2010–2019
రెండు గొప్ప ఆజ్ఞలు
2019 అక్టోబర్ సర్వసభ్య సమావేశము


రెండు గొప్ప ఆజ్ఞలు

ఈ రెండు గొప్ప ఆజ్ఞలను మనం పాటించేందుకు తప్పక ప్రయత్నించాలి. ఆవిధంగా చేయుటకు, మనం చట్టానికి, ప్రేమకు మధ్య సమన్వయం సాధించాలి.

యేసు క్రీస్తు సువార్తలో నా ప్రియమైన సహోదరీలారా, నిత్య కుటుంబములో దైవికంగా నియమించబడిన కావలివారిగా మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. “కుటుంబాలు ఏర్పాటు చేయబడి, బంధించబడి, శాశ్వతంగా మహోన్నత స్థితికి ఎదుగునట్లు ఈ సంఘము పునఃస్థాపించబడిందని అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ మనకు బోధించారు.”1 ఎల్‌జిబిటి గా సూచించబడే స్త్రీ స్వలింగ సంపర్కులు, స్వలింగ సంపర్కులు, ద్విలింగులు, లేక లింగమార్పిడి చేసుకున్న వ్యక్తుల కొరకు ఆ బోధన ముఖ్యమైన గుఢార్ధములను కలిగియున్నది.2 “ఒకరినొకరు ప్రేమించడానికి ఎల్లప్పుడూ ఒకరినొకరితో ఏకీభవించాల్సిన” అవసరములేదని అధ్యక్షులు నెల్సన్ కూడా మనకు గుర్తుచేసారు. 3 పిల్లలు మరియు యువత అడిగే ప్రశ్నలకు జవాబివ్వడానికి కుటుంబ చర్చల కొరకు ఈ ప్రవచనాత్మక బోధనలు ముఖ్యమైనవి. ఈ శ్రోతలతో మాట్లాడుటకు నేను ప్రార్థనాపూర్వకంగా ప్రేరేపణను వెదికాను, ఎందుకంటే సంఘంలోని ప్రతి కుటుంబాన్ని ప్రత్యక్షంగా లేక పరోక్షంగా ప్రభావితం చేసే ఈ ప్రశ్నలతో మీరు ప్రత్యేకంగా ప్రభావితం చేయబడ్డారు.

I.

యేసు బోధించిన రెండు గొప్ప ఆజ్ఞలతో నేను ప్రారంభిస్తాను.

“నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను.

“ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ.

“నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దానివంటిదే.” 4

దీనర్థం ప్రతిఒక్కరిని ప్రేమించాలని మనం ఆజ్ఞాపించబడ్డాము, ఎందుకంటే ప్రతిఒక్కరు మన పొరుగువారని యేసు చెప్పిన మంచి సమరయుని ఉపమానం బోధిస్తుంది. 5 కానీ ఈ రెండవ ఆజ్ఞను పాటించాలనే ఉత్సాహంలోమొదటిదైన, మన పూర్ణహృదయముతోను, పూర్ణాత్మతోను, పూర్ణమనస్సుతోను, దేవుని ప్రేమించాలనే మొదటి ఆజ్ఞను మరచిపోకూడదు. “[ఆయన] ఆజ్ఞలను పాటించడం” ద్వారా ఆ ప్రేమను మనం చూపుతాం. 6 ఆయన ఆజ్ఞలను మనం పాటించాలని దేవుడు కోరుతున్నాడు, ఎందుకంటే పశ్చాత్తాపము కలిగిన విధేయత ద్వారానే, ఆయన సన్నిధిలో జీవించడానికి మనం తిరిగి వెళ్ళగలము మరియు ఆయన వలే పరిపూర్ణులం కాగలము.

ఇటీవల సంఘ యౌవనులకు ఇచ్చిన తన ప్రసంగంలో, అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్, “దేవుని యొక్క ప్రేమ మరియు ఆయన చట్టాల మధ్యగల బలమైన సంబంధం” అని ఆయన పిలిచిన దాని గురించి మాట్లాడారు. 7 ఎల్‌జిబిటి గా గుర్తించబడిన వారికి సంబంధించిన సమస్యలకు అతి ముఖ్యంగా అన్వయించదగిన చట్టము, దేవుని యొక్క వివాహ చట్టము మరియు దానితోపాటు ఉన్న పవిత్రత చట్టము. ఆయన పిల్లల కొరకు మన పరలోకమందున్న తండ్రి యొక్క రక్షణ ప్రణాళికలో రెండూ ఆవశ్యకమైనవి. అధ్యక్షులు నెల్సన్ బోధించినట్లుగా, “దేవుని యొక్క చట్టాలు మన పట్ల ఆయనకు గల అంతములేని ప్రేమచేత మరియు మనం సాధ్యమైనంత మంచివారిగా కావాలనే ఆయన కోరిక చేత పూర్తిగా ప్రేరేపించబడ్డాయి.”8

