సర్వసభ్య సమావేశము
పరీక్షించబడెను, నిరూపించబడెను, మరియు మెరుగుపెట్టబడెను
అక్టోబరు 2020 సర్వసభ్య సమావేశము


పరీక్షించబడెను, నిరూపించబడెను, మరియు మెరుగుపెట్టబడెను

మన శ్రమలందు మన నిబంధనలకు మనము విశ్వాసపాత్రులమని నిరూపించుకొన్నప్పుడు కలిగే గొప్ప దీవెన, మన స్వభావాలలో మార్పు.

నా ప్రియమైన సహోదర, సహోదరిలారా, ఈరోజు నేను మీతో మాట్లాడుటకు కృతజ్ఞత కలిగియున్నాను. జీవితం ప్రత్యేకంగా కష్టమైనదిగా, అస్థిరమైనదిగా ఉన్నప్పుడు, ప్రోత్సాహమివ్వాలని నేనాశిస్తున్నాను. మీలో కొందరు ఇప్పుడు కష్టమును, అస్థిరతను అనుభవిస్తున్నారు. లేని యెడల, అవి భవిష్యత్తులో వస్తాయి.

అది నిరాశజనకమైనది కాదు. అది వాస్తవమైనది—అయినప్పటికినీ ఈ లోకమును సృష్టించుటలో దేవుని యొక్క ఉద్దేశ్యము వలన అది ఆశాజనకమైనది. ఆ ఉద్దేశమేదనగా, అది కష్టమైనప్పుడు సరైన దానిని ఎంపిక చేయుటకు వారు సమర్ధులను, సమ్మతి కలిగియున్నారని నిరూపించుకొనుటకు ఆయన పిల్లలకు అవకాశమిచ్చుట. ఆవిధంగా చేయడం వలన వారి స్వభావాలు మార్చబడతాయి మరియు వారు ఆయనవలె ఎక్కువగా మారతారు. దానికి ఆయనయందు స్థిరమైన విశ్వాసము అవసరమని ఆయన ఎరుగును.

నాకు తెలిసిన దానిలో అధికము నా కుటుంబము నుండి వచ్చింది. నాకు ఎనిమిది సంవత్సరాల వయస్సు కలిగియున్నప్పుడు, నా తెలివైన తల్లి మా కుటుంబపు పెరటి తోటలో కలుపు మొక్కలు తీయమని మా అన్నను, నన్ను అడిగింది. ఇప్పుడు అది సులువైన పనిగా కనబడుతుంది, కానీ మేము న్యూ జెర్సీలో నివసించాము. తరచుగా వర్షం కురిసేది. అది బలమైన బంకమట్టి నేల. కలుపు మొక్కలు కూరగాయల కంటె వేగంగా ఎదుగుతాయి.

వేర్లు బంకమట్టిలో స్థిరంగా నాటబడినందు వల్ల, నా చేతిలో కలుపు మొక్క విరిగినప్పుడు నేను విసుగుచెందుట నాకు జ్ఞాపకమున్నది. అమ్మ, అన్నయ్య వారి వరుసలో చాలా ముందున్నారు. నేను ఎంత గట్టిగా ప్రయత్నిస్తే అంత ఎక్కువగా వెనుకబడ్డాను.

“ఇది చాలా కష్టము!” నేను గట్టిగా చెప్పాను.

సానుభూతి చూపించడానికి బదులుగా, మా అమ్మ చిరునవ్వు నవ్వి అన్నది, “ఓహ్, హాల్, అవును, అది కష్టమైనది.” అది ఆవిధంగా ఉండాల్సియున్నది. జీవితము ఒక పరీక్ష.”

ఆ క్షణములో, ఆమె మాటలు సత్యమని, నా భవిష్యత్తులో సత్యముగా ఉండుట కొనసాగుతాయని నేను ఎరుగుదును.

