సర్వసభ్య సమావేశము
విశ్వాస సహిత ప్రార్థనలు
ఏప్రిల్ 2020 సర్వసభ్య సమావేశము


విశ్వాస సహిత ప్రార్థనలు

మనం విశ్వాసంతో ప్రార్థిస్తున్నప్పుడు, ప్రభువు తన రెండవ రాకడ కోసం ప్రపంచాన్ని సిద్ధం చేస్తున్నప్పుడు మనం ఆయన యొక్క పనిలో ఒక ముఖ్యమైన భాగం అవుతాము.

సర్వసభ్య సమావేశం యొక్క ఈ మొదటి సభ ప్రారంభంలో ఎల్డర్ మేనెస్ ప్రార్థనకు సమాధానం ఇవ్వబడుతోంది. అద్భుతమైన సందేశాలు మరియు అందమైన సంగీతం ద్వారా మాకు ప్రేరణ వచ్చింది. ఈ సమావేశం అద్భుతమైన మరియు చిరస్మరణీయమైనదని అధ్యక్షులు రస్సెల్ ఎం. నెల్సన్ ఇచ్చిన వాగ్దానం ఇప్పటికే నెరవేరడం ప్రారంభమైంది.

“తండ్రి అయిన దేవుడు మరియు ఆయన ప్రియమైన కుమారుడైన యేసు క్రీస్తు దర్శనంలో జోసెఫ్ స్మిత్‌కు కనబడి 200 సంవత్సరాలు అయిన కారణంగా దాని జ్ఞాపకార్థం ద్విశతాబ్ది కాలం” గా ఈ సంవత్సరాన్ని అధ్యక్షులు నెల్సన్ పేర్కొన్నారు. అధ్యక్షులు నెల్సన్ ఈ చారిత్రాత్మక సమావేశానికి మనల్ని సిద్ధం చేయడానికి వ్యక్తిగత ప్రణాళికను రూపొందించమని మనల్ని ఆహ్వానించారు, ఈ జ్ఞాపకార్థం “సంఘ చరిత్రలో ఒక అత్యంత ప్రభావితమైన సమయము అవుతుంది, మరియు మీ భాగం చాలా ముఖ్యమైనది” అని ఆయన అన్నారు.1

నా లాగే, బహుశా మీరు ఆయన సందేశాన్ని విన్నారు మరియు “నా భాగం ఏ విధంగా ముఖ్యమైనది?” అని మిమ్మల్ని మీరు ప్రశ్నించకొన్నారు. పునఃస్థాపన యొక్క సంఘటనల గురించి మీరు చదివి ప్రార్థన చేసి ఉండవచ్చు బహుశా, మునుపెన్నడూ లేనంతగా, తండ్రి అయిన దేవుడు తన ప్రియమైన కుమారుడిని పరిచయం చేసిన ఆ అసాధారణ సమయాల కథనాలను మీరు చదివారు. బహశా, రక్షకుడు అప్పుడు మన పరలోకపు తండ్రి పిల్లలతో మాట్లాడిన సందర్భాలను మీరు చదివి ఉండవచ్చు. నేను ఆ పనులన్నీ మరియు ఇంకా ఎక్కువ చేశానని నాకు తెలుసు.

నేను దేవుని యాజకత్వము మరియు యుగముల ప్రారంభము గురించి నా పఠనంలో పరస్పరసంబంధాలు కనుగొన్నాను. ఈ సమావేశానికి నా సిద్ధపాటు నా స్వంత చరిత్రలో అత్యంత ప్రభావితమైన సమయము అని నేను గ్రహించినప్పుడు నేను వినయముగా ఉన్నాను. నా హృదయంలో మార్పులు వచ్చాయి. నేను కొత్త కృతజ్ఞతను అనుభవించాను. కొనసాగుతున్న పునఃస్థాపన యొక్క ఈ వేడుకలో పాల్గొనడానికి ఆహ్వానించబడటం పట్ల నేను ఆనందంతో నిండిపోయాను.

జాగ్రత్తగా సిద్ధపడటం, మరింత ఆనందం, మరింత ఆశావాదం మరియు ప్రభువుకు అవసరమైన ఏ సామర్థ్యంలోనైనా సేవ చేయడానికి మరింత నిశ్చయించుకోవడం వల్ల ఇతరులు అనుభూతి చెందుతున్నారని నేను ఊహించాను.

