సర్వసభ్య సమావేశము
క్రీస్తు లేచియున్నాడు; ఆయన యందు విశ్వాసం కొండలను కదిలిస్తుంది
2021 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


క్రీస్తు లేచియున్నాడు; ఆయన యందు విశ్వాసం కొండలను కదిలిస్తుంది

యేసు క్రీస్తు యందు విశ్వాసమనేది ఈ జీవితంలో మనకు లభించే అతిగొప్ప శక్తి. నమ్మువానికి సమస్తమును సాధ్యమే.

నా ప్రియ సహోదర సహోదరీలారా, ఈ ఈస్టరు ఆదివారం నాడు మీతో మాట్లాడే అవకాశం కొరకు నేను కృతజ్ఞుడిని.1 యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్త బలి మరియు పునరుత్థానము మనలో ప్రతిఒక్కరి జీవితాన్ని శాశ్వతంగా మార్చివేసింది. మనము ఆయనను ప్రేమిస్తున్నాము మరియు కృతజ్ఞతాపూర్వకంగా ఆయనను, మన పరలోక తండ్రిని ఆరాధిస్తున్నాము.

గత ఆరు నెలలు, మనం ప్రపంచవ్యాప్త మహమ్మారితో పోరాటం కొనసాగించాము. అనారోగ్యం, నష్టం, ఒంటరితనాన్ని ఎదుర్కోవడంలో మీ నమ్రతను, ఆత్మీయ బలాన్ని చూసి నేను ఆశ్చర్యపడుతున్నాను. వీటన్నిటిలో మీ కొరకు ప్రభువు యొక్క నిత్య ప్రేమను మీరు అనుభవించాలని నేను నిరంతరం ప్రార్థిస్తున్నాను. మీ శ్రమల పట్ల మీరు బలమైన శిష్యత్వంతో స్పందించినట్లయితే, గత సంవత్సరం వృధా కాలేదు.

ఈ ఉదయం, భూమిపై నివాసులున్న ప్రతి ఖండం నుండి వచ్చిన సంఘ నాయకులనుండి మనం విన్నాము. నిజంగా సువార్త యొక్క దీవెనలు ప్రతి జాతి, భాష మరియు జనుల కొరకైనవి. యేసు క్రీస్తు యొక్క సంఘము విశ్వవ్యాప్త సంఘము. యేసు క్రీస్తు మన నాయకుడు.

మహమ్మారి కూడా ఆయన సత్యము యొక్క నిరంతర వృద్ధిని మందగింపజేయలేకపోయినందుకు ధన్యవాదాలు. ఈ గందరగోళమైన, వివాదాస్పదమైన, అలసిన ప్రపంచానికి ఖచ్చితంగా కావలసినది యేసు క్రీస్తు యొక్క సువార్త.

దేవుని పిల్లల్లో ప్రతిఒక్కరు యేసు క్రీస్తు యొక్క స్వస్థపరచు, విమోచన సందేశాన్ని విని, అంగీకరించు అవకాశానికి అర్హులు. ఇప్పుడు మరియు ఎల్లప్పుడు—మన సంతోషానికి మరేయితర సందేశము అంత ముఖ్యమైనది కాదు.2 మరేయితర సందేశము నిరీక్షణతో ఎక్కువగా నింపబడలేదు. మరేయితర సందేశము మన సమాజంలో వివాదాన్ని తొలగించలేదు.

యేసు క్రీస్తు యందు విశ్వాసము నమ్మకానికంతటికి పునాది మరియు దైవిక శక్తికి మార్గము. అపొస్తలుడైన పౌలు ప్రకారము, విశ్వాసము లేకుండా (దేవునికి) ఇష్టుడైయుండుట అసాధ్యము: దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయ చేయువాడనియు నమ్మవలెను గదా.”3

జీవితంలో ప్రతి మంచి—నిత్య ప్రాముఖ్యత గల సంభవనీయమైన ప్రతి దీవెన—విశ్వాసంతో మొదలవుతుంది. మన జీవితాల్లో దేవునికి ప్రాధాన్యతనివ్వడమనేది మనల్ని నడిపించడానికి ఆయన సమ్మతిస్తున్నారనే విశ్వాసంతో మొదలవుతుంది. మనల్ని శుద్ధిచేయడానికి, స్వస్థపరచడానికి మరియు బలపరచడానికి యేసు క్రీస్తు శక్తి కలిగియున్నారనే విశ్వాసంతో నిజమైన పశ్చాత్తాపము మొదలవుతుంది.4

