సర్వసభ్య సమావేశము
గిలాదులో గుగ్గిలము ఏమియు లేదా?
2021 అక్టోబరు సర్వసభ్య సమావేశము


గిలాదులో గుగ్గిలము ఏమియు లేదా?

రక్షకుని స్వస్థపరిచే శక్తి మన శరీరాలను స్వస్థపరచగల ఆయన సామర్థ్యము మాత్రమే కాదు, అంతకంటే ముఖ్యమైనది, మన హృదయాలను స్వస్థపరిచే సామర్థ్యము.

నా సువార్త పరిచర్య ముగిసిన కొంతకాలం తరువాత, బివైయులో విద్యార్థిగా ఉండగా, మా నాన్న నాకు ఫోను చేసారు. ఆయన ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారని మరియు బ్రతికే అవకాశాలు ఎక్కువ లేనప్పటికీ ఆయన స్వస్థత పొంది, తన సాధారణ జీవిత కార్యకలాపాలకు తిరిగి రావాలని నిర్ణయించుకున్నానని నాతో చెప్పారు. ఆయనతో ఫోనులో మాట్లాడడం నాకు విచారకరముగా ఉండెను. మా నాన్న నా బిషప్పు, నా స్నేహితుడు మరియు నా సలహాదారుడు. మా అమ్మ, నా తోబుట్టువులు మరియు నేను భవిష్యత్తు గురించి ఆలోచించినప్పుడు అది అస్పష్టంగా కనిపించింది. నా చిన్న తమ్ముడు న్యూయార్కులో సవార్తసేవ చేస్తున్నాడు మరియు కష్టమైన కుటుంబ సంఘటనలలో చాలా దూరం నుండి పాల్గొన్నాడు.

ఆరోజు కలుసుకొన్న వైద్య సహాయకుడు, క్యాన్సర్ వ్యాప్తి చెందకుండా ఆపడానికి శస్త్రచికిత్స చేయాలని సూచించాడు. మా కుటుంబము మనఃపూర్వకంగా ఉపవాసముండి, ఒక అద్భుతము కోసం ప్రార్థన చేసింది. మానాన్న స్వస్థపడటానికి తగినంత విశ్వాసమును మేము కలిగియున్నామని నేను భావించాను. శస్త్ర చికిత్సకు ముందు, నా అన్న నార్మ్ మరియు నేను మా నాన్నకు ఒక దీవెన ఇచ్చాము. మేము కూడగట్టగల సమస్త విశ్వాసముతో, ఆయన స్వస్థపడాలని మేము ప్రార్థించాము.

శస్త్రచికిత్స అనేక గంటలు చేయడానికి నిర్ణయించబడింది, కానీ కేవలం కాసేపటి తరువాత వైద్యుడు వేచియున్న గదిలో మా కుటుంబముతో కలుసుకోవడానికి వచ్చాడు. వారు శస్త్రచికిత్స ప్రారంభించినప్పుడు, క్యాన్సర్ మా నాన్న శరీరమంతా వ్యాప్తి చెందినట్లు వారు చూడగలిగారు. వారు గమనించిన దానిని బట్టి, మా నాన్నకు జీవించడానికి కొన్ని నెలలు మాత్రమే ఉన్నాయి. మేము చాలా కృంగిపోయాము.

శస్త్ర చికిత్స నుండి మా నాన్న మేల్కొన్న తరువాత, ఆయన ప్రక్రియ విజయవంతమైందా అని తెలుసుకోవాలని ఆతృతగా ఉన్నారు. మేము ఆయనతో విచారమైన వార్తను పంచుకున్నాము.

