సర్వసభ్య సమావేశము
ఆయన నామమును బట్టి దీవించుడి
2021 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


ఆయన నామమును బట్టి దీవించుడి

మన యాజకత్వమును పొందుటకు ఉద్దేశమేదనగా, ఆయన నామములో ప్రభువు కొరకు జనులను దీవించుటకు మనల్ని అనుమతించుట.

నా ప్రియమైన సహోదరులారా, దేవుని యొక్క యాజకత్వములో సేవకులారా, ఈరాత్రి మీకు ప్రసంగించుట నాకు గౌరవప్రదమైనది. మీరు నా లోతైన గౌరవాన్ని, కృతజ్ఞతను కలిగియున్నారు. మీతో మాట్లాడి, మీ గొప్ప విశ్వాసమును నేను విన్నప్పుడు, ఎప్పటికప్పుడు బలమైన సమూహములు, ఎప్పటికీ ఎక్కువ విశ్వాసులైన యాజకత్వముగల వారితో, లోకములో ఎప్పటికీ పెరుగుతున్న యాజకత్వ శక్తి ఉన్నదని నా నమ్మకము.

ఈ రాత్రి మీతో నా కొన్ని క్షణాలలో, మీ వ్యక్తిగత యాజకత్వ సేవలో ఎప్పటికప్పుడు ఎక్కువ ప్రభావవంతంగా ఉండాలని కోరే వారితో కూడా నేను మాట్లాడతాను. సేవ చేయడానికి మీ పిలుపును నెరవేర్చాలనే ఆజ్ఞను గూర్చి మీరు ఎరిగియున్నారు.1 కానీ ఆ పిలుపును ఘనపరచుట అంటే మీకు ఏ ఉద్దేశాన్ని కలిగియున్నదని మీరు ఆశ్చర్యపడవచ్చు.

సరిక్రొత్త పరిచారకులతో నేను ప్రారంభిస్తాను ఎందుకనగా వారు తమ యాజకత్వ సేవను నెరవేర్చుట అనగా అర్థమేమిటో సందేహంగా భావించవచ్చు. క్రొత్తగా నియమించబడిన పెద్దలు కూడా వినాలని కోరవచ్చు. తన సేవ యొక్క మొదటి వారాలలో ఉన్న ఒక బిషప్పు కూడా ఆసక్తి కలిగియుండవచ్చు.

ఒక పరిచారకునిగా నా రోజులను నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు అది నాకు బోధనాత్మకమైనది. ఇప్పుడు నేను సూచించే దానిని ఎవరైనా నాతో చెప్పియుండాల్సిందని నేను కోరుతున్నాను. అప్పటి నుండి నాకు వచ్చిన యాజకత్వపు నియామకములన్నీ — ప్రస్తుతం కాలములో నేను పొందిన వాటిలో కూడా అది నాకు సహాయపడియుండేది.

చాలా చిన్న శాఖలో నేను ఒక పరిచారకుడిని, అందులో నేను ఒకేఒక పరిచారకుడను మరియు మా అన్న టెడ్ ఒకేఒక బోధకుడు. ఆ శాఖలో మేము మాత్రమే ఒక కుటుంబము. మొత్తము శాఖ మా ఇంటిలో సమావేశమయ్యేది. మా అన్నకు, నాకు ఉన్న యాజకత్వ నాయకుడు అప్పుడే యాజకత్వము పొందిన క్రొత్తగా పరివర్తన చెందినవాడు. మా స్వంత హాలులో సంస్కారమును అందించుట నా ఏకైక యాజకత్వ బాధ్యత అని నేను నమ్మాను.

మా కుటుంబము యూటాకు మారినప్పుడు, అనేక పరిచారకులున్న పెద్ద వార్డులో నేను ఉండుట కనుగొన్నాను. అక్కడ నా మొదటి సంస్కార సమావేశములో, పరిచారకులు శిక్షణ పొందిన బృందం వలె వారు సంస్కారమును అందించినప్పుడు, ఖచ్చితత్వముతో కదులుతున్నట్లుగా నేను గమనించాను.

