సర్వసభ్య సమావేశము
చూసే కన్నులు
అక్టోబరు 2020 సర్వసభ్య సమావేశము


చూసే కన్నులు

పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా, క్రీస్తు చూచినట్లుగా ఇతరులను చూచుటకు మరియు మనల్ని మనం చూచుటకు ఆయన మనకు సాధ్యపరచును.

దేవుని హస్తమును చూచుట

ప్రవక్త ఎలీషాకు సేవ చేసిన ఒక యువకుని యొక్క పాత నిబంధన వృత్తాంతమును నేను ప్రేమిస్తున్నాను. ఒక తెల్లవారుజామును ఆ యువకుడు మేల్కొని, బయటకు వెళ్లాడు, మరియు పట్టణము గొప్ప సైన్యము చేత చుట్టుముట్టబడుట కనుగొన్నాడు. అతడు ఎలీషా వద్దకు పరుగెత్తాడు: “అయ్యో, నా యేలీనవాడా, మనము ఏమి చేయుదుము?”

“భయపడవద్దు, మన పక్షమును నున్నవారు వారికంటె అధికులైయున్నారని” ఎలీషా జవాబిచ్చాడు.

ఆ యువకునికి నెమ్మదిపరచే అభయము కంటె ఎక్కువ అవసరమని ఎలీషా ఎరుగును; అతడు చూడగలగాలి. మరియు “యెహోవా, … వీడు చూచునట్లు దయచేసి వీని కండ్లను తెరువుమని ఎలీషా ప్రార్ధించాడు.” యెహోవా ఆ పనివాని కండ్లను తెరవచేసెను గనుగ వాడు ఎలీషా చుట్టును పర్వతము అగ్ని గుఱ్ఱములచేత రథములచేతను నిండియుండుట చూచెను.” 1

మర్త్యత్వము యొక్క శ్రమలు మిమ్మల్ని బలహీనపరచుట ద్వారా దీనులుగా చేసినప్పుడు—మీరు క్షీణింప చేయబడి ముట్టడి చేయబడినట్లు భావించిన సమయాలు—ఆ పనివాని వలె, దేవుడు మీ జీవితంలో ఎలా పనిచేస్తున్నాడో చూచుటకు ప్రయాసపడుటను మీరు కనుగొన్న సమయాలుండవచ్చు. దేవునియందు విశ్వసించుము మరియు ఆయన సమయమందు వేచియుండుము, ఎందుకనగా మీ సమస్తముతో ఆయన హృదయమును మీరు నమ్మవచ్చును. కానీ ఇక్కడ రెండవ పాఠమున్నది. నా ప్రియమైన సహోదర, సహోదరీలారా, మీరు సాధారణంగా చూడని విషయాలను చూచుటకు మీ కన్నులు తెరవమని మీరు కూడా ప్రభువుకు ప్రార్ధించవచ్చును.

దేవుడు మనల్ని చూచినట్లుగా మనము గ్రహించుట

బహుశా స్పష్టముగా చూచుటకు మనకు అత్యంత ముఖ్యమైన విషయాలు దేవుడు ఎవరు, మనము నిజముగా ఎవరము—“దైవిక స్వభావము మరియు నిత్య గమ్యముతో” పరలోక తల్లిదండ్రుల యొక్క కుమారులు, కుమార్తైలము.” 2 ఆయన మీ గురించి ఎలా భావిస్తున్నాడు, దానితోపాటు ఈ సత్యములను బయల్పరచమని దేవునిని అడుగుము. మీ నిజమైన గుర్తింపు, ఉద్దేశమును, బలమైన అవగాహన కలిగి, మీరు ఎక్కువగా గ్రహించినప్పుడు, మీ జీవితంలో సమస్తమును అది ఎక్కువగా ప్రభావితం చేస్తుంది.

ఇతరులను చూచుట

మనల్ని దేవుడు ఎలా చూస్తున్నాడో గ్రహించుట ఆయన చూచినట్లుగా ఇతరులను చూచుటకు సహాయపడుటకు మార్గమును సిద్ధపరచును. ప్రత్యేక శీర్షిక రచయత డేవిడ్ బ్రూక్స్ ఇలా అన్నాడు: “మన సమాజంలో చాలా గొప్ప సమస్యలు ఇతరుల చేత నిర్లక్ష్యము చేయబడి, విలువ ఇవ్వబడనట్లు భావించే జనుల నుండి ప్రవహిస్తాయి. … మనమందరం మెరుగ్గా ఉండవలసిన ఒక ముఖ్యమైన … లక్షణం [ఉంది] … [దానిని] మనమందరము మెరుగుపరచుకోవాలి, అది ఒకరినొకరం లోతుగా చూసే మరియు లోతుగా చూడబడే లక్షణం.” 3

