సర్వసభ్య సమావేశము
యేసు క్రీస్తుకు మన మన పరివర్తనను లోతుగా చేయుట
2021 అక్టోబరు సర్వసభ్య సమావేశము


యేసు క్రీస్తుకు మన మన పరివర్తనను లోతుగా చేయుట

లేఖనాలు మరియు దేవుని గురించి మన జ్ఞానము బహుమానాలు—మనం తరుచుగా తేలికగా తీసుకొనే బహుమానాలు. ఈ దీవెనలను మనము ఆదరిద్దాము.

ఎల్డర్ నీల్సన్, చక్కని మీ సందేశానికి మీకు ధన్యవాదాలు. అది మాకు అవసరమైయుండెను.

నా ప్రియమైన సహోదర సహోదరిలారా, అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇటీవల మనకు ఇలా బోధించారు: “ఏదైన బాగా చేయడానికి ప్రయత్నము అవసరము. యేసు క్రీస్తు యొక్క నిజమైన శిష్యులు కావడం దానికి మినహాయింపు కాదు. ఆయన యందు విశ్వాసాన్ని, నమ్మకాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం అవసరము.” యేసు క్రీస్తుపై మన విశ్వాసాన్ని పెంపొందించడానికి ఆయన మనకు ఇచ్చిన సిఫార్సులలో, క్రీస్తు యొక్క సువార్తసేవ మరియు పరిచర్యను బాగా అర్థం చేసుకోవడానికి మనం నిమగ్నమైన అభ్యాసకులుగా మారాలి, మనం లేఖనాలను అధ్యయనం చేయడంలో పూర్తిగా నిమగ్నము కావాలి. (“Christ Is Risen; Faith in Him Will Move Mountains,” Liahona, May 2021, 103 చూడండి.)

లీహై కుటుంబంలో లేఖనాలు ఒక ముఖ్యమైన భాగమని మోర్మన్ గ్రంథములో మనం నేర్చుకున్నాము—ఎంతగా అంటే నీఫై మరియు అతడి సహోదరులు ఇత్తడి పలకలను పొందడానికి యెరూషలేము తిరిగి వచ్చారు. (1 నీఫై 3– చూడండి).

నీఫై మరియు అతని తండ్రికి లియహోనా బయలుపరచినట్లు, లేఖనాలు మన కొరకు దేవుని చిత్తమును బయల్పరుస్తాయి. అతడు తన విల్లును విరగగొట్టిన తరువాత, ఆహారము సంపాదించడానికి తాను ఎక్కడికి వెళ్ళాలో నీఫై తెలుసుకోవాలి. అతడి తండ్రియైన లీహై గోళము వైపు చూసి, అక్కడ వ్రాయబడిన విషయాలను చూసారు. విశ్వాసము, శ్రద్ధ మరియు వాటికి చూపబడిన ఆసక్తి ప్రకారము గోళముపై ముళ్ళు పని చేస్తాయని నీఫై గ్రహించాడు. ఆ వ్రాత చదవడానికి సులభమైనదిగా ఉండడం అతడు చూసాడు మరియు అది ప్రభువు యొక్క మార్గముల గురించి వారికి జ్ఞానమును ఇచ్చింది. ప్రభువు చిన్న సాధనముల ద్వారా గొప్ప క్రియలను చేయగలడని అతడికి తెలుసు. లియహోనా చేత ఇవ్వబడిన నడిపింపులను బట్టి అతడు విధేయుడిగా ఉన్నాడు. అతడు కొండపైకి వెళ్ళి, తన కుటుంబానికి ఆహారము సంపాదించాడు, వాళ్ళు ఆహారము లేకపోవడంతో చాలా బాధపడ్డారు. (1 నీఫై 16:23-31 చూడండి.)

