2010–2019
దేవునితో భాగస్వాములుగా ఉన్న నిబంధన స్త్రీలు
2019 అక్టోబర్ సర్వసభ్య సమావేశము


దేవునితో భాగస్వాములుగా ఉన్న నిబంధన స్త్రీలు

దేవునితో భాగస్వామ్యమందు ఒక నిబంధన స్త్రీ అగుట ఎంత గొప్పది మరియు దేవుని యొక్క మంచి కుమార్తైలు ఎల్లప్పుడు తల్లులుగా ఉండి, నడిపించి మరియు పరిచర్య చేసారు.

దేవుని నిబంధన కుమార్తైలైన, మీతో మాట్లాడే దీవెన కొరకు నేను కృతజ్ఞత కలిగియున్నాను. ఈ రాత్రి, నా ఉద్దేశమేమనగా మీరు పిలువబడిన గొప్ప సేవయందు మిమ్మల్ని ప్రోత్సహించుట. అవును, నా స్వరము వినుచున్న దేవుని యొక్క ప్రతి కుమార్తై ప్రభువైన యేసు క్రీస్తు నుండి ఒక పిలుపు పొందియున్నది.

మిమ్ములను పరిపూర్ణముగా యెరిగి, ఆయన కుమార్తైగా మిమ్మల్ని ప్రేమిస్తున్నఒక దేవుని చేత మీ కొరకు ఎంపిక చెయ్యబడిన ఒక స్థలము మరియు సమయములో మీరు మర్త్యత్వములో ప్రవేశపెట్టబడినప్పుడు మీ పిలుపు ప్రారంభమయ్యింది. ఆత్మలోకములో, ఆయన మిమ్ములను యెరిగి, మీకు బోధించారు మరియు ప్రపంచ చరిత్రలో అరుదైన అవకాశమును మీరు కలిగి, బాప్తీస్మపు తొట్టెలోకి ఆహ్వానించబడే స్థలములో మిమ్ములను ఉంచారు. అక్కడ, యేసు క్రీస్తు యొక్క పిలువబడిన సేవకుడు చేత మాట్లాడబడిన ఈ మాటలను మీరు వింటారు: “యేసు క్రీస్తు చేత అధికారమివ్వబడియుండి, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోకి నేను నీకు బాప్తీస్మమిస్తున్నాను. ఆమేన్.”1

మీరు ఆ నీటిలోనుండి బయటకు వచ్చినప్పుడు, సేవ చేయుటకు మీరు మరియొక పిలుపును అంగీకరించారు. దేవుని యొక్క క్రొత్త నిబంధన కుమార్తెగా, మీరు ఒక వాగ్దానము చేసారు మరియు యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘములో ఒక నియమించబడిన కార్యమును పొందారు, ఆ తరువాత మీరు ఒక సభ్యురాలిగా నిర్థారింపబడ్డారు. యేసు క్రీస్తు నామమును మీపైన తీసుకొని, ఆయన ఆజ్ఞలు పాటించి, ఆయనకు సేవ చేస్తారని దేవునితో మీరు నిబంధన చేసారు.

ఈ నిబంధనలు చేసిన ప్రతి ఒక్కరు, అతనిని లేదా ఆమెను చేయమని ప్రభువు పిలిచే సేవకు ఆ వ్యక్తి పరిపూర్ణముగా సరిపోతారు. ఐనప్పటికి, దేవుని యొక్క నిబంధన చెయ్యబడిన కూమార్తెలు మరియు కుమారులు ఒక ముఖ్యమైన, సంతోషకరమైన పిలుపును పంచుకుంటారు. అదేమనగా ఆయన కొరకు ఇతరులకు సేవ చెయ్యడం.

అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ సహోదరీలతో మాట్లాడుతూ, ప్రభువు కార్యములో ఆయనతో చేరమని మీకు ఇవ్వబడిన ఆయన పిలుపు యొక్క అద్భుతమైన సారాంశమును ఇచ్చారు. అధ్యక్షులు నెల్సన్ మీ పిలుపును ఈ విధంగా వివరించారు: “ ‘నరునికి మర్త్యత్వమును, నిత్య జీవమును ఇచ్చుటయే నా కార్యము, నా మహిమయై యున్నది’ అని ప్రభువు చెప్పారు.”’ (మోషే 1:39.) కాబట్టి, ఆయన భక్తిగల శిష్యురాలైన కుమార్తై యధార్థముగా ఇలా చెప్పవచ్చును, ‘నేను ప్రేమించే వారు ఆ పరలోక లక్ష్యమును చేరుటకు సహాయము చేయటమే నా కార్యము మరియు నా మహిమయై యున్నది.’