యేసు క్రీస్తు జనులను లోతుగా చూస్తారు. ఆయన వ్యక్తులు, వారి అవసరతలను, మరియు వారు ఎవరివలె కాగలరో చూస్తాడు. ఇతరులు జాలరులు, పాపులు, లేక సుంకరులను చూసిన చోట, యేసు శిష్యులను చూసాడు; దయ్యములు పట్టిన వ్యక్తిని ఇతరులు చూచిన చోట, యేసు బాహ్యా బాధను చూడకుండా, వ్యక్తిని అంగీకరించాడు మరియు అతడిని స్వస్థపరిచాడు. 4

మన తీరికలేని జీవితాలలో కూడ, మనము యేసు యొక్క మాదిరిని అనుసరించగలము మరియు వ్యక్తులు—వారి అవసరాలు, వారి విశ్వాసము, వారి ప్రయాస, మరియు వారు ఎవరివలె కాగలరో చూడగలము. 5

నేను సాధారణంగా చూడని విషయాలను చూచుటకు నా కన్నులు తెరవమని ప్రభువుకు నేను ప్రార్ధించినప్పుడు, తరచుగా రెండు ప్రశ్నలను నాకై నేను అడుగుతాను మరియు వచ్చే ప్రేరేపణలకు ఆసక్తిని చూపుతాను: “నేను చేస్తున్నది ఏది నేను చేయటం మానేయ్యాలి?” మరియు “నేను చేయడం లేనిది చేయటం ప్రారంభించాల్సినది ఏమిటి?” 6

నెలల క్రితం, సంస్కారమందు, నాకై నేను ఈ ప్రశ్నలను అడిగాను మరియు వచ్చిన భావన చేత నేను ఆశ్చర్యపడ్డాను. “లైనులో నీవు వేచియుండగా నీ ఫోను వైపు చూడటం ఆపు.” లైనులో నిలబడి నా ఫోను వైపు చూడటం దాదాపు యాంత్రికమైనది; రెండు పనుల చేయడానికి ఈ-మెయిల్ చూడటం, ముఖ్యమైన వార్తలను చూడటం, లేక సామాజిక మీడియా గుండా చూడటం అది మంచి సమయంగా నేను కనుగొన్నాను.

మరుసటి ఉదయం, షాపు వద్ద పొడవైన లైనులో వేచియున్నాను. నా ఫోనును బయటకు తీసాను మరియు తరువాత నాకు కలిగిన భావనను జ్ఞాపకం చేసుకున్నాను. నా ఫోను లోపల పెట్టెశాను మరియు చుట్టూ చూసాను. నా ముందున్న ఒక మంచి వృద్ధుని నేను చూసాను. పిల్లి ఆహారముగల డబ్బాలు తప్ప అతడి బండి ఖాళీగా ఉన్నది. నేను కాస్త ఇబ్బందిగా భావించాను కానీ నిజంగా తెలివిగా అన్నాను, “మీకు పిల్లి ఉందని నాకు కనిపిస్తుంది.” తుఫాను రాబోతుందని, పిల్లి ఆహారము లేకుండా సిద్ధపడకుండా ఉండటం తనకిష్టం లేదని అతడు చెప్పాడు. మేము క్లుప్తంగా మాట్లాడుకున్నాము, మరియు అతడు నా వైపు తిరిగి, “మీకు తెలుసా, నేను ఎవరికి చెప్పలేదు, కానీ ఈ రోజు నా పుట్టినరోజు.” నా గుండె కరిగిపోయింది. నేను అతడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాను మరియు నా ఫోను చూడనందుకు నేను మౌనంగా కృతజ్ఞత తెలిపాను మరియు అవసరమైన మరొక వ్యక్తిని నిజముగా చూసి, మాట్లాడే అవకాశాన్ని కోల్పోయేదాన్ని.

యెరికోకు దారిలో ప్రయాణిస్తూ—చూచి మరియు దాటిపోయిన యాజకుడు లేక లేవియుని వలే ఉండటం నా పూర్ణహృదయముతో నేనిష్టపడలేదు. 7 కానీ చాలా తరచుగా నేను అలా ఉన్నానని అనుకుంటున్నాను.

నాకోసం దేవుని పనిని చూచుట

రోజ్లిన్ పేరుగల ఒక యువతి నుండి లోతుగా చూచుట గురించి ఒక విలువైన పాఠాన్ని నేను ఈమధ్య నేర్చుకున్నాను.

