సర్వసభ్య సమావేశము
క్రీస్తు నొద్దకు రండి—కడవరి-దిన పరిశుద్ధులుగా జీవించుట
ఏప్రిల్ 2020 సర్వసభ్య సమావేశము


క్రీస్తు నొద్దకు రండి—కడవరి-దిన పరిశుద్ధులుగా జీవించుట

మనము కష్టమైన విషయాలను చేయగలము మరియు అదేవిధంగా చేయుటకు ఇతరులకు సహాయపడగలము, ఎందుకనగా మనము ఎవరియందు నమ్మకముంచగలమో ఎరుగుదుము.

ఎల్డర్ సోరెస్, మోర్మన్ గ్రంథమును గూర్చి మీ శక్తివంతమైన, ప్రవచనాత్మక సాక్ష్యము కొరకు, మీకు ధన్యవాదాలు. ఇటీవల, మోర్మన్ గ్రంథము యొక్క అసలు వ్రాతప్రతి పేజిని పట్టుకొనే ప్రత్యేక అవకాశము నాకు కలిగింది. ఈ ప్రత్యేకమైన పేజీలో, ఈ యుగములో మొదటిసారి, నీఫై యొక్క ధైర్యముగల మాటలు వ్రాయబడినవి: “మరియు ఇది జరిగెను, నీఫై అను నేను నా తండ్రితో చెప్పితిని: నేను వెళ్ళి మరియు ప్రభువు ఆజ్ఞాపించిన కార్యములను చేయుదును, ఏలయనగా ప్రభువు మనుష్య సంతానమునకు తాను, వారికి ఆజ్ఞాపించిన కార్యమును వారు నెరవేర్చునట్లు వారి కొరకొక మార్గమును సిద్ధపరచక ఆయన ఎట్టి ఆజ్ఞలను ఇయ్యడని నేనెరుగుదును.”1

చిత్రం
మోర్మన్ గ్రంథము యొక్క అసలు వ్రాతప్రతి పేజి

ఈ పేజీని నేను పట్టుకున్నప్పుడు, “దేవుని యొక్క వరము మరియు శక్తి”2 చేత మోర్మన్ గ్రంథమును అనువదించిన, 23 సంవత్సరాల జోసెఫ్ స్మిత్ యొక్క ప్రయత్నాల కొరకు లోతైన ప్రశంసతో నేను నింపబడ్డాను. లేబన్ నుండి కంచు పలకలను సంపాదించుటలో చాలా కష్టమైన కార్యమును నెరవేర్చుటకు అడగబడిన, యువకుడైన నీఫై మాటల కొరకు ప్రశంసను కూడ నేను అనుభవించాను.

ప్రభువుపై దృష్టిసారించుట అతడు కొనసాగించిన యెడల, ప్రభువు అతడిని ఆజ్ఞాపించిన దానిని నెరవేర్చుటలో అతడు విజయాన్ని పొందుతాడని నీఫై ఎరుగును. అతడు శోధనలు, శారీరక శ్రమలు మరియు తన స్వంత కుటుంబములో కొందరు మోసగించుట వలన బాధ అనుభవించినప్పుడు కూడ, అతడు తన జీవితకాలమంతా రక్షకునిపై దృష్టిని కేంద్రీకరించాడు.

నీఫై తాను ఎవరియందు నమ్మికయుంచి యున్నాడో ఎరుగును.3 “నేనెట్టి దురదృష్టవంతుడనైన మనుష్యుడను! అవును, నా శరీరమును బట్టి నా హృదయము దుఃఖించుచున్నది,”4 అని ఆశ్చర్యపడిన వెంటనే, నీఫై వ్యాఖ్యానించాడు, “నా దేవుడు నాకు సహాయమై యుండెను. ఆయన అరణ్యములో నా బాధలలో నన్ను నడిపించెను మరియు ఆయన నన్ను జలముల యొక్క గొప్ప ఆగాథములపైన కాపాడెను.”5

