2010–2019
ఆయన నామమును ఘనపరచుట
2019 అక్టోబర్ సర్వసభ్య సమావేశము


ఆయన నామమును ఘనపరచుట

నిబంధన గుర్తింపు, సంబంధించుటతో, మనము యేసు క్రీస్తు యొక్క నామము చేత పిలవబడుచున్నాము.

తల్లిదండ్రులు ఒక బిడ్డ యొక్క జననమును ఉత్సాహంగా ఎదురుచూసినప్పుడు, వారు తమ క్రొత్త బిడ్డ కొరకు ఒక పేరును ఎంపిక చేసే బాధ్యతను కలిగియున్నారు. బహుశా మీరు పుట్టినప్పుడు, మీరు ఒక పేరు పొందియున్నారు, అది తరములుగా మీ కుటుంబానికి అందించబడును. లేక మీకివ్వబడిన పేరు సంవత్సరములో లేక మీరు పుట్టిన ప్రాంతములో ప్రసిద్ధి చెందియుండవచ్చు.

ప్రవక్త హీలమన్, అతడి భార్య వారి పసివారైన కుమారులకు నీఫై, లీహై అనే అర్ధవంతమైన కుటుంబ పేర్లను ఇచ్చారు. తరువాత హీలమన్ తన కుమారులకు చెప్పాడు:

“మన మొదటి తల్లిదండ్రుల యొక్క పేర్లను నేను మీకు ఇచ్చియున్నాను … మీరు మీ పేర్లను జ్ఞాపకము చేసుకొనునప్పుడు మీరు వారిని జ్ఞాపకము చేసుకొనునట్లు దీనిని నేను చేసియున్నాను; మీరు వారిని జ్ఞాపకము చేసుకొనునప్పుడు మీరు వారి క్రియలను జ్ఞాపకము చేసుకొనవచ్చును; … అవి మంచివని అది చెప్పబడి మరియు వ్రాయబడినవి.

“కాబట్టి, నా కుమారులారా, మీరు మంచిదైనది చేయవలెనని నేను కోరుచున్నాను.”1

నీఫై మరియు లీహైల పేర్లు వారి పూర్వీకుల మంచి కార్యములను జ్ఞాపకముంచుకొనుటకు, అదేవిధంగా మేలు చేయుటకు వారిని ప్రోత్సహించుటకు వారికి సహాయపడినవి.

సహోదరిలారా, మనము ఎక్కడ నివసిస్తున్నప్పటినీ, మనము ఏ భాష మాట్లాడుతున్నప్పటినీ, లేక మనము 8 లేక 108 సంవత్సరాల వారైనప్పటికినీ మనము ఒకే ఉద్దేశములను కలిగిన ప్రత్యేక పేరును పంచుకుంటాము.

“ఏలయనగా (మనలో) అనేకులు క్రీస్తులోనికి బాప్తీస్మము పొంది, క్రీస్తును ధరించుకొనిరి … ఏలయనగా (మనము) క్రీస్తు యేసునందు ఒక్కటిగా ఉన్నాము.”2

యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘ సభ్యులుగా, “బాప్తీస్మపు విధి ద్వారా … మనము మొదట క్రీస్తు నామమును మనపైకి తీసుకొనుటకు మన సమ్మతిని ప్రతిజ్ఞ చేసాము.”3 ఈ నిబంధన ద్వారా, మనము ఎల్లప్పుడు జ్ఞాపకముంచుకొనుటకు, ఆయన ఆజ్ఞలను పాటించుటకు, ఇతరులకు సేవ చేయుటకు వాగ్దానము చేసాము. మనము సంస్కారములో పాల్గొన్నప్పుడు, ఈ నిబంధనను పాటించుటకు మన సమ్మతి ప్రతీ ఆదివారము క్రొత్తదిగా చేయబడింది మరియు “నూతన జీవమును పొంది నడుచుకొనే,”4 దీవెన యందు మరొకసారి మరలా ఆనందించగలము.

