సర్వసభ్య సమావేశము
మన హృదయపు లోతులో
ఏప్రిల్ 2020 సర్వసభ్య సమావేశము


మన హృదయపు లోతులో

మనందరం—మన హృదయాలలోనికి ఆయన సువార్తను లోతుగా పొందటానికి—మనకు సహాయపడటానికి ప్రభువు ప్రయత్నిస్తున్నాడు.

సహోదర, సహోదరిలారా, మనము ఎంత అద్భుతమైన సమయంలో జీవిస్తున్నాము. పునఃస్థాపన యొక్క ప్రారంభమును మనము జరుపుకుంటున్నప్పుడు, మనము సాక్ష్యమిస్తున్న, కొనసాగుతున్న పునఃస్థాపనను జరుపుకొనుట కూడ యుక్తమైనది. ఈ సమయంలో జీవిస్తున్నందుకు నేను మీతోపాటు ఆనందిస్తున్నాను.1 ఆయనను స్వీకరించుటకు సిద్ధపడుటకు మనకు సహాయపడుటకు అవసరమైన సమస్తమును, ఆయన ప్రవక్తల ద్వారా, స్థానములో ఉంచుట ప్రభువు కొనసాగించారు.2

అవసరమైన విషయాలలో ఒకటి క్రొత్తదైన పిల్లల మరియు యువత ప్రారంభం. లక్ష్యములను ఏర్పరచుట, చేర్చబడుటకు క్రొత్త చిహ్నములు, మరియు యౌవనుల బలము కొరకు సమావేశాలపై ఈ కార్యక్రమము యొక్క ఉద్ఘాటనతో మీలో అనేకులు పరిచయం కలిగియున్నారు. కానీ అవి కార్యక్రమము నిర్మించబడిన సూత్రములు మరియు వాటి ఉద్దేశమును చూచుటకు లేక గుర్తించుటకు మన సామర్ధ్యమును అస్పష్టంగా చేయనివ్వకూడదు: యేసు క్రీస్తు యొక్క సువార్త మన పిల్లలు మరియు యువత యొక్క హృదయాలలో లోతైన భావనలు, ఆలోచనలు స్థాపించుటకు సహాయపడుట.3

ఈ సూత్రములను ఎక్కువ స్పష్టంగా చూసినప్పుడు, దీనిని 8 నుండి 18 సంవత్సరాల సభ్యులకు ఒక కార్యక్రమముగా కంటే ఎక్కువగా గుర్తిస్తాము. మన హృదయాలలోనికి ఆయన సువార్తను లోతుగా పొందటానికి—మనందరికి—సహాయపడటానికి ప్రభువు ఎలా ప్రయత్నిస్తున్నాడో మనము చూస్తాము. మనము కలిసి నేర్చుకోవటానికి పరిశుద్ధాత్మ మనకు సహాయపడుతుందని నేను ప్రార్ధిస్తున్నాను.

అనుబంధాలు—“వారితో ఉండుము”4

మొదటి సూత్రము అనుబంధాలు. వారు యేసు క్రీస్తు సంఘములో సహజమైన భాగము కనుక, క్రీస్తు వద్దకు మన నిరంతర ప్రయాణంలో అనుబంధాల ప్రాముఖ్యతను మనము కొన్నిసార్లు మరచిపోతాము. నిబంధనలు చేసి, పాటించు ప్రక్రియలో మనము ఒంటరిగా నడచుటకు లేక కనుగొనబడుటకు ఆశించబడలేదు. తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు, స్నేహితులు, మరియు నిబంధన బాటలో కూడ నడుస్తున్న నాయకుల ప్రేమ మరియు సహకారము మనకవసరం.

ఈవిధమైన అనుబంధాలకు సమయం అవసరం. కలిసి ఉండాల్సిన సమయం. నవ్వటానికి, ఆడుకోవటానికి, నేర్చుకోవడానికి, మరియు కలిసి సేవ చేయుటకు సమయం. ఒకరినొకరి ఆసక్తులు మరియు సవాళ్లను అభినందించుటకు సమయం. మనము ఉత్తమంగా ఉండటానికి కలిసి ప్రయాసపడినప్పుడు ఒకరినొకరితో నిష్కపటంగా, నిజాయితీగా ఉండుటకు సమయం. ఈ అనుబంధాలు కుటుంబాలుగా, కోరములుగా, తరగతులుగా, మరియు సమూహములుగా సమావేశామయ్యే ప్రధాన ఉద్దేశ్యాలలో ఒకటి. అవి ప్రభావవంతమైన పరిచర్య కోసం పునాది.5

