2010–2019
మన శరీరాలపై మన మన ఆత్మకు నియంత్రణను ఇచ్చుట
2019 అక్టోబర్ సర్వసభ్య సమావేశము


మన శరీరాలపై మన మన ఆత్మకు నియంత్రణను ఇచ్చుట

ఈ జీవితంలో మనము నేర్చుకోగల అతి ముఖ్యమైన విషయాలలో ఒకటి మన నిత్య ఆత్మీయ స్వభావమును ఎలా ఉద్ఘాటించాలి మరియు మన చెడు కోరికలను నియంత్రించాలి.

నా ప్రియమైన సహోదర, సహోదరిలారా, గత సంవత్సరము అక్టోబరు సర్వసభ్య సమావేశము సమీపించినప్పుడు, నా సమావేశ ప్రసంగమును 1913 అక్టోబరు 3న అధ్యక్షులు జోసెఫ్ ఎఫ్. స్మిత్‌కు ఇవ్వబడిన ఆత్మ లోకమును గూర్చి కలిగిన దర్శనము యొక్క 100వ వార్షికోత్సవమును గుర్తిస్తూ నేను సిద్ధపరిచాను.

అనువాదము కొరకు నా ప్రసంగమును అప్పగించిన కొన్నిరోజుల తరువాత, నా ప్రియమైన సహచరిణి, బార్బారా, తన మర్త్యకాల శిక్షణాకాలమును పూర్తి చేసికొని ఆత్మ లోకములోనికి వెళ్లింది.

రోజులు, వారములుగా, తరువాత నెలలుగా మారినప్పుడు, ఇప్పటికి బార్బారా చనిపోయిన సంవత్సరమైంది, నాకై నేను ఈ లేఖనమును ఎక్కువ సంపూర్ణంగా ప్రశంసించుట కనుగొన్నాను: “మరణించిన వారి కొరకు మీరు దుఃఖపడినందున మీరు ప్రేమలో కలిసి జీవించెదరు.”1 బార్బారా, నేను 67 సంవత్సరాలుగా “ప్రేమయందు కలిసి జీవించుటకు” దీవించబడ్డాము. కానీ మనము ప్రేమించు వారిని “ కోల్పోయినందుకు దుఃఖించుట” అనగా అర్ధమేమిటో చాలా వ్యక్తిగతంగా నేను నేర్చుకున్నాను. ఓహ్, నేను ఆమెను ఎంతగా ప్రేమిస్తున్నాను మరియు జ్ఞాపకము చేసుకుంటున్నాను!

మనలో అనేకులు ఇతరులు మనకు చేసిన దానిని వారు వెళ్లిపోయేంత వరకు పరిపూర్ణంగా ప్రశంసించరని నేను అనుకుంటున్నాను. బార్బారా ఎల్లప్పుడు తీరికి లేకుండా ఉండేదని నాకు తెలుసు, కానీ కుటుంబము, సంఘము, మరియు సమాజము నిరంతరము తన సమయముపై డిమాండ్లను నేను పూర్తిగా గ్రహించలేదు. మా కుటుంబము పనిచేస్తూ ఉండుటకు సంవత్సరాలుగా వేల సార్లు పునరావృతం చేయబడిన అంకితభావముతో చేయబడిన అనుదిన ప్రయత్నాలున్నాయి. సమస్తమందు, ఆమె తన స్వరమును పెంచుట లేక నిర్దయగల మాటను చెప్పుట మా కుటుంబము ఎప్పుడూ వినలేదు.

ఈ గత సంవత్సరము అనేక జ్ఞాపకాలు నా మనస్సులోనికి వచ్చాయి. ఏడుగురు పిల్లలకు తల్లిగా ఉండుటకు ఆమె చేసిన శారీరకంగా కష్టమైన ఎంపిక గురించి నేను ఆలోచించాను. ఆమె పిల్లల్ని పెంచడం, గృహమును చూసుకోవటం మాత్రమే ఆమె ఎప్పటికీ కోరిన వృత్తి, మరియు ప్రతీ అంశములో ఆమె చాలా నైపుణ్యము కలిగియున్నది.

