సర్వసభ్య సమావేశము
ప్రత్యేకంగా ఘనమైన పిలుపు
ఏప్రిల్ 2020 సర్వసభ్య సమావేశము


ప్రత్యేకంగా ఘనమైన పిలుపు

విశ్వాసము యొక్క స్త్రీలుగా, మనము ప్రవక్త జోసెఫ్ స్మిత్ యొక్క అనుభవాలనుండి సత్యము యొక్క సూత్రములను తీసుకొనగలము అది మన స్వంత బయల్పాటును పొందడానికి మెళకువలను అందిస్తుంది.

పునఃస్థాపనలో స్త్రీల యొక్క ఎడతెగని పాత్రలపై నేటి నా ప్రసంగమును కేంద్రీకరించుటకు నేను కృతజ్ఞురాలిని. చరిత్ర అంతటా స్త్రీలు మన పరలోక తండ్రి యొక్క ప్రణాళికలో ప్రత్యేక స్థానమును కలిగియున్నారని స్పష్టమైంది. అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ బోధించారు, “స్త్రీలు కలిగియున్న … ప్రభావమును లెక్కించుట అసాధ్యము … కుటుంబాలపై మాత్రమే కాదు కానీ ప్రభువు సంఘముపై, భార్యలుగా, తల్లులుగా, మరియు మామ్మలుగా; సహోదరీలు, అత్తలు, చిన్నమ్మలుగా; బోధకులుగా మరియు నాయకురాళ్లగా; మరియు ప్రత్యేకంగా శ్రేష్టమైన మాదిరులుగా, విశ్వాసమును కాపాడు భక్తులుగా.”1

178 సంవత్సరాల క్రితం, నావూలో ప్రాచీన ఉపశమన సమాజములో, ప్రవక్త జోసెఫ్ స్మిత్ సహోదరీలను “[వారి] విశేషావకాశముకు అనుగుణంగా జీవించమని ”2 సలహా ఇచ్చాడు. వారి మాదిరి నేడు మనకు బోధిస్తుంది. వారు ఒక ప్రవక్త స్వరమును ఐక్యతగా అనుసరించారు మరియు ఇప్పుడు మనము నిలబడిన పునాదిని వేయుటకు వారు సహాయపడినప్పుడు యేసు క్రీస్తుయందు స్థిరమైన విశ్వాసముతో జీవించారు. సహోదరిలారా, ఇప్పుడు మన వంతు. మనము ప్రభువు నుండి దైవిక కార్యమును కలిగియున్నాము, మరియు మన విశ్వసనీయమైన, ప్రత్యేకమైన సహాయములు కీలకమైనవి.

అధ్యక్షులు స్పెన్సర్ డబ్ల్యు. కింబల్ వివరించారు: “మన రక్షకుని రాకడకు ముందు, ఈ భూమి మీద కడవరి దినాలలో నీతిగల స్త్రీలుగా ఉండుట, ప్రత్యేకంగా ఘనమైన పిలుపు. నేడు నీతిగల స్త్రీ యొక్క బలము మరియు ప్రభావము ఎక్కువ ప్రశాంతమైన సమయాల కంటే పదింతలు గొప్పగా ఉన్నది.”3

అధ్యక్షులు నెల్సన్ అదేవిధంగా వేడుకున్నారు: “సంఘము యొక్క నా సహోదరీలను నేను వేడుకుంటున్నాను … అడుగు ముందుకు వేయండి! మీరు ఇంతకుముందు చేసిన దానికంటే ఎక్కువగా—మీ గృహములో, మీ సమాజములో, మరియు దేవుని రాజ్యములో—మీ హక్కుగా ఉన్న, అవసరమైన స్థానము తీసుకోండి.”4

ఇటీవల, ప్రాధమిక పిల్లల గుంపుతోపాటు, నేను న్యూయార్క్, పామైరాలో స్మిత్ కుటుంబ గృహానికి ప్రతిరూపమైన దానిలో అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ తో కలుసుకొనే విశేషావకాశము పొందాను. అడుగు ముందుకు వేయుటకు వారు చేయగల దానిని పిల్లలకు మన ప్రియమైన ప్రవక్త బోధించినప్పుడు వినుము.

