సర్వసభ్య సమావేశము
మన స్వకీయ రక్షకుడు
2021 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


మన స్వకీయ రక్షకుడు

ఆయన ప్రాయశ్చిత్త త్యాగము వలన, రక్షకుడు శుద్ధి చేయుటకు, స్వస్థపరచుటకు మరియు ఒకరి తరువాత ఒకరిగా మనల్ని బలపరచగల శక్తిని కలిగియున్నాడు.

ఈ అద్భుతమైన ఈస్టరు ఆదివారమున మీతో ఉన్నందుకు నేను కృతజ్ఞత కలిగియున్నాను. నేను ఈస్టరు గురించి ఆలోచించినప్పుడు, సమాధి తోట వద్ద ఉన్న వారితో దూతల చేత మాట్లాడబడిన మాటలు నా మనస్సులో పునఃశ్చరణ చేయడం నాకు ప్రియమైనది: “సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెదకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచియున్నాడు.”1 నజరేతు యొక్క యేసు పునరుత్థానము చెందాడని, ఆయన జీవిస్తున్నాడని నేను సాక్ష్యమిస్తున్నాను.

క్రీస్తును గూర్చి మీకేమి తోచుచున్నది?

ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం, నా మిషనరీ సహచరుడు మరియు నేను ఫిలిప్పీన్స్‌లోని దావావో నగరంలో ఒక స్థానిక వార్తాపత్రికకు సహకారి అయిన చాలా మేధావిని కలుసుకుని అతనికి బోధించాము. అతడికి బోధించడాన్ని మేము ఆనందించాము ఎందుకనగా అతడు చాలా ప్రశ్నలు కలిగియున్నాడు మరియు మా నమ్మకాలను చాలా గౌరవించాడు. అతడు మమ్మల్ని అడిగిన మిక్కిలి జ్ఞాపకార్ధమైన ప్రశ్న “క్రీస్తును గూర్చి మీకేమి తోచుచున్నది?”2 మేము ఉత్సాహంగా మా భావాలను పంచుకున్నాము మరియు యేసు క్రీస్తును గూర్చి సాక్ష్యాన్ని పంచుకున్నాము. తరువాత అతడు అదే విషయముపై ఒక వ్యాసాన్ని వ్రాసాడు, అది రక్షకుని గురించి అద్భుతమైన మాటలు మరియు వాక్యభాగాలను కలిగియున్నది. నేను ఆకట్టుకోబడ్డాను కాని ప్రేరేపించబడలేదని జ్ఞాపకమున్నది. అది మంచి సమాచారాన్ని కలిగియున్నది కానీ అది అర్థము లేనిదిగా, ఆత్మీయ శక్తిని కొదువుగా ఉన్నట్లుగా అనిపించింది.

ఆయనను గూర్చి అధికంగా తెలుసుకొనుట

“క్రీస్తును గూర్చి మీకేమి తోచుచున్నది?” రక్షకుడిని నేను ఎంత సన్నిహితంగా ఎరుగుదునో, అది ఆయనను వినగల నా సామర్థ్యాన్ని, అదేవిధంగా ఆయన చెప్పిన దానికి నేను ఎలా స్పందిస్తానో అనే దానిని ప్రభావితం చేస్తుందని నేను గ్రహిస్తున్నాను. కొన్ని సంవత్సరాల క్రితం డేవిడ్ ఎ. బెడ్నార్ తన ప్రసంగములో భాగముగా క్రింది ప్రశ్నలను అడిగారు: “రక్షకుని గూర్చి మాత్రమే మనకు తెలుసా? లేక కేవలము వాస్తవాలను తెలుసుకొనుట కంటె మేలుగా ఆయనను వ్యక్తిగత విధానములో తెలుసుకుంటున్నామా? మనము ప్రభువును ఎలా తెలుసుకున్నాము?”3