సంవత్సరాల తరువాత పరలోక తండ్రి మరియు ఆయన ప్రియమైన కుమారుడు ఈ లోకమును సృష్టించి, ఆత్మ బిడ్డలకు మర్త్య జీవిత అవకాశాన్ని ఇచ్చుటకు గల వారి ఉద్దేశమును గూర్చి మాట్లాడుట చదివినప్పుడు, అమ్మ యొక్క ప్రేమగల చిరునవ్వుకు కారణము స్పష్టమైంది.

“వారి దేవుడైన ప్రభువు వారికి ఆజ్ఞాపించిన సంగతులన్నిటిని వారు గైకొందురో లేదోనని మనము వారిని పరీక్షించెదము;

“మరియు ఎవరైతే వారి మొదటి స్థితిని కాపాడుకుంటారో వారు వృద్ధి చేయబడతారు; మరియు తమ మొదటి స్థితిని కాపాడుకోలేని వారు, వారి మొదటి స్థితిని కాపాడుకొనిన వారితో అదే రాజ్యములో మహిమ కలిగియుండరు; మరియు ఎవరైతే వారి రెండవ స్థితిని కాపాడుకుంటారో వారికి మహిమ వారి తలలపై ఎప్పటికీ, శాశ్వతంగా చేర్చబడుతుందని దేవుడు చెప్పాడు.”1

మీరు నేను, మన పరలోక తండ్రి యొక్క సమక్షములో ఇక లేనప్పుడు పరీక్షించబడుటకు మరియు దేవుని ఆజ్ఞలు పాటించుటకు మనము ఎన్నుకుంటామని నిరూపించుటకు ఆహ్వానమును అంగీకరించాము.

మన పరలోక తండ్రి అటువంటి ప్రేమగల ఆహ్వానము ఇచ్చినప్పటికి, ఆత్మ బిడ్డలలో మూడవ వంతు మందిని తనను అనుసరించమని, మన వృద్ధికి మరియు నిత్య సంతోషము కొరకు తండ్రి యొక్క ప్రణాళికను తిరస్కరించమని లూసిఫరు ఒప్పించాడు. సాతాను యొక్క తిరుగుబాటు వలన, అతడు తన అనుచరులతో బయటకు త్రోసివేయబడ్డాడు. ఇప్పుడు, ఈ మర్త్య జీవితమందు దేవుని నుండి తొలగిపోవునట్లు అతడికి సాధ్యమైనంత మందిని ప్రయత్నిస్తాడు.

మనలో ప్రణాళికను అంగీకరించిన వారు మన రక్షకుడు మరియు విమోచకునిగా ఉంటానని అడిగిన యేసు క్రీస్తునందు మన విశ్వాసము వలన ఆవిధంగా చేసాము. మనము ఏ మర్త్య బలహీనతలను కలిగియున్నప్పటికినీ, ఏ చెడ్డ శక్తులు మనకు వ్యతిరేకించినప్పటికినీ, మేలు చేసే శక్తులు మిక్కిలి గొప్పవని అప్పుడు మనము నమ్మియుండవచ్చు.

పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు మిమ్మల్ని ఎరిగియున్నారు, మిమ్మల్నిప్రేమిస్తున్నారు. మీరు వారివద్దకు తిరిగి వెళ్లి, ఆయనవలె కావాలని కోరుతున్నారు. మీ విజయము, వారి విజయము. ఈ మాటలు మీరు చదివిన లేక వినినప్పుడు పరిశుద్ధాత్మ చేత నిర్ధారించుటను మీరు భావించారు: “ఏలయనగా నరునికి అమర్త్యత్వమును, నిత్యజీవమును ఇచ్చుటయే నా కార్యమును మహిమయైయున్నది.”2