అధ్యక్షులు నెల్సన్ బోధించారు: “అనేక దేశాలు … స్వలింగ- వివాహమును చట్టపరము చేసాయి. సంఘ సభ్యులుగా, మనం చట్టబద్ధమైన వివాహంతో … పాటు దేశ చట్టాలను గౌరవిస్తాం. అయినప్పటికీ, నిజం ఏమిటంటే, ఆరంభంలో. … వివాహము దేవునిచేత నియమించబడింది! మరియు ఈరోజు వరకు అది స్త్రీ, పురుషుల మధ్యేనని ఆయనచేత నిర్వచించబడింది. వివాహం గురించి ఆయన నిర్వచనాన్ని దేవుడు మార్చలేదు.”

అధ్యక్షులు నెల్సన్ కొనసాగించారు: “ఆయన పవిత్రత చట్టాన్ని కూడా దేవుడు మార్చలేదు. దేవాలయమును ప్రవేశించుటకు అర్హతలు మారలేదు. 9

“సత్యాన్ని మాత్రమే బోధించడము అపొస్తలులుగా మా బాధ్యత అని అధ్యక్షులు నెల్సన్ మనందరికి గుర్తుచేసారు. ఆ బాధ్యత దైవిక చట్టాన్ని మార్చడానికి [అపొస్తులులకు] అధికారాన్ని ఇవ్వదు.”10 కాబట్టి, నా సహోదరిలారా, సంఘ నాయకులు ఎల్లప్పుడూ స్త్రీ, పురుషుల మధ్య వివాహం యొక్క ప్రత్యేక ప్రాముఖ్యత మరియు దానికి సంబంధించిన పవిత్రత చట్టం గురించి బోధించాలి.

II.

యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘము యొక్క కార్యమేదనగా, దేవుని పిల్లలను సిలెస్టియల్ రాజ్యం కొరకు, ప్రత్యేకించి దాని అత్యున్నత మహిమయైన, ఉన్నత స్థితి లేక నిత్యజీవం కొరకు సిద్ధపరచుట తుది చింతగా ఉన్నది. నిత్యత్వం కొరకైన వివాహం ద్వారా మాత్రమే, ఆ అత్యున్నత గమ్యం సాధ్యమవుతుంది. 11 “శాశ్వతంగా, ఎప్పటికీ సంతానం కొనసాగునని”13 ఆధునిక బయల్పాటు వివరించినట్లుగా—నిత్యజీవమనేది స్త్రీ మరియు పురుషుల కలయకలో అంతర్లీనంగా ఉన్న సృజనాత్మక శక్తులను కలిపియున్నది.12

యుక్తవయస్సుగల యౌవనులకు తన ప్రసంగములో, అధ్యక్షులు నెల్సన్ బోధించారు, “దేవుని యొక్క చట్టములకు కట్టుబడియుండుట మీరు తుది మహోన్నత స్థితివైపు పురోభివృద్ధి చెందినప్పుడు, మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతుంది”14—అది, ఉన్నత స్థితి పొందిన జీవితము మరియు మన పరలోక తల్లిదండ్రుల యొక్క దైవిక సాధ్యతతో, దేవుని వలే అగుట. మనం ప్రేమించే వారందరి కొరకు మనం కోరుకొనే గమ్యం అదే. ఆ ప్రేమ వలన, మనం ప్రేమించే వారికి గొప్ప సంతోషాన్నివ్వగలవని మనకు తెలిసిన దేవుని ఆజ్ఞలు, ప్రణాళిక మరియు కార్యాన్ని మన ప్రేమ మించిపోయేలా మనం అనుమతించరాదు.

కానీ మనం ప్రేమించేవారు అనేకులున్నారు, వారిలో కొందరు పునఃస్థాపించబడిన సువార్తను కలిగియున్నారు, వివాహం మరియు పవిత్రత చట్టం గురించిన దేవుని ఆజ్ఞలందు నమ్మనివారు లేక అనుసరించుటకు ఎన్నుకొనని వారు ఉన్నారు. వారి సంగతేమిటి?