ఎల్డర్ డేల్ జి. రెన్‌లండ్ ఇలా చెప్పినప్పుడు, ఈ అనుబంధాలను వృద్ధి చేయుటకు కీలకమైనది మనకిచ్చారు: “ఇతరులకు ప్రభావవంతంగా సేవ చేయుటకు మనము వారిని … పరలోక తండ్రి యొక్క కన్నుల ద్వారా చూడాలి. అప్పుడు మాత్రమే మనము ఆత్మ యొక్క నిజమైన విలువను అర్ధం చేసుకోవడం ప్రారంభించగలము. అప్పుడు మాత్రమే పరలోక తండ్రి తన పిల్లలందరి కోసం కలిగియున్న ప్రేమను మనము గ్రహించగలుగుతాము. 6

దేవుడు చూసినట్లుగా ఇతరులను చూచుట ఒక వరము. ఈ వరమును వెదకమని మనందరిని నేను ఆహ్వానిస్తున్నాను. చూచుటకు మన కన్నులు తెరవబడినప్పుడు,7 దేవుడు చూసినట్లుగా ఇతరులు తమను తాము చూసుకొనుటకు సహాయపడగలుగుతాము.8 అధ్యక్షులు హెన్రీ బి. ఐరింగ్ దీనిని చెప్పినప్పుడు, దాని శక్తిని ఆయన వక్కాణించారు: “చాలా ముఖ్యమైనది ఏదనగా, వారు నిజముగా ఎవరు మరియు వారు నిజంగా ఏమి కాగలరో [మీ] నుండి [ఇతరులు] నేర్చుకొన్నది. నేను ఊహించేది ఏమిటంటే, ప్రసంగాలనుండి వారు ఎక్కువగా వారు నేర్చుకొనరు. వారు మీరు ఎవరు, వారు ఎవరని మీరనుకుంటున్నారు, మరియు వారు ఏమి కాగలరని మీరనుకుంటున్నారో భావనల నుండి వారు దానిని పొందుతారు.9 వారి నిజమైన గుర్తింపును మరియు ఉద్దేశమును గ్రహించడానికి ఇతరులకు సహాయపడుట మనము ఇవ్వగల మిక్కిలి గొప్ప బహుమానాలలో ఒకటి.10 దేవుడు చూసినట్లుగా ఇతరులను, మనల్ని చూచుట, మన హృదయాలను “ఐక్యత మరియు ప్రేమయందు దగ్గరగా చేర్చును.”11

ఎప్పటికప్పుడు పెరుగుతున్న లౌకిక శక్తులు మనపై ప్రభావం కలిగియుండటంతో, ప్రేమగల అనుబంధాలనుండి వచ్చు బలము మనకవసరం. కనుక మనము కార్యక్రమాలు, సమావేశాలు, మరియు ఇతర కూడికలను ప్రణాళిక చేసినప్పుడు,ఈ కూడికల ప్రధాన ఉద్దేశము, యేసు క్రీస్తు యొక్క సువార్త మన హృదయాలలో లోతుగా వెళ్ళుటకు సహాయపడుట మరియు మనల్ని ఐక్యపరచు ప్రేమగల అనుబంధాలను నిర్మించుట అని మనము జ్ఞాపకముంచుకోవాలి.12

బయల్పాటు, స్వతంత్రత, మరియు పశ్చాత్తాపము—“వారిని పరలోకముతో జతపరచును”13

అవును, కేవలం కలిసి కట్టుబడియుండుట మాత్రమే సరిపోదు. వివిధ కారణాల చుట్టూ ఐక్యతను సాధించే అనేక సమూహాలు మరియు సంస్థలున్నాయి. కానీ మనము వెదికే ఐక్యత క్రీస్తుయందు ఒకటిగా అగుట, ఆయనతో మనల్ని జతపరచుకొనుట.14 పరలోకముతో మన హృదయాలను జతపరచుటకు, ఇప్పుడే ఎల్డర్ ఆండర్సన్ వాగ్ధాటితో మాట్లాడినట్లుగా, మనకు వ్యక్తిగత ఆత్మీయ అనుభవాలు అవసరము.15 పరిశుద్ధాత్మ వాక్యమును మరియు దేవుని ప్రేమను మన మనస్సు, హృదయములోనికి తీసుకొనిపోయినప్పుడు ఈ అనుభవాలు కలుగుతాయి.16

