సర్వసభ్య సమావేశము
పాపం పసివాళ్ళు
2021 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


పాపం పసివాళ్ళు

బలమైన వారు మరియు ప్రయాసపడుతున్నవారు—ప్రతీ వార్డు మరియు శాఖలో మనకు ప్రతిఒక్కరు అవసరము. అందరూ అవసరమే.

ఒక బాలునిగా, నేను మా నాన్నతో కారులో వెళ్తూ, రోడ్డు ప్రక్కన కష్టమైన పరిస్థితులు అనుభవిస్తున్నవారిని లేదా సహాయము అవసరమైన వారిని చూడటం నాకు గుర్తున్నది. మా నాన్న ఎల్లప్పుడు “పోబ్రేసిటో,” అనగా అర్థము “పాపం పసివాళ్ళు,” అని వ్యాఖ్యానించేవాడు.

కొన్ని సందర్భాలలో, ప్రత్యేకంగా మా తాతమామ్మలను చూడటానికి మేము మెక్సికోకు ప్రయాణించినప్పుడు, మా నాన్న వీరిలో అనేకమందికి సహాయపడినప్పుడు గొప్ప ఆసక్తితో నేను గమనించాను. ఆయన సాధారణంగా అవసరమున్న వ్యక్తిని కనుగొని, తరువాత ఏకాంతంగా వెళ్ళి వారికి అవసరమైన సహాయమును అందిస్తాడు. వారిని పాఠశాలలో చేర్చడానికి సహాయపడటం, కొంత ఆహారాన్ని కొనడం లేదా ఏదోవిధంగా వారి శ్రేయస్సు కోసం సహాయం చేయడాన్ని నేను తరువాత కనుగొన్నాను. ఊహించని రీతిలో ఆయనకు తారసపడిన “పాపం పసివారికి” ఆయన పరిచర్య చేస్తున్నాడు. వాస్తవానికి, నేను పెరిగి పెద్దవాడవుతున్న సంవత్సరాలలో స్వయంసమృద్ధిని పొందడానికి ప్రయత్నిస్తుండగా, తలదాచుకోవడానికి ఒక స్థలము అవసరమైన ఎవరైనా మాతో ఉండని సమయం ఎప్పుడూ లేకపోవడం నాకు గుర్తులేదు. ఈ అనుభవాలను గమనించుట నా పొరుగువారి పట్ల మరియు అవసరతలో వున్నవారి కొరకు కనికరముగల లక్షణాన్ని నాలో కల్పించింది.

నా సువార్తను ప్రకటించుడి లో ఇలా వ్యాఖ్యానించును: “మీరు జనుల చేత చుట్టుముట్టబడియున్నారు. మీరు వీధిలో వారిని దాటతారు, వారి ఇండ్లలో వారిని కలుస్తారు, మరియు వారి మధ్యలో ప్రయాణిస్తారు. వారందరూ దేవుని యొక్క పిల్లలు, మీ సహోదర, సహోదరీలు. … వీరిలో అనేకులు జీవితం యొక్క ఉద్దేశాన్ని వెదకుతున్నారు. వారు తమ భవిష్యత్తు, వారి కుటుంబాల కోసం ఆలోచిస్తున్నారు” ( నా సువార్తను ప్రకటించుడి: మిషనరీ సేవకు ఒక మార్గదర్శి [2018],1).

సంఘములో సేవ చేస్తున్న సంవత్సరములంతటా, వారి జీవితాలలో భౌతికంగా మరియు ఆత్మీయంగా, రెండు విధాలుగా అవసరమైన వారిని వెదకడానికి నేను ప్రయత్నించాను. “ప్రోబేసిటో,” పాపం పసివారు, అని చెప్తున్న మా నాన్న స్వరాన్ని నేను తరచుగా విన్నాను.

బైబిలులో ఒక పసివానిని శ్రద్ధ తీసుకొన్న అద్భుతమైన మాదిరిని మనము కనుగొంటాము:

“పగలు మూడు గంటలకు ప్రార్థనకాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్లుచుండగా,

“పుట్టినది మొదలుకొని కుంటివాడైన యొక మనుష్యుడు మోసికొనిపోబడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్లువారిని బిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమను దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచు వచ్చిరి.