లేఖనాలకు అంకితమయిన ఒక విద్యార్థిగా నాకు నీఫై కనిపించాడు. నీఫై లేఖనాలందు ఆనందించాడని, వాటిని తన హృదయములో ధ్యానించాడని మరియు తన పిల్లల యొక్క శిక్షణ మరియు ప్రయోజనము కొరకు వాటిని వ్రాసాడని మనము చదివాము (2 నీఫై 4:15-16 చూడండి).

అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ వివరించారు:

“మనం క్రీస్తు వాక్యమును విందారగించుచూ ముందుకుసాగి, అంతము వరకు సహించిన యెడల, … [మనం] నిత్యజీవమును పొందుతాము’ [2 నీఫై 31:20].

“విందు అనగా రుచిచూడటం కంటే ఎక్కువైనది. విందారగించడం అనగా రుచిని ఆస్వాదించడం. లేఖనాలను సంతోషకరమైన ఆవిష్కరణ మరియు నమ్మకమైన విధేయతతో అధ్యయనం చేయడం వలన మనం వాటి రుచిని ఆస్వాదిస్తాము. మనం దేవుని యొక్క మాటలను విందారగిస్తే, అవి ‘మెత్తని హృదయములు అను పలకలమీద’ చెక్కబడతాయి [2 కొరింథీయులు 3:3]. అవి మన స్వభావంలో అంతర్భాగమవుతాయి” (“Living by Scriptural Guidance,” Liahona, Jan. 2001, 21).

మన ఆత్మలు లేఖనములందు ఆనందించినట్లైతే, మనము చేసే విషయాలలో కొన్ని ఏవి?

తెరకు రెండు వైపులా ఇశ్రాయేలీయులు సమకూర్చబడుటలో భాగముగా ఉండటానికి మన కోరిక హెచ్చింపబడుతుంది. సువార్తికులను వినడానికి మన కుటుంబము, స్నహేతులను ఆహ్వానించడం మనకు సాధారణమైనదిగా, సహజమైనదిగా అవుతుంది. మనము యోగ్యులుగా ఉంటాము మరియు సాధ్యమైనంత తరచుగా దేవాలయానికి వెళ్ళడానికి బదులుగా చెలామణిలోఉన్న దేవాలయ సిఫారసును కలిగియుంటాము. మన పూర్వీకుల పేర్లను కనుగొని, సిద్ధం చేసి దేవాలయానికి సమర్పించడానికి మనము పనిచేస్తాము. సంస్కారమును తీసుకొనడంలో మనము యోగ్యతగా పాల్గొన్నప్పుడు ప్రభువుతో మన నిబంధనలను క్రొత్తగా చేయడానికి ప్రతీ ఆదివారము సంఘానికి హాజరవుతూ, విశ్రాంతిదినమును పాటించడంలో మనము విశ్వాసముగా ఉంటాము. దేవుని నోటినుండి బయటకు వచ్చే ప్రతీ మాటను జీవించుట ద్వారా నిబంధన బాటపై మనము నిలిచియుండటానికి మనము తీర్మానిస్తాము (సిద్ధాంతము మరియు నిబంధనలు 84:44 చూడండి).

ప్రభువు యొక్క సంగతులందు సంతోషించుట అనగా మీకేమి అర్థాన్ని కలిగియున్నది?

లేఖనములందు సంతోషించుట అనగా జ్ఞానము కొరకు ఆకలి దప్పికలను కలిగియుండటం కంటే ఎక్కువైనది. నీఫై తన జీవితకాలమందు గొప్ప సంతోషాన్ని అనుభవించాడు. అయినప్పటికీ, అతడు కష్టాలు మరియు విచారమును కూడా ఎదుర్కొన్నాడు (2 నీఫై 4:12–13 చూడండి). “అయినప్పటికీ,” “నేను ఎవరియందు నమ్మికయుంచి యున్నానో నేను ఎరుగుదును” (2 నీఫై 4:19) అని అతడు చెప్పాడు. మనము లేఖనాలను అధ్యయనం చేసినప్పుడు, దేవుని యొక్క రక్షణ ప్రణాళికను, ఉన్నత స్థితిని మనము బాగా అర్థము చేసుకుంటాము మరియు ఆయన లేఖనాలలో అదేవిధంగా ఆధునిక ప్రవక్తల యొక్క వాగ్దానములందు మరియు దీవెనలందు మనకు చేసిన వాగ్దానములందు మనము నమ్ముతున్నాము.

