2010–2019
ఫలము
2019 అక్టోబర్ సర్వసభ్య సమావేశము


ఫలము

రక్షకుడైన యేసు క్రీస్తుపై, మరియు ఆయన ద్వారా మాత్రమే వచ్చు నిత్య సంతోషముపై మీ కన్నులు మరియు హృదయముల దృష్టిసారించండి.

మీరు ఏమి ఆలోచిస్తున్నారో నాకు తెలుసు! ఇంకొక ప్రసంగీకులు మాత్రమే మిగిలియున్నారు, ఆ తరువాత అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ నుండి మనము వింటాము. మన ప్రియమైన ప్రవక్త కొరకు మనము ఎదురుచూస్తుండగా, మిమ్మల్ని అప్రమత్తంగా ఉంచాలని ఆశిస్తూ, నేను చాలా ఆకర్షణీయమైన అంశమును ఎంపిక చేసాను: నా అంశము ఫలము.

చిత్రం
ఫలము

బెర్రీలు, అరటిపళ్లు, పుచ్చకాయలు, మరియు మామిడి కాయలు, లేక కివానో లేక దానిమ్మకాయ వంటి ఎక్కువ విలక్షణమైన రంగు, రూపము, మరియు తియ్యదనముతో ఫలములు చాలాకాలంగా విలువైనవి రుచికరమైనవిగా ఉన్నవి.

ఆయన భూలోక పరిచర్యలో, రక్షకుడు మంచి ఫలమును నిత్య విలువగల విషయాలతో పోల్చెను. “వారి ఫలముల వలన మీరు వారిని తెలిసికొందురు,”1 అని ఆయన అన్నారు. “ప్రతి మంచి చెట్టు మంచి ఫలమును ఫలించును.”2 “నిత్య జీవార్ధమైన ఫలమును”3 సమకూర్చుకోవాలని ఆయన మనల్ని ప్రోత్సహిస్తున్నారు.

మోర్మన్ గ్రంథములో తన స్పష్టమైన కలలో ప్రవక్త లీహై “అంధకారమైన మరియు విషాదభరితమైన అరణ్యములో” తనను తాను కనుగొనుటను మనము బాగా ఎరుగుదుము. అక్కడ, మురికి నీళ్లు, అంధకారపు పొగమంచు, నిషేధించబడిన దారులు, అదేవిధంగా “ఒకరిని సంతోషపరచుటకు కోరదగిన” అందమైన వృక్షము వద్దకు నడిపించు ఇరుకైన సంకుచితమైన బాట వెంబడి ఇనుప4 దండము అక్కడున్నాయి. కలను జ్ఞాపకము చేసుకుంటా, లీహై ఇలా చెప్పును: “దాని యొక్క ఫలమును . . . తింటిని మరియు అది నేను ఇంతకు ముందు రుచి చూచిన వాటన్నిటి కంటే అతి మధురముగా ఉన్నది . . . [మరియు] అది నా ఆత్మను మిక్కిలి గొప్ప ఆనందముతో నింపెను.“ ఫలము “ఇతర ఫలముల [కంటే] [ఎక్కువ] కోరదగినది.”5

చిత్రం
దాని రుచికరమైన పండ్లతో జీవ వృక్షము

వృక్షము మరియు ఫలము యొక్క అర్థం

మిక్కిలి ప్రశస్తమైన ఫలములతో ఉన్న ఈ వృక్షము దేనిని పోలియున్నది? అది “దేవుని యొక్క ప్రేమను” 6 సూచించును మరియు మన పరలోక తండ్రి యొక్క అద్భుతమైన విమోచన ప్రణాళికను చాటిచెప్పును. “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును, నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.”7

రక్షకుని యొక్క సాటిలేని ప్రాయశ్చిత్తము యొక్క అద్భుతమైన దీవెనలకు ఈ ప్రశస్తమైన ఫలము చిహ్నముగా ఉన్నది. మన మర్త్యత్వము తరువాత మనము తిరిగి జీవించడమే కాదు, కానీ యేసు క్రీస్తునందు మన విశ్వాసము, మన పశ్చాత్తాపము, మరియు ఆజ్ఞలు పాటించుట ద్వారా, మనము మన పాపములనుండి క్షమింపబడగలము మరియు ఒకరోజు మన తండ్రి, ఆయన కుమారుని యెదుట స్వచ్ఛముగా, పరిశుద్ధముగా నిలబడతాము.

