సర్వసభ్య సమావేశము
మార్పును నిలుపుకొనుము
అక్టోబరు 2020 సర్వసభ్య సమావేశము


మార్పును నిలుపుకొనుము

యేసు క్రీస్తు ద్వారా, మనము శాశ్వతమైన మార్పులు చేయడానికి బలమివ్వబడ్డాము. మనము వినయముగా ఆయన వైపు తిరిగినప్పుడు, మారడానికి మన సామర్ధ్యమును ఆయన హెచ్చిస్తారు.

సహోదరీలారా, మీతో ఉండడం చాలా సంతోషంగా ఉంది.

చిత్రం
సంత‌లో చెల్లించుట

ఎవరైనా ఒకరు ఒక వస్తువు కొనడానికి సంత‌కు వెళ్ళడాన్ని ఊహించుకోండి. వస్తువు విలువ కంటే ఆమె రొక్కందారుడికి ఎక్కువ చెల్లించినట్లైతే, అతడు ఆమెకు చిల్లర ఇస్తాడు.

చిత్రం
చిల్లర తీసుకొనుట

మన రక్షకుడైన యేసుక్రీస్తు నుండి మనకు లభించే అద్భుతమైన ఆశీర్వాదాల గురించి రాజైన బెంజిమెన్ ప్రాచీన అమెరికాలోని తన ప్రజలకు బోధించాడు. ఆయన పరలోకములను, భూమిని, మరియు మనము ఆనందించే సమస్త సౌందర్యమును సృష్టించారు. 1 ఆయన ప్రేమగల ప్రాయశ్చిత్తఃము ద్వారా, పాపము మరియు మరణము నుండి విమోచింపబడుటకు ఆయన మనకు ఒక మార్గమును సిద్ధపరిచారు. 2 ఆయన ఆజ్ఞలను శ్రద్ధగా జీవించుట ద్వారా ఆయనకు మన కృతజ్ఞతను చూపినప్పుడు, ఎల్లప్పుడూ మనల్ని ఆయనకు రుణగ్రస్తులుగా చేస్తూ ఆయన వెంటనే మనల్నిదీవిస్తారు.

ఆయనకు మనము ఎప్పటికీ తిరిగి ఇవ్వగలిగే విలువ కంటే చాలా అత్యధికంగా ఆయన మనకు ఇస్తారు. కాబట్టి, మన పాపముల కొరకు లెక్కించలేని వెల చెల్లించిన ఆయనకు మనము ఏమి ఇవ్వగలము? మనము ఆయనకు మార్పును ఇవ్వగలము. మన మార్పును ఆయనకు మనమివ్వగలము. అది ఆలోచనలో మార్పు, అలవాటులో మార్పు లేక మనము వెళుతున్న దిశలో మార్పు కావచ్చు. మనలో ప్రతీఒక్కరి కొరకు ఆయన అమూల్యమైన చెల్లింపుకు బదులుగా, మన హృదయములో మార్పు కొరకు ప్రభువు అడుగుతున్నారు. ఆయన మన నుండి కోరే మార్పు ఆయన ప్రయోజనము కొరకు కాదు, కానీ మన కొరకైనది. కనుక, సంత‌లో మనము ఇచ్చే చిల్లర తీసుకొనే కొనుగోలుదారుడిలా కాకుండా, మన కృపగల రక్షకుడు మార్పు నిలుపుకోమని మనల్ని పిలుస్తున్నాడు.

రాజైన బెంజిమెన్ చేత మాట్లాడబడిన మాటలు వినిన తరువాత, అతడి జనులు వారి హృదయాలు మారినవని ఇట్లనుచూ కేక వేసి చెప్పిరి, “ప్రభువు సర్వశక్తిమంతుని యొక్క ఆత్మ, మేము చెడు చేయుటకు ఇక ఏ మాత్రము కోరిక లేక నిరంతరము మంచి చేయుటకు కోరిక కలిగియుండునట్లు … మా యందు లేక మా హృదయములందు ఒక గొప్ప మార్పు కలుగజేసెను.” 3 వారు వెంటనే పరిపూర్ణంగా మారారని లేఖనాలు చెప్పవు; బదులుగా, మారాలనే వారి కోరిక దానిని అమలు చేయడానికి వారిని బలవంతం చేసింది. వారి హృదయము యొక్క మార్పు అనగా ప్రకృతి సంబంధియైన పురుషుడు లేక స్త్రీని అణచివేసి యేసు క్రీస్తు వలె ఎక్కువగా మారడానికి ప్రయాసపడినప్పుడు ఆత్మకు లోబడడమని అర్థము.