పుట్టినప్పుడు మనమివ్వబడిన పేరు మన వ్యక్తిగత గుర్తింపును ప్రతిఫలించును, మన భూలోక కుటుంబాల లోపల సంబంధించుటను మనకిచ్చును. అయినప్పటికినీ, మనము బాప్తీస్మమందు “తిరిగి జన్మించినప్పుడు,” మనమెవరిమో మన అవగాహన విస్తరించబడింది. “మీరు చేసిన నిబంధన కారణముగా మీరు క్రీస్తు సంతానమని ఆయన కుమారులని, ఆయన కుమార్తెలని పిలువబడుదురు ఏలయనగా ఇదిగో, … ఆయన మిమ్ములను ఆత్మీయంగా కనియున్నాడు; ఏలయనగా ఆయన నామమందలి విశ్వాసము ద్వారా మీ హృదయములు మారినవని మీరు చెప్పుచున్నారు; కాబట్టి మీరు ఆయన ద్వారా జన్మించియున్నారు.”5

కాబట్టి, నిబంధన గుర్తింపు, సంబంధించుటతో, మనము యేసు క్రీస్తు నామము చేత పిలవబడుచున్నాము. మరియు “కేవలము సర్వశక్తిమంతుడైన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామమునందు మరియు ద్వారానే తప్ప నరుల యొక్క సంతానమునకు దాని ద్వారా రక్షణ వచ్చును, మరి ఏ ఇతర నామము లేక ఏ ఇతర మార్గము లేక సాధనము ఉండదు.”6

యేసు యొక్క నామము ఆయన పుట్టకముందే తెలియజేయబడింది. రాజైన బెంజిమెన్‌కు, ఒక దూత ప్రవచించెను, “ఆయన యేసు క్రీస్తని దేవుని యొక్క కుమారుడని పిలువబడును, … ఆయన తల్లి మరియ అని పిలువబడును.”7 ఆయన కార్యము “విమోచించు ప్రేమ”8 భూమి మీద సువార్త ఉన్నప్పుడు, ఆదాము, హవ్వల దినముల నుండి ప్రారంభించి, ప్రస్తుతం మన కాలము వరకు, దేవుని పిల్లలకు కూడా తెలియజేయబడింది, ఆవిధంగా వారు “వారి పాపముల యొక్క నివృత్తి కొరకు వారు ఏ మూలాధారమును చూడవలెనో,”9 తెలుసుకొందురు.

గత సంవత్సరము, అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ సహోదరీలకు “చెదరిపోయిన ఇశ్రాయేలును సమకూర్చుటకు సహాయపడుట ద్వారా భవిష్యత్తును రూపించుమని” “ఒక ప్రవచనాత్మక మనవిని” ఇచ్చారు. ఆయన మనల్ని మోర్మన్ గ్రంధము చదవమని, “రక్షకుని గూర్చి మాట్లాడు లేక రక్షకునికి సూచించు ప్రతీ వచనమును గుర్తించుము” అని ఆహ్వానించారు. ఆయన మనము “క్రీస్తును గూర్చి మాట్లాడుట గురించి ఉద్దేశ్యపూర్వకంగా ఉండమని, క్రీస్తునందు ఆనందించమని, (మన కుటుంబము) స్నేహితులతో క్రీస్తును గూర్చి ప్రకటించుము,” అని అడిగారు. బహుశా ఆయన వాగ్దానము యొక్క ఫలములను మీరు గుర్తించుట ప్రారంభించియుంటారు, “మీరు, వారు రక్షకునికి దగ్గరవుతారు. … మార్పులు, అద్భుతములు కూడ, సంభవించుట ప్రారంభమగును.”10

