సర్వసభ్య సమావేశము
మీ సంతానము కొరకు
2023 అక్టోబరు సర్వసభ్య సమావేశము


మీ సంతానము కొరకు

మీరు ప్రారంభించిన, లేదా వారసత్వముగా మీరు పొందిన ఈ అందమైన విశ్వాసపు గొలుసులో బలహీనమైన లింకుగా ఉండకండి. బలమైనదిగా ఉండండి.

కొన్ని సంవత్సరాల క్రితం, దక్షిణ అమెరికా వాయువ్య ప్రాంతంలో నేను సేవ చేస్తున్నప్పుడు, పెరూ, లిమాలో నివసిస్తుండగా, నాకు కలిగిన అందమైన అనుభవాన్ని మీతో పంచుకోవాలని కోరుతున్నాను.

ఒక తీరికలేని వారాంతము నియమించబడిన పనుల తరువాత నేను ఇంటికి తిరిగి వస్తుండగా అది జరిగింది. చివరికి విమానశ్రయ ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ పూర్తి చేసిన తరువాత, మేము సాధారణంగా ఉపయోగించే టాక్సీ సేవల నుండి ఒక స్నేహపూర్వకమైన టాక్సీ డ్రైవరు నా కోసం ఎదురుచూడటం నేను చూసాను. అతడు నన్ను తన కారు వద్దకు తీసుకొని వెళ్ళాడు, మరియు విశ్రాంతి తీసుకొని, ఇంటికి నిశ్శబ్దమైన ప్రయాణాన్ని ఆనందించడానికి సిద్ధపడి నేను వెనుక కూర్చోన్నాను. కొన్ని ఫర్లాంగులు డ్రైవింగ్ చేసిన తర్వాత, డ్రైవర్‌కు అతని సూపర్‌వైజర్ నుండి ఫోన్ కాల్ వచ్చింది, నేను తప్పు టాక్సీని తీసుకున్నానని అతడికి చెప్పాడు. వేరొక కారు నాకోసం రిజర్వు చేయబడింది, మరియు నేను కార్లను మార్చాలని కోరిన యెడల, విమానాశ్రయానికి తిరిగి తీసుకెళ్ళమని సూపర్‌వైజర్ అతడిని అడిగాడు. అది అవసరం లేదని, మేము కొనసాగించవచ్చని నేను చెప్పాను. కొన్ని నిముషాల మౌనం తరువాత, అతడు రియెర్‌వ్యూ అద్దము గుండా నావైపు చూసాడు మరియు ఇలా అడిగాడు, “మీరు మోర్మన్ అవునా కాదా?”

మంచిది, ఆ ఆహ్వానించే ప్రశ్న తరువాత, నా మౌన క్షణాలు ముగిసిపోయాయని నేనెరుగుదును. డ్రైవరు ప్రశ్నకు సంబంధించి సంభాషణలో పాల్గోనడానికి నేను ఉత్సాహంగా ఉన్నాను.

అతడి పేరు ఒమర్, అతడి భార్య పేరు మారియా థెరిసా, మరియు వారికి ఇద్దరు పిల్లలున్నారు—కారోలినా, వయస్సు 14, రోడ్రిగో, వయస్సు 10. ఒమర్ చిన్నప్పటి నుండి సంఘ సభ్యుడిగా ఉన్నాడు. అతడి కుటుంబము చురుకుగా ఉన్నారు, కానీ కొంతకాలము, అతడి తల్లిదండ్రులు సంఘానికి వెళ్ళడం మానేసారు. ఒమర్‌కు 15 ఏళ్ళ వయస్సులో అతడు పూర్తిగా చైతన్యం లేకుండా మారాడు. ఇప్పుడు అతడు 40 సంవత్సరాల వాడు.

ఆ క్షణములో, నేను తప్పు టాక్సీ తీసుకోలేదని నేను గ్రహించాను. అది యాదృచ్ఛికమైనది కాదు! నేను ఎవరినో మరియు ప్రభువు అతడిని సంఘములో తిరిగి చురుకుగా ఉండమని పిలుస్తున్నాడు కనుక నేను అతడి టాక్సీలో ఉన్నానని అతడికి చెప్పాను

తరువాత మేము అతడు, అతడి కుటుంబము చురుకైన సంఘ సభ్యులుగా ఉన్న సమయం గురించి మాట్లాడాము. మధురమైన కుటుంబ గృహ సాయంకాలపు క్షణాలు, మరియు కొన్ని ప్రాధమిక పాటలలో కొన్ని ప్రియమైన జ్ఞాపకాలను అతడు కలిగియున్నాడు. అప్పుడు అతడు నెమ్మదిగా “నేను దేవుని యొక్క ఒక బిడ్డను”1 కొన్ని పదాలను పాడాడు.