మనము గౌరవించే మహత్తరమైన సంఘటనలు ప్రవచించిన ఆఖరి యుగమునకు నాంది, దీనిలో ప్రభువును స్వీకరించడానికి తన సంఘాన్ని మరియు తన ప్రజలను, ఆయన పేరును వహించే వారిని సిద్ధం చేస్తున్నారు. ఆయన రాక కోసం మన సిద్ధపాటులో భాగంగా, ఆయన మనలో ప్రతి ఒక్కరినీ ఆత్మీయంగా లేవనెత్తును, కాబట్టి ఈ ప్రపంచ చరిత్రలో చూడని విధంగా ఆత్మీయ సవాళ్లు మరియు అవకాశాలకు మనం ఎదగవచ్చు.

సెప్టెంబరు 1840 లో, ప్రవక్త జోసెఫ్ స్మిత్ మరియు మొదటి అధ్యక్షత్వములో అతని సలహాదారులు ఈ క్రింది వాటిని ప్రకటించారు: “ఈ చివరి రోజుల్లో ప్రభువు యొక్క కార్యము చాలా పెద్దవాటిలో ఒకటి మరియు మానవుల గ్రహింపునకు మించినది. దాని కీర్తి మాటలలో వర్ణించలేనిది, మరియు దాని వైభవానికి మించినది లేదు. ప్రపంచ సృష్టి నుండి ప్రతి తరం ద్వారా ప్రస్తుత కాలం వరకు ప్రవక్తలను మరియు నీతిమంతులను ఉత్తేజం చేసిన ఇతివృత్తం ఇది; లోకము ప్రారంభమైనప్పటి నుండి పవిత్ర ప్రవక్తల చేత చెప్పబడినట్లుగా క్రీస్తు యేసునందు, పరలోకంలోను, భూమిమీద ఉన్నవన్నీ ఆయనలో ఒకచోట చేరి, మరియు అన్ని విషయాలు పునఃస్థాపించబడి, ఇది నిజంగా కాలముల సంపూర్ణత యొక్క యుగము; దీనిలో ప్రవక్తలకు ఇచ్చిన వాగ్దానాల మహిమకరమైన నెరవేర్పు జరుగుతుంది, మరియు సర్వోన్నతుని శక్తి యొక్క ప్రత్యక్షత గొప్పగా, మహిమకరముగా మరియు శ్రేష్ఠమైనదిగా ఉండును. …

వారు ఇంకా ఇలా చెప్పారు: “… దేవునిరాజ్యము యొక్క అభివృద్ధి మరియు యాజకత్వమును సంపూర్ణముగా, మహిమలో స్థాపించడానికి ముందుకు సాగి మా శక్తులను ఏకం చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నామని మేము భావిస్తున్నాము. చివరి రోజులలో సాధించాల్సిన పని చాలా ప్రాముఖ్యమైనది, మరియు పరిశుద్ధుల యొక్క శక్తి, నైపుణ్యం, ప్రతిభ మరియు సామర్థ్యం అవసరమౌతుంది, తద్వారా ఇది ప్రవక్త [దానియేలు] వివరించిన ఆ కీర్తి మరియు ఘనతతో ముందుకు సాగవచ్చు. [దానియేలు 2: 34–35, 44–45 చూడండి]; కాబట్టి అటువంటి గొప్పతనం మరియు వైభవం గల పనులను సాధించడానికి పరిశుద్ధుల ఏకాగ్రత అవసరం.”2

పునఃస్థాపనలో అభివృద్ధిచెందుటకు మనం ఏమి చేస్తాము మరియు ఎప్పుడు చేస్తాం అనే దాని గురించి చాలా ప్రత్యేకతలు ఇంకా వెల్లడించలేదు. అయినప్పటికీ ఆ ప్రారంభ రోజులలో కూడా ప్రథమ అధ్యక్షత్వమునతు ప్రభువు మన ముందు ఉంచిన పని యొక్క వెడల్పు మరియు లోతు తెలుసు. జరుగుతాయని మనకు తెలిసిన కొన్ని ఉదాహరణలు ఇక్కడ ఉన్నాయి:

తన పరిశుద్ధుల ద్వారా, ప్రభువు తన సువార్త వరమును “ప్రతి జనమునకు, వంశమునకు, భాషకు మరియు ప్రజలకు” అందిస్తారు.3 వ్యక్తిగత “మనుష్యులను పట్టు జాలరులు”4 వలె సాంకేతికత మరియు అద్భుతాలు ఒక పాత్రను పోషించుటను కొనసాగిస్తాయి—వారు శక్తితో మరియు అధికమైన విశ్వాసముతో పరిచర్య చేస్తారు.