మా కుటుంబము మనఃపూర్వకంగా ఉపవాసముండి, ఒక అద్భుతము కోసం ప్రార్థన చేసింది. మా నాన్న ఆరోగ్యము త్వరగా క్షీణించినప్పుడు, ఆయన నొప్పి లేకుండా ఉండాలని మేము ప్రార్థించడం మొదలుపెట్టాము. చివరకు ఆయన పరిస్థితి విషమించింది, ఆయన త్వరగా చనిపోవడం అనుమతించాలని ప్రభువును మేము అడిగాము. శస్త్ర చికిత్స జరిగిన కొన్ని నెలల తరువాత, శస్త్ర చికిత్సకుని చేత ఊహించబడినట్లుగానే మా నాన్న చనిపోయారు.

వార్డు మరియు కుటుంబ స్నేహితుల చేత మా కుటుంబముపై మిక్కిలి ప్రేమ, శ్రద్ధ క్రుమ్మరించబడ్డాయి. మా నాన్నగారి జీవితాన్ని గౌరవించే ఒక అందమైన అంత్యక్రియలను మేము జరిపాము. కాలము గతించినప్పుడు, మేము మా నాన్న లేని బాధను అనుభవించాము, మా నాన్న ఎందుకు స్వస్థపరచబడలేదా అని నేను ఆశ్చర్యపడసాగాను. నా విశ్వాసము తగినంత బలంగా లేదా అని నేను ఆశ్చర్యపడ్డాను. కొందరు కుటుంబాలు ఒక అద్భుతాన్ని ఎందుకు పొందారు, కానీ మా కుటుంబము ఎందుకు పొందలేదు? జవాబుల కోసం లేఖనాలవైపు తిరగడం నా సువార్తసేవలో నేను నేర్చుకున్నాను, కాబట్టి నేను లేఖనాలను పరిశోధించడం ప్రారంభించాను.

గాయములను బాగు చేయడానికి ఉపయోగించబడిన సుగంధపు దినుసు లేక లేపనమును గూర్చి పాత నిబంధన బోధిస్తుంది అది గిలాదులో పెరిగిన ఒక పొద నుండి తయారు చేయబడింది. పాత నిబంధన కాలములో లేపనము “గిలాదులో గుగ్గిలముగా”1 పిలవబడింది. ప్రవక్త యిర్మీయా తన ప్రజల మధ్య అతడు గమనించిన విపత్తులను గూర్చి విలపించాడు మరియు స్వస్థత కోసం ఆశించాడు. యిర్మీయా ప్రశ్నించాడు, “గిలాదులో గుగ్గిలము ఏమియు లేదా; అక్కడ ఏ వైద్యుడును లేడా?” 2 సాహిత్యము, సంగీతము, కళ ద్వారా రక్షకుడైన యేసు క్రీస్తు ఆయన అసాధారణమైన స్వస్థపరచే శక్తి వలన గిలాదు యొక్క గుగ్గిలముగా తరచుగా సూచించబడ్డాడు. యిర్మీయా వలె నేను ప్రశ్నించాను, “గిలాదులో గుగ్గిలము ఏమియు లేదా; అక్కడ ఏ వైద్యుడును లేడా?”

క్రొత్త నిబంధన మార్కు 2వ అధ్యాయములో మనము రక్షకుడిని కపెర్నహూములో కనుగొంటాము. రక్షకుని స్వస్థపరచే శక్తి గురించి మాట దేశమంతటా వ్యాపించబడింది మరియు అనేకమంది జనులు రక్షుకని చేత స్వస్థపరచబడుటకు కపెర్నహూముకు ప్రయాణించారు. అక్కడ అనేకమంది ఇంటి చుట్టూ సమావేశమయ్యారు, రక్షకుడు ఉన్నచోట వారందరిని స్వీకరించడానికి ఆయనకు స్థలము లేదు. నలుగురు మనుష్యులు పక్షవాత రోగిని రక్షకుని చేత స్వస్థపరచుటకు మోసుకొని వచ్చారు. వారు సమూహము గుండా వెళ్ళలేకపోయారు, కాబట్టి వారు ఇంటి పైకప్పు తీసి, రక్షకుని కలుసుకోవడానికి అతడిని క్రిందకు దించారు.

