సర్వసభ్య సమావేశము
గురి యొద్దకే పరుగెత్తుట
2021 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


గురి యొద్దకే పరుగెత్తుట

ఈ జీవితంలో మనము ఎంత అనుభవిస్తామన్నది ముఖ్యము కాదు, కానీ మనము ఏమి కాబోతున్నామో అనేది ముఖ్యము.

అపొస్తలుల కార్యములు మరియు పౌలు యొక్క పత్రికలను నేను చదివినప్పుడు, యేసు క్రీస్తును సేవించుటలో, బోధించుటలో మరియు సాక్ష్యమిచ్చుటలో ప్రేమ మరియు కృతజ్ఞత చేత పౌలు ఎలా ప్రేరేపించబడ్డాడో నేను ఆశ్చర్యపడ్డాను. ఒక వ్యక్తి ప్రత్యేకంగా తన గొప్ప బాధలను పరిగణిస్తూ, అటువంటి ప్రేమ, కృతజ్ఞతతో ఎలా సేవ చేయగలడు? సేవ చేయడానికి పౌలును ప్రేరేపించినదేమిటి? “క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని, గురి యొద్దకే పరుగెత్తుచున్నాను.”1

గురి యొద్దకు పరుగెత్తడానికి మన రక్షకుడు మరియు మన పరలోకమందున్న తండ్రితో “నిత్య జీవమునకు నడిపించే ఇరుకైన సంకుచితమైన మార్గమును”2 విశ్వసనీయంగా కొనసాగించాలి. పౌలు తన బాధలను “మన యెడల ప్రత్యక్షము కాబోవు మహిమ యెదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని యెంచుచున్నాను”3 అని పునఃసమీక్షించాడు. అతడు జైలులో బంధించబడినప్పుడు పౌలు ఫిలిప్పీయులకు రాసిన లేఖ, మనందరికీ, ప్రత్యేకంగా ఈ అనిశ్చయమైన కష్టమైన కాలములో మిక్కిలి సంతోషమును, ఉల్లాసమును ప్రోత్సాహమునిచ్చును. పౌలు వలన మనమందరం ఎక్కువ విశ్వాసంగా, ఆశాజనకంగా భావించాల్సిన అవసరమున్నది: “నా ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనియున్నాను: క్రీస్తును సంపాదించుకొనులాగున, సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను.”4

పౌలు యొక్క సేవను మనము చూచుచుండగా, మన కాలములో మన స్వంత “పౌలుల” చేత మనము ప్రేరేపించబడ్డాము మరియు పైకెత్తబడ్డాము, వారు కూడా తమ జీవితాలలో వారికి ప్రియమైన వారి జీవితాలలో ఎదుర్కొంటున్న సవాళ్ల మధ్య ప్రేమ మరియు కృతజ్ఞతతో సాక్ష్యమిస్తున్నారు. 9 సంవత్సరాల క్రితం నాకు కలిగిన ఒక అనుభవము గురి యొద్దకే పరుగెత్తుట యొక్క ప్రాముఖ్యతను గ్రహించడానికి సహాయపడింది.

2012లో, మొదటిసారి సర్వసభ్య సమావేశ నాయకత్వ సమావేశానికి నేను నడిచివెళ్లినప్పుడు, నేను ముంచివేయబడినట్లుగా, తగియుండననే భావించకుండా ఉండలేకపోయాను. నా మనస్సులో ఒక స్వరము “నీవు ఇక్కడ చెందవు! అని పట్టు విడువకుండా చెప్పుచున్నది! ఒక గంభీరమైన తప్పు చేయబడింది!” కూర్చోవడానికి ఒక స్థలము వెదకడానికి ప్రయత్నిస్తూ నేను నడుస్తుండగా, ఎల్డర్ జెఫ్రీ ఆర్. హాల్లండ్ గుర్తించారు. ఆయన నావద్దకు వచ్చి, “ఎడ్వర్డ్ ఇక్కడ నిన్ను చూడటం మంచిగా ఉన్నది,” మరియు ఆయన మృదువుగా నా ముఖాన్ని నిమిరారు. నేను పసిబిడ్డలా భావించాను! ఆయన ప్రేమ, ఆలింగనం నేను స్వాగతించబడినట్లు భావించునట్లు చేసాయి మరియు చేర్చబడిన ఆత్మను, సహోదరత్వ ఆత్మను అనుభూతి చెందడానికి నాకు సహాయపడినవి. మరుసటి రోజు, ఎల్డర్ హాల్లండ్ కోరములో తనకంటె పెద్దవారైన ఎల్డర్ డాల్లిన్ హెచ్. ఓక్స్ ముఖాన్ని ముందురోజు నాకు చేసిన విధంగా అప్యాయంగా నిమరటం నేను గమనించాను!