రక్షకుని ఎల్లప్పుడు జ్ఞాపకముంచుకొనుటకు మన వాగ్దానము—మనము పెద్ద సమూహములో లేక మన ఏకాంత ప్రదేశాలలో ఉన్నప్పటికినీ, దేవునికి తప్ప వేరేవరికి మన క్రియలు తెలియని చోట సత్యము, నీతి కొరకు నిలబడుటకు మనకు బలము నిచ్చును. మనము ఆయనను, ఆయన నామమును జ్ఞాపకముంచుకొన్నప్పుడు, వ్యక్తిగతంగా-అవమానించు పోలికలు లేక అహంకారమైన విమర్శలు కొరకు మనకు స్థలముండదు. మన కన్నులు రక్షకునిపై ఉంచుటతో, మనము నిజముగా ఎవరిమో మనకై మనము చూస్తాము—దేవుని యొక్క ప్రేమించబడిన బిడ్డ.

మన నిబంధనను జ్ఞాపకముంచుకొనుట లోకసంబంధమైన చింతలను నెమ్మదిపరచును, స్వీయ- అనుమానము ధైర్యముగా మారును, శ్రమ కాలములలో నిరీక్షణను ఇచ్చును.

మనము తొట్రిల్లి, నిబంధన బాట వెంబడి మన అభివృద్ధిలో పడిపోయినప్పుడు, ఆయన నామమును మనపట్ల ఆయన ప్రేమగల దయను మాత్రమే మనము జ్ఞాపకముంచుకోవాలి. “ఏలయనగా ఆయన సమస్త శక్తి, సమస్త వివేకము, సమస్త గ్రహింపును కలిగియున్నాడు, ఆయన అన్ని సంగతులను గ్రహించును, మరియు పశ్చాత్తాపము పొంది మరియు ఆయన నామమందు విశ్వసించు వారికి … .ఆయన కనికరముగల వ్యక్తియై యున్నాడు.”11 నిశ్చయముగా, విరిగిన హృదయము నలిగిన ఆత్మతో, “ఉత్తమంగా చేయుటకు, ఉత్తమంగా ఉండుటకు,”12 కోరిన వారందరికి యేసు నామము కంటే మధురమైన ధ్వని ఏదీ లేదు.

అధ్యక్షులు నెల్సన్ బోధించారు: “మీరు నిశ్శబ్దంగా, సౌకర్యముగల క్రైస్తవునిగా ఉండే రోజు పోయింది. మీ మతము ఆదివారము సంఘములో కనబడుట గూర్చినది మాత్రమే కాదు. అది ఆదివారము ఉదయమునుండి శనివారము రాత్రి వరకు నిజమైన శిష్యులుగా కనబడుట గూర్చినది. … ప్రభువైన యేసు క్రీస్తుకు ‘సగము-కాలము’ శిష్యునిగా ఉండుట వంటి విషయము లేదు.”13

క్రీస్తు యొక్క నామమును మనపై తీసుకొనుటకు మన సమ్మతి మర్యాదప్రకారమైన మాటలను ఇచ్చిపుచ్చుకొనుట కంటే ఎక్కువైనది. అది ఊరక చేయబడిన వాగ్దానము లేక సంప్రదాయ వివాదము కాదు. అది ప్రకరణం యొక్క ఆచారము లేక మనము ధరించే వాటి పత్రము పేరు కాదు. మనము కేవలము ఒక అల్మారాలో ఉంచే లేక గోడమీద వేలాడదీసే సామెత కాదు. ఆయన నామము “ధరించబడింది,”14 మన హృదయాలలో వ్రాయబడింది, “(మన) ముఖములపై చెక్కబడింది “15

మన ఆలోచనలు, క్రియలు, ఇతరులతో పరస్పర చర్యల ద్వారా ఎల్లప్పుడు రక్షకుని ప్రాయశ్చిత్తః త్యాగము జ్ఞాపకముంచుకోబడాలి. ఆయన మన పేర్లను, మాత్రమే కాదు, కానీ ఆయన మనల్ని ఎల్లప్పుడు జ్ఞాపకముంచుకుంటాడు. రక్షకుడు ఇలా ప్రకటించారు:

“ఏలయనగా ఒక స్త్రీ ఆమె తన గర్భమున పుట్టిన కుమారునిపై కనికరము లేక యుండునట్లు తన పాలు తాగు చంటిబిడ్డను మరువగలదా? అవును, వారు మరచి పోవచ్చును, అయినప్పటికినీ ఓ ఇశ్రాయేలు వంశమా నేను నిన్ను మరువను.”