పెరుగుతున్న కలహము మధ్య ప్రజలుగా మనం మరింత ఐక్యంగా మారుతాము. సమూహాలు మరియు కుటుంబాలు సువార్త ద్వారా ఆశీర్వదించబడగా ఆత్మీయ బలంతో మనం సమకూర్చబడతాము.

అవిశ్వాస ప్రపంచం కూడా యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘాన్ని గుర్తిస్తుంది మరియు దానిపై దేవుని శక్తిని గ్రహిస్తుంది. విశ్వాసపాత్రులైన, ధైర్యవంతులైన శిష్యులు తమ దైనందిన జీవితంలో నిర్భయంగా, వినయంగా, బహిరంగంగా క్రీస్తు నామాన్ని తమపైన తీసుకుంటారు.

అయితే, మనలో ప్రతి ఒక్కరూ ఇంత గొప్పతనం మరియు వైభవం ఉన్న ఈ పనిలో ఎలా పాల్గొనగలము? అధ్యక్షులు నెల్సన్ ఆధ్యాత్మిక శక్తిలో ఎలా ఎదగాలని నేర్పించారు. యేసే క్రీస్తని మన పెరుగుతున్న విశ్వాసం వల్ల మనం పశ్చాత్తాపాన్ని సంతోషకరమైన అవకాశంగా తీసుకున్నప్పుడు, పరలోకపు తండ్రి మన ప్రతి ప్రార్థనను వింటారని మనం అర్థం చేసుకున్నప్పుడు మరియు నమ్మినప్పుడు, ఆజ్ఞలను పాటించటానికి మరియు జీవించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, నిరంతరాయంగా బయల్పాటును పొందడానికి మన శక్తిలో మనం పెరుగుతాము. పరిశుద్ధాత్మ మన నిరంతర సహచరి కాగలదు. మన చుట్టూ ఉన్న ప్రపంచం చీకటిగా మారినప్పటికీ కాంతి భావన మనతోనే ఉంటుంది.

అటువంటి ఆత్మీయ శక్తిలో ఎలా ఎదగాలనేదానికి జోసెఫ్ స్మిత్ ఒక ఉదాహరణ. విశ్వాసముతో కూడిన ప్రార్థన దేవుని నుండి బయల్పాటు పొందుటకు కీలకమని ఆయన మనకు చూపించెను. తండ్రియైన దేవుడు ప్రార్థనలకు సమాధానమిస్తారని నమ్మకముతో ఆయన విశ్వాసంతో ప్రార్థించెను. యేసు క్రీస్తు ద్వారా మాత్రమే తన పాపాలకు తాను అనుభవించిన అపరాధం నుండి విముక్తి పొందగలడని నమ్ముతూ విశ్వాసంతో ప్రార్థించెను. మరియు ఆయన క్షమాపణ పొందటానికి యేసు క్రీస్తు యొక్క నిజమైన సంఘాన్ని కనుగొనవలసి ఉందని నమ్ముతూ విశ్వాసంతో ప్రార్థించెను.

తన ప్రవచనాత్మక పరిచర్యలో, జోసెఫ్ స్మిత్ నిరంతర బయల్పాటు పొందడానికి విశ్వాస ప్రార్థనలను ఉపయోగించెను. నేటి సవాళ్లను మరియు ఇంకా రాబోయే వాటిని ఎదుర్కొంటున్నప్పుడు, మనం కూడా అదే పద్ధతిని పాటించాలి. అధ్యక్షులు బ్రిగం యంగ్ ఇలా అన్నారు, “తన ప్రజలకు మార్గనిర్దేశం చేయడానికి మరియు దర్శకత్వం వహించడానికి ప్రతి శ్వాస యధార్థముగా దేవునికి ఒక ప్రార్థనగా ఉండటం కంటే కడవర-దిన పరిశుద్ధుల కోసం నాకు వేరే మార్గం తెలియదు.”5

సంస్కార ప్రార్థనల నుండి వచ్చిన ఈ మాటలు మన దైనందిన జీవితానికి వర్ణనగా ఉండాలి: “ఎల్లప్పుడూ ఆయనను జ్ఞాపకము చేసుకొనుము.” “ఆయన” అనే పదం యేసు క్రీస్తును సూచిస్తుంది. “మరియు ఆయన ఆజ్ఞలను పాటించవలెను” అనే తదుపరి పదాలు ఆయనను జ్ఞాపకం చేసుకోవడం అంటే ఏమిటో సూచిస్తాయి.6 మనం యేసు క్రీస్తును ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ, నిశ్శబ్ద ప్రార్థనలో, “ఆయన నన్ను ఏమి చేయమని కోరుతున్నారు?” అని అడగవచ్చు

యేసు క్రీస్తుపై విశ్వాసంతో అర్పించిన ఇటువంటి ప్రార్థన ఈ చివరి యుగమునకు దారితీసింది. మరియు దాని విస్తరణను కొనసాగించడానికి మనలో ప్రతి ఒక్కరం చాలా ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తాము. అలాంటి ప్రార్థన యొక్క అద్భుతమైన ఉదాహరణలను నేను కనుగొన్నాను.

