సర్వసభ్య సమావేశము
మహిమ రాజ్యములు
2023 అక్టోబరు సర్వసభ్య సమావేశము


మహిమ రాజ్యములు

మన స్వంత కోరికలు మరియు ఎంపికలు అనుమతించే ప్రతి దీవెనను మరియు ప్రతి ప్రయోజనాన్ని మనము పొందుకొనేలా చూడడానికి మనకు ప్రేమగల పరలోక తండ్రి ఉన్నారు.

యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘ సభ్యులు తరచుగా ఇలా అడగబడతారు, “మీ సంఘము ఇతర క్రైస్తవ సంఘముల నుండి ఎలా భిన్నంగా ఉంది?” మనము ఇచ్చే సమాధానాలలో యేసు క్రీస్తు యొక్క సంపూర్ణ సిద్ధాంతంఉంటుంది. ఆ సిద్ధాంతంలో ప్రధానమైనది, మన పరలోకపు తండ్రి తన పిల్లలందరినీ ఎంతగానో ప్రేమిస్తున్నారని, మనమందరం ఎప్పటికీ మహిమ రాజ్యములో జీవించాలని ఆయన కోరుకుంటున్నారనే వాస్తవము. అంతేకాదు, మనం ఆయనతో మరియు ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో శాశ్వతంగా జీవించాలని ఆయన కోరుకుంటున్నారు. మనం ఎంచుకున్న గమ్యాన్ని మరియు జీవితాన్ని నిర్ధారించే ఎంపికలను చేయడానికి ఆయన ప్రణాళిక మనకు బోధలు మరియు ఎంపికలు చేసే అవకాశాన్ని ఇస్తుంది.

I.

ఆధునిక బయల్పాటు నుండి, భూమిపై నివసించే వారందరికీ అంతిమ గమ్యం నీతిమంతులకు పరలోకము మరియు మిగిలిన వారికి శాశ్వతమైన నరక బాధలు తప్పవనే ఆలోచన తగినది కాదు అని మనకు తెలుసు. తన పిల్లల కోసం దేవుని ప్రేమపూర్వక ప్రణాళికలో మన రక్షకుడైన యేసు క్రీస్తు బోధించిన: “నా తండ్రి యింట అనేక నివాసములు కలవు” అనే ఈ వాస్తవికత కూడా ఉంది.1

బయలుపరచబడిన యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము యొక్క వెల్లడి చేయబడిన సిద్ధాంతం ఇలా బోధిస్తుంది, దేవుని పిల్లలందరూ—(మహిమరాజ్యానికి పంపబడని వారిని ఇక్కడ వివరించను) —చివరికి మహిమ యొక్క మూడు రాజ్యాలలో ఒకదానిని వారసత్వంగా పొందుతారు, అందులో అతి తక్కువ మహిమ కూడా “సమస్త జ్ఞానమును మించినది”2 అవిధేయులు తమ పాపాల కోసం బాధపడినకాలం