సర్వసభ్య సమావేశము
రక్షకుని విధానములో బోధించుట
2021 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


రక్షకుని విధానములో బోధించుట

బోధకుని మాదిరిని అనుసరించడానికి మరియు ఆయన వలె బోధించడానికి ఏదైనా చేయాల్సిన బాధ్యత మనలో ప్రతిఒక్కరికి ఉన్నది.

అసాధారణమైన బోధకులు

కొన్ని నెలల క్రితం, నా స్వస్థలమైన నెవాడాలోని ఓవర్టన్ నుండి మునుపటి తరగతి సహవాసి, మా ప్రియమైన శిశుపాఠశాల ఉపాధ్యాయురాలి కోసం ఒక క్రిస్మస్ బహుమతి కలిసి ఇద్దామని సూచించాడు, ఆమె ఇటీవల 98వ పుట్టినరోజు జరుపుకున్నది. మేము దయ కలిగియుండాలని, మంచి విశ్రాంతి, పాలు, అల్పాహారము వలన కలిగే సంతోషము మరియు ఒకరినొకరు ప్రేమించుట యొక్క ప్రాముఖ్యతను ఆమె మాకు బోధించింది. అటువంటి అద్భుతమైన బోధకురాలిగా ఉన్నందుకు, సహోదరి డేవిస్ మీకు ధన్యవాదాలు.

చిత్రం
సహోదరి డేవిస్

అనేక సంవత్సరాల క్రితం రిక్స్ కళాశాలకు హాజరగుతుండగా నాకు మరొక అసాధారణమైన బోధకుడున్నాడు. నేను మిషను సేవ చేయడానికి సిద్ధపడుతున్నాను మరియు ఒక మిషనరీ సిద్ధపాటు తరగతికి హాజరగుట సహాయకరంగా ఉంటుందని అనుకున్నాను. నేను అనుభూతి చెందినది నా జీవితాన్ని మార్చివేసింది.

తరగతి యొక్క మొదటి రోజు నుండి నేను ఒక ప్రవీణుడైన బోధకుని సమక్షములో ఉన్నానని గ్రహించాను. ఆ బోధకుడు సహోదరుడు ఎఫ్. మాల్విన్ హమ్మాండ్. సహోదరుడు హమ్మాండ్ ప్రభువును ప్రేమించాడని, మరియు నన్ను ప్రేమించాడని నేను ఎరుగుదును. దానిని నేను అతని ముఖములో చూసాను, దానిని అతడి స్వరములో విన్నాను. అతడు బోధించినప్పుడు, ఆత్మ నా మనస్సుకు జ్ఞానవృద్ధి కలిగించింది. అతడు సిద్ధాంతమును బోధించాడు, కానీ అతడు నా స్వంతంగా దానిని నేను నేర్చుకోవాలని కూడా ఆహ్వానించాడు. ప్రభువు యొక్క సిద్ధాంతాన్ని నాకై నేను నేర్చుకోవాలనే నా బాధ్యతను స్పష్టంగా చూడటానికి ఆ ఆహ్వానము నాకు సహాయపడింది. ఆ అనుభవము నన్ను శాశ్వతంగా మార్చివేసింది. రక్షకుని విధానములో బోధించినందుకు మీకు ధన్యవాదాలు, సహోదరుడు హమ్మాండ్.

సహోదర సహోదరీలారా, ప్రతిఒక్కరు గృహములో, సంఘములో ఇటువంటి నేర్చుకొనే అనుభవాన్ని కలిగియుండటానికి అర్హులు.