“దేవుని శక్తిని నిరాకరించవద్దని,” “ఏలయనగా, ఆయన నరుల సంతానము యొక్క విశ్వాసమును బట్టి శక్తి ద్వారా పనిచేయునని,”5 ప్రవక్త మొరోనై ప్రకటించాడు. మన జీవితాల్లో దేవుని శక్తిని స్థాపించేది మన విశ్వాసమే.

అయినప్పటికీ, విశ్వాసాన్ని అభ్యసించడం చాలా కష్టంగా కనిపించవచ్చు. మనం బాగా ఆశించిన దీవెనలు పొందడానికి తగినంత విశ్వాసాన్ని సమకూర్చుకోవడం మనకు సాధ్యమేనా అని కొన్నిసార్లు మనం ఆశ్చర్యపడవచ్చు. ఏమైనప్పటికీ, మోర్మన్ గ్రంథ ప్రవక్తయైన ఆల్మా మాటల ద్వారా ప్రభువు ఆ భయాలను అంతం చేస్తున్నారు.

చిత్రం
ఆవ గింజ

కేవలం మాటలపై ప్రయోగము చేయమని మరియు “నమ్మవలెనను కోరిక కలిగియుండుట తప్ప మరేమియు (మనము) చేయలేనియెడల, ఒక రేణువంత విశ్వాసమును సాధన చేయమని,”6 ఆల్మా మనల్ని అడుగుతున్నాడు. “రేణువంత విశ్వాసం” అనే పదజాలము, మనకు “ఆవగింజంత విశ్వాసముండిన యెడల,” మనం “ఈ కొండను చూచి-ఇక్కడ నుండి అక్కడకు పొమ్మని చెప్పగలము మరియు అది పోవును; [మనకు] అసాధ్యమైనది ఏదియు ఉండదు” అనే ప్రభువు యొక్క బైబిలుసంబంధిత వాగ్దానాన్ని నాకు గుర్తు చేస్తుంది.7

చిత్రం
ఆవ గింజల మధ్య పక్షి

మన మర్త్య బలహీనతను ప్రభువు అర్థం చేసుకుంటారు. కొన్నిసార్లు మనమందరం సంకోచిస్తాము. కానీ, మన గొప్ప సామర్థ్యం కూడా ఆయనకు తెలుసు. ఆవగింజ చిన్నగా మొదలై, దాని కొమ్మలపై పక్షులు గూళ్ళు కట్టుకోగలిగినంత పెద్ద చెట్టుగా పెరుగుతుంది. చిన్నదే, కానీ పెరుగుతున్న విశ్వాసాన్ని ఆవగింజ సూచిస్తుంది.8

ఆయన పరిపూర్ణమైన శక్తికి ప్రవేశం కలిగియుండేందుకు మనం పరిపూర్ణమైన విశ్వాసం కలిగియుండాలని ప్రభువు కోరడం లేదు. కానీ, మనం విశ్వసించాలని ఆయన కోరుతున్నారు.

నా ప్రియ సహోదర సహోదరీలారా, మీ విశ్వాసాన్ని పెంచుకోవడాన్ని నేడే మొదలుపెట్టమని ఈ ఈస్టరు ఉదయాన నేను మీకు పిలుపునిస్తున్నాను. మీ వ్యక్తిగత సవాళ్ళు ఎవరెస్టు పర్వతమంత పెద్దగా కనిపించినప్పటికీ, మీ విశ్వాసం ద్వారా మీ జీవితంలోని కొండలను కదిలించడానికి యేసు క్రీస్తు మీ సామర్థ్యాన్ని పెంచుతారు.9

ఒంటరితనం, సందేహం, అనారోగ్యం లేదా ఇతర వ్యక్తిగత సమస్యలు మీ కొండలు కావచ్చు. మీ కొండలు భిన్నంగా ఉండవచ్చు, అయినప్పటికీ మీ విశ్వాసాన్ని పెంచుకోవడమే మీ సవాళ్ళలో ప్రతిదానికి సమాధానం. విశ్వాసాన్ని పెంచుకోవడానికి క్రియ అవసరము. ఒక రేణువంత విశ్వాసాన్ని సమకూర్చుకోవడానికి కూడా సోమరులు మరియు శ్రద్ధలేని శిష్యులు ఎల్లప్పుడూ కష్టపడతారు.

