సర్వసభ్య సమావేశము
పరిపూర్ణమైన ప్రకాశవంతమైన నిరీక్షణ
ఏప్రిల్ 2020 సర్వసభ్య సమావేశము


పరిపూర్ణమైన ప్రకాశవంతమైన నిరీక్షణ

దేవుడు ఈ లోకంలో పనిచేస్తాడనే మూలాధార సత్యాన్ని పునఃస్థాపన తిరిగి నిర్థారించినందువలన, అధిగమించలేని అసమానతలను ఎదుర్కొంటున్నప్పటికీ మనం నిరీక్షించగలము, మనం నిరీక్షించాలి.

యేసు క్రీస్తు సువార్త పునఃస్థాపనలో దేవుని హస్తము యొక్క మహత్యాన్ని చూడడానికి మన స్వంత విధానంలో గతంలోకి చూస్తూ ఈ ఏప్రిల్ 2020 సమావేశం కోసం ఎదురుచూడమని అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ గత అక్టోబరులో మనల్ని ఆహ్వానించారు. నేను, సహోదరి హాలెండ్ ఆ ప్రవచనాత్మక ఆహ్వానాన్ని గంభీరంగా తీసుకున్నాము. ఆనాటి మతవిశ్వాసాలను గమనిస్తూ 1800 ఆరంభంలో జీవిస్తున్నట్లు మమ్మల్ని మేము ఊహించుకున్నాము. ఆ ఊహలో మమ్మల్ని మేము, ఇక్కడ ఏమి లోపమున్నది? ఏమి కలిగియుండాలని మేము కోరుకున్నాము? మా ఆధ్యాత్మిక కోరికలకు జవాబుగా దేవుడు ఏమి అందిస్తాడని మేము నిరీక్షిస్తున్నాము?” అని ప్రశ్నించుకున్నాము.

ఒక విషయం, ఆయన తరచు లోపాలు, అపార్థాలు గల శతాబ్దాల వెనుక దాగినట్లుగా అనుకొనే ఆనాటి జనులలో అనేకమంది కన్నా మేము దేవుని నిజమైన భావన యొక్క పునరుద్ధరణ కోసం రెండు శతాబ్దాల క్రితం ప్రేమతో నిరీక్షించామని మేము గుర్తించాము. ఆనాటి ప్రముఖ మతపరమైన వ్యక్తియైన విల్లియం ఎల్లెరి ఛాన్నింగ్ నుండి ఒక వాక్యాన్ని పంచుకున్నట్లయితే, మేము ”తల్లిదండ్రులుగా దేవుని పాత్ర” కొరకు చూసేవాళ్ళం, ఛాన్నింగ్ దానిని “క్రైస్తవ మతం యొక్క మొదటి గొప్ప సిద్ధాంతముగా” యెంచాడు. 1 అటువంటి సిద్ధాంతము దేవుడిని, శిక్షించే న్యాయాధిపతిగా లేదా ముందుగా శ్రద్ధ చూపిన విషయాలను వదిలి వేరే పనుల్లో నిమగ్నమైన యజమానిగా చూడడానికి బదులుగా శ్రద్ధగల పరలోక తండ్రిగా గుర్తించియుండేది.

అవును, ఆ పదం యొక్క ప్రేమపూర్వక అర్థంలో ఒక నిజమైన తండ్రి గతంలో చేసిన మాదిరిగానే, ప్రస్తుతము బహిరంగంగా మాట్లాడుతూ, నడిపింపునిచ్చే దేవుడిని కనుగొనడమే 1820లో మా నిరీక్షణ అయ్యుండేది. నిశ్చయంగా ఆయన, రక్షణ కొరకు కొద్దిమందిని ముందుగా నిశ్చయించి, మిగిలిన మానవ కుటుంబాన్ని మొత్తం నరకానికి అప్పగించే కఠినమైన, ఏకపక్ష స్వయం ప్రతిపత్తి గలవాడుకాదు. దైవిక ప్రకటన ద్వారా ఆయన ప్రతీ చర్య “లోకమునకు ప్రయోజనకరమైనదై యుండును; ఏలయనగా ఆయన లోకమును ప్రేమించెను“ 2 మరియు దానిలో ప్రతిఒక్కరిని కూడా. ఆ ప్రేమే ఆయన అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తును భూమిపైకి పంపడానికి ఆయనకు గల సర్వోత్తమ కారణం.3