క్రీస్తు యొక్క అనుచరులుగా, మనము మన జీవితాలలో కష్టాలు మరియు శ్రమలను అనుభవించకుండా ఉండము. తరచుగా మనము కష్టమైన విషయాలను చేయాల్సిన అవసరమున్నది, అది ఒంటరిగా చేయాల్సి వచ్చిన యెడల, క్షీణింపచేయును మరియు అసాధ్యము కావచ్చు. “నా యొద్దకు రండి,” 6 రక్షకుని ఆహ్వానమును మనము అంగీకరించినప్పుడు, ఆయన నీఫై మరియు జోసెఫ్‌కు చేసినట్లుగా, ఆయన అవసరమైన సహాయమును, ఆదరణను మరియు శాంతిని అందిస్తాడు. మన లోతైన శ్రమలందు కుాడ, మనము ఆయనను నమ్మి, ఆయన చిత్తమును అంగీకరించినప్పుడు ఆయన ప్రేమ యొక్క ప్రభావమును మనము అనుభూతి చెందుతాము. ఆయన విశ్వాసులైన శిష్యుల కొరకు దాచబడిన సంతోషమును మనము అనుభవించగలము, ఏలయనగా “క్రీస్తే ఆనందము.”7

2014 లో, ఒక పూర్తికాల-మిషను సేవ చేయుచుండగా, మా కుటుంబము ఊహించని సంఘటనలను ఎదుర్కొంది. పొడుగైన స్కేటింగ్ బోర్డుపై నిటారుగా ఉన్న కొండ క్రిందుగా ప్రయాణిస్తున్నప్పుడు, మా చిన్న కుమారుడు పడిపోయాడు మరియు అతని మెదడుకు ప్రాణాంతక గాయం తగిలింది. అతని పరిస్థితి క్షీణించినప్పుడు, వైద్య సిబ్బంది అతడిని అత్యవసర శస్త్ర చికిత్సకు తీసుకొని వెళ్లారు.

ఇతరత్రా ఖాళీగా ఉన్న హాస్పిటల్ గదినేలపై మా కుటుంబము మోకరించి దేవునికి మా హృదయాలను క్రుమ్మరించాము. ఈ కలవరము, బాధాకరమైన క్షణము మధ్యలో, మేము మా పరలోక తండ్రి యొక్క ప్రేమ మరియు శాంతితో నింపబడ్డాము.

భవిష్యత్తు ఏమి కలిగియున్నదో లేక మా కుమారుడు తిరిగి బ్రతికియుండటం మేము చూస్తామో మాకు తెలియదు. అతడి జీవితం దేవుని చేతులలో ఉన్నదని, మరియు ఫలితాలు నిత్య దృష్టికోణము నుండి, అతడి కొరకు, మా మంచి కొరకు సవ్యంగా జరుగుతుందని మాకు స్పష్టంగా తెలుసు. ఆత్మ యొక్క వరము ద్వారా, ఫలితమేదైన మేము పూర్తిగా సిద్ధపడియున్నాము.

అది సులభము కాదు! మేము 400 మంది పూర్తి-కాల మిషనరీలపై అధ్యక్షత్వం వహిస్తుండగా ప్రమాదము ఫలితంగా రెండు నెలలు హాస్పిటల్‌లో ఉండాల్సి వచ్చింది. మా కుమారుడు ముఖ్యమైన జ్ఞాపకాన్ని కోల్పోయాడు. అతడు కోలుకోవటం సుదీర్ఘమైన, కష్టమైన, శారీరకమైన, మాట్లాడే మరియు వృత్తిసంబంధమైన థెరపీ సమావేశాలను కలిగియున్నది. సవాళ్లు మిగిలి ఉన్నాయి, కానీ కాలక్రమేణా మేము అద్భుతాన్ని చూసాము.

మేము ఎదుర్కొనే ప్రతీ శ్రమకు మేము కోరిన ఫలితాన్ని కలిగియుండదని స్పష్టంగా మేము గ్రహించాము. అయినప్పటికినీ, క్రీస్తుపై మనము దృష్టిని కేంద్రీకరించినప్పుడు, మనము శాంతిని అనుభవిస్తాము, మరియు అవి ఏవైనప్పటికిని ఆయన కాలములో, ఆయన మార్గములో దేవుని యొక్క అద్భుతాలను చూస్తాము.

ప్రస్తుతపు పరిస్థితి బాగా ముగిసే విధంగా మనం చూడలేనప్పటి సందర్భాలుంటాయి మరియు నీఫై వలె ఇలా చెప్పియుండవచ్చు, “నా శరీరమును బట్టి నా హృదయము దుఃఖించుచున్నది.”8 మన ఏకైక నిరీక్షణ యేసు క్రీస్తులో ఉన్న సందర్భాలు ఉండవచ్చు. అటువంటి నిరీక్షణ మరియు ఆయనయందు నమ్మకముంచుట ఎటువంటి దీవెన. క్రీస్తు ఒక్కడే తన వాగ్దానములు ఎల్లప్పుడు నిలుపుకుంటాడు. ఆయన వద్దకు వచ్చు వారందరి కొరకు ఆయన విశ్రాంతి అభయమివ్వబడింది.9

రక్షకుడైన యేసు క్రీస్తునందు నమ్మకముంచి దృష్టిని కేంద్రీకరించుట ద్వారా వచ్చు శాంతి, ఓదార్పును అందరూ అనుభవించాలని మన నాయకులు లోతుగా కోరుతున్నారు.