దేవుడు మన మార్గమును సులువుగా చేయడానికి శక్తిని కలిగియున్నాడు. వాగ్దాన దేశమునకు సంచరిస్తుండగా ఆయన ఇశ్రాయేలీయులకు మన్నాతో పోషించెను. ప్రభువు తన మర్త్య పరిచర్యలో రోగులను స్వస్థపరిచాడు, చనిపోయినవారిని లేవనెత్తాడు మరియు సముద్రాన్ని శాంతింపజేశాడు. ఆయన పునరుత్థానము తరువాత, ఆయన “బంధింపబడిన వారి చెరసాలను తెరిచాడు.”3

అయినప్పటికినీ ఆయన ప్రవక్తలో మిక్కిలి గొప్పవారిలో ఒకడైన ప్రవక్త జోసెఫ్ స్మిత్, చెరసాలో బాధపడెను మరియు మన పునరావృతమయ్యే పరీక్షలలో మనందరికీ ఉపయోగపడి, అవసరమైన పాఠమును బోధించాడు: “గోతిలో నీవు పడద్రోయబడినను, లేక నరహత్య చేయువారి చేతులలోనికి అప్పగించబడి మరణదండన నీకు విధించబడినను; అగాధములోనికి నీవు పడద్రోయబడినను; ఎగిసిపడే అలలు నీకు విరోధముగా కుట్రపన్నినను; బలమైన గాలులు నీకు శత్రువుగా మారినను; ఆకాశము నల్లగా మారి, నీ మార్గమును అడ్డగించుటకు పంచభూతములు కలిసిపోయినను; అన్నిటికన్నా, నరకపు దవడలు నీ కొరకు నోటిని విశాలముగా తెరచినను, నా కుమారుడా, ఇవన్నియు నీకు అనుభవమునిచ్చుటకు నీ మేలుకొరకేనని తెలుసుకొనుము.”4

ప్రేమగల మరియు సర్వ శక్తిమంతుడైన దేవుడు మన మర్త్య పరీక్షలు అంత కఠినంగా ఎందుకు అనుమతించాడో మీరు సహేతుకంగా ఆశ్చర్యపోవచ్చు. అది ఎందుకనగా కుటుంబాలతో శాశ్వతంగా ఆయన సమక్షములో జీవించగలుగుటకు మనము ఆత్మీయగా పరిశుద్ధంగా, ఆత్మీయంగా బలముగా ఉండుటలో మనము వృద్ది చెందాలని ఆయన ఎరుగును. దానిని సాధ్యపరచుటకు, పరలోక తండ్రి మనకు ఒక రక్షకుడిని, ఆయన ఆజ్ఞలను పాటించుటకు, పశ్చాత్తాపపడుటకు మనకై మనం ఎంపిక చేసే శక్తిని మనకిచ్చారు మరియు ఆవిధంగా త్వరలో ఆయన వద్దకు తిరిగి వెళ్లగలము.

తండ్రి యొక్క సంతోషపు ప్రణాళిక ఆయన ప్రియమైన కుమారుడైన, యేసు క్రీస్తువలె ఎప్పటికీ మారుటను దానికి కేంద్రముగా కలిగియున్నది. అన్ని విషయాలందు, రక్షకుని యొక్క మాదిరి మన శ్రేష్టమైన మార్గదర్శి. తనను తాను నిరూపించుకొనే అవసరత నుండి ఆయన మినహాయించబడలేదు. మన సమస్త పాపముల కొరకు వెల చెల్లిస్తూ, పరలోక తండ్రి యొక్క పిల్లలందరి కొరకు సహించాడు. మర్త్యత్వములోనికి వచ్చిన వారిని మరియు రాబోవు వారందరి బాధను ఆయన అనుభవించాడు.

