సర్వసభ్య సమావేశము
పిల్లలకు, యువతకు స్వయం-సమృద్ధిని బోధించుట
2022 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


పిల్లలకు, యువతకు స్వయం-సమృద్ధిని బోధించుట

మన రక్షకుడైన యేసు క్రీస్తును మరియు ఆయన సువార్తను అనుసరించి, మన జీవితములంతటా స్వశక్తిపై ఆధారపడుతూ, మనము దీనిని మన పిల్లలు, యువతకు బోధిద్దాం.

స్వయం-సమృద్ధి గురించి, అది పిల్లలకు, యువతకు ఎలా బోధించబడగలదో నేను మాట్లాడతాను. స్వయం-సమృద్ధి పెద్దవారి కోసమైన విషయంగా భావించబడవచ్చు. బాల్యము నుండి, యువతగా ఇంటిలో యేసు క్రీస్తు యొక్క సువార్త వారు బోధింపబడి, దాని సిద్ధాంతము, సూత్రములను ఆచరించినప్పుడు వయోజనులు స్వయం-సమృద్ధి బాటవైపు శ్రేష్ఠముగా ఉండగలరని నేను గ్రహించగలిగాను.

ఈ భావనను రుజువు చేయడానికి, గ్రహించడానికి అత్యుత్తమ విధానము, ఒక గొప్ప నిజ జీవితపు మాదిరి. విల్ఫ్రైడ్ వానీకి ఆరు సంవత్సరాల వయస్సున్నపుడు, అతని ఏడుగురు తోబుట్టువులు మరియు అతని తల్లి అబిడ్జన్, ఐవరీ కోస్ట్‌లో బాప్తిస్మము తీసుకున్నారు. ఎనిమిది సంవత్సరాలప్పుడు అతడు బాప్తిస్మము తీసుకొన్నాడు. విల్ఫ్రైడ్‌కి పదకొండు సవంత్సరాలప్పుడు, కుటుంబములో ప్రధానంగా పోషించే అతని తండ్రి చనిపోయాడు.

కుటుంబ పరిస్థితి చేత విచారించినప్పటికీ, తన తల్లి ప్రోత్సాహము మరియు సంఘ సహాయముతో పాఠశాలను కొనసాగించడానికి విల్ఫ్రైడ్ నిర్ణయించాడు. అతడు సెకండరీ పాఠశాల నుండి పట్టభద్రతను పొందాడు మరియు ఘానా కేప్ కోస్ట్ మిషనులో పూర్తి-కాల సువార్తసేవ చేసాడు, అక్కడ అతడు ఆంగ్లము నేర్చుకున్నాడు. అతడు తన సువార్తసేవ తరువాత, విశ్వవిద్యాలయానికి హాజరై, విద్యను కొనసాగించి, అకౌంటింగ్ మరియు ఆర్థికశాస్త్రములో డిప్లోమాను సంపాదించాడు. ఈ రంగంలో ఉద్యోగం సంపాదించడం కష్టమైనప్పటికీ, అతడు పర్యాటక, ఆతిధ్య పరిశ్రమలో పనిని కనుగొన్నాడు.

అతడు ఫైవ్-స్టార్ హోటల్‌లో ఒక వెయిటర్‌గా ప్రారంభించాడు, కానీ మెరుగుపరుచుకోవాలనే తపన ఒక ద్విభాష రిసెప్షనిస్టుగా అయ్యే వరకు అతడు ఎక్కువగా నేర్చుకోవడానికి అతడిని ప్రేరేపించింది. ఒక క్రొత్త హోటల్ తెరవబడినప్పుడు, అతడు రాత్రి ఆడిటర్‌గా నియమించబడ్డాడు. ఎక్కువ విద్యను పొందాలనే మన నాయకుల సలహాను అనుసరిస్తూ, ప్రస్తుతం అతడు బివైయు-పాత్‌వే వరల్డ్‌వైడ్‌లో చేరి, పర్యాటక, హోటల్స్‌లో ఒక సర్టిఫికెట్‌ను పొందే కోర్సును చదువుతున్నాడు. ఒక రోజు అత్యాధునిక హోటల్ మేనేజర్ కావాలని అతడి కోరిక. విల్ఫ్రైడ్ తన నిత్య సహవాసికి, ఇద్దరు పిల్లలను పోషించగలడు, అదేవిధంగా తన తల్లి, తోబుట్టువులకు సహాయపడగలడు. ప్రస్తుతం అతడు సంఘములో స్టేకు ప్రధాన సలహాసభలో ఒక సభ్యునిగా సేవ చేస్తున్నాడు.