వృక్ష ఫలమును తినుట—బాప్తీస్మము తీసుకొనుట, పరిశుద్ధాత్మ యొక్క వరము పొందుట, మరియు మహోన్నతము నుండి శక్తితో వరమివ్వబడుటకు ప్రభువు యొక్క మందిరములో ప్రవేశించుట ద్వారా పునఃస్థాపించబడిన సువార్త యొక్క విధులు మరియు నిబంధనలను మనము హత్తుకొన్నామని తెలియజేయును. యేసు క్రీస్తు యొక్క కృప ద్వారా మరియు మన నిబంధనలను గౌరవించుట ద్వారా, నిత్యత్వమంతటా మన నీతిగల కుటుంబముతో జీవించు అపారమైన వాగ్దానమును మనము పొందుతాము. 8

దూత ఆ ఫలమును “ఆత్మకు మిక్కిలి ఆనందకరమైనది,”9 అని వర్ణించుటలో ఆశ్చర్యము లేదు. అది సత్యము!

యధార్థముగా నిలిచియుండుటకు సవాలు

మనమందరము నేర్చుకున్నట్లుగా, పునఃస్థాపించబడిన సువార్త యొక్క ప్రశస్తమైన ఫలమును రుచి చూసిన తరువాత కూడ, ప్రభువైన యేసు క్రీస్తుకు యధార్ధముగా మరియు విశ్వాసముగా నిలిచియుండుట సులభము కాదు. ఈ సర్వసభ్య సమావేశములో చాలా సార్లు చెప్పబడినట్లుగా, మన హృదయాలను రక్షకుని నుండి మరియు ఆయనను అనుసరించుటలో మనము అనుభవించిన సంతోషములు మరియు అందములను లాగివేయుటకు ప్రయత్నించు అంతరాయములు, మోసములు, కలవరము, కల్లలోలము, ప్రలోభాలు మరియు శోధనలను మనము నిరంతరము ఎదుర్కొంటాము.

ఈ దుర్దశ వలన, లీహై కలలో ఒక హెచ్చరిక కూడ ఉన్నది! నదికి మరొక వైపు ఉన్న విశాలమైన భవనములో అన్ని వయస్సులు గల జనులు వారి వేళ్లను యేసు క్రీస్తు యొక్క నీతిగల అనుచరుల వైపు చూపుతూ, ఎగతాళి చేస్తూ, వెక్కిరిస్తున్నారు.

భవనములోని జనులు ఆజ్ఞలను పాటించు వారిని ఎగతాళి చేస్తూ, నవ్వుతూ యేసు క్రీస్తు యందు మరియు ఆయన సువార్తయందు వారి విశ్వాసమును అపహాస్యము చేసి, అపకీర్తి తేవాలని ఆశిస్తూ ఉన్నారు. విశ్వాసులపై సందేహము మరియు ద్వేషముగల మాటల దాడులను ప్రారంభించుట వలన, ఫలమును రుచి చూచిన వారిలో కొందరు ఒకప్పుడు వారు హత్తుకొనిన సువార్తను బట్టి సిగ్గుపడసాగారు. లోకములోని తప్పుడు ప్రలోభాలు వారిని ఆకర్షించును; వారు వృక్షము మరియు ఫలము నుండి తొలగిపోయారు, మరియు ప్రభువు యొక్క మాటలలో, “నిషేధించబడిన బాటలలో [పడిపోయారు] మరియు [తప్పిపోయారు].”10

నేటి మన లోకములో, అపవాది యొక్క నిర్మాణ సిబ్బింది పెద్ద, విశాలమైన భవనమును పెద్దదిగా చేయుటకు అతివేగంగా ఎక్కువ కాలము పని చేస్తున్నారు. ఇంటర్నెట్‌లో ఎగతాళి చేయు విషయాలు, అపహాస్యము చేయు జనులు బిగ్గరగా అభిప్రాయాలను వ్యక్తపరచుచుండగా, మన గృహాలను ప్రవేశించుటకు ఆశిస్తూ, నదిని దాటి పెద్ద విశాలమైన భవనము విస్తృతపరచబడింది.11