ఈ వృత్తాంతము చదివినప్పుడు, రక్షకుడు ఆ వ్యక్తిని కలిసినప్పుడు ఆయన చెప్పిన దానిని బట్టి నేను ఆశ్చర్యపడ్డాను: “కుమారుడా, నీ పాపములు క్షమించబడినయున్నవి.“ 3 ఈ వ్యక్తిని మోసుకొని వచ్చిన నలుగురిలో నేను ఒకరినైతే, నేను రక్షకునితో “నిజానికి మేము ఇతడిని స్వస్థపరచుటకు తీసుకొని వచ్చాము” అనే వాడిని. “నేను అతడిని స్వస్థపరిచాను,” అని రక్షకుడు జవాబిచ్చియుండవచ్చని నేను అనుకుంటున్నాను. రక్షకుని స్వస్థపరిచే శక్తి మన శరీరాలను ఆయన స్వస్థపరిచే సామర్థ్యము మాత్రమే కాదు, కానీ అంతకంటే ముఖ్యమైనది, మన హృదయాలను మరియు నా కుటుంబము యొక్క విరిగిన హృదయాలను స్వస్థపరిచే సామర్థ్యమును నేను పూర్తిగా గ్రహించలేదనుట సాధ్యమేనా?

ఆయన చివరికి శారీరకంగా వ్యక్తిని స్వస్థపరచినప్పుడు, రక్షకుడు ఈ అనుభవము ద్వారా ఒక ముఖ్యమైన పాఠమును బోధించాడు. ఆయన సందేశము ఏమిటంటే ఆయన గ్రుడ్డివారి కన్నులను తాకగలరు మరియు వారు చూడగలరని నాకు స్పష్టమయ్యింది. ఆయన చెవిటి వారి చెవులను తాకగలరు మరియు వారు వినగలరు. ఆయన నడవలేని వారి కాళ్ళను తాకగలరు మరియు వారు నడవగలరు. ఆయన మన కన్నులను, మన చెవులను మరియు మన కాళ్ళను స్వస్థపరచగలరు, కానీ అన్నిటికంటే అతి ముఖ్యమైనది, ఆయన పాపము నుండి మనల్ని శుద్ధి చేసినప్పుడు మన హృదయాలను స్వస్థపరచగలడు మరియు కష్టమైన శ్రమల గుండా మనల్ని పైకెత్తగలడు.

పునరుత్థానము తరువాత మోర్మన్ గ్రంథములోని జనులకు రక్షకుడు ప్రత్యక్షమైనప్పుడు, ఆయన తన స్వస్థపరుచు శక్తి గురించి మరలా మాట్లాడారు. పరలోకము నుండి ఆయన స్వరము ఇలా చెప్పుట నీఫైయులు విన్నారు, “నేను మిమ్ములను స్వస్థపరచునట్లు మీరందరూ నా యొద్దకు తిరిగి వచ్చి మరియు మీ పాపముల విషయమై పశ్చాత్తాపము పొంది మరియు పరివర్తన నొందరా?”4 తరువాత, రక్షకుడు బోధించినట్లుగా, “ఏలయనగా వారు తిరిగి వచ్చి పశ్చాత్తాపపడి, హృదయము యొక్క పూర్ణ ఉద్దేశ్యముతో నా యొద్దకు వచ్చెదరేమో, నేను వారిని స్వస్థపరచుదునేమో మీరెరుగరు.”5 రక్షకుడు శారీరక స్వస్థత గురించి సూచించడం లేదు కానీ బదులుగా వారి ఆత్మలకు ఆత్మీయ స్వస్థతను సూచిస్తున్నారు.