ఏదైనా మంచిని చేయడానికి ప్రయత్నం అవసరము. యేసు క్రీస్తు యొక్క నిజమైన శిష్యులు కావడం దానికి మినహాయింపు కాదు. ఆయన యందు విశ్వాసాన్ని, నమ్మకాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం అవసరము. ఆ విశ్వాసాన్ని, నమ్మకాన్ని పెంచుకోవడానికి మీకు సహాయపడేందుకు నేను ఐదు సూచనలను అందిస్తున్నాను.

మొదటిది, అధ్యయనము. చురుకుగా పాల్గొనే విద్యార్థి అవ్వండి. క్రీస్తు యొక్క నియమితకార్యాన్ని, పరిచర్యను బాగా అర్థం చేసుకోవడానికి లేఖనాలలో మిమ్మల్ని మీరు నిమగ్నం చేసుకోండి. క్రీస్తు యొక్క సిద్ధాంతాన్ని తెలుసుకోండి, తద్వారా మీ జీవితం కొరకు దాని శక్తిని మీరు గ్రహిస్తారు. యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము మీకు అన్వయిస్తుందనే సత్యాన్ని అంతర్గతీకరించండి. మీ కష్టాన్ని, మీ తప్పులను, మీ బలహీనతను, మీ పాపాలను ఆయన తనపై తీసుకున్నారు. ఆయన నష్టపరిహారం చెల్లించారు మరియు మీరు ఎదుర్కొనే ప్రతి కొండను కదిలించడానికి కావలసిన శక్తిని మీకు అందించారు. మీ విశ్వాసము, నమ్మకము మరియు ఆయనను అనుసరించడానికి సమ్మతితో మీరు ఆ శక్తిని పొందుతారు.

మీ కొండలను కదిలించడానికి ఒక అద్భుతం అవసరం కావచ్చు. అద్భుతాల గురించి నేర్చుకోండి. ప్రభువు యందు మీ విశ్వాసాన్ని బట్టి అద్భుతాలు జరుగుతాయి. ఆ విశ్వాసానికి కేంద్రబిందువు—మీరు కోరుకునే అద్భుతమైన సహాయంతో ఆయన మిమ్మల్ని ఎలా మరియు ఎప్పుడు దీవిస్తారనే ఆయన చిత్తము మరియు యుక్తకాలమును నమ్మడం. మీ జీవితంలోని కొండలను కదిలించడానికి మిమ్మల్ని అద్భుతాలతో దీవించడం నుండి దేవుడిని ఆపేది కేవలం మీ విశ్వాసమే.10

మీరు రక్షకుని గురించి ఎంత ఎక్కువగా నేర్చుకుంటే, అంత సులువుగా ఆయన కనికరమును, అనంతమైన ఆయన ప్రేమను, బలపరచి, స్వస్థపరచి, విమోచించు ఆయన శక్తిని నమ్ముతారు. విశ్వాసంతో మీరు ఒక కొండను ఎదుర్కొన్నప్పుడు లేదా ఎక్కుతున్నప్పటి కంటే ఎక్కువగా ఎన్నడూ రక్షకుడు మీకు దగ్గరగా ఉండరు.