రండి, నన్ను అనుసరించండి ఉపోద్ఘాతములో క్రీస్తు వంటి బోధన దేనిని నెరవేర్చగలదో ఒక దర్శనాన్ని ఇస్తుంది. “యేసు క్రీస్తు పట్ల మన పరివర్తనను లోతుగా చేసి, ఆయన వలె ఎక్కువగా కావడానికి మనకు సహాయపడడమే సమస్త సువార్త అభ్యాసము మరియు బోధన యొక్క లక్ష్యము” అని అది తెలుపుతుంది … మన విశ్వాసాన్ని బలపరచి, పరివర్తన యొక్క అద్భుతానికి నడిపించే ఆ రకమైన సువార్త అభ్యాసమంతా ఒకేసారి జరగదు. ఇది తరగతి గదిని మించి వ్యక్తి యొక్క హృదయము మరియు గృహములోనికి వ్యాపిస్తుంది.”1

ప్రాచీన అమెరికాలో రక్షకుని యొక్క పరిచర్య చాలా ప్రభావవంతమైనది మరియు విస్తృతమైనదని లేఖనాలు సూచిస్తున్నాయి, ఆవిధంగా, “నీఫైయులు మరియు లేమనీయులు ఇరువురు దేశము యొక్క ముఖమంతటా జనులందరు ప్రభువుకు పరివర్తన పొందిరి, మరియు వారి మధ్య ఏ వివాదములు మరియు తగవులు లేకుండెను, మరియు ప్రతి మనుష్యుడు ఒకనితోనొకడు న్యాయముగా వ్యవహరించెను.”2

మన బోధన మనము ప్రేమించు వారిపై అదేవిధమైన ప్రభావమును ఎలా కలిగియుండగలదు? రక్షకుని వలె ఎక్కువగా మనము ఎలా బోధించగలము మరియు ఇతరులు ఎక్కువ లోతుగా పరివర్తన చెందడానికి సహాయపడగలము? మీకు కొన్ని సూచనలు నన్ను ఇవ్వనివ్వండి.

రక్షకుడిని అనుకరించండి.

తరువాత అత్యంత ప్రధానమైనది, తానే ప్రవీణుడైన బోధకుని గురించి మీకు సాధ్యమైన సమస్తమును నేర్చుకోవడానికి మీరు బాధ్యత వహించండి. ఇతరులకు ప్రేమను ఆయన ఎలా చూపించాడు? ఆయన బోధించినప్పుడు వారు ఎలా భావించారు? ఆయన ఏమి బోధించాడు? ఆయన బోధించిన వారి నుండి ఆయన ఆశించినవి ఏమిటి? ఇటువంటి ప్రశ్నలు మీరు పరిశోధించిన తరువాత, ఆయన వలె ఎక్కువగా ఉండటానికి మీరు బోధించే విధానాన్ని సరిచేసుకోండి.

సువార్త గ్రంథాలయ యాప్‌లో మరియు ChurchofJesusChrist.org లో అనేక బోధనా వనరులను సంఘము అందిస్తున్నది. అటువంటి ఒక వనరు రక్షకుని విధానములో బోధించుట అని పేరు పెట్టబడింది. దాని ప్రతి మాటను చదివి, అధ్యయనము చేయమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మీ బోధనలో క్రీస్తువలె ఎక్కువగా ఉండటానికి మీ ప్రయత్నాలందు దాని సూత్రములు మీకు సహాయపడతాయి.

కుటుంబాల శక్తిని పూర్తిగా పని చేయనివ్వండి.

కొన్ని నెలల క్రితం ఒక ప్రియమైన స్నేహితుడిని సందర్శించడానికి నేను ఆగినప్పుడు, నాకు కలిగిన అనుభవముతో నా తదుపరి సూచన వివరించబడుతుంది. అతడి భార్య, వెనుక ఎవరితోనో మాట్లాడటం నేను వినగలిగాను, అతడు తన కుటుంబంతో ఉండగలుగునట్లు నేను త్వరగా బయటకు వచ్చేసాను.