యేసు గురించి మాట్లాడినట్లయితే, 19వ శతాబ్దపు ఆ మొదటి సంవత్సరాలలో మేము జీవించినట్లయితే, క్రైస్తవ మతస్థుల మధ్య రక్షకుని జీవితం మరియు పునరుత్థానము యొక్క వాస్తవికత గురించిన సందేహాలు చెప్పుకోదగినంత ప్రభావాన్ని చూపడం మొదలైందని గొప్ప విచారంతో మేము గుర్తించియుండేవారము. కాబట్టి, యేసే క్రీస్తని, దేవుని యొక్క నిజమైన కుమారుడని, ఆల్ఫా మరియు ఒమేగ అని, ఎప్పటికీ లోకమునకు తెలిసిన ఏకైక రక్షకుడనే బైబిలు సాక్ష్యాన్ని నిర్థారించే ఋజువు లోకమంతటికి రావాలని మేము నిరీక్షించేవారము. ఇతర లేఖన ఆధారాలు, యేసు క్రీస్తు యొక్క మరియొక నిబంధనను కలిగియున్నదేదైనా, అద్భుతమైన ఆయన జననము, ఆశ్చర్యకరమైన పరిచర్య, ప్రాయశ్చిత్త త్యాగము మరియు మహిమకరమైన పునరుత్థానము గురించి మన జ్ఞానాన్ని విస్తరించి, మెరుగుపరచేదేదైనా ముందుకు తేబడాలనేది మా ప్రియమైన నిరీక్షణలలో ఉండేది. నిజంగా అటువంటి సాక్ష్యాధార పత్రము, నీతిని … పరలోకమునుండి క్రిందకు (పంపును); సత్యమును … భూమినుండి (పంపును).”4

ఆ రోజులలో క్రైస్తవ ప్రపంచాన్ని గమనిస్తూ మేము, నిజమైన యాజకత్వము కలిగియుండి, మాకు బాప్తీస్తమివ్వగలిగి, పరిశుద్ధాత్మ వరమును అనుగ్రహించగలిగి, ఉన్నతస్థితికి అవసరమైన సువార్త విధులన్నిటిని నిర్వర్తించగలిగి, దేవునిచే అధికారమివ్వబడిన ఒకరిని కనుగొనాలని ఆశించియుండేవారము. దేవుని యొక్క ఘనమైన మందిరము తిరిగివచ్చుటకు సంబంధించి యెషయా, మీకా మరియు ఇతర ప్రాచీన ప్రవక్తల అనర్గళమైన వాగ్దానాలు నెరవేర్చబడుటను చూడాలని 1820లో మేము ఆశించియుండేవారము. 5 ఆత్మ, విధులు, శక్తితో మరియు నిత్య సత్యాలను బోధించుటకు, వ్యక్తిగత గాయాలను స్వస్థపరచుటకు, కుటుంబాలను శాశ్వతముగా కలిపి బంధించుటకు అధికారముతో మరల స్థాపించబడిన పరిశుద్ధ దేవాలయాల మహిమను చూసి మేము పులకించిపోయేవారము. “మరణము మిమ్మల్ని వేరుచేయునంతవరకు“ అనే శాపగ్రస్థమైన మాటలు వినే అవసరం లేకుండా, మా వివాహము కాలము మరియు నిత్యత్వమంతటి కొరకు బంధింపబడిందని నాతో మరియు నా ప్రియమైన పెట్రీషియాతో చెప్పడానికి అధికారమున్న ఒకరిని కనుగొనడానికి నేను ప్రతిచోట వెదికియుండేవాడిని. “(మన) తండ్రి యింట అనేక నివాసములు కలవు,“ అని నాకు తెలుసు 6 కానీ వ్యక్తిగతంగా మాట్లాడినట్లయితే, వాటిలో ఒకదానిని వారసత్వంగా పొందే అదృష్టం నాకున్నప్పటికీ, దానిని పంచుకోవడానికి పాట్ మరియు మా పిల్లలు నాతో లేకపోతే అది ఒక శిధిల భవనంతో సమానము. యేసు క్రీస్తు పేరు కూడా వినకుండా జీవించి, మరణించిన మా పూర్వీకులు కొందరి కోసం మేము న్యాయమైన మరియు కనికరముగల ఆ బైబిలు భావనలు — మరణించిన వారి పూర్వీకుల తరఫున జీవించియున్న వారు రక్షణ విధులను అందించు అభ్యాసము పునఃస్థాపించబడాలని ఆశించియుండేవారము. 7 మరే అభ్యాసము, భూలోకంలో ఆయన పిల్లలు ఎప్పుడు జీవించినా లేక ఎక్కడ మరణించినా వారిలో ప్రతిఒక్కరి కొరకు ప్రియమైన దేవుని అభిమానాన్ని ఇంతకంటే ప్రకాశవంతంగా చూపగలదని నేను ఊహించలేను.