ఈ బయల్పాటు లేఖనాల ద్వారా, ప్రత్యేకంగా మోర్మన్ గ్రంథము; జీవిస్తున్న ప్రవక్తలు మరియు మిగిలిన విశ్వాసులైన శిష్యుల నుండి ప్రేరేపించబడిన మాటల ద్వారా; మరియు మిక్కిలి నెమ్మదియైన స్వరము ద్వారా మనకు వచ్చును.17 ఈ మాటలు ఒక పేజీపై సిరాను, మన చెవులలో అలల ధ్వని, మన మనస్సులు, హృదయాలలోని ఆలోచనలు లేక భావనలను మించినవి. దేవుని వాక్యము ఆత్మీయ శక్తిని కలిగియున్నది.18 అది సత్యమును, వెలుగును.19 ఆవిధంగా మనము ఆయనను వింటాము! వాక్యము క్రీస్తుయందు మన విశ్వాసమును ప్రారంభించును మరియు హెచ్చించును, రక్షకుని వలె ఎక్కువగా మారటానికి ఒక కోరికను మనలో ప్రేరేపించును—అంటే పశ్చాత్తాపపడుట, మరియు నిబంధన బాటలో నడుచుట.20

గత ఏప్రిల్, అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ బయల్పాటు ప్రయాణములో పశ్చాత్తాపము యొక్క ప్రధాన పాత్రను గ్రహించుటకు మనకు సహాయపడ్డారు.21 ఆయన అన్నారు: “పశ్చాత్తాపపడుటకు మనం ఎంచుకొన్నప్పుడు, మారుటకు మనం ఎంచుకుంటాము! రక్షకుడు మనలను శ్రేష్టమైన వ్యక్తులుగా మార్చుటకు మనం అనుమతిస్తాము. … మనము యేసు క్రీస్తు వలె ఎక్కువగా మారటానికి ఎన్నుకుంటాము!”22 దేవుని వాక్యము చేత ప్రేరేపించబడి, ఈ మార్పు యొక్క ప్రక్రియ, పరలోకముతో మనల్ని జతపరచు విధానము.

పశ్చాత్తాపపడమనిన అధ్యక్షులు నెల్సన్ యొక్క ఆహ్వానంలో అంతర్లీనమైనది స్వతంత్రత యొక్క సూత్రము. మనకై మనం మనం పశ్చాత్తాపమును తప్పక ఎంపిక చేసుకోవాలి. సువార్త మన హృదయాలలోనికి నెట్టడం సాధ్యం కాదు. ఎల్డర్ రెన్‌లండ్ ఇలా చెప్పారు, “తల్లిదండ్రులుగా మన పరలోక తండ్రి యొక్క లక్ష్యము, ఆయన పిల్లలు సరైనది చేయునట్లు చేయుట కాదు; అది ఆయన పిల్లలు సరైనది చేయుటకు ఎంపిక చేయునట్లు” చేయుట.23

పిల్లలు మరియు యువత ద్వారా భర్తీ చేయబడిన కార్యక్రమంలో, వివిధ గుర్తింపులను పొందుటకు బదులుగా పూర్తి చేయుటకు 500 పైగా వేర్వేరు అర్హతలున్నాయి.24 ఈరోజు, తప్పనిసరిగా ఒక అవసరమున్నది. అది రక్షకుని వలె ఎక్కువగా మారటానికి ఎంపిక చేయమనే ఒక ఆహ్వానమును కలిగియున్నది. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని వాక్యమును పొందుట మరియు క్రీస్తు మనలను శ్రేష్టమైన వ్యక్తులుగా మార్చుటకు అనుమతించుట ద్వారా దీనిని మనం చేస్తాము.

ఇది లక్ష్యమును ఏర్పరచుట లేక స్వీయ అభివృద్ధి కంటె చాలా ఎక్కువ. లక్ష్యములు కేవలము ఒక సాధనము అది బయల్పాటు, స్వతంత్రత, మరియు పశ్చాత్తాపము ద్వారా పరలోకముతో జతపరచబడుటకు—క్రీస్తునొద్దకు వచ్చుటకు, ఆయన సువార్తను మన హృదయాలలో లోతుగా తీసుకొనుటకు మనకు సహాయపడును.

ఒడంబడిక మరియు త్యాగము—“వారిని నడిపించనియ్యుము”25

చివరిగా, యేసు క్రీస్తు యొక్క సువార్త మన హృదయాలలో లోతుగా పొందటానికి, మనము దానిలో ఒడంబడిక చేసుకొనుట—మన సమయాన్ని, ప్రతిభలను దానికి ఇచ్చుట, దానికోసం త్యాగము చేయుట అవసరము.26 మనమందరం అర్ధవంతమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటాము, మరియు ఇది యువతరం విషయంలో ప్రత్యేకంగా వర్తిస్తుంది. వారు ఒక హేతువులో భాగముగా ఉండాలని కోరతారు.