ఇంచు మించు ఒక గంట తరువాత ఆయన భార్య నుండి నాకు ఈ సందేశం వచ్చింది: సహోదరుడు న్యూమాన్, మా ఇంటికి వచ్చినందుకు ధన్యవాదాలు. మేము మిమ్మల్ని లోపలికి ఆహ్వానించేవారము, కానీ మేము అప్పుడు ఏమి చేస్తున్నామో మీకు తెలపాలని నేను కోరుతున్నాను. మహమ్మారి వచ్చినప్పటినుండి మేము ప్రతి ఆదివారము జూమ్‌లో మా పెద్ద పిల్లలతో రండి నన్ను అనుసరించుడి చర్చిస్తున్నాము. అది వాస్తవంగా అద్భుతాలను చేస్తున్నది. మా కూతురు మొదటిసారి స్వంతంగా మోర్మన్ గ్రంథాన్ని చదివిందని నేను అనుకుంటున్నాను. ఈ రోజు మోర్మన్ గ్రంథములో చివరి పాఠము మరియు మీరు వచ్చినప్పుడు దానిని మేము పూర్తి చేస్తున్నాము. … రండి నన్ను అనుసరించండి, జూమ్ మరియు ఒక మహమ్మారి సరైన సమయంలో ఒక హృదయాన్ని మార్చుకోవడానికి అవకాశాన్ని ఎలా ఇచ్చిందో వినడానికి మీకు ఆసక్తి కలిగిస్తుందని నేను అనుకున్నాను. … ఈ విషమ సమయమందు అనేక చిన్న అద్భుతాలు ఎలా జరుగుతున్నాయో నేను ఆశ్చర్యపడినట్లు చేసాయి.

2018 అక్టోబరులో అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ చేసిన వాగ్దానము యొక్క నెరవేర్పు వలె ఇది నాకు వినిపిస్తున్నది. గృహ-కేంద్రీకృత, సంఘ-సహకార సువార్త అభ్యాసము ప్రతీ కుటుంబము వారి గృహాన్ని విశ్వాసము యొక్క పవిత్ర స్థలముగా మార్చుకోవడానికి న్యాయముగా మరియు జాగ్రత్తగా అనుసరించినప్పుడు, “కుటుంబాల యొక్క శక్తిని పూర్తిగా ఉపయోగించే సాధ్యతను కలిగియున్నాయని ఆయన అన్నారు. సువార్త అభ్యాసానికి కేంద్రంగా మీరు మీ ఇంటిని మార్చడానికి శ్రద్ధగా పని చేసినప్పుడు, కొంతకాలానికి మీ విశ్రాంతి దినములు నిజంగా సంతోషభరితమవుతాయని నేను వాగ్దానమిస్తున్నాను. మీ పిల్లలు రక్షకుని బోధనలు నేర్చుకోవడానికి మరియు జీవించడానికి ఉత్సాహపడతారు. … మీ కుటుంబములో మార్పులు నాటకరీతిగా, బలపరచేవిగా ఉంటాయి.”3 ఇది ఎంత మహిమకరమైన వాగ్దానం!

నిజంగా జీవితం మారాలంటే, యేసు క్రీస్తుకు పరివర్తన చెందడం మన పూర్ణాత్మతో జరగాలి మరియు మన జీవితంలోని ప్రతి అంశానికి విస్తరించాలి. అందుకే అది మన జీవితాలు—మన కుటుంబాలు, మరియు గృహాల యొక్క కేంద్రముగా దృష్టిసారించాలి.

ఆ మార్పు వ్యక్తిగతమైనదని జ్ఞాపకముంచుకోండి

పరివర్తన అంతరంగములో నుండి తప్పక రావాలని జ్ఞాపకముంచుకోవాలని నా చివరి సూచన. పదిమంది కన్యకల ఉపమానములో వివరించబడినట్లుగా, మన మార్పు యొక్క నూనెను, మనము ఇవ్వాలని కోరినట్లుగా వేరొకరి ఇవ్వలేము. డేవిడ్ ఎ. బెడ్నార్ బోధించినట్లుగా: “ఈ ప్రశస్తమైన నూనె ఒక్కొక్కసారి ఒక్క బిందువుగా … ఓపికగా, పట్టుదలగా సంపాదించబడవలెను. ఏ దగ్గరదారి లభ్యముగా లేదు; చివరి నిముషములో హాడావుడిగా సిద్ధపడుట సాధ్యము కాదు.”4

