లేఖనములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 2


2వ ప్రకరణము

1823 సెప్టెంబరు 21 సాయంకాలమున న్యూయార్క్‌లోని మాంచెస్టర్‌లో ప్రవక్త యొక్క తండ్రి గృహములోనుండగా ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్‌కు మొరోనై దూత చెప్పిన మాటలకు సంబంధించి జోసెఫ్ స్మిత్ చరిత్రనుండి తీసుకోబడిన ఒక భాగము. ప్రస్తుత ప్రపంచములో మోర్మన్ గ్రంథముగా ఉన్న వృత్తాంతమును వ్రాసిన చరిత్రకారుల సుదీర్ఘ వరుసలో మొరోనై ఆఖరివాడు. (మలాకీ 4:5–6తో పోల్చుము; ప్రకరణములు 27:9; 110:13–16; మరియు 128:18లతో కూడా పోల్చుము.)

1, ఏలీయా యాజకత్వమును బహిర్గతము చేయును; 2–3, పితరుల యొక్క వాగ్దానములు పిల్లల హృదయాలలో నాటబడును.

1 ఇదిగో, ప్రభువు యొక్క భయంకరమైన ఆ మహాదినము రాక మునుపు ప్రవక్తయైన ఏలీయా ద్వారా యాజకత్వమును నేను మీకు బహిర్గతము చేయుదును.

2 తండ్రులకు చేయబడిన వాగ్దానములను అతడు పిల్లల హృదయాలలో నాటును, పిల్లల హృదయాలు వారి తండ్రుల తట్టు తిరుగును.

3 అట్లు కాని యెడల, ఆయన రాకడ సమయములో భూమియంతయు పూర్తిగా నాశనము చేయబడును.