తన తండ్రి మోర్మన్ మాటలను అతడు పంచుకొన్నప్పుడు, మొరోనై అదనపు అర్థమును ఇస్తున్నాడు. అద్భుతములను గూర్చి మాట్లాడిన తరువాత, మోర్మన్ ఇలా వివరించారు, “మరియు క్రీస్తు ఇట్లు చెప్పియుండెను: మీరు నా యందు విశ్వాసము కలిగియున్న యెడల, నా దృష్టిలో సరియైనది ఏదైనను చేయుటకు మీరు శక్తి కలిగియుందురు.”6 యేసు క్రీస్తు నా విశ్వాసము యొక్క ఉద్దేశ్యముగా ఉండాలని మరియు నేను ఆయనయందు విశ్వాసమును సాధన చేసినప్పుడు ఆయనకు యుక్తమైన దానిని నేను అంగీకరించాలని నేను నేర్చుకున్నాను. మా నాన్న చనిపోవటం దేవుని యొక్క ప్రణాళికకు ఆవశ్యకమైనదని ఇప్పుడు నేను గ్రహించాను. ఇప్పుడు, నేను మరొకరిని దీవించడానికి అతడు లేక ఆమె తలపై నా చేతులను ఉంచినప్పుడు, క్రీస్తునందు అనుకూలమైనది అయితే, ఒక వ్యక్తి శారీరకంగా స్వస్థపరచబడగలడు మరియు స్వస్థపరచబడతామని నేను గ్రహించి, యేసు క్రీస్తునందు నాకు విశ్వాసమున్నది.

రక్షకుని యొక్క ప్రాయశ్చిత్తము, ఇది ఆయన విమోచన మరియు ఆయన సహాయక శక్తి రెండింటినీ అందుబాటులోకి తెస్తుంది, ఇది యేసు క్రీస్తు అందరికీ అందించే అంతిమ ఆశీర్వాదం. మనము పూర్ణ హృదయముతో పశ్చాత్తాపపడినప్పుడు, రక్షకుడు మనల్ని పాపము నుండి శుద్ధి చేస్తారు. తండ్రికి మన చిత్తమును సంతోషంగా అప్పగించినప్పుడు, అతి కష్టమైన పరిస్థితులలో కూడా రక్షకుడు మన భారములను పైకెత్తి, వాటిని తేలికగా చేస్తారు.7

కానీ నేను నేర్చుకొన్న గొప్ప పాఠము ఇక్కడున్నది. రక్షకుని స్వస్థపరచే శక్తి నా కుటుంబానికి పని చేయలేదని నేను తప్పుగా నమ్మాను. ఇప్పుడు ఎక్కువ పరిపక్వతగల కళ్ళతో మరియు అనుభవముతో నేను తిరిగి చూసినప్పుడు, నా కుటుంబ సభ్యులు ప్రతిఒక్కరి జీవితాలలో రక్షకుని యొక్క స్వస్థపరిచే శక్తిని నేను చూసాను. నేను శారీరక స్వస్థతపై ఎక్కువగా దృష్టిసారించడం వలన, జరిగిన అద్భుతాలను చూడటానికి నేను విఫలమయ్యాను. ప్రభువు ఈ కష్టమైన శ్రమ గుండా తన సామర్థ్యమును మించి మా అమ్మను బలపరిచారు మరియు పైకెత్తారు, ఆమె ఒక సుదీర్ఘమైన, ప్రయోజనకరమైన జీవితాన్ని కొనసాగించింది. ఆమె తన పిల్లలు మరియు మనుమలపై అసాధారణమైన మంచి ప్రభావమును కలిగియున్నది. ప్రభువు నన్ను మరియు నా తోబుట్టువులను ప్రేమ, ఐక్యత, విశ్వాసము మరియు స్థితిస్థాపకతతో దీవించారు అది మా జీవితాలలో ముఖ్యమైన భాగమైంది మరియు నేటికి కొనసాగుతున్నది.