చిత్రం
దావీదు మరియు గొల్యాతు

ఒక మధ్యాహ్నకాలము, నేను నా భార్య ఒక స్నేహితుని ఇంటికి ఆహ్వానించబడ్డాము. వారి ఏడు సంవత్సరాల కుమారుడైన డేవిడ్, దావీదు గోల్యాతుల బైబిలు కథను ఎప్పుడూ వినలేదు మరియు అతడు దానిని వినాలని కోరాడు. నేను కథను చెప్పడం ప్రారంభించినప్పుడు, తన చేతిలో ఏ ఖడ్గము లేకుండా దావీదు తన విశ్వాసముతో, ఇశ్రాయేలు దేవుని నామములో ఒక ఒడిసెల మరియు ఒక రాయితో ఫిలిష్తీయుడిని గాయపరచి, చంపిన విధానము చేత అతడు ఆకట్టుకోబడ్డాడు (1 సమూయేలు చూడండి).

అతడు తన విశాలమైన నల్లని కళ్ళతో నా వైపు చూసి, నన్ను స్థిరంగా అడిగాడు “దేవుడు ఎవరు?” దేవుడు మన పరలోక తండ్రి అని, మనము ఆయనను గూర్చి లేఖనాలలో నేర్చుకుంటామని నేను అతడికి వివరించాను.

తరువాత అతడు నన్ను అడిగాడు, “లేఖనాలు అనగా ఏమిటి?” లేఖనాలు దేవుని వాక్యమని, వాటిలో దేవుని గురించి బాగా తెలుసుకోవడానికి సహాయపడే అందమైన కథనాలను అతడు కనుగొంటాడని నేను అతడికి చెప్పాను. అతడి తల్లిని, తన ఇంటిలో ఉన్న బైబిలును ఉపయోగించమని మరియు అతడికి మొత్తము కథ చదవకుండా డేవిడ్‌ను నిద్రపోనివ్వద్దని నేను ఆమెను కోరాను. అతడు దానిని విన్నప్పుడు అతడు సంతోషించాడు. లేఖనాలు మరియు దేవుని గురించి మన జ్ఞానము బహుమానాలు—మనం తరుచుగా తేలికగా తీసుకొనే బహుమానాలు. ఈ దీవెనలను మనము ఆదరిద్దాము.

ఒక యువకునిగా సువార్త పరిచర్య చేస్తుండగా, లేఖనాలతో బోధించుట ద్వారా అనేకమంది జీవితాలు మార్చబడినవని నేను గమనించాను. వాటిలో ఉన్న శక్తిని గూర్చి మరియు అవి మన జీవితాలను ఎలా మార్చగలవో నేను ఎరిగియున్నాను. మేము పునఃస్థాపించబడిన సువార్తను బోధించిన ప్రతి వ్యక్తి, ప్రత్యేక అవసరాలను కలిగియున్న ప్రత్యేకమైన వ్యక్తులు. అవును, పరిశుద్ధ లేఖనాలు, పరిశుద్ధ ప్రవక్తల చేత వ్రాయబడిన ప్రవచనాలు, ప్రభువునందు విశ్వాసమునకు, పశ్చాత్తాపమునకు వారిని తెచ్చి మరియు వారి హృదయాలను మార్చాయి.

వారు ప్రేరేపణను, నడిపింపును, ఓదార్పును, బలమును మరియు వారి అవసరాలకు జవాబులను పొందినప్పుడు లేఖనాలు వారిని ఆనందముతో నింపాయి. వారిలో అనేకులు వారి జీవితాలను మార్పులు చేయడానికి నిర్ణయించారు మరియు దేవుని ఆజ్ఞలను పాటించడం ప్రారంభించారు.