అధ్యక్షులు నెల్సన్ ఇలా వివరించారు, “సాక్ష్యములను భంగపరచుటకు, ప్రభువు యొక్క పనిని ఆటంకపరచుటకు అపవాది తన ప్రయత్నాలను నాలుగు రెట్లు ఎక్కువ చేసెను.”12 లీహై మాటలు మనము జ్ఞాపకముంచుకొందాం: “మేము వారిని లక్ష్యపెట్టలేదు.”13

మనము భయపడనవసరము లేనప్పటికినీ, మనము జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు చిన్న విషయాలు మన ఆత్మీయ సమతుల్యతను అంతరాయపరచవచ్చును. దయచేసి మీ ప్రశ్నలు, ఇతరుల అవమానాలు, విశ్వాసములేని స్నేహితులు, లేక దురదృష్టకరమైన పొరపాట్లు మరియు నిరాశలు ప్రశస్తమైన వృక్ష ఫలమునుండి వచ్చు మధురమైన, స్వచ్ఛమైన, మరియు ఆత్మను-తృప్తిపరచు దీవెనలనుండి మిమ్మల్ని మరల్చివేయుటకు అనుమతించకుము. రక్షకుడైన యేసు క్రీస్తుపై, మరియు ఆయన ద్వారా మాత్రమే వచ్చు నిత్య సంతోషముపై మీ కన్నులు మరియు హృదయముల దృష్టిసారించుము.

జేసన్ హాల్ యొక్క విశ్వాసము

జూన్‌లో, నా భార్య క్యాథీ, నేను జేసన్ హాల్ యొక్క అంత్య క్రియలకు హాజరయ్యాము. ఆయన మరణించే సమయంలో, ఆయన వయస్సు 48 సంవత్సరాలు మరియు పెద్దల సమూహపు అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు.

అతడి జీవితమును మార్చిన సంఘటనను గూర్చి జేసన్ యొక్క మాటలు ఇక్కడున్నాయి:

“ [15 సంవత్సరాలప్పుడు] [నేను] సముద్రంలో డైవింగ్ ప్రమాదంలో చిక్కుకున్నాను. … నా మెడను [విరగొట్టుకున్నాను] మరియు ఛాతి నుండి క్రిందకు పక్షవాతపడ్డాను. నా కాళ్ళు పూర్తి నియంత్రణను మరియు నా చేతులు పాక్షిక నియంత్రణను నేను కోల్పోయాను. నేను ఇక నడవలేకపోయాను, నిలబడలేకపోయాను, … లేక నాకై నేను తినలేకపోయాను. నేను ఊపిరి తీసుకోలేకపోయాను లేక లేక మాట్లాడలేకపోయాను.”14

“‘నా [పరలోకమందున్న] తండ్రి,’ ‘నేను నా చేతులను మాత్రమే కలిగియున్న యెడల, నేను దానిని చేయగలనని నేను ఎరుగుదునని ప్రాధేయపడ్డాను. దయచేసి, తండ్రి, దయచేసి. …

“… నా కాళ్లను ఉంచుము, తండ్రీ నా చేతుల ఉపయోగము కొరకు మాత్రమే నేను ప్రార్ధిస్తున్నాను.’” 15