తరచుగా ఆమె మా పిల్లల్ని, నన్ను ఎలా జాడ తెలుసుకునేదో నేను ఆశ్చర్యపడ్డాను. ప్రతి వారము మా కుటుంబం పెద్ద గుట్టగా ఉపయోగించిన బట్టలు ఉతకటం, పిల్లలకు సరైన పరిమాణములో బూట్లు మరియు దుస్తులను ఉంచుట వంటి కార్యక్రమాలు మినహాయిస్తే, భోజనము సిద్ధపరచే పని ఒక్కటే నిజముగా కష్టమైనది. మేమందరం మాకు ముఖ్యమైన అనేక ఇతర సమస్యల కొరకు ఆమె వైపు తిరిగాము. అవి మాకు ముఖ్యమైనవి కనుక, అవి ఆమెకు కూడా ముఖ్యమైనది. ఒక్క మాటను ఉపయోగించి ఆమెను వర్ణించాలంటే, ఒక భార్యగా, ఒక తల్లిగా, ఒక స్నేహితురాలిగా, ఒక పొరుగువానిగా, మరియు దేవుని యొక్క కుమార్తెగా—ఆమె అద్భుతమైనది.

ఇప్పుడు ఆమె చనిపోయి, తరువాత జీవితానికి కొనసాగింది కనుక, ఆమె జీవితంలో చివరి నెలలలో, నేను ఆఫీసు నుండి ఇంటికి వచ్చినప్పుడు, ఆమె ప్రక్కన కూర్చోని, ఆమె చేతిని పట్టుకొని, మరలా, మరలా ఆమెకు ఇష్టమైన సంగీత ముగింపులను మేము చూచుటకు ఎంపిక చేసినందుకు నేను సంతోషిస్తున్నాను—ఎందుకనగా ఆమె దానిని కేవలము మధ్యాహ్నాము ముందే చూసిందని అల్జీమర్ వ్యాధి ఆమెను గుర్తుంచుకోనివ్వదు. ఆమెతో కూర్చోని, తన చేతిని పట్టుకొన్న ఆ ప్రత్యేకమైన సమయాల జ్ఞాపకాలు ఇప్పుడు నాకు చాలా ప్రశస్తమైనవి.

సహోదర, సహోదరిలారా, మీ కుటుంబ సభ్యుల కన్నులలోనికి ప్రేమతో చూచు ఒక అవకాశమును దయచేసి కోల్పోవద్దు. పిల్లలు మరియు తల్లిదండ్రులారా, మీరు ఒకరినొకరు చేరుకొని, మీ ప్రేమను, ప్రశంసను వ్యక్తపరచుకోండి. నా వలే, మీలో కొందరు ఒక రోజు లేచి, అటువంటి ముఖ్యమైన సంభాషణ కొరకు సమయము దాటిపోయిందని కనుగొనవచ్చు. కృతజ్ఞత, మంచి జ్ఞాపకాలు, సేవ, మరియు మరింత ప్రేమతో నిండిన హృదయాలతో ప్రతీరోజు కలిసి జీవించండి.

ఈ గత సంవత్సరమందు, ఎప్పటికంటే ఎక్కువగా మన పరలోక తండ్రి యొక్క ప్రణాళిక గురించి నేను లోతుగా ధ్యానించాను. తన కుమారుడైన కొరియాంటన్‌కు బోధిస్తూ, ఆల్మా దానిని “సంతోషము యొక్క గొప్ప ప్రణాళికగా”2 సూచించాడు.

ప్రణాళికను నేను ఆలోచించినప్పుడు నా మనస్సులోనికి వచ్చు మాట “పునఃకలయక.” అది మన ప్రేమగల పరలోకమందున్న తండ్రి చేత ప్రణాళిక చేయబడిన ఒక ప్రణాళిక, దాని కేంద్రముగా అది దేవుని కుటుంబములో తరము మీద తరము, భర్తలు, భార్యలు, తల్లిదండ్రులు మరియు పిల్లలు శాశ్వతంగా తిరిగి కలుసుకొనుట—గొప్ప మహిమకరమైన కుటుంబ పునఃకలయక యొక్క సాధ్యతను కలిగియున్నది.

ఆ ఆలోచన నాకు ఓదార్పును మరియు మరలా నేను బార్బారాతో ఉంటాననే అభయాన్ని నాకు తెచ్చింది. తన జీవితపు ముగింపులో ఆమె శారీరకంగా బాధపడినప్పటికినీ, ఆమె ఆత్మ బలమైనది, దివ్యమైనది, మరియు స్వచ్ఛమైనది. ఆమె అన్ని విషయాలందు తనను తాను సిద్ధపరచుకొన్నది ఆవిధంగా ఆ దినము వచ్చినప్పుడు, విశ్వాసము మరియు శాంతికరమైన అభయముతో నిండి, ఆమె “దేవుని యొక్క న్యాయపీఠము,” 3 యెదుట నిలబడగలదు. కానీ ఇక్కడ నేను, రెండు రోజులలో 91 సంవత్సరాల వాడను, మరియు “నేను సిద్ధముగా ఉన్నానా?” అని నేనింకా ఆశ్చర్యపడుతున్నాను. మరొకసారి ఆమె చేతిని పట్టుకోగలుగుటకు నేను చేయాల్సిన సమస్తమును నేను చేస్తున్నానా?”

