2010–2019
తెలుసుకోవడం, ప్రేమించడం, మరియు ఎదగటం
2019 అక్టోబర్ సర్వసభ్య సమావేశము


తెలుసుకోవడం, ప్రేమించడం, మరియు ఎదగటం

ఈ గొప్ప పరిచర్య కార్యములో మన భాగమును మనమందరం అర్థం చేసుకుందాం, తద్వారా మనం ఆయనవలే మరింతగా అవుతాము.

2016లో టెంపుల్ స్క్వేర్ వద్ద టాబర్నాకిల్ గాయకబృందము నెదర్లాండ్స్ మరియు బెల్జియమ్ దర్శించటానికి వచ్చారు. ఆ ఉత్సాహముగల సంఘటనలో నేను చేర్చబడ్డాను కనుక, వారి ప్రదర్శనను రెండు సార్లు ఆనందించే అవకాశము నాకు కలిగింది.

చిత్రం
గాంగ్ వాయిద్యము

వారి ప్రదర్శన సమయమందు అంత పెద్ద గాయక బృందమును కదిలించుట ఎటువంటి అద్భుతమైన ప్రయత్నమో నేను ఆలోచించాను. పెద్ద సంగీత సాధనం గాంగ్‌ను చూసి నేను ఆశ్చర్యపడ్డాను, అది మీ చేతితో సులువుగా తీసుకొని వెళ్లగల వయోలిన్, బూర, లేక ఇతర సాధనాలతో పోలిస్తే కష్టమైనది మరియు బహుశా రవాణా చేయటం చాలా ఖరీదైనది కానీ ఈ గాంగ్ అసలు ప్రమేయమును చూస్తే, అది కొన్నిసార్లు మాత్రమే కొట్టబడును, అదేసమయంలో, మిగిలిన చిన్న సాధనములు కచేరీలో ఎక్కువగా చేర్చబడినవి. గాంగ్ ధ్వని లేకుండా ప్రదర్శన ఒకేలా వుండదని నేను భావించాను, కనుక ఈ పెద్ద గాంగ్‌ను సముద్రమునకు అవతలి వైపుకు అంత దూరము కదిలించుటకు ప్రయత్నం చేయబడాలి.

చిత్రం
వాయిద్యబృందముతో గాంగ్ వాయిద్యము

కొన్నిసార్లు మనము గాంగ్ వలే, ప్రదర్శనలో చిన్న భాగము వహించుటకు మాత్రమే సరిపోతామని మనము భావించవచ్చు. మీ ధ్వని చాలా ముఖ్యమైనదని నన్ను మీతో చెప్పనియ్యుము.

మనకు అన్ని సాధనములు అవసరము. ఇతరులు కళాత్మక ప్రతిభలు కలిగియుండగా, మనలో కొందరు పాఠశాలలో సులువుగా, త్వరగా నేర్చుకుంటారు. కొందరు డిజైను చేస్తారు, కట్టగలరు, లేక శ్రద్ధ తీసుకోగలరు, లేక ఇతరులకు బోధించగలరు. ఈ లోకమునకు అర్ధమును మరియు ఆసక్తిని తెచ్చుటకు అందరూ అవసరము.

ఇవ్వటానికి ఏమీ లేదని, లేక ఏ ప్రాముఖ్యతను కలిగిలేరని, లేక ఎవరికి తాము విలువైన వారము కాదని భావించు వారికి, మిగిలిన వారు లోకంలో తమ జీవితం సమస్తము అద్భుతంగా ఉందను కొనువారికి, మరియు వీరిరువురికి మధ్యలో ఉండు వారికి, ఈ విషయము గురించి మాట్లాడాలని నేను కోరుతున్నాను.

జీవితపు బాటపై మీరు ఎక్కడ ఉన్నప్పటికినీ, మీలో కొందరు ఆ బాటపై ఉన్నట్లుగా కూడా మిమ్మల్ని మీరు పరిగణించలేనంత చాలా భారముగా భావించవచ్చు. చీకటిలో నుండి వెలుగులోనికి అడుగు పెట్టమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. సువార్త వెలుగు, అప్యాయతను, స్వస్థతను తెచ్చును మరియు మీరు ఎవరు మరియు జీవితంలో మీ ఉద్దేశ్యమేమిటో నిజముగా గ్రహించుటకు మీకు సహాయపడును.

మనలో కొందరు నిషేధించబడిన మార్గములపై సంచరిస్తూ, అక్కడ సంతోషమును కనుగొనుటకు ప్రయత్నిస్తున్నారు.

శిష్యత్వము యొక్క బాటపై నడుచుటకు మరియు ఆయన వద్దకు తిరిగి వచ్చుటకు ప్రేమగల పరలోక తండ్రి చేత మనము ఆహ్వానించబడ్డాము. ఆయన పరిపూర్ణమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు.1

మార్గము ఏమిటి? ఒకరినొకరం అర్ధము చేసుకొనుటకు సహాయపడే విధానము ఒకరినొకరికి పరిచర్య చేసుకొనుట.

