సర్వసభ్య సమావేశము
ఈ దినము
2022 అక్టోబరు సర్వసభ్య సమావేశము


ఈ దినము

జీవించియున్న మన ప్రవక్త, మోర్మన్ గ్రంథముతో భూమిని వరదలా ముంచివేయడానికి తన వంతు కృషి చేస్తున్నారు. మనం ఆయన మార్గాన్ని తప్పక అనుసరించాలి.

ప్రియమైన నా సహోదర సహోదరీలారా, మోర్మన్ గ్రంథములో ఉపదేశము, వాగ్దానాలు మరియు బోధనలను ఆలకించమని చెప్పడానికి “ఈ దినమున”1 అనే వాక్యభాగము పదేపదే ఉపయోగించబడింది. “ఈ దినమున నేను మీతో చెప్పబోవు మాటలను వినుము; … మీరు వినునట్లు మీ చెవులను, మీరు గ్రహించునట్లు మీ హృదయములను, మీ దృష్టి యందు దేవుని మర్మములు విశదమగునట్లు మీ మనస్సులను తెరువుము” అని రాజైన బెంజమిన్ తన చివరి ప్రసంగంలో జనులను హెచ్చరించాడు.2 సర్వసభ్య సమావేశము అటువంటి సందర్భమే. మనము ప్రభువుకు, ఆయన సువార్తకు “అన్ని సమయములలో సత్యవంతులై”3 యుండునట్లు, “ఈ దినము” కొరకైన ఉపదేశాన్ని వినడానికి మనం వస్తాము. “భూమిపైనున్న గ్రంథములన్నింటిలోకెల్లా మిక్కిలి ఖచ్చితమైనదని” జోసెఫ్ స్మిత్ పిలిచిన మోర్మన్ గ్రంథానికి మన ఒడంబడికను “ఈ దినమున” క్రొత్తదిగా చేయుట యొక్క ప్రాముఖ్యతను నేను బలంగా భావిస్తున్నాను.4

చిత్రం
ఎల్డర్ రాస్బాండ్ యొక్క మోర్మన్‌ గ్రంథ ప్రతి

మోర్మన్ గ్రంథము యొక్క ఒక ప్రతిని నేను నా చేతిలో పట్టుకున్నాను. ఇది నా 1970ల నాటి పాతకాలపు సంచిక మరియు ఇది నాకు అమూల్యమైనది. దీని ఆకారాన్ని బట్టి ఇది అలసిపోయి అరిగిపోయింది, కానీ మరేయితర గ్రంథము దీనిలా నా జీవితానికి, నా సాక్ష్యానికి ముఖ్యమైనది కాదు. దీనిని చదివి, యేసు క్రీస్తు దేవుని కుమారుడని,5 ఆయన నా రక్షకుడని,6 ఈ లేఖనాలు దేవుని వాక్యమని,7 సువార్త పునఃస్థాపించబడిందని8 ఆత్మ ద్వారా నేను సాక్ష్యం పొందాను. ఆ సత్యాలు నా స్వభావంలో ఆవశ్యక భాగమయ్యాయి. ప్రవక్త నీఫై చెప్పినట్లుగా, “నా ఆత్మ ప్రభువు యొక్క కార్యములందు ఆనందించును.”9

చిత్రం
ఆయన మిషను అధ్యక్షుడు మరియు ఎల్డర్ హాంక్స్‌తో ఎల్డర్ రాస్బాండ్

ఎడమ నుండి కుడికి: ఎల్డర్ రోనాల్డ్ ఎ. రాస్బాండ్, యువ మిషనరీ; అధ్యక్షుడు హెరాల్డ్ విల్కిన్సన్, తూర్పు రాష్ట్రాల మిషను అధ్యక్షుడు; మరియు ఎల్డర్ మారియన్ డి. హాంక్స్, ప్రధాన అధికార డెబ్బది.