మరుసటి ఆదివారము నన్ను ఎవరూ చూడలేనప్పుడు నాకు నేనుగా ఉండటానికి వార్డు భవనము వద్దకు ముందుగా వెళ్ళాను. ఇది సాల్ట్ లేక్ సిటీలోని యేల్క్రెస్ట్ వార్డు అని నాకు గుర్తు, దానికి మైదానంలో ఒక విగ్రహం ఉంది. సంస్కారమును అందించుటలో నా స్థానమును నేను తీసుకొన్నప్పుడు పొరపాటు జరగకుండా ఎలా ఉండాలో తెలుసుకోవడానికి సహాయము కొరకు నేను మనఃపూర్వకంగా ప్రార్థించాను. ఆ ప్రార్థన జవాబివ్వబడింది.

మా యాజకత్వ సేవలో ఎదగడానికి మేము ప్రయత్నించినప్పుడు ప్రార్థించడానికి మరియు ఆలోచించడానికి ఉత్తమమైన విధానము ఉన్నదని ఇప్పుడు నాకు తెలుసు. వ్యక్తులు యాజకత్వము ఎందుకు ఇవ్వబడతారో అర్థము చేసుకోవడం ద్వారా అది వచ్చింది. మన యాజకత్వమును పొందుటకు ఉద్దేశమేదనగా, ఆయన నామములో ప్రభువు కొరకు జనులను దీవించుటకు మనల్ని అనుమతించుట.2

నేను పరిచారకుడైన కొన్ని సంవత్సరాల తరువాత, ఆచరణాత్మకంగా పరిచారకుని స్థానము అర్థమేమిటో నేను నేర్చుకొన్నాను. సంవత్సరాల క్రితం, ఒక ప్రధాన యాజకునిగా, నేను రోగులైన వృద్ధుల సంరక్షణా కేంద్ర సంస్కార సమావేశాన్ని దర్శించడానికి నియమించబడ్డాను. సంస్కారము అందించడానికి నేను అడగబడ్డాను. నేను సంస్కారమును అందించిన విధాన ప్రక్రియ లేక ఖచ్చితత్వము గురించి ఆలోచించడానికి బదులుగా, నేను ప్రతీ వృద్ధుల ముఖాలలో చూసాను. వారిలో అనేకమంది ఏడ్వడం నేను చూసాను. ఒక స్త్రీ నా చేతులను పట్టుకొని, పైకిచూసి, “ఓహ్, మీకు కృతజ్ఞతలు, మీకు కృతజ్ఞతలు” అని బిగ్గరగా అన్నది.

ఆయన నామములో ఇవ్వబడిన సేవను, నా సేవను ప్రభువు దీవించాడు. ఆ రోజు నేను ఎంత బాగా చేయగలనోనని ప్రార్థించడానికి బదులుగా అటువంటి అద్భుతము కొరకు నేను ప్రార్థన చేసాను. నా ప్రేమగల సేవ ద్వారా ప్రభువు యొక్క ప్రేమను జనులు అనుభవించాలని నేను ప్రార్థించాను. సేవ చేయడానికి మరియు ఆయన నామములో ఇతరులను దీవించడానికి ఇది ముఖ్యమైనదని నేను నేర్చుకున్నాను.

అటువంటి ప్రేమను గూర్చి జ్ఞాపకం చేసే ఒక అనుభవాన్ని ఈ మధ్య నేను విన్నాను. కోవిద్-19 మహమ్మారి వలన సంఘ సమావేశాలన్ని నిలిపివేయబడినప్పుడు, ఒక పరిచర్య చేసే సహోదరుడు తాను పరిచర్య చేస్తున్న ఒక సహోదరికి సంస్కారాన్ని అందించి, నిర్వహించడానికి తన పెద్దల సమూహపు అధ్యక్షుడి నుండి ఒక నియామకాన్ని అంగీకరించాడు. అతడు సంస్కారము తెస్తానని ఆమెకు ఫోను చేసినప్పుడు, అటువంటి ప్రమాదకరమైన సమయంలో అతడి స్వంత ఇంటి నుండి బయటకు రప్పించడానికి ఇబ్బందిపడుతూ మరియు త్వరలో విషయాలు మామూలు అవుతాయని నమ్ముతూ ఆమె అయిష్టంగా అంగీకరించింది.