మనమందరం ఆయన పిల్లలమని, సంతోషము కలిగియుండుటకు ఆయన మనల్ని సృష్టించారని దేవుని యొక్క సిద్ధాంతం చూపుతుంది. 15 దేవుడు మర్త్య అనుభవం కోసం ఒక ప్రణాళికను ఏర్పాటు చేసాడని, అందులో ఆయన ఉన్నతమైన దీవెనలను పొందేలా అందరు విధేయతను ఎంపిక చేయవచ్చు లేదా తక్కువ మహిమగల రాజ్యాలలో ఒకటికి నడిపించినట్లు ఎంపికలు చేయవచ్చని ఆధునిక బయల్పాటు బోధిస్తుంది. 16 తన పిల్లలందరి కొరకు దేవుని యొక్క గొప్ప ప్రేమ కారణంగా, ఆ తక్కువ మహిమ రాజ్యాలు కూడా మనుషులు గ్రహించగలిగిన దానికంటే ఎక్కువ అద్భుతంగా ఉంటాయి. 17 ఆయన “తండ్రిని మహిమపరుస్తారు, మరియు ఆయన హస్తముల కార్యములన్నిటిని రక్షించినప్పుడు,” యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తఃము ఈ సమస్తమును సాధ్యం చేస్తుంది. 18

III.

నేను మొదటి ఆజ్ఞ గురించి మాట్లాడాను, కానీ రెండవ దాని సంగతేమిటి? మన పొరుగువారిని ప్రేమించాలనే ఆజ్ఞను మనమెలా పాటిస్తాం? స్త్రీ స్వలింగ సంపర్కులు, స్వలింగ సంపర్కులు, లింగమార్పిడి చేసుకున్నవారు, ద్విలింగుల బోధనలను, చర్యలను అనుసరించేవారిని, మన పొరుగువారందరి పట్ల చూపాలని రక్షకుడు మనకు ఆజ్ఞాపించినటువంటి ప్రేమతో ఆదరించాలని మా సభ్యులను ఒప్పించటానికి మేము ప్రయత్నిస్తాము. కాబట్టి, అమెరికా సంయుక్త రాష్ట్రాలలో స్వలింగ-వివాహము చట్టపరమైనదిగా ప్రకటించబడినప్పుడు, ప్రధమ అధ్యక్షత్వము మరియు పన్నెండుమంది అపొస్తులుల కోరము ప్రకటించారు: “మనము సమ్మతించనప్పుడు కూడా—సమస్త జనులను ప్రేమించి మరియు దయతో, మర్యాదతో ఆదరించాలని యేసు క్రీస్తు యొక్క సువార్త మనకు బోధించును. స్వలింగ వివాహానికి సమ్మతించే చట్టాలను లేక కోర్టు నియమాలను ఉపయోగించుకొనే వారిని అగౌరవంగా చూడరాదని మేము దృఢంగా చెప్తున్నాము.”19

ఇంకను, మన నమ్మకాలను, నిబద్ధతలను పంచుకోని వారిని మనమెన్నడూ హింసించరాదు. 20 విచారకరముగా, ఈ పరిస్థితులను ఎదుర్కొంటున్న వారిలో కొందరు మన కుటుంబాలు, వార్డులు, స్టేకులలో కొందరు సభ్యులు మరియు నాయకుల చేత అణచివేయబడి, తిరస్కరించబడుతున్నారు. మనమందరం దయగా, ఎక్కువ మర్యాదగా ఉండేందుకు తప్పక ప్రయాసపడాలి.

IV.

మన మర్త్య అనుభవాలలో వేర్వేరు సవాళ్ళు మనము కలిగియుండటానికి గల కారణాలు మనకు తెలియకపోవచ్చు. కానీ మనఃపూర్వకంగా ఆయన సహాయాన్ని వెదికితే, ఈ సవాళ్ళను జయించడానికి మనలో ప్రతిఒక్కరికి దేవుడు సహాయపడతాడని మనకు తెలుసు. మనకు బోధించబడిన చట్టాలను అతిక్రమించినందుకు బాధపడి, పశ్చాత్తాపపడిన తర్వాత, మనందరికి ఏదో ఒక మహిమ రాజ్యం కేటాయించబడుతుంది. చివరి మరియు అంతిమ తీర్పు దేవునిదే, ఆయనకు మాత్రమే మనలో ప్రతీఒక్కరికి తీర్పుతీర్చడానికి కావలసిన తెలివి, జ్ఞానము, మహిమ ఉన్నాయి.