మీరు ఎంత బాధను బాగా సహించగలరని మీరు ఆశ్చర్యపడినప్పుడు, ఆయనను జ్ఞాపకముంచుకొనండి. మీరు బాధపడే దానిని ఆయన బాధపడ్డాడు ఆవిధంగా మిమ్మల్ని ఎలా పైకెత్తాలో ఆయన ఎరుగును. ఆయన భారమును తీయకపోవచ్చు, కానీ ఆయన మీకు బలమును, ఓదార్పును, మరియు నిరీక్షణను ఇస్తాడు. ఆయన మార్గమును ఎరుగును. ఆయన చేదు పాత్రను త్రాగాడు. ఆయన అందరి బాధను సహించాడు.

మీరు ఎదుర్కొనే పరీక్షలు ఏవైనప్పటికినీ మీకు ఎలా సహాయపడాలో ఎరిగిన ప్రేమగల రక్షకుని చేత మీరు పోషించబడ్డారు మరియు ఓదార్చబడ్డారు. ఆల్మా బోధించాడు:

“మరియు ఆయన ప్రతిరకమైన బాధలు, శ్రమలు మరియు శోధనలు అనుభవించుచూ ముందుకు వెళ్లును. మరియు ఇది తన జనుల యొక్క బాధలు మరియు రోగములను ఆయన తనపైన తీసుకొనును అని చెప్పిన వాక్యము నెరవేరుటకు.

“మరియు ఆయన జనులను కట్టి ఉంచు మరణ బంధకములను ఆయన వదులు చేయునట్లు ఆయన మరణమును తనపైన తీసుకొనును. మరియు శరీరమును బట్టి ఆయన ప్రేగులు కనికరముతో నిండవలెనని, వారి యొక్క బలహీనతలను బట్టి, తన జనులను ఎట్లు ఆదరించవలెనో శరీరమును బట్టి ఆయన ఎరుగునట్లు, ఆయన వారి యొక్క బలహీనతలను తన పైన తీసుకొనును.“5

ఆయన మీకు సహాయపడే ఒక విధానము ఆయనను ఎల్లప్పుడు జ్ఞాపకముంచుకొనుటకు మరియు ఆయన వద్దకు రమ్మని మిమ్మల్ని ఆహ్వానించుట. ఆయన మనల్ని ప్రోత్సహిస్తున్నడు:

“ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును.

“నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నా యొద్ద నేర్చుకొనుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును.”6

ఆయన వద్దకు వచ్చుటకు మార్గము, ఆయన వాక్యమును విందారగించుట, పశ్చాత్తాపపడి విశ్వాసమును సాధన చేయుట, ఆయన అధికారమివ్వబడిన సేవకుని చేత బాప్తీస్మము పొంది, నిర్ధారించబడుటకు ఎంపిక చేయుట, మరియు తరువాత దేవునితో మీ నిబంధనలను పాటించుట. ఆయన పరిశుద్ధాత్మను మీ సహవాసిగా, ఆదరణకర్తగా, మరియు మార్గదర్శిగా ఉండుటకు పంపాడు.

పరిశుద్ధాత్మ యొక్క వరముకు యోగ్యతగా మీరు జీవించినప్పుడు, మీరు మార్గమును చూడనప్పుడు కూడ ప్రభువు మిమ్మల్ని క్షేమమునకు నడిపించగలడు. నాకైతే, ఆయన చాలా తరచుగా తీసుకోవాల్సిన తదుపరి లేక రెండో మెట్టు చూపించాడు. ఆయన అరుదుగా నాకు సుదూర భవిష్యత్తు గురించి ఒక పాక్షిక జ్ఞానమును ఇచ్చాడు, కాని ఆ అరుదైన జ్ఞానము కూడా నేను రోజువారీ జీవితంలో దేనిని ఎంపిక చేయాలో నడిపిస్తుంది.

ప్రభువు వివరించాడు:

“ఇకపై రాబోయే విషయాల గురించి మీ దేవుని రూపకల్పన, మరియు మిక్కిలి శ్రమ తరువాత … అనుసరించే కీర్తి గురించి ప్రస్తుత సమయానికి, మీరు మీ సహజ కళ్ళతో చూడలేరు.

