సర్వసభ్య సమావేశము
పరివర్తనే మన లక్ష్యం
2022 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


పరివర్తనే మన లక్ష్యం

పరిశుద్ధాత్మ మీతో నేరుగా మాట్లాడుట వింటూ, లేఖనాలలో మీరు గడిపే సమయానికి, ప్రత్యమ్నాయము ఏదీ లేదు.

ఇప్పుడు కేవలము మూడు సంవత్సరాలుగా, ప్రభువు యొక్క సంఘ సభ్యులుగా మనము కలిసి ప్రయాణము చేస్తున్నాము. 2018 అక్టోబరులో ప్రధమ అధ్యక్షత్వము మరియు పన్నెండుమంది అపొస్తలుల సమూహము రండి, నన్ను అనుసరించండి వనరు మన మార్గదర్శిగా, క్రొత్త, ప్రేరేపించబడిన శైలిలో లేఖనాలను అధ్యయనము చేయడం ద్వారా యేసు క్రీస్తును గూర్చి నేర్చుకోమని మనల్ని ఆహ్వానించారు.

ఏదైనా ప్రయాణంలో, మన అభివృద్ధిని అంచనా వేయడానికి మరియు ఇంకా మనం లక్ష్యమువైపు వెళ్తున్నామని నిర్ధారించుకోవడానికి అప్పడప్పుడు ఆగడం మంచిది.

పరివర్తనే మన లక్ష్యం

రండి, నన్ను అనుసరించండి పరిచయము నుండి ఈ లోతైన వ్యాఖ్యానాన్ని పరిగణించండి:

“సమస్త సువార్త శిక్షణ మరియు బోధించడం యొక్క లక్ష్యం ఏమిటంటే పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తుకు మన పరివర్తనను లోతుగా చేయడం. …

“ … మన విశ్వాసాన్ని బలపరచి, పరివర్తన యొక్క అద్భుతానికి నడిపించే ఆ రకమైన సువార్త అభ్యాసమంతా ఒకేసారి జరగదు. ఇది తరగతి గదుల నుండి మన హృదయాలు మరియు గృహాలకు వ్యాపిస్తుంది. సువార్తను అర్థం చేసుకొని, జీవించడానికి నిలకడగల, అనుదిన ప్రయత్నాలు దానికి అవసరము. నిజమైన పరివర్తనకు నడిపించే సువార్త శిక్షణకు పరిశుద్ధాత్మ యొక్క ప్రభావము అవసరము.”1

మనము కోరే అద్భుతము ఇదే—ఒక వ్యక్తి లేఖనాలలో ఒక అనుభవము కలిగియున్నప్పుడు, 2 ఆ అనుభవము పరిశుద్ధాత్మ యొక్క ప్రభావము చేత దీవించబడుతుంది. అటువంటి అనుభవాలు రక్షకునికి మన పరివర్తన కొరకు ప్రశస్తమైన ప్రధాన అంశాలు. అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఈమధ్య మనకు గుర్తు చేసినట్లుగా, ఆత్మీయ పునాదులు స్థిరముగా బలపరచబడాలి.3 దీర్ఘకాలికమైన మార్పు అనేది జీవితకాల ప్రక్రియ.4 పరివర్తనే మన లక్ష్యం.

ఎక్కువ ప్రభావవంతంగా ఉండటానికి, లేఖనాలతో మీ అనుభవాలు మీ స్వంతంగా ఉండాలి.5 మరొక వ్యక్తి యొక్క అనుభవాలు మరియు అంతర్‌జ్ఞానములు సహాయకరంగా ఉండవచ్చు కానీ, అవి అదేవిధమైన మార్పు తెచ్చే శక్తిని తేలేవు. పరిశుద్ధాత్మ మీతో నేరుగా మాట్లాడుట వింటూ, లేఖనాలలో మీరు గడిపే సమయానికి, ప్రత్యమ్నాయము ఏదీ లేదు.

పరిశుద్ధాత్మ నాకు ఏమి బోధిస్తుంది?

