సర్వసభ్య సమావేశము
జీవితపు కష్టముల నుండి ఆశ్రయము కనుగొనుట
ఏప్రిల్ 2020 సర్వసభ్య సమావేశము


జీవితపు కష్టముల నుండి ఆశ్రయము కనుగొనుట

మన జీవితాలను కొట్టుచున్న తుఫానులను లక్ష్యపెట్టకుండా, యేసు క్రీస్తు మరియు ఆయన ప్రాయశ్చిత్తము మనందరికి అవసరమైన ఆశ్రయము.

90-మధ్యలో, నా కళాశాల సంవత్సరాలలో, నేను చిలీలో శాంటియాగో అగ్నిమాపక విభాగము యొక్క నాల్గవ కంపెనీలో భాగముగా ఉన్నాను. అక్కడ పని చేస్తుండగా, నేను రాత్రి కాపలాలో భాగముగా అగ్నిమాపక కేంద్రము వద్ద నివసించాను. సంవత్సరం చివరినాటికి, నేను క్రొత్త సంవత్సరం పండుగ సందర్భంగా అగ్నిమాపక కేంద్రము వద్ద ఉండాలని చెప్పబడ్డాను, ఎందుకంటే ఆ రోజు దాదాపు ఎల్లప్పుడు అత్యవసర పరిస్థితి ఉంటుంది. ఆశ్చర్యపడి, నేను జవాబిచ్చాను, “నిజంగా?”

అర్ధరాత్రి, శాంటియాగో దిగువ పట్టణంలో, బాణాసంచా కాల్చడం ప్రారంభించినప్పుడు, నా సహచరులతో వేచి వుండటం నాకు గుర్తుంది. మేము నూతన సంవత్సరం కొరకు శుభాకాంక్షలు తెలుపుతూ ఒకరినొకరం కౌగలించుకోవటం ప్రారంభించాము. హఠాత్తుగా, అక్కడ అత్యవసరమున్నట్లు సూచిస్తూ, అగ్నిమాపక కేంద్రము వద్ద గంటలు మోగసాగాయి. మేము మా సామాగ్రిని తీసుకున్నాము మరియు అగ్నిమాపక యంత్రముపైకి దూకాము. అత్యవసర పరిస్థితికి మా దారిలో, నూతన సంవత్సరం వేడుక చేసుకుంటున్న జనుల గుంపులను మేము దాటినప్పుడు, వారు విస్తారంగా ఏ చింతా లేకుండా, స్వేచ్ఛగా ఉండటం నేను గమనించాను. వాళ్లు విశ్రాంతిగా ఉన్నారు మరియు వెచ్చని వేసవి రాత్రిని ఆనందిస్తున్నారు. అయినప్పటికి, సమీపంలో ఎక్కడో, మేము సహాయపడటానికి త్వరపడుతున్న జనులు తీవ్రమైన కష్టంలో ఉన్నారు.

కొన్నిసార్లు మన జీవితాలలో కష్టాలు లేకుండా సాపేక్షంగా ఉన్నప్పటికి, మనలో ప్రతీఒక్కరికి ఊహించని సవాళ్లు మరియు కష్టాలను మనము ఎదుర్కొనే సమయము వస్తుంది, అది మన సామర్ధ్యం యొక్క పరిమితులను పెంచుతుందని గ్రహించటానికి ఈ అనుభవం నాకు సహాయపడింది. శారీరక, మానసిక, కుటుంబ, మరియు ఉద్యోగ సవాళ్లు; ప్రకృతి విపత్తులు; మరియు జీవితము యొక్క ఇతర విషయాలు లేక మరణము వంటివి ఈ జీవితంలో మనము ఎదుర్కొనే కష్టాలలో కొన్ని ఉదాహరణలు మాత్రమే.

ఈ తుఫానులు ఎదుర్కొన్నప్పుడు, మనము తరచుగా నిరాశగల భావనలు లేక భయమును అనుభవిస్తాము. అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇలా చెప్పారు, “విశ్వాసమే భయానికి విరుగుడు”—faith in our Lord Jesus Christ (“Let Your Faith Show,” Liahona, May 2014, 29). జనుల జీవితాలను ప్రభావితం చేయు కష్టములను నేను చూసినట్లుగా, ఏ రకమైన కష్టము మనల్ని కొట్టినప్పటికినీ—దానికి ఒక పరిష్కారము ఉందా లేక కనుచూపులో ముగింపు ఉన్నా లక్ష్యపెట్టకుండా—అక్కడ ఒకే ఒక ఆశ్రయము ఉన్నది, మరియు అది అన్నిరకాల తుఫానులకు ఒకేవిధముగా ఉన్నదని నేను నిర్ధారించాను. మన పరలోక తండ్రి చేత అందించబడిన ఈ ఒకే ఆశ్రయము మన ప్రభువైన యేసు క్రీస్తు మరియు ఆయన ప్రాయశ్చిత్తము.