అధ్యక్షులు హెన్రీ బి. ఐరింగ్ ఇలా బోధిస్తున్నారు: ”నిజమైన పరివర్తన గొప్ప ప్రయత్నము మరియు కొంత బాధతో విశ్వాసమందు స్వేచ్ఛగా వెదకుటపై ఆధారపడియున్నది.” అప్పుడు ప్రభువు తానే … శుద్ధి మరియు మార్పు యొక్క అద్భుతమును దయచేయగలడు.” 4 మనల్ని మార్చుటకు రక్షకుని సామర్ధ్యముతో మన ప్రయత్నమును జతపరచి, మనము నూతన సృష్టి అవుతాము.

నేను చిన్నదానిగా ఉన్నప్పుడు, నా లక్ష్యమైన నిత్యజీవము వైపు పైకి, నిలువు మార్గములో నడుస్తున్నట్లుగా నేను ఊహించాను. నేను ఏదైనా తప్పు చేసిన లేక చెప్పిన ప్రతీసారి, నా ప్రయాణమును మరలా తిరిగి ప్రారంభించడానికి మాత్రమే ఆ మార్గము క్రిందుగా జారిపోతున్నట్లు భావించాను. పిల్లల ఆట చూట్స్ మరియు నిచ్చెనలలో (వైకుంఠపాళి ఆట వంటిది) ఒక చదరముపై దిగినట్లుగా అది ఉన్నది, అది మిమ్మల్ని బోర్డు పైభాగము నుండి తిరిగి ఆట ప్రారంభానికి క్రిందికి జారేస్తుంది! అది నిరాశ కలిగిస్తుంది! కానీ క్రీస్తు యొక్క సిద్ధాంతమును 5 మరియ నా జీవితంలో దానిని ఎలా అన్వయించుకోవాలో గ్రహించడం ప్రారంభించినప్పుడు, నేను నిరీక్షణను కనుగొన్నాను.

చిత్రం
మార్పు చెందే ప్రక్రియ సహించుటను కలిపియున్నది

మార్పు కొరకు నిరంతర మాదిరిని యేసు క్రీస్తు మనకు ఇచ్చారు. ఆయనయందు విశ్వాసమును సాధన చేయడానికి ఆయన మనల్ని ఆహ్వానిస్తున్నారు, అది పశ్చాత్తాపపడడానికి మనల్ని ప్రేరేపిస్తుంది—“అట్టి విశ్వాసము మరియు పశ్చాత్తాపము హృదయము యొక్క మార్పును తెచ్చును.” 6 మనము పశ్చాత్తాపపడి, ఆయన వైపు మన హృదయాలను త్రిప్పినప్పుడు, పరిశుద్ధ నిబంధనలు చేసి, జీవించుటకు గొప్ప కోరికను మనము పొందుతాము. మన జీవితములంతటా ఈ సూత్రాలను అన్వయించుటను కొనసాగించడం మరియు మనల్ని మార్చడానికి ప్రభువును ఆహ్వానించడం ద్వారా మనము అంతము వరకు సహిస్తాము. అంతము వరకు సహించుట అనగా అంతము వరకు మార్పు చెందుట అని అర్ధము. విఫలమైన ప్రతీ ప్రయత్నంతో నేను మరలా ప్రారంభించడం లేదని నేను ఇప్పుడు అర్థం చేసుకున్నాను, కానీ ప్రతి ప్రయత్నంతో నేను నా మార్పు ప్రక్రియను కొనసాగిస్తున్నాను.

