సర్వసభ్య సమావేశము
సువార్త వెలుగు యొక్క సత్యము, ప్రేమ
2021 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


సువార్త వెలుగు యొక్క సత్యము, ప్రేమ

సువార్త వెలుగు యొక్క సత్యము, ప్రేమ నేడు భూమి అంతటా ఉజ్వలంగా ప్రకాశిస్తుందని నేను సాక్ష్యమిస్తున్నాను.

కడవరి దిన పరిశుద్ధుల మనోహరమైన కీర్తన “సమస్త రాజ్యములారా, వినండి!” సమస్త లోకములోనికి వెళ్ళుచున్న సంపూర్ణ సువార్త యొక్క ఉత్సాహమును, ఉల్లాసమును నిస్సందేహంగా సంగ్రహిస్తుంది. ఈ కీర్తనలో మనము పాడతాం:

“సమస్త రాజ్యములారా, వినండి!” పరలోకము యొక్క స్వరము వినండి

అందరూ సంతోషించగల ప్రతీ భూమి ద్వారా

మహిమ దూతలు పల్లవిని కేకలు వేస్తారు:

సత్యము మరొకసారి పునఃస్థాపించబడింది!1

గొప్ప సంతోషాన్ని వ్యక్తపరిచిన పదముల రచయత, లూయీస్ ఎఫ్. మాంక్, ఒక జర్మను పరివర్తన చెందిన వ్యక్తి, ఐరోపాలో పూర్తి-కాల సువార్త పరిచర్య చేస్తుండగా స్విట్జ్‌ర్లాండ్‌లో నివసిస్తుండగా, కీర్తన కొరకు ప్రేరేపించబడిన మాటలను వ్రాసాడు.2 పునఃస్థాపన ప్రపంచంపై చూపిన ప్రభావాన్ని చూసినప్పుడు కలిగే ఆనందం కీర్తన యొక్క ఈ క్రింది మాటలలో స్పష్టంగా చెప్పబడింది:

చీకటిలో అన్వేషిస్తూ, రాజ్యములు దుఃఖించాయి;

ఉదయము కొరకు గమనిస్తూ, వారు సత్య పునఃస్థాపన కోసం ఎదురుచూసారు.

ఇప్పుడు అందరూ సంతోషిస్తున్నారు; సుదీర్ఘమైన రాత్రి ముగిసింది.

మరొకసారి సత్యము భూమి మీదున్నది!3

దాదాపు 200 సంవత్సరాల క్రితం నుండి కొనసాగుతున్న పునఃస్థాపన ప్రారంభానికి కృతజ్ఞతలు, “సువార్త వెలుగు యొక్క సత్యము, ప్రేమ”4 ఇప్పుడు భూమి అంతటా ఉజ్వలంగా ప్రకాశిస్తున్నది. దేవుడు “ఎవరిని గద్దింపక అందరికిని ధారాళముగ దయచేయువాడు”5 అని 1820 లో ప్రవక్త జోసెఫ్ తెలుసుకున్నాడు, అప్పటినుండి మిలియన్ల కంటే ఎక్కువమంది తెలుసుకున్నారు.

ఈ కడవరి యుగములో సంఘము స్థాపించబడిన వెంటనే, ప్రభువు జోసెఫ్ స్మిత్‌తో మాట్లాడాడు మరియు ఇలా చెప్పినప్పుడు మన కోసం ఆయన సమృద్ధియైన ప్రేమను ప్రత్యక్షపరిచాడు:

“కాబట్టి, ప్రభువైన నేను, భూలోక నివాసులందరిపైకి రాబోవు విపత్తునెరిగి, నా సేవకుడైన జోసెఫ్ స్మిత్ జూ. ను పిలిచి, పరలోకము నుండి మాట్లాడి, ఆజ్ఞలనిచ్చితిని; …

“నా నిత్య నిబంధన స్థిరపరచబడాలని;

“నా సంపూర్ణ సువార్త భూదిగంతముల వరకు, బలహీనులు, సామాన్యులచేత ప్రకటింపబడవలెను.”6

ఈ బయల్పాటు ఇవ్వబడిన తరువాత వెంటనే సువార్తికులు పిలవబడి, ప్రపంచంలోని అనేక రాజ్యాలకు పంపబడ్డారు. ప్రవక్త నీఫై ఊహించినట్లుగా, పునఃస్థాపించబడిన సువార్త సందేశము, “సమస్త జనములు, వంశములు, భాషలు మరియు ప్రజల మధ్య” ప్రకటించబడుట ప్రారంభమయ్యెను.7

“1830లో అమెరికాలో న్యూయార్క్ ఉత్తరభాగంలో ఒక చిన్న చెక్క గదిలో యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము అధికారికంగా నిర్వహించబడింది.