అతడి చిరునామా, ఫోను నెంబరు, తీసుకొని, అతడి బిషప్పుకు వాటిని ఇవ్వడానికి అనుమతి పొందిన తరువాత, అతడు సంఘానికి తిరిగి వచ్చిన మొదటి రోజు నేను సంఘములో ఉండటానికి మార్గాన్ని కనుగొంటానని నేను అతడికి చెప్పాను. విమానాశ్రయం నుండి మా ఇంటికి మా ప్రయాణం ముగించాము, అదేవిధంగా అతడి గతము గురించి చర్చ కూడ ముగిసింది, మరియు మేము వేర్వేరు మార్గాలలో వెళ్ళాము.

కొన్ని వారముల తరువాత అతడి బిషప్పు నాకు ఫోను చేసి, ఒక నిర్ధిష్టమైన ఆదివారము ఒమర్ సంఘానికి హాజరు కావడానికి ప్రణాళిక చేస్తున్నాడని నాతో చెప్పాడు. నేను అక్కడ ఉంటానని అతనితో చెప్పాను. ఆ ఆదివారము, ఒమర్ తన కుమారునితో అక్కడున్నాడు. అతడి భార్య, కుమార్తై ఇంకా ఆసక్తి కలిగిలేరు. కొన్ని నెలల తరువాత, అతడి బిషప్పు నాకు మరలా ఫోను చేసాడు, యిసారి అతడి భార్య, అతడి ఇద్దరు పిల్లలు బాప్తీస్మము పొందబోతున్నారని నాకు చెప్పాడు, మరియు అక్కడ ఉండమని అతడు నన్ను ఆహ్వానించాడు. వారు సంఘ సభ్యులుగా నిర్ధారించబడిన ఆదివారము యొక్క చిత్రము ఇక్కడున్నది.

చిత్రం
వారు నిర్ధారించబడిన ఆదివారమున ఎల్డర్ గోడొయ్‌తో ఒమర్ కుటుంబము.

అదే ఆదివారము, ఒమర్, అతడి కుటుంబము సిద్ధపడిన యెడల, ఒక సంవత్సరంలో లిమా దేవాలయంలో వారి బంధనను నెరవేర్చడానికి నేను గౌరవించబడతానని నేను చెప్పాను. ఒక సంవత్సరం తరువాత, మా అందరికి జ్ఞాపకార్ధమైన క్షణములో తీయబడిన చిత్రము ఇక్కడున్నది.

చిత్రం
దేవాలయము వద్ద ఎల్డర్ గోడొయ్‌తో ఒమర్ కుటుంబము.

నేను ఈ అనుభవాన్ని మీతో ఎందుకు పంచుకుంటున్నాను? రెండు ఉద్దేశాల కొరకు దానిని నేను పంచుకుంటున్నాను.

మొదట, పునఃస్థాపించబడిన యేసు క్రీస్తు యొక్క సువార్త నుండి ఎదో కారణము చేత పడిపోయిన మంచి సభ్యుల కొరకు ప్రసంగించడానికి. రెండవది, ఈరోజు పాల్గొన్న సభ్యులలో వారు ఉండవలసినట్లుగా తమ నిబంధనలకు విశ్వసనీయంగా ఉండని వారికి ప్రసంగించడానికి కూడ. రెండు సందర్భాలలో, వారి ముందున్న తరములు ప్రభావితం చేయబడతాయి, మరియు వారి సంతానముల కొరకు దాచబడిన దీవెనలు, వాగ్దానములు అపాయములో ఉంటాయి.

నా పెరువియన్ స్నేహితుడు ఒమర్‌తో జరిగినట్లుగా, నిబంధన మార్గాన్ని విడిచిపెట్టిన మంచి సభ్యులైన మొదటి దృష్టాంతంతో ప్రారంభిద్దాం. అతడు తిరిగి రావడానికి ఎందుకు నిర్ణయించుకున్నాడని నేను అడిగినప్పుడు, అతడు, అతడి భార్య వారి పిల్లలు యేసు క్రీస్తు యొక్క సువార్తతో జీవితంలో సంతోషంగా ఉంటారని భావించారని అతడు చెప్పాడు. వారి పిల్లల కోసం సంఘానికి తిరిగి వెళ్ళడానికి ఇది దాదాపు సమయమని అతడు భావించాడు.

