సర్వసభ్య సమావేశము
పరిచయ సందేశం
2022 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


పరిచయ సందేశం

మేము ఈ ప్రత్యేక సభలో దేవుని కుమార్తెలు మరియు వారి సంస్థలకు సంబంధించిన వాటిపై దృష్టి పెట్టడం ద్వారా వారిని గౌరవిస్తాము.

నా ప్రియమైన సహోదరీలారా, సర్వసభ్య సమావేశము యొక్క ఈ ప్రత్యేక స్త్రీల సభను మనము ప్రారంభిస్తున్నప్పుడు, ప్రథమ అధ్యక్షత్వము నుండి ఈ పరిచయ సందేశాన్ని ఇవ్వడానికి నేను సంతోషిస్తున్నాను.

మన శనివారపు సభలు విభిన్న ఉద్దేశ్యాలు మరియు విభిన్న ప్రేక్షకుల చరిత్రను కలిగియున్నాయి. ఈ సాయంత్రము మనము ఊహించదగిన భవిష్యత్తు కొరకు క్రొత్త ఉద్దేశ్యము మరియు ప్రక్రియను ప్రారంభించినప్పుడు ఆ చరిత్రకు మేము జోడించాము. యేసు క్రీస్తు యొక్క సువార్త మార్పు చెందదు. సువార్త సిద్ధాంతము మార్పు చెందదు. మన వ్యక్తిగత నిబంధనలు మారవు. కానీ సంవత్సరాలుగా, మా సందేశాలను తెలుపుటకు మేము జరిపే సమావేశాలు మారతాయి మరియు బహుశా సంవత్సరాలు గడిచేకొద్దీ మారడం కొనసాగవచ్చు.

ప్రస్తుతానికి, ఈ శనివారం సాయంత్రం సమావేశము సర్వసభ్య సమావేశము యొక్క ఒక సభ, ఏ సంస్థ యొక్క సభ కాదు. సర్వసభ్య సమావేశము యొక్క అన్ని సభల వలె, ప్రణాళిక చేయుట, ప్రసంగీకులు మరియు సంగీతము ప్రథమ అధ్యక్షత్వము చేత ప్రణాళిక చేయబడ్డాయి.

ఈ సభను నిర్వహించమని ఉపశమన సమాజము యొక్క ప్రధాన అధ్యక్షురాలైన, అధ్యక్షురాలు జీన్ బి. బింగమ్‌ను మేము అడిగాము. భవిష్యత్తులో శనివారం సాయంకాల సభలు ప్రథమ అధ్యక్షత్వము చేత ప్రణాళిక చేయబడి, ఉపశమన సమాజము, యువతులు మరియు ప్రాథమిక ప్రధాన అధ్యక్షత్వముల యొక్క సభ్యులు వంటి సంఘపు ఇతర ప్రధాన అధికారులలో ఒకరి చేత నిర్వహించబడవచ్చు.

నేటి రాత్రి, సర్వసభ్య సమావేశము యొక్క ఈ శనివారం సాయంత్రపు సభ కడవరి దిన పరిశుద్ధ స్త్రీలకు సంబంధించిన వాటిపై దృష్టిసారిస్తుంది. ఇది యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘ సిద్ధాంతము, ప్రత్యేకంగా స్త్రీలకు సంబంధించిన సంఘ విధానాలు, ప్రధాన బాధ్యతలు, సంఘ స్త్రీలు మరియు బాలికలను కలిపియున్న సంస్థల పనిని కలిగియున్నది. సర్వసభ్య సమావేశాలలోని అన్ని సభల మాదిరిగానే ప్రపంచవ్యాప్త ప్రేక్షకులకు ఉద్దేశపూర్వకంగా ప్రసారం చేయబడినప్పటికీ, ఈ సభకు సమావేశ కేంద్రములో హాజరు కావడానికి ఆహ్వానించబడిన ప్రేక్షకులు 12 ఏళ్ళు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళలు మరియు బాలికలు. పాల్గొనే సంస్థలపై అధ్యక్షత్వం వహించే కొందరు యాజకత్వ నాయకులను మేము చేర్చాము.

మేము ఇక్కడ ప్రారంభిస్తున్నది ప్రభువు యొక్క ప్రపంచవ్యాప్తమైన సంఘ నాయకత్వం మరియు సభ్యత్వానికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచార వనరులకు ప్రతిస్పందిస్తుంది. యేసు క్రీస్తు సువార్త యొక్క సిద్ధాంతం ప్రతీఒక్కరి కొరకైనది, కాబట్టి అది మన ప్రధాన ఉద్దేశ్యం మరియు ప్రసారము యొక్క పరిధి. మేము ఈ ప్రత్యేక సభలో దేవుని కుమార్తెలు మరియు వారి సంస్థలకు సంబంధించిన వాటిపై దృష్టి పెట్టడం ద్వారా వారిని గౌరవిస్తాము.

ఇప్పుడు దూరముగా ఉన్న నిర్దిష్టమైన ప్రేక్షకుల కొరకు ప్రసంగించుట ద్వారా వివరణాత్మక శిక్షణనిచ్చే సామర్థ్యాన్ని సంఘ నాయకులకు అందించినందుకు ప్రసార సాంకేతిక విద్య కొరకు మేము కృతజ్ఞత కలిగియున్నాము. ప్రస్తుతం ప్రయాణ అవకాశాలు పెరుగుతున్నాయనే వాస్తవాన్ని కూడా మేము స్వాగతిస్తున్నాము. దూరంలో ఉన్నవారికి అవసరమైన క్రమమైన ముఖాముఖి నాయకత్వ శిక్షణను నిర్వహించడానికి సంఘ నాయకులను పంపడానికి అది మాకు వీలు కల్పిస్తుంది.

ఇది ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కార్యము. మేము ఆయన సేవకులము, ఆయన పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నాము. ఈ సంస్థల యొక్క నాయకులపై, ఈ సంస్థలలో మరియు వారి వ్యక్తిగత జీవితాలలో ప్రభువుకు సేవ చేస్తున్న విశ్వాసులైన స్త్రీలు, బాలికలపై మన ప్రభువు యొక్క దీవెనల కొరకు మేము ప్రార్థిస్తున్నాము. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.