జేసన్ ఎన్నడూ తన చేతుల ఉపయోగమును పొందలేదు. విశాలమైన భవనము నుండి స్వరములను మీరు వినగలరా? “జేసన్ హాల్, దేవుడు నీ ప్రార్థనలు వినలేదు! దేవుడు ప్రేమగల దేవుడైతే, ఆయన నిన్ను ఇలా ఎందుకు వదిలివేస్తాడు? క్రీస్తుయందు విశ్వాసము ఎందుకు?” జేసన్ హాల్ వారి స్వరములను విన్నాడు కానీ వారిని లక్ష్యపెట్టలేదు. బదులుగా అతడు వృక్ష ఫలమును విందారగించాడు. యేసు క్రీస్తుయందు అతడి విశ్వాసము స్థిరమైనదిగా మారెను. అతడు విశ్వవిద్యాలయమునుండి పట్టభద్రతను పొందాడు, మరియు కాలెట్ కొల్‌మన్‌ను దేవాలయములో వివాహము చేసుకున్నాడు, ఆమెను తవ జీవితము యొక్క ప్రేమగా”16 వర్ణించాడు. 16 సంవత్సరాల వివాహము తరువాత, మరొక అద్భుతము, వారి ప్రశస్తమైన కుమారుడు కోల్‌మాన్ జన్మించాడు.

చిత్రం
జేసన్ మరియు కాలెట్ హాల్
చిత్రం
హాల్ కుటుంబము

వారి విశ్వాసమును వారు ఎలా పెంచుకున్నారు? కాలెట్ వివరించింది: “మేము దేవుని యొక్క ప్రణాళిక యందు నమ్మకముంచాము. అది మాకు నిరీక్షణను ఇచ్చింది. [భవిష్యత్తు దినములో] జేసన్ పూర్తి ఆరోగ్యవంతుడవుతాడని మేము ఎరుగుదుము. … దేవుడు ఒక రక్షకుడని ఇచ్చాడని, ఆయన ప్రాయశ్చిత్త త్యాగము మేము వదలివేయాలని అనుకున్నప్పుడు ఎదురు చూస్తూ ఉండటానికి మాకు సాధ్యపరచిందని మేము ఎరుగుదుము.”17

చిత్రం
కోల్‌మెన్ హాల్

జేసన్ యొక్క అంత్యక్రియల వద్ద మాట్లాడుతూ, 10 సంవత్సరాల కోల‌్‌మాన్ తన తండ్రి తనకు “పరలోక తండ్రి మన కొరకు ప్రణాళికను కలిగియున్నాడని, భూమిమీద జీవితము అద్భుతంగా ఉంటుందని, మరియు మనము కుటుంబాలుగా జీవించ వచ్చని తనకు బోధించాడని చెప్పాడు. … కానీ … మనము కష్టమైన విషయాలను చేయాలి మరియు మనము తప్పులు చేస్తాము.”

కోల్‌మాన్ కొనసాగించాడు: “పరలోక తండ్రి తన కుమారుడైను యేసును, భూమి మీదకు పంపెను. ఆయన పని పరిపూర్ణముగా ఉండుట. జనులను స్వస్థపరచుట. వారిని ప్రేమించుట. మరియు తరువాత మన బాధ, విచారములు, మరియు పాపములను భరించుట. తరువాత ఆయన మన కొరకు చనిపోయాడు.” తరువాత కోల్‌మన్ జోడించాడు, “ఆయన దీనిని చేసారు కనుక, ఇప్పుడు నేను ఎలా భావిస్తున్నానో యేసు ఎరుగును.

“యేసు చనిపోయిన మూడు రోజుల తరువాత, ఆయన … మరలా తన పరిపూర్ణమైన శరీరంతో తిరిగి బ్రతికెను. ఇది నాకు ముఖ్యమైనది ఎందుకనగా మా [నాన్న] శరీరము పరిపూర్ణముగా ఉండును మరియు ఒక కుటుంబముగా మేము కలిసి ఉంటాము.”

చిత్రం
హాల్ కుటుంబము

కోల్‌మాన్ కొనసాగించాడు: “నేను చిన్నబిడ్డగా ఉన్నప్పటి నుండి, మా నాన్న ప్రతీరోజు ఇలా చెప్పాడు, ‘నాన్న నిన్ను ప్రేమిస్తున్నాడు, పరలోక తండ్రి నిన్ను ప్రేమిస్తున్నాడు, మరియు నీవు మంచి బాలుడవు.’”18

యేసు క్రీస్తు వలన ఆనందం కలుగుతుంది

హాల్ కుటుంబము ఎందుకు సంతోషమును, నిరీక్షణను భావిస్తున్నారో అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ వివరించారు. ఆయన చెప్పెను:

“మనము అనుభవించు సంతోషము మన జీవితపు పరిస్థితులతో పెద్దగా సంబంధము లేదు మరియు మన జీవితముల యొక్క దృష్టితో పూర్తి సంబంధము కలిగియున్నది.

