సర్వసభ్య సమావేశము
ఇది మన సమయం!
2021 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


ఇది మన సమయం!

చరిత్రలో ఈ చిరస్మరణీయమైన సమయమందు, దేవుడు మనల్ని ఇక్కడకు పంపాడు.

1978లో, నేను 65,000 అభిమానులతో కిక్కిరిసిన స్టేడియమ్‌లో ఫుట్‌బాల్ ఆటస్థలములో నిలబడియున్నాను. నా ముందు కొందరు చాలా భారీ ప్రత్యర్ధులున్నారు వారు నా తలను తీసేయ్యాలని కోరుతున్నట్లుగా కనబడ్డారు. నేషనల్ ఫుట్‌బాల్ లీగ్‌లో ప్రారంభ క్వార్టర్‌బాక్‌గా ఇది నా మొదటి ఆట మరియు మేము మునుపటి సంవత్సరం నుండి లీగ్ ఛాంపియన్లుగా ఆడుతున్నాము. నిజాయితీగా చెప్పాలంటే, నేను పోటీపడటానికి తగినంత మంచిగా ఉన్నానా అని ప్రశ్నించుకున్నాను. నా మొదటి పాస్ విసిరేందుకు నేను వెనక్కి తగ్గాను, నేను బంతిని విడుదల చేస్తున్నప్పుడు, నేను ఇంతకు ముందు కొట్టబడిన దానికంటే ఎక్కువ గట్టిగా కొట్టబడ్డాను. ఆ క్షణమందు, ఆ భారీ అథ్లెట్ల కుప్ప కింద పడి, నేను అక్కడ ఏమి చేస్తున్నానో అని ఆశ్చర్యపోయాను. నేను చేయాల్సిన ఒక నిర్ణయమున్నది. నా సందేహాలు నన్ను జయించేలా నేను చేయాలా లేక పైకిలేచి, ముందుకు సాగడానికి నేను ధైర్యమును, బలమును కనుగొనాలా?

చిత్రం
మొదటి పాస్

సంబంధిత గుంపు

భవిష్యత్తు అవకాశాల కొరకు ఈ అనుభవము నన్ను ఎలా సిద్ధపరుస్తుందో ఆ సమయమందు నేను గ్రహించలేదు. కష్టమైన పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు నేను బలముగా ధైర్యముగా, ఉండగలనని నేను నేర్చుకోవాల్సిన అవసరమున్నది.

ప్రభువు యొక్క సేవకునిగా మీరు ఎదుర్కొనే సవాళ్ళ కంటే ఫుట్‌బాల్ క్రీడ అంత ముఖ్యమైనది కాకపోవచ్చు. అనేక సందర్భాలలో, అక్కడ చూస్తున్న జనులతో నిండిన స్టేడియమ్ ఉండకపోవచ్చు. కానీ మీ సాహసముగల నిర్ణయాలు నిత్య ప్రాముఖ్యతను కలిగియుండగలవు.

మీరు ఎల్లప్పుడు సవాళ్ళను విజయవంతంగా జయించలేకపోవచ్చు. కానీ మీ పరలోక తండ్రి ఆయన రాజ్యమును నిర్భయముగా నిర్మించువారిగా మిమ్మల్ని చూస్తున్నారు. అందుకే ఆయన మిమ్మల్ని ప్రపంచ చరిత్రలో చాలా నిర్ణయాత్మక సమయంలో ఇక్కడకు పంపాడు. ఇది మన సమయం!

సంఘ అధ్యక్షుడైన తరువాత వెంటనే అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ చెప్పిన దానిని వినండి: “మన రక్షకుడు, విమోచకుడైన యేసు క్రీస్తు, ఇప్పుడు మరియు ఆయన మరల తిరిగి వచ్చినప్పుడు, ఆయన అద్భుతకార్యములలో కొన్నిటిని నెరవేరుస్తాడు. తండ్రియైన దేవుడు, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ఈ సంఘముపైగా ఘనత, మహిమయందు అధ్యక్షత్వము వహిస్తాడనే అద్భుతమైన సూచనలను మనము చూస్తాము” (“Revelation for the Church, Revelation for Our Lives,” Liahona, May 2018, 96).