“ఇదిగో నేను, నిన్ను నా అరచేతుల మీదుగా చెక్కితిని, నీ ప్రాకారములు నిరంతరము నా యెదుటనున్నవి.”16

అధ్యక్షులు జార్జ్ ఆల్బర్ట్ స్మిత్ బోధించారు, “మీరు వహించే పేర్లను ఘనపరచుము, ఎందుకనగా ఎదోఒకరోజు మీరు. [ఆ పేర్లతో] మీరు ఏమి చేసారో … మీ పరలోకమందున్న తండ్రికి … తెలియజేసే విశేషావకాశము మరియు బాధ్యతను కలిగియున్నారు.”17

జాగ్రత్తగా ఎంపిక చేసిన నీఫై మరియు లీహైల పేర్ల వలే, మనము ప్రభువైన యేసు క్రీస్తు యొక్క నిజమైన శిష్యులమని మన గురించి చెప్పబడి, వ్రాయబడునా? మనపై సమ్మతిగా మనము తీసుకొన్న యేసు క్రీస్తు నామమును మనము ఘనపరుస్తున్నామా? మనము ఆయన ప్రేమగల దయ, ఆయన విమోచించు శక్తి యొక్క “ఒక పరిచారకులు మరియు సాక్షిగా ఉన్నామా?”18

కొంతకాలం క్రితం, నేను మోర్మన్ గ్రంధమును వింటున్నాను. 2 నీఫై చివరి అధ్యాయములో, నేను నీఫై చెప్పుచున్న దానిని విన్నాను దానిని నేను ఇంతకు ముందు ఎన్నడూ అదేరీతిలో చదవలేదు. అతడి గ్రంధమంతటా, అతడు “విమోచకుడు,” “ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధుడు,” “దేవుని యొక్క గొఱ్ఱెపిల్ల,” “మెస్సయా,” గూర్చి సాక్ష్యమిచ్చాడు మరియు బోధించాడు. కాని అతడు తన వృత్తాంతమును ముగించినప్పుడు, అతడు ఈ మాటలను చెప్పుట నేను విన్నాను: “నేను స్పష్టతయందు అతిశయించుచున్నాను, నేను సత్యమునందు అతిశయించుచున్నాను, నేను నా యేసు నందు అతిశయించుచున్నాను, ఏలయనగా ఆయన నా ఆత్మను నరకము నుండి విమోచించియున్నాడు.”19 నేను ఈ మాటలను విన్నప్పుడు, నా హృదయము ఉల్లసించెను మరియు నేను మరలా, మరలా విన్నాను. నా స్వంత పేరును నేను గుర్తించి, స్పందించినట్లుగా, ఆ వచనమును నేను గుర్తించాను మరియు స్పందించాను.

ప్రభువు చెప్పారు, “అవును నా నామమును ధరించుటకు ఇష్ఠపడుచున్న ఈ జనులు ధన్యులు, ఏలయనగా నా నామమందు వారు పిలువబడుదురు మరియు వారు నావారు.”20

యేసు క్రీస్తు యొక్క కడవరి పరిశుద్ధుల సంఘ సభ్యులుగా మనము, ఆయన నామమును ప్రేమ, భక్తి, మంచి కార్యములతో ఘనపరచుట ద్వారా “క్రీస్తు నామము (మనపై) సంతోషముగా తీసుకొందామా.”21 ఆయన “దేవుని యొక్క గొఱ్ఱెపిల్ల, నిజముగా నిత్యుడైన తండ్రి యొక్క కుమారుడు కూడ”22 అని నేను సాక్ష్యిమిస్తున్నాను. ఆయన పరిశుద్ధ బిడ్డయైన యేసు క్రీస్తు నామములో, ఆమేన్.