“మన జీవితాల యొక్క దృష్టి దేవుని యొక్క రక్షణ ప్రణాళిక … యేసు క్రీస్తు మరియు ఆయన సువార్త పై ఉన్నప్పుడు, మన జీవితాలలో—జరుగుచున్నది లేక జరగని దానిని లక్ష్యపెట్టకుండా సంతోషమును అనుభవించవచ్చును. సంతోషము ఆయన వలన, ఆయన నుండి వచ్చును. ఆయన సమస్త సంతోషము యొక్క ఆధారము. …

“మనము లోకము వైపు చూసిన యెడల … , మనము ఎప్పటికీ సంతోషమును ఎరుగము. … యేసు క్రీస్తుచేత బోధించబడినట్లుగా, నీతిగా జీవించుటకు ఉద్దేశ్యపూర్వకంగా ప్రయత్నించుట నుండి వచ్చు వరము [సంతోషము].19

మీరు తిరిగి వచ్చినప్పుడు ఒక వాగ్దానం

మీరు కొంతకాలము వృక్ష ఫలము లేకుండా ఉన్న యెడల, రక్షకుని యొక్క బాహువులు ఎల్లప్పుడు మీ వైపు చాపబడియున్నవని నేను వాగ్దానము చేస్తున్నాను. ఆయన ప్రేమతో సైగ చేస్తున్నారు, “పశ్చాత్తాపము పొంది, నా యొద్దకు రండి.”20 ఆయన ఫలము సమృద్ధియైనది మరియు ఎల్లప్పుడు యుక్త సమయులో ఉన్నది. అది డబ్బుతో కొనలేనిది, మరియు దానిని నిజాయితీగా కోరిన వారెవ్వరూ నిరాకరించబడరు.21

చెట్టు వద్దకు తిరిగి వెళ్లి, మరలా ఫలమును తిరిగి రుచి చూడాలని కోరు వారెవరైనా మీ పరలోక తండ్రికి ప్రార్ధించుట ద్వారా ప్రారంభించగలరు. యేసుక్రీస్తు మరియు ఆయన ప్రాయశ్చిత్త త్యాగము యొక్క శక్తి యందు నమ్మకముంచుము. “ప్రతీ ఆలోచనయందు”22 రక్షకుని వైపు మీరు చూసినప్పుడు, వృక్ష ఫలము మరలా మీదగను, మీ అభిరుచికి రుచికరమైనది, మీ ఆత్మకు ఆనందకరమైనది అగునని, “దేవుని యొక్క వరములన్నిటి కంటే మిక్కిలి గొప్పది,”23 అని నేను మీకు వాగ్దానమిస్తున్నాను.

చిత్రం
లిస్బన్ దేవాలయమును ప్రతిష్ఠించు సమయంలో పోర్చుగీసు పరిశుద్ధులతో ఎల్డర్ అండర్సన్

మూడు వారముల క్రితం ఇదే రోజు, క్యాథీ, నేను లిస్బన్ పోర్చుగల్ దేవాలయ ప్రతిష్ఠకు హాజరైనప్పుడు, రక్షకుని ఫలము యొక్క సంతోషము పూర్తి ప్రదర్శనను నేను చూసాను. మతపరమైన స్వేచ్ఛ లభ్యమైనప్పుడు, 1975 లో పునఃస్థాపించబడిన సువార్త సత్యములు పోర్చుగల్‌కు తెరవబడెను. సమూహములు లేక, సంఘ భవనాలు మరియు 1,000 మైళ్లు దగ్గరలో ఏ దేవాలయము లేనప్పడు ఫలమును మొదట రుచి చూసిన అనేకమంది ఘనులైన పరిశుద్ధులు పోర్చుగల్ లిస్బన్‌లో, ప్రభువు యొక్క మందిరములో ఇప్పుడు ప్రశస్తమైన వృక్ష ఫలము ఉన్నందుకు మాతోపాటు ఆనందించారు. వారి హృదయాలను రక్షకునిపై దృష్టిసారించిన ఈ కడవరి దిన పరిశుద్ధులను నేను ఎంతగా గౌరవిస్తున్నాను మరియు నమస్కరిస్తున్నాను.

“ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును: నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు,”24 అని రక్షకుడు చెప్పెను.

ఈ ఉదయము ప్రపంచమంతటా సభ్యులతో మాట్లాడుతూ అధ్యక్షులు నెల్సన్ ఇలా చెప్పారు, “నా ప్రియమైన సహోదర, సహోదరిలారా, మీరు యేసు క్రీస్తు యొక్క బోధనలు అనుసరించుట నుండి వచ్చు ఫలముల యొక్క జీవిస్తున్న నిదర్శనములు. తరువాత ఆయన: “నేను మీకు ధన్యవాదాలు! అని చెప్పారు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను!”25

అధ్యక్షులు నెల్సన్, మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాము.

మన ప్రియమైన అధ్యక్షునిపై ఉంచబడిన బయల్పాటు యొక్క శక్తికి నేను ప్రత్యక్ష సాక్షిని. ఆయన దేవుని యొక్క ప్రవక్త. పాతకాలపు లీహై వలే, వచ్చి వృక్ష ఫలమును భుజించమని అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ మనల్ని, దేవుని యొక్క సమస్త కుటుంబముకు సైగ చేస్తున్నారు. ఆయన సలహాను అనుసరించుటకు దీనమనస్సును మరియు బలమును మనము కలిగియుండెదము గాక.

యేసు క్రీస్తు దేవుని యొక్క కుమారుడని నేను సవినయముగా సాక్ష్యమిస్తున్నాను. ఆయన ప్రేమ, శక్తి, మరియు కృప శాశ్వతమైన విలువగల సంగతులన్నిటిని తెచ్చును. ఆవిధంగా నేను యేసు క్రీస్తు నామములో సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.

వివరణలు

  1. మత్తయి 7:16.

  2. మత్తయి 7:17.

  3. యోహాను 4:36.

  4. జనవరి 2007 ప్రారంభంలో, డెబ్బది యొక్క అధ్యక్షత్వములో సభ్యునిగా బ్రిగం యంగ్ విశ్వవిద్యాలయంలో మార్చి 4, 2007 న ఇవ్వబోతున్న భక్తి ప్రసంగం కోసం, అదే ప్రేక్షకుల ముందు ఫిబ్రవరి 4, 2007 న ప్రసంగం ఇవ్వడానికి సిద్ధమవుతున్న ఎల్డర్ డేవిడ్ ఎ. బెడ్నార్‌ను ఆయన ఏమి సిద్ధపడుతున్నారు అని అడిగాను. తన ప్రసంగము ఇనుప దండమును గట్టిగా పట్టుకొనియుండుట అని చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. సరిగ్గా ఈ అంశాన్నే నా ప్రసంగము కొరకు ఎంచుకొన్నాను. మా మూల గ్రంథాన్ని ఒకరితో ఒకరం పంచుకున్న తరువాత, మా విధానాలు భిన్నంగా ఉన్నాయని మేము గ్రహించాము. “జీవజలము గల నిల్వప్రదేశం,” అనే పేరుగల ఆయన ప్రసంగము లేఖనాలలో ఉన్నట్లుగా ఇనుప దండము లేదా దేవుని వాక్యమును నొక్కిచెప్పింది. ఆయన ప్రసంగములో ఆయన ఇలా ప్రశ్నించారు, “ మనము ఇనుప దండమును గట్టిగా పట్టుకొనగలుగునట్లు చేసే విధంగా మీరు, నేను అనుదినము లేఖనాలను చదువుతు, అధ్యయనము చేయుచు మరియు వెతుకుతున్నామా?” (speeches.byu.edu).