మొదటిది జోసెఫ్ స్మిత్. ప్రభువు తనని ఏమి చెయ్యాలని కోరుతున్నారో అని ఆయన చిన్నపిల్లలవంటి విశ్వాసంతో అడిగెను. ఆయనకు ఇవ్వబడిన సమాధానం ప్రపంచ చరిత్రను మార్చివేసింది.

నాకైతే చాలా ముఖ్యమైన పాఠం, ప్రార్థన చేయటానికి జోసెఫ్ మోకరిల్లినప్పుడు సాతాను దాడికి జోసెఫ్ స్పందన నుండి వచ్చింది.

మనం ప్రార్థన చేయకూడదని మనకు అనిపించేలా సాతాను మరియు అతని సేవకులు ప్రయత్నం చేస్తారని నాకు అనుభవం నుండి తెలుసు. తనను బంధించడానికి ప్రయత్నించిన శక్తి నుండి తనను విడిపించమని దేవుని ప్రార్థించుటకు జోసెఫ్ స్మిత్ తన శక్తులన్నిటినీ ప్రయోగించినప్పుడు, ఉపశమనం కోసం ఆయన చేసిన ప్రార్థనకు సమాధానం లభించింది మరియు పరలోక తండ్రి, యేసు క్రీస్తు కనిపించారు.

పునఃస్థాపన ప్రారంభానికి అడ్డుకట్ట వేయడానికి సాతాను చేసిన ప్రయత్నం చాలా తీవ్రంగా ఉంది ఎందుకంటే జోసెఫ్ ప్రార్థన చాలా ముఖ్యమైనది. కొనసాగుతున్న పునఃస్థాపనలో మీరు మరియు నేను పోషించవలసిన చిన్న పాత్రలను కలిగి ఉంటాము. ఐనప్పటికి పునఃస్థాపన యొక్క శత్రువు మమ్మల్ని ప్రార్థన చేయకుండా ఆపడానికి ప్రయత్నిస్తాడు. జోసెఫ్ విశ్వాసం యొక్క మాదిరి మరియు అతని సంకల్పం మన సంకల్పంలో మనల్ని బలపరచగలదు. నా ప్రార్థనలలో జోసెఫ్ ప్రవక్త కోసం పరలోక తండ్రికి కృతజ్ఞతలు చెప్పడానికి అనేక కారణాలలో ఇది ఒకటి.

నిరంతర పునఃస్థాపనలో నా పాత్ర పోషించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మోర్మన్ గ్రంథములోని ఈనస్ నా విశ్వాస ప్రార్థనకు మరొక నమూనా. మీ భాగం ఏమైనప్పటికీ, మీరు ఆయనను మీ వ్యక్తిగత గురువుగా తీసుకోవచ్చు.

జోసెఫ్ మాదిరిగా ఈనస్ విశ్వాసంతో ప్రార్థించాడు. అతను తన అనుభవాన్ని ఈ విధంగా వివరించాడు:

“మరియు నా ఆత్మ ఆకలిగొనెను; మరియు నేను నా సృష్ఠికర్త యెదుట మోకాళ్ళూనితిని మరియు నా స్వంత ఆత్మ నిమిత్తము బలమైన ప్రార్థన మరియు యాచనయందు నేను ఆయనకు మొర పెట్టితిని; మరియు దినమంతయు నేను ఆయనకు మొరపెట్టితిని; అవును మరియు రాత్రి వచ్చినప్పుడు నేను ఇంకను నా స్వరమును అది పరలోకములకు చేరునట్లు పైకెత్తితిని.

“మరియు ఒక స్వరము నా యొద్దకు వచ్చి ఇట్లనెను; ఈనస్ నీ యొక్క పాపములు నీకు క్షమించబడినవి మరియు నీవు ఆశీర్వదించబడుదువు.

“మరియు ఈనస్ అను నేను దేవుడు అబద్దమాడడని యెరుగుదును. అందువలన నా దోషము తుడిచి వేయబడెను.