“1947 వరకు—సంఘము ప్రారంభంలో ఆరుగురు సభ్యులనుండి ఒక మిలియన్ వరకు ఎదగడానికి—117 సంవత్సరాలు పట్టింది. సంఘము దాని ప్రారంభపు దినములనుండి సువార్తికులు దాని సహజ లక్షణము, 1837లో స్వదేశ అమెరికా దేశము నుండి, కెనడా వరకు, ఉత్తర అమెరికా ఖండమును మించి ఇంగ్లండ్‌కు అనేక దిశలలో విస్తరించబడింది. కొంతకాలం తర్వాత, సువార్తికులు ఐరోపా ఖండంలో, భారతదేశం మరియు పసిఫిక్ ద్వీపాలు ఉన్నంత దూరంగా పని చేస్తున్నారు.

“16 సవత్సరాలు తరువాత 1963లో, సంఘము రెండు మిలియన్ల సభ్యులను కలిగియున్నది, మరియు ఇంకా ఎనిమిది సంవత్సరాలలో మూడు మిలియన్లు చేరుకున్నది.”8

సంఘము యొక్క వేగవంతమైన వృద్ధిని ప్రముఖంగా పేర్కొంటూ అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఈమధ్య చెప్పారు: “యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘములో ప్రభువు యొక్క కార్యము అత్యధిక వేగముగా ముందుకు సాగుతున్నది. సంఘము అపూర్వమైన, అసమానమైన భవిష్యత్తును కలిగియున్నది.”9

యేసు క్రీస్తు యొక్క సువార్త దాని సంపూర్ణతలో పునఃస్థాపించబడుట, ప్రభువు యొక్క జీవిస్తున్న సంఘ నిర్మాణము భూమి మీద మరలా ఉన్నది, మరియు అప్పటి నుండి దాని అసాధారణమైన అభివృద్ధి భూమి అంతటా యాజకత్వపు దీవెనలు లభ్యమగునట్లు చేసింది. దేవునికి మనల్ని బద్ధులనుగా చేసి, నిబంధన మార్గములో మనల్ని ఉంచే పరిశుద్ధ విధులు మరియు నిబంధనలు “దైవత్వము యొక్క శక్తిని”10 స్పష్టంగా ప్రత్యక్షపరుస్తాయి. జీవిస్తున్నవారికి, మృతుల కొరకు ఈ పరిశుద్ధ విధులందు మనము పాల్గొన్నప్పుడు, మనము తెరకు రెండువైపుల ఇశ్రాయేలును సమకూరుస్తున్నాము మరియు రక్షకుని రెండవ రాకడ కొరకు భూమిని సిద్ధపరుస్తున్నాము.

1973 ఏప్రిల్‌లో, నా తల్లిదండ్రులు, నేను దేవాలయంలో ముద్రించబడడానికి మా స్వదేశమైన అర్జెంటీనా నుండి ప్రయాణించాము. అప్పుడు ఆ సమయంలో లాటిన్ అమెరికా అంతటిలో ఏ దేవాలయాలు లేవు కనుక, మేము సాల్ట్‌లేక్ దేవాలయంలో ముద్రించబడడానికి ఒకవైపు 6,000 మైళ్ళకు పైగా విమానంలో వెళ్ళాము. ఆ సమయంలో నేను కేవలము రెండు సంవత్సరాల వాడిని, మరియు ఆ ప్రత్యేక అనుభవాన్ని గూర్చి నాకు పూర్తి జ్ఞాపకము లేనప్పటికినీ, ఆ ప్రయాణం నుండి మూడు ప్రత్యేకమైన జ్ఞాపకాలు చాలా స్పష్టంగా గుర్తున్నాయి, అప్పటి నుండి నిలిచియున్నవి.

చిత్రం
విమానం కిటికీ నుండి కనిపించే దృశ్యము

మొదటిది, విమానము కిటికీ దగ్గరగా నేను ఉంచబడి, క్రింద తెల్లని మేఘాలను చూడటం గుర్తున్నది.