ఆ ఆదివారము ఉదయము అతడు ఆమె ఇంటికి వచ్చినప్పుడు, ఆమెకు ఒక మనవి వున్నది. వారు నడిచి వెళ్ళి తన ప్రక్కన ఉన్న 87 సంవత్సరాల పొరుగు ఆమెతో కూడా సంస్కారాన్ని తీసుకోవచ్చా? బిషప్పు అనుమతితో, అతడు అంగీకరించాడు.

అనేకనేక వారాలు, చాలా జాగ్రత్తగా దూరంగా ఉండి, మిగిలిన భద్రతగల జాగ్రత్తలు తీసుకొని, ఈ చిన్న పరిశుద్ధుల గుంపు ఒక సాధారణమైన సంస్కార సేవ కొరకు ప్రతీ ఆదివారము సమావేశమయ్యారు. కొన్ని విరిగిన రొట్టె ముక్కలు మరియు నీళ్ళుగల కప్పులు—కానీ దేవుని ప్రేమ యొక్క మంచితనము కొరకు అనేక కన్నీళు కార్చబడినవి.

సరైన సమయంలో పరిచర్య చేసే సహోదరుడు, అతడి కుటుంబము, అతడు పరిచర్య చేస్తున్న సహోదరి సంఘానికి తిరిగి వెళ్ళగలిగారు. కానీ 87 సంవత్సరాల విధవరాలు, అత్యధిక జాగ్రత్త వలన ఇంటిలో ఉండాల్సి వచ్చింది. పరిచర్య చేసే సహోదరుడు — అతడి నియామకం ఆమె పొరుగువారికి మరియు ఈ వృద్ధ సహోదరికి కాదని జ్ఞాపకముంచుకోండి—ఈరోజు వరకు, ప్రతీ ఆదివారము లేఖనాలు, చిన్న రొట్టె ముక్కను సిద్ధంగా ఉంచుకొని, ప్రభురాత్రి భోజనమైన సంస్కారమును నిర్వహించడానికి మౌనంగా ఆమె ఇంటికి వెళ్ళాడు.

అతడి యాజకత్వ సేవ, ఆరోజు వృద్ధుల సంరక్షణా కేంద్రములో నాదానివలె ప్రేమతో ఇవ్వబడింది. వాస్తవానికి, పరిచర్య చేసే సహోదరుడు తన బిషప్పును వార్డులో తాను సంరక్షించగల ఇతరులు ఎవరైనా ఉన్నారా అని ఈమధ్య అడిగాడు. అతడు తన యాజకత్వ సేవను నెరవేర్చడానికి తన కోరిక ప్రభువు నామములో, వ్యక్తిగతంగా ఆయనకు మాత్రమే తెలిసిన విధానములో అతడు సేవ చేసినప్పుడు వృద్ధి చెందింది. అతడు సేవ చేసే వారి కొరకు ప్రభువు యొక్క ప్రేమను గూర్చి తెలుసుకోవడానికి, నేను చేసినట్లుగా పరిచర్య చేసే సహోదరుడు ప్రార్థించాడో లేదో నాకు తెలియదు, కానీ ప్రభువు నామములో అతడి సేవ వలన, ఫలితం ఒకేవిధంగా ఉన్నది.