నేను అధ్యయనం చేసి, ధ్యానించినప్పుడు, రక్షకుని గురించి నాకు తెలిసినది ఆయన గురించి నాకు నిజంగా తెలిసిన దానిని బాగా అధిగమిస్తుందనే చాలా స్పష్టమైన అవగాహన నాకు కలిగింది. ఆయనను తెలుసుకోవడానికి ఎక్కువ ప్రయత్నము చెయ్యాలని అప్పుడు నేను తీర్మానించుకున్నాను. లేఖనాల కొరకు, విశ్వాసులును యేసు క్రీస్తు శిష్యులైన స్త్రీ, పురుషుల సాక్ష్యముల కొరకు నేను చాలా కృతజ్ఞత కలిగియున్నాను. గత కొన్ని సంవత్సరాలుగా రక్షకుడిని బాగా తెలుసుకోవాలనే నా ప్రయత్నము అనేక భిన్నమైన అంశాలను అధ్యయనం చేయడానికి నన్ను నడిపించింది. నేను వ్రాసిన చాలని మాటల కంటె ఎక్కువ గొప్ప సందేశాన్ని పరిశుద్ధాత్మ ఈరోజు మీకు తెలపాలని నేను ప్రార్థన చేస్తున్నాను.

మొదటిగా, రక్షకుని తెలుసుకొనుట మన జీవితాలలో అత్యంత ముఖ్యమైన అన్వేషణ అని మనము గుర్తించాల్సిన అవసరమున్నది. అది అన్నింటి కన్నా ఎక్కువ ప్రాధాన్యతను కలిగియుండాలి.

“అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము.”4

“నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప యెవడును తండ్రి యొద్దకు రాడని, యేసు అతడితో చెప్పెను.”5

ఆయన వాగ్దానము గొప్పది: “నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు గలిగియుండును.”6

రెండవది, మనము రక్షకుడిని ఎక్కువగా తెలుసుకోగలిగినప్పుడు, లేఖన భాగాలు మరియు ప్రవక్తల మాటలు మనకు చాలా సన్నిహితంగా అర్థవంతమైనవి అవుతాయి, ఆవిధంగా లేఖనాలు, ప్రవక్తల మాటలు మన స్వంత మాటలవుతాయి. వాక్యముపై ప్రయోగము చేసి7 మరియు పరిశుద్ధాత్మ నుండి ఒక సాక్ష్యమును పొందుట ద్వారా మన స్వంత ప్రత్యేక విధానములో రక్షకుని తెలుసుకొనుట మనకై మనం తెలుసుకోగలిగినంత ఎక్కువగా ఇతరుల యొక్క మాటలు, భావాలు మరియు అనుభవాలను అనుకరించుట కాదు. ప్రవక్త ఆల్మా ప్రకటించినట్లుగా:

“నాకై నేను ఈ విషయములను ఎరుగుదునని మీరు అనుకొనుట లేదా? ఇదిగో, నేను పలికిన వాటిని గూర్చి ఈ విషయములను సత్యమని నేను ఎరుగుదునని నేను మీకు సాక్ష్యమిచ్చుచున్నాను. మరియు ఎట్లు వాటి యథార్థతను నేను ఎరుగుదునని మీరనుకొనుచున్నారు?

“ఇదిగో, అవి నాకు దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా తెలియజేయబడెనని నేను మీకు చెప్పుచున్నాను. ఇదిగో, నేను ఈ విషయములను నాకుగా తెలుసుకొనవలెనని నేను అనేక దినములు ఉపవాసముండి, మరియు ప్రార్థన చేసితిని. మరియు అవి సత్యమని నాకై నేను ఎరుగుదును. ఏలయనగా ప్రభువైన దేవుడు వాటిని నాకు పరిశుద్ధాత్మ ద్వారా ప్రత్యక్షపరచెను మరియు ఇది నాలో ఉన్న ఆత్మ యొక్క ప్రకటన.”8

మూడవది, యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము మనకు స్వయంగా, వ్యక్తిగతంగా అన్వయిస్తుందనే హెచ్చించబడిన జ్ఞానము మనము ఆయనను తెలుసుకోవడానికి సహాయపడుతుంది. మన జీవితాలలో క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము వ్యక్తిగత ప్రాముఖ్యతను గుర్తించుట కంటె దాని గురించి అనేక వ్యక్తి వాచకంగా ఆలోచించి మాట్లాడటం తరుచుగా మనకు సులభమైనది. యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము ఆనంతమైనది మరియు నిత్యమైనది, అది ప్రతిఒక్కరికి అన్వయిస్తుంది, అది చాలా స్వంత, వ్యక్తిగత స్థాయిలో మనల్ని ప్రభావితం చేస్తుంది. ఆయన ప్రాయశ్చిత్త త్యాగము వలన, రక్షకుడు శుద్ధి చేయుటకు, స్వస్థపరచుటకు మరియు ఒకరి తరువాత ఒకరిగా మనల్ని బలపరచగల శక్తిని కలిగియున్నాడు.