ప్రతీ వారము నేను రండి, నన్ను అనుసరించండి చేతిపుస్తకమును తెరచినప్పుడు, పేజీపైన ఈ ప్రశ్నను నేను వ్రాస్తాను: “ఈ వారము ఈ అధ్యయాలను నేను చదివినప్పుడు, పరిశుద్ధాత్మ నాకు ఏమి బోధిస్తుంది?”

నేను లేఖనాలు చదువుతున్నప్పుడు, ఆ ప్రశ్నను నేను పలుమార్లు ధ్యానిస్తాను. మరియు విఫలము కాకుండా, ఆత్మీయ భావనలు వస్తాయి, మరియు నా చేతిపుస్తకంలో వాటిని నేను వ్రాస్తాను.

ఇప్పుడు, పరిశుద్ధాత్మ నాతో ఎప్పుడు మాట్లాడుతుందని నాకు ఎలా తెలుస్తుంది? మంచిది, అది స్వల్పమైన, సాధారణమైన విధానాలలో జరుగుతుంది. కొన్నిసార్లు ఒక లేఖన భాగము నా ఆసక్తిని చాలా గమనించేదిగా కనబడుతుంది. మిగిలిన సమయాలలో, సువార్త సూత్రమును గూర్చి విస్తారమైన అవగాహనతో నా మనస్సు జ్ఞానవృద్ధి కలిగించబడినట్లు నేను బావిస్తాను. నా భార్య, యాన్ని మారీ, నేను కలిసి మేము చదివే దాని గురించి మాట్లాడినప్పుడు కూడ పరిశుద్ధాత్మ యొక్క ప్రభావాన్ని అనుభవిస్తాను. ఆమె దృష్టికోణము ఎల్లప్పుడు ఆత్మను ఆహ్వానిస్తుంది.

ప్రవక్త మరియు పస్కా

ఈ సంవత్సరము మన గృహాలలో, ఆదివారపు బడిలో క్రొత్త నిబంధన గూర్చి నేర్చుకొంటున్నాము. పాత నిబంధన చదువుచుండగా, నమ్మకమైన మార్గదర్శులతో నేను సమయాన్ని గడుపుతున్నట్లుగా భావించాను: ఆదాము, హవ్వ, హానోకు, నోవా, అబ్రహాము, మరియు అనేకమంది ఇతరులు.

ఈ వారము, నిర్గమకాండము 7--13 అధ్యయనము చేయుచుండగా, ఐగుప్తులో శతాబ్దాల దాస్యము నుండి ఇశ్రాయేలీయులను ప్రభువు ఎలా విడిపించాడో మనము నేర్చుకున్నాము. ఫరో తన హృదయాన్ని మృదువుగా చేసుకోకుండా ప్రత్యక్షంగా చూసిన తొమ్మిది తెగుళ్ల గురించి—దేవుని శక్తికి సంబంధించిన తొమ్మిది ఆకట్టుకునే వ్యక్తీకరణల గురించి మనం చదువుతాము.

పదవ తెగులు గురించి—ఇశ్రాయేలులో ప్రతీ కుటుంబము దాని కోసం ఎలా సిద్ధపడగలరో ప్రభువు తన ప్రవక్త మోషే గురించి చెప్పాడు. వారు పస్కా అని పిలిచే ఒక ఆచారంలో భాగంగా, ఇశ్రాయేలీయులు మచ్చలేని ఒక మగ గొర్రెను బలి ఇవ్వాలి. తరువాత వారు గొఱ్ఱెపిల్ల రక్తముతో వారి గృహాల ద్వారపు బంధాలను గుర్తించాలి. రక్తంతో గుర్తించబడిన ఇళ్లన్నీ రాబోయే భయంకరమైన తెగుళ్ళ నుండి రక్షించబడతాయని ప్రభువు వాగ్దానం చేశాడు.