సహోదరి జోన్స్: “అధ్యక్షులు నెల్సన్‌ను మీరు అడగాలని కోరుతున్న ఒక ప్రశ్నను మీరు కలిగియుంటే తెలుసుకోవాలని నేను కుతూహలంగా ఉన్నాను. మీరు ఇక్కడ ప్రవక్తతో కూర్చోన్నారు. మీరు ప్రవక్తను అడగాలని ఎల్లప్పుడు కోరుకున్నదేమైనా ఉన్నదా? అవును, పర్ల్.”

పర్ల్: “ఒక ప్రవక్తగా ఉండటం కష్టమైనదా? మీరు, నిజంగా తీరికలేకుండా ఉంటారా?”

అధ్యక్షులు నెల్సన్‌: “అవును, అది కష్టమైనది. రక్షకుని వలె ఎక్కువగా మారటానికి సంబంధించిన ప్రతీది కష్టమైనది. ఉదాహరణకు, దేవుడు మోషేకు పది ఆజ్ఞలు ఇచ్చినప్పుడు, ఆయన మోషేను ఎక్కడికి వెళ్లమని చెప్పారు? ఒక పర్వతం పైన, సీనాయి పర్వతం పైకి. కనుక పది ఆజ్ఞలు పొందడానికి మోషే ఆ పర్వతం శిఖరం వరకు నడవవలసి వచ్చింది. ఇప్పుడు, పరలోక తండ్రి ఇలా చెప్పియుండవచ్చు, ‘మోషే, నువ్వు అక్కడ ప్రారంభించు, ఇక్కడ నేను ప్రారంభిస్తాను, మరియు నేను సగం దూరంలో నిన్ను కలుసుకుంటాను.’ లేదు, ప్రభువు ప్రయత్నాన్ని ప్రేమిస్తున్నాడు, ఎందుకనగా ప్రయత్నము బహుమానాలను తెస్తుంది, అది లేకుండా అవి రాలేవు. ఉదాహరణకు, మీరు ఎప్పుడైన పియానో పాఠాలు తీసుకున్నారా?”

పిల్లలు: “అవును.”

పర్ల్: “నేను వయోలిన్ తీసుకుంటాను.”

అధ్యక్షులు నెల్సన్: “మీరు సాధన చేస్తారా?”

పిల్లలు: “అవును.”

అధ్యక్షులు నెల్సన్: “మీరు సాధన చేయకపోతే ఏం జరుగుతుంది?”

పర్ల్: “మీరు మరచిపోతారు.”

అధ్యక్షులు నెల్సన్: “అవును, మీరు వృద్ధి చెందరు, అవునా?” కనుక జవాబు, అవును, పర్ల్. దానికి ప్రయత్నము, చాలా కష్టమైన పని, చాలా అధ్యయనము అవసరం మరియు ఎప్పటికీ ముగింపు లేదు. అది మంచిది! అది మంచిది, ఎందుకనగా, మనము ఎల్లప్పుడు వృద్ధి చెందుతున్నాము. తరువాత జీవితంలో కూడ మనము వృద్ధి చెందుతాము.”