దీని వెనుక ఉన్న కథ ఇది. ఒక యువ సువార్తికునిగా నేను, ఈస్టర్న్ స్టేట్స్ మిషనులో మమ్మల్ని సందర్శించిన ఎల్డర్ మారియన్ డి. హాంక్స్ ఉపదేశాన్ని విన్నాను. ఆయన బ్రిటీషు మిషను యొక్క మాజీ అధ్యక్షుడు, ఆయన సువార్తికులలో ఇద్దరు ఈరోజు వేదికపై ఉన్నారు: నా ప్రియ సహోదరులైన ఎల్డర్ జెఫ్రీ ఆర్. హాలండ్ మరియు ఎల్డర్ క్వింటిన్ ఎల్. కుక్.10 ఇంగ్లండులో ఉన్న ఆయన సువార్తికులతో చేసినట్లుగా, గుర్తులు పెట్టని మోర్మన్ గ్రంథ ప్రతిని కనీసం రెండుసార్లు చదవమని ఆయన మమ్మల్ని సవాలు చేసారు. నేను సవాలును స్వీకరించాను. మొదటిసారి చదివినప్పుడు, యేసు క్రీస్తు గురించి చెప్తున్న లేదా సాక్ష్యమిస్తున్న ప్రతీదాని క్రింద నేను గీతగీయాలి లేదా గుర్తుపెట్టాలి. నేను ఎర్ర పెన్సిలును ఉపయోగించాను మరియు అనేక భాగాల క్రింద గీతగీసాను. రెండవసారి, సువార్త యొక్క సూత్రాలను, సిద్ధాంతాన్ని ప్రత్యేకించి చూపమని ఎల్డర్ హాంక్స్ చెప్పారు మరియు ఈసారి నేను లేఖనాలలో గుర్తుపెట్టడానికి నీలిరంగును ఉపయోగించాను. సూచించబడినట్లుగా నేను రెండుసార్లు మోర్మన్ గ్రంథాన్ని చదివాను, తర్వాత నాకు ప్రత్యేకంగా అనిపించిన భాగాలను గుర్తించడానికి పసుపు మరియు నలుపు రంగులను ఉపయోగిస్తూ మరో రెండుమార్లు చదివాను.11 నేను అనేక గుర్తులు పెట్టానని మీరు చూడవచ్చు.

చిత్రం
మోర్మన్ గ్రంథము యొక్క గుర్తు పెట్టబడిన ప్రతి.

నా పఠనంలో లేఖనాలను గుర్తించడం కంటే చాలా ఎక్కువే ఉంది. మొదలు నుండి చివరి వరకు, మోర్మన్ గ్రంథాన్ని చదివిన ప్రతీసారి నేను ప్రభువు కొరకు గాఢమైన ప్రేమతో నింపబడ్డాను. ఆయన బోధనల యొక్క సత్యము గురించి మరియు అవి “ఈ దినము”నకు ఎలా అన్వయిస్తాయనే దాని గురించి ఆవశ్యకమైన, లోతైన సాక్ష్యాన్ని నేను భావించాను. “యేసు క్రీస్తు యొక్క మరియొక నిబంధన” అనే పేరు ఈ గ్రంథానికి సరిగ్గా సరిపోతుంది.12 ఆ అధ్యయనముతో మరియు పొందిన ఆత్మీయ సాక్ష్యముతో, నేను మోర్మన్ గ్రంథాన్ని ప్రేమించే సువార్తికునిగా మరియు యేసు క్రీస్తు యొక్క శిష్యునిగా మారాను.13

“ఈ దినమున,” మోర్మన్ గ్రంథము యొక్క గొప్ప సువార్తికులలో ఒకరు అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్. ఆయన క్రొత్తగా అపొస్తలునిగా పిలువబడినప్పుడు, ఆయన ఆక్రా, ఘానాలో ఉపన్యాసమిచారు.14 హాజరైన ప్రముఖులలో ఆఫ్రికా గిరిజనుల రాజు కూడా ఉన్నారు, అతనితో ఒక అనువాదకుని సహాయంతో ఆయన మాట్లాడారు. ఆ రాజు బైబిలు యొక్క గంభీరమైన విద్యార్థి మరియు ప్రభువును ప్రేమించాడు. అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ వ్యాఖ్యానం తరువాత, ఆ రాజు ఆయనను సమీపించి, పరిపూర్ణమైన ఆంగ్లంలో, “నీవెవరు?” అని అడిగాడు. తాను యేసు క్రీస్తు చేత నియమించబడిన అపొస్తలుడనని అధ్యక్షులు నెల్సన్ వివరించారు.15 రాజు అడిగిన తరువాతి ప్రశ్న, “యేసు క్రీస్తు గురించి మీరు నాకేమి బోధించగలరు?”16

అధ్యక్షులు నెల్సన్ మోర్మన్ గ్రంథాన్ని తీసుకొని, 3 నీఫై 11 తెరిచారు. అధ్యక్షులు నెల్సన్ మరియు రాజు కలిసి నీఫైయులకు రక్షకుని ప్రసంగాన్ని చదివారు: “ఇదిగో లోకములోనికి వచ్చునని ప్రవక్తలు సాక్ష్యమిచ్చిన యేసు క్రీస్తును నేనే. … నేను లోకమునకు వెలుగును, జీవమునైయున్నాను.”17