స్వయం-సమృద్ధి అనేది “తనకు, తన కుటుంబానికి గల జీవితపు ఆత్మీయ, భౌతిక అవసరాలను సమకూర్చుటకు గల సామర్థ్యము, నిబద్ధత మరియు ప్రయత్నముగా”1 నిర్వచించబడింది. స్వయం-సమృద్ధిని కలిగియుండటానికి ప్రయాసపడుట నిబంధన మార్గము పై మన కార్యములో భాగము, అది మనలను పరలోక తండ్రి వద్దకు మరియు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు వద్దకు తిరిగి నడిపిస్తుంది. అది యేసు క్రీస్తుయందు మన విశ్వాసమును బలపరుచును, రక్షణ, ఉన్నతస్థితి యొక్క నిబంధనలు మరియు విధుల ద్వారా మనల్ని సంతోషంగా బంధించును. స్వయం-సమృద్ధి అనేది యేసు క్రీస్తు యొక్క సువార్తలో భాగము మరియు ఒక కార్యక్రమము కాదు. అది జీవితకాలము సాగే ఒక ప్రక్రియ, ఒక సంఘటన కాదు.

మనము ఆత్మీయ బలము, శారీరక, భావావేశ ఆరోగ్యమందు ఎదుగుతూ, మన విద్యను, ఉద్యోగమును వెదకుతూ, భౌతికంగా సిద్ధపడుట ద్వారా మన జీవితములంతటా స్వయం-సమృద్ధి గల వారమవుతాము.2 ఈ పని మన జీవితములందు ఎప్పటికైన పూర్తి చేయబడుతుందా? లేదు, అది శిక్షణ, అభివృద్ధి మరియు పని యొక్క జీవితకాల ప్రక్రియ. అది ఎప్పటికీ ముగియదు; అది కొనసాగే అనుదిన ప్రక్రియ.

మన పిల్లలు మరియు యువతకు స్వయం-సమృద్ధి యొక్క సిద్ధాంతము మరియు సూత్రములను మనము ఎలా బోధించగలము? ఒక ముఖ్యమైన విధానమేదనగా, పిల్లలు మరియు యువత కార్యక్రమాన్ని క్రమంగా ఉపయోగించుట. తల్లితండ్రులు మరియు పిల్లలు యేసు క్రీస్తు యొక్క సువార్తను నేర్చుకొని, సేవ మరియు ప్రోత్సాహకార్యక్రమాలలో పాల్గొని, ప్రతీ బిడ్డకు ప్రత్యేకమైన వ్యక్తిగత అభివృద్ధిలో నాలుగు రంగాలలో కలిసి పనిచేస్తారు. ఇది ఇకపై అందరికీ ఒకే నిర్దేశిత కార్యక్రమం కాదు.

పిల్లల మార్గదర్శక పుస్తకం ఇలా చెప్తుంది, “యేసు మీ వయస్సులో ఉన్నప్పుడు, ఆయన నెర్చుకొని, వృద్ధి చెందాడు. మీరు నేర్చుకుంటున్నారు మరియు వృద్ధి చెందుతున్నారు కూడా. లేఖనాలు చెప్పును: ‘యేసు జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయయందును, మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను’ (లూకా 2:52).”3 ఈ లేఖనము ఆత్మీయ కోణములో అభివృద్ధిని, శిక్షణను దేవునితో అనుగ్రహము; సామాజిక అంశము, మానవుని దయ; శారీరక కోణము, ఆకృతి; మరియు మేధోపరమైన అంశము, జ్ఞానమును సూచిస్తుంది. ఈ అభివృద్ధి ప్రాంతాలు మన వయస్సుతో సంబంధము లేకుండా అందరికీ వర్తిస్తాయి. మనమెప్పుడు వారికి బోధిస్తాము? ద్వితీయోపదేశకాండము 6:6–7 లో మనము చదువుతాము:

“నేడు నేను నీకాజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను:

“నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, నీ యింట కూర్చుండునప్పుడును త్రోవను నడుచునప్పుడును, పండుకొనునప్పుడును త్రోవను నడుచునప్పుడును పండుకొనునప్పుడును లేచునప్పుడును వాటిని గూర్చి మాటలాడవలెను.