ఆరంభము నుండి రక్షకుని ఏకైక కోరిక, ఆయన ఏకైక ఉద్దేశము, తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చుట. ఆయన కొరకు తండ్రి చిత్తమేదనగా, “తండ్రితో న్యాయవాదిగా,”10 “మనుష్యుని యొక్క అమర్య్తత్వము మరియు నిత్యజీవమును [తెచ్చుటకు]”9 సహాయపడుట. కాబట్టి “ఆయన కుమారుడై యుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను; మరియు సంపూర్ణ సిద్ధి పొందిన వాడై, తనకు విధేయులైన వారికందరికిని నిత్య రక్షణకు కారకుడాయెను.”11

”ప్రతి రకమైన బాధలు మరియు శ్రమలు మరియు శోధనలు అనుభవించుచు ముందుకు వెళ్ళును. …

“మరియు ఆయన జనులను కట్టి ఉంచు మరణ బంధకములను ఆయన వదులు చేయునట్లు ఆయన మరణమును తనపైన తీసుకొనును … మరియు శరీరమును బట్టి ఆయన ప్రేగులు కనికరముతో నిండవలెనని, … వారి యొక్క బలహీనతలను బట్టి, తన జనులను ఎట్లు ఆదరించవలెనో శరీరమును బట్టి ఆయన ఎరుగునట్లు, ఆయన వారి యొక్క బలహీనతలను తన పైన తీసుకొనును.

“… తన జనుల యొక్క పాపములను ఆయన తనపైన తీసుకొనునట్లు ఆయన విడుదల యొక్క శక్తిని బట్టి, వారి యొక్క అతిక్రమములను ఆయన తుడిచివేయునట్లు దేవుని యొక్క కుమారుడు శరీరమును బట్టి, శ్రమపడును.”12

ప్రభువు యొక్క ప్రాయశ్చిత్తము యొక్క వ్యక్తిగత స్వభావమును హత్తుకోవడానికి కొన్నిసార్లు మనకు కలిగే ప్రయాసను వివరించే ఒక సాధారణమైన అనుభవాన్ని పంచుకోవాలని నేను కోరుతున్నాను.

సంవత్సరాల క్రితం, అధ్యక్షత్వము వహించే మా నాయకుని నుండి ఒక ఆహ్వానమివ్వబడి, నేను మోర్మన్ గ్రంథమును మొదటి నుండి చివరి దాకా చదివాను మరియు ప్రభువు యొక్క ప్రాయశ్చిత్తము సూచించిన వచనాలను గుర్తించాను. నేను నేర్చుకొన్న దానిగురించి ఒక పేజి సారాంశమును సిద్ధపరచమని కూడా ఆయన నన్ను అడిగారు. “ఒక పేజీ? నాకై నేను అనుకున్నాను. తప్పకుండా, అది సులభమైనది.” అయినప్పటికినీ, నా ఆశ్చర్యానికి, అది చాలా కష్టమైన పనిగా నేను కనుగొన్నాను.

నేను నిజమైన లక్ష్యమును గ్రహించలేదు మరియు తప్పు ఊహలు కలిగియున్నాను కనుక నేను విఫలమయ్యానని అప్పటినుండి గ్రహించాను. మొదట, నేను సారాంశము ప్రతిఒక్కరికి ప్రేరేపించేదిగా ఉండాలని ఆశించాను. సారాంశము నాకోసం ఉద్దేశించబడింది మరియు వేరేవరికి కాదు. రక్షకుడు, ఆయన నా కొరకు చేసిన దాని గురించి అది నా భావాలను పూర్తిగా సూచించాలి, ఆవిధంగా నేను చేసిన ప్రతీసారి, అది అద్భుతమైన, తీవ్రమైన మరియు వ్యక్తిగత ఆత్మీయ అనుభవాలను తెస్తుంది.

