2010–2019
సందేశము, కారణము మరియు జనసమూహము
2019 అక్టోబర్ సర్వసభ్య సమావేశము


సందేశము, కారణము మరియు జనసమూహము

మన కాలములో స్థిరముగా ఉండు కరకర ధ్వనులు, క్రీస్తును మన జీవితాల యొక్క, మన విశ్వాసము యొక్క మరియు మన సేవ యొక్క కేంద్రముగా చూచుటకు మనము ప్రయాసపడతామని ఆశిస్తున్నాను.

సహోదర, సహోదరిలారా, ఇది గత ఏప్రిల్‌లో తన గృహములో సర్వసభ్య సమావేశము చూస్తున్న ఏడు నెలల వయస్సుగల స్యామీ హో చింగ్.

చిత్రం
స్యామీ హో చింగ్ సర్వసభ్య సమావేశమును చూస్తున్నాడు.

అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ మరియు ఇతర ప్రధాన అధికారులను ఆమోదించుటకు సమయము వచ్చినప్పుడు, తన పాలసీసాను పట్టుకొనుటలో స్యామీ చేతులు తీరికలేకుండా ఉన్నాయి. కాబట్టి అతడు ఆ తరువాత చెయ్యగల ఉత్తమమైన పని చేసాడు.

చిత్రం
ఆమోదిస్తున్నప్పుడు స్యామీ హో చింగ్

మీ కాళ్ళతో ఓటు వెయ్యండి అనే భావనకు స్యామీ పూర్తిగా క్రొత్త అర్థాన్ని ఇస్తున్నాడు.

యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము యొక్క అర్థ వార్షిక సర్వసభ్య సమావేశానికి స్వాగతం. సంవత్సరములో రెండు సార్లు జరిగే సమావేశాలకు అర్థమును చర్చించుటకు సందర్భమును చెప్పుటకు, క్రొత్త నిబంధన వృత్తాంతము లూకాలో ఈ దృశ్యాన్ని నేను ఆలోచించాలని కోరుతున్నాను.1

“[యేసు] యెరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గ్రుడ్డివాడు త్రోవప్రక్కన కూర్చుండి భిక్షమడుగుకొను చుండెను:

“… [ఒక] జనసమూహము దాటిపోవుచున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా

“… వారు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్లుచున్నాడని వానితో చెప్పిరి.

“అప్పుడు వాడు యేసూ, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలువేయగా”

అతని ధైర్యాన్ని చూసి, జనసమూహము వానిని నెమ్మదిపరచుటకు ప్రయత్నించిరి గాని, “వాడు మరి ఎక్కువగా కేకలు వేసెను,” అని చెప్పును. అతని పట్టుదల ఫలితంగా, అతడు యేసు వద్దకు తేబడెను, తన చూపును తిరిగి పొందుటకు విశ్వాసముతో నిండిన అతని విన్నపమును విన్న ఆయన, అతనిని స్వస్థపరచెను.2

నేను చదివిన ప్రతిసారి ఈ చిన్న నిజ జీవితపు అనుభవము చేత నేను ప్రేరేపించబడతాను. ఈ మనుష్యుని వ్యాకులతను మనం గ్రహించవచ్చును. రక్షకుని ఆసక్తిని మరల్చుటకు వాడు కేకలు వేయటను మనం దాదాపు వినవచ్చు. ఊరకుండుటకు అతడు నిరాకరించుట గురించి-నిజానికి, మిగతా వాళ్ళంతా తన స్వరాన్ని తగ్గించమని చెప్తున్నప్పుడు, తన స్వరమెత్తి కేకలు వేయ్యాలనే తన పట్టుదల గురించి మనం చిరునవ్వు చిందిస్తాము. ఇది ఏ వివరణ అవసరము లేని చాలా పట్టుదల గల విశ్వాసము యొక్క మధురమైన కథ. కాని ఇతర లేఖనములవలె, ఎంత ఎక్కువగా మనం చదువుతామో, అంత ఎక్కువ దానిలో మనం కనుగొంటాము.