20 సంవత్సరాలుగా ఆమె భర్తగా ఉండి, విడిచి వెళ్లిపోయినప్పుడు నాశనమైన నా స్నేహితురాలి చేత ఆ వృత్తాంతము పంచుకోబడింది. తల్లిదండ్రుల మధ్య పిల్లలు విభజించబడిన సమయంతో, సంఘానికి ఒంటరిగా హాజరు కావాలనే ఆలోచన చాలా కష్టమైనదిగా కనబడింది. ఆమె జ్ఞాపకం చేసుకున్నది:

“కుటుంబానికి అత్యధిక ప్రాముఖ్యత ఇచ్చే సంఘములో, ఒంటరిగా కూర్చోవడం బాధాకరమైనది. ఆ మొదటి ఆదివారము నాతో ఎవరూ మాట్లాడకూడదని ప్రార్ధిస్తూ నేను వెళ్లాను. నేను ప్రసన్నంగా ఉండలేకపోయాను, మరియు కన్నీళ్లు అంచున ఉన్నాయి. బెంచి ఎంత ఖాళీగా ఉందో ఎవరూ గ్రహించరని ఆశిస్తూ, నేను విలక్షణమైన ప్రదేశంలో కూర్చోన్నాను.

“మా వార్డులోని ఒక యువతి తిరిగి, నావైపు చూసింది. నేను చిరునవ్వు నటించాను. ఆమె తిరిగి నవ్వింది. ఆమె ముఖంలో ఆందోళనను నేను చూడగలిగాను. ఆమె నావద్దకు వచ్చి మాట్లాడకూడదని నేను మౌనంగా వేడుకున్నాను—చెప్పడానికి నా వద్ద ఏ మంచి విషయంలేదు మరియు నేను ఏడుస్తానని ఎరుగుదును. నేను నా ఒడివైపు తిరిగి చూసి, కళ్లలోకి చూడటం మానేసాను.

“తరువాత సమయంలో, ఆమె అప్పుడప్పుడు నావైపు తిరిగి చూడటం నేను గమనించాను.” సమావేశం ముగిసిన వెంటనే, ఆమె నేరుగా నావద్దకు వచ్చింది. ‘హాయ్, రోజ్లిన్,‘ నేను గుసగుసలాడాను. ఆమె తన చేతులతో నన్ను చుట్టివేసింది, ‘సహోదరి స్మిత్, ఈ రోజు నీకు మంచి రోజు కాదని నేను చెప్పగలను. నేను చాలా విచారిస్తున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను.‘ ఆమె నన్ను మరలా హత్తుకొన్నప్పుడు, నేను ఊహించినట్లుగా కన్నీళ్లు వచ్చాయి. కానీ నేను వెళ్లిపోయినప్పుడు, ‘బహుశా నేను దీనిని చేయగలను,’ అని నాలో నేను అనుకున్నాను.

చిత్రం
రోజ్లిన్ మరియు సహోదరి స్మిత్

“ఆ ప్రియమైన 16-ఏళ్ల-యువతి, నా వయసులో సగం కన్నా చిన్నది, ఆ తరువాత సంవత్సరమంతా ప్రతి ఆదివారం, ‘మీరు ఎలా ఉన్నారు?’ అని అడగటానికి, ఆలింగనం చేసుకోవడానికి నన్ను కనుగొన్నది. సంఘానికి రావడానికి నేను ఎలా భావిస్తున్నానో అది ప్రత్యేకతను చూపింది. నిజమేమిటంటే ఆ ఆలింగనములపై నేను ఆధారపడసాగాను. ఆమె నన్ను గమనించింది. నేను అక్కడ ఉన్నానని ఎవరైనా ఒకరికి తెలుసు. ఎవరో శ్రద్ధ తీసుకున్నారు.”

తండ్రి చాలా ఇష్టపూర్వకంగా అందించే అన్ని బహుమతుల మాదిరిగానే,ఆయనను అడుగుట—మరియు తరువాత అమలు చేయుట లోతుగా చూచుటకు అవసరము. ఆయన ఇతరులను చూసినట్లుగా—ఆయన నిజమైన కుమారులు, కుమార్తెలను అంతములేని, దైవిక సాధ్యతతో చూచుటకు అడుగుము. తరువాత ప్రేమించుట, సేవ చేయుట, ప్రేరేపించబడినట్లుగా వారి విలువను మరియు సాధ్యతను ధృవీకరించుట ద్వారా అమలు చేయుట. ఇది మన జీవితాల యొక్క మాదిరి అయినప్పుడు, “యేసు క్రీస్తు యొక్క … నిజమైన శిష్యులుగా” మారటం మనకై మనం కనుగొంటాము. 8 ఇతరులు వారితో మన హృదయాలను నమ్మగలుగుతారు. ఈ మాదిరిలో మన స్వంత నిజమైన గుర్తింపును, ఉద్దేశమును కూడా కనుగొంటాము.