ఆ క్షణమందు ప్రవక్తలు, దీర్ఘదర్శులుగా మరియు బయల్పాటుదారులుగా మనము ఆమోదించిన ఈ మనుష్యుల ద్వారా నేను ప్రభువు యొక్క ప్రేమను అనుభూతి చెందాను. ఎల్డర్ హాల్లండ్ తన దయ, సహజమైన చర్యల ద్వారా నా స్వీయ కేంద్రీకృతాన్ని, నా అసమర్ధత భావాలను జయించడానికి నాకు సహాయపడ్డారు. క్రీస్తు యొద్దకు ఆత్మలను తేవడానికి—నేను పిలవబడిన పరిశుద్ధమైన మరియు సంతోషకరమైన కార్యముపై దృష్టిసారించడానికి ఆయన నాకు సహాయపడ్డారు. గురి యొద్దకే పరుగెత్తడానికి నా ఆసక్తిని నడిపించిన పాత పౌలు వలె ఆయన ఉన్నారు.

ఆసక్తికరంగా, పౌలు మన వెనుక ఉన్న మన పాత భయాలు, మన పాత దృష్టి, మన పాత వైఫల్యాలు మరియు మన పాత విచారమును—మరచిపోమని మనల్ని పిలుస్తుండగా ముందుకు త్రోసుకొనిపొమ్మని పౌలు ప్రేరేపిస్తున్నాడు. మన ప్రియమైన ప్రవక్త అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ వలె, “క్రొత్త, పవిత్రమైన విధానానికి”5 ఆయన మనల్ని ఆహ్వానిస్తున్నాడు. రక్షకుని వాగ్దానము నిజమైనది: “తన ప్రాణమును రక్షించు కొనగోరువాడు దాని పోగొట్టుకొనును; నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాని దక్కించు కొనును.”6

నా మొదటి సర్వసభ్య సమావేశ ప్రసంగములో, మా పొలములో పనిచేయడానికి మా అమ్మ నాకు బోధించిన ఒక అనుభవాన్ని నేను పంచుకున్నాను. “ఎన్నడూ వెనక్కి చూడకు,” అని ఆమె చెప్పింది. “మనము ఇంకా ఏమి చేయాలో ముందుకు చూడు.”7

ఆమె జీవితం ముగింపులో, అమ్మ కేన్సరుతో పోరాడినప్పుడు, ఆమె నౌమి మరియు నాతో ఉన్నది. ఒక రాత్రి తన పడక గదిలో ఆమె వెక్కివెక్కి ఏడ్వడటం నేను విన్నాను. కేవలము రెండు గంటల క్రితమే తాను రోజూ తీసుకొనే మార్ఫిన్ తీసుకొన్న తరువాత కూడా ఆమె నొప్పి తీవ్రంగా ఉన్నది.

నేను ఆమె గదిలో ప్రవేశించాను, ఆమెతో పాటు ఏడ్చాను. ఆమె నొప్పి నుండి తక్షణ ఉపశమనము ఇమ్మని ఆమె కోసం బిగ్గరగా నేను ప్రార్థించాను. తరువాత ఆమె పొలములో సంవత్సరాల క్రితం చేసిన అదే విషయాన్ని చేసింది: ఆమె ఆగింది మరియు నాకొక పాఠము నేర్పింది. ఆ క్షణంలో నేను ఆమె ముఖాన్ని ఎప్పటికీ మరచిపోలేను: బలహీనమైన, గొప్ప వ్యాధితో దెబ్బతిన్న మరియు బాధతో నిండిన, దుఃఖిస్తున్న తన కొడుకుపై జాలితో చూడటం. ఆమె తన కన్నీళ్ల గుండా నవ్వింది, నా కళ్లలోకి నేరుగా చూసి, ఇలా అన్నది, “అది నీకు లేక మరెవరికీ కాదు, కానీ ఈ నొప్పి తీసివేయాలా లేక లేదా అన్నది దేవునిదే.”

నేను మౌనంగా కూర్చున్నాను. ఆమె కూడా మౌనంగా కూర్చోన్నది. ఆ జ్ఞాపకము నా మనస్సులో స్పష్టంగా నిలిచియున్నది. నాతో శాశ్వతంగా నిలిచియుండునట్లు, ఆ రాత్రి మా అమ్మ ద్వారా ప్రభువు నాకొక పాఠాన్ని నేర్పారు. దేవుని యొక్క చిత్తానికి తన అంగీకారాన్ని మా అమ్మ తెలిపినప్పుడు, గెత్సేమనే వనములో మరియు గొల్గొతా సిలువపై యేసు క్రీస్తు అనుభవించుటకు గల కారణమును నేను జ్ఞాపకముంచుకున్నాను. ఆయన ఇలా చెప్పెను: “ఇదిగో నేను మీకు నా సువార్తను ఇచ్చియున్నాను మరియు నేను మీకు ఇచ్చిన సువార్త ఇదే— తండ్రి నన్ను పంపెను, కాబట్టి నా తండ్రి చిత్తమును జరిగించుటకు నేను లోకములోనికి వచ్చియున్నాను.”8