ఇటీవలే నాపైన చాలా ప్రభావం చూపిన ఒక ఆలోచన ఏమిటంటే అతడి చుట్టూ ఆత్మీయంగా సున్నితంగా ఉన్న జనులు ఉన్నారనేది ఈ మనుష్యుడు కలిగియున్న మంచి అవగాహన. ఈ కథ యొక్క ప్రాముఖ్యతంతా అజ్ఞాత స్త్రీ పురుషులు తమ తోటివాడు “ఈ అలజడికి కారణం ఏమిటి?” అని అడిగినప్పుడు ఆ చప్పుడుకు కారణం క్రీస్తు అని గుర్తించే జ్ఞానాన్ని కలిగియుండటం; రక్షకుడు తానే ఆ చప్పుడుకు కారణము. ఈ క్లుప్త సంభాషణ నుండి మనలో ప్రతి ఒక్కరము కొంత నేర్చుకోగలము. విశ్వాసము, దృఢసంకల్పముల విషయములో, వాటిని కలిగియున్నవారిని మీ ప్రశ్నను అడుగుట ఉత్తమము. “గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి దారి చూపగలడా?” అని యేసు ఒక సారి ప్రశ్నించెను. “[అట్లయిన యెడల,] వారిద్దరును గుంటలో పడుదురు గదా?”3

ఈ సర్వ సభ్య సమావేశాలకు హాజరగుటకు గల ఉద్దేశము ప్రతి ఒక్కరిలో అటువంటి విశ్వాసము, దృఢసంకల్పమును వృద్ధిచేయుట, మరియు నేడు మాతో చేరుట వలన ఈ అన్వేషణే ప్రతి ఒక్కరిచేత పంచుకోబడిన ఒక ఉద్దేశమని మీరు తెలుసుకుంటారు. మీ చుట్టూ చూడండి. ఈ ప్రదేశములో ప్రతీ దిశ నుండి అన్నిపరిమాణములు కలిగిన కుటుంబాలను మీరు చూస్తారు. పాత స్నేహితులు సంతోషకరమైన కలయికతో హత్తుకుంటారు, మనోహరమైన గాయకబృందం సిద్ధపడుతుంటారు మరియు ఆందోళన కారులు చెక్క పెట్టెలపైన నిలబడి ఈ బోధనలు తప్పని ఒప్పించుటకు ప్రయత్నిస్తూ ఉంటారు. గతంలో సేవ చేసి తిరిగి వచ్చిన సువార్త పరిచారకులు తమతో పనిచేసిన సహచరుల గురించి వెతుకుతారు, అయితే ఇటీవల తిరిగి వచ్చిన సువార్తపరిచారకులు సరికొత్త సహచరుల కొరకు వెతుకుతారు (నేను చెప్పేది మీకు అర్థం అయ్యింది అనుకుంటాను!) మరి ఛాయాచిత్రాల సంగతేంటి? పరలోకము మనల్ని రక్షించాలి! (హాస్యభరితమైనది) ప్రతి ఒక్కరు సెల్‌ఫోన్‌లు కలిగియున్నారు కాబట్టి “ప్రతి సభ్యుడు ఒక సువార్తపరిచారకుడు” అనే దానినుండి “ప్రతి సభ్యుడు ఒక ఛాయచిత్రగ్రాహకుడు” గా మారింది. ఇటువంటి సంతోషకరమైన అలజడి మధ్యలో, “దాని అర్ధము ఏమిటి?” అని ఒకరు న్యాయముగా అడుగవచ్చును.