ఘనమైన కార్యములు? అద్భుతమైన సూచనలు? అది ఏలా కనిపిస్తుంది? మనము ఏ పాత్రను పోషిస్తాము మరియు మనము ఏమి చేయాలో ఎలా గ్రహిస్తాము? జవాబులు అన్నీ నాకు తెలియదు, కానీ ప్రభువుకు మనము సిద్ధపడియుండాల్సిన అవసరమున్నదని నాకు తెలుసు! యాజకత్వపు అధికారాన్ని యోగ్యతగా సాధన చేయుట ఎన్నడూ ఇంత కీలకమైనదిగా లేదు.

దేవుని ప్రవక్తను మనము నమ్ముతామా? మన గమ్యమును కనుగొని మనము నెరవేరుస్తామా? అవును, మనము చేయగలం, మనము తప్పక చేయాలి, ఎందుకనగా ఇది మన సమయం!

మనముందు వచ్చిన మోషే మరియ, మొరోనై, ఆల్మా, ఎస్తేరు, యోసేపు మరియు అనేకమంది ఇతరులు—దేవుని యొక్క బలమైన సేవకుల వృత్తాంతములను మనము విన్నప్పుడు—వారు ఎక్కువ ముఖ్యమైన వారుగా కనబడతారు. కానీ వారు మనకంటె అంత భిన్నంగా లేరు. వారు సవాళ్ళను ఎదుర్కొన్న సాధారణమైన జనులు. వారు ప్రభువునందు నమ్మకముంచారు. నిర్ణయాత్మక క్షణములందు వారు సరైన ఎంపికలు చేసారు. మరియు యేసు క్రీస్తునందు విశ్వాసముతో, వారు తమ కాలంలో అవసరమైన కార్యములను నెరవేర్చారు.

చిత్రం
ప్రవక్తయైన యెహోషువ

మంచి ఉప్పు

పాత నిబంధన నాయకుడు యెహోషువను పరిగణించండి. అతడు చరిత్రలో గొప్ప నాయకులలో ఒకడైయుండి, మోషేను భక్తిగా అనుసరించాడు. మోషే వెళ్ళిపోయిన తరువాత, అది యెహోషువ సమయము. అతడు ఇశ్రాయేలీయులను వాగ్దాన దేశములోనికి నడిపించాలి. అతడు దానిని ఎలా చేయాలి? యెహోషువ ఐగుప్తులో జన్మించి, దాస్యములో పెంచబడ్డాడు. అతడికి సహాయపడటానికి చేతి పుస్తకము లేక సూచనలు గల వీడియోలను కలిగిలేడు. అతడికి స్మార్ట్ ఫోను లేదు! కానీ అతడు ప్రభువు నుండి ఈ వాగ్దానమును పొందాడు:

“నేను మోషేకు తోడైయుండినట్లు నీకును తోడైయుందును: నేను విడువను, ఎడబాయను.

“నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము” (యెహోషువ1:5–6).

నేను క్రొత్త, అనుభవములేని డెబ్బదిగా ఉన్నప్పుడు, హాస్పిటల్‌లో ఉన్న యువకుని—వెంటనే కలుసుకోవడానికి ప్రవక్తకు ప్రతినిధిగా నేను ఉంటానా అని అడుగుతూ, ప్రథమ అధ్యక్షత్వములోని కార్యాలయమునుండి నాకు ఒక అత్యవసర ఫోను వచ్చింది. ఆ యువకుని పేరు జాక్. అతడు ఒక మిషనరీగా ఉండటానికి సిద్ధపడుతున్నాడు కానీ అతడికి ఒక ప్రమాదము జరిగి తలకు తీవ్రమైన గాయముతో బాధపడుతున్నాడు.

నేను ఆసుపత్రికి వెళ్ళినప్పుడు, నేను వేగంగా ఆలోచించాను. ప్రవక్త కొరకు ఒక కార్యమా—ఇది నిజమా? నేను ఏమి ఎదుర్కొబోతున్నాను? నేను ఈ యువకునికి ఎలా సహాయపడతాను? నాకు తగినంత విశ్వాసము ఉన్నదా? మనఃపూర్వకమైన ప్రార్థన మరియు పరిశుద్ధ యాజకత్వ అధికారమును నేను కలిగియున్నాననే జ్ఞానము శాంతిని పొందడానికి నేను దృష్టిసారించగల ఆలోచనలయ్యాయి.