మా 1820 నిరీక్షణల జాబితా ఇంకా కొనసాగగలదు, కానీ అటువంటి నిరీక్షణలు వ్యర్థమైనవి కావు అనేది బహుశా పునఃస్థాపన యొక్క అతిముఖ్యమైన సందేశము కావచ్చు. పరిశుద్ధ వనములో ప్రారంభమై, ఈనాటికీ కొనసాగుతున్న ఈ కోరికలు నిజం కావడం ఆరంభమైంది మరియు అపొస్తలుడైన పౌలు, ఇతరులు బోధించినట్లుగా అవి స్థిరంగా, ఖచ్ఛితంగా ఆత్మకు నిజమైన లంగరులుగా మారాయి.8 ఒకప్పుడు కేవలం ఆశించినది ఇప్పుడు చరిత్రగా మారింది.

ఇందువల్లనే ప్రపంచం పట్ల దేవుని మంచితనపు 200 సంవత్సరాల వైపు మనం చూడగలం. కానీ భవిష్యత్తులో ఏం జరుగుతుందని మనం ఆశించవచ్చు? ఇంకా నెరవేర్చబడని కోరికలు మనం కలిగియున్నాము. మనం చెప్పుకుంటున్నట్లుగా మనం కొవిడ్ 19 తో పెద్ద యుద్ధం చేస్తున్నాము, ఇసుక రేణువు10 కన్నా 1000 రెట్లు చిన్నదైన ఒక సూక్ష్మక్రిమి9 జనాభా మొత్తాన్ని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయగలదు అనడానికి ఇదొక గంభీరమైన గుర్తు. ఈ ఆధునిక తెగులు వలన ప్రియమైన వారిని కోల్పోయిన వారికొరకు, అలాగే ప్రస్తుతము వ్యాధి సోకిన లేక ప్రమాదంలో ఉన్నవారికొరకు మేము ప్రార్థిస్తాము. అటువంటి అద్భుతమైన ఆరోగ్య రక్షణనిస్తున్న వారికొరకు మేము నిశ్చయముగా ప్రార్థిస్తాము. దీనిని మనం జయించినప్పుడు—మనం జయిస్తాము—ఈ ప్రపంచాన్ని ఆకలియనే క్రిమి నుండి కాపాడేందుకు మరియు మన పొరుగువారిని, దేశాలను పేదరికమనే క్రిమి నుండి కాపాడేందుకు మనం అంతే కట్టుబడియుందాము. వారు కాల్చి చంపబడతారనే భయం లేకుండా —విద్యార్థులు బోధించబడగలిగే పాఠశాలల కోసం మనం నిరీక్షిద్దాం మరియు—ఎటువంటి జాతి, తెగ, లేక మతపరమైన అపోహల చేత మార్పులేకుండా దేవుని యొక్క ప్రతి బిడ్డ కొరకు వ్యక్తిగత మర్యాద అనే బహుమానం కొరకు నిరీక్షిద్దాం. వీటన్నిటిని అట్టడుగున కట్టిపడేయాలనేది, క్లుప్తంగా రెండు గొప్ప ఆజ్ఞలు: ఆయన సలహాను పాటించడం ద్వారా దేవుడిని ప్రేమించడం మరియు దయ, జాలి, సహనం, క్షమాగుణం చూపడం ద్వారా మన పొరుగువారిని ప్రేమించడం అనే వాటి పట్ల అధిక భక్తి కొరకు మా దయలేని నిరీక్షణ. 11 ఈ రెండు గొప్ప దైవిక నిర్దేశకాలు—వారికిప్పుడు తెలిసిన దానికన్నా మెరుగైన ప్రపంచాన్ని మన పిల్లలకు ఇవ్వడానికి మేము కలిగియున్న ఒకేఒక్క నిజమైన నిరీక్షణ అయ్యున్నాయి—మరియు ఎప్పటికీ అయ్యుంటాయి. 12