“పేతురును యోహానును దేవాలయములో ప్రవేశింపబోవునప్పుడు వాడు చూచి భిక్షమడిగెను.

“పేతురును, యోహానును వానిని తేరి చూచి— మా తట్టు చూడమనిరి.

“వాడు వారి యొద్ద ఏమైన దొరకునని కనిపెట్టుచు వారియందు లక్ష్యముంచెను.

“అంతట పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చు చున్నాను. నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడువుమని చెప్పెను.

“వాడి కుడిచెయ్యి పట్టుకొని లేవనెత్తెను: వెంటనే వాని పాదములును చీలమండలును బలము పొందెను” (అపొస్తలుల కార్యములు 3:1–7; వివరణ చేర్చబడింది).

ఈ వృత్తాంతమును చదువుటలో నేను తేరి చూచుట అనే మాటను ఉపయోగించుట చేత కుతూహలం చెందాను. తేరి చూచుట అనే మాటకు అర్థము ఒకరి కళ్లు, ఆలోచనలకు నడిపించుట, లేక తీక్షణంగా చూచుట అని అర్థము (“fasten,” Dictionary.com చూడండి). పేతురు ఆ వ్యక్తిని చూసినప్పుడు, అతడు ఇతరుల కంటే భిన్నంగా ఇతడిని చూసాడు. నడవలేని ఇతని అసమర్ధతను మించి ఆ వ్యక్తి గురించి అతడు అర్థం చేసుకున్నాడు, స్వస్థపరచబడటానికి మరియు ఇతడు కోరుచున్న దీవెనలు పొందటానికి దేవాలయములో ప్రవేశించడానికి ఇతడి విశ్వాసము సరిపోతుందని గ్రహించగలిగాడు.

పేతరు అతడి కుడిచెయ్యి పట్టుకొని అతడిని పైకిలేవనెత్తాడని నేను గమనించాను. ఈవిధంగా పేతురు అతడికి సహాయపడినప్పుడు, ప్రభువు అతడిని అద్భుతంగా స్వస్థపరిచాడు, మరియు “వాని పాదములును చీలమండలును బలము పొందెను” (అపొస్తలుల కార్యములు 3:7). ఈ వ్యక్తి కోసం అతడి ప్రేమ, అతడికి సహాయపడాలనే కోరిక బలహీనుడైన మనుష్యునిలో శక్తి, సామర్థ్యము హెచ్చించబడినట్లు చేసింది.

ఒక ప్రాంతీయ డెబ్బదిగా సేవ చేస్తుండగా, నాకు బాధ్యతగా ఇవ్వబడిన ప్రాంతంలోని స్టేకు అధ్యక్షులతో పరిచర్య దర్శనాలు చేయడానికి ప్రతీ మంగళవారము రాత్రిని నేను కేటాయించాను. యేసు క్రీస్తు యొక్క సువార్త విధి అవసరతగల వారితో లేక ప్రస్తుతం వారు చేసిన నిబంధనలు పాటించని వారితో అపాయింట్‌మెంట్ తీసుకోమని నేను వారిని ఆహ్వానించాను. మా ఏకరీతిగల, ఉద్దేశ్యపూర్వకమైన పరిచర్య ద్వారా, ప్రభువు మా ప్రయత్నాలను గొప్పవిగా చేసాడు మరియు మేము అవసరతలో ఉన్న వ్యక్తులను, కుటుంబాలను కనుగొనగలిగాము. ఈ “పాపం పసివాళ్ళు,” మేము సేవ చేసిన వేర్వేరు స్టేకులలో నివసించారు.

ఒక సందర్భములో, పరిచర్య దర్శనాలను చేయటానికి, నేను సాండీ కెన్యాను వ్యూ స్టేకు అధ్యక్షుడైన అధ్యక్షుడు బిల్ విట్‌వర్త్‌తోపాటు వెళ్ళాను. నీఫై వలే అదే అనుభవాన్ని కలిగియుండటానికి ప్రయత్నిస్తూ, మేము ఎవరిని దర్శించాలో అని అతడు ప్రార్థించాడు, అతడు “[తాను] చేయవలసిన క్రియలేమో ముందుగా ఎరుగక ఆత్మ చేత నడిపించబడెను” (1 నీఫై 4:6). మేము పరిచర్య చేసినప్పుడు, జాబితాను తగ్గించుట లేక పద్ధతి ప్రకారం వ్యక్తులను సందర్శించడానికి వ్యతిరేకంగా ఎక్కువ అవసరతలో ఉన్న వారికి బయల్పాటు చేత మేము నడిపించబడాలని అతడు రుజువు చేసాడు. మనము ప్రేరేపణ యొక్క శక్తి చేత నడిపించబడాలి.