రండి, నన్ను అనుసరించండి ఆ సత్యముపై ఆధాపడియున్నది. “చూడు!”5 అని చెప్పుట ద్వారా యేసు క్రీస్తు గురించి నీఫై నేర్చుకోవడానికి సహాయపడిన దేవదూతతో దానిని నేను పోలుస్తాను. ఆ దేవదూత వలె, రండి, నన్ను అనుసరించండి రక్షకుని కనుగొని, ఆయనను ఆలకించడానికి బదులుగా లేఖనాలలో, ఆధునిక ప్రవక్తల మాటలలో చూడమని, మనల్ని ఆహ్వానిస్తాయి. నీఫై వలె, మనము దేవుని వాక్యమును చదువుతూ, ధ్యానిస్తుండగా ఆత్మ చేత వ్యక్తిగతంగా బోధింపబడతాము. రండి, నన్ను అనుసరించండి క్రీస్తు యొక్క సిద్ధాంతమును సమగ్రంగా అధ్యయనము చేయడానికి మనలో ప్రతిఒక్కరికి సహాయపడుతుంది.

ఒక తల్లిదండ్రుల యొక్క బాధ్యత అనేక విధాలుగా అదేవిధంగా ఉన్నది. పిల్లలు వారి తల్లిదండ్రుల నుండి అనేక విషయాలను వారసత్వంగా పొందుతారు, కానీ సాక్ష్యము వాటిలో ఒకటి కాదు. ఒక విత్తనము మొలకెత్తడాన్ని మనం చేయలేనట్లుగానే మన పిల్లలకు ఒక సాక్ష్యాన్ని మనము ఇవ్వలేము. కానీ మంచి నేలతో, ముండ్లులేని పోషణనిచ్చే వాతావరణమును మనము అందించగలము. మనము ఆదర్శమైన పరిస్థితులను కల్పించడానికి ప్రయాసపడగలము ఆవిధంగా మన పిల్లలు—మరియు మనము ప్రేమించే ఇతరులు—విత్తనము కోసం స్థలము కనుగొనగలరు, “వాక్యమును [విని], మనము దానిని [గ్రహించి],”6 “[ఆ విత్తనము] మంచిదని”7 వారికై వారు కనుగొనగలరు.

చిత్రం
సహోదరుడు న్యూమాన్ మరియు అతని కుమారుడు జాక్

కొన్ని సంవత్సరాల క్రితం, మా కొడుకు జాక్ మరియు నాకు స్కాట్లాండ్‌‌లోని సెయింట్ ఆండ్రూస్‌లో గోల్ఫ్ ఓల్డ్ కోర్స్ ఆట ఆడే అవకాశము కలిగింది, అక్కడే గోల్ఫ్ క్రీడ ప్రారంభమైంది. అది అద్భుతమైనది! నేను తిరిగి వచ్చిన తరువాత ఆ అనుభవము యొక్క పరిమాణమును ఇతరులకు చెప్పటానికి ప్రయత్నించాను. కానీ నేను చెప్పలేకపోయాను. ఫోటోలు, వీడియోలు, మరియు నా శ్రేష్టమైన వర్ణనలు పూర్తిగా సరిపోలేదు. సెయింట్ ఆండ్రూస్ యొక్క గొప్పతనాన్ని ఎవరైనా తెలుసుకోవటానికి ఉన్న ఏకైక మార్గం దానిని అనుభూతి చెందుట అని చివరికి నేను గ్రహించాను—విస్తారమైన ఫెయిర్‌వేలు (ఫెయిర్‌వేస్ అంటే ఆటగాడు మొదట గోల్ఫ్ బంతిని తాకిన ప్రదేశం మరియు ఆకుపచ్చ రంగు (ఆటగాడు బంతిని కొట్టడానికి ప్రయత్నిస్తున్న రంధ్రం చుట్టూ ఉన్న ప్రాంతం)) మధ్య ఉన్న ప్రాంతాన్ని చూచుట, గాలిని పీల్చుకొనుట, వారి ముఖము మీద గాలిని అనుభవించుట, మరియు కొన్ని తప్పు షాట్లను గోల్ఫ్ బంతిని ఉద్దేశించిన విధంగా వెళ్ళని విధంగా సాధారణంగా ఇసుకతో నిండిన గోల్ఫ్ కోర్సు మైదానంలో గుంటలలోనికి, దట్టమైన, ఉలెక్సి జాతి మొక్కల పొదలలోనికి కొట్టడం వంటివి, దానిని మేము గొప్ప ప్రయత్నముతో చేసాము.

