సర్వసభ్య సమావేశము
వీడియో: “ఆయన ముందుగా చూసిన స్త్రీలు మీరే”
2022 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


వీడియో: “ఆయన ముందుగా చూసిన స్త్రీలు మీరే”

1979లో, అధ్యక్షులు కింబల్ హాస్పిటల్‌లో ఉన్నారు మరియు ప్రధాన స్త్రీల సమావేశములో తన ప్రసంగాన్ని చదవమని, తన భార్య కామిల్లాను అడిగారు.

సహోదరి కామిల్లా కింబల్l: “కడవరి దినాలలో సంఘానికి వచ్చే వృద్ధిలో ముఖ్యమైన భాగము లోకములో అనేకమంది మంచి స్త్రీల వలన వస్తుంది (వీరిలో తరచుగా ఆత్మీయత యొక్క అంతర్గత భావం ఉంటుంది) మరియు పెద్ద సంఖ్యలో సంఘానికి ఆకర్షితులవుతారు. సంఘము యొక్క స్త్రీలు తమ జీవితాలలో నీతిగల మాదిరులుగా ఉండి, స్పష్టమైన సంభాషణలను ప్రతిబింబించి మరియు లోకము యొక్క స్త్రీల నుండి—సంఘ స్త్రీలు ప్రత్యేకంగా మరియు పొగడదగిన విధానాలలో విభిన్నంగా చూడబడేంత వరకు ఇది జరుగుతుంది.”1

అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్: “నా ప్రియమైన సహోదరీలారా, ఈ ముగింపు సన్నివేశంలో మీరు మా ముఖ్యమైన సహచరులు, ఈరోజు అధ్యక్షులు కింబల్ ముందుగా ఊహించిన రోజు. ఆయన ముందుగా చూసిన స్త్రీలు మీరే! మీ సుగుణము, వెలుగు, ప్రేమ, జ్ఞానము, ధైర్యము, ప్రవర్తన, విశ్వాసము, మరియు నీతివంతమైన జీవితాలు గతంలో కంటె ఎక్కువ మొత్తంలో లోకములోని మంచి స్త్రీలను వారి కుటుంబాలతోపాటు సంఘానికి ఆకర్షిస్తాయి.

“మీ బలము, మీ పరివర్తన, మీ దృఢవిశ్వాసం, నడిపించడానికి మీ సామర్థ్యం, మీ జ్ఞానము మరియు మీ స్వరములు … మాకు అవసరము. పవిత్రమైన నిబంధనలు చేసి, వాటిని పాటించే స్త్రీలు, దేవుని శక్తి మరియు అధికారంతో మాట్లాడగలిగే స్త్రీలు లేకుండా దేవుని రాజ్యము పూర్తవదు మరియు పూర్తి కాలేదు!”

“ … నా ప్రియమైన సహోదరీలారా, మీ పిలుపు ఏదైనప్పటికీ, మీ పరిస్థితులు ఏవైనప్పటికీ, మీ భావనలు, మీ పరిజ్ఞానములు, మరియు మీ ప్రేరణలు మాకు అవసరము. వార్డు మరియు స్టేకు సలహాసభలలో మీరు మాట్లాడుట మరియు నిస్సంకోచంగా మాట్లాడుట మాకవసరము. వివాహితురాలైన ప్రతి సహోదరి, మీ కుటుంబమును పరిపాలించుటలో మీ భర్తతో మీరు ఏకమైనప్పుడు ‘తోడ్పడుచున్న మరియు పూర్తి భాగస్వామిగా‘ మాట్లాడుట మాకవసరము. వివాహితులు లేక ఒంటరి సహోదరీలైన మీరు, దేవుని నుండి పొందిన వరములుగా ప్రత్యేక సామర్థ్యములు మరియు ప్రత్యేక సహజ జ్ఞానములు కలిగియున్నారు. సహోదరులమైన మేము అదే ప్రత్యేక ప్రభావమును కలిగియుండలేము.

“సమస్త సృష్టిలో అంతిమ, గొప్ప చర్య స్త్రీ సృష్టి అని మనకు తెలుసు! మీ బలము మాకు అవసరము! …

“… నా ప్రియమైన సహోదరీలారా, మీకు ధన్యవాదాలు, మరియు ఈ పవిత్రమైన కార్యములో కలిసి పాల్గొననినప్పుడు, మీ సృష్టి యొక్క ఉద్దేశ్యమును నెరవేర్చడానికి, మీ పూర్తి సాధ్యతను సాధించడానికి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. ప్రభువు రెండవ రాకడ కోసం లోకాన్ని సిద్ధం చేయడంలో మనం కలిసి సహాయము చేద్దాము.”2

వివరణలు

  1. Teachings of Presidents of the Church: Spencer W. Kimball (2006), 222–23.

  2. Russell M. Nelson, “A Plea to My Sisters,” Ensign or Liahona, Nov. 2015, 96, 97.