యేసు క్రీస్తు యొక్క సువార్త ప్రపంచంలో మిక్కిలి గొప్ప హేతువు. అధ్యక్షులు ఎజ్రా టాఫ్ట్ బెన్సన్ ఇలా చెప్పారు: “ఈ సువార్తను సమస్త లోకమునకు తీసుకొని వెళ్లాలని మనము దేవుని చేత ఆజ్ఞాపించబడ్డాము. నేడు ఈ హేతువందు మనము తప్పనిసరిగా ఏకమవ్వాలి. సువార్త మాత్రమే లోకమును దాని స్వంత స్వీయ -విధ్వాంసము నుండి రక్షించును. సువార్త మాత్రమే అన్ని జాతులు, జాతీయత యొక్క పురుషులు [మరియు స్త్రీలను] శాంతియందు ఏకము చేస్తుంది. సువార్త మాత్రమే మానవ కుటుంబానికి సంతోషము, ఆనందమును, మరియు రక్షణను తెచ్చును.”27

ఎల్డర్ డేవిడ్ ఎ. బెడ్నార్ వాగ్దానమిచ్చారు, “యువతను మనము ఆహ్వానించి, ఆచరించుటకు అనుమతించుట ద్వారా వారికి అధికారము ఇచ్చినప్పుడు, అద్భుతమైన విధానాలలో సంఘము ముందుకు సాగుతుంది.”28 చాలా తరచుగా మనము యువతను క్రీస్తు యొక్క ఈ గొప్ప హేతువు కొరకు త్యాగము చేయటానికి ఆహ్వానించలేదు మరియు అనుమతించలేదు. ఎల్డర్ నీల్ ఎ. మాక్స్‌వెల్ గమనించారు, “[మన] యువత [దేవుని యొక్క కార్యము చేత], తక్కువగా ప్రభావితం చేయబడితే, బహుశా వారు లోకము చేత ఎక్కువగా క్షీణింపజేయబడతారు.”29

పిల్లలు మరియు యువత కార్యక్రమము యువతను శక్తివంతం చేయడంపై కేంద్రీకరిస్తుంది. వారు తమ స్వంత లక్ష్యాలను ఎన్నుకుంటారు. కోరము మరియు తరగతి అధ్యక్షత్వములు వాటి సరైన పాత్రలో ఉంచబడతాయి. వార్డు యువత సలహాసభ, వార్డు సలహా సభ వలె, రక్షణ మరియు ఉన్నతస్థితి యొక్క కార్యముపై కేంద్రీకరిస్తాయి.30 కోరములు మరియు తరగతులు దేవుడు వారికి ఇచ్చిన కార్యమును ఎలా చేయాలో సలహా ఇచ్చుట ద్వారా వాటి సమావేశాలను ప్రారంభిస్తారు.31

సంఘ యువతతో అధ్యక్షులు నెల్సన్ ఇలా చెప్పారు: “మీరు ఎంపిక చేస్తే, మీరు కోరిన యెడల, … మీరు ఏదైన పెద్దది, ఏదైన మహాగొప్పది, ఏదైనా అద్భుతమైన దానిలో పెద్ద భాగముగా ఉండగలరు! … ఈ లోకమునకు ప్రభువు ఎప్పటికీ పంపిన శ్రేష్టమైన వారిమధ్య మీరున్నారు. మీరు తెలివిగా, జ్ఞానం కలిగియుండే సామర్ధ్యమును కలిగియున్నారు, మరియు లోకముపై ముందు తరము కంటె ఎక్కువ ప్రభావాన్ని కలిగియున్నారు!”32 మరొక సందర్భంలో అధ్యక్షులు నెల్సన్ యువతకు ఇలా చెప్పారు: “మీ యందు నాకు పూర్తి విశ్వాసమున్నది. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మరియు ప్రభువు ప్రేమిస్తున్నారు. మనము ఆయన పిల్లలము, ఆయన పరిశుద్ధ కార్యములో కలిసి ఒడంబడిక చేసుకున్నాము.”33 యువ జనులారా, అధ్యక్షులు నెల్సన్ మీయందు కలిగియున్న నమ్మకాన్ని మరియు ఈ కార్యమునకు మీరు ఎంత ముఖ్యమైన వారో మీరు భావించగలరా?

తల్లిదండ్రులు మరియు పెద్ద నాయకులారా, అధ్యక్షులు నెల్సన్ యువతను చూసినట్లుగా చూడమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మీ ప్రేమను, నమ్మకాన్ని యువత అనుభూతి చెందినప్పుడు, ఎలా నడిపించాలో మీరు వారిని ప్రోత్సహించి, బోధించినప్పుడు—తరువాత వారి మార్గములో నుండి తప్పుకొన్నప్పుడు—వారి అంతర్‌జ్ఞానములు, సామర్ధ్యములు, మరియు సువార్తకు ఒడంబడికతో మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తారు.34 క్రీస్తు యొక్క హేతువు కొరకు ఒడంబడిక చేసుకొనుటలో మరియు త్యాగము చేయుటకు ఎంపిక చేయటంలో ఆనందమును వారు అనుభవిస్తారు. ఆయన సువార్త వారి హృదయాలలోనికి లోతుగా వెళ్లును, మరియు కార్యము అద్భుతమైన విధానాలలో ముందుకు సాగుతుంది.