క్రొత్త నిబంధన కథలో వలె, ఎవరైతే జ్ఞానముతో దీవించబడ్డారో వారు, ఈ సమావేశము సాంప్రదాయకంగా మనకు సమస్తమును అందించినప్పటికి, యేసే మన ఆచారాలకు కేంద్రమని గ్రహిస్తే తప్ప దీనికి స్వల్పమైన లేదా ఏ అర్థము ఉండదని గుర్తిస్తారు. మనం వెదికే జ్ఞానమును, ఆయన వాగ్దానము చేసిన స్వస్థతను, ఇక్కడ ఉన్నది అని మనం ఏదోవిధంగా తెలుకున్న ప్రాముఖ్యతను పొందుటకు, ఈ అలజడి—అది ఆనందంగా ఉన్నప్పటికి—దానిచేత మళ్లించబడకుండా, ఆయనపైన మన దృష్టిని సారించాలి. ప్రతి ప్రసంగీకుని ప్రార్థన, పాడిన వారందరి నిరీక్షణ, ప్రతి అతిధి యొక్క భక్తితో కూడిన గౌరవము—అన్నీ ఆయన ఆత్మను అనగా ఈ సంఘము ఎవరిదో ఆయన అనగా సజీవుడైన క్రీస్తు, దేవుని గొర్రెపిల్ల, సమాధానకర్త యొక్క ఆత్మను ఆహ్వానించుటకు అంకితం చేయబడినవి.

కానీ ఆయనను వెదకుటకు మనం సమావేశ మందిరములోనే ఉండనవసరం లేదు. ఒక బిడ్డ మొదటి సారి మోర్మన్ గ్రంథము చదివినప్పుడు అబినడై ధైర్యము లేదా 2,000 మంది యౌవ్వన యోధుల గురించి చాలా ఆనందించినప్పుడు, ఈ అద్భుతమైన గ్రంథములో అతి ముఖ్యమైన, ఎల్లప్పుడు ఉండే వ్యక్తి, మరియు దానిలో ప్రతీ పేజీలో వాస్తవంగా ప్రేరేపణను కలిగించు, ప్రభావమును చూపించే రక్షకుడు మరియు దానిలో విశ్వాసమును పెంచు వ్యక్తులందరిని కలుపు లింకు యేసు అని మనం మృదువుగా జతపరచవచ్చును.

ఆ విధంగానే, ఒక స్నేహితుడు మన విశ్వాసము గురించి నేర్చుకొనుచున్నప్పుడు, ఆమె లేదా అతడు కొన్నిఅసమానమైన మూలకాలు, మతపరమైన ఆచరణల యొక్క పరిచయములేని పదాలు—ఆహార సంబంధమైన ఆంక్షలు, స్వశక్తిపై-ఆధారపడు సరఫరాలు, అగ్రగాముల పర్వతారోహణము, డిజిటల్ కుటుంబ వృక్షాలు, చాలా సంఖ్యలో ఉన్న స్టేకు కేంద్రాల వల్ల ఒకరు రుచికరమైన మాంసము వడ్డించబడుతుందని తప్పకుండా ఊహించుకుని కాస్త ముంచివేయబడినట్లుగా భావిస్తారు. కాబట్టి మన స్నేహితులు వారికి క్రొత్తగా ఉండే అనేక విషయాలను విన్నప్పుడు, అలజడి గంధరగోళమును కలిగించు విషయాలపైన వారు దృష్టిసారించకుండా, వాటి యొక్క అర్థాన్ని, ఉద్దేశాన్ని వారు అర్థము చేసుకొనుటకు మరియు నిత్య సువార్త యొక్క ముఖ్య ఉద్దేశమైన—పరలోక తల్లిదండ్రుల ప్రేమ, దివ్యమైన కుమారుని ప్రాయశ్చిత్త వరము, పరిశుద్ధాత్మ యొక్క ఆదరించు నడిపింపు, ఈ సమస్త సత్యముల యొక్క కడవరి దిన పునఃస్థాపన ఇంకా ఎన్నో వాటి గురించి అర్థము చేసుకొనుటకు వారికి సహాయం చెయ్యాలి.