చిత్రం
రక్షకుడు స్వస్థపరచుట

అదే ఖాళీ బెంచీలో ఒంటరిగా కూర్చోని, తన ఇంటిలో సువార్త జీవించడానికి 20 సంవత్సరాల ప్రయత్నము వ్యర్ధమేనా అని ఆలోచిస్తుండగా మరొక అనుభవాన్ని నా స్నేహితురాలు జ్ఞాపకం చేసుకున్నది. ఆమెకు నెమ్మదిపరచే అభయము కంటె ఎక్కువ అవసరము; ఆమెకు దృష్టి అవసరము. ఒక ప్రశ్న ఆమె హృదయములోనికి చొచ్చుకొనిపోవుటను భావించింది: “ఆ విషయాలు నీవు ఎందుకు చేసావు? అవి ప్రతిఫలము కోసం, ఇతరుల పొగడ్త కోసం, లేక ఆశించిన ఫలితం కోసం నీవు వాటిని చేసావా? ఆమె ఒక క్షణము సందేహించింది, తన హృదయంలో పరిశోధించింది, మరియు తరువాత నమ్మకంగా జవాబివ్వగలిగింది, “నేను రక్షకుని ప్రేమించాను గనుక నేను వాటిని చేసాను. మరియు నేను ఆయన సువార్తను ప్రేమిస్తున్నాను.” ఆమె చూచుటకు సహాయపడుటకు ప్రభువు ఆమె కన్నులు తెరిచాడు. దృష్టి యొక్క ఈ సాధారణమైన లేక శక్తివంతమైన మార్పు, తన పరిస్థితులు లక్ష్యపరచకుండా ఆమె క్రీస్తుయందు విశ్వాసముతో పట్టుదలతో కొనసాగించుటకు సహాయపడింది.

అది కష్టమైనప్పుడు—కూడ, మనము అలసిపోయినప్పుడు కూడ మనము ఒంటరిగా ఉన్నప్పుడు కూడ మరియు ఫలితాలు మనమాశించినట్లుగా రానప్పుడు కూడ ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడని, చూచుటకు కన్నులను మనకిస్తాడని నేను సాక్ష్యమిస్తున్నాను. ఆయన కృప ద్వారా, ఆయన మనల్ని దీవించును మరియు మన సామర్ధ్యమును హెచ్చించును. పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా, క్రీస్తు చూచినట్లుగా ఇతరులను చూచుటకు మరియు మనల్ని మనం చూచుటకు ఆయన మనకు సాధ్యపరచును. ఆయన సహాయముతో, మిక్కిలి అవసరమైన దానిని మనము గ్రహించగలము. మన జీవితాల యొక్క సాధారణమైన వివరాలలో, దాని ద్వారా ప్రభువు యొక్క హస్తము పనిచేయుట చూచుట మనము ప్రారంభిస్తాము—మనము లోతుగా చూస్తాము.

ఆ గొప్ప దినములో “ఆయన ఉన్నట్లే మనము ఆయనను చూచెదము; కావున ఆయన ప్రత్యక్షమగునప్పుడు, మనము ఆయన వలె ఉండునట్లు మనము ఈ నిరీక్షణను కలిగియుండునట్లు” 9 యేసు క్రీస్తు నామములో నేను ప్రార్ధిస్తున్నాను, ఆమేన్.

వివరణలు

  1. 2 రాజులు 6:15–17 చూడండి.

  2. యువతుల నేపథ్యము, ChurchofJesusChrist.org.

  3. David Brooks, “Finding the Road to Character” (Brigham Young University forum address, Oct. 22, 2019), speeches.byu.edu.

  4. మార్కు 5:1–15 చూడుము.

  5. “సాధ్యమైన దేవుళ్ళు, దేవతలుగల సమాజంలో జీవించడం, మీరు మాట్లాడగలిగే మందబుద్ధిగల … అత్యంత ఆసక్తిలేని వ్యక్తి ఒకరోజు ఒక జీవి కావచ్చు, ఇది మీరు ఇప్పుడు చూసిన యెడల ఆరాధించడానికి మీరు బలంగా శోధించబడతారని జ్ఞాపకముంచుకొనుట చాలా తీవ్రమైన విషయం. … సాధారణమైన జనులు లేరు” (C. S. Lewis, The Weight of Glory [2001], 45–46).

  6. Kim B. Clark, “Encircled about with Fire” (Seminaries and Institutes of Religion satellite broadcast, Aug. 4, 2015), ChurchofJesusChrist.org.

  7. లూకా 10:30–32 చూడండి.

  8. మొరోనై 7:48.

  9. మొరోనై 7:48; అవధారణ చేర్చబడినది.