చిత్రం
గెత్సేమనేలో క్రీస్తు

గత సర్వసభ్య సమావేశములో మనకు మన ప్రియమైన ప్రవక్త అధ్యక్షులు నెల్సన్ యొక్క ప్రవచనాత్మక ప్రశ్నలను గూర్చి నేను ఆలోచిస్తున్నాను. అధ్యక్షులు నెల్సన్ అడిగారు: “ మీ జీవితంలో దేవునికి మిక్కిలి ప్రాధాన్యతనివ్వడానికి మీరు సమ్మతిస్తున్నారా? దేవునిని మీ జీవితములో అత్యంత ముఖ్యమైన ప్రభావంగా ఉండనివ్వడానికి మీరు సమ్మతిస్తున్నారా? మిగిలిన ఇతర ఆశయం కంటే ఎక్కువ ముఖ్యమైనదిగా … ఆయన స్వరమును మీరు అనుమతిస్తారా? మీ చిత్తము ఆయన చిత్తమందు ఉపసంహరించబడడానికి మీరు సమ్మతిస్తున్నారా?” 9 మా అమ్మ భావావేశంగా, కానీ స్థిరంగా “అవును,” అని జవాబిచ్చి ఉండేది మరియు ప్రపంచ వ్యాప్తంగా మిగిలిన విశ్వాసులైన సంఘ సభ్యులు కూడా భావావేశంగానే కానీ స్థిరంగా “అవును,” అని జవాబిచ్చి ఉండేవారు. అధ్యక్షులు నెల్సన్, ఈ ప్రవచనాత్మక ప్రశ్నలతో మమ్మల్ని ప్రేరేపించి, పైకెత్తినందుకు మీకు కృతజ్ఞతలు.

ఈమధ్య, దక్షిణ ఆఫ్రికాలోని ప్రెటోరియాలో తన భార్యను, ఎదిగిన కూతురును ఒకేసారి సమాధి చేయాల్సి వచ్చిన బిషప్పుతో నేను మాట్లాడాను. ఈ కరోనా వైరస్ మహమ్మారి చేత వారి ప్రాణాలు తీయబడినవి. ఆయన ఎలా ఉన్నారని నేను అడిగాను. బిషప్పు టెడ్డీ థాబెట్ యొక్క జవాబు ప్రభువు యొక్క ప్రవక్తలు, దీర్ఘదర్శులు మరియు బయల్పాటు దారుల నుండి వచ్చిన మాటలు, సలహాను అనుసరించడానికి నా తీర్మానాన్ని బలపరచింది. మనకు ఎలా సహాయపడాలో ఆయన ఎరుగునట్లు, రక్షకుడు తన బాధలను మరియు తన జనుల యొక్క బాధలను తనపై తీసుకొనునని తెలుసుకొనుటలో ఎల్లప్పుడు నిరీక్షణ మరియు ఓదార్పు ఉన్నదని బిషప్పు టెడ్డీ థాబెట్ జవాబిచ్చారు.10 లోతైన విశ్వాసముతో ఆయన సాక్ష్యమిచ్చారు, “రక్షణ ప్రణాళిక, సంతోషము యొక్క ప్రణాళిక కొరకు నేను కృతజ్ఞత కలిగియున్నాను.” తరువాత ఆయన నన్ను ఈ ప్రశ్న అడిగారు, “గత సమావేశములో మన ప్రవక్త బోధించడానికి ప్రయత్నించినది ఇదేనా?”

ఒక విధంగా లేక మరొక విధంగా మనందరికి మర్త్యత్వపు సవాళ్ళు వచ్చినప్పుడు, మన లక్ష్యమైన “గురి యొద్దకు పరిగెత్తుట” పై మనం దృష్టిసారిద్దాము, అది “దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందుట.”11

మనందరికి నా సవినయముగల ఆహ్వానము, ఎన్నడూ నిరాశ చెందవద్దు. “ప్రతి భారమును, సుళువుగా చిక్కుల బెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుటకు”12 మనము పిలవబడ్డాము.

ఈ జీవితంలో మనము ఎంత అనుభవిస్తామన్నది ముఖ్యము కాదు, కానీ మనము ఏమి కాబోతున్నామో అనేది ముఖ్యము. గురి యొద్దకు పరుగెత్తుటలో సంతోషమున్నది. మనము ఆయన వైపు చూసినప్పుడు సమస్తమును జయించిన ఆయన మనకు సహాయపడతాడని నేను సాక్ష్యమిస్తున్నాను. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.