సర్వసభ్య సమావేశము
దేవాలయంపై దృష్టిసారించండి
2022 అక్టోబరు సర్వసభ్య సమావేశము


దేవాలయంపై దృష్టిసారించండి

దేవాలయంలో గడిపే అధిక సమయం ఇంకేది కూడా చేయలేని విధంగా మీ జీవితాన్ని ఆశీర్వదిస్తుందని నేను వాగ్దానమిస్తున్నాను.

ప్రియమైన సహోదర సహోదరీలారా, సర్వసభ్య సమావేశం యొక్క అద్భుతమైన ఈ ఐదు సభలలో మనం మరొక్కసారి పరలోకాలు తెరువబడుటను అనుభవించాము! మీరు మీ మనోభావాలను నమోదు చేసుకొని, వాటిని అనుసరించాలని నేను ప్రార్థిస్తున్నాను. మన పరలోక తండ్రి మరియు ఆయన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వారి సహాయం కోరడానికి మీ ప్రయత్నాలను హెచ్చించమని నేను మిమ్మల్ని కోరుతున్నాను.

ఇటీవల నాకు, సహోదరి నెల్సన్‌కు మోర్మన్ గ్రంథ వీడియోలు సిరీస్ యొక్క క్రొత్త సీజన్ 4 ముందస్తు ప్రదర్శన చూసే అవకాశం కలిగింది.1 వాటిచేత మేము ప్రేరేపించబడ్డాము! నీఫైయులకు రక్షకుని ప్రత్యక్షతను వర్ణించే దృశ్యం నుండి ఒక సంక్షిప్త భాగాన్ని నేను మీకు చూపించనా.

దేవాలయం వద్ద జనులకు ప్రత్యక్షమవడానికి రక్షకుడు ఎంచుకోవడం విశేషం. అది ఆయన మందిరం. అది ఆయన శక్తితో నింపబడింది. ప్రభువు మన కొరకు ఇప్పుడు చేస్తున్న దానిని మనం ఎప్పటికీ మరచిపోకూడదు. ఆయన తన దేవాలయాలను మరింత అందుబాటులోకి తెస్తున్నారు. మనం దేవాలయాలను నిర్మించే వేగాన్ని ఆయన పెంచుతున్నారు. ఇశ్రాయేలీయులను సమకూర్చడంలో సహాయం చేయడానికి మన సామర్థ్యాన్ని ఆయన హెచ్చిస్తున్నారు. మనలో ప్రతీఒక్కరు ఆత్మీయంగా శుద్ధి కావడాన్ని కూడా ఆయన సులభతరం చేస్తున్నారు. దేవాలయంలో గడిపే అధిక సమయం ఇంకేది కూడా చేయలేని విధంగా మీ జీవితాన్ని ఆశీర్వదిస్తుందని నేను వాగ్దానమిస్తున్నాను.

ప్రస్తుతం మనము 168 ఉపయోగంలో ఉన్న దేవాలయాలను, నిర్మాణంలో ఉన్న 53 క్రొత్త దేవాలయాలను మరియు పూర్వ నిర్మాణ రూపకల్పన దశలో ఉన్న మరో 54 దేవాలయాలను కలిగియున్నాము.2 కింది ప్రతి స్థలంలో ఒక కొత్త దేవాలయాన్ని నిర్మించాలనే మా ప్రణాళికలను ప్రకటిస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను: బుసాన్, కొరియా; నాగా, ఫిలిప్పీన్స్; శాంటియాగో, ఫిలిప్పీన్స్; ఏకేట్, నైజీరియా; చిక్లేయో, పెరూ; బ్యూనస్ ఎయిర్స్ సిటీ సెంటర్, అర్జెంటీనా; లోండ్రినా, బ్రెజిల్; రిబీరో ప్రేటో, బ్రెజిల్; హ్యూహూటెనాంగో, గ్వాటమాల; జాక్సన్విల్లే, ఫ్లోరిడా; గ్రాండ్ రాపిడ్స్, మిచిగాన్; ప్రోస్పర్, టెక్సాస్; లోన్ మౌంటైన్, నెవాడా; మరియు టాకోమా, వాషింగ్టన్.

ప్రస్తుతమున్న దేవాలయానికి ప్రయాణించే సమయం ప్రధాన సవాలుగా ఉన్న ఎంపిక చేయబడిన పెద్ద మహానగర ప్రాంతాల్లో బహుళ దేవాలయాలను నిర్మించడానికి కూడా మేము ప్రణాళిక చేస్తున్నాము. కావున, క్రొత్త దేవాలయాలను నిర్మించడానికి మెక్సికో పట్టణానికి దగ్గరగా వున్న క్యూర్నావాకా, పచుకా, టోలుకా మరియు తులా అనబడే నాలుగు అదనపు ప్రదేశాలను ప్రకటించడానికి నేను సంతోషిస్తున్నాను.

నా ప్రియమైన సహోదర సహోదరీలారా, మీరు మునుపెన్నడూ చేయని విధానాలలో దేవాలయంపై మీ దృష్టిసారించండి. అనుదినము దేవునికి, యేసు క్రీస్తుకు దగ్గరవ్వాలని నేను మిమ్మల్ని దీవిస్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మనము మళ్ళీ కలుసుకునే వరకు దేవుడు మీకు తోడైయుండును గాక అని యేసు క్రీస్తు యొక్క పవిత్ర నామములో నేను ప్రార్థిస్తున్నాను, ఆమేన్.

వివరణలు

  1. ఈ క్రొత్త వీడియోలు, సువార్త గ్రంథాలయము మరియు ఇతర ఛానెల్‌లలో అనేక భాషలలో అందుబాటులో ఉంటాయి. సమావేశము తర్వాత, ఈరోజు నుండి ప్రతీవారం ఎపిసోడ్‌లు ప్రచురించబడతాయి.

  2. 2022 అక్టోబర్ 1 నాటికి, మరో నాలుగు దేవాలయాలు పునరుద్ధరించబడుతున్నాయి (సెయింట్ జార్జ్ యూటా, మాంటై యూటా, సాల్ట్‌లేక్ మరియు కొలంబస్ ఒహైయో), మరియు మూడు దేవాలయాలు సమర్పణ కోసం వేచి ఉన్నాయి (హామిల్టన్ న్యూజిలాండ్, క్విటో ఈక్వెడార్ మరియు బెలెమ్ బ్రెజిల్).