    ఎల్డర్ బెడ్నార్‌తో సంభాషణ జరిగిన ఒక వారం తరువాత, అధ్యక్షులు బాయిడ్ కే. ప్యాకర్ “మీరు మరియు లీహై కల” అనే శీర్షికతో బివైయు ఆరాధనలో ప్రసంగించారు. అధ్యక్షులు ప్యాకర్ ఇనుప దండము అనేది పరిశుద్ధాత్మ ద్వారా మనకు వచ్చే వ్యక్తిగత బయల్పాటు మరియు ప్రేరేపణ అని నొక్కిచెప్పారు. “మీరు ఇనుప దండమును పట్టుకొనియుంటే, పరిశుద్ధాత్మ వరముతో ముందుకు పోయే మీ మార్గాన్ని మీరు భావించగలరు. … ఇనుప దండమును పట్టుకొనియుండి, దానిని వదిలి పెట్టవద్దు. పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా జీవితములో మార్గాన్ని భావించగలరు” (జన. 16, 2007, speeches.byu.edu).

    మార్చి 2007లో“ప్రవక్తల మాటలను గట్టిగా పట్టుకొనియుండండి,” అనే నా అంశము ఇనుప దండము జీవిస్తున్న ప్రవక్తల మాటలను సూచిస్తుంది (మార్చి. 4, 2007, speeches.byu.edu).

    ఈ మూడు ప్రసంగాల మధ్య సంబంధం యాదృచ్చికం కాదు. ఇనుప దండము లేదా దేవుని వాక్యము మూడు విధాలుగా గుర్తించబడి ఒకే ప్రేక్షకులకు మూడు ప్రసంగాలు సిద్ధపరచబడినప్పుడు ప్రభువు యొక్క హస్తము పనిచేసింది: (1) లేఖనాలు లేదా ప్రాచీన ప్రవక్తల మాటలు; (2) జీవించుచున్న ప్రవక్తల మాటలు; మరియు (3) పరిశుద్ధాత్మ యొక్క శక్తి. ఇది నాకు నేర్చుకొనదగినట్టిఒక ముఖ్యమైన అనుభవం.

  5. 1 నీఫై 8:4-12 చూడండి

  6. 1 నీఫై 11:25.

  7. యోహాను 3:16.

  8. డేవిడ్ ఏ. బెడ్నార్, “Lehi’s Dream: Holding Fast to the Rod,” లియహోానా, Oct. 2011, 32–37 చూడండి.

  9. 1 నీఫై 11:23.

  10. 1 నీఫై 8:28.

  11. బాయిడ్ కే.ప్యాకర్, “Lehi’s Dream and You” (Brigham Young University devotional, Jan. 16, 2007), speeches.byu.edu చూడండి.

  12. రస్సెల్ ఎమ్. నెల్సన్, “We Can Do Better and Be Better,” లియహోనా, మే 2019, 68.

  13. 1 నీఫై 8:33.

  14. స్టీఫెన్ జేసన్ హాల్, “The Gift of Home,” న్యూ ఎరా, డిసెం. 1994, 12.

  15. స్టీఫెన్ జేసన్ హాల్, “Helping Hands,” న్యూ ఎరా, అక్టో. 1995, 46, 47.

  16. కాలిట్ హాల్ నుండి ఎల్డర్ ఆండర్సన్‌కు వ్యక్తిగత ప్రత్యుత్తరము.

  17. కాలిట్ హాల్ నుండి ఎల్డర్ ఆండర్సన్‌కు వ్యక్తిగత ప్రత్యుత్తరము.

  18. కోల్‌మన్ యొక్క అంత్యక్రియల ప్రసంగము, కాలిట్ హాల్ చేత ఎల్డర్ ఆండర్సన్‌ తో పంచుకొనబడింది.

  19. రస్సెల్ ఎమ్. నెల్సన్, “Joy and Spiritual Survival,” లియహోనా, నవం. 2016, 82, 84.

  20. 3 నీఫై 21:6.

  21. 2  నీఫై 26:25, 33 చూడండి.

  22. సిద్ధాంతము మరియు నిబంధనలు 6:36.

  23. 1  నీఫై 15:36.

  24. యోహాను 15:5.

  25. రస్సెల్ ఎమ్. నెల్సన్, “The Second Great Commandment,” లియహోనా, నవం. 2019, xx.