యువ దంపతులైన జెఫ్, హీధర్, మరియు వారి చిన్ని బాబు, కాయ్‌ ఇంటికి వెళ్ళడం నాకు గుర్తున్నది. జెఫ్ చురుకైన సంఘ సభ్యునిగా ఎదిగాడు. అతడు చాలా ప్రతిభగల క్రీడాకారుడు మరియు విజయవంతమైన నిపుణతగల క్రీడాకారుని వృత్తిలో ఉన్నాడు. అతడు తన యుక్తవయసులో సంఘము నుండి దూరమవటం ప్రారంభించాడు. తరువాత, అతడికి కారు ప్రమాదం జరిగింది, అది అతడి జీవిత గమనాన్ని మార్చివేసింది. మేము వారి ఇంటిలోనికి ప్రవేశించి, పరిచయం చేసుకున్నప్పుడు, తన కుటుంబాన్ని చూడటానికి ఎందుకు వచ్చారని జెఫ్ మమ్మల్ని అడిగాడు. స్టేకు సరిహద్దులలోపల దాదాపు 3,000 సభ్యులు నివసిస్తున్నారని మేము జవాబిచ్చాము. తరువాత అతడిని నేనిలా అడిగాను, “ఈ రాత్రికి మేము సందర్శించగలిగే అన్ని గృహాలలో, ప్రభువు మమ్మల్ని ఎందుకు ఇక్కడకు పంపించాడో మాకు చెప్పండి.”

దానితో జెఫ్ భావావేశం చెందాడు మరియు తన చింతలలో కొన్నిటిని, ఒక కుటుంబంగా వారు వ్యవహరిస్తున్న కొన్ని సమస్యలను చెప్పడం ప్రారంభించాడు. యేసు క్రీస్తు సువార్త యొక్క వివిధ సూత్రములను మేము పంచుకోవడం ప్రారంభించాము. మొదట కష్టంగా అనిపించే కొన్ని నిర్దిష్టమైన పనులను చేయమని మేము వారిని ఆహ్వానించాము కానీ అవి సరైన సమయంలో వారికి గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని తెస్తాయి. తరువాత అధ్యక్షులు విట్‌వర్త్ జెఫ్‌కు తన సవాళ్ళను జయించడానికి అతడికి సహాయపడటానికి ఒక యాజకత్వ దీవెన ఇచ్చారు. జెఫ్, హీధర్ మేము చేయమని వారిని అడిగిన దానిని చేయడానికి అంగీకరించారు.

దాదాపు ఒక సంవత్సర తరువాత, జెఫ్ తన భార్య హీధర్‌కు యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘ సభ్యురాలిగా బాప్తీస్మమివ్వడాన్ని గమనించుట నా విశేషావకాశము. కాలము మరియు నిత్యత్వము కొరకు ఒక కుటుంబంగా ముద్రవేయబడడానికి దేవాలయములో ప్రవేశించడానికి వారు ఇప్పుడు తమను తాము సిద్ధపరచుకుంటున్నారు. మా దర్శనము భౌతికంగా, ఆత్మీయంగా వారి జీవితాల గమనాన్ని మార్చివేసింది.

ప్రభువు ఇలా చెప్పెను:

“కాబట్టి, విశ్వాసముగానుండుము; నేను నీకు నియమించిన స్థానమునందు నిలిచియుండుము; బలహీనులను పోషించుము, వడలిన చేతులను పైకెత్తుము, సడలిన మోకాళ్ళను బలపరచుము” (సిద్ధాంతము మరియు నిబంధనలు 81:5).

“ఈ విషయాలను చేయడంలో, మీ పొరుగువారికి గొప్ప మేలును మీరు చేస్తారు, మరియు మీ ప్రభువైన ఆయన మహిమను హెచ్చిస్తారు” (సిద్ధాంతము మరియు నిబంధనలు 81:4).