జీవితము యొక్క అతి సాధారణమైన, ప్రధానమైన వాస్తవము: మనమందరం చనిపోతాము. మనము వృద్ధులుగా లేక చిన్నవారిగా, సులువుగా లేక కష్టంగా, ఐశ్వర్యవంతులుగా లేక పేదవారిగా, ప్రియమైన లేక ఒంటరి వారిగా చనిపోయినప్పటికినీ, ఏ ఒక్కరు మరణమును తప్పించుకోలేరు.

కొన్ని సంవత్సరాల క్రితం, అధ్యక్షులు గార్డెన్ బి. హింక్లీ చెప్పినది దీని గురించి ప్రత్యేకంగా అర్ధవంతమైనది: “మనము సరైన వివాహము చేసుకొని, సరిగ్గా జీవించిన యెడల, మరణము యొక్క వాస్తవమును మరియు కాల ప్రయాణమును లక్ష్యపెట్టకుండా, మన అనుబంధము కొనసాగుతుందనే జ్ఞానము నుండి వచ్చు సమాధానము ఎంత ఓదార్పునిచ్చును.”4

నిశ్చయంగా నేను సరైన వివాహము చేసుకున్నాను. దాని గురించి ఏ సందేహము లేదు. కానీ అధ్యక్షులు హింక్లీ ప్రకారం అది సరిపోదు. నేను సరిగ్గా కూడా జీవించాలి.5

ఈరోజు, “సరిగా జీవించుట,” చాలా కలవరపరిచే భావన కాగలదు, ప్రత్యేకంగా మీరు ఎక్కువ సమయాన్ని సోషల్ మీడియాలో గడిపిన యెడల, దేవుడు మరియు ఆయన బిడ్డల కొరకైన ఆయన ప్రణాళిక గురించి ఎవరైనా నిజమైన సత్యములను లేక తప్పుడు భావనలను ప్రకటించవచ్చు. కృతజ్ఞతపూర్వకంగా, సంఘ సభ్యులు ఎలా జీవించాలో తెలుసుకొనుటకు శాశ్వతంగా సత్యమైన సువార్త సూత్రములను కలిగియున్నారు ఆవిధంగా మనము చనిపోయినప్పుడు మనము ఉత్తమంగా సిద్ధపడియుంటాము.

నేను జన్మించడానికి కొన్ని నెలల క్రితం, మా అపొస్తులుడైన తాత, ఎల్డర్ జె. బ్యాలర్డ్ సరిగా జీవించుట అనగా అర్ధము ఏమిటో దాని ప్రధాన స్వభావమును వివరించిన ఒక ప్రసంగము ఇచ్చారు. “The Struggle for the Soul,” (ఆత్మ కొరకు పోరాటము) అను శీర్షిక గల ఆయన ప్రసంగము మన భౌతిక శరీరము మరియు మన నిత్య ఆత్మల మధ్య కొనసాగుతున్న యుద్ధముపై దృష్టిసారించింది.

“ఏ పురుషుడు లేక స్త్రీ ఎప్పటికీ కలిగియుండగల గొప్ప వివాదము … వ్యక్తిగతంగా జరిగే యుద్ధమగును,” సాతాను “మన ఆత్మల యొక్క శత్రువు,” “శరీరము యొక్క వ్యామోహములు, ఆకలిదప్పికలు, అకాంక్షల ,” ద్వారా మనల్ని ముట్టడి చేయునని వివరిస్తూ ఆయన చెప్పారు.6 కనుక మన దైవిక, ఆత్మీయ స్వభావము మరియు మనుష్యుని యొక్క ప్రకృతి సంబంధమైన స్వభావము మధ్య ప్రధానమైన యుద్ధమున్నది. సహోదర, సహోదరిలారా, మనము పరిశుద్ధాత్మ యొక్క ప్రభావము ద్వారా ఆత్మీయ సహాయమును పొందగలము, అది “మీకు సమస్త విషయాలను బోధించగలదు.”7 యాజకత్వము యొక్క శక్తి మరియు దీవెనల ద్వారా కూడా సహాయము రాగలదు.

ఇప్పుడు, ఈ యుద్ధము మీతో ఎలా జరుగుతున్నది? అని నేను అడుగుతున్నాను.