అధ్యక్షులు నెల్సన్ మోర్మన్ గ్రంథము యొక్క ఆ ప్రతిని రాజుకు బహూకరించినప్పుడు, రాజు ఇలా స్పందించాడు, “మీరు నాకు వజ్రాలు లేదా కెంపులు ఇచ్చియుండవచ్చు, కానీ ప్రభువైన యేసు క్రీస్తు గురించి ఈ అదనపు జ్ఞానము కంటే నాకు ఎక్కువ విలువైనది ఏదీ లేదు.”18

మోర్మన్ గ్రంథమును మన ప్రియమైన ప్రవక్త ఎలా పంచుకుంటారనే దానికి అది ఒక్కటే మాదిరి కాదు. యేసు క్రీస్తు గురించి ఎల్లప్పుడూ తన సాక్ష్యాన్ని పంచుకుంటూ, ఆయన వందలమందికి మోర్మన్ గ్రంథ ప్రతులను ఇచ్చారు. సంఘ ప్రధాన కేంద్రంలోనైనా లేదా వారి స్వంత ప్రదేశాలలోనైనా, అధ్యక్షులు నెల్సన్ అతిథులు, అధ్యక్షులు, రాజులు, రాష్ట్రపతులు, వ్యాపార నాయకులు, సంస్థలు మరియు విభిన్న విశ్వాసాలకు చెందిన వారిని కలుసుకున్నప్పుడు, బయల్పరచబడిన లేఖనమైన ఈ గ్రంథాన్ని ఆయన భక్తిపూర్వకంగా బహూకరిస్తారు. ఆయన సందర్శనకు జ్ఞాపకార్థంగా బల్లపై, సొరుగు‌లలో లేదా బీరువాలలో ఉంచబడే విధంగా రిబ్బన్లతో చుట్టబడిన అనేక వస్తువులను ఆయన వారికి ఇవ్వగలరు. దానికి బదులుగా, గిరిజన రాజు వివరించినట్లు వజ్రాలు, కెంపులను మించి, తనకు అత్యంత అమూల్యమైన దానిని ఆయన ఇస్తారు.

“మోర్మన్ గ్రంథము యొక్క సత్యములు మన ఆత్మలను స్వస్థపరచుటకు, ఆదరించుటకు, పునఃస్థాపించుటకు, సహాయపడుటకు, బలపరచుటకు, ఓదార్చుటకు మరియు ఉల్లాసపరచుటకు శక్తి కలిగియున్నవి” అని అధ్యక్షులు నెల్సన్ చెప్పారు.19 దేవుని యొక్క మన ప్రవక్త నుండి వాటిని అందుకున్న వారి చేతులలో మోర్మన్ గ్రంథము యొక్క ఈ ప్రతులు పట్టుకొనబడియుండడాన్ని నేను గమనించాను. దానిని మించిన గొప్ప బహుమానము ఉండజాలదు.

చిత్రం
గాంబియా ప్రథమ మహిళతో అధ్యక్షులు నెల్సన్

ఈమధ్య ఆయన గాంబియా యొక్క ప్రథమ మహిళను ఆయన కార్యాలయంలో కలిసినప్పుడు, వినయంగా ఆమెకు మోర్మన్ గ్రంథాన్ని అందించారు. అక్కడితో ఆయన ఆగిపోలేదు. యేసు క్రీస్తు, ఆయన ప్రాయశ్చిత్తము మరియు ప్రతిచోటా ఉన్న—దేవుని పిల్లలందరి కొరకు ఆయన ప్రేమ గురించి బోధించి, సాక్ష్యమివ్వడానికి ఆమెతో పాటు చదవడానికి ఆయన దాని పేజీలు తెరిచారు.

జీవించియున్న మన ప్రవక్త మోర్మన్ గ్రంథముతో భూమిని వరదలా ముంచివేయడానికి తన వంతు చేస్తున్నారు.20 కానీ, ఆయన ఒక్కరే ఆ పని చేయలేరు. మనం ఆయన మార్గాన్ని తప్పక అనుసరించాలి.

ఆయన మాదిరిచేత ప్రేరేపించబడి, నేను వినయంగా, మరింత మనఃపూర్వకముగా మోర్మన్ గ్రంథాన్ని పంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాను.

