లేఖనములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 120


120వ ప్రకరణము

దీనికి ముందు బయల్పాటైన 119వ ప్రకరణములో చెప్పబడిన దశమభాగముగా ఇవ్వబడిన ఆస్థులను ఏమి చేయవలనో తెలుపుచు 1838, జులై 8న ఫార్‌వెస్ట్, మిస్సోరిలో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ద్వారా ఇవ్వబడిన బయల్పాటు.

1 నిశ్చయముగా ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నా సంఘ ప్రథమ అధ్యక్షత్వము, బిషప్పు, అతని సలహామండలి, నా ఉన్నత సలహామండలితో ఏర్పరచబడిన ఒక సలహామండలిచేత అది ఉపయోగించబడవలెను; నా వారితో నేను పలికిన మాటల వలన అది జరుగవలెను. అలాగే జరుగును గాక. ఆమేన్.