ఈ ప్రశస్తమైన పిల్లలకు అధ్యక్షులు నెల్సన్ యొక్క జవాబు మనలో ప్రతీఒక్కరికి ఇవ్వబడింది. దేవుడు ప్రయత్నమును ప్రేమించును, మరియు ప్రయత్నము ఫలితాలను తెస్తుంది. మనము సాధన చేయటం కొనసాగిస్తాము, ప్రభువును వెంబడించుటకు మనము ప్రయాసపడినంత సేపు మనము ఎల్లప్పుడు అభివృద్ధి చెందుతాము.5 ఆయన ఈరోజే పరిపూర్ణత ఆశించడు. మనము మన వ్యక్తిగత సీనాయి కొండపైకి ఎక్కడం కొనసాగిస్తాము. గత కాలంలో మాదిరిగా, వాస్తవానికి మన ప్రయాణానికి ప్రయత్నము, కష్టమైన పని, మరియు అధ్యయనము అవసరము, కానీ అభివృద్ధి చెందుటకు మన ఒడంబడిక నిత్య వరములను తెస్తుంది.6

పునఃస్థాపన మరియు ప్రయత్నము, కష్టమైన పని, మరియు అధ్యయనము గురించి ప్రవక్త జోసెఫ్ స్మిత్ మరియు మొదటి దర్శనము నుండి ఇంకా మనము ఏమి నేర్చుకుంటాము? మొదటి దర్శనము మన ప్రత్యేకమైన, కొనసాగుతున్న పాత్రలందు మనకు నడిపింపును ఎలా ఇస్తుంది? విశ్వాసము యొక్క స్త్రీలుగా, మనము ప్రవక్త జోసెఫ్ స్మిత్ యొక్క అనుభవాలనుండి సత్యము యొక్క సూత్రములను పొందగలము అది మన స్వంత బయల్పాటును పొందడానికి మెళకువలను అందిస్తుంది. ఉదాహరణకు:

  • మనము కష్టముల క్రింద పనిచేస్తాము.

  • ఆచరించుటకు జ్ఞానము పొందటానికి మనము లేఖనాల వైపు తిరుగుతాము.

  • దేవుని యందు మన విశ్వాసము మరియు నమ్మకమును మనము రుజువు చేస్తాము.

  • అపవాది యొక్క ప్రభావాన్ని అడ్డుకోవడానికి మనకు సహాయపడటానికి దేవునితో వేడుకోవడానికి మనము మన శక్తిని ఉపయోగిస్తాము.

  • దేవునికి మన హృదయపు కోరికలను అర్పిస్తాము.

  • మనము ఆయనవైపు తిరిగినప్పుడు, మన జీవితపు ఎంపికలను ఆయన వెలుగు నడిపించుటపై మరియు మనపై పడుటపై మనము దృష్టిసారిస్తాము.

  • ఆయన మనలో ప్రతిఒక్కరిని పేరు ద్వారా ఎరుగునని, మనము నెరవేర్చటానికి వ్యక్తిగత పాత్రలను కలిగి ఉన్నాడని మనము గ్రహిస్తాము.7

అదనముగా, మనము దైవిక సాధ్యతను మరియు నిత్య విలువను కలిగియున్నామనే జ్ఞానమును జోసెఫ్ స్మిత్ పునఃస్థాపించాడు. మన పరలోక తండ్రితో ఆ అనుబంధము వలన, ఆయన నుండి మనము బయల్పాటు పొందాలని ఆయన మనల్ని ఆశిస్తున్నాడని నేను నమ్ముతున్నాను.

ప్రభువు ఎమ్మాను “పరిశుద్ధాత్మను పొందమని” ఎక్కువగా నేర్చుకోమని, “ఈ లోక విషయాలను ప్రక్కన పెట్టి, … మేలైన విషయాల కొరకు వెదకమని,” మరియు దేవునితో “[ఆమె] నిబంధనలను పట్టుకొనియుండుము” అని ఉపదేశించాడు.8 నేర్చుకొనుట పురోగతికి సమగ్రమైనది, ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ యొక్క నిరంతర సహవాసము మనలో ప్రతీఒక్కరికి ప్రక్కన పెట్టాల్సిన అవసరమైన దానిని మనకు బోధించినట్లుగా—అనగా అర్ధము మనల్ని అంతరాయపరచగలది లేక మన పురోభివృద్ధిని ఆలస్యము చేసేది.