క్రీస్తు మాటలందు సంతోషించమని నీఫై మనలను ప్రోత్సహిస్తున్నాడు, ఎందుకనగా క్రీస్తు యొక్క మాటలు మనము చేయవలసిన విషయాలన్నిటినీ మనకు చెప్తాయి (2 నీఫై 32:3 చూడండి).

చిత్రం
కుటుంబ లేఖన అధ్యయనము

లేఖనాలు అధ్యయనం చేయడానికి ఒక శాశ్వతమైన ప్రణాళికను కలిగియుండమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. బోధించడానికి, సువార్తను నేర్చుకోవడానికి, యేసు క్రీస్తుకు మన మార్పును లోతుగా చేయుటకు మరియు ఆయన వలే మారడానికి మనకు సహాయపడటానికి రండి, నన్ను అనుసరించండి గొప్ప వనరు. మనము సువార్తను అధ్యయనం చేసినప్పుడు, మనము కేవలం క్రొత్త సమాచారము కొరకు చూడడం లేదు; బదులుగా మనము ఒక “నూతన సృష్టి” కావాలని కోరుకుంటున్నాము (2 కొరింథీయులకు 5:17).

పరిశుద్ధాత్మ మనల్ని సత్యమునకు నడిపించి, ఆ సత్యము గురించి సాక్ష్యమిచ్చును (యోహాను 16:13 చూడండి). సమస్త సత్యమునకు మూలమైన దేవుని నుండి బయల్పాటు ద్వారా ఆయన మన మనస్సులను ప్రకాశింపజేయును, మన గ్రహింపును వేగవంతం చేయును మరియు మన హృదయాలను తాకును. పరిశుద్ధాత్మ మన హృదయాలను శుద్ధిచేయును. ఆయన మనల్ని సత్యము ప్రకారము జీవించాలనే కోరికను మనలో ప్రేరేపించి, ఆవిధంగా చేయగల మార్గాలను మనకు గుసగుసలాడును. “పరిశుద్ధాత్మ … మీకు సమస్తమును బోధించును” (యోహాను 14:26).

ప్రవక్త జోసెఫ్ స్మిత్‌కు ఆయన బయల్పరచిన మాటలను గూర్చి మాట్లాడుతూ, మన రక్షకుడు ఇలా చెప్పారు:

“ఈ మాటలు మనుష్యుల నుండి లేదా మనుష్యుని నుండి వచ్చినవి కావు, కానీ నా నుండి వచ్చినవి; …

“నా స్వరము మీతో ఈ మాటలను పలుకుచున్నది; ఏలయనగా అవి నా ఆత్మచేత మీకు అనుగ్రహించబడినవి …;

“అందువలన, మీరు నా స్వరము విన్నారని మరియు నా మాటలను ఎరుగుదురని సాక్ష్యమివ్వగలరు” (సిద్ధాంతము మరియు నిబంధనలు 18:34–36).

మనము పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కోరుకోవాలి. ఈ లక్ష్యం మన నిర్ణయాలను శాసించాలి మరియు మన ఆలోచనల్ని, చర్యల్ని నిర్దేశించాలి. ఆత్మ యొక్క ప్రభావాన్ని ఆహ్వానించే ప్రతిదానిని మనము తప్పక వెదకాలి మరియు ఈ ప్రభావము నుండి దూరం చేసే ప్రతిదానిని తిరస్కరించాలి.

యేసు క్రీస్తు మన పరలోక తండ్రి యొక్క ప్రియమైన కుమారుడని నేను సాక్ష్యమిస్తున్నాను. నేను నా రక్షకుడిని ప్రేమిస్తున్నాను. ఆయన లేఖనాలు మరియు ఆయన జీవిస్తున్న ప్రవక్తల కొరకు నేను కృతజ్ఞత కలిగియున్నాను. అధ్యక్షులు నెల్సన్ ఆయన ప్రవక్తయైయున్నారు. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.