నేను వెళ్ళినప్పుడు, జాక్ ఆసుపత్రి మంచముపై పడుకొనియున్నాడు. ఆసుపత్రి సహాయకుడు అతడిని శస్త్ర చికిత్స చేసే గదిలోని తీసుకొని వెళ్ళడానికి సిద్ధంగా నిలబడియున్నాడు, ఆవిధంగా వైద్యులు అతడి మెదడుపైన ఒత్తిడిని తీసివేయగలరు. కన్నీళ్ళతో నిండిన అతడి తల్లి, భయంగా చూస్తున్న యౌవన స్నేహితుడు దగ్గరగా నిలబడియున్నారు, మరియు జాక్‌కు ఒక యాజకత్వ దీవెన అవసరమని నాకు స్పష్టంగా తెలుసు. అతడి స్నేహితుడు ఈమధ్యనే మెల్కీసెదకు యాజకత్వమును పొందాడు, గనుక నాకు సహాయపడమని నేను అతడిని అడిగాను. మేము వినయంగా జాక్‌కు ఒక దీవెన ఇచ్చినప్పుడు యాజకత్వము యొక్క శక్తిని నేను అనుభూతి చెందాను. తరువాత అతడు శస్త్ర చికిత్స కోసం తీసుకొనిపోబడ్డాడు, మరియు ఆయన జ్ఞానము ప్రకారము రక్షకుడు విషయాలను పరిష్కరిస్తాడని శాంతికరమైన భావన నిర్ధారించింది.

వైద్య బృందము మొదట కోయకముందు, ఒక చివరి ఎక్స్‌రే తీసారు. వారి విస్మయానికి, ఏ శస్త్ర చికిత్స అవసరము లేదని వారు కనుగొన్నారు.

చాలా చికిత్స తరువాత, జాక్ నడవడం మరలా మాట్లాడటం నేర్చుకున్నాడు. అతడు విజయవంతమైన మిషను సేవ చేసాడు, మరియు ఇప్పుడు ఒక అందమైన కుటుంబాన్ని పెంచుతున్నాడు.

వాస్తవంగా, ఇది ఎల్లప్పుడూ కలిగే ఫలితం కాదు. సమాన విశ్వాసముతో నేను మిగిలిన యాజకత్వ దీవెనలు ఇచ్చాను, మరియు ఈ జీవితంలో పూర్తి స్వస్థతను ఇవ్వడం ప్రభువు చిత్తము కాదు. ఆయన శక్తిని, ఉద్దేశ్యములను మనము నమ్ముతాము మరియు ఫలితాలను ఆయనకే వదిలేస్తాము. మన క్రియల ఫలితాన్ని మనము ఎల్లప్పుడు ఎంపిక చేయలేము, కానీ అమలు చేయడానికి సిద్ధంగా ఉండటానికి మనము ఎంపిక చేయగలము.

ప్రాణాంతక పరిస్థితుల్లో వారికి ప్రతినిధిగా ఉండమని మిమ్మల్ని ప్రథమ అధ్యక్షత్వము అడగకపోవచ్చు. కానీ ప్రభువు యొక్క ప్రతినిధులుగా జీవితాన్ని-మార్చే విషయాలను చేయడానికి మనము పిలవబడ్డాము. ఆయన మనల్ని విడిచిపెట్టడు. ఇది మన సమయం!

యేసు నీటిపై నడవటం అతడు చూసినప్పుడు, రక్షకుని యొక్క ప్రధాన అపొస్తలుడైన పేతురు సముద్రముపై ఓడలో ఉన్నాడు. అతడు ఆయనను చేరుకోవాలని కోరగా, “రమ్మని” రక్షకుడు అడిగాడు. ధైర్యముగా, అద్భుతంగా, పేతురు పడవ యొక్క క్షేమాన్ని విడిచిపెట్టి, రక్షకుని వైపు నడవసాగాడు. కానీ పేతురు ఘోరమైన గాలిపై దృష్టిసారించినప్పుడు, అతడి విశ్వాసము క్షీణించింది. “అతడు భయపడి; మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యిచాపి అతని పట్టుకొనెను” (మత్తయి 14:22–33 చూడండి). (మత్తయి 14:22-33 చూడండి.)

చిత్రం
యేసు సమీపించుట

మన జీవితాలలో దుర్దశ, కష్టములు కలిగినప్పుడు మన దృష్టి ఎక్కడున్నది? జ్ఞాపకముంచుకొనండి, అక్కడ బలము, ధైర్యము యొక్క నమ్మకమైన ఆధారము ఎల్లప్పుడూ ఉంటుంది. పేతురు వైపు అవి చాపబడినట్లుగా, యేసు యొక్క బాహువులు మనవైపు చాపబడినవి. మనము ఆయనను చేరుకున్నప్పుడు, ఆయన మనల్ని ప్రేమతో విడిపిస్తాడు. మనం ఆయనవారము. “భయపడవద్దు: నేను నిన్ను విమోచించియున్నాను, పేరు పెట్టి నేను నిన్ను పిలిచియున్నాను; నీవు నా సొత్తు” (యెషయా 43:1). మీరు అనుమతించిన యెడల ఆయన మీ జీవితమును ప్రభావితం చేస్తాడు. ఎంపిక మీదే! రస్సెల్ ఎమ్. నెల్సన్, “దేవునికి మిక్కిలి ప్రాధాన్యతనిమ్ము,” లియహోనా, నవ. 2020, 92 చూడండి.