“అత్యధిక శ్రమ తరువాత దీవెనలు కలుగుతాయి.”7

మన శ్రమలందు మన నిబంధనలకు మనము విశ్వాసపాత్రులమని నిరూపించుకొన్నప్పుడు కలిగే గొప్ప దీవెన, మన స్వభావాలలో మార్పు. మన నిబంధనలను పాటించుటకు మనము ఎంపిక చేయుట ద్వారా, యేసు క్రీస్తు యొక్క శక్తి మరియు ఆయన ప్రాయశ్చిత్తము యొక్క దీవెనలు మనలో పని చేస్తాయి. ప్రేమించుటకు, క్షమించుటకు, మరియు రక్షకుని వద్దకు వచ్చుటకు ఇతరులను ఆహ్వానించుటకు మన హృదయాలు మృదువుగా చేయబడతాయి. ప్రభువుయందు మన విశ్వాసము వృద్ధి చెందుతుంది. మన భయాలు తగ్గించబడతాయి.

ఇప్పుడు, శ్రమ ద్వారా వాగ్దానము చేయబడిన అటువంటి దీవెనలతో కూడ, తెలివిగా మనము శ్రమను కోరుకొనము. మర్త్య జీవితపు అనుభవములో, మనల్ని మనం నిరూపించుకొనుటకు, ఎప్పటికీ రక్షకుడు మరియు మన పరలోక తండ్రి వలె అగుటకు అవసరమైన పరీక్షలలో సఫలమగుటకు మనం తగినన్ని అవకాశాలను కలిగియుంటాము.

అదనముగా, మనము తప్పనిసరిగా ఇతరుల శ్రమను గుర్తించి, సహాయపడటానికి ప్రయత్నించాలి. మనము తీవ్రంగా పరీక్షించబడినప్పుడు అది ప్రత్యేకంగా కష్టమైనది. కాని మనము మరొకరి భారమును, కొంచమైనా కూడ పైకెత్తినప్పుడు, మన నడుములు బలపరచబడినట్లు, మరియు మనము చీకటిలో ఒక వెలుగును గ్రహించుటను కనుగొంటాము.

దీనిలో, ప్రభువు మన మార్గదర్శి. గొల్గొతాలో కల్వరి సిలువపై, ఆయన దేవుని అద్వితీయ కుమారుడు కాకపోతే ఆయన చనిపోయేంత మిక్కిలి గొప్ప బాధను అప్పటికే అనుభవిస్తూ, ఆయన తనను శిక్షించిన వారిని చూసి, ఆయన తండ్రితో చెప్పాడు, “తండ్రీ వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము.”8 ఎప్పటికీ జీవించిన ప్రతీఒక్కరికి కొరకు బాధపడుతూ, ఆయన సిలువపై నుండి యోహానును, దుఃఖిస్తున్న ఆయన స్వంత తల్లిని చూసాడు మరియు ఆమె శ్రమయందు ఆమెకు పరిచర్య చేసాడు:

“యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి అమ్మా, యిదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను!

“తరువాత ఆయన శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పెను! ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన యింట చేర్చుకొనెను.”9

అత్యంత పరిశుద్ధమైన దినాలలో ఆయన క్రియల ద్వారా, ఈ జీవితంలో మాత్రమే కాదు కానీ రాబోయే సమయంలో నిత్యజీవితంలో సహాయము అందిస్తూ ఆయన మనలో ప్రతిఒక్కరికి స్వచ్ఛంధంగా తన ప్రాణమును ఇచ్చాడు.

భయంకరమైన శ్రమలందు విశ్వాసపాత్రులుగా ఉండుటను నిరూపించుకొనుట ద్వారా గొప్ప ఉన్నతస్థాయిలకు వెళ్లిన జనులను నేను చూసాను. ఈరోజు సంఘమంతటా మాదిరులున్నాయి. ప్రతికూలత ద్వారా జనులు వినయంగా చేయబడతారు. వారు విశ్వాసంగా సహించుట మరియు కృషి ద్వారా, వారు రక్షకుడు మరియు మన పరలోక తండ్రిలాగా ఎక్కువగా మారుతున్నారు.