మొదటిసారి ఎవరైనా పరిశుద్ధ దేవాలయమునకు వెళ్తున్నప్పుడు, అతడు లేదా ఆమె ఆ అనుభవము గురించి విస్మయము చెందవచ్చును. మన కర్తవ్యం ఏమిటంటే ఎవరినైతే పూజించుటకు మనం అక్కడ ఉన్నామో ఆ రక్షకుని వైపు దృష్టిసారించునట్లు పరిశుద్ధ చిహ్నాలు, బయలుపరచబడిన ఆచారక్రియలు, ఆచారమైన దుస్తులు, దృశ్యసంబంధమైన ప్రదర్శనలు ఉండాలే తప్ప వాటినుండి దృష్టి మరలకుండా మనం జాగ్రత్త తీసుకోవాలి. దేవాలయము ఆయన గృహము, మరియు మన మనస్సులలో మిక్క ముఖ్యమైన వ్యక్తిగా ఆయన ఉండాలి—ముఖ ద్వారము వద్ద చెక్కబడిన దానిని చదవడం దగ్గర నుండి ఆ భవనములో ఆఖరి క్షణం గడిపే వరకు—దేవాలయ విధులలో గోచరమైనట్లే, మన తనువంతా క్రీస్తు యొక్క ఘనమైన సిద్ధాంతముతో నిండి ఉండాలి. మనం ఎదుర్కొనే సంభ్రమాశ్చర్యాల మధ్య, అన్నిటికంటే ఎక్కువగా మనం దేవాలయములో యేసు యొక్క అర్థాన్ని చూడాలి.

ఇటీవల నెలలలో సంఘములో చేయబడిన అనేకమైన ధైర్యముగల ప్రథమయత్నములు, క్రొత్త ప్రకటనలను పరిగణించండి. మనం ఒకరికొకరు పరిచర్య చేసినప్పుడు, లేదా సబ్బాతు దిన అనుభవాన్ని శుద్ధి చేసినప్పుడు, లేదా పిల్లలు మరియు యువత కొరకు ఒక క్రొత్త కార్యక్రమాన్ని ఉత్సాహంగా అంగీకరించినప్పుడు, అవి మన రక్షణ దుర్గముపైన ఎక్కువ స్థిరంగా కట్టుకొనుటకు సహాయము చేయుటకు పరస్పర సంబంధము కలిగిన వాటిగా చూడకుండా వాటిని వేరుగా, సంబంధములేనిగా చూచినప్పుడు ఈ బయల్పాటు సర్దుబాట్ల యొక్క నిజమైన కారణాన్ని మనం కోల్పోతాము. 4 నిశ్చయముగా, నిశ్చయముగా సంఘము యొక్క బయలుపరచబడిన పేరును మనం ఉపయోగించాలి అని అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ చెప్పినప్పుడు, ఆయన ఉద్దేశము ఇదే.5 యేసు—ఆయన పేరు, ఆయన సిద్ధాంతము, ఆయన మాదిరి, ఆయన దైవత్వము—మన ఆరాధనకు కేంద్రమైనప్పుడు, ఒకప్పుడు ఆల్మా చెప్పిన గొప్ప సత్యమును బలపరుస్తున్నాము: “అనేక పరిణామములు రావచ్చును; [కాని] ఇదిగో, వాటన్నిటికంటే అధిక ప్రాముఖ్యత కలిగినది ఒకటున్నది— … విమోచకుడు జీవించి [యుండి], మరియు తన జనుల మధ్య వచ్చును.”6

ఒక ముగింపు ఆలోచన: జోసెఫ్ స్మిత్ యొక్క 19వ- శతాబ్ధపు సరిహద్దు వాతావరణము క్రైస్తవ సాక్షులు ఒకరితో నొకరు పోటీపడు ఉత్సాహముగల సమూహములతో నిండియున్నది. 7 కాని వారు సృష్టించిన అల్లరిలో, ఈ ఉత్సాహముగల పునరుద్ధరణవాదులు పరిహాసముగా జోసెఫ్ స్మిత్ మనఃపూర్వకముగా వెదకిన ఆ రక్షకుని కనుగొనుట కష్టముగా చేసారు. “అంధకారము మరియు గంధరగోళము”8 అని తాను పిలిచిన పరిస్థితితో పోరాడుచు, ఒక వనములోనికి ఏకాంతముగా వెళ్ళి అక్కడ ఈ ఉదయమున ఇక్కడ ప్రస్తావించిన దేనికన్నా సువార్తకు ముఖ్యమైన రక్షకుని గూర్చి మరింత మహిమకరమైన సాక్ష్యమును చూచి, వినెను. అతడు ఊహించని, ముందుగా గ్రహించని దృష్టిగల వరముతో, జోసెఫ్ విశ్వము యొక్క గొప్ప దేవుడైన పరలోక తండ్రిని, మరియు ఆయన పరిపూర్ణమైన అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తును దర్శనములో చూచెను. తరువాత తండ్రి మనం ఈ ఉదయమున చర్చించుకొనుచున్న దాని యొక్క మాదిరిని ఉంచెను: ఆయన యేసు వైపు చూపించి ఇలా చెప్పాడు: “ఈయన నా ప్రియ కుమారుడు. ఆయనను ఆలకించుము!”9 యేసు యొక్క దైవిక గుర్తింపు, రక్షణ ప్రణాళికలో ఆయన సర్వోన్నత ప్రాధాన్యత, ఆయన గురించి దేవుని అభిప్రాయము ఆ క్లుప్తమైన ఏడు పదముల ప్రకటనను ఏ గొప్ప భావవ్యక్తీకరణ ఎప్పటికి అధిగమించలేదు.