సహోదర సహోదరీలారా, మన పరిచర్యలో ఒక ముఖ్యమైన అంశమును అపొస్తలుడైన పౌలు బోధించాడు. మనము “క్రీస్తు యొక్క శరీరమైయుండి వేరు వేరుగా అవయవములై యున్నాము” (1 కొరింథీయులకు 12:27) అని అతడు బోధించాడు, మరియు మొత్తము శరీరము జ్ఞానవృద్ధిపొందుటకు శరీరములో ప్రతీ సభ్యుడు అవసరమైయున్నాడు. తరువాత అతడు ఒక శక్తివంతమైన సత్యమును బోధించాడు, దానిని చదివినప్పుడు అది నా హృదయముపై బలమైన ప్రభావాన్ని కలిగించింది. “శరీరము యొక్క అవయవములలో ఏవి మరి బలహీనములుగా కనబడునో అవి మరి అవశ్యములే: శరీరములో ఏ అవయములు ఘనత లేనివనితలంతుమో ఆ అవయవములు మరి ఎక్కువగాఘనపరచుచున్నాము” (1 కొరింథీయులకు 12:22–23; వివరణ చేర్చబడింది).

దీని ఫలితంగా ప్రతీ వార్డు మరియు శాఖలో మనకు బలమైనవారు, ప్రయాసపడుతున్నవారు—ప్రతిఒక్కరు మనకు అవసరం. “క్రీస్తు యొక్క శరీరము” ఆవశ్యకముగా జ్ఞానాభివృద్ధి చెందుటకు అందరూ అవసరము. మన వేర్వేరు సమూహాలలో మనల్ని బలపరచి, మనల్ని సంపూర్ణంగా చేయగల మనము కోల్పోయిన వారెవరని నేను తరచుగా ఆశ్చర్యపడ్డాను.

ఎల్డర్ డి. టాడ్ క్రిస్టాఫర్సన్ ఇలా బోధించారు: “సంఘంలో మనం దైవిక సిద్ధాంతాన్ని నేర్చుకోవడమే కాదు; మనం దాని అనువర్తనాన్ని కూడా అనుభవిస్తాము. క్రీస్తు శరీరముగా, సంఘ సభ్యులు రోజువారీ జీవిత వాస్తవికతలో ఒకరికొకరు పరిచర్య చేస్తారు. మనలో ఎవరును పరిపూర్ణులు కారు. … క్రీస్తు శరీరంలో, మనం ‘ప్రేమలో కలిసి జీవించడం’ నేర్చుకునేటప్పుడు, భావనలు మరియు ఉన్నతమైన పదాలకు మించి నిజమైన ‘ప్రత్యక్షమైన’ అనుభవం కలిగియుండాలి [సిద్ధాంతము మరియు నిబంధనలు 42:45]” (“సంఘము ఎందుకు,” లియహోనా, నవం. 2015, 108–9).

చిత్రం
బ్రిగం యంగ్ యొక్క స్వప్నము

1849లో, బ్రిగం యంగ్‌కు కలిగిన స్వప్నములో, ఆయన ప్రవక్త జోసెఫ్ స్మిత్ పెద్ద గొఱ్ఱెలు, మేకల మందను కాయడం ఆయన చూసారు. ఈ జంతువులలో కొన్ని పెద్దవి అందమైనవి; మిగిలినవి చిన్నవి, మురికిగా ఉన్నాయి. బ్రిగమ్ యంగ్‌ జోసెఫ్ స్మిత్ కళ్ళలోనికి చూచి, ఇలా చెప్పటం జ్ఞాపకంముంచుకున్నాడు, “జోసెఫ్, నేను ఎప్పుడూ చూడని అసాధారణమైన మందను … నీవు కలిగియున్నావు; నీవు దానితో ఏమి చేయబోతున్నావు?” క్రమముగాలేని ఈ మందను చూసి చింతించనట్లు కనబడిన ప్రవక్త, కేవలము జవాబిచ్చాడు, “వాటి స్థానములలో అవన్నీ మంచిగా ఉన్నాయి.”

