్ణమైన సంతోషాన్ని“8 వారు గుర్తించునట్లు అనుభవించునట్లు ఏలా చెప్పవచ్చని నేను ఆశ్చర్యపడుతున్నాను.

వారు గ్రహించవలసిందేమిటంటే దేవునితో నిబంధన చేయకుండా ఉండుటకు ఎంచుకున్న అధ్బుతమైన స్త్రీపురుషులతో పాటు వారి కొరకు ఇకముందర ఒక స్థలమున్నప్పటికీ - కుటుంబాలు తిరిగి కలుసుకొని, నివసించుటకు, ఎల్లప్పుడూ అభివృద్ధి చెందుటకు ఆస్థలంలో అవకాశంలేదు. వారు ఎడతెగని అభివృద్ధి, సంతోషం యొక్క9 సంపూర్ణసంతోషాన్ని అనుభవించగలిగేది ఆ రాజ్యంలో కాదు. దేవునితో అనగా మన నిత్యతండ్రి; ఆయన కుమారుడు, యేసుక్రీస్తు; మన అధ్భుతమైన, అర్హత కల్గిన, యోగ్యులైన కుటుంబసభ్యులతో పాటు మహోన్నతపరచబడిన సెలెస్టియల్ రాజ్యంలో నివసించినప్పుడే ఆ సంపూర్ణ దీవెనలు వస్తాయి.

నా మితభాషులైన స్నేహితులకు ఇది చెప్పాలని భావిస్తున్నాను:

“ఈ జీవితంలో, దేనిలోనూ తక్కువదానితో నీవు ఎప్పుడూ సర్దుకుపోలేదు. అయితే, యేసుక్రీస్తు పునఃస్థాపించబడిన సువార్తను పూర్తిగా హత్తుకోడానికి నీవు వ్యతిరేకిస్తే, నీవు తక్కువదానితో సర్దుకుపోడానికి ఎంచుకుంటున్నావు.

రక్షకుడు, ‘నా తండ్రి యింట అనేక నివాసములు కలవు‘10 అని చెప్పెను. అయినప్పటికీ, దేవునితో నిబంధనలు చేయుటకు మీరు ఎంచుకోకపోవడం వలన, మీరు చాలా అల్పమైనగృహంలో మీ నిత్యత్వమంతా నివసించుటకు సర్దుకుపోతున్నారు.”

నా మితభాషులైన స్నేహితులకు ఇలా చెప్పుచూ బ్రతిమాలుతున్నాను:

“మీ హృదయాలను దేవునికి సమర్పించుకోండి. ఈ విషయాలు సత్యమైనవా అని ఆయనను అడగండి. ఆయన మాటలను పఠించడానికి సమయం కేటాయించండి. నిజంగా పఠించండి! మీరు నిజంగా మీ కుటుంబాలను ప్రేమిస్తే, వారితో పాటు నిత్యత్వమంతా వారితో మహోన్నతపరచబడాలంటే, ఈ నిత్యసత్యాలను తెలుసుకొని, వాటికి బద్ధులై నివసించుటకు దాని వెలను శ్రద్ధతో పఠించుట, తీవ్రమైన ప్రార్థనల ద్వారా ఇప్పుడే వెల చెల్లించండి.

”మీరు దేవునినైనా నమ్ముతున్నారా అని మీకు సంశయంగా ఉంటే, అక్కడ నుండే ప్రారంభించండి. దేవునితో అనుభవం లేనివారు, దేవుని ఉనికిని కూడా సందేహిస్తారని గ్రహించండి. కావున, ఆయనతో అనుభవాలను పోందే స్థానంలో మిమ్ములను ఉంచుకోండి. మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. దేవుని హస్తాన్ని మీ జీవితాలలో, మీ చుట్టూనున్న లోకంలో చూచు కన్నులు కలిగియుండుటకు ప్రార్థించండి. ఆయన నిజంగా ఉన్నాడా, ఆయన మిమ్ములను యెరుగునేమో మీతో చెప్పమని అడగండి. ఆయన మీగురించి ఏ విధంగా భావిస్తున్నాడో అడగండి. ఆ తర్వాత, వినండి.”

నా ప్రియమైన స్నేహితులలో ఒకరు దేవునితో మితమైన అనుభవాలను కలిగియుండెను. మరణించిన ఆయన భార్యతో ఉండాలని ఆయన ఆశపడ్డాడు. ఆయనకు సహాయం చేయమని నన్ను అడిగాడు. క్రీస్తు సిద్ధాంతాన్ని అర్థంచేసుకోవడానికి, సువార్త నిబంధనలు, విధులు, దీవెనలు నేర్చుకోవడానికి మన దైవసేవకులతో కలవమని నేను ఆయనను ప్రోత్సహించాను.

ఆవిధంగా అతడు చేశాడు. కానీ వారు చెప్పిన క్రమంను అనుసరించాలంటే అతని జీవతంలో అనేకమార్పులు చేసుకోవాలని అతడు అభిప్రాయపడ్డాడు. ”ఆ ఆజ్ఞలు, నిబంధనలు నాకు చాలా కష్టంగా ఉన్నాయి. నేను దశమభాగాన్ని కట్టలేను, సంఘంలో సేవచేయుటకు నాకు సమయం కూడా లేదు.” అని అతడు చెప్పాడు. అప్పుడతడు, నేను చనిపోయాక, మేము తిరిగి కలిసుండగలిగేందుకు మీరు దయచేసి అవసరమైన దేవాలయపనిని నాకొరకు, నా భార్య కొరకు చేయగలరా?” అని అడిగాడు.

ఆ వ్యక్తి యొక్క న్యాయవాధిని నేను కానందుకు కృతజ్ఞుడను. ఈజీవితంలో బాప్తీస్మం పొందుటకు, యాజకత్వానికి నియమించబడడానికి, మర్తత్వంలోయుండగానే దేవాలయదీవెనలు పొందే అవకాశం కలిగియున్నా కూడా ఆ క్రమాన్ని తిరస్కరించడానికి కోరి ఎంచుకున్న వ్యక్తి కొరకు చేయబడే దేవాలయపని యొక్క ప్రయోజనమేమిటని నేను ప్రశ్నిస్తున్నాను.

నా ప్రియమైన సహోదర సహోదరీల్లారా, యేసు క్రీస్తు మన పరలోకతల్లిదండ్రులు, మనం ప్రేమించేవారున్న గృహానికి తీసుకొనివెళ్లే నిబంధన మార్గాన్ని ఎంచుకోమని ఆహ్వానిస్తున్నాడు. ”రండి, నన్ను వెంబడించండి” అని ఆయన ఆహ్వానిస్తున్నారు.

ఇప్పుడు, ఆయన సంఘాధ్యక్షునిగా, సంఘం నుండి మిమ్మల్నిమీరే దూరంగా ఉంచుకొనిన మిమ్మల్ని, ఇంకా రక్షకుని పునఃస్థాపించబడిన సంఘం గురించి తెలుసుకోవడానికి శ్రద్ధగా వెదకనివారైన మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను. మీకుమీరుగా కనుగొనేందుకు ఆత్మీయపనిని చేయండి, దయచేసి ఇప్పుడే చేయండి. సమయం గతిస్తోంది.

దేవుడు సజీవుడని నేను సాక్ష్యమిస్తున్నాను! యేసే క్రీస్తు. ఆయన సంఘం, ఆయన యొక్క పరిపూర్ణమైన సువార్త మన జీవితాలను ఇక్కడ, ఇంకా ముందు కూడా దీవించుటకు పునఃస్థాపించబడ్డాయి. దానిని నేను యేసు క్రీస్తు నామములో సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.