“స్త్రీ యొక్క దైవికముగా ఇవ్వబడిన కార్యములో భాగము ఏదనగా ఒకరి యొక్క సిలెస్టియల్ సామర్థ్యమును చేరుకొనుటకు మరొక వ్యక్తికి సహాయపడుట. తల్లిగా, గురువుగా, లేదా పోషించు పరిశుద్ధురాలిగా, ఇతరులు అమర్త్యత్వమును, నిత్యజీవమును పొందుతారు అనే ఆశతో ఆమె ఇతరుల జీవితాలను ప్రభావితం చేస్తుంది. దేవునితో భాగస్వామిగా, ఆమె దైవిక మిషను ఏదనగా ఆత్మలు జీవించుటకు, ప్రాణాలు పైకెత్తబడుటకు సహాయము చేయుట. ఇదే ఆమె జీవితము యొక్క అత్యంత గొప్ప కార్యసాధనము. అది ఘనతను చేకూర్చేది, ఆత్మీయాభివృద్ధిని కలిగించేది, మరియు మహోన్నత స్థితిని కలిగించేది.”2

తల్లి, నాయకురాలు లేదా పరిచర్య చేయు సహోదరి వంటి పిలుపులలో సేవ చేయు మీ వ్యక్తిగత మిషనుపై ఎప్పుడు, ఎంతకాలము వరకు దృష్టిసారించబడుతుందో మీరు తెలుసుకోలేరు. ప్రభువు ఆయనకున్న ప్రేమవలన మనము నియమించబడిన కార్యముల యొక్క అనుకూల సమయము, కాలపరిమాణము మరియు క్రమముల ఎంపికను మనకు ఇవ్వరు. ఐనప్పటికి, ఈ నియమించబడిన కార్యములన్నీ ఈ జీవితములో లేదా వచ్చే జీవితములో దేవుని యొక్క ప్రతీ కుమార్తైకు వస్తాయని లేఖనములు మరియు సజీవులైన ప్రవక్తల నుండి మీరు తెలుసుకొనవచ్చును. అవన్నీయు “దేవుని వరములలో కెల్ల గొప్ప వరమైన”3 ప్రేమగల కుటుంబాలలో నిత్యజీవము కొరకు సిద్ధపాటుగా ఉన్నాయి.

మన అంతిమ లక్ష్యము కొరకు ఇప్పుడు సిద్ధపడుటకు ప్రతీ ప్రయత్నము చేయుటకు మీరు జ్ఞానవంతులుగా ఉంటారు. ఆ పని సరాళము చెయ్యబడింది ఎందుకంటే ఈ నియమించబడిన కార్యములకు చాలా వరకు ఒకే విధమైన సిద్ధపాటు అవసరము.

పరిచర్య చేయు సహోదరిగా ఉండే నియమించబడిన కార్యముతో మొదలు పెడదాము. తండ్రి మరణించిన కుటుంబములో పదేళ్ళ వయస్సుగల కుమార్తైగా లేదా ఇటీవల అగ్ని ప్రమాదముచేత ప్రభావితం చేయబడిన తన పట్టణములో ఒక ఉపశమన సమాజ అధ్యక్షురాలిగా లేదా మీరు ఆసుపత్రిలో శస్త్రచికిత్స నుండి కోలుకొంటున్నవారిగా ఆ నియమించబడిన కార్యమును కలిగియున్నప్పటికీ-ఆయన పరిచర్య చేయు కుమార్తైగా ఉండుటకు ప్రభువు నుండి మీ పిలుపును నెరవేర్చుటకు ఒక అవకాశమును మీరు కలిగియున్నారు.

అవి చాలా భిన్నంగా ఉన్న పరిచర్య నియమించబడిన కార్యములుగా కనిపిస్తున్నాయి. ఐనప్పటికినీ వాటన్నిటికి శక్తివంతమైన, ప్రేమగల హృదయము, ప్రభువు ఒక మార్గమును సిద్ధపరచకుండా ఏ ఆజ్ఞ ఇవ్వరనే నిర్భయమైన విశ్వాసము, మరియు ఆయన కొరకు వెళ్లి, పని చెయ్యాలనే కోరిక సిద్ధపాటుగా కావాలి. 4

ఆమె సిద్ధపడెను గనుక, 10-సంవత్సరాల వయస్సుగల కుమార్తె విధవరాలైన తన తల్లి చుట్టూ తన చేతులుంచి, తన కుటుంబమునకు ఏవిధంగా సహాయపడాలో తెలుసుకొనుటకు ప్రార్థించింది. అమె ప్రార్థిస్తూనే ఉన్నది.