“ప్రభువు … మోషేకు ఆజ్ఞాపించినట్లుగా … ఇశ్రాయేలీయులు వెళ్లి ఆలాగు చేసిరి” (నిర్గమకాండము 12:28). విధేయత యొక్క ఆ సాధారణ ప్రకటనలో చాలా శక్తివంతమైన విషయం ఉంది.

ఇశ్రాయేలీయులు మోషే యొక్క సలహాను అనుసరించి విశ్వాసంతో ప్రవర్తించినందున, వారు తెగులు నుండి రక్షించబడ్డారు మరియు కాలక్రమేణా, వారి చెర నుండి విముక్తి పొందారు.

అయితే ఈ అధ్యయాలలో పరిశుద్ధాత్మ నాకు ఏమి బోధిస్తున్నాడు?

నాకు ముఖ్యమైనవిగా భావించే కొన్ని ఆలోచనలు ఇక్కడున్నాయి:

  • ఆయన తన జనులను కాపాడి, రక్షించడానికి ఆయన ప్రవక్త ద్వారా ప్రభువు పనిచేస్తాడు.

  • ప్రవక్తను అనుసరించడానికి విశ్వాసము మరియు వినయము తరువాత భద్రత మరియు విడుదల యొక్క అద్భుతము జరుగుతుంది.

  • ద్వారబందములపైన రక్తము యేసు క్రీస్తు, దేవుని గొఱ్ఱె పిల్ల యందు అంతర్ విశ్వాసము యొక్క బాహ్య చిహ్నముగా ఉన్నది.

ప్రవక్త మరియు ప్రభువు యొక్క వాగ్దానములు

ఈ పాత నిబంధన వృత్తాంతంలో ప్రభువు తన ప్రజలను ఆశీర్వదించిన విధానానికి మరియు నేడు ఆయన తన ప్రజలను కూడా ఆశీర్వదిస్తున్న విధానానికి మధ్య ఉన్న సమాంతరతతో నేను ఆకట్టుకోబడ్డాను.

ప్రభువు యొక్క జీవిస్తున్న ప్రవక్త, అధ్యక్షులు నెల్సన్ లేఖనాలను అధ్యయనం చేసే సాధనంగా రండి, నన్ను అనుసరించండి మనకు పరిచయం చేసినప్పుడు, మన గృహాలను విశ్వాసము మరియు సువార్త శిక్షణా కేంద్రాల ఆశ్రయాలుగా మార్చుకోవాలని ఆయన మనల్ని ఆహ్వానించారు.

తరువాత ఆయన నాలుగు ప్రత్యేక దీవెనలు వాగ్దానము చేసారు:

  1. మీ సబ్బాతు దినములు ఆనందకరంగా ఉంటాయి.

  2. మీ పిల్లలు రక్షకుని బోధనలు నేర్చుకోవడానికి మరియు జీవించడానికి ఉత్సాహపడతారు,

  3. మీ జీవితంలో మరియు మీ గృహములో అపవాది యొక్క ప్రభావము తగ్గిపోతుంది, మరియు

  4. మీ కుటుంబములో మార్పులు నాటకరీతిగా, బలపరచేవిగా ఉంటాయి.”6

ఇప్పుడు, ఐగుప్తులో మోషేతో పస్కాను అనుభవించిన వారి నుండి మనకు ఏ జర్నల్ ఎంట్రీలు లేవు. అయినప్పటికినీ, ఈరోజు సమానమైన విశ్వాసముతో అధ్యక్షులు నెల్సన్‌ను అనుసరించి, మరియు వాగ్దానము చేయబడిన దీవెనలు పొందిన పరిశుద్ధుల నుండి మనము అనేక సాక్ష్యములను కలిగియున్నాము.