అధ్యక్షులు డేవిడ్ ఓ. మెఖే చెప్పారు: “మానవుని యొక్క భూలోక ఉనికి అతడు తన ప్రయత్నాలు, తన మనస్సు, తన ఆత్మను అతడి భౌతిక స్వభావము యొక్క ఓదార్పుకు, తృప్తికి తోడ్పడు విషయాలపై కేంద్రీకరిస్తాడా, లేక అతడు ఆత్మీయ లక్షణాలను సంపాదించుట తన జీవితపు ఉద్దేశముగా చేస్తాడా అని కేవలము ఒక పరీక్ష.”8

మన ప్రకృతి సంబంధమైన మరియు ఆత్మీయ స్వభావముల మధ్య యుద్ధము ఒక క్రొత్త విషయము కాదు. తన జనలకు తన చివరి ప్రసంగములో, రాజైన బెంజిమెన్ ఇలా బోధించారు, “పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణలకు లోబడి మరియు ప్రకృతి సంబంధియైన మనుష్యుని విసర్జించి మరియు ప్రభువైన క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము ద్వారా ఒక పరిశుద్ధుడు అయితేనే తప్ప, ప్రకృతి సంబంధియైన మనుష్యుడు దేవునికి ఒక శత్రువైయున్నాడు మరియు ఆదాము యొక్క పతనము నుండి ఉండియున్నాడు, మరియు ఎప్పటికి నిరంతరముండును.”9

“శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై యున్నది.

“శరీరానుసారమైన మనస్సు మరణము ఆత్మానుసారమైన మనస్సు జీవమును, సమాధానమునై యున్నది,”10 అని అపోస్తులుడైన పౌలు బోధించెను.

ఈ జీవితంలో మనము నేర్చుకోగల అతి ముఖ్యమైన విషయాలలో ఒకటి మన నిత్య ఆత్మీయ స్వభావమును ఎలా నొక్కి చెప్పగలము మరియు మన చెడు కోరికలను నియంత్రించుకోగలమని నాకు స్పష్టముగా కనబడుచున్నది. ఇది అంత కష్టమైనది కాదు. మన భౌతిక శరీరము కంటే ఎక్కువ కాలమున్న మన ఆత్మ, మర్తత్యమునకు ముందు లోకములో చెడుకు పైగా నీతిని ఎన్నుకొనుటలో ఇదివరకే విజయవంతమైనది. ఈ భూమి రూపింపబడకముందు, మనము మన పరలోక తల్లిదండ్రుల సన్నిధిలో జీవించాము, వారు మనల్ని ప్రేమించారు మరియు ఇప్పటికీ మనల్ని ప్రేమించుట కొనసాగిస్తున్నారు.

అవును, ఆ మర్తత్యమునకు ముందు లోకములో మనము జీవితమును-మార్చు నిర్ణయాలను, ఎంపికలను చేయాల్సియున్నది. ఈ గ్రహము మీద ఎప్పటికీ జీవించిన లేక జీవించు ప్రతీ వ్యక్తి మన రక్షణ కొరకు పరలోక తండ్రి యొక్క ప్రణాళికను అంగీకరించుటకు ఎంపిక చేయుటకు ఆవశ్యకమైన నిర్ణయాన్ని చేసారు. ఆవిధంగా మనము విజయవంతమైన ఆత్మీయ స్వభావము మరియు నిత్య గమ్యముగల నిరూపితమైన జాడ నివేదికతో భూమిమీదకు మనమందరం వచ్చాము.

దాని గురించి ఒక క్షణం ఆలోచించండి. ఇదే మీరు నిజముగా ఎవరు మరియు ఎల్లప్పుడు మీరు ఎవరిగా ఉన్నారు: నిత్యత్వములో ఆత్మీయ పునాది మరియు అంతములేని సాధ్యతలతో ప్రవహించు ఒక భవిష్యత్తుతో ఒక కుమారుడు లేక దేవుని యొక్క కుమార్తె. మీరు—మొదట, మొట్టమొదటి, మరియు ఎల్లప్పుడు—ఒక ఆధ్యాత్మిక ప్రాణిగా ఉన్నారు. కనుక ఒకరు మన ఆత్మీయ స్వభావముకు ముందుగా మన ప్రకృతి సంబంధి స్వభావమును ఎంపిక చేసినప్పుడు, మనము మన నిజమైన, సత్యమైన, ప్రామాణికమైన ఆత్మీయ వ్యక్తులకు వ్యతిరేకంగా దేనినో ఎంపిక చేస్తున్నాము.