ఉపశమన సమాజ అధ్యక్షురాలు తన ప్రాంతంలో ఊహించని అగ్నిప్రమాదం జరగక ముందే పరిచర్య చేయుటకు సిద్ధపడింది. ఆమె తన జనులను తెలుసుకొని, ప్రేమించింది. అనేక సంవత్సరాలుగా ఆయన కొరకు చేసే చిన్న చిన్న సేవలలో సహాయపడమని ప్రభువుకు ఆమె చేసిన ప్రార్థనలకు జవాబులు పొందియుండి యేసు క్రీస్తునందు ఆమె విశ్వాసము వృద్ధి చెందింది. ఆమె యొక్క సుదీర్ఘమైన సిద్ధపాటు వలన, వేదనలో ఉన్న జనులు మరియు కుటుంబాలకు పరిచర్య చేయుటకు తన సహోదరీలను ఏర్పాటుచేయుటకు ఆమె సిద్ధముగాను, ఆతృతగాను ఉండెను.

ఆసుపత్రిలో శస్త్ర చికిత్సనుండి కోలుకొంటున్న ఒక సహోదరి తన తోటి రోగులకు పరిచర్య చేయుటకు సిద్ధపడింది. ప్రతీ అపరిచితులు అతడు లేదా ఆమె ఒక పొరుగువానివలే లేదా స్నేహితునివలె భావించి, ప్రభువు కొరకు పరిచర్య చేయుచు ఆమె తన జీవిత కాలాన్ని గడిపింది. ఆసుపత్రిలో పరిచర్య చేయాలనే పిలుపును తన హృదయంలో భావించినప్పుడు, ఆమె ఇతరులకు ఎంత ధైర్యంగా, ఎంత ప్రేమతో సేవ చేసిందంటే, ఆమె వెంటనే కోలుకోకూడదని ఇతర రోగులు ఆశించసాగారు.

పరిచర్య చెయ్యడానికి మీరు సిద్ధపడిన విధంగానే, మీరు ప్రభువు కొరకు ఒక నాయకురాలిగా ఉండుటకు పిలుపు వచ్చినప్పుడు మీరు దానికి సిద్ధపడగలరు మరియు సిద్ధపడాలి. జనులను నడిపించుటకు మరియు ఆయన వాక్యమును భయము లేకుండా బోధించుటకు, లేఖనముల యెడల ఉన్న మీ లోతైన ప్రేమయందు నాటబడిన, యేసు క్రీస్తునందు విశ్వాసము దానికి అవసరము. అప్పుడు పరిశుద్ధాత్మ మీ స్థిరమైన సహవాసిగా కలిగియుండుటకు మీరు సిద్ధపడియుంటారు. యువతుల అధ్యక్షత్వములో మీ సలహాదారిణి తన స్వరములో భయముతో, “సహోదరి అల్వరెజ్ ఈరోజు అనారోగ్యంతో ఉన్నది, ఆమె పాఠాన్ని ఎవరు బోధిస్తారు?” అని చెప్పినప్పుడు, మీరు “నేను చేస్తాను” అని చెప్పడానికి ఆతృతతో ఉంటారు.

ఒక తల్లి అవ్వమని ప్రభువు ఒక నియమించబడిన కార్యానికి మిమ్మల్ని పిలిచినప్పుడు ఆ అద్భుతమైన దినము కొరకు అటువంటి సిద్ధపాటే అవసరమౌతుంది. కాని ఇంతకు ముందు మీకు అవసరమైన దానికంటే ఇంకా ఎక్కువ ప్రేమగల హృదయము కూడా దానికి అవసరము.. మీ హృదయములో యేసు క్రీస్తునందు విశ్వాసము ఇంతకుముందు ఎప్పటికీ ఉన్నదానికంటే ఎక్కువగా అవసరము. పరిశుద్ధాత్మ యొక్క ప్రభావము, నడిపింపు మరియు ఓదార్పు కొరకు ప్రార్థించుటకు మీరు సాధ్యమా అని భావించిన దానిని మించిన సామర్ధ్యము అవసరము.

తల్లులకు అవసరమైనదేమిటో ఏ యుగములో ఉన్న పురుషుడైనా ఏవిధంగా తెలుసుకోగలడు అని మీరు న్యాయముగా అడగవచ్చును. అది సరియైన ప్రశ్న. పురుషులు ప్రతిదానిని తెలుసుకోలేరు, కానీ దేవుని నుండి వచ్చు బయల్పాటు చేత మనం కొన్ని పాఠాలు నేర్చుకోవచ్చును. మనం గమనించేది అర్థం చేసుకొనుటకు మనకు సహాయపడమని ఆత్మను వెదకుటకు అవకాశమును ఉపయోగించుకొన్నప్పుడు, గమనించుట ద్వారా మనం కూడా చాలా నేర్చుకోవచ్చును.