ఈ విశ్వవ్యాప్త కోరికలకు అదనంగా, ఈ ప్రేక్షకులలో అనేకమంది లోతైన వ్యక్తిగత కోరికలను కలిగియున్నారు: వివాహం మెరుగుపడాలనే కోరిక, లేక కొన్నిసార్లు కేవలం వివాహం జరగాలనే కోరిక, ఒక వ్యసనాన్ని జయించాలనే కోరిక, దారితప్పిన బిడ్డ తిరిగి రావాలనే కోరిక, శతవిధాలైన భౌతిక మరియు భావోద్వేగపూరితమైన బాధలు తగ్గాలనే కోరిక. దేవుడు ఈ లోకంలో పనిచేస్తాడనే మూలాధార సత్యాన్ని పునఃస్థాపన తిరిగి నిర్థారించినందువలన, అత్యంత అధిగమించలేని అసమానతలను మనం ఎదుర్కొంటున్నప్పటికీ, మనం నిరీక్షించగలము, మనం నిరీక్షించాలి. అబ్రాహాము అసంభవమని తెలిసినప్పటికీ నిరీక్షించగలిగాడు అనే లేఖనమునకు అర్థమిదే13—అనగా, అసంభవమనిపించినప్పటికీ అతడు మరియు శారా బిడ్డను కనగలరని—నమ్మకపోవడానికి అన్ని కారణాలు ఉన్నప్పటికీ అతడు నమ్మగలిగాడు. కాబట్టి, “న్యూయార్క్ ఉత్తరభాగంలో చెట్లమధ్య ఒక బాలుడు మోకరించినందుకు దైవకాంతి యొక్క మెరుపుతో మా 1820ల నిరీక్షణలలో అనేకం నెరవేర్చబడడం ఆరంభం కాగలిగినప్పుడు, నీతియుక్తమైన కోరికలు మరియు క్రీస్తు వంటి కోరికలు నిరీక్షణకర్తయగు దేవునిచేత ఇంకను ఆశ్చర్యకరంగా, అద్భుతంగా నెరవేర్చబడతాయని మేమెందుకు ఆశించకూడదు?” అని నేనడుగుతున్నాను. న్యాయంగా మనం కోరుకున్నది ఏదో ఒకరోజు, ఏదో ఒకవిధంగా, ఎలాగో అలాగ మనదవుతుందని మనమందరం నమ్మాలి.

సహోదర సహోదరీలారా, 19వ శతాబ్దపు ఆరంభంలో ఉన్న మతపరమైన లోపాలలో కొన్ని మనకు తెలుసు. ఇంకను కొందరి బలమైన కోరికలు, నిరీక్షణలు నెరవేరకుండా విడిచిపెట్టిన నేటి మతపరమైన లోపాలలో కొన్ని మనకు తెలుసు. అనేక రకాలైన ఆ అసంతృప్తులు అనేకమందిని సాంప్రదాయక మత సంస్థల నుండి దూరంగా నడిపించి వేస్తున్నాయని మనకు తెలుసు. ”అనేకమంది మత నాయకులు (ఈనాడు) ఈ క్షీణతను గురించి చెప్పడంలో పొరబడుతున్నారు”, బదులుగా ”జనులకు నచ్చేవి, పనికిరానివి, చెడు విషయాలను మంచివిగా మార్చి అనవసరమైన వాటన్నిటిని” బోధిస్తున్నారు14 అని ఒక తెలివైన రచయిత వ్రాసాడని కూడా మనకు తెలుసు — మరియు అన్నీ ఒకేసారి, ఈ ప్రపంచానికి మరెంతో అవసరమైనప్పుడు, నవతరానికి మరెంతో కావలసినప్పుడు, యేసు యొక్క దినములో ఆయన ఎంతో అందించినప్పుడు బోధించబడుతున్నాయి. క్రీస్తు యొక్క శిష్యులుగా మనం మన రోజులో, “మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయెను“15 అని చింతించిన ఆ ప్రాచీన ఇశ్రాయేలీయులను మించగలము. వాస్తవానికి, మనం చివరకు నిరీక్షణ కోల్పోయినట్లయితే, మనం మన చివరి నిరంతర స్వాధీనాన్ని కోల్పోతాం. తన డివినా కమ్మెడియా ద్వారా ప్రయాణికులందరికి నరకపు ద్వారం పైన డాంటె ఒక హెచ్చరిక వ్రాసాడు: “ఇక్కడ ప్రవేశించే మీరు అన్ని ఆశలను త్యజించాలి” అన్నాడతడు. 16 నిజంగా నిరీక్షణ కోల్పోబడినప్పుడు, మనకు మిగిలేది నలువైపులా మండుచున్న నరకపు జ్వాల.