ఈ కష్టములు ఎదుర్కొనుట నుండి మనలో ఎవరూ మినహాయించబడరు. మోర్మన్ గ్రంథ ప్రవక్త హీలమన్ ఈ విధంగా మనకు బోధించాడు: “మరియు ఇప్పుడు నా కుమారులారా, జ్ఞాపకముంచుకొనుడి. అపవాది అతని బలమైన గాలులను, అవును సుడిగాలి యందు అతని బాణములను ముందుకు పంపునప్పుడు, అవును, అతని సమస్త వడగళ్లు మరియు అతని బలమైన గాలివాన మీ పైన కొట్టునప్పుడు, మనుష్యులు వారు కట్టిన పడిపోని ఆ పునాది ఒక నిశ్చయమైన పునాది. మీరు కట్టబడిన బండను బట్టి, దౌర్భాగ్యపు అఘాథము మరియు అంతములేని శ్రమకు మిమ్ములను క్రిందికి లాగుకొని పోవుటకు అది మీపైన ఏ శక్తి కలిగియుండకుండునట్లు, మీరు మీ పునాదిని కట్టవలయును. అది దేవుని యొక్క కుమారుడు క్రీస్తె. మన విమోచకుని యొక్క బండపైన అయ్యున్నదని జ్ఞాపకముంచుకొనుడి” (హీలమన్ 5:12).

తుఫానులను సహించుటతో తన స్వంత అనుభవాలను కలిగిన ఎల్డర్ రాబర్ట్ డి. హేల్స్ ఇలా చెప్పారు: “బాధపడుట సర్వసాధారణమైనది; బాధకు మనము ఎలా స్పందిస్తామన్నది వ్యక్తిగతమైనది. ఒక వ్యక్తి బాధకు రెండు విధాలుగా ప్రతిస్పందించగలడు. అది విశ్వాసముతో జతపరచబడి బలపరచేది మరియు శుద్ధి చేయు అనుభవము కావచ్చు లేక ప్రభువు యొక్క ప్రాయశ్చిత్త త్యాగమందు మనము విశ్వాసము కలిగి లేనియెడల అది మన జీవితాలలో నాశనకరమైన శక్తి కాగలదు” (“Your Sorrow Shall Be Turned to Joy,” Ensign, Nov. 1983, 66).

యేసు క్రీస్తు ఆయన ప్రాయశ్చిత్తము ఇచ్చు ఆశ్రయమును ఆనందించుటకు బదులుగా, మనము ఆయనయందు విశ్వాసము కలిగియుండాలి—పరిమితమైన, భూలోక దృష్టికోణము యొక్క సమస్త బాధలను జయించుటకు మనకు సామర్ధ్యమిచ్చునట్లు అనుమతించే విశ్వాసము. మనము చేయు సమస్తమందు ఆయన వద్దకు వచ్చినట్లయితే ఆయన మన భారములను తేలికగా చేస్తానని వాగ్దానమిచ్చాడు.

“ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును,” ప్రభువు చెప్పారు.

“నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నా యొద్ద నేర్చుకొనుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును.

“ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలికగాను ఉన్నవి” (మత్తయి 11:28–30; మోషైయ 24:14–15 కూడా చూడుము).

“విశ్వాసముగల ఒకరికి, ఏ వివరణ అవసరం లేదు. విశ్వాసము లేని ఒకరికి, ఏ వివరణ సాధ్యము కాదు,” అని చెప్పబడింది. (ఈ ప్రకటన థామస్ ఆక్వినాస్‌కు ఆపాదించబడింది, కానీ బహుశా అది అతను బోధించిన విషయాలకు విడదీయబడిన వాక్యార్ధము.) అయినప్పటికినీ, ఇక్కడ భూమి మీద జరుగుతున్న విషయాలను గూర్చి మనము పరిమితమైన జ్ఞానము కలిగియున్నాము, మరియు ఎందుకు అనే ప్రశ్నలకు తరచుగా మనకు జవాబులు లేవు. ఇది ఎందుకు జరుగుతుంది? ఇది నాకు ఎందుకు జరుగుతుంది? నేను ఏమి నేర్చుకోవాల్సియున్నది? ప్రశ్నలకు జవాబులను మనము కనుగొనలేనప్పుడు, లిబర్టీ జైలులో ప్రవక్త జోసెఫ్ స్మిత్‌కు మన రక్షకుని చేత వ్యక్తం చేయబడిన మాటలు పూర్తిగా వర్తిస్తాయి.