చిత్రం
మొజాంబిక్ అధ్యక్షుడితో ఎల్డర్ రాస్బాండ్

ఇటీవల నేను ఒక పనిమీద మొజాంబిక్‌లో ఉన్నాను. ఈ అందమైన దేశపౌరులు పేదరికం, అనారోగ్యం, నిరుద్యోగం, తుఫానులు మరియు రాజకీయ అశాంతితో కష్టపడుతున్నారు. ఆ దేశ అధ్యక్షుడైన ఫిలీపె నాయుసిని కలుసుకొనే గౌరవం నాకు కలిగింది. ఆయన మనవితో, నేను ఆయన కొరకు, ఆయన దేశం కొరకు ప్రార్థించాను; ఆయన దేశంలో మేము యేసు క్రీస్తు21 యొక్క దేవాలయాన్ని నిర్మిస్తున్నామని నేను ఆయనతో చెప్పాను. మా సందర్శన ముగింపులో, ఆయన స్థానిక భాషయైన పోర్చుగీసులో ఉన్న మోర్మన్ గ్రంథ ప్రతిని నేను ఆయనకు బహూకరించాను. ఆయన కృతజ్ఞతాపూర్వకంగా ఆ గ్రంథాన్ని అంగీకరించినప్పుడు, దాని పేజీలలో ఉన్న ప్రభువు మాటలలో ఆయన జనుల కొరకు కనుగొనబడు నిరీక్షణ, వాగ్దానాల గురించి నేను సాక్ష్యమిచ్చాను.22

చిత్రం
లెసోతో రాజు మరియు రాణితో ఎల్డర్ రాస్బాండ్

మరొక సందర్భంలో, నా భార్య మెలానీ మరియు నేను, లెసోతో రాజు లెట్సీ III మరియు అతని భార్యను వారి ఇంట్లో కలిశాము.23 మాకు మా సందర్శనలో ముఖ్యమైనది వారికి మోర్మన్ గ్రంథము యొక్క ప్రతిని బహూకరించడం, తర్వాత నా సాక్ష్యాన్ని పంచుకోవడం. ఆ అనుభవం గురించి మరియు ఇతర వాటి గురించి నేను ఆలోచించినప్పుడు, కడవరి దిన లేఖనం యొక్క ఒక వచనం నా మనస్సులో మెదులుతుంది: “నా సంపూర్ణ సువార్త భూదిగంతముల వరకు, రాజులు మరియు పరిపాలకుల యెదుట బలహీనులు, సామాన్యులచేత ప్రకటింపబడాలి.”24

చిత్రం
రాయబారి పాండేతో ఎల్డర్ రాస్బాండ్
చిత్రం
అతని పవిత్ర గోత్రజనికుడు బర్తొలోమయితో సంఘ నాయకులు

జెనీవాలోని ఐక్యరాజ్యసమితిలో భారత రాయబారి ఇంద్ర మణి పాండేతో25; తూర్పు ఆర్థోడాక్స్ సంఘము యొక్క పవిత్ర గోత్రజనికుడు బర్తొలోమయితో26 ; మరియు అనేకమంది ఇతరులతో నేను మోర్మన్ గ్రంథమును పంచుకున్నాను. నేను వారికి వ్యక్తిగతంగా “మన మతము యొక్క ప్రధానరాయిని” 27 ఇచ్చి, మన విశ్వాసము యొక్క మూలరాయి28 అయిన యేసు క్రీస్తు గురించి నా సాక్ష్యాన్ని పంచుకున్నప్పుడు, ప్రభువు యొక్క ఆత్మను మాతో నేను అనుభవించాను.

ఇప్పుడు, సహోదర సహోదరీలారా, పవిత్రమైన బోధనలు, వాగ్దానాలు గల ఈ గ్రంథాన్ని ఎవరికైనా ఇవ్వడానికి మీరు మొజాంబిక్ లేదా భారత దేశానికి వెళ్ళనక్కరలేదు లేదా రాజులను, పాలకులను కలవాల్సిన అవసరం లేదు. మీ స్నేహితులు, కుటుంబము, మీతోపాటు పని చేసేవారు, మీ సాకర్ శిక్షకుడు లేదా మీ సంతలో రైతుకు మోర్మన్ గ్రంథమును ఇవ్వమని ఈ దినము నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ గ్రంథములో కనుగొనబడే ప్రభువు యొక్క వాక్యము వారికి అవసరము. అనుదిన జీవితము మరియు రాబోయే నిత్యజీవము గురించిన ప్రశ్నలకు జవాబులు వారికి అవసరము. వారి ముందు ఉంచబడిన నిబంధన బాట గురించి, వారి కొరకు ప్రభువు యొక్క స్థిరమైన ప్రేమ గురించి వారు తెలుసుకోవాలి. అవన్నీ మోర్మన్ గ్రంథములో ఉన్నాయి.