వాటిలో కొన్ని సాక్ష్యాలు ఇక్కడున్నాయి:

ఒక చిన్న కుటుంబములో ఒక తల్లి చెప్పింది: “మా ఇంటిలో మేము క్రీస్తును గూర్చి మాట్లాడతాము మరియు క్రీస్తునందు ఆనందిస్తాము. రక్షకునికి వారిని దగ్గరగా తెచ్చే ఈ సువార్త సంభాషణలతో ఇంటిలో నా పిల్లలు పెరిగి పెద్దవారగుట---నాకైతే అది గొప్ప దీవెన.”7

రండి, నన్ను అనుసరించండి ద్వారా తన లేఖనాల అధ్యయనాన్ని ఒక పెద్ద సహోదరుడు ఇలా పిలిచాడు, “మన ఆత్మీయ శ్రేయస్సు కొరకు అవసరమైన సువార్త సిద్ధాం తమును చూచుటకు మనకు సహాయపడునట్లు దైవిక వెలుగును ప్రసారము చేసే సాధనము.”8

ఒక యౌవనస్తురాలైన భార్య తన వివాహములో కలిగిన దీవెనలు వివరించింది: “నా భర్త యొక్క హృదయాన్ని నేను ఎక్కువ లోతుగా తెలుసుకోగలిగాను, మరియు మేము కలిసి చదివినప్పుడు నేను అతనికి నా కోరికలు, భావావేశాలను ఎక్కువగా తెలుసుకోనిచ్చాను.”9

ఒక పెద్ద కుటుంబానికి చెందిన ఒక తల్లి తన కుటుంబానికి బోధించడానికి ఆమె చేసిన ప్రయత్నాలు ఎలా మారిందో గమనించింది. ఆమె ఇలా పేర్కొంది: “వెనక్కి తిరిగి చూసుకుంటే, నేను మంచు తొడుగులు ధరించి పియానో వాయిస్తున్నట్లు అనిపించింది. నేను గ్లోవ్స్‌తో పియానో వాయించగలిగాను, కానీ సంగీతము సరిగా లేదు. ఇప్పుడు గ్లోవ్స్‌ తీయబడినవి, మరియు నా సంగీతము ఇంకా ఖచ్చితంగా లేనప్పటికినీ, నేను తేడాను వినగలిగాను. రండి, నన్ను అనుసరించండి నాకు దర్శనాన్ని, సామర్ధ్యాన్ని, దృష్టిని మరియు ఉద్దేశ్యమును ఇచ్చింది.”10

ఒక యౌవనస్తుడైన భర్త చెప్పాడు: “నా ఉదయములలో క్రమమైన భాగముగా రండి, నన్ను అనుసరించండి నేను చేసినప్పటి నుండి ఇంటిలో నా అత్యంత ముఖ్యమైన ప్రాధాన్యతలు మరింత స్పష్టంగా మారాయి. అధ్యయనం చేయుట దేవాలయము, నా భార్యతో నా అనుబంధము, మరియు నా పిలుపు వంటి నాకు అత్యంత ముఖ్యమైన విషయాలను గూర్చి ఎక్కువగా ఆలోచించడానికి నన్ను నడిపిస్తుంది. నా గృహము ఒక పరిశుద్ధ స్థలము అక్కడ దేవునికి మొదటి స్థానము.”11

ఒక సహోదరి పంచుకొన్నది: “ రండి, నన్ను అనుసరించండితో నా అనుభవాలు అరుదుగా గుర్తించదగినవి, కానీ కాలక్రమేణా అటువంటి స్థిరమైన దృష్టిసారించిన అధ్యయనము చేత నేను ఏవిధంగా మారానో నేను చూడగలను. ఆ విధమైన అధ్యయనము నన్ను వినయముగా చేసి, నాకు బోధించి, మరియు ఒక సమయంలో కొద్ది కొద్దిగా నన్ను మారుస్తుంది.”12

మిషనరీగా తిరిగి వచ్చిన ఒకరు తెలిపారు: “రండి, నన్ను అనుసరించండి కార్యక్రమము నా మిషనుపై నేను చేసిన లేఖన అధ్యయన స్థాయికి దగ్గరగా నన్ను చేసింది, మరియు లేఖన అధ్యయనాన్ని చేయవలసిన అంశాల జాబితాలో ఏదో ఒకటిగా చూడటం నుండి ముందుకు సాగాను.”13

ఒక సహోదరుడు చెప్పాడు: “పరిశుద్ధాత్మ నా జీవితంలోనికి ఎక్కువగా ఆహ్వానించబడి, నిర్ణయాలు చేయడంలో దేవుని యొక్క బయల్పరచే నడిపింపును అనుభవించాను. నేను క్రీస్తు యొక్క సాధారణమైన సిద్ధాంతములోని అందము గురించి మరియు ఆయన ప్రాయశ్చిత్తఃము గురించి ఎక్కువ లోతైన సంభాషణలను కలిగియున్నాము.