కానీ మా నాన్న సంగతి ఏమిటి? పశ్చాత్తాపపడిన వారిందరి వలె, రక్షకుని ప్రాయశ్చిము వలన లభ్యమయ్యే దీవెనలను ఆయన వెదకి పొందినప్పుడు ఆయన ఆత్మీయంగా స్వస్థపరచబడ్డారు. ఆయన తన పాపములకు ప్రాయశ్చిమును పొందారు మరియు ఇప్పుడు పునరుత్థానము యొక్క అద్భుతము కొరకు ఎదురుచూస్తున్నారు. “ఆదామునందు అందరు ఏలాగు మృతిపొందుచున్నారో, ఆలాగుననే క్రీస్తునందు అందరు బ్రదికింపబడుదురు”8 అని అపొస్తలుడైన పౌలు బోధించెను. ఇదిగో నేను రక్షకునితో ఇలా చెప్పాను, “స్వస్థపరచుటకు మా నాన్నను మేము మీ వద్దకు తీసుకొనివచ్చాము” మరియు రక్షకుడు ఆయన నాన్నను స్వస్థపరిచారని రక్షకుడు నాకు స్పష్టపరిచారు. గిలాదు యొక్క గుగ్గిలము నీల్సన్ కుటుంబానికి పనిచేసింది—మేము ఆశించిన విధంగా కాదు, కానీ ఇంకా ప్రాముఖ్యమైన విధానములో దీవించింది మరియు మా జీవితాలను దీవించడం కొనసాగుతుంది.

క్రొత్త నిబంధన యోహాను 6 అధ్యాయములో, రక్షకుడు ఒక అత్యంత ఆసక్తికరమైన అద్భుతాన్ని చేసారు. కేవలము కొన్ని చేపలు మరియు కొన్ని రొట్టె ముక్కలతో రక్షకుడు 5,000 మందికి ఆహారమిచ్చారు. ఈ వృత్తాంతాన్ని నేను అనేకసార్లు చదివాను, కానీ ఆ అనుభవంలో కొంత భాగాన్ని నేను కోల్పోయాను, అది ఇప్పుడు నాకు గొప్ప అర్థాన్ని కలిగి ఉంది. రక్షకుడు 5,000 మందికి ఆహారమిచ్చిన తరువాత, ఆయన తన శిష్యులను మిగిలిన ముక్కలను సేకరించమని అడిగారు, అది 12 గంపలను నింపింది. దానిని చేయడానికి రక్షకుడు ఎందుకు సమయాన్ని తీసుకున్నారో అని నేను ఆశ్చర్యపోయాను. నాకు స్పష్టమైనది ఏమిటంటే, ఆ సందర్భము నుండి మనము నేర్చుకొనగల ఒక పాఠము: ఆయన 5,000 మందికి ఆహారమిమవ్వగలరు మరియు ఇంకా మిగిలిపోయాయి. “మనుష్యులందరికీ నా కృప చాలును.”9 రక్షకుని యొక్క విమోచించే మరియు స్వస్థపరచే శక్తి ఎంత పెద్దది లేక ఎంత కష్టమైనది అయినప్పటికీ—ఏ పాపము, గాయము, లేక శ్రమనైనా కప్పును. ఆయన కృప చాలును.

కష్టతరమైన సమయాలు వచ్చినప్పుడు, అవి తప్పక వస్తాయి లేదా మన జీవితమును పాపము చుట్టుముట్టినప్పుడు, రక్షకుడు “తన రెక్కలందు ఆరోగ్యముతో”10నిలుచున్నాడనే జ్ఞానముతో, విశ్వాసముతో మనము ముందుకు సాగగలము.

గిలాదు యొక్క గుగ్గిలము, రక్షకుడైన యేసు క్రీస్తును గూర్చి, మన విమోచకుని గూర్చి మరియు ఆయన అద్భుతమైన స్వస్థపరిచే శక్తిని గూర్చి నేను మీకు సాక్ష్యమిస్తున్నాను. మిమ్మల్ని స్వస్థపరచాలనే ఆయన కోరికను గూర్చి నేను సాక్ష్యమిస్తున్నాను. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.