వారితో పనిచేసి, సేవ చేస్తూ, లేఖనాలను అధ్యయనము చేస్తూ, ప్రవక్తల చేత బోధింపబడినట్లుగా యేసు క్రీస్తు యొక్క బోధనలను అనుసరిస్తూ మన మంచి మాదిరి ద్వారా ఈ విషయాలను మనము పిల్లలకు బోధించగలము.

పిల్లలు మరియు యువత కార్యక్రమములో, పిల్లలు అభివృద్ధి యొక్క నాలుగు రంగాలలో ప్రతిఒక్క దానిలో వేర్వేరు లక్ష్యాలను ఎన్నుకుంటారు. ప్రతీ రంగములో వారు తమ స్వంత లక్ష్యాలను ఏర్పరచుట ముఖ్యమైనది. తల్లిదండ్రులు మరియు నాయకులు బోధించి, సలహా ఇచ్చి, సహకరించగలరు.

ఉదాహరణకు, మా మనుమరాలు మిరండా ప్రతిరోజు ప్రాతఃకాల సెమినరీ తరగతులలో పాల్గొనుట ద్వారా ఆత్మీయంగా ఎదగడానికి చాలా ప్రేరేపించబడింది. ఆమె తన వార్డులోని మిగిలిన సెమినరీ విద్యార్థుల నుండి అనుకూలమైన వ్యాఖ్యలు వినుట ద్వారా ఆసక్తి చెందింది. తరగతి కోసము ఆమె తల్లి ఆమెను మేల్కొల్పనవసరం లేదు. తన స్వంతంగా, ఆమె లేచి ఉదయం నియమించబడిన సమయం 6.20 కి వీడియో సమావేశంలో చేరుతుంది ఎందుకనగా ఆమె ఆవిధంగా చేయడానికి తనకు సహాయపడే మంచి అలవాట్లను వృద్ధి చేసింది. మిరాండా ఇప్పుడు వారి వద్దకు వెళ్లినప్పుడు, ఆమె ఎక్కువగా మాట్లాడుతుందని నా స్వంత తల్లిదండ్రులు ఇటీవల నాతో చెప్పారు, ఆమె ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇవి గుర్తించదగిన ఫలితాలతో జీవితం మరియు ఎదుగుదలకు పాఠాలు.

తల్లిదండ్రులు, తాత మామ్మలు, నాయకులు మరియు స్నేహితులు పిల్లల ఎదుగుదలకు, అభివృద్ధికి సహాయపడతారు. పూర్తిగా నిమగ్నమైయున్న పరిచర్య చేసే సహోదర, సహోదరీలు వార్డు యొక్క యాజకత్వపు మరియు నిర్మాణ నాయకులతో కలిసి సహాయమును అందిస్తారు. “కుటుంబము: ప్రపంచమునకు ఒక ప్రకటన” ఇలా చెప్పును: “దైవిక ప్రణాళిక ద్వారా, తండ్రులు వారి కుటుంబాలకు ప్రేమ మరియు నీతియందు అధ్యక్షత్వము వహిస్తారు మరియు వారి కుటుంబాల జీవితపు అవసరాలు మరియు భద్రతను అందించడానికి బాధ్యత కలిగియున్నారు. తల్లులు తమ పిల్లల పోషణ కొరకు ప్రధాన బాధ్యతను కలిగియున్నారు. ఈ పరిశుద్ధమైన బాధ్యతలందు, తండ్రులు మరియు తల్లులు సమాన భాగస్వాములుగా ఒకరినొకరికి సహాయపడుటకు బద్ధులుగా ఉన్నారు. … బంధువుల కుటుంబాలు అవసరమైనప్పుడు సహాయమును అందించాలి.”4 చివరి వరుస మిగిలిన వారి మధ్య తాత, మామ్మలను సూచిస్తుంది.