వాగ్దానము మరియు సాక్ష్యము

అనుబంధాలు, బయల్పాటు, స్వతంత్రత, పశ్చాత్తాపము, మరియు త్యాగము—ఈ సూత్రములపై మనము కేంద్రీకరించినప్పుడు—యేసు క్రీస్తు యొక్క సువార్త మన హృదయాలలోనికి లోతుగా చొచ్చుకొనిపోవునని నేను వాగ్దానము చేస్తున్నాను. పునఃస్థాపన దాని అంతిమ ఉద్దేశమునకు ముందుకుసాగుట, ఇశ్రాయేలు యొక్క విమోచన మరియు సీయోను యొక్క స్థాపనను మనము చూస్తాము, అక్కడ రాజులకు రాజుగా క్రీస్తు పరిపాలిస్తాడు.

ఆ దినము కొరకు తన జనులను సిద్ధపరచుటకు అవసరమైన అన్ని విషయాలను చేయుట దేవుడు కొనసాగిస్తాడని నేను సాక్ష్యమిస్తున్నాను. “క్రీస్తు నొద్దకు రమ్ము మరియు ఆయనలో పరిపూర్ణుడవు కమ్ము,”36 ఇలా చేయుటకు మనమందరం ప్రయాసపడినప్పుడు ఈ మహిమకరమైన కార్యములో ఆయన చేతి హస్తమును మనము చూచెదముగాక. యేసు క్రీస్తు నామములో సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.

వివరణలు

  1. సిద్ధాంతము మరియు నిబంధనలు 45:12 చూడుము. అధ్యక్షులు నెల్సన్: “ఇశ్రాయేలును సమకూర్చుట యొక్క ఉత్సాహము మరియు అత్యవసరతను ఒక్కసారి ఆలోచించండి: ఆదాము మొదలుకొని ప్రతీ ప్రవక్త మన దినమును చూసారు. ఇశ్రాయేలు సమావేశమైనప్పుడు మరియు రక్షకుని యొక్క రెండవ రాకడ కొరకు లోకము సిద్ధపడినప్పుడు, ప్రతీ ప్రవక్త మన దినము గురించి మాట్లాడారు. దాని గురించి ఆలోచించండి! భూగ్రహంపై ఇప్పటివరకు జీవించిన జనులందరిలో, మనము మాత్రమే ఈ చివరి, గొప్ప సమకూర్చు సంఘటనలో పాల్గొంటాము. అది ఎంత ఉత్సాహకరమైనది!” (“Hope of Israel” [worldwide youth devotional, June 3, 2018], HopeofIsrael.ChurchofJesusChrist.org).

    ఎల్డర్ జెఫ్రీ ఆర్. హాలండ్ బోధించారు:

    “జీవించుటకు ఇది ఎంత అద్భుతమైన సమయము!

    “యేసు క్రీస్తు యొక్క సువార్త మిక్కిలి నిశ్చయమైనది, మిక్కిలి భద్రమైనది, మిక్కిలి నమ్మదగినది, మరియు పరలోకంలో, అత్యంత ఫలవంతమైన సత్యము. ఏదీ—ఏ విషయము, ఏ ఒక్కరు, ఏ ప్రభావము కాదు—ఈ సంఘము దాని లక్ష్యమును నెరవేర్చుట నుండి, మరియు లోక పునాది వేయకబడకముందే ప్రకటించబడిన దాని గమ్యమును గ్రహించుట నుండి ఆపలేదు. భవిష్యత్తు గురించి భయపడనవసరం లేదు లేక అస్థిరమైనది కాదు.

    “మన ముందు ఉన్న ప్రతి ఇతర యుగానికి భిన్నంగా, ఈ యుగము, సంస్థాగతమైన విశ్వాసభ్రష్టత్వమును అనుభవించదు; అది యాజకత్వపు తాళపు చెవులను కోల్పోవుట చూడదు; అది సర్వశక్తిమంతుడైన దేవుని స్వరమునుండి బయల్పాటు ఆపివేయబడుట అనుభవించదు. … జీవించుటకు ఎటువంటి దినము!