రెండవది, యేసు క్రీస్తు యందు నమ్మడాన్ని ఎంచుకోండి. తండ్రియైన దేవుడు, ఆయన ప్రియ కుమారుడు లేదా పునఃస్థాపన యొక్క చెల్లుబాటు లేదా ఒక ప్రవక్తగా జోసెఫ్ స్మిత్ దైవిక పిలుపు యొక్క యథార్థత గురించి మీకు సందేహాలున్నట్లయితే, నమ్మడాన్ని ఎంచుకోండి 11 మరియు విశ్వాసంగా ఉండండి. మీ ప్రశ్నలను ప్రభువు యొద్దకు మరియు ఇతర విశ్వసనీయ మూలాధారాల యొద్దకు తీసుకువెళ్ళండి. ప్రవక్త జీవితంలో లోపాలను లేదా లేఖనాలలో పరస్పర వైరుద్ధ్యాలను కనుగొనగలరనే ఆశతో కాకుండా, నమ్మాలనే కోరికతో అధ్యయనం చేయండి. సందేహించువారితో వాటిని నిరంతరం చర్చిస్తూ మీ సందేహాలను పెంచుకోవడాన్ని ఆపండి. మీ ఆత్మీయ పరిశోధన ప్రయాణంలో మిమ్మల్ని నడిపించడానికి ప్రభువును అనుమతించండి.

మూడవది, విశ్వాసంతో పనిచేయండి. మీకు మరింత విశ్వాసం ఉన్నట్లయితే, మీరేమి చేస్తారు? దాని గురించి ఆలోచించండి. దాని గురించి వ్రాయండి. అప్పుడు, విశ్వాసం ఎక్కువగా అవసరమైన దానిని చేయడం ద్వారా విశ్వాసాన్ని ఎక్కువగా పొందండి.

నాల్గవది, యోగ్యులుగా పవిత్ర విధులలో పాలుపొందండి. విధులు మీ జీవితం కొరకు దేవుని శక్తిని స్థాపిస్తాయి.12

ఐదవది, సహాయం కొరకు యేసు క్రీస్తు నామములో మీ పరలోక తండ్రిని అడగండి.

విశ్వాసానికి క్రియ అవసరం. బయల్పాటు పొందడానికి క్రియ అవసరం. కానీ, “అడుగు ప్రతివాడును పొందును; వెదకువానికి దొరకును; తట్టువానికి తీయబడును.”13 మీ విశ్వాసం పెరగడానికి ఏది సహాయపడుతుందో దేవుడికి తెలుసు. అడగండి, మళ్ళీ అడగండి.

విశ్వాసము బలహీనుల కొరకైనదని అవిశ్వాసి చెప్పవచ్చు. కానీ ఈ మాట విశ్వాసం యొక్క శక్తిని లెక్కచేయదు. రక్షకుని యొక్క అపొస్తలులు ఆయనను సందేహించినట్లయితే, వారి జీవితాలను పణంగా పెట్టి, ఆయన మరణం తర్వాత ఆయన సిద్ధాంతాన్ని బోధించడాన్ని వారు కొనసాగించేవారా?14 అది నిజమని స్థిరమైన సాక్ష్యాన్ని వారు కలిగియుండకపోతే, జోసెఫ్ మరియు హైరం స్మిత్‌లు ప్రభువు సంఘం యొక్క పునఃస్థాపనను కాపాడడానికి హతసాక్షులయ్యేవారా? యేసు క్రీస్తు యొక్క సువార్త పునఃస్థాపించబడింది అనే విశ్వాసం వారికి ఉండనట్లయితే, సుమారు 2,000 మంది పరిశుద్ధులు యూటాకు ప్రయాణిస్తూ మరణించేవారా?15 నిజంగా, విశ్వాసము అసాధ్యాన్ని సాధించడానికి బహుశా జరుగని దానిని సాధ్యమయ్యేట్లు చేయు శక్తి.

ఇదివరకే మీకున్న విశ్వాసాన్ని తగ్గించుకోకండి. సంఘములో చేరి, విశ్వాసంగా నిలిచియుండడానికి విశ్వాసము అవసరం. పండితులను, ప్రజాదరణ గల అభిప్రాయాన్ని కాకుండా ప్రవక్తలను అనుసరించడానికి విశ్వాసము అవసరం. మహమ్మారిగల సమయంలో సువార్త సేవ చేయడానికి విశ్వాసము అవసరం. దేవుని యొక్క పవిత్రత చట్టం ఇప్పుడు పాతబడిపోయిందని లోకం అరుస్తున్నప్పుడు, పవిత్రమైన జీవితాన్ని జీవించడానికి విశ్వాసము అవసరం. లౌకిక ప్రపంచంలో పిల్లలకు సువార్తను బోధించడానికి విశ్వాసము అవసరం. ప్రియమైనవారి ప్రాణం కోసం వేడుకోవడానికి విశ్వాసము అవసరం మరియు నిరాశపరిచే జవాబును అంగీకరించడానికి మరింత విశ్వాసము అవసరం.