మీరు మోర్మన్ గ్రంథాన్ని వారికి ఇచ్చినప్పుడు, దేవుని వాక్యానికి వారి మనస్సులను, హృదయాలను మీరు తెరుస్తున్నారు. గ్రంథము యొక్క ముద్రించబడిన ప్రతులను మీతోపాటు తీసుకువెళ్ళవలసిన అవసరం లేదు. మీ మొబైల్ ఫోనులో సువార్త గ్రంథాలయ యాప్‌లో లేఖన విభాగం నుండి మీరు దీనిని సులువుగా పంచుకోవచ్చు.29

వారి జీవితాల్లో సువార్త ద్వారా ఆశీర్వదించబడే వారందరి గురించి ఆలోచించండి, ఆపై మీ ఫోన్ నుండి మోర్మన్ గ్రంథ ప్రతిని వారికి పంపండి. మీ సాక్ష్యాన్ని మరియు మీ జీవితాన్ని ఈ పుస్తకం ఎలా ఆశీర్వదించిందో గుర్తుంచుకోండి.

ప్రియమైన నా స్నేహితులారా, మోర్మన్ గ్రంథముతో భూమిని వరదలా ముంచివేయడంలో మన ప్రియమైన ప్రవక్త, అధ్యక్షులు నెల్సన్ గారిని అనుసరించమని ప్రభువు యొక్క అపొస్తలునిగా నేను మీకు ఆహ్వానమిస్తున్నాను. అవసరం చాలా గొప్పది; మనం ఇప్పుడు పని చేయాలి. “కేవలము సత్యమును ఎక్కడ కనుగొనవలెనో తెలియకపోవుట వలన దానిని యెరుగకయున్న”31 వారిని సమీపించాలని మీరు ప్రేరేపించబడినప్పుడు, మీరు “భూమిపై అత్యంత గొప్ప కార్యము, ఇశ్రాయేలు సమకూర్పు”30 నందు పాల్గొంటున్నారని నేను వాగ్దానమిస్తున్నాను. ఈ గ్రంథము మీ జీవితాన్ని ఎలా మార్చింది మరియు మిమ్మల్ని దేవునికి, ఆయన శాంతికి,32 మరియు ఆయన “గొప్ప సంతోషకరమైన సువార్తలకు”33 ఎలా దగ్గర చేసింది అనేదాని గురించి మీ సాక్ష్యము వారికి అవసరము.

దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి, “ఈ దినము” ప్రభువైన యేసు క్రీస్తు యొద్దకు, పునఃస్థాపించబడిన ఆయన సువార్త యొద్దకు ఆత్మలను తీసుకురావడానికి వెలుగులోనికి వచ్చేందుకు మోర్మన్ గ్రంథము ప్రాచీన అమెరికాలో దైవిక రూపకల్పనచేత సిద్ధపరచబడిందని నేను సాక్ష్యమిస్తున్నాను. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.

వివరణలు

  1. జేకబ్ 2:2–3; మోషైయ 2:14, 30; 5:7; ఆల్మా 7:15; మరియు మోర్మన్ గ్రంథములోని అనేక ఇతర వాక్యాలను చూడండి.

  2. మోషైయ 2:9.

  3. ఆల్మా 53:20.

  4. Teachings of Presidents of the Church: Joseph Smith (2007), 64. 1841, నవంబర్ 28 న పన్నెండుమంది అపొస్తలులతో కూడిన సలహాసభ‌లో జోసెఫ్ స్మిత్ ఇచ్చిన పూర్తి ప్రకటన: “నేను సహోదరులకు మోర్మన్‌ గ్రంథము భూమిపైయున్న మరేయితర గ్రంథము కన్నను మిక్కిలి ఖచ్చితమైనదని, మన మతము యొక్క ప్రధాన రాయి అని మరియు ఒక మనుష్యుడు ఏ ఇతర గ్రంథము కన్నను దీని యొక్క సూక్తులననుసరించిన యెడల దేవునికి చేరువగునని చెప్పియున్నాను” “సరైనది” అనే ముఖ్య ప్రస్తావన, పుస్తకం యొక్క అనువాదంలో పొందబడిన బయల్పాటుకు మరియు సువార్త యొక్క “సరళమైన మరియు ప్రశస్థమైన” సత్యాలను మరే ఇతర పుస్తకం కంటే మెరుగ్గా స్థాపించే మోర్మన్ గ్రంథములో బోధించబడిన సిద్ధాంతానికి కారణమని చెప్పవచ్చు. (1 నీఫై 13:40 చూడండి).