అధ్యక్షులు నెల్సన్ చెప్పారు, “బయల్పాటును పొందటానికి మీ ఆత్మీయ సామర్ధ్యమును హెచ్చించమని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను.”9 అడుగు ముందుకు వేయటానికి స్త్రీల సామర్ధ్యమును నేను లోతుగా ఆలోచించినప్పుడు మన ప్రవక్త మాటలు నిరంతరం నాతో ఉన్నాయి. ఆయన మనల్ని వేడుకుంటున్నారు, అది ప్రాధాన్యతను సూచిస్తుంది. బయల్పాటును పొందుట మరియు అచరించుట ద్వారా పాపముతో జబ్బుపడిన ప్రపంచంలో ఎలా ఆత్మీయంగా బ్రతికియుండాలో ఆయన మనకు బోధిస్తున్నారు.10 మనము ఆవిధంగా చేసినప్పుడు, ప్రభువు యొక్క ఆజ్ఞలను ఘనపరచి, జీవించినప్పుడు, ఎమ్మా స్మిత్‌కు ఇవ్వబడినట్లుగా మనము కూడ “నీతి కిరీటము” వాగ్దానమివ్వబడ్డాము.11 ఈ జీవితంలో మనము వెదకుచున్న బాట దేవుని చేత నియమించబడిందని తెలుసుకొనుట యొక్క ప్రాముఖ్యతను గూర్చి ప్రవక్త జోసెఫ్ స్మిత్ బోధించాడు. ఆ జ్ఞానము లేకుండా, మనము “[మన] మనస్సులలో, అలసిపోయి సొమ్మసిల్లిపోతాము.”12

ఈ సమావేశములో, మన జీవితాలను మార్చుకోవటానికి, మెరుగుపరచుకోవటానికి, మరియు శుద్ధి చేసుకోవటానికి మనల్ని ప్రేరేపించు సత్యములను మనము వింటాము. వ్యక్తిగత బయల్పాటు ద్వారా, ఇప్పుడు అదంతా చేయటానికి తీర్మానించుకొని మనము వెళ్లినప్పుడు—“సర్వసభ్య సమావేశము విన్న తరువాత ముంచివేయబడ్డాము” అని కొందరు పిలిచిన దానిని మానగలము. స్త్రీలు అనేక టోపీలను ధరిస్తారు, కానీ అన్ని ఒకేసారి ధరించుట అసాధ్యము, అనవసరము. ఈరోజు ఏ పనిపై దృష్టిసారించాలో తీర్మానించడానికి ఆత్మ మనకు సహాయపడుతుంది.13

పరిశుద్ధాత్మ ద్వారా ప్రభువు యొక్క ప్రేమగల ప్రభావం మన పురోభివృద్ధికి ఆయన ప్రాధాన్యతను తెలుసుకోవటానికి మనకు సహాయపడుతుంది. వ్యక్తిగత బయల్పాటును లక్ష్యపెట్టుట వ్యక్తిగత అభివృద్ధికి నడిపించును.14 మనము వింటాము, ఆచరిస్తాము.15 ప్రభువు చెప్పారు, “మీరు పొందుతారని నమ్ముతూ, విశ్వాసమందు నా నామములో తండ్రిని అడుగుము, మరియు మీరు పరిశుద్ధాత్మను కలిగియుంటారు, అది యుక్తమైన అన్ని విషయాలను బయల్పరచును.”16 నిరంతరం బయల్పాటును పొందడం మన కొనసాగుతున్న పాత్ర.