    “… మీరు గమనించని యెడల, నేను కడవరి దినాలను గూర్చి నిశ్చయముగా ఉన్నాను. … విశ్వసించుము. పైకి లెమ్ము. విశ్వాసముగా ఉండుము. మనము జీవిస్తున్న అత్యంత అసాధారణమైన దినమును ఎక్కువగా ఉపయోగించుకొనుము.” (Facebook post, May 27, 2015; see also “Be Not Afraid, Only Believe” [address to Church Educational System religious educators, Feb. 6, 2015], broadcasts.ChurchofJesusChrist.org).

  2. యోహాను 1:12 చూడండి.

  3. యువకుల ప్రధాన అధ్యక్షత్వములో మేము పిలవబడిన తరువాత వెంటనే, అధ్యక్షులు హెన్రీ బి. ఐరింగ్ ఈరోజు సంఘ యువత ఎదుర్కొంటున్న ప్రత్యేకమైన సవాళ్లు మరియు అవకాశాలను మాతో చర్చించారు. యేసు క్రీస్తు సువార్త వారి హృదయాలలోనికి లోతుగా వెళ్లుటకు సహాయపడే విషయాలపై దృష్టిసారించమని ఆయన మాకు సలహా ఇచ్చారు. యువకుల అధ్యక్షత్వముగా మాకు ఆ సలహా నడిపింపుగా ఉన్నది.

  4. See “Be with Them,” ChurchofJesusChrist.org/callings/aaronic-priesthood-quorums/my-calling/leader-instruction/be-with-them.

  5. మోషైయ 18:25; మొరోనై 6:5 చూడుము.

  6. Dale G. Renlund, “Through God’s Eyes,” Liahona, Nov. 2015, 94; see also Moses 1:4–6.

    అధ్యక్షులు థామస్ ఎస్. మాన్సన్ బోధించారు: “వ్యక్తులు వారున్నట్లుగా కాకుండా, వారు కాబోయే వారిగా చూచుటకు మనము బాధ్యతను కలిగియున్నాము. ఈవిధముగా వారి గురించి ఆలోచించమని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను” (“See Others as They May Become,” Liahona, Nov. 2012, 70).

    ఎల్డర్ నీల్ ఎ. మాక్స్‌వెల్ బోధించారు: “చాలా తరచుగా, ఒక యువకుని యొక్క సంఘ ప్రమాణములతో ఐక్యతగా లేని ప్రవర్తన లేక అతడి ప్రతఘటించేవిగా కనబడే ప్రశ్నలు లేక అతడు వ్యక్తిపరచే అనుమానాల వలన అతడు త్వరగా ముద్రవేయబడతాడు. ఫలితాలు దూరము మరియు కొన్నిసార్లు, గుంపులో లేకుండా ఉండుట కావచ్చు. నిజమైన ప్రేమ ముద్రవేయబడుట ఇష్టపడదు!” (“Unto the Rising Generation,” Ensign, Apr. 1985, 9).

  7. 2 రాజులు 6:17–16 చూడండి.

  8. ప్రథమ అధ్యక్షత్వములో ఒక సభ్యునిగా స్టీఫెన్ ఎల్. రిచర్డ్స్ చెప్పారు, “అత్యున్నత రకమైన వివేచన ఏదనగా, ఇతరులలో గ్రహించి, వారి మంచి స్వభావాలను, వారిలో అంతర్లీనంగా ఉన్న మంచిని వెలికి తీస్తుంది” (in Conference Report, Apr. 1950, 162; in David A. Bednar, “Quick to Observe,” Ensign, Dec. 2006, 35; Liahona, Dec. 2006, 19). 2 రాజులు 6:17 కూడా చూడండి.

  9. Henry B. Eyring, “Teaching Is a Moral Act” (address at Brigham Young University, Aug. 27, 1991), 3, speeches.byu.edu; emphasis added; see also Henry B. Eyring, “Help Them Aim High,” Liahona, Nov. 2012, 60–67.

  10. మోషే 1:3–6 చూడండి.

  11. మోషైయ 18:21; మోషై 7:18 కూడా చూడుము.

  12. “పరలోక తండ్రితో అనుబంధమును వృద్ధి చేయుటకు, సహాయపడే చురుకైన [కడవరి-దిన పరిశుద్ధ] కుటుంబము, సహవాసులు, నాయకులతో బలమైన, అనుకూలమైన అనుబంధములు గల యువకులు, వారు చురుకుగా ఉండటానికి అవకాశముంది. ప్రత్యేక కార్యక్రమ అంశములు—ఆదివారపు పాఠ్యప్రణాళిక, [యువకుల] ప్రోత్సాహ కార్యక్రమము, వ్యక్తిగత విజయ అంచనాలు వంటివి … ఆ అనుబంధాలనుండి స్వతంత్రంగా తక్కువ ప్రభావాన్ని కలిగియుండవచ్చు. … ముఖ్యమైన ప్రశ్న ఏదనగా, ప్రత్యేక కార్యక్రమ అంశాలు ఎంత పూర్తిగా అన్వయించారన్నది కాదు కానీ [కడవరి-దిన పరిశుద్ధ] యువకుల యొక్క మత గుర్తింపును బలపరచే మంచి అనుబంధాలకు అవి ఎలా సహాయపడతాయి” (“Be with Them,” ChurchofJesusChrist.org/callings/aaronic-priesthood-quorums/my-calling/leader-instruction/be-with-them).