  5. జీవముతో ఉన్న క్రీస్తు: అపొస్తలుల యొక్క సాక్ష్యము,” ప్రథమ అధ్యక్షత్వము మరియు పన్నెండుమంది అపొస్తలుల సమూహము చేత ప్రకటన, జనవరి 1, 2000 చూడండి: “యేసు జీవముతో యున్న క్రీస్తని, దేవుని యొక్క అమర్త్యుడైన కుమారుడని—. అతడు గొప్ప రాజైన ఇమ్మానుయేలు, తన తండ్రి కుడి పార్శ్వమందు ఈనాడు నిలిచియున్నవాడు. అతడు ఈ లోకమునకు వెలుగు, జీవము మరియు నిరీక్షణయైయున్నాడు. అతని మార్గము ఈ జీవితంలో సంతోషము వైపు నడిపించుటకు మరియు రాబోయే లోకములో నిత్య జీవితము వైపు నడిపించుటకు త్రోవయై యున్నది అని ఆయన చేత క్రమముగా నియమింపబడిన అపొస్తలులుగా మేము సాక్ష్యమిచ్చుచున్నాము. సాటిలేని బహుమానమైన అతని దివ్యమైన కుమారునికై దేవునికి కృతజ్ఞతలు” (ChurchofJesusChrist.org).

  6. యెషయా 49:26; 1 నీఫై 21:26; 22:12; సిద్ధాంతము మరియు నిబంధనలు 66:1 చూడండి.

  7. దేవుని వాక్యం లేఖనాలలో కనిపిస్తుంది. ఉదాహరణకు, మోర్మన్‌ గ్రంథములో, లేమన్ మరియు లెముయెల్‌లు లీహై స్వప్నమును సూచించి, “ఇనుప దండము అంటే ఏమిటి?” అని ప్రశ్నించారు. నీఫై చెప్పినట్లుగా, “దేవుని వాక్యమును ఆలకించి, దానిని గట్టిగా పట్టుకొనియుండు వారెన్నడూ నశించరు; అంతేకాక శోధనలు మరియు నాశనమునకు నడిపించునట్లు అపవాది యొక్క అగ్ని బాణములు వారిని అంధులుగా చేయలేవు” (1 నీఫై 15:23–24).

  8. యేసు క్రీస్తు సువార్త సంపూర్ణత యొక్క పునఃస్థాపన: ప్రపంచమునకు ద్విశతాబ్ది ప్రకటన” చూడండి, అది క్రింది వాటిని కలిగియుంది: “1830 ఏప్రిల్ 6 తేదీన ఏర్పాటు చేయబడిన యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము, క్రీస్తు యొక్క పునఃస్థాపించబడిన క్రొత్త నిబంధన సంఘము అని మేము ప్రకటించాము. ఈ సంఘము దాని ప్రధాన మూలరాయియైన యేసు క్రీస్తు యొక్క పరిపూర్ణ జీవితముతో, ఆయన అనంతమైన ప్రాయశ్చిత్తము మరియు యధార్థమైన పునరుత్థానముతో అనుసంధానించబడినది. యేసు క్రీస్తు మరొకసారి అపొస్తలులను పిలిచి, వారికి యాజకత్వ అధికారమును అనుగ్రహించెను. ఆయన మనందరినీ తన యొద్దకు, ఆయన సంఘము యొద్దకు రమ్మని, పరిశుద్ధాత్మను, రక్షణ విధులను, శాశ్వతమైన ఆనందమును పొందమని ఆహ్వానించుచున్నారు. వాగ్దానము చేయబడిన పునఃస్థాపన నిరంతర బయల్పాటు ద్వారా ముందుకు సాగునని మేము సంతోషముగా ప్రకటించుచున్నాము. “సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చునప్పుడు,” ఈ భూమి మునుపటిలా ఇంకెన్నడూ ఉండదు ( ఎఫెసీయులకు 1:10 ) (ChurchofJesusChrist.org).

  9. 2 నీఫై 4:16.

  10. See Quentin L. Cook, “Be Not Weary in Well-Doing” (Brigham Young University devotional, Aug. 24, 2020), speeches.byu.edu; Eliza Smith-Driggs, “This Week on Social: How to Develop a Love for the Lord, Yourself and Others,” Church News, July 17, 2020, thechurchnews.com.

  11. మూడవ పఠనం, పసుపు: భూగర్భ శాస్త్రం లేదా భూగోళశాస్త్రం; నాల్గవ పఠనం, నలుపు: మోర్మన్‌ గ్రంథము యొక్క కథాంశం.

  12. “యేసు క్రీస్తు యొక్క మరియొక నిబంధన” అనేది మోర్మన్ గ్రంథము యొక్క సంచికలన్నిటికి ఉపశీర్షికగా జతచేయబడింది. శీర్షిక పేజీలో పేర్కొన్న విధంగా, పుస్తకం యొక్క ఉద్దేశ్యాన్ని మరింత నొక్కిచెప్పడానికి సంఘ నాయకులు పేరును మార్చారు: “యేసే క్రీస్తు అని, నిత్యుడగు దేవుడని, సమస్త జనములకు తననుతాను ప్రత్యక్షపరచుకొనునని యూదుని, అన్యజనుని ఒప్పించుటకునై యున్నది.”