“నా కుమారుడా, నీ ఆత్మకు సమాధానము కలుగునుగాక; నీ ప్రతికూలత, నీ శ్రమలు ఒక స్వల్ప క్షణముంటాయి;

“మరియు నీవు బాగా సహించిన యెడల, దేవుడు నిన్ను మహోన్నత స్థితికి హెచ్చించును” (సిద్ధాంతములు మరియు నిబంధనలు 121:7–8).

అనేకమంది జనులు వాస్తవానికి యేసుక్రీస్తు యందు విశ్వాసముంచినప్పటికినీ, మనము ఆయనను నమ్ముతున్నామా మరియు ఆయన మనకు బోధించినది, మనము చేయాలని మనల్ని అడిగిన విషయాలను మనము నమ్ముతున్నామా అన్నది ముఖ్యమైన ప్రశ్న. బహుశా కొందరు ఇలా అనుకోవచ్చు, “నాకు ఏమి జరుగుతున్నదో యేసు క్రీస్తుకు ఏమి తెలుసు? సంతోషంగా ఉండటానికి నాకు ఏమి అవసరమో ఆయనకు ఎలా తెలుసు?” ఇలా చెప్పినప్పుడు, ప్రవక్త యెషయా ఎవరిని గూర్చి ప్రస్తావించాడో, నిజముగా, అది మన విమోచకుడు మరియు మధ్యవర్తి:

“అతడు తృణీకరింపబడిన వాడును ఆయెను, మనుష్యుల వలన విసర్జింపబడినవాడును, వ్యసనాక్రాంతుడుగాను. …

నిశ్చయముగా ఆయన మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. …

“మన యతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్ధమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగుచున్నది” (యెషయా 53:3–5).

అపొస్తులుడైన పేతురు కూడా రక్షకుని గూర్చి ఇలా చెప్తూ బోధించాడు, “మనము పాపముల విషయమై చనిపోయి, నీతి విషయమై జీవించునట్లు, ఆయన తానే శరీరమందు మన పాపములను మ్రానుమీద మోసికొనెను, ఆయన పొందిన గాయములచేత మీరు స్వస్థత నొందితిరి” (1 పేతురు 2:24).

పేతురు యొక్క స్వంత ప్రాణత్యాగము దగ్గరవుతున్నప్పటికినీ, అతని మాటలు భయముతో లేక నిరాశవాదముతో నింపబడలేదు; బదులుగా, వారు “నానా విధములైన శోధనలచేత, దుఃఖము కలిగి” ఉన్నప్పటికిని, అతడు పరిశుద్ధులకు “ఆనందించమని” బోధించాడు. “అగ్ని చేత శుద్ధిపరచబడినప్పటికిని, … (మన) విశ్వాసము పరీక్షకు నిలిచినదై,” “యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు” మరియు “(మన) ఆత్మలకు రక్షణకు” నడిపించునని జ్ఞాపకముంచుకోమని పేతురు మనకు సలహా ఇచ్చాడు (1 పేతురు 1:6–7, 9).

పేతురు కొనసాగించాడు:

“ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్నివంటి మహాశ్రమను గూర్చి మీకేదో యొకవింత సంభవించునట్లు ఆశ్చర్యపడకుడి:

“క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము, క్రీస్తు శ్రమలలో మీరు పాలివారైయున్నంతగా సంతోషించుడి” (1 పేతురు 4:12–13).

“ప్రతీ పరిస్థితిలో పరిశుద్ధులు సంతోషంగా ఉండగలరు. … మన జీవితాల యొక్క దృష్టి అంతా దేవుని రక్షణ ప్రణాళిక పైన … యేసు క్రీస్తు మరియు ఆయన సువార్త పైన ఉన్నప్పుడు, మన జీవితాల్లో ఏమి జరుగుతోంది — ఏమి జరగడం లేదు—అనేదానితో సంబంధం లేకుండా మనం ఆనందమును అనుభవించగలము. ఆనందము ఆయన నుండి మరియు ఆయన వలన కలుగుతుంది. ఆయనే సమస్త ఆనందానికి మూలము” (“Joy and Spiritual Survival,” Liahona, Nov. 2016, 82) అని అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ బోధించారు.