ఒక ఏడు సంవత్సరాల బిడ్డ పంచుకున్నాడు: “నేను త్వరలో బాప్తిస్మము తీసుకుంటున్నాను, మరియు రండి, నన్ను అనుసరించండి నన్ను సిద్ధపరుస్తుంది. నా కుటుంబము, నేను బాప్తిస్మము గురించి మాట్లాడతాను, మరియు ఇప్పుడు బాప్తిస్మము పొందడం గురించి నేను భయపడటంలేదు. రండి, నన్ను అనుసరించండి పరిశుద్ధాత్మ నా హృదయములోనికి రావడానికి సహాయపడుతుంది, మరియు నేను లేఖనాలను చదివినప్పుడు నేను అప్యాయంగా భావిస్తాను.”15

చివరికి, ఏడుగురు పిల్లల తల్లి నుండి: “మేము దేవుని వాక్యమును చదివినప్పుడు, ఆలోచన నుండి శక్తికి; శ్రమ, కష్టము నుండి విడుదలకు; వివాదము, విమర్శ నుండి ప్రేమ, సమాధానముకు; మరియు అపవాది ప్రభావము నుండి దేవుని యొక్క ప్రభావముకు సాగుటకు ఆయన మాకు సహాయపడ్డాడు.”16

వీరు, మరియు మిగిలిన ఇతర క్రీస్తు యొక్క విశ్వాసులైన అనుచరులు వారి గృహాల ద్వారములపై దేవుని గొఱ్ఱె పిల్ల రక్తమును చిహ్నపూర్వకంగా ఉంచారు. రక్షకుని అనుసరించడానికి వారి తమ అంతర్ నిబద్ధతను నిరూపిస్తున్నారు. అద్భుతానికి ముందు విశ్వాసముంటుంది. అది ఒక వ్యక్తి లేఖనాలలో ఒక అనుభవము కలిగియుండే అద్బుతము మరియు ఆ అనుభవము పరిశుద్ధాత్మ యొక్క ప్రభావము చేత దీవించబడుతుంది.

మనము లేఖనాలు చదువుతున్నప్పుడు, దేశములో లేఖన కరవు ఉండదు. నీఫై చెప్పినట్లుగా, “దేవుని యొక్క వాక్యమును ఆలకించి, మరియు దానిని గట్టిగా పట్టుకొని ఉండు వారెన్నడూ నశించరు, అంతేకాక శోధనలు మరియు వారిని నాశనముకు నడిపించునట్లు అపవాది యొక్క అగ్ని బాణములు వారిని అంధత్వమునకు జయించలేవు” (1 నీఫై 15:24).

పూర్వకాలంలో, ఇశ్రాయేలీయులు మోషే ప్రవక్త ద్వారా ఇవ్వబడిన ప్రభువు యొక్క నడిపింపును అనుసరించినప్పుడు, వారు భద్రత మరియు స్వేచ్ఛతో దీవించబడ్డారు. ఈరోజు, మన జీవిస్తున్న ప్రవక్త అధ్యక్షులు నెల్సన్ ద్వారా ఇవ్వబడిన ప్రభువు యొక్క నడిపింపును మనము అనుసరించినప్పుడు, మనము మన హృదయాలలో పరివర్తనతో మరియు మన గృహాలలో భద్రతతో సమానంగా దీవించబడతాము.