మన జీవిస్తున్న ప్రవక్త రస్సెల్ ఎమ్. నెల్సన్ లోకము కొరకు మరియు క్రీస్తు యొక్క సంఘ సభ్యుల కొరకు ప్రభువు యొక్క దర్శనాన్ని తెలియజేస్తున్నారు: “ప్రపంచమునకు మా సందేశము సరళమైనది మరియు చిత్తశుద్ధి గలది: క్రీస్తు నొద్దకు రమ్మని, పరిశుద్ధ దేవాలయములో దీవెనలు పొందమని, శాశ్వతమైన సంతోషమును కలిగియుండమని, మరియు నిత్య జీవము కొరకు అర్హులుగా ఉండమని తెరకు రెండువైపుల దేవుని పిల్లలందరిని మేము ఆహ్వానిస్తున్నాము.”10

“క్రీస్తు నొద్దకు రండి” ఈ ఆహ్వానము కడవరి దిన పరిశుద్ధులకు ప్రత్యేక ఆచరణలను కలిగియున్నది.11 రక్షకుని యొక్క సంఘ సభ్యులుగా, మనం ఆయనతో నిబంధనలు చేసాము మరియు ఆయన ఆత్మీయంగా కనిన కుమారులము, కుమార్తైలము అయ్యాము.12 ఆయన వద్దకు వచ్చుటకు ఇతరులను ఆహ్వానించుటలో ప్రభువుతో పనిచేయుటకు అవకాశము కూడా మనము ఇవ్వబడ్డాము.

మనము క్రీస్తుతో పని చేసినప్పుడు, మన మిక్కిలి లోతుగా దృష్టిసారించబడిన ప్రయత్నాలు మన స్వంత గృహాల లోపల ఉండాలి. కుటుంబ సభ్యులు మరియు సన్నిహిత స్నేహితులు సవాళ్లు ఎదుర్కొన్నప్పటి సమయాలుంటాయి. లోకము యొక్క స్వరములు, మరియు వారి స్వంత కోరికలు, వారు సత్యమును ప్రశ్నించునట్లు వారిని చేయవచ్చు. రక్షకుని యొక్క ప్రేమ మరియు మన ప్రేమ రెండిటిని వారు అనుభవించుటకు సహాయపడుటకు మనకు సాధ్యమైన సమస్తమును చేయాలి. “మీరు ఒకరినొకరి కొరకు ప్రేమ కలిగియుంటే, దీని ద్వారా … మీరు నా శిష్యులని, … మనుష్యులు తెలుసుకొందురు” అని మనకు బోధించే “ఒకరినొకరు ప్రేమించుడి”13 అనే మన ప్రియమైన క్రీర్తనగా మారిన లేఖన వచనము గూర్చి నేను జ్ఞాపకం చేయబడ్డాను.

సత్యమును ప్రశ్నించే వారి కొరకు మన ప్రేమయందు, మనకై మనం సంపూర్ణ సువార్తను జీవిస్తూ, దాని సత్యములను బోధించుట కొనసాగించిన యెడల, మనం ప్రేమించు వారిని మోసగిస్తున్నట్లు మనం భావించునట్లు చేయుటకు సమస్త ఆనందము యొక్క శత్రువు ప్రయత్నించవచ్చు.

క్రీస్తు నొద్దకు వచ్చుటలో లేక క్రీస్తు వద్దకు తిరిగి వచ్చుటలో ఇతరులకు సహాయపడే మన సామర్ధ్యము నిబంధన బాటపై నిలిచియుండుటకు మన స్వంత వ్యక్తిగత ఒడంబడిక ద్వారా మనము ఉంచిన మాదిరి ద్వారా విస్తారంగా తీర్మానించబడును.

మనము ప్రేమించు వారిని విడిపించుట మన నిజమైన కోరిక అయితే, మనకై మనం ఆయన సంఘమును మరియు ఆయన సంపూర్ణ సువార్తను హత్తుకొనుట ద్వారా క్రీస్తుతో స్థిరముగా నిలిచియుండాలి.