ఆ అందమైన, ప్రకాశమైన మేఘాలు పెద్ద దూది బంతులుగా ఉన్నట్లుగా నా మనస్సులో నిలిచిపోయాయి.

నా మనస్సులో నిలిచియున్న మరొక రూపము, లాస్ ఎంజెల్స్ ప్రాంతంలో ఒక వినోదపు పార్కులోని సరదాగా కనబడే పాత్రలలో కొన్ని. ఆ పాత్రలు మరచిపోవడం కష్టమైనది.

కానీ అత్యంత గొప్ప ప్రాముఖ్యత గలది ఈ ప్రకాశవంతమైన మరచిపోని రూపము:

చిత్రం
సాాల్ట్ లేక్ దేవాలయపు ముద్రవేయబడు గది

సాల్ట్‌ లేక్ దేవాలయములోని పరిశుద్ధ గదిలో ఉండటం నాకు గుర్తున్నది, అక్కడ దంపతులు, కుటుంబాల యొక్క కాలము, నిత్యత్వమంతటి కొరకు ముద్రవేయబడుట జరుగును. దేవాలయము యొక్క అందమైన బలిపీఠము నాకు జ్ఞాపకమున్నది మరియు కాంతివంతమైన సూర్యుని వెలుగు గది వెలుపల కిటికీ గుండా ప్రకాశించుట నాకు గుర్తున్నది. అప్పుడు నేను వాటిని అనుభూతి చెందాను, మరియు అప్పటినుండి సువార్త వెలుగు యొక్క సత్యము, ప్రేమ యొక్క భద్రత, మరియు ఓదార్పు భావనలను అనుభవించుట కొనసాగించాను.

20 సంవత్సరాల తరువాత, ఈసారి నేను, నాకు కాబోయే భార్య కాలము మరియు నిత్యత్వము కొరకు ముద్రవేయబడినప్పుడు — మరొకసారి ముద్రవేయబడటానికి నేను దేవాలయములో ప్రవేశించినప్పుడు అదే భావాలు నా హృదయంలో కలిగాయి. అయినప్పటికీ, ఈసారి మేము వేల మైళ్ళు ప్రయాణించాల్సినవసరం లేదు, ఎందుకనగా అప్పటినుండి బ్యూనస్ ఎయిర్స్ అర్జెంటీనా దేవాలయము నిర్మించబడింది, ప్రతిష్ఠించబడింది, మరియు అది మా యింటి దగ్గర నుండి కేవలము స్వల్ప దూరములో ఉన్నది.

చిత్రం
వాకర్ కుటుంబము

మా వివాహము మరియు ముద్రించబడుట జరిగిన ఇరవై-రెండు సంవత్సరాల తరువాత, అదే దేవాలయానికి తిరిగి వెళ్ళే దీవెన మాకు కలిగింది, కానీ ఈసారి మా అందమైన కూతురుతో, మరియు మేము కాలము, నిత్యత్వమంతటి కొరకు ఒక కుటుంబంగా ముద్రవేయబడ్డాము.

నా జీవితంలో ఈ మిక్కిలి పరిశుద్ధమైన క్షణాలను నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, నేను లోతైన, శాశ్వతమైన ఆనందముతో ముంచివేయబడ్డాను. మన వ్యక్తిగత అవసరాలు మరియు మన హృదయపూర్వకమైన కోరికలను ఎరిగిన, కనికరముగల పరలోకమందున్న తండ్రి యొక్క ప్రేమను అనుభూతి చెందాను, అనుభూతి చెందుతూనే ఉన్నాను.

కడవరి దినాలలో ఇశ్రాయేలును సమకూర్చుటను ప్రసంగించుటలో, ప్రభువైన యెహోవా చెప్పాడు: “వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయము మీద దాని వ్రాసెదను, నేను వారికి దేవుడనై యుందును, వారు నాకు జనులగుదురు.”11 ఆయన పరిశుద్ధ మందిరములో పరిశుద్ధ విధుల ద్వారా నాపై లోతైన, శాశ్వతమైన ప్రభావము చూపించుట ప్రారంభించిన ప్రభువు యొక్క ధర్మశాస్త్రము కొరకు నేను శాశ్వతంగా కృతజ్ఞత కలిగియున్నాను. ఆయన మన దేవుడు, మనము ఆయన జనులమని తెలుసుకొనుట ఎంత ప్రధానమైనది మరియు మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఏవైనప్పటికీ, మనము విశ్వాసపాత్రంగా ఉండి, మనము ప్రవేశించిన నిబంధనలకు విధేయులమైతే, మనము “ఆయన ప్రేమ యొక్క బాహువులలో శాశ్వతంగా చుట్టబడియుంటాము.”12