పశ్చిమ ఆఫ్రికాలో మేము సేవ చేసినప్పుడు, నా భార్య నూరియా పరిచర్య చేస్తూ, సముద్రము అవతల ఉన్న మా కుటుంబము మరియు మనుమలతో సంబంధాన్ని కలిగియుండుటలో అసాధారణమైన పనిని చేసింది. ఆమె దానిని సాంకేతిక విద్య ద్వారా చేసింది. ఆమె చిన్న మనుమలకు ఆమె పుస్తకాలను చదివింది. ఆమె వీడియో సమావేశము ద్వారా పెద్ద మనుమరాళ్ళకు మా కుటుంబము యొక్క వృత్తాంతము, సైన్సు విషయాలు, ప్యూర్టో రికో యొక్క చరిత్ర, విశ్వాస ప్రమాణములు మరియు యేసు క్రీస్తు యొక్క సువార్త వంటి అంశాలను బోధిస్తుంది. ఈకాలములో దూరాలు సంబంధాలను, చేర్చబడుటను, పరిచర్య చేయుటను మరియు మన కుటుంబాల యువతరానికి బోధించడాన్ని పరిమితం చేయవు. మా ప్రశస్తమైన మనుమలకు బోధించడానికి, వారిని ప్రేమించడానికి, గారబం చేయడానికి మరియు వారిని నవ్వించడానికి నాకు సాధ్యమైనప్పుడు నేను కూడా నూరియాతో చేరతాను.

పిల్లలు మరియు యువత కార్యక్రమము మరియు స్వయం-సమృద్ధిని నిర్మించుట మధ్య ప్రేరేపించబడిన పోలికలను మీరు గమనించాలి. ప్రతిఒక్కటిలో అభివృద్ధి యొక్క నాలుగు ప్రాంతాలు చాలా పోలికగా ఉన్నాయి. స్వయం-సమృద్ధిలో ఆత్మీయ బలము పిల్లలు, యువతలందు ఆత్మీయ అంశముతో సంబంధమును కలిగియున్నది. స్వయం-సమృద్ధిలో శారీరక మరియు భావావేశ ఆరోగ్యము పిల్లలు, యువతలో శారీరక, సామాజిక అంశాలతో జతపరచబడియున్నది. విద్య, ఉద్యోగము మరియు స్వయం-సమృద్ధిలో తాత్కాలిక సంసిద్ధత పిల్లలు మరియు యువత కార్యక్రమంలో మేధోపరమైన అంశానికి సమానంగా ఉంటాయి.

ముగింపులో, మన రక్షకుడైన యేసు క్రీస్తును మరియు ఆయన సువార్తను అనుసరించి, మన జీవితములంతటా స్వశక్తిపై ఆధారపడుతూ, మనము దీనిని మన పిల్లలు, యువతకు బోధిద్దాము. వీటి ద్వారా మనము దానిని శ్రేష్ఠముగా చేయగలము:

  1. ఇతరులకు సేవ చేయుటకు మంచి మాదిరులుగా ఉండుట,

  2. స్వయం-సమృద్ధి యొక్క సిద్ధాంతము మరియు సూత్రములను జీవించుట మరియు బోధించుట,

  3. యేసు క్రీస్తు యొక్క సువార్తలో భాగముగా స్వయం-సమృద్ధిని నిర్మించాలనే ఆజ్ఞకు విధేయులగుట.

సిద్ధాంతము మరియు నిబంధనలు 104:15-16 ఇలా చెప్తుంది:

“నా పరిశుద్ధులకు సమకూర్చుట నా ఉద్దేశ్యమైయున్నది, ఏలయనగా సమస్తము నాదే.

“కానీ అది నా స్వంత విధానములోనే జరుగవలెను; ఇదిగో, నా పరిశుద్ధుల కొరకు సమకూర్చుటకు ప్రభువైన నేను శాసించిన విధానమిదియే, బీదలు హెచ్చింపబడవలెను, ధనికులు తగ్గింపబడవలెను.”

ఇది యేసు క్రీస్తు యొక్క సంఘము. ఆయన సువార్త ఇక్కడ భూమి మీద, నిత్యత్వములంతటా కుటుంబాలను దీవించును. నిత్య కుటుంబాలుగా మారడానికి మనము ప్రయాసపడినప్పుడు మన జీవితాలలో అది మనల్ని నడిపించును. ఇది సత్యమని నాకు తెలుసు. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.

వివరణలు

  1. General Handbook: Serving in The Church of Jesus Christ of Latter-day Saints, 22.0, ChurchofJesusChrist.org చూడండి.

  2. General Handbook, 22.1 చూడండి.

  3. Personal Development: Children’s Guidebook [2019], 4.

  4. కుటుంబము: ప్రపంచమునకు ఒక ప్రకటన,” ChurchofJesusChrist.org చూడండి.