రెండేళ్ళ క్రితం నేను, సహోదరి నెల్సన్ సమోవా, టోంగా, ఫీజి మరియు తహితిలను సందర్శించాము. ఆ ద్వీపాలలో ప్రతిది చాలారోజులు అధిక వర్షపాతాన్ని అనుభవించాయి. వారి బహిరంగ సమావేశాలు వర్షం నుండి కాపాడబడాలని సభ్యులు ఉపవాసముండి, ప్రార్థించారు.

సమోవా, ఫీజీ మరియు తహితిలలో సమావేశం మొదలవగానే వర్షం ఆగిపోయింది. కానీ, టోంగాలో వర్షం ఆగ లేదు. అయినప్పటికీ, 13,000 మంది విశ్వాసులైన పరిశుద్ధులు స్థలము దక్కించుకోవడానికి గంటల ముందు వచ్చి, కుండపోత వర్షంలో ఓర్పుగా వేచియుండి, పూర్తిగా తడిచిపోయి రెండు-గంటల పాటు సమావేశంలో కూర్చున్నారు.

చిత్రం
వర్షములో టోంగా పరిశుద్ధులు

ఆ ద్వీపవాసులలో ప్రతిఒక్కరిలో బలమైన విశ్వాసం పనిచేయడాన్ని మేము చూసాము—వర్షాన్ని ఆపడానికి తగినంత విశ్వాసం మరియు వర్షం ఆగనప్పుడు పట్టుదలతో ఉండేందుకు విశ్వాసం.

మన జీవితాల్లోని కొండలు ఎల్లప్పుడూ మనకు నచ్చినట్లుగా లేదా నచ్చినప్పుడు కదలవు. కానీ మన విశ్వాసం ఎల్లప్పుడూ మనల్ని ముందుకు తోస్తుంది. విశ్వాసం ఎల్లప్పుడూ దైవత్వపు శక్తికి మన ప్రవేశాన్ని పెంచుతుంది.

ఇది తెలుసుకోండి: ప్రపంచంలో మీరు నమ్మే ప్రతిది మరియు ప్రతిఒక్కరు విఫలమైనా, యేసు క్రీస్తు మరియు ఆయన సంఘము మిమ్మల్ని ఎన్నడూ విఫలం కానియ్యవు. ప్రభువు ఎన్నడూ కునకడు, నిద్రపోడు.16 ఆయన “నిన్న, నేడు [రేపు] ఒకే రీతిగా ఉన్నాడు.”17 ఆయన తన నిబంధనలను, 18 వాగ్దానాలను , లేదా తన జనులపై ఆయనకున్న ప్రేమను విడిచిపెట్టడు. ఆయన నేడు అద్భుతములు చేసాడు మరియు ఆయన రేపు అద్భుతములు చేస్తాడు.19

యేసు క్రీస్తు యందు విశ్వాసమనేది ఈ జీవితంలో మనకు లభించే అతిగొప్ప శక్తి. నమ్మువానికి సమస్తమును సాధ్యమే.20

ఆయనయందు పెరుగుతున్న మీ విశ్వాసము కొండలను—భూమిని అందంగా చేసే పర్వతాలను కాదు, కానీ మీ జీవితాల్లోని కష్టాల కొండలను కదిలిస్తుంది. సవాళ్ళను అసమాన వృద్ధి మరియు అవకాశంగా మార్చడానికి అభివృద్ధి చెందుతున్న మీ విశ్వాసం మీకు సహాయపడుతుంది.

ఈ ఈస్టరు ఆదివారం నాడు, ప్రేమ మరియు కృతజ్ఞత గల నా గాఢమైన భావాలతో నిజంగా యేసు క్రీస్తు లేచియున్నాడనే నా సాక్ష్యాన్ని నేను ప్రకటిస్తున్నాను. తన సంఘాన్ని నడిపించడానికి ఆయన లేచియున్నాడు. వారు ఎక్కడ నివసిస్తున్నప్పటికీ, దేవుని పిల్లలందరి జీవితాలను దీవించడానికి ఆయన లేచియున్నాడు. ఆయన యందు విశ్వాసంతో, మనము మన జీవితాల్లోని కొండలను కదిలించగలము. ఈవిధంగా నేను యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.