ఒకప్పుడు తమ కుటుంబాలలో సువార్తను కలిగి ఉండి, సంఘములో పాల్గొనరాదని వారి తల్లిదండ్రులు లేదా తాతామామ్మల నిర్ణయం కారణంగా దానిని పోగొట్టుకున్న సంఘములోని చురుకుగా లేని సభ్యులు లేదా సభ్యులు కానివారిని మనం చూసినప్పుడు చాలా బాధగా ఉంది. ఆ నిర్ణయము వారి సంతానముపై శాశ్వతమైన ప్రభావాన్ని కలిగియుంటుంది!

వారి పిల్లలు మరియు మనుమలు వారి జీవితాలలో యేసు క్రీస్తు యొక్క సువార్త భద్రతను, దీవెనల నుండి ఆటంకపరచబడుతున్నారు. ఇంకా గొప్ప విచారకమైనది, ఎదో ఒక రోజు ఉండే ఒక నిత్య కుటుంబము యొక్క వాగ్దానాలను వారు కోల్పోయారు. ఒకరి నిర్ణయము సంతతి యొక్క మొత్తము తరములు ప్రభావితం చేయబడతాయి. విశ్వాసము యొక్క వారసత్వము విచ్ఛిన్నమైంది.

అయినప్పటికినీ, విరిగినది ఏదైనా యేసు క్రీస్తు ద్వారా బాగు చేయబడవచ్చు. ఈ కారణము వలన, అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ నుండి ఈ ఆహ్వానమును దయచేసి పరిగణించండి: “ఇప్పుడు మీరు ఆ మార్గము తప్పిన యెడల, దయచేసి తిరిగి రమ్మని నా హృదయములోని సమస్త నిరీక్షణతో నేను మిమ్మల్ని ఆహ్వానించనా. మీ చింతలు ఏవైనప్పటికినీ, మీ సవాళ్ళు ఏవైనప్పటికినీ, ఈ ప్రభువు యొక్క సంఘములో, మీకు ఒక స్థానమున్నది. మీరు, ఇంకా పుట్టని తరములు నిబంధన మార్గమునకు తిరిగి వెళ్ళుటకు మీ క్రియల చేత దీవించబడతారు.”2

ఇప్పుడు, రెండవ సందర్భము గురించి మాట్లాడదాం, ఈరోజు పాల్గొన్న సభ్యులలో వారు ఉండవలసినట్లుగా తమ నిబంధనలకు విశ్వసనీయంగా ఉండని వారు. నిన్నటి నిర్ణయాలు రేపటి వాస్తవాలను ప్రభావితం చేసినట్లుగా, నేటి నిర్ణయాలు మన భవిష్యత్తును మరియు మన కుటుంబ సభ్యుల భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి.

అధ్యక్షులు డాల్లిన్ హెచ్. ఓక్స్ మనకు బోధించారు:

“పునఃస్థాపించబడిన యేసు క్రీస్తు యొక్క సువార్త భవిష్యత్తు గురించి ఆలోచించుటకు మనల్ని ప్రోత్సహిస్తుంది. … నేడు మన చర్యలను నడిపించడానికి భవిష్యత్తు గురించి గొప్ప ఉపాయాలను అది మనకు బోధిస్తుంది.

దానికి వ్యత్యాసముగా, కేవలం వర్తమానము గురించి మాత్రమే చింతించు వ్యక్తులు మనందరికి తెలుసు: ఈ రోజే ఖర్చు పెడదాం, నేడే అనుభవిద్దాం మరియు భవిష్యత్తు గురించి ఏ ఆలోచన వద్దు.

“… మనం ప్రస్తుత నిర్ణయాలు తీసుకున్నప్పుడు, మనం ఎల్లప్పుడు ‘ఇది దేనికి దారి తీస్తుంది?’”3 అని ప్రశ్నించుకోవాలి. మన ప్రస్తుత నిర్ణయాలు ఇప్పుడు మరియు నిత్యత్వములోకి మనల్ని నడిపిస్తాయా, లేదా అవి మనల్ని విచారము, కన్నీళ్ళకు నడిపిస్తాయా?

కొందరు అనుకోవచ్చు, “మనము ప్రతిరోజు సంఘానికి హాజరు కానవసరం లేదు,” లేదా “అన్ని సరిగా ఉన్నప్పుడు మనం దశమభాగం చెల్లిద్దాం,” లేదా “ఈ విషయంలో నేను సంఘ నాయకులకు సహకరించను.”

“కాని” “సంఘము సత్యమని మాకు తెలుసు, మరియు యేసు క్రీస్తు యొక్క సువార్తను మేము ఎన్నడూ విడిచిపెట్టము” అని చెప్తారు.