  13. యేసు క్రీస్తు శిష్యులుగా ఉండడం ఆయన పట్ల మనకున్న ప్రేమకు నిదర్శనం. శిష్యులు బాప్తిస్మం పొందారు; వారు యేసు క్రీస్తు నామమును తమపైకి తీసుకున్నారు; అపొస్తలుడైన పేతురు వివరించిన విధంగా వారు ఆయన లక్షణాలను స్వీకరించడం ద్వారా ఆయనను అనుసరించడానికి ప్రయత్నిస్తారు: “ఆ హేతువుచేతనే మీమట్టుకు మీరు పూర్ణజాగ్రత్తగలవారై, మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనము నందు భక్తిని, భక్తియందు సహోదరప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి.” (2 పేతురు 1:5–7; Preach My Gospel: A Guide to Missionary Service [2019], 121–32) కూడా చూడండి.

  14. అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్, అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన గుండె శస్త్రచికిత్స వైద్యుడు, 1984లో పన్నెండుమంది అపొస్తలుల సమూహమునకు పిలుపునిచ్చే ముందు, 1986లో ఘనాలోని అక్రాలో ఉన్న ఒక వైద్య పాఠశాలలో గుండె శస్త్రచికిత్స చరిత్రపై ఉపన్యాసం ఇచ్చారు. మీడియా ద్వారా తరువాత ఇంటర్వ్యూలో, “[ప్రజలు] మంచి పౌరులుగా మారడానికి, బలమైన కుటుంబాలను నిర్మించడానికి, నిజమైన సంతోషాన్ని పొందేందుకు మరియు భూమిలో అభివృద్ధి చెందడానికి ప్రభువు యొక్క సేవకుడిగా అక్కడ ఉన్నానని” ఆయన వివరించారు.” ఆయన 2001, నవంబర్ 16న అక్రా, ఘనా దేవాలయ శంకుస్థాపన కోసం ఘనాలోని అక్రాకు తిరిగి వచ్చారు (see “Ground Broken for First Temple in West Africa,” Church News, Nov. 24, 2001, thechurchnews.com).

  15. General Handbook: Serving in The Church of Jesus Christ of Latter-day Saints, 5.1.1.1 చూడండి: “మన కాలంలో, అపొస్తలులుగా నియమించబడడానికి మరియు పన్నెండుమంది అపొస్తలుల సమూహములో సేవ చేయడానికి సంఘ అధ్యక్షుడి ద్వారా ప్రభువు పురుషులను పిలుస్తారు (సిద్ధాంతము మరియు నిబంధనలు18:26–28)” (ChurchofJesusChrist.org).

  16. రస్సెల్ ఎమ్. నెల్సన్, “మోర్మన్ గ్రంథము: అది లేకుండా మీ జీవితం ఎలా ఉంటుంది?””, లియహోనా, నవ. 2017, 60.

  17. 3 నీఫై 11:10–11.

  18. రస్సెల్ ఎమ్. నెల్సన్, “మోర్మన్ గ్రంథము: అది లేకుండా మీ జీవితం ఎలా ఉంటుంది?,” 61 చూడండి.

  19. రస్సెల్ ఎమ్. నెల్సన్, “మోర్మన్ గ్రంధము: అది లేకుండా మీ జీవితం ఎలా ఉంటుంది?,” 62.

  20. మోషే 7:62 చూడండి.

  21. బీరా మొజాంబిక్ దేవాలయాన్ని 2021 ఏప్రిల్ 4న అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ప్రకటించారు. హిందూ మహాసముద్రం తీరంలో ఉన్న బీరాలో ఐదు లక్షల కంటే ఎక్కువ మంది ప్రజలు నివసిస్తున్నారు.

  22. మోర్మన్‌ గ్రంథములో కనిపించే నిరీక్షణ మరియు వాగ్దానాలకు ఉదాహరణలు 2నీఫై 31:20; జేకబ్ 4:4–6; ఆల్మా 13:28–29; 22:16; 34:41; ఈథర్ 12:32; మొరోనై 7:41; 8:26 లో ఉన్నాయి.

  23. డర్బన్ సౌత్ ఆఫ్రికా దేవాలయ ప్రతిష్టాపనకు కొరకు ఆఫ్రికాలో కేటాయించిన పనిలో ఉన్నప్పుడు, ఎల్డర్ మరియు సహోదరి రాస్బాండ్‌లు 2020, ఫిబ్రవరి 10న రాజ కుటుంబంతో సమావేశమయ్యారు.

  24. సిద్ధాంతము మరియు నిబంధనలు 1:23.