ఎవరైన అస్వస్థత చెందిన వారికి లేక అవసరతగల సమయంలో నేను ఒక యాజకత్వ దీవెన ఇవ్వడానికి ముందు ప్రభువు ప్రేమను వారు అనుభూతి చెందునట్లు నేను ప్రార్థించినప్పుడు, అదే అద్భుతమైన ఫలితము కలిగింది. అది ఆసుపత్రిలో ఒకసారి జరిగింది, యాజకత్వ దీవెన ఇచ్చే అవకాశం నాకు ఇచ్చే బదులు తొందరగా వారి దారికి అడ్డు తొలగమని తద్వారా వారు తమ పని చేసుకోవచ్చని అసహనానికి గురైన వైద్యులు నన్ను కోరుటకు బదులు నన్ను ఆదేశించారు. నేను అక్కడ ఉండి దీవెన ఇచ్చాను. చనిపోతుందని వైద్యులు భావించిన, ఆ రోజు నేను దీవించిన ఆ చిన్నారి బ్రతికింది ఆ రోజు నేను ఈ సమయంలో కృతజ్ఞతతో ఉన్నాను, నేను నా స్వంత భావాలను పొందలేకపోయాను, కానీ ఆ చిన్నారిని దీవించాలని ప్రభువు కోరినట్లు భావించాను. దీవెన ఏమిటో నాకు తెలుసు: స్వస్థపడమని నేను ఆమెను దీవించాను. ఆమె స్వస్థపడింది.

స్వస్థత యొక్క దీవెన కొరకు ఆశిస్తూ, మంచము చుట్టూ ఉన్న కుటుంబ సభ్యులతో దాదాపు మరణానికి దగ్గరలో ఉన్నట్లుగా కనబడిన ఒకరికి నేను దీవెన ఇచ్చినప్పుడు అది అనేకసార్లు జరిగింది. నాకు ఒక్క క్షణము ఉన్నప్పుడు కూడా, ఆయన నామములో నేను ఇవ్వగలుగునట్లు ప్రభువు దాచియుంచిన దీవెన ఏమిటో తెలుసుకోవడానికి నేను ప్రార్థించాను. నేను లేక దగ్గర నిలబడిన జనులు కోరినది కాదు, ఆ వ్యక్తిని ఎలా దీవించాలని ఆయన కోరుతున్నాడో తెలుసుకోవాలని నేను అడిగాను. దీవెన ఇతరులు వారికై వారు లేక వారి ప్రియమైన వారు కోరినది కాకపోయినప్పుడు కూడా, నిరాశకు బదులుగా అంగీకారము మరియు ఓదార్పును అనుభూతి చెందడానికి ఆత్మ వారిని ప్రేరేపిస్తుందని నా అనుభవము.

ఒక వ్యక్తి కొరకు ప్రభువు కలిగియున్న దీవెనను ఇవ్వడానికి గోత్రజనకులు నడిపింపు కొరకు ఉపవాసముండి, ప్రార్థించినప్పుడు అదే ప్రేరేపణ వస్తుంది. మరలా, నన్ను ఆశ్చర్యపరచిన మరియు దీవెనను పొందుతున్న వ్యక్తిని కూడా ఆశ్చర్యపరిచిన దీవెనలను నేను విన్నాను. స్పష్టంగా, దీవెన ప్రభువు నుండి వచ్చింది—ఆయన నామములో పంచుకోబడిన వాగ్దానములు అదేవిధంగా హెచ్చరికలు రెండిటిని కలిగియున్నది. గోత్రజనకుని ప్రార్థన మరియు ఉపవాసము ప్రభువు చేత ప్రతిఫలమివ్వబడతాయి.

ఒక బిషప్పుగా, నేను యోగ్యతను నిర్ధారించే మౌఖిక పరీక్షలను నిర్వహిస్తూ, నా స్వంత వివేకముచేత దాచబడకుండా ఆయన ఇవ్వగల ప్రేరేపణను కాపాడుతూ వ్యక్తికొరకు ఆయన కోరిన దానిని నేను గ్రహించడానికి అనుమతించమని ప్రార్థించుట నేను నేర్చుకున్నాను. దిద్దుబాటుతో ఎవరినైనా దీవించాలని ప్రభువు ప్రేమతో కోరిన యెడల, అది కష్టమైనది. మీరు, ఇతర వ్యక్తి కోరిన దాని నుండి ప్రభువు కోరిన దానిని ప్రత్యేకించడానికి ప్రయత్నము అవసరమవుతుంది.