2019 అక్టోబరులో సర్వసభ్య సమావేశములో స్త్రీల సమావేశమందు, అధ్యక్షులు నెల్సన్ ఇలా చెప్పారు, “ఒకరినొకరికి పరిచర్య చేయుటకు మన సమస్త ప్రయత్నాలు, సువార్తను ప్రకటించుట, పరిశుద్ధులను పరిపూర్ణముగా చేయుట, మరియు మృతులను విడిపించుట పరిశుద్ధ దేవాలయములో ఒకేచోట చేరతాయి.”13

మరియు, అదే సర్వసభ్య సమావేశమందు అధ్యక్షులు నెల్సన్ బోధించారు: “అవును, పునఃస్థాపన యొక్క మిక్కిలి ప్రశస్తమైన అంశము పరిశుద్ధ దేవాలయము. దాని పరిశుద్ధ విధులు మరియు నిబంధనలు ఆయన రెండవ రాకడయందు రక్షకునికి స్వాగతమిచ్చుటకు సిద్ధపడియున్న జనులను సిద్ధపరచుటకు అవి కీలకమైన భాగము.”14

కొనసాగుతున్న పునఃస్థాపన ముందుకంటె ఎక్కువ వేగంగా జరిగిన దేవాలయ నిర్మాణము మరియు సమర్పణ చేత గుర్తించబడింది. తెరకు రెండువైపుల (ఇశ్రాయేలును) మనము సమకూర్చినప్పుడు, మన జీవితాలలో సేవ చేయడానికి మరియు దేవాలయమును ముఖ్యమైనదిగా చేయడానికి మనము త్యాగాలను చేసినప్పుడు, ప్రభువు మనల్ని నిజంగా నిర్మిస్తున్నాడు — ఆయన తన నిబంధన జనులను నిర్మిస్తున్నాడు.

ఓహ్, పైన సింహాసనముపైన ప్రకాశిస్తున్న వెలుగు చాలా మహిమకరమైనది

సువార్త వెలుగు యొక్క సత్యము మరియు ప్రేమ ప్రకాశిస్తున్నది!

ఈ పరలోకపు కిరణం, సూర్యునివలే ప్రకాశవంతమైనది

ఈరోజు ప్రతి భూమిని వెలిగిస్తుంది.15

సువార్త వెలుగు యొక్క సత్యము, ప్రేమ నేడు భూమి అంతటా ఉజ్వలంగా ప్రకాశిస్తుందని నేను సాక్ష్యమిస్తున్నాను. ప్రవక్త యెషయా చేత ముందుగా చెప్పబడిన “ఆశ్చర్యకార్యము, బహు ఆశ్చర్యకార్యము” 16 మరియు నీఫై చేత చూడబడిన కార్యము 17 ఈ కష్టమైన సమయాలలో కూడా అత్యంత వేగవంతంగా జరుగుచున్నది. జోసెఫ్ స్మిత్ ప్రవచనాత్మకగా ప్రకటించినట్లుగా: “సత్యము యొక్క ప్రమాణము నియమించబడింది; దేవుని యొక్క ఉద్దేశములు నెరవేర్చబడి, మరియు గొప్ప యెహోవా కార్యము పూర్తిచేయబడిందని చెప్పేంతవరకు, … కార్యము వృద్ధి చెందుట నుండి ఏ దుష్ట హస్తము ఆపలేదు.”18

సహోదర సహోదరీలారా, పరలోకపు స్వరము అనగా మన రక్షకుని స్వరము వినుటలో మనల్ని మనం, మన కుటుంబాలను చేర్చడానికి ఈ రోజు సమ్మతించి, తీర్మానించుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఆయన సన్నిధికి తిరిగి నడిపించే బాటలో మనల్ని స్థిరముగా భద్రపరచే నిబంధనలను మనము చేసి పాటిస్తామని నేను ఆశిస్తున్నాను, మరియు ఆయన సువార్త యొక్క మహిమకరమైన వెలుగు, సత్యము యొక్క దీవెనలందు మనము ఆనందిస్తామని ఆశిస్తున్నాను. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.