ఇంకను, నిర్ణయం చేయుటను శరీరము మరియు భూలోక కోరికలు క్లిష్టతరము చేస్తాయనుటలో ఏ సందేహము లేదు. ఈ మర్త్య లోకమునకు ఒకసారి వచ్చిన తరువాత మర్తత్యమునకు ముందు లోకము యొక్క జ్ఞాపకమును మనము కలిగిలేము కనుక, ఒకరు దేవునితో మన సంబంధమును, మన ఆత్మీయ స్వభావము యొక్క దృష్టిని కోల్పోవచ్చు, మరియు మన ప్రకృతి సంబంధ స్వభావము మనము ఇప్పుడు కావాలని కోరిన దానికి ప్రాధాన్యతను ఇవ్వగలదు. శరీర విషయాలకు పైగా ఆత్మ విషయాలను ఎంపిక చేయుటను నేర్చుకొనుట, పరలోక తండ్రి యొక్క ప్రణాళికలో ఈ భూలోక అనుభవము భాగముగా ఎందుకున్నదో ప్రధాన కారణాలలో ఒకటి. అందుకే ఆ ప్రణాళిక మన ప్రభువును, రక్షకుడైన యేసు క్రీస్తు ప్రాయశ్చిత్తము యొక్క దృఢమైన పునాదిపై కూడా కట్టబడింది, ఆవిధంగా మనము శరీరమునకు లోబడినప్పుడు చేసిన తప్పులు కలిపి మన పాపములు నిరంతర పశ్చాత్తాపము ద్వారా జయింపబడవచ్చు మరియు మనము ఆత్మీయంగా దృష్టిసారించి జీవించగలము. క్రీస్తు యొక్క ఆత్మీయమైన సిద్ధాంతముతో అనుగుణముగా మన శారీరక ఆకలిదప్పికలను నియంత్రించుటకు ఇప్పుడే సమయము. అందుకే మనము మన పశ్చాత్తాపపడే దినమును ఆలస్యము చేయరాదు.11

కాబట్టి, పశ్చాత్తాపము మన వ్యక్తిగత యుద్ధములో ఆవశ్యకమైన ఆయుధమగును. గత సర్వసభ్య సమావేశములో, అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఈ యుద్ధమును సూచించారు మరియు “మనము పశ్చాత్తాపపడుటకు ఎన్నుకొన్నప్పుడు, మారటానికి మనము ఎన్నుకుంటున్నాము! రక్షకుడు మనలను శ్రేష్టమైన వ్యక్తులుగా మార్చుటకు మనం అనుమతిస్తాము. మనం ఆత్మీయంగా ఎదుగుటకు, ఆనందమును పొందుటకు—ఆయన విమోచనయందు ఆనందమును పొందుటకు మనం ఎంచుకుంటాము. మనం పశ్చాత్తాపపడాలని ఎంచుకొన్నప్పుడు, మనం మరింతగా యేసు క్రీస్తువలె మారుటకు ఎన్నుకుంటాము! 12

ప్రతిరాత్రి నా పరలోకమందున్న తండ్రితో ప్రార్ధనయందు నా రోజును సమీక్షించినప్పుడు, నేనేదైనా తప్పు చేస్తే క్షమించమని నేను అడుగుతాను మరియు రేపు మంచిగా ఉండటానికి ప్రయత్నిస్తానని వాగ్దానము చేస్తాను. ఈ క్రమమైన అనుదిన పశ్చాత్తాపము నా ఆత్మ ఎవరు నాకు బాధ్యత కలిగియున్నారో నా భౌతిక శరీరానికి జ్ఞాపకం చేయును.

మరొక వనరు ఎమనగా, ప్రాయశ్చిత్తము మరియు ప్రభువును, రక్షకుడైన యేసు క్రీస్తు మన కొరకు కలిగియున్న పరిపూర్ణమైన ప్రేమను జ్ఞాపకముంచుకొనుటలో సంస్కారములో పాల్గొనుట ద్వారా ఆత్మీయంగా మనల్ని మనం తాజాగా చేసుకొనుటకు ప్రతివారం మనమందరం కలిగియున్న అవకాశము.

సహోదర, సహోదరిలారా, కాస్త నెమ్మది పడి, మీ ప్రకృతి సంబంధ స్వభావమును జయించుటలో మరియు మీ దైవిక, ఆత్మీయ స్వభావమునకు శక్తిని ఇచ్చుటలో ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారో ఆలోచించమని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను, ఆవిధంగా సమయము వచ్చినప్పుడు, మీ ప్రియమైన వారితో సంతోషకరమైన పునఃకలయకకు ఆత్మలోకములోనికి మీరు ప్రవేశించవచ్చు—దీని కొరకు నేను సాక్ష్యమిస్తున్నాను మరియు యేసు క్రీస్తు యొక్క నామములో వినయముగా ప్రార్థిస్తున్నాను, ఆమేన్.