మన జీవితకాలములో బహుశా దాని తరువాత మన యాజకత్వ సేవను మనము నెరవేర్చగలమని నేను నమ్ముతున్నాను. అది ప్రభువు యొక్క చిత్తమును తెలుసుకోవడానికి ప్రయత్నించుటలో మన శ్రద్ధ మరియు ఆయన స్వరమును వినడానికి మన ప్రయత్నాలపై ఆధారపడియున్నది, ఆవిధంగా మనము ఆయన కొరకు సేవ చేస్తున్న వ్యక్తి కొరకు ఆయన కోరిన దానిని సరిగా తెలుసుకోగలుగుతాము. ఆ నెరవేర్పు చిరు దశల్లో వస్తుంది. అది నెమ్మదిగా రావచ్చు, కానీ అది వస్తుంది. ప్రభువు దీనిని మనకు వాగ్దానమిస్తున్నాడు:

“ఈ రెండు యాజకత్వములను పొందుటలో వారి పిలుపును ఘనపరచుటలో విశ్వాసముగానుండు వారెవరైనను, వారి శరీరములు నూతనపరచబడుటకు ఆత్మవలన పవిత్రపరచబడుదురు.

“వారు మోషే యొక్క, అహరోను యొక్క, అబ్రహాము సంతానము యొక్క కుమారులుగా, సంఘము మరియు దేవుని రాజ్యముగా దేవునిచేత ఎన్నుకోబడిన వారిగా అగుదురు.

“ఈ యాజకత్వమును పొందువారందరు నన్ను చేర్చుకొందురని ప్రభువు సెలవిచ్చుచున్నాడు.”3

యాజకత్వపు తాళపుచెవులు ప్రవక్త జోసెఫ్ స్మిత్‌కు పునఃస్థాపించబడినవని నేను సాక్ష్యమిస్తున్నాను. మనకు తెలియజేయబడిన గొప్ప సంఘటనల కొరకు యాజకత్వమును పునఃస్థాపించుటకు పరలోకము నుండి ప్రభువు యొక్క సేవకులు ప్రత్యక్షమయ్యారు. ఇశ్రాయేలీయులు సమకూర్చబడతారు. ఆయన మహిమకరమైన రెండవ రాకడ కొరకు ప్రభువు యొక్క జనులు సిద్ధపడియుంటారు. పునఃస్థాపన కొనసాగుతుంది. ప్రభువు తన చిత్తములో అధికమును తన ప్రవక్తకు బయల్పరుస్తాడు.

ప్రభువు చేయబోతున్న దాని ముఖ్యమైన బయల్పాటులతో మీరు చిన్నవారిగా భావించవచ్చు. మీరు అలా భావిస్తే, ప్రభువు మిమ్మల్ని ఎలా చూస్తున్నారో ప్రార్థనాపూర్వకంగా అడగమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఆయన మిమ్మల్ని వ్యక్తిగతంగా ఎరుగును, ఆయన మీపై యాజకత్వమును దయచేసాడు, మరియు సేవ చేయడానికి పిలుపుకు స్పందించుట మరియు యాజకత్వమును నెరవేర్చుట ఆయనకు ముఖ్యమైనది ఎందుకనగా ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు మరియు ఆయన నామములో జనులను దీవించడానికి ఆయన మిమ్మల్ని నమ్ముతున్నాడు.

ఆయన ప్రేమను మరియు ఆయన నమ్మకమును మీరు అనుభవించగలుగునట్లు ఇప్పుడు నేను మిమ్మల్ని దీవిస్తున్నాను, యేసు క్రీస్తు నామములో ఆమేన్.