  25. ఎల్డర్ రాస్బాండ్ 2021 సెప్టెంబరు 17న ఇటలీలోని బోలోగ్నాలో ఇంటర్‌ఫెయిత్ ఫోరమ్‌కు కేటాయించిన పనిలో ఉన్నప్పుడు, జెనీవాలోని ఐక్యరాజ్యసమితి మరియు ఇతర అంతర్జాతీయ సంస్థలకు భారతదేశ శాశ్వత ప్రతినిధి, రాయబారి ఇంద్ర మణి పాండేతో సమావేశమయ్యారు.

  26. ఎల్డర్ రాస్బాండ్ 2021 సెప్టెంబరు 13న ఇటలీలోని బోలోగ్నాలో ఇంటర్‌ఫెయిత్ ఫోరమ్‌కు కేటాయించిన పనిలో ఉన్నప్పుడు, ఈస్టర్న్ ఆర్థోడాక్స్ సంఘమునకు చెందిన పరిశుద్ధ క్రైస్తవ సంబంధిత గోత్రజనికుడు బర్తొలోమయిని కలిశారు.

  27. Teachings: Joseph Smith, 64. కీలకమైన నడిమధ్య రాయి ఏదంటే వంపు పైభాగంలోని చీలిక ఆకారపు రాయి, ఇది ఇతర రాళ్ళను కలిపి బిగిస్తుంది. మోర్మన్ గ్రంథము ఏ విధంగా “మన మతము యొక్క ప్రధాన రాయియో” అర్థం చేసుకోవడంలో మీ కుటుంబ సభ్యులకు సహాయపడడానికి మీరు పైభాగంలోని చీలిక ఆకారాపు రాయితో ఒక వంపును నిర్మించవచ్చు లేదా గీయవచ్చు. మోర్మన్‌ గ్రంథము సభ్యుల జీవితాలకు “ప్రధానరాయి” గా పనిచేస్తుంది, వారు నిబంధన మార్గంలో దృఢంగా ఉండేందుకు సహాయం చేస్తుంది.

  28. ఎఫెసీయులకు 2:19-20 చూడండి. అటువంటి ప్రేమ మరియు సేవకు యేసు క్రీస్తు పరిపూర్ణమైన మాదిరి. దేవాలయం వద్ద మూల రాయి వేయడం, దేవుని ఇంటి పునాది యొక్క మూలను ఏర్పరిచే ప్రధాన రాయికి ప్రతీక అయినట్లే, యేసుక్రీస్తు మన విశ్వాసానికి మరియు మన రక్షణకు మూలస్తంభం. మనం జీవించునట్లుగా ఆయన తన జీవితాన్ని ఇచ్చాడు; బలంలో, ఉద్దేశ్యంలో లేదా ప్రేమలో అతనికి సాటి ఎవరూ లేరు.

  29. మీరు దీనిని మీ మొబైల్ ఫోన్ నుండి పంచుకోవచ్చు. ఒక మార్గం ఏమిటంటే,సువార్త గ్రంథాలయ యాప్‌ని తెరిచి, “లేఖనాలు” సేకరణకు వెళ్ళి, ఆపై ఎగువన ఉన్న “ఇప్పుడే పంచుకోండి”ని నొక్కడం. లేదా మోర్మన్‌ గ్రంథము యాప్‌లో నుండి మీరు “పంచుకోండి” చిహ్నాన్ని నొక్కవచ్చు, ఇది ఒక స్నేహితుడు అతని లేదా ఆమె ఫోన్‌ని ఉపయోగించి సులభంగా స్కాన్ చేయగల QR కోడ్‌ను ప్రదర్శిస్తుంది.

  30. Russell M. Nelson, “Hope of Israel” (worldwide youth devotional, June 3, 2018), HopeofIsrael.ChurchofJesusChrist.org. “2018, జూన్ 3న, అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ మరియు ఆయన భార్య వెండీ డబ్ల్యు. నెల్సన్, ‘ప్రభువు యొక్క యువ సైనికదళంలో చేరమని’ మరియు ‘గొప్ప సవాలు, గొప్ప హేతువు మరియు భూమిపై గొప్ప కార్యము’లో పాలుపంచుకోమని యువతను ఆహ్వానించారు. మరియు అతిపెద్ద సవాలు ఏమిటి? ఇశ్రాయేలు సమకూర్పు” (Charlotte Larcabal, “A Call to Enlist and Gather Israel,” New Era, Mar. 2019, 24).

  31. సిద్ధాంతము మరియు నిబంధనలు 123:12.

  32. 2 నీఫై 4:27; మోషైయ 4:3; 15:18; ఆల్మా 46:12 చూడండి.

  33. 1 నీఫై 13:37.