యువతుల ఇతివృత్తంలో ప్రేరేపించబడిన వాక్యము ఉన్నది, అదిలా వ్యాఖ్యానిస్తుంది, “నేను పశ్చాత్తాపం యొక్క వరమును కాపాడుకుంటాను మరియు ప్రతి రోజు మెరుగుపరచుకోవడానికి ప్రయత్నిస్తాను.” 7 ఈ అందమైన వరమును మనము కాపాడుకుంటామని, మార్పును కోరడంలో ఉద్దేశ్యపూర్వకంగా ఉంటామని నేను ప్రార్ధిస్తున్నాను. కొన్నిసార్లు మనము చేయాల్సిన మార్పులు తీవ్రమైన పాపముతో ముడిపడి ఉంటాయి. కానీ చాలా తరచుగా, యేసుక్రీస్తు లక్షణాలతో మనల్ని మనం విలీనం చేసుకోవడానికి మన ప్రవర్తన మెరుగుపరచడానికి మనం ప్రయాసపడతాము. మన అనుదిన ఎంపికలు మన అభివృద్ధికి సహాయపడతాయి లేక అడ్డుపడతాయి. చిన్నవి, కానీ స్థిరమైన, ఉద్దేశ్వపూర్వకమైన మార్పులు మనము మెరుగుపడడానికి సహాయపడతాయి. నిరాశ చెందరాదు. మార్పు అనేది జీవితకాల ప్రక్రియ. మారడానికి మన శ్రమలలో, ప్రభువు మనతో సహనంగా ఉన్నందుకు నేను కృతజ్ఞత కలిగియున్నాను.

యేసు క్రీస్తు ద్వారా శాశ్వతమైన మార్పులు చేయుటకు మనము బలమివ్వబడ్డాము. మనము వినయముగా ఆయన వైపు తిరిగినప్పుడు, మారడానికి మన సామర్ధ్యమును ఆయన హెచ్చిస్తారు.

మన రక్షకుని ప్రాయశ్చిత్తము యొక్క మార్చివేయు శక్తికి అదనంగా, మనము మన ప్రయత్నాలను చేసినప్పుడు, పరిశుద్ధాత్మ మనల్ని బలపరచి, నడిపిస్తాడు. మనము ఏ మార్పులు చేయాలో తెలుసుకోవడానికి కూడా ఆయన సహాయపడగలడు. మనము యాజకత్వ దీవెనలు, ప్రార్ధన, ఉపవాసము మరియు దేవాలయమునకు హాజరగుట ద్వారా సహాయమును మరియు ప్రోత్సాహమును కూడా కనుగొనగలము.

అదేవిధంగా, నమ్మకస్తులైన కుటుంబ సభ్యులు, నాయకులు మరియు స్నేహితులు మారడానికి మన ప్రయత్నాలందు సహాయకరంగా ఉండగలరు. నాకు ఎనిమిది సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, మా అన్నయ్య లీ మరియు నేను మా స్నేహితులతో పొరుగునున్న చెట్టు కొమ్మలలో ఆడుతూ సమయాన్ని గడిపేవారము. ఆ చెట్టు నీడలో మా స్నేహితుల సహవాసములో కలిసియుండడాన్ని మేము ప్రేమించాము. ఒకరోజు లీ చెట్టు పైనుండి పడి, తన చేతిని విరగగొట్టుకున్నాడు. విరిగిన ఎముక వలన అతడు తనకుతానుగా చెట్టు ఎక్కడం కష్టంగా ఉండేది. కానీ అతడు లేకుండా చెట్టులో ఆడుకోవడం మునుపటిలా లేదు. కాబట్టి మాలో కొందరు బాగున్న అతడి చేతిని పైకి లాగుతుండగా, మరికొందరు అతడిని క్రింద నుండి త్రోయడం ద్వారా ఎక్కువ శ్రమ లేకుండా లీ తిరిగి చెట్టులోకి వచ్చాడు. అతడి చేయి ఇంకా విరిగిపోయి ఉన్నది, కానీ అతడికి నయమవుతుండగా మా స్నేహమును ఆనందిస్తూ అతడు మరలా మాతో ఉన్నాడు.