ఇటువంటి ఆలోచనలు గలవారు ఈ “నులి వెచ్చని” రకమైన సభ్యత్వము వారి జీవితాలపై మరియు వారి సంతానము యొక్క జీవితాలపై ఉండగల ప్రతికూలమైన ప్రభావాన్ని గ్రహించరు. తల్లిదండ్రులు చురుకుగా ఉండవచ్చు, కానీ ఈ జీవితంలో మరియు నిత్యత్వములో వారి పిల్లలను కోల్పోయే అపాయం ఎక్కువగా ఉన్నది.

వారి కుటుంబాలతో సిలెస్టియల్ మహిమను పొందని వారి గురించి, ప్రభువు చెప్పారు, “వీరు యేసును గూర్చి సాక్ష్యమందు సాహసముగా లేరు; కాబట్టి వారు మన దేవుని యొక్క రాజ్యములో కిరీటమును పొందలేదు.”4 ఇదేనా మనకు మరియు మన పిల్లలకు కావాలని మనం కోరుకున్నది? మన కోసం, మన సంతానము కోసం మనము ఎక్కువ సాహసంగా మరియు తక్కువ నులివెచ్చగా ఉండవద్దా?

అధ్యక్షులు ఎమ్. రస్సెల్ బల్లార్డ్ అదేవిధమైన ఆలోచనను కూడ ప్రసంగించారు:

“కొందరికి, నమ్మమని, నిలిచియుండమన్న క్రీస్తు యొక్క ఆహ్వానము కష్టంగా కొనసాగుతుంది. … కొందరు శిష్యులు ఒక ప్రత్యేక సంఘ నియమము లేదా బోధనను గ్రహించడానికి ప్రయాసపడతారు. మిగిలిన వారు మన చరిత్రలో చింతలు లేదా కొందరు సభ్యులు, గతము, ప్రస్తుతపు నాయకుల లోపాలను కనుగొంటారు. …

“… సంఘ సభ్యులు మరియు ప్రభువు యొక్క నాయకులను ‘వెంబడింపరాదనే’ నిర్ణయము సుదీర్ఘ-కాలము ప్రభావాన్ని కలిగియుంటుంది, అది ఎల్లప్పుడు ప్రస్తుతం చూడబడదు.”5

ఎంత విషాదకరమైన వారసత్వం వెంట వెళ్లాలి-—మరియు ఏ కారణము కోసం? అది ఏమైనప్పటికినీ, రాబోయే తరముల కొరకు అది సృష్టించే ప్రతికూల ఆత్మీయ ప్రభావమును విస్మరించడం సరిపోదు.

నా ప్రియమైన సహోదర, సహోదరులారా, నా సందేశములో నేను చెప్పిన ఈ రెండు పరిస్థితులలో ఒకటి మీరు ఎదుర్కొంటున్న యెడల, దయచేసి మీ క్రియ గమనాన్ని తిరిగి పరిగణించండి. ఈ జీవితంలో మన కోసం ఒక ప్రణాళిక ఉన్నదని మీకు తెలుసు. కుటుంబాలు నిత్యమైనవిగా ఉండవచ్చని మీకు తెలుసు. మీ కుటుంబాన్ని అపాయములో ఎందుకు ఉంచుతారు? మీరు ప్రారంభించిన, లేదా వారసత్వముగా మీరు పొందిన ఈ అందమైన విశ్వాసపు గొలుసులో బలహీనమైన లింకుగా ఉండకండి. బలమైనదిగా ఉండండి. దానిని చేయడం మీ వంతు, మరియు ప్రభువు మీకు సహాయపడతారు.

దాని గురించి ఆలోచించమని, ముందుకు చూడమని మరియు “ఇది ఎక్కడికి నడిపిస్తుందో” లెక్కించమని, అవసరమైతే మీ సంతానము కోసం మీ బాటను తిరిగి సరి చేసుకోవడానికి తగినంత సాహసంగా ఉండమని నా హృదయపూర్వకంగా నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.

వివరణలు

  1. “నేను దేవుని యొక్క బిడ్డను,” Hymns, no. 301.

  2. రస్సెల్ ఎమ్. నెల్సన్, “మనము కలిసి ముందుకు సాగినప్పుడు,” లియహోనా, ఏప్రి. 2018, 7; ఉద్ఘాటన జోడించబడింది.

  3. డాలిన్ హెచ్. ఓక్స్, “ఇది దేనికి దారితీస్తుంది?,” లియహోనా, మే 2019, 60; ఉద్ఘాటన జోడించబడింది.

  4. సిద్ధాంతము మరియు నిబంధనలు 76:79 ; వివరణ చేర్చబడింది.

  5. ఎమ్. రస్సెల్ బాల్లర్డ్, “To Whom Shall We Go,” లియహోనా, నవ. 2016, 90; ఉద్ఘాటన జోడించబడింది.