  13. See “Connect Them with Heaven,” ChurchofJesusChrist.org/callings/aaronic-priesthood-quorums/my-calling/leader-instruction/connect-them-with-heaven.

  14. యోహాను 15:1–5; 17:11; ఫిలిప్పీయులకు 4:13; 1 యోహాను 2:6; జేకబ్ 1:7; ఓంనై 1:26; మొరోనై 10:32 చూడుము.

  15. లేఖనాలు ఈ మాదిరులతో నిండియున్నవి; ఇక్కడ కేవలం రెండున్నాయి: 1 నీఫై 2:16; ఈనస్ 1:1–4.

  16. లూకా 24:32; 2 నీఫై 33:1–2; జేకబ్ 3:2; మొరోనై 8:26; సిద్ధాంతములు మరియు నిబంధనలు 8:2–3 చూడుము.

  17. 2 తిమోతి3:15–16; సిద్ధాంతములు మరియు నిబంధనలు 68:3–4; 88:66; 113:10 చూడుము.

  18. 1 థెస్సలోనికయులకు 1:5; ఆల్మా 26:13; 31:5; హీలమన్ 3:29; 5:17; సిద్ధాంతములు మరియు నిబంధనలు 21:4–6; 42:61; 43:8–10; 50:17–22; 68:4 చూడుము.

  19. యోహాను 6:63; 17:17; ఆల్మా 5:7; సిద్ధాంతములు మరియు నిబంధనలు 84:43–45; 88:66; 93:36 చూడుము.

  20. యోహాను 15:3; 1 పేతురు1:23; మోషైయ 1:5; ఆల్మా 5:7, 11–13; 32:28, 41–42; 36:26; 62:45; హీలమన్ 14:13 చూడుము.

  21. 2 నీఫై 31:19–21; 32:3, 5 చూడుము.

  22. రస్సెల్ ఎమ్. నెల్సన్, “We Can Do Better and Be BetterLiahona, మే 2019, 67.

  23. డేల్ జి. రెన్లాండ్, “ఈ దినమున మీరు ఎంచుకోండి,” లియహోనా, నవం. 2018, 104.

  24. ఈ సంఖ్య స్కౌటింగ్ కార్యక్రమాలకు అర్హతలను కలిగియున్నది, అది అమెరికా సంయుక్త రాష్ట్రాలు మరియు కెనడాలో ఈమధ్య వరకు బాలురు మరియు యువకుల కొరకు సంఘ ప్రోత్సాహ కార్యక్రమంలో భాగముగా ఉన్నాయి. స్కౌటింగ్‌లో పాల్గొనని ప్రాంతాలలో, అర్హతల సంఖ్య 200 పైగా ఉన్నాయి. అదనముగా, బాలురు, బాలికలు, యువతీ, యువకుల కొరకు వేర్వేరు ప్రోత్సాహ కార్యక్రమాలు భిన్నంగా ఏర్పరచబడి కుటుంబాల కొరకు ఎక్కువ క్లిష్టంగా చేస్తుంది.

  25. Let Them Lead,” ChurchofJesusChrist.org/callings/aaronic-priesthood-quorums/my-calling/leader-instruction/let-them-lead చూడండి.

  26. ఓంనై 1:26; 3 నీఫై 9:20; 12:19; సిద్ధాంతములు మరియు నిబంధనలు 64:34 చూడుము. “అన్ని విషయాల త్యాగము అవసరములేని ఒక మతము జీవితానికి, రక్షణకు అవసరమైన విశ్వాసాన్ని ఉత్పత్తి చేయటానికి తగినంత శక్తిని కలిగియుండదు” (Lectures on Faith [1985], 69).

  27. Ezra Taft Benson, The Teachings of Ezra Taft Benson (1988), 167; in Preach My Gospel: A Guide to Missionary Service (2019), 13; see also Russell M. Nelson, “Hope of Israel,” HopeofIsrael.ChurchofJesusChrist.org.

  28. Meeting with Elder David A. Bednar; see also “2020 Temple and Family History Leadership Instruction,” Feb. 27, 2020, ChurchofJesusChrist.org/family-history.