మా అమ్మ నుండి నేను మరొక పాఠము నేర్చుకున్నాను. ఒక బాలికగా ఆమెకు డిఫ్తీరియా వచ్చింది మరియు దాదాపు చనిపోబోయింది. తరువాత ఆమెకు వెన్నుముక, నాడీమండల రోగము కలిగింది. ఆమె తండ్రి చిన్న వయస్సులో చనిపోయాడు, కనుక మా అమ్మ, ఆమె సహోదరులు వారి తల్లికి చేయూత నివ్వడానికి సహాయపడ్డారు.

ఆమె జీవితకాలమంతా, ఆమె అనారోగ్య శ్రమలు మరియు ఆర్ధిక చింతల ప్రభావాన్ని అనుభవించింది. ఆమె తన 10 సంవత్సరాల జీవితంలో, ఆమెకు బహుళ శస్త్రచికిత్సలు అవసరమైనవి. అన్నిటి ద్వారా, ఆమె మంచముపై ఉన్నప్పుడు కూడా, ప్రభువుకు విశ్వాసపాత్రురాలిగా నిరూపించింది. ఆమె పడకగదిలోని ఒకేఒక చిత్రము రక్షకునిదని నాకు జ్ఞాపకమున్నది. తన పడకపై ఆమె చనిపోవుటకు ముందు చెప్పిన ఆఖరి మాటలు ఇవే: “హాల్, నీ స్వరము నీకు జలుబు చేసినట్లుగా ఉంది.” నీ ఆరోగ్యం జాగ్రత్త.”

ఆమె అంత్యక్రియల వద్ద, చివరి ప్రసంగీకులు, ఎల్డర్ స్పెన్సర్ డబ్ల్యు. కింబల్. ఆమె శ్రమలు, ఆమె విశ్వాసము గురించి మాట్లాడుతూ, ఆయన తప్పనిసరిగా ఇది చెప్పాడు: “మిల్‌డ్రెడ్ అంతకాలము, అంత ఎక్కువగా ఎందుకు బాధపడిందని మీలో కొందరు ఆశ్చర్యపడవచ్చు. ఎందుకో నేను మీకు చెప్తాను. ఎందుకనగా ప్రభువు ఆమెను కాస్త ఎక్కువ మెరుగుపెట్టాలని కోరాడు.”

యేసు క్రీస్తు యొక్క సంఘములో విశ్వాసపాత్రులైన సభ్యులలో అనేకులు, ప్రభువు వారిని కాస్త ఎక్కువ మెరుగుపెట్టడానికి కోరినప్పుడు స్థిరమైన విశ్వాసముతో భారములను భరించిన వారు మరియు ఇతరులు తమవి భరించుటకు సహాయపడిన వారి కొరకు నేను నా కృతజ్ఞతను వ్యక్తపరుస్తున్నాను. వారు, వారి కుటుంబాలు అటువంటి మెరుగుపెట్టుటను సహిస్తుండగా, ప్రపంచమంతటా ఇతరులకు సేవ చేయు సంరక్షకులు మరియు నాయకుల కొరకు కూడా నేను ప్రేమను, ప్రశంసను తెలియజేస్తున్నాను.

మనము పరలోక తండ్రి యొక్క పిల్లలము, ఆయన మనల్ని ప్రేమిస్తున్నారని నేను సాక్ష్యమిస్తున్నాను. అందరి కొరకు అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ యొక్క ప్రేమను నేను అనుభవించాను. ఆయన నేడు ప్రపంచంలో ప్రభువు యొక్క ప్రవక్త. ఆవిధంగా నేను ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.