మనము అలా చేయటంలో ఎక్కువ నైపుణ్యము సంపాదించినప్పుడు, పరిచర్య చేయుటకు, రక్షణ కార్యము మరియు ఉన్నతస్థితిని నెరవేర్చుటకు—నిజముగా “ఈ లోక విషయాలను తిరస్కరించి, పరలోకపు విషయాల కొరకు వెదకుటకు వ్యక్తిగత పాత్రలందు మనము ఎక్కువ శక్తిని పొందుతాము.”17 అప్పుడు మనము మన నవతరము అదేవిధంగా చేయడానికి ఎక్కువ ప్రభావవంతంగా ప్రేరేపించగలము.

సహోదర, సహోదరిలారా, మన జీవితాలలో దేవుని యొక్క శక్తిని మనమందరం కోరతాము.18 నేడు దేవుని యొక్క కార్యమును నెరవేర్చుటలో స్త్రీలు, పురుషుల మధ్య చక్కని ఐక్యత ఉన్నది. మనము బాప్తీస్మపు నీళ్లలో మొదట చేసినవి మరియు తరువాత పరిశుద్ధ దేవాలయముల గోడల లోపల చేసిన నిబంధనల ద్వారా యాజకత్వ శక్తిని చేరుకుంటాము.19 “దేవునితో నిబంధనలు చేసి, ఆ నిబంధనలను గైకొను ప్రతీ స్త్రీ, ప్రతీ పురుషుడు మరియు యాజకత్వ విధులలో యోగ్యతతో పాల్గొనువారు, దేవుని యొక్క శక్తిని ప్రత్యక్షముగా అందుకోగలరు,”20 అని అధ్యక్షులు నెల్సన్ మనకు బోధించారు.

నా నిబంధనల ద్వారా నేను యాజకత్వ శక్తిని చేరుకోగలనని21 ఒక స్త్రీగా నా జీవితం ప్రారంభంలో నేను గ్రహించలేదని ఈరోజు నేను వ్యక్తిగతంగా అంగీకరిస్తున్నాను. సహోదరిలారా, మనము “[మన] నిబంధనలు హత్తుకొని,”22 లేఖనముల సత్యములను స్వీకరించి, మరియు మన జీవిస్తున్న ప్రవక్తల మాటలను లక్ష్యపెట్టినప్పుడు, యాజకత్వ అధికారమును మనము గుర్తించి, కాపాడుకుంటామని నేను ప్రార్ధిస్తున్నాను.

“మీరు రక్షించుటకు శక్తిమంతుడైన వాని యోగ్యతలపైన పూర్తిగా ఆధారపడుచూ ఆయన యందు స్థిరమైన విశ్వాసముతో”23 మన పరలోక తండ్రి మరియు మన రక్షకునితో మన భక్తిని మనం ధైర్యముగా ప్రకటిద్దాము. మన ఉన్నతమైన ఆత్మీయ సాధ్యత వైపు ఈ ప్రయాణమును మనం సంతోషంగా కొనసాగిద్దాం మరియు ప్రేమ, సేవ, నాయకత్వము మరియు కనికరము ద్వారా మన చుట్టూ ఉన్నవారు అదేవిధంగా చేయడానికి సహాయపడదాం.

ఎల్డర్ జేమ్స్ ఈ. టాల్మేజ్ మనకు మృదువుగా జ్ఞాపకం చేసారు, “స్త్రీ మరియు స్త్రీత్వము యొక్క ప్రపంచపు గొప్ప ఛాంపియన్ యేసు క్రీస్తే.”24 పునఃస్థాపనలో మహిళ నిరంతర పాత్రల యొక్క తుది విశ్లేషణలో, మనందరి కోసం ఏ పాత్ర ముఖ్యమైనది? అది ఆయనను వినుట, 25 ఆయనను అనుసరించుట,26 ఆయనను విశ్వసించుట,27 మరియు ఆయన ప్రేమ యొక్క విస్తరణగా ఉండుట అని నేను సాక్ష్యమిస్తున్నాను.28 ఆయన జీవిస్తున్నాడని నేను ఎరుగుదును.29 యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో, ఆమేన్.