ఈలోపు, మనం రెండు గొప్ప ఆజ్ఞలను పాటించడానికి తప్పక ప్రయత్నించాలి. ఆవిధంగా చేయుటకు, ఆజ్ఞలను పాటిస్తూ, నిబంధన బాటపై నడుస్తూ, మార్గంలో మన పొరుగువారిని ప్రేమిస్తూ—చట్టము మరియు ప్రేమకు మధ్య మనము సమన్వయం పాటించాలి. ఈ ప్రక్రియలో దేనికి సహకారమివ్వాలి, దేనిని వ్యతిరేకించాలి, ఎలా ప్రేమించాలి, గౌరవంగా ఎలా వినాలి, ఎలా బోధించాలి అనే దాని గురించి మనం దైవిక ప్రేరేపణను వెదకటం ఈ సమన్వయానికి అవసరం. ఆజ్ఞల విషయంలో రాజీపడకూడదు, కానీ సంపూర్ణమైన పరిమాణంలో గ్రహింపును మరియు ప్రేమను చూపాలని మన సమన్వయం కోరుతుంది. మన సమన్వయంలో వారి లైంగిక ధోరణి గురించి సందేహాలున్న పిల్లలను గూర్చి ఆలోచనాత్మకంగా ఉండాలి, కానీ అది ముందే వారిపై ఒక నిర్ణయానికి వచ్చుటను ఆపుతుంది, ఎందుకంటే చాలామంది పిల్లల్లో, అటువంటి సందిగ్ధత కాలం గడిచే కొద్దీ విశేషంగా తగ్గిపోతుంది. 21 మన సమన్వయం నిబంధన బాటనుండి దూరమవ్వడాన్ని వ్యతిరేకిస్తుంది, మరియు ప్రభువు నుండి మనుష్యులను దూరం చేసే వారెవరికైనా అది సహాయమును నిరాకరించును. వీటన్నిటిలోను ఆయన ఆజ్ఞలను పాటించే వారందరి కొరకు దేవుడు నిరీక్షణను, అంతిమ ఆనందాన్ని, మరియు దీవెనలను వాగ్దానం చేసారని మనం గుర్తుంచుకుంటాం.

V.

తల్లులు, తండ్రులు మరియు మనమందరం ఈ రెండు గొప్ప ఆజ్ఞలను బోధించాల్సిన బాధ్యత కలిగియున్నాము. సంఘ స్త్రీల కొరకు, అధ్యక్షులు స్పెన్సర్ డబ్ల్యూ. కింబల్ ఈ గొప్ప ప్రవచనములో ఆ బాధ్యతను వివరించారు: “కడవరి దినాలలో సంఘములో కలిగే ప్రధాన వృద్ధిలో అధికము లోకములోని అనేకమంది మంచి స్త్రీలు … సంఘమునకు విస్తారమైన సంఖ్యలో ఆకర్షించబడుట వలన కలుగును. సంఘము యొక్క స్త్రీలు తమ జీవితాలలో నీతియుక్తతను, స్పష్టమైన సంభాషణలను ప్రతిబింబించి మరియు లోకము యొక్క స్త్రీల నుండి … సంఘ స్త్రీలు ప్రత్యేకంగా, వేరుగా చూడబడేంత వరకు ఇది జరుగుతుంది. … కాబట్టి కడవరి దినాలలో సంఘము యొక్క సంఖ్యలో మరియు ఆత్మీయాభివృద్ధిలో రెండిటిలో సంఘము యొక్క స్త్రీల మాదిరులు ప్రాముఖ్యమైన శక్తిగా ఉంటాయి.”22

ఆ ప్రవచనం గురించి మాట్లాడుతూ, “అధ్యక్షులు కింబల్ ముందుగా చూసినది ఈ రోజేనని, అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ప్రకటించారు. ఆయన ముందుగా చూసిన స్త్రీలు మీరే!”23 ఈ సంఘ స్త్రీలు కాపాడేవారిలో ప్రస్తుతం లోక ప్రాధాన్యతలచేత, దుష్ట వక్రీకరణల చేత ప్రభావితం చేయబడిన వారి స్వంత ప్రియమైన మిత్రులు మరియు కుటుంబము ఉండవచ్చని 40 ఏళ్ళ క్రితం ఆ ప్రవచనాన్ని వినిన మాలో ఎవరూ గ్రహించలేదు. ఆ ప్రవచనాన్ని నెరవేర్చడానికి మీరు బోధించాలని, పనిచేయాలని నా ప్రార్థన మరియు దీవెన, యేసు క్రీస్తు నామములో ఆమేన్.