  29. Neal A. Maxwell, “Unto the Rising Generation,” 11. ఎల్డర్ మాక్స్‌వెల్ కొనసాగించారు: “కార్యాచరణలో, ఎంతమంది పరిచారకులు మరియు బోధకుల కోరము అధ్యక్షత్వములు కేవలము ఒక ప్రార్ధన చేయుటకు లేక సంస్కారమును అందించే పిలుపు మాత్రమే కలిగియున్నారు? సహోదరులారా, వీరు నిజంగా ప్రత్యేక ఆత్మలు, అవకాశమివ్వబడితే వారు ప్రాముఖ్యమైన విషయాలను చేయగలరు.

  30. See General Handbook: Serving in The Church of Jesus Christ of Latter-day Saints, 2.2, ChurchofJesusChrist.org.

  31. Quorum and Class Presidency Resources,” “Come, Follow Me—For Aaronic Priesthood Quorums and Young Women Classes, ఉపయోగించుట” “వార్డు లేక బ్రాంచి పిలుపుల” లో యువతులు మరియు అహరోను యాజకత్వ కోరముల తరగతుల కొరకు వనరులు కలిపి యువతను నడిపించుటకు సహాయపడుటకు సువార్త గ్రంథాలయంలో అనేక వనరులు లభ్యమవుతాయి.

  32. Russell M. Nelson, “Hope of Israel,” HopeofIsrael.ChurchofJesusChrist.org. అదే భక్తి కూడికలో, అధ్యక్షులు నెల్సన్ చెప్పారు: “మన పరలోక తండ్రి తన మిక్కిలి ఘనమైన ఆత్మలలో అనేకమందిని—బహుశా, ఈ చివరి దశ కొరకు—ఆయన శ్రేష్టమైన జట్టును దాచి ఉంచారని నేను చెప్పగలను. ఆ ఘనమైన ఆత్మలు—ఈ శ్రేష్టమైన ఆటగాళ్లు, ఆ నాయకులు— మీరే!”

  33. రస్సెల్ ఎమ్. నెల్సన్, “పిల్లలు మరియు యువత: ఎల్డర్ గార్రిట్ డబ్ల్యు. గాంగ్‌తో ముఖాముఖి సన్నివేశం,” ,” Nov. 17, 2019, broadcasts.ChurchofJesusChrist.org.

  34. అధ్యక్షులు నెల్సన్: “యౌవనులను, ప్రత్యేకంగా తరగతి మరియు కోరము అధ్యక్షత్వములలో సేవ చేయుటకు నియమించబడిన వారిని మనము నడిపించనివ్వాలి. యాజకత్వ అధికారము వారికి అప్పగించబడింది. వారి తరగతి లేక కోరమును నడిపించుటలో ఎలా ప్రేరేపేణ పొందాలో వారు నేర్చుకుంటారు” (in “Children and Youth Introductory Video Presentation,” Sept. 29, 2019, ChurchofJesusChrist.org).

    ఎల్డర్ క్వింటిన్ ఎల్. కుక్ ఇలా చెప్పారు. “యువత వారికై వారు చేయగల దానిని తల్లిదండ్రులు మరియు నాయకులు తీసివేయకుండా— చిన్న వయస్సులలో ఎక్కువ వ్యక్తిగత బాధ్యతను తీసుకొనుటకు మన యువత అడగబడ్డారు” (“Adjustments to Strengthen Youth,” Liahona, Nov. 2019, 40).

  35. అధ్యక్షులు జార్జ్ క్యు. కాన్నన్ బోధించారు: “ఈ యుగము కోసము దేవుడు దాచియుంచిన ఆత్మలు లోకమును మరియు దుష్టుని యొక్క అన్ని శక్తులను ఎదుర్కొనుటకు, సువార్తను ప్రకటించుటకు, సత్యమును కాపాడుటకు మరియు అన్ని పర్యవసానములకు నిర్భయంగా, మన దేవుని యొక్క సీయోనను స్థాపించి, నిర్మించుటకు ధైర్యమును మరియు తీర్మానమును కలిగియున్నారు. ఎప్పటికి పడద్రోయబడకుండా, సీయోను యొక్క పునాదిని వేయుటకు మరియు నీతిమంతులుగా ఉండి, దేవునిని ఘనపరచి, ఆయనను మహోన్నతంగా ఘనపరచి, మరియు అన్ని పరిస్థితులలో ఆయనకు విధేయులుగా ఉండే సంతతిని పెంచుటకు, ఈ తరములో ఈ ఆత్మలను ఆయన పంపియున్నాడు” (“Remarks,” Deseret News, May 31, 1866, 203); see also Teachings of Presidents of the Church: Joseph Smith (2007), 186.

  36. మొరోనై 10:32.