చెట్టులో ఆడిన నా అనుభవము, యేసు క్రీస్తు యొక్క సువార్తలో మన క్రియాశీలతకు చిహ్నముగా ఉండుట గురించి నేను తరచుగా ఆలోచించాను. సువార్త కొమ్మల నీడలో, మన నిబంధనలతో ముడిపడిన అనేక దీవెనలను మనము ఆనందిస్తాము. కొందరు వారి నిబంధనల యొక్క క్షేమము నుండి పడిపోయియుండవచ్చు మరియు సువార్త కొమ్మల భద్రతకు తిరిగి రావడానికి మన సహాయము అవసరము కావచ్చు. తమంతట తాము తిరిగి రావడం వారికి కష్టము కావచ్చు. వారు మన స్నేహాన్ని ఆస్వాదించేటప్పుడు వారికి స్వస్థత కలిగేలా సహాయపడడానికి మనం ఇక్కడ కొంచెం మృదువుగా లాగి, అక్కడ కొంచెం పైకి ఎత్తగలమా?

మీరు పడిపోవుట వలన ఒక గాయంతో బాధపడుతుంటే, మీ నిబంధనలకు మరియు అవి అందించే ఆశీర్వాదాలకు తిరిగి రావడానికి దయచేసి ఇతరులను సహాయపడనివ్వండి. మిమ్మల్ని ప్రేమించేవారి చేత చుట్టబడియున్నప్పుడు, మీరు స్వస్థపడడానికి, మారడానికి రక్షకుడు మీకు సహాయపడగలరు.

అప్పుడప్పుడు నేను అనేక సంవత్సరాలుగా చూడని స్నేహితులను అనుకోకుండా కలుస్తాను. “నువ్వు ఏమీ మారలేదు!” అని కొన్నిసార్లు వారు చెప్తారు. నేను దానిని వినిన ప్రతీసారి కాస్త ఇబ్బంది పడతాను, ఎందుకంటే సంవత్సరాలు గడిచేకొద్దీ నేను మారానని అనుకుంటున్నాను. నిన్నటి కంటే నేను మారానని అనుకుంటున్నాను! నేను కాస్త దయగా, తక్కువ విమర్శించేదానిగా ఉన్నానని మరియు ఎక్కువ కనికరము కలిగియున్నానని నేను అనుకుంటున్నాను. ఇతరుల అవసరాలకు నేను త్వరగా స్పందిస్తున్నానని మరియు నేను కొంచెం ఎక్కువ సహనము కలిగియున్నానని అనుకుంటున్నాను.

మా ఇంటి దగ్గర ఉన్న కొండలు ఎక్కడం నాకిష్టం. తరచుగా నేను దారి వెంట నడుస్తున్నప్పుడు, నా బూటులోనికి ఒక చిన్న రాయి వెళుతుంది. చివరకు, నేను ఆగి నా బూటును దులుపుతాను. నేను ఆగి ఆ చిన్న రాయిని తీసివేయడానికి ముందు నొప్పితో ఎంతసేపు పైకి ఎక్కడానికి నన్ను నేను అనుమతించాను అనేది నాకు ఆశ్చర్యము కలిగిస్తుంది.

మనము నిబంధన బాటపై ప్రయాణిస్తున్నప్పుడు, కొన్నిసార్లు బలహీనమైన అలవాట్లు, పాపములు లేక చెడు స్వభావాల రూపంలో మన బూట్లలోని రాళ్ళను పైకి తీస్తాము. మన జీవితాల నుండి వాటిని ఎంత త్వరగా దులిపివేస్తే , మన మర్త్య ప్రయాణము అంత ఎక్కువ సంతోషకరంగా ఉంటుంది.

మార్పును కాపాడుకోవడానికి ప్రయత్నము అవసరము. అప్పుడే నేను తొలగించిన విసిగించే, బాధాకరమైన గులకరాయిని నా బూటులో తిరిగి ఉంచడానికి మాత్రమే దారిలో ఆగడాన్ని నేనూహించలేను. ఒక అందమైన సీతాకోక చిలుక తిరిగి గొంగళిగా మారడానికి ఎంపిక చేయనట్లుగా నేను ఇకపై ఆవిధంగా చేయడానికి ఇష్టపడను.

యేసు క్రీస్తు వలన, మనము మారగలము అని నేను సాక్ష్యమిస్తున్నాను. ఆయనలాగా మారడానికి మనము మన అలవాట్లు సరిదిద్దుకోగలము, మన ఆలోచనలు మార్చుకోగలము మరియు మన ప్రవర్తనను శుద్ధిచేసుకోగలము. ఆయన సహాయముతో, మనము మార్పును నిలుపుకోగలము. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.