నీఫై వృత్తాంతమును గూర్చి మరలా మాట్లాడుతూ, ప్రభువుయందు నమ్మకముంచుటకు నీఫై యొక్క ఆపేక్ష అతడి తల్లిదండ్రులు ప్రభువుయందు నమ్మకముంచుటకు మరియు వారి నిబంధన పాటించు ఆపేక్ష ద్వారా ప్రభావితం చేయబడిందని మనము ఎరుగుదుము. ఇది జీవవృక్షమును గూర్చి లీహై యొక్క దర్శనములో అందముగా విశదీకరించబడింది. ఈ వృక్షము యొక్క మధురమైన మరియు సంతోషకరమైన ఫలమును రుచి చూచిన తరువాత, లీహై “బహుశా [అతడి] కుటుంబమును కూడ కనుగొందామని [తన] కన్నులను చుట్టూ తిప్పెను.”14 శరయ, శామ్, మరియు నీఫైలు “వారు ఎటు పోవలెనో తెలియకయున్నట్లు” నిలబడటం అతడు చూసాడు.15 తరువాత లీహై వ్యాఖ్యానించాడు, “నేను వారికి సైగ చేసితిని, మరియు వారు నా యొద్దకు రావలెనని ఇతర సమస్త ఫలములను మించి కోరదగిన ఆ ఫలమును తినవలెనని పెద్ద స్వరముతో నేను వారికి చెప్పితిని.”16 లీహై జీవవృక్షమును విడిచి పెట్టలేదని దయచేసి గమనించుము. అతడు ప్రభువుతో ఆత్మీయంగా నిలిచియున్నాడు మరియు ఫలమును తినుటకు అతడు ఉన్నచోటుకు రమ్మని తన కుటుంబాన్ని ఆహ్వానించాడు.

ఆయన సంఘము నుండి క్రీస్తు యొక్క బోధనలను వేరు చేయుట ద్వారా సువార్త యొక్క సంతోషమును విడిచి వెళ్ళమని అపవాది ప్రలోభపెట్టును. మన స్వంత ఆత్మీయత ద్వారా, ఆయన సంఘము నుండి స్వతంత్రంగా, మన స్వంత నిబంధన బాటపై మనము స్థిరముగా నిలబడియుండగలమని మనము నమ్మునట్లు అతడు చేస్తాడు.

క్రీస్తు యొక్క నిబంధన పిల్లలు ఆయన నిబంధన బాటపై నిలిచియుండుటకు సహాయపడుటకు ఈ కడవరి దినాలలో, క్రీస్తు సంఘము పునఃస్థాపించబడింది.

సిద్ధాంతములు మరియు నిబంధనలలో మనమిలా చదివాము, “ఇదిగో, ఎవరైతే పశ్చాత్తాపపడి నా యొద్దకు వస్తారో వారిదే నా సంఘము—ఇది నా సిద్ధాంతము.”17

క్రీస్తు యొక్క సంఘము ద్వారా, పరిశుద్ధుల యొక్క సమాజముగా మన అనుభవాల ద్వారా మనము బలపరచబడతాము. ఆయన ప్రవక్తలు దీర్ఘదర్శులు, మరియు బయల్పాటుదారుల ద్వారా ఆయన స్వరమును మనము వింటాము. మరిముఖ్యముగా, ఆయన సంఘము ద్వారా క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తఃము యొక్క ఆవశ్యకమైన అన్ని దీవెనలు మనకు లభిస్తాయి, అది పరిశుద్ధ విధులందు పాల్గొనుట ద్వారా మాత్రమే గ్రహించబడుతుంది.

యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము భూమి మీద క్రీస్తు సంఘము, దేవుని యొక్క పిల్లలందరి యొక్క ప్రయోజనము కొరకు ఈ కడవరి దినాలలో పునఃస్థాపించబడింది.

మనము క్రీస్తునొద్దకు వచ్చినప్పుడు మరియు కడవరి-దిన పరిశుద్ధులుగా జీవించినప్పుడు, ఆయన ప్రేమ, ఆయన ఆనందము, మరియు ఆయన శాంతి యొక్క చేర్చబడిన పరిమాణముతో మనము దీవించబడతాము. నీఫై వలె, మనము కష్టమైన విషయాలను చేయగలము మరియు అదేవిధంగా చేయుటకు ఇతరులకు సహాయపడగలము, ఎందుకనగా మనం ఎవరియందు నమ్మకముంచగలమో ఎరుగుదుము.18 క్రీస్తు మన వెలుగు, మన జీవము, మరియు మన రక్షణ.19 యేసు క్రీస్తు నామములో, ఆమేన్.