నాకైతే, పరిచర్య అనగా దైవిక ప్రేమను సాధన చేయుట.2 ఆ విధంగా మనము ఇచ్చువారికి మరియు పొందువారికి ఇరువురు పశ్చాత్తాపపడుటకు కోరికను పొందుటకు ఒక వాతావరణమును సృష్టించగలము. మరొక మాటలలో, మనము దిశను మార్చి మన రక్షకుడైన యేసు క్రీస్తు వలే ఎక్కువగా అవుతాము మరియు దగ్గరవుతాము.

ఉదాహరణకు, మన భాగస్వామి లేక పిల్లలకు వారు మెరుగుపరచుకోవాలని నిరంతరము చెప్పాల్సినవసరం లేదు; ఇదివరకే వారు దానిని ఎరిగియున్నారు. ఈ ప్రేమగల వాతావరణమును సృష్టించుటలో వారు తమ జీవితాలలో అవసరమైన మార్పులను చేయుటకు మరియు ఉత్తమమైన జనులుగా మారుటకు శక్తి ఇవ్వబడతారు.

ఈ విధానములో పశ్చాత్తాపము ప్రతీరోజు శుద్ధి చేయబడే ప్రక్రియగా మారును, అది చెడు ప్రవర్తనకు క్షమాపణ అడుగుటను కలిపియుండవచ్చు. చాలా త్వరగా విమర్శించుటకు లేక చాలా నెమ్మదిగా వినుటకు నేను త్వరపడిన సందర్భాలు నాకు జ్ఞాపకమున్నాయి మరియు ఇంకా జరుగుతున్నాయి రోజు ముగింపులో నా వ్యక్తిగత ప్రార్థనయందు, పశ్చాత్తాపపడి, ఉత్తమంగా మారుటకు పరలోకమునుండి ప్రేమగల సలహాను నేను అనుభూతి చెందాను. నా తల్లిదండ్రులు, సహోదరుడు, మరియు సహోదరీల చేత మొదట సృష్టించబడిన ప్రేమగల వాతావరణము, తరువాత నా భార్య, పిల్లలు, అదేవిధంగా స్నేహితులు, నేను మంచి వ్యక్తిగా మారుటకు నాకు సహాయపడింది

మనము ఎక్కడ సరిగా చేయగలమో మనందరికి తెలుసు. ఒకరినొకరు పలుమార్లు గుర్తు చేసుకోవాల్సిన అవసరము లేదు, కానీ ఒకరినొకరిని ప్రేమించి పరిచర్య చేయాల్సిన అవసరమున్నది, ఆవిధంగా చేయటంలో, మారుటకు సమ్మతించు వాతావరణమును అందించుము.

అదే వాతావరణములో మనము నిజముగా ఎవరము, రక్షకుని యొక్క రెండవ రాకడకు ముందు, లోక చరిత్రలో చివరి అధ్యాయములో మన పాత్ర ఏమిటో మనము నేర్చుకుంటాము.

మీ వంతు గురించి మీరు ఆశ్చర్యపడుచున్న యెడల, మీరు ఒంటరిగా ఉండగల ప్రదేశమును వెదకి, మీరు వహించాల్సిన పాత్ర మీకు తెలియచేయమని పరలోక తండ్రిని అడగమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను బహుశా జవాబు క్రమముగా రావచ్చు, తరువాత నిబంధన, పరిచర్య బాటపై మన పాదము మరింత స్థిరముగా నిలిపినప్పుడు ఎక్కువ స్పష్టముగా వచ్చును.

మాటల యుద్ధము మరియు అభిప్రాయముల కల్లోలముల మధ్య అతడు ఉండగా జోసెఫ్ స్మిత్ ఎదుర్కొన్న అవే కష్టములలో కొన్నిటిని మనము అనుభవిస్తున్నాము. అతడి స్వంత వృత్తాంతమును మనము చదివినప్పుడు, తనకు తానుగా అతడు చెప్పాడు: “ఏమి జరగబడాల్సియున్నది? ఈ తెగలన్నిటిలో ఏది సరైనది; లేక అవన్నీ కలిసి తప్పైనవా? వాటిలో ఏదైనా ఒకటి సరైనది అయితే, అది ఏది మరియు నేను దానిని ఎలా తెలుసుకోగలను?”3

ఇలా వివరించిన యాకోబు పత్రికలో అతడు కనుగొన్న జ్ఞానముతో,“మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న యెడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగ దయచేయువాడు,”4 జోసెఫ్ కొంత సమయానికి “దేవుని అడగవలెనని,”5 తీర్మానమునకు వచ్చెను.

తరువాత మనము అతడు తన జీవితంలో మొదటిసారి అటువంటి ప్రయత్నము చేసాడని చదువుతాము, ఏలయనగా అతడి ఆందోళలన్నిటి మధ్య, ఇంకను అతడు బిగ్గరగా ప్రార్థించుటకు ప్రయత్నించలేదు.6

మనము ఇదివరకు ఎన్నడూ చేయని విదానములో మన సృష్టికర్తను మనము పిలిచిన మొదటిసారి, అది మనకు ఆవిధముగా ఉన్నది.