యేసు క్రీస్తు జీవిస్తున్నారని నేను సాక్ష్యమిస్తున్నాను. ఇది ఆయన సంఘము, ప్రవక్త జోసెఫ్ స్మిత్ ద్వారా భూమి మీదకు పునఃస్థాపించబడింది. అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ నేడు ప్రభువు యొక్క ప్రవక్త. నేను ఆయనను ప్రేమిస్తున్నాను, బలపరుస్తున్నాను. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.

వివరణలు

  1. రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: పాత నిబంధన 2022, vii.

  2. “We are each responsible for our individual spiritual growth” (రస్సెల్ ఎమ్. నెల్సన్, “ప్రారంభవాక్కులు,” లియహోనా, నవం. 2018, 8).

  3. రస్సెల్ ఎమ్. నెల్సన్, “దేవాలయము మరియు మీ ఆత్మీయ పునాది,లియహోనా, నవ. 2021, 93--96 చూడండి.

  4. అధ్యక్షులు నెల్సన్ “ప్రభువు కొరకు సమయాన్ని కేటాయించాలని మనల్ని వేడుకొనడానికి ఇది ముఖ్యమైన కారణము! పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ మీతో ఉండడానికి అనుమతించే వాటిని చేయడం ద్వారా మీ స్వంత ఆత్మీయ పునాదిని దృఢంగా, దీర్ఘకాలము నిలిచేదిగా చేసుకోండి” (“Make Time for the Lord,” Liahona, Nov. 2021, 120).

  5. “ఇతరులు ఏమి చెప్పినా, చేసినా, సత్యము గురించి మీ హృదయానికి, మనసుకు పుట్టుకొచ్చే సాక్ష్యాన్ని ఎవ్వరూ తీసుకెళ్లలేరు” (Russell M. Nelson, “Revelation for the Church, Revelation for Our Lives,” Liahona, May 2018, 95).

  6. రస్సెల్ ఎమ్. నెల్సన్, “ఆదర్శ మైన కడవరి దిన పరిశుద్ధులుగా అగుట,” లియహోనా, నవ. 2018, 113--14. గత ఏప్రిల్ అధ్యక్షులు నెల్సన్ ఈ ఆహ్వానాన్ని మరలా ఇచ్చారుl: “మీ గృహాన్ని మీ విశ్వాసం యొక్క ప్రాథమిక ఆశ్రయ దుర్గముగా మార్చాలనే మీ నిబద్ధత ఎప్పటికీ అంతం కాదు. ఈ పతనమైన ప్రపంచంలో విశ్వాసం మరియు పరిశుద్ధత తగ్గడంతో, పరిశుద్ధ స్థలాల కొరకు మీ అవసరం పెరుగుతుంది. మీ గృహము నిజముగా ఒక పరిశుద్ధ స్థలముగా చేయమని, ‘మరియు మీ ముఖ్యమైన లక్ష్యము నుండి కదిలించబడ వద్దని’ నేను మిమ్మల్ని పురికొల్పుతున్నాను” [సిద్ధాంతము మరియు నిబంధనలు 87:8; emphasis added] from that essential goal” (“What We Are Learning and Will Never Forget,” Liahona, May 2021, 79).

  7. వ్యక్తిగత ఉత్తరప్రత్యుత్తరాలు; 2 నీఫై 25:26 కూడా చూడండి.

  8. వ్యక్తిగత ఉత్తరప్రత్యుత్తరాలు.

  9. వ్యక్తిగత ఉత్తరప్రత్యుత్తరాలు.

  10. వ్యక్తిగత ఉత్తరప్రత్యుత్తరాలు.

  11. వ్యక్తిగత ఉత్తరప్రత్యుత్తరాలు.

  12. వ్యక్తిగత ఉత్తరప్రత్యుత్తరాలు.

  13. వ్యక్తిగత ఉత్తరప్రత్యుత్తరాలు.

  14. వ్యక్తిగత ఉత్తరప్రత్యుత్తరాలు.

  15. వ్యక్తిగత ఉత్తరప్రత్యుత్తరాలు.

  16. వ్యక్తిగత ఉత్తరప్రత్యుత్తరాలు.