అధ్యక్షులు యంగ్ మేల్కొనినప్పుడు, సంఘము వివిధరకాల “గొఱ్ఱెలను, మేకలను,” సమకూరుస్తుండగా, అందరిని లోపలికి తెచ్చి మరియు సంఘములో వారి స్థానములను తీసుకొన్నప్పుడు వారి పూర్తి సాధ్యతను గ్రహించుటకు వారిలో ప్రతిఒక్కరిని అనుమతించుట తన బాధ్యత అని అతడు గ్రహించాడు. (Adapted from Ronald W. Walker, “Brigham Young: Student of the Prophet,” Ensign, Feb. 1998, 56–57.)

సహోదర సహోదరీలారా, నా ప్రసంగము యొక్క ప్రారంభం, యేసు క్రీస్తు యొక్క సంఘములో ప్రస్తుతం చురుకుగా పాల్గొనని ఒక వ్యక్తి గురించి నేను లోతుగా ఆలోచించినప్పుడు వచ్చింది. ఒక క్షణము నేను వారిలో ప్రతిఒక్కరితో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాను. ఎల్డర్ నీల్ ఎ. మాక్స్‌వెల్ ఇలా బోధించారు, “అటువంటి వ్యక్తులు తరచుగా దగ్గరలో ఉంటారు--- కానీ సంఘములో — పూర్తిగా పాల్గొనరు. వారు సంఘ భవనం లోపలికి రారు, కానీ వారి దాని ద్వారమును విడిచివెళ్ళరు. వీరికి సంఘము అవసరము, మరియు వారు అవసరమైనయున్నారు, కానీ కొంత భాగం, ‘లోకములో దేవుడు లేకుండా జీవిస్తారు’ [మోషైయా 27:31]” (“ఇప్పుడు ఎందుకు కాదు?,” ఎన్‌సైన్, నవం. 1974, 12).

మన క్రొత్త ప్రవక్తగా సంఘ సభ్యత్వముతో ఆయన మొదట మాట్లాడినప్పుడు, మన ప్రియమైన ప్రవక్త అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ యొక్క ఆహ్వానమును నేను అంగీకరిస్తాను. ఆయన ఇలా అన్నారు: “ఇప్పుడు, సంఘములో ప్రతీ సభ్యునితో నేను చెప్తున్నాను: నిబంధన మార్గములో ఉండండి. రక్షకునితో నిబంధనలు చేసి, ఆ నిబంధనలు పాటించడం ద్వారా ఆయనను అనుసరించాలనే మీ నిబద్ధత ప్రతిచోటా ఉన్న పురుషులు, స్త్రీలు మరియు పిల్లలకు లభించే ప్రతి ఆత్మీయ దీవెన మరియు విశేషాధికారానికి ద్వారాన్ని తెరుస్తుంది. ”

తరువాత ఆయన ఇలా వేడుకున్నారు: “ఇప్పుడు మీరు ఆ మార్గము తప్పిన యెడల, దయచేసి తిరిగి రమ్మని నా హృదయములోని సమస్త నిరీక్షణతో నేను మిమ్మల్ని ఆహ్వానించనా. మీ చింతలు ఏవైనప్పటికినీ, మీ సవాళ్ళు ఏవైనప్పటికినీ, ఈ ప్రభువు యొక్క సంఘములో, మీకు ఒక స్థానమున్నది. మీరు, ఇంకా పుట్టని తరములు నిబంధన మార్గమునకు తిరిగి వెళ్ళుటకు ఇప్పుడు మీ క్రియల చేత దీవించబడతారు” (“As We Go Forward Together,” లేదా Liahona, Apr. 2018, 7; వివరణ చేర్చబడింది).

మనందరికి ప్రవీణుడైన పరిచారకుడు మరియు రక్షకుడైన యేసు క్రీస్తు, ఆయనను గూర్చి నేను సాక్ష్యమిస్తున్నాను. “ పోబ్రేసిటోస్ ”, మనలో అవసరతలో ఉన్న “పాపం పసివాళ్ళను” వెతకాలని మనలో ప్రతి ఒక్కరినీ ఆహ్వానిస్తున్నాను. యేసు క్రీస్తు నామములో ఇది నా సాక్ష్యము, ఆమేన్.