వాస్తవానికి, కష్ట సమయంలో వాటిని జీవించుట మరియు అన్వయించటం కంటే మనం కష్టాలలో లేనప్పుడు ఈ విషయాలను చెప్పుట సులభమైనది. కానీ మీ సోదరుడిగా, జీవితాలను దెబ్బతీసే తుఫానులతో సంబంధం లేకుండా, యేసు క్రీస్తు మరియు ఆయన ప్రాయశ్చిత్తము మనందరికీ అవసరమైన ఆశ్రయమని తెలుసుకోవటం ఎంత విలువైనదో మీతో పంచుకోవాలని నేను హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను.

మనమందరం దేవుని యొక్క పిల్లలమని, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడని, మరియు మనము ఒంటరివారము కాదని నాకు తెలుసు. ఆయన మీ భారములను తేలికగా చేయగలరని మరియు మీరు కోరుతున్న ఆశ్రయముగా ఉండగలడని వచ్చి, చూడమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. వచ్చి, వారు ఎంతగానో ఆపేక్షించిన ఆశ్రయమును కనుగొనుటకు ఇతరులకు సహాయపడుము. వచ్చి ఈ ఆశ్రయములో మాతో ఉండండి, అది జీవితపు కష్టములను ఎదిరించుటకు మీకు సహాయపడుతుంది. మీరు వస్తే, మీరు చూస్తారు, మీరు సహాయపడతారు, మరియు మీరు నిలిచియుంటారు, అని నా హృదయంలో ఎటువంటి సందేహములేదు.

ప్రవక్త ఆల్మా తన కుమారుడైన హీలమన్‌కు క్రింది దానిని సాక్ష్యమిచ్చాడు: “దేవునియందు నమ్మికయుంచు వారెవరైనను, వారి శోధనలందు మరియు వారి కష్టములందు మరియు వారి శ్రమలందు సహాయము పొందుదురని మరియు అంత్యదినమున లేపబడుదురని నేనెరుగుదును” (ఆల్మా 36:3).

రక్షకుడు స్వయంగా చెప్పెను:

“మీ హృదయాలు ఓదార్చనియ్యుడి …; ఏలయనగా సమస్త శరీరులు నా చేతి హస్తములు; నిశ్చలంగా ఉండుడి మరియు నేను దేవుడనని తెలుసుకొనుడి.…

“కాబట్టి, మరణానికి కూడ భయపడకండి; ఏలయనగా ఈ లోకములో మీ సంతోషము పరిపూర్ణముకాదు, కానీ నాయందు మీ సంతోషము పరిపూర్ణముగా ఉన్నది” (సిద్ధాంతములు మరియు నిబంధనలు 101:16, 36).

అనేక సందర్భాలలో నా హృదయాన్ని తాకిన “నా ఆత్మ, నిశ్చలంగా ఉండుము,” కీర్తన మన ఆత్మలకు ఓదార్పునిచ్చే సందేశమును కలిగియున్నది. సాహిత్యం క్రిందివిధంగా చదవబడును:

“నా ఆత్మ, నిశ్చలంగా ఉండుము: గడియ త్వరపడుతున్నది

మనము ఎప్పటికీ ప్రభువుతో శాశ్వతంగా ఉన్నప్పుడు,

నిరాశ, దుఃఖము మరియు భయము పోయినప్పుడు,

విచారం మరచిపోబడింది, ప్రేమ యొక్క స్వచ్ఛమైన ఆనందాలు పునరుద్ధరించబడ్డాయి.

“నా ఆత్మ, నిశ్చలంగా ఉండుము: మార్పు, కన్నీళ్లు గతమై నప్పుడు,

అందరూ క్షేమము మరియు దీవించబడ్డాము చివరికి మనము కలుసుకుందాం. (Hymns, no. 124)

మనము జీవితపు కష్టములు ఎదుర్కొన్నప్పుడు, మన శ్రేష్టమైన ప్రయత్నము చేసి, మన ఆశ్రయముగా యేసు క్రీస్తును, ఆయన ప్రాయశ్చిత్తముపై ఆధారపడినప్పుడు, మనము వెదకుతున్న ఉపశమనము, ఓదార్పు, బలము, నిగ్రహము, మరియు శాంతితో దీవించబడతాము, భూమి మీద మన కాలము ముగింపుయందు మన హృదయాలలో నిశ్చయతతో, బోధకుని మాటలను మనము వింటాము: “భళా, నమ్మకమైన మంచి దాసుడా: … నీ యాజమానుని సంతోషములో పాలుపొందుము” (మత్తయి 25:21). యేసు క్రీస్తు నామములో సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.