తన జీవితం ముగింపులో, యెహోషువ తన జనులను ఇలా వేడుకొన్నాడు, “మీరు ఎవని సేవించెదరో, నేడు మీరు కోరుకొనుడి; … నేను నా యింటివారము యెహోవాను సేవించెదము” (యెహోషువ 24:15). ప్రభువును సేవించడానికి అతడు చేసిన ఎంపికల వలన, యెహోషువ తన కాలములో గొప్ప నాయకుడు అయ్యాడు. నా ప్రియమైన స్నేహితులారా, ఇది మన సమయము! మన ఎంపికలు మన గమ్యమును తీర్మానిస్తాయి (Thomas S. Monson, “Decisions Determine Destiny” [Brigham Young University fireside, Nov. 6, 2005], speeches.byu.edu చూడండి.)

నేను ఒక బిషప్పుగా సేవ చేస్తుండగా, మా వార్డుకు ఒక ప్రతిజ్ఞను మేము కలిగియున్నాము: మంచి ఎంపికలు నిత్యమైన సంతోషమును తెస్తాయి. “బిషప్పు, నేను మంచి ఎంపికలు చేస్తున్నాను!” అని చెప్తూ యువత హాలులో నన్ను దాటి వెళ్తారు. అది ఒక బిషప్పు యొక్క ఆకాంక్ష!

“మంచి ఎంపికలు” అనగా మన ఉద్దేశ్యమేమిటి? ఎవరో ఒకసారి యేసును అడిగారు, “ధర్మశాస్త్రములో గొప్ప ఆజ్ఞ ఏది?” ఆయన సమాధానమిస్తూ:

“నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను.

“ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ.

“నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దానివంటిదే” (మత్తయి 22:36–39).

మీ గురించి నాకు తెలియదు, కానీ ఈ రెండు గొప్ప ఆజ్ఞలను నేను చదివినప్పుడు, నిన్ను నీవు ప్రేమించుకొనుమనే మూడవ ఆజ్ఞ సూచించబడిందని నేను కనుగొన్నాను.

మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం ఒక ఆజ్ఞగా మీరు ఎప్పుడైన ఆలోచించారా? మనల్ని మనం ప్రేమించుకోని యెడల దేవునిని, ఆయన పిల్లల్ని నిజంగా మనము ప్రేమించగలమా?

సంవత్సరాలుగా హాని కలిగించే నాశనకరమైన ఎంపికలను జయించడానికి ప్రయత్నిస్తున్న ఒక వ్యక్తికి ఒక తెలివైన నాయకుడు ఈమధ్య సలహా ఇచ్చాడు. ఆ వ్యక్తి సిగ్గుపడ్డాడు, ఎవరి ప్రేమను పొందడానికి తాను అర్హుడను కానని సందేహించాడు.

“ప్రభువు నిన్ను ఎరిగియున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు, మరియు నీవు తీసుకొంటున్న ధైర్యముగల నిర్ణయాలతో చాలా సంతోషిస్తున్నాడు,” అని అతడి నాయకుడు అతడితో చెప్పాడు. కానీ తరువాత అతడు అన్నాడు, “నిన్ను నీవు ప్రేమించుకోవాలనే ఆజ్ఞను [నీవు] వినాలి ఆవిధంగా [దేవుని యొక్క] ప్రేమను అనుభవించగలవు, మరియు ఇతరులను ప్రేమించగలవు.”

ఈ సహోదరుడు ఆ సలహాను విన్నప్పుడు, అతడు క్రొత్త కళ్ళతో జీవితాన్ని చూసాడు. తరువాత అతడు చెప్పాడు, “శాంతి మరియు అంగీకారమును కనుగొనడానికి ప్రయత్నిస్తూ నా సమస్త జీవితాన్ని నేను గడిపాను. అనేక తప్పుడు స్థలములలో నేను ఆ విషయాల కోసము చూసాను. పరలోక తండ్రి మరియు రక్షకుని యొక్క ప్రేమయందు మాత్రమే నేను ఓదార్పు కనుగొనగలను. నన్ను నేను ప్రేమించుకోవాలని వారు కోరుతున్నారని నేనెరుగుదును; ఇది నిజంగా నా కోసం వారి ప్రేమను నేను అనుభవించగల ఏకైక విధానము.”