దేవుని వాక్యము ఆవిధంగా ఉన్నది. మనము దానిని బోధించగలము, దానిని ప్రకటించగలము, మనము దానిని వివరించగలము. దాని గురించి మనము మాట్లాడగలము, దానిని వర్ణించగలము, మనము దాని గురించి సాక్ష్యము కూడా ఇవ్వగలము. కానీ దేవుని యొక్క పరిశుద్ధ వాక్యము ఆత్మ యొక్క శక్తి ద్వారా పరలోకము నుండి మంచు బిందువుల వలె 8 అతడు లేక ఆమె పైకి పడుట అనుభూతి చెందేంతవరకు, అది పోస్టుకార్డు లేక వేరొకరి యొక్క సెలవు దిన ఫోటోలను చూడటం వలె ఉంటుంది. మీకై మీరు అక్కడికి వెళ్ళాలి. పరివర్తన వ్యక్తిగత ప్రయాణము—సమకూర్చే ప్రయాణము.

గృహములో, సంఘములో బోధించే ప్రతీఒక్కరు, వారి స్వంత ఆత్మీయ అనుభవాలను కలిగియుండటానికి అవకాశాన్ని ఇతరులకు ఇవ్వగలరు. ఈ అనుభవాల ద్వారా, వారికై వారు “అన్ని సంగతుల యొక్క సత్యమును” తెలుసుకోగలుగుతారు.”9 “దేవునికి ప్రాధాన్యతనివ్వడానికి మీరు ఎంచుకొనినప్పుడు సువార్త లేక సంఘం గురించి మీకు నిజాయితీగల ప్రశ్నలున్నట్లయితే, ఖచ్ఛితమైన నిత్య సత్యాలను కనుగొని గ్రహించడానికి మీరు నడిపించబడతారు, అవి మీ జీవితానికి దారిచూపి నిబంధన మార్గముపై స్థిరంగా నిలిచి ఉండేందుకు మీకు సహాయపడతాయి,”10 అని అధ్యక్షులు నెల్సన్ బోధించారు.

నాటకరీతిగా బోధన మెరుగుపరచండి

స్టేకులలో, వార్డులలో మరియు గృహాలలో—ప్రతీ స్థాయిలో బోధనను నాటకరీతిలో మెరుగుపరచుకోవడానికి తల్లిదండ్రులను, యువతను కలిసి సంప్రదించమని సంఘములోని ప్రతి నిర్మాణములోని నాయకులు, బోధకులను నేను ఆహ్వానిస్తున్నాను. అది సిద్ధాంతమును బోధించుట మరియు మన వ్యక్తిగత అధ్యయనము చేసే నిశ్శబ్దమైన క్షణాలలో పరిశుద్ధాత్మ బోధించిన సత్యములను గూర్చి ఆత్మ-నిండిన చర్చను ఆహ్వానించుట ద్వారా సాధించబడుతుంది.

క్రీస్తునందు నా ప్రియమైన స్నేహితులారా, బోధకుని మాదిరిని అనుసరించడానికి మరియు ఆయన వలె బోధించడానికి ఏదైనా చేసే బాధ్యత మనలో ప్రతిఒక్కరికి ఉన్నది. ఆయన మార్గము నిజమైన మార్గము! మనము ఆయనను అనుసరించినప్పుడు, “ఆయన ఉన్నట్లే మనము ఆయనను చూచెదము, కావున ఆయన ప్రత్యక్షమగునప్పుడు, మనము ఆయనవలే ఉండునట్లు, ఆయన శుద్ధముగా ఉన్నట్లు మనము శుద్ధము చేయబడునట్లు మనము ఈ నిరీక్షణను కలిగియుండెదము.”11 స్వయంగా బోధకుడైన ఆయన, పునరుత్థానము చెందిన యేసు క్రీస్తు నామములో, ఆమేన్.