మేము వివాహము చేసుకొన్నప్పటినుండి 57 సంవత్సరాలుగా కాథ్లీన్ జాన్సన్ ఐరింగ్‌ను నేను గమనిస్తున్నాను. ఆమె నలుగురు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలకు తల్లి. ఇప్పటి వరకు, వందకుపైగా ప్రత్యక్ష కుటుంబ సభ్యులపైన తల్లిగా ప్రభావము చూపుటకు మరియు వందలకు పైగా ఎంతోమందిని సొంత కుటుంబ సభ్యులుగా తన మాతృ హృదయములోనికి దత్తత చేసుకొని ఆమె పిలుపును అంగీకరించింది.

తల్లిలా పాలించుటకు తన మిషనుతో కలిపికలిగియున్నప్పటికీ—ఆయనస్త్రీ యొక్క దైవిక మిషను గురించి అధ్యక్షులు నెల్సన్ యొక్క పరిపూర్ వర్ణన మీరు గుర్తుచేసుకోండి: “తల్లిగా, గురువుగా, లేదా పోషించు పరిశుద్ధురాలిగా, వారు అమర్త్యత్వమును, నిత్యజీవమును పొందుతారనే ఆశతో ఆమె ఇతరుల జీవితాలను ప్రభావితం చేస్తుంది. దేవునితో భాగస్వామిగా, ఆమె దైవిక మిషను ఏదనగా ఆత్మలు జీవించుటకు, ప్రాణాలు పైకెత్తబడుటకు సహాయము చేయుట. ఇదే ఆమె జీవితము యొక్క అత్యంత గొప్ప కార్యసాధనము.”5

నేను గ్రహించినంత దగ్గరగా, నా భార్య కాథ్లీన్ మన తండ్రి యొక్క కుమార్తెలకు, ఇవ్వబడిన బాధ్యతను అనుసరించింది. “దేవునితో భాగస్వామిగా … ఇతరులు అమర్త్యత్వమును, నిత్యజీవమును పొందుతారు అనే ఆశతో ఆమె ఇతరుల జీవితాలను ప్రభావితం చేస్తుంది” అనే మాటలు కీలకమైనవిగా నాకనిపిస్తుంది. ఆమె బలవంతము చెయ్యలేదు. ఆమె ప్రభావము చూపించింది. తన ఆశలకు ఆమె ఒక ప్రాధమిక విధానాన్ని కలిగియుండి, ఆమె ప్రేమించి, పాలించిన వారికి ప్రభావమును చూపించుటకు ప్రయత్నించింది. ఆమె ప్రాథమిక విధానము యేసు క్రీస్తు యొక్క సువార్త—దానిని అనేక సంవత్సరాలుగా ప్రార్థనాపూర్వకంగా గమనించడం ద్వారా నేను చూడగలిగాను.

దేవునితో భాగస్వామ్యమందు నిబంధన స్త్రీగా మారుట వలనే దేవుని యొక్క గొప్ప, మరియు మంచి కుమార్తైలు ఆయన వారి కొరకు సిద్ధపరచిన ఏ మార్గము ఏ స్థలములోనైనా సేవచేస్తూ, ఎల్లప్పుడు తల్లిలా పాలించారు, నడిపించారు, పరిచర్య చేసారు. దేవుని యొక్క నిబంధన-పాటించు కుమార్తైగా ఆయన యొద్దకు తిరిగి వెళ్లినప్పుడు మీ పరలోక గృహమునకు చేయు మీ ప్రయాణములో ఆనందాన్ని కనుగొంటారని నేను మీకు వాగ్దానము చేస్తున్నాను.

తండ్రియైన దేవుడు జీవిస్తున్నారని, ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నారని నేను సాక్ష్యమిస్తున్నాను. ఆయన మీ ప్రార్ధనలకు జవాబిచ్చును. ఆయన ప్రియమైన కుమారుడు, ప్రతి అంశములో యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘమును నడిపిస్తున్నారు. అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఆయన జీవిస్తున్న ప్రవక్త. జోసెఫ్ స్మిత్ పాల్మైరా, న్యుయార్క్‌లోని చెట్ల వనములో తండ్రియైన దేవుడు మరియు యేసు క్రీస్తును చూచి, వారితో మాట్లాడెను. ఇది సత్యమని నాకు తెలుసు. యేసు క్రీస్తు మీ రక్షకుడని కూడ నేను సాక్ష్యమిస్తున్నాను; ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రాయశ్చిత్తఃము ద్వారా, మీరు పరిశుద్ధపరచబడగలరు, ఉన్నతమునకు ఎత్తబడగలరు మరియు పరిశుద్ధ పిలుపులు మీకు వస్తాయి. ఈవిధంగా నేను యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.