జోసెఫ్ యొక్క ప్రయత్నము వలన, పరలోక తండ్రి మరియు ఆయన కుమారుడు, యేసు క్రీస్తు అతడిని పేరుతో పిలుస్తూ అతడికి ప్రత్యక్షమయ్యారు, ఫలితంగా, మనమెవరము మరియు మనము నిజముగా ముఖ్యమైన వారమనే ఎక్కువ స్పష్టమైన జ్ఞానము కలిగియున్నాము.

అతడి సున్నితమైన యౌవన సంవత్సరాలలో అతడి స్నేహితులుగా ఉండాల్సిన వారు మరియు అతడిని దయగా చూడాల్సిన వారి చేత జోసెఫ్ హింసింపబడ్డాడని మనము తరువాత చదువుతాము.7 కనుక శిష్యత్వము యొక్క జీవితమును జీవిస్తున్నప్పుడు మనము కొంత వ్యతిరేకతను ఎదురుచూడవచ్చు.

ప్రస్తుతము మీరు వాద్యబృందములో భాగముగా ఉండలేనట్లు భావించిన యెడల మరియు పశ్చాత్తాప మార్గము మీకు కష్టమైనదిగా కనబడిన యెడల, మనము కొనసాగించిన యెడల, మన భుజముల నుండి భారము తీసివేయబడును మరియు అవి మరలా తేలికగా చేయబడునని దయచేసి తెలుసుకొనుము. మనము ఆయనను చేరుకున్నప్పుడు పరలోక తండ్రి మనల్ని ఎన్నడూ విడిచిపెట్టాడు. మనము చేసిన తప్పులు లక్ష్యపెట్టకుండా, వాటిని జయించుటకు మనకు సహాయపడుటకు పరలోక తండ్రి ఉన్నారు.

మనలో కొందరు గాయపడ్డారు, కానీ ప్రభువుకు గల ప్రధమ చికిత్స కిట్ మన గాయములన్నిటిని కప్పుటకు పట్టీలు తగినంత పెద్దగా ఉన్నాయి.

కనుక ఆ ప్రేమ, దాతృత్వము లేక క్రీస్తు యొక్క శుద్ధమైన ప్రేమగా కూడా మనము పిలిచే ఆ షరతులు లేని ప్రేమ,8 మన గృహాలలో అవసరము, అక్కడ తల్లిదండ్రులు తమ పిల్లలకు మరియు పిల్లలు వారి తల్లిదండ్రులకు పరిచర్య చేయాలి. ప్రేమ ద్వారా, హృదయాలు మార్చబడును మరియు ఆయన చిత్తము చేయుటకు కోరికలు ఉద్భవించును.

మన పరలోక తండ్రి యొక్క పిల్లలుగా, ఆయన సంఘ సభ్యులుగా ఒకరినొకరితో మన వ్యవహారములందు ఆ ప్రేమ మనకవసరము, అది మన వాద్యబృందాలలోని సంగీత సాధనములన్నిటినీ కలుపుటకు మనకు సాధ్యపరచును, ఆవిధంగా రక్షకుడు తిరిగి వచ్చినప్పుడు పరలోకపు దూతల గాయక బృందములతో మనము మహిమకరముగా నిర్వహించగలము.

మన అనుదిన జీవితాలు కొనసాగుతున్నప్పుడు, మన పరిసరాలు ప్రకాశించుటకు, కాంతివంతమగుటకు ఆ ప్రేమ, ఆ వెలుగు అవసరము. జనులు వెలుగును గమనిస్తారు మరియు దానికి ఆకర్షించబడతారు ఆ రకమైన మిషనరీ కార్యము ఇతరులను “వచ్చి చూడండి, వచ్చి సహాయం చేయండి, వచ్చి ఉండండి.” అని ఆకర్షిస్తుంది. 9 దయచేసి, ఈ గొప్ప పని గురించి మరియు దానిలో మీ భాగాన్ని మీరు స్వీకరించినప్పుడు, మన ప్రియమైన ప్రవక్త జోసెఫ్ స్మిత్‌తో కలిసి సంతోషిద్దాం, “నేను ఒక దర్శనాన్ని చూశాను; నాకు తెలుసు, దేవునికి తెలుసు అని నాకు తెలుసు, నేను దానిని తిరస్కరించలేను.”10

నేను ఎవరో నాకు తెలుసని, మీరెవరో నాకు తెలుసని నేను మీకు సాక్ష్యమిస్తున్నాను. మనమందరం మనల్ని ప్రేమిస్తున్న పరలోక తండ్రి యొక్క పిల్లలము. ఆయన మనల్ని విఫలమవటానికి ఇక్కడికి పంపలేదు కానీ ఆయన వద్దకు మహిమకరంగా తిరిగి వెళ్లుటకు పంపాడు. ఈ గొప్ప పరిచర్య కార్యములో మన భాగము మనందరము గ్రహించినట్లు, ఆవిధంగా ఆయన తిరిగి వచ్చినప్పుడు, మనము ఆయనవలె మారగలమని, నా ప్రార్థన, యేసు క్రీస్తు నామములో, ఆమేన్.