మనల్ని మనం ప్రేమించుకోవాలని—తద్వారా మనము అహంకారంగా లేదా స్వార్థపరులమైనంతగా కాదు, కానీ ఆయన గారాబం చేసిన పిల్లలుగా: ఆయన మనల్ని చూచినట్లుగా మనల్ని మనల్ని మనం చూడాలని మన పరలోక తండ్రి కోరుతున్నారు. మీరు దేవుడు ప్రేమించిన బిడ్డని మీరు నిజంగా నమ్మినప్పుడు, దేవుని కొరకు మీ ప్రేమ వృద్ధి చెందుతుంది. నిజాయితీగల గౌరవంతో మనల్ని మనం చూసినప్పుడు, అదేవిధంగా ఇతరులను చూడటానికి మన హృదయాలు తెరవబడతాయి. మీకు గల ప్రతిభలు, మీరు కలిగియున్న వరములతో సాధ్యమైన గొప్ప మేలును చేయగలుగునట్లు చరిత్రలో ఈ చిరస్మరణీయమైన సమయమందు, ఇప్పుడు, దేవుడు మిమ్మల్ని ఇక్కడికి పంపాడని, మీ దైవిక విలువను మీరు ఎంత ఎక్కువగా గుర్తిస్తే, ఈ దైవిక సత్యమును మీరు అంత బాగా గ్రహిస్తారు. ఇది మన సమయం! ఇది మీ సమయం! (రస్సెల్ ఎమ్. నెల్సన్, Becoming True Millennials” [worldwide devotional for young adults, Jan. 10, 2016], broadcasts.ChurchofJesusChrist.org చూడండి.)

ప్రతీ యుగములో, ప్రతీ ప్రవక్త, “మనము జీవిస్తున్న రోజుకు సంతోషకరమైన ఎదురుచూపుతో వేచియున్నారు; … వారు మన దినమును గూర్చి పాడారు, వ్రాసారు, మరియు ప్రవచించారు; … మనము కడవరి-దిన మహిమను తెచ్చుటకు దేవుడు [ఎంపిక] చేసిన ప్రియమైనవారము” (Teachings of Presidents of the Church: Joseph Smith [2007], 186) అని జోసెఫ్ స్మిత్ బోధించెను.

మీ అనుదిన సవాళ్ళను మీరు ఎదుర్కొన్నప్పుడు, ఎల్డర్ జెఫ్రీ ఆర్. హాల్లండ్ ఇచ్చిన ఈ అభయాన్ని జ్ఞాపకముంచుకోండి: “చాలా అధికమైన బాధ్యత మనపై ఉన్నది, కానీ అది మహిమకరమైన మరియు విజయవంతమైన అనుభవము. … ఈ అంతిమ పోటీలో విజయము ముందుగానే ప్రకటించబడింది. వ్రాయబడిన గ్రంథాలైన …, లేఖనాలలో!” విజయము ఇదివరకే ఉన్నది. (“Be Not Afraid, Only Believe” [address to Church Educational System religious educators, Feb. 6, 2015], broadcasts.ChurchofJesusChrist.org).

రక్షకుడు తిరిగి వచ్చినప్పుడు మహిమగల దినము కొరకు మనల్ని మనం సిద్ధపరచుకొన్నప్పుడు మన వ్యక్తిగత పాత్రలను గుర్తించి, స్వీకరించుటకు మనమందరం ప్రార్థించాలనే ఒక ఆహ్వానమును నేను మీకివ్వనా. మనం గ్రహించే దానికంటే ఎక్కువగా ప్రభువు మనల్ని ప్రేమిస్తున్నాడు, మరియు ఆయన మన ప్రార్థనలకు జవాబిస్తాడు. మనము ఫుట్‌బాల్ రంగస్థలములో ఉన్నా, హాస్పిటల్ గదిలో, లేక ఏ ఇతర స్థలములో ఉన్నప్పటికినీ, మనము దాని యొక్క ముఖ్య భాగమవుతాము—ఎందుకనగా ఇది మన సమయము! యేసు క్రీస్తు నామములో, ఆమేన్.