“మరియు నేను చెప్పతిని: ప్రభువా ఇది ఎట్లు చేయబడెను?

“మరియు అతడు నాతో చెప్పెను: నీవు ముందెన్నడు వినని మరియు చూచియుండని ఆ క్రీస్తు నందున్న విశ్వాసమును బట్టి. మరియు ఆయన శరీరమందు తనను తాను ప్రత్యక్షపరచుకొనుటకు ముందు అనేక సంవత్సరములు గడిచిపోవును; అందువలన వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను.” 7

ఈ మాటలలో పాఠము నన్ను దీవించెను: “నీవు ముందెన్నడు వినని మరియు చూచియుండని ఆ క్రీస్తు నందున్న విశ్వాసమును బట్టి.”

వనములోకి వెళ్ళడానికి మరియు సాతాను యొక్క శక్తుల నుండి విడుదల కావాలని ప్రార్థించటానికి జోసెఫ్‌కు క్రీస్తుపై విశ్వాసం ఉంది. అతను ఇంకా తండ్రిని, కుమారుడిని చూడలేదు, కాని అతను తన హృదయ శక్తితో విశ్వాసంతో ప్రార్థించాడు.

ఈనస్ అనుభవం నాకు అదే విలువైన పాఠం నేర్పింది. నేను విశ్వాసంతో ప్రార్థించినప్పుడు, రక్షకుడిని తండ్రితో నా న్యాయవాదిగా కలిగి ఉన్నాను మరియు నా ప్రార్థనలు పరలోకానికి చేరుకుంటాయని నేను భావిస్తున్నాను. సమాధానాలు వస్తాయియ దీవెనలు పొందబడతాయి. కష్ట సమయాల్లో కూడా శాంతి, ఆనందం ఉంటాయి.

పన్నెండు అపొస్తలుల సమూహము యొక్క క్రొత్త సభ్యుడిగా, నేను ఎల్డర్ డేవిడ్ బి. హే ప్రార్థనలో మోకరిల్లినప్పుడు నాకు గుర్తుంది. ఆయన నేను ఇప్పుడు ఉన్న వయస్సులో ఉండి, నేను ఇప్పుడు అనుభవిస్తున్న సవాళ్లను కలిగియున్నారు. ఆయన ప్రార్థించినప్పుడు ఆయన స్వరం నాకు గుర్తుంది. నేను చూడటానికి కళ్ళు తెరవలేదు, కాని ఆయన నవ్వుతున్నట్లు అనిపించింది. ఆయన తన స్వరంలో ఆనందంతో పరలోక తండ్రితో మాట్లాడారు.

“యేసుక్రీస్తు పేరిట” అని చెప్పినప్పుడు ఆయన ఆనందాన్ని నా మనస్సులో వినగలను. ఎల్డర్ హే రక్షకుడు ఆ సమయంలో అతను ప్రార్థించిన సందేశాన్ని ధృవీకరిస్తున్నట్లు భావించినట్లు నాకు అనిపించింది. మరియు అది చిరునవ్వుతో స్వీకరించబడుతుందని నేను ఖచ్చితంగా అనుకున్నాను.

మన రక్షకుడిగా యేసు క్రీస్తుపై మరియు మన తండ్రిగా మన పరలోకపు తండ్రిపై మన విశ్వాసంలో మనం అభివృద్ధచెందినప్పుడు అద్భుతమైన నిరంతర పునఃస్థాపనకు మన కీలకమైన సహకారం అందించే మన సామర్థ్యం పెరుగుతుంది. మనం విశ్వాసంతో ప్రార్థిస్తున్నప్పుడు, ప్రభువు తన రెండవ రాకడ కోసం ప్రపంచాన్ని సిద్ధం చేస్తున్నప్పుడు మనం ఆయన యొక్క పనిలో ఒక ముఖ్యమైన భాగం అవుతాము. ఆయన మనలో ప్రతి ఒక్కరినీ ఆహ్వానించిన పనిని చేయడంలో మనమందరం ఆనందం పొందాలని ప్రార్థిస్తున్నాను.

యేసు క్రీస్తు జీవిస్తున్నారని నేను సాక్ష్యమిస్తున్నాను. ఇది ఆయన సంఘము మరియు భూమిపై ఆయన రాజ్యం. జోసెఫ్ స్మిత్ పునఃస్థాపన యొక్క ప్రవక్త. అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఈ రోజు భూమిపై ప్రభువు ప్రవక్త. ఆయన యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘములో యాజకత్వము యొక్క అన్ని తాళపుచేతులను కలిగి ఉన్నారు. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.