కాబట్టి, “ఇతర సహాయకులు విఫలమై, సుఖాలు వీడినప్పుడు,“17 అని కీర్తన చెప్పినట్లుగా, నిరాశాజనకమైన పరిస్థితులలో దేవుని యందు మన విశ్వాసము మరియు ఇతరుల పట్ల మన దాతృత్వముతో అనివార్య సంబంధమేర్పరచుకున్న నిరీక్షణ అనే ఈ అమూల్యమైన బహుమానం మనకు అత్యంత ఆవశ్యకమైన సుగుణాలలో ఒకటైయుంటుంది.

ఈ రెండువందల వార్షికోత్సవ సమయంలో, మనం మనకివ్వబడిన వాటన్నిటిని చూడడానికి వెనుదిరిగినప్పుడు, అనేక కోరికలు నెరవేర్చబడ్డాయని తెలుసుకొని ఆనందించినప్పుడు, కొన్ని నెలల క్రితం జోహెన్స్ బర్గ్ లో మాతో ఇలా చెప్పిన ఇంటికి వచ్చిన అందమైన యౌవన మిషనరీ సహోదరి మనోభావాన్ని నేను తిరిగి ఉచ్ఛరిస్తున్నాను, ”(మనం) ఇంత దూరం ప్రయాణించామంటే అర్థము ఇకపై ముందుకు సాగలేమని లేక ఎక్కువ పొందలేమని కాదు.”18

లేఖనాలలో నమోదు చేయబడిన అత్యంత ప్రేరేపిత వీడ్కోలు సందేశాలలో ఒకదానిని వ్యాఖ్యానిస్తూ, ప్రవక్త నీఫై మరియు ఆ యౌవన సహోదరితో పాటు నేను చెప్తున్నాను:

“నా ప్రియమైన సహోదరులారా (మరియు సహోదరీలారా), మీరు (పునఃస్థాపన యొక్క ప్రథమ ఫలములు పొందిన) తర్వాత, సమస్తము చేయబడెనా? అని నేనడుగుతున్నాను. ఇదిగో నేను మీతో లేదని చెప్పుచున్నాను; …

“… క్రీస్తు నందు ఒక నిలకడతో పరిపూర్ణమైన ప్రకాశవంతమైన నిరీక్షణ కలిగియుండి, దేవుని యొక్క మరియు మనుష్యులందరి యొక్క ప్రేమను కలిగి ముందుకు త్రోసుకు వెళ్ళవలెను. … మీరు స్థిరముగా నుండిన యెడల[,] … మీరు నిత్యజీవమును పొందుదురని తండ్రి ఇట్లు చెప్పుచున్నాడు.”19

నా సహోదర సహోదరీలారా, ఈ చివరిది మరియు యుగాలన్నిటిలోకి గొప్పదైన, యేసు క్రీస్తు సువార్త పునఃస్థాపించబడిన యుగములో మనకివ్వబడిన వాటన్నిటి కొరకు నేను కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఆ సువార్త నుండి వచ్చే బహుమానాలు, దీవెనలే నాకు సర్వస్వం —సర్వస్వం —కాబట్టి వాటి కొరకు పరలోకమందున్న నా తండ్రికి కృతజ్ఞతలు తెలిపే ప్రయత్నంలో నేను “పాటించవలసిన వాగ్దానాలున్నాయి, నేను నిద్రించకముందు ప్రయాణించవలసిన దూరాలున్నాయి, మరియు నేను నిద్రించకముందు ప్రయాణించవలసిన దూరాలున్నాయి.”20 కాబట్టి, 200 ఏళ్ళుగా మనం ఉన్న పరిశుద్ధ నిరీక్షణా మార్గాన్ని వెలిగించే “ప్రకాశవంతమైన నిరీక్షణ“21 లో నడుస్తూ, మన హృదయాలలో ప్రేమతో ముందుకు త్రోసుకు వెళ్ళెదము. భవిష్యత్తు కూడా గతం లాగే అద్భుతాలతో నిండి, సమృద్ధిగా దీవించబడుతుందని నేను సాక్ష్యమిస్తున్నాను. మనం ఇదివరకే పొందిన దీవెనలను మించిన వాటి కొరకు ఆశించడానికి మనకు అన్ని కారణాలున్నాయి, ఎందుకంటే ఇది సర్వశక్తిమంతుడైన దేవుని కార్యము, ఇది నిరంతర బయల్పాటు గల సంఘము, మరియు ఇది అపరిమిత కనికరము, దయ గల క్రీస్తు యొక్క సువార్త. ఈ సత్యాలన్నీ మరియు ఇంకా ఎక్కువ వాటి గురించి నేను యేసు క్రీస్తు నామములో సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.