రెండవది, సారాంశము బ్రహ్మాండగా, విపులమైనదిగా, మంచి మాటలు మరియు వాక్యభాగాలను కలిగి ఉండాలని నేనాశించాను. అది ఎన్నడూ సంక్లిష్ట పదజాలానికి సంబంధించినది కాదు. అది నమ్మకము యొక్క స్పష్టమైన, సరళమైన ప్రకటనగా ఉండటానికి ఉద్దేశించబడింది. “ఏలయనగా నా ఆత్మ స్పష్టత యందు ఆనందించును, ఏలయనగా ఈ మాదిరిని ప్రభువైన దేవుడు నరుల యొక్క సంతానము మధ్య పనిచేయును. ఏలయనగా ప్రభువైన దేవుడు వివేచనకు వెలుగు నిచ్చును.”13

మూడవది, ఇది సంపూర్ణంగా ఉంటుందని నేను ఊహించాను—అన్ని సారాంశాలను ముగించే సారాంశం—పురోగతిలో ఉన్న పనికి బదులుగా, ఇక్కడ ఒక పదాన్ని లేదా ఒక పదబంధాన్ని నా అవగాహనగా జోడించగలిగే పనికి బదులుగా, ఒకరు జోడించలేని మరియు జోడించకూడని చివరి సారాంశం ఇది, దీని వలన యేసు క్రీస్తు ప్రాయశ్చిత్తం పట్ల నా అవగాహన పెరుగుతుంది.

సాక్ష్యము మరియు ఆహ్వానము

ఒక యువకునిగా నేను, నా బిషప్పుతో నా సంభాషణ నుండి ఎక్కువగా నేర్చుకున్నాను. ఆ అనుభవము లేని సంవత్సరాలందు, నేను ఒక ప్రియమైన కీర్తన నుండి మాటలను ప్రేమించడం నేను నేర్చుకున్నాను:

యేసు నాకిచ్చే ప్రేమను చూసి నేను ఆశ్చర్యపోతున్నాను,

ఆయన నాకు సంపూర్ణంగా ఇయ్యబోయే కృపను బట్టి కలవరపడుతున్నాను.

ఆయన నాకోసం సిలువ వేయబడ్డాడని తెలుసుకోవానికి నేను వణకుతున్నాను,

పాపినైన నా కొరకు, ఆయన బాధను అనుభవించాడు, ఆయన రక్తము చిందించాడు, ఆయన చనిపోయాడు.

ఓహ్, ఆయన నా కొరకు శ్రద్ధ తీసుకొనుట అద్భుతమైనది.

నా కొరకు చనిపోవడానికి తగినంతగా!

ఓహ్, అది అద్భుతమైనది, అది నాకు అద్భుతమైనది!14

ప్రవక్త మొరోనై మనల్ని ఆహ్వానించాడు: “మరియు ఎవరిని గూర్చి ప్రవక్తలు మరియు అపొస్తలులు వ్రాసియుండిరో, ఆ యేసును వెదకుటకు నేను మీకు సిఫారసు చేయుచున్నాను.”15

“యేసు క్రీస్తు గురించి [మనకు] సాధ్యమైన సమస్తమును నేర్చుకోవడానికి [మనము] ముందుకు సాగిన యెడల, … పాపమునుండి మరలిపోయే [మన] సామర్థ్యము వృద్ధి చెందుతుంది. ఆజ్ఞలను పాటించాలనే [మన] కోరిక బహుగా హెచ్చింపబడుతుంది.”16

ఈ ఈస్టర్ ఆదివారం నాడు, రక్షకుడు తన రాతి సమాధి నుండి బయటికి వచ్చినట్లే, మన ఆధ్యాత్మిక నిద్ర నుండి మేల్కొని, సందేహాల మేఘాలు, భయం యొక్క పట్టు, అహంకారం యొక్క మత్తు, మరియు నిశ్చలత యొక్క మేఘం నుండి పైకి లేవండి. యేసు క్రీస్తు మరియు పరలోక తండ్రి జీవిస్తున్నారు. మన యెడల వారు కలిగియున్న పరిపూర్ణమైన ప్రేమను గూర్చి నేను సాక్ష్యమిస్తున్నాను. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.