అలజడి మరియు గందరగోళము ఏదైనా ఉన్నదా? జనసమూహము మరియు కలహములు ఏమైనా ఉన్నాయా? మన ప్రపంచములో ఇవన్నీ చాలా ఉన్నాయి. వాస్తవానికి, అపనమ్మకస్తులు మరియు విశ్వాసులు ఇప్పటికి ఈ దర్శనము గురించి, వాస్తవంగా నేడు చెప్పిన ప్రతిదాని గురించి వాదిస్తారు. ఒక వేళ విస్తారమైన అభిప్రాయముల మధ్య స్పష్టముగా చూచుటకు, అర్థమును కనుగొనుటకు మీరు శ్రమపడుతుంటే, ఆ యేసు నుండి సమాధానాలు వెదకమని నేను మిమ్మును ప్రోత్సాహిస్తున్నాను మరియు ప్రాచీన యెరికో మార్గములో మన అంధుడైన స్నేహితుడు తన కంటిచూపును పొందిన దాదాపు 1800 సంవత్సరాల తరువాత వచ్చిన జోసెఫ్ స్మిత్ అనుభవం గురించి నా అపొస్తలుని సాక్ష్యమును చెప్పుచున్నాను. జీవితములో అత్యంత ఉద్వేగపరచు దృశ్యము మరియు శబ్ధము యేసు అటు వెళ్లుచుండగా10 కలిగేది మాత్రమే కాదు, కాని మన యొద్దకు వచ్చి, మన ప్రక్కన ఆగి, మనతో ఆయన నివాసము ఏర్పరచుకొనుట అని ఈ ఇద్దరు మరియు కాలగమనములో ఇంకా అనేకమందితో కలిపి నేను సాక్ష్యమిస్తున్నాను.11

సహోదరీ, సహోదరులారా, మన కాలములో స్థిరముగా ఉండు కరకర ధ్వనులు, జీవితపు లయలలో క్రీస్తును మన జీవితాల యొక్కయు, మన విశ్వాసము యొక్కయు మరియు మన సేవ యొక్క కేంద్రముగా చూచుటకు మనం ప్రయత్నిస్తామని ఆశిస్తున్నాను. అక్కడే నిజమైన అర్థము ఉన్నది. మరియు కొన్ని సార్లు మన అవగాహన పరిమితమైతే లేదా మన విశ్వాసము తగ్గితే లేదా మన నమ్మకము పరీక్షించబడి, శుద్ధి చేయబడితే—అది ఖచ్చితంగా చేయబడుతుంది—అప్పుడు మనం “యేసూ, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని” కేకలు వేయుదుము గాక.12 ఆయన మిమ్ములను ఆలకించునని, త్వరలో లేదా ఆలస్యంగానైనా “చూపుపొందుము: నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను” 13 అని చెప్పునని అపొస్తలుని ఉత్సాహముతో, ప్రవచనాత్మక ధృఢవిశ్వాసముతో నేను మీకు వాగ్దానము చేయుచున్నాను. సర్వసభ్య సమావేశమునకు స్వాగతము. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.