వివరణలు

  1. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో ఈస్టరు ఉదయాన జనులు పలకరించుకోవడానికి ఒక ప్రత్యేకమైన, విశిష్టమైన విధానాన్ని ఉపయోగిస్తారు. పలకరించే వ్యక్తి వారి స్థానిక భాషలో, “క్రీస్తు లేచియున్నాడు!” అంటాడు. అప్పుడు అవతలి వ్యక్తి, “నిజంగా! ఆయన లేచియున్నాడు! అని అంటాడు. ఉదాహరణకు, రష్యా భాష మాట్లాడేవారు ఈస్టరు పలకరింపులను “Христос воскрес” (క్రీస్తు లేచియున్నాడు [పునరుత్థానుడయ్యాడు]!) తో మొదలుపెట్టి, “Воистину! воскрес!” (నిజంగా! ఆయన లేచియున్నాడు!) అని ముగిస్తారు.

  2. మోషైయ 2:41 చూడండి.

  3. హెబ్రీయులకు 11:6. విశ్వాసమనేది “అన్నింటిపై శక్తి, ఆధిపత్యము, అధికారము గల మొదటి గొప్ప పరిపాలక సూత్రము” అని Lectures on Faith (విశ్వాసం మీద ఉపన్యాసాలు) వివరిస్తుంది ([1985], 5).

  4. మత్తయి 11:28–30; ఆల్మా 7:12–13; ఈథర్ 12:27 చూడండి.

  5. మొరోనై 10:7; వివరణ చేర్చబడినది.

  6. ఆల్మా 32:27; వివరణ చేర్చబడినది.

  7. మత్తయి 17:20; వివరణ చేర్చబడినది; హీలమన్ 12:9, 13 కూడా చూడండి.

  8. సిద్ధాంతము మరియు నిబంధనలు 78:17–18 చూడండి. ప్రకృతి సంబంధియైన మనుష్యుని విసర్జించుటకు ప్రతిఫలము, “ప్రభువైన క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము ద్వారా పరిశుద్ధుడు” (మోషైయ 3:19) కావడం.

  9. 1 నీఫై 7:12 చూడండి.

  10. మోర్మన్ 9:19–21; ఈథర్ 12:30 చూడండి.

  11. 2 నీఫై 33:10–11 చూడండి.

  12. సిద్ధాంతము మరియు నిబంధనలు 84:20 చూడండి.

  13. మత్తయి 7:8.

  14. విశ్వాసపు శక్తి లేకుండా, అతడు నిజమని ఎరిగినదానిని తిరస్కరించడానికి నిరాకరించినందుకు అబినడై అగ్నిచేత మరణాన్ని అనుభవిస్తాడా? (మోషైయ 17:7–20 చూడండి). వారు నమ్మినదానిని బహిరంగంగా తిరస్కరించినట్లయితే వారి జీవితాలు మరింత సౌకర్యవంతంగా ఉండగలిగినప్పుడు, ఆ శక్తి లేకుండా ఈథర్ బండ యొక్క సందులో దాగుకుంటాడా (ఈథర్ 13:13–14 చూడండి) మరియు మొరోనై ఒంటరిగా కాలం గడుపుతాడా? (మొరోనై 1:1–3 చూడండి)

  15. మెల్విన్ ఎల్. బాషోర్, హెచ్. డెన్నిస్ టోల్లీ, మరియు బివైయు అగ్రగామి మర్త్య బృందం, “Mortality on the Mormon Trail, 1847–1868,” BYU Studies, vol. 53, no. 4 (2014), 115 చూడండి.

  16. కీర్తనలు 121:4 చూడండి.

  17. మోర్మన్ 9:9.

  18. యెషయా 54:10; 3 నీఫై 22:10 చూడండి.

  19. మోర్మన్ 9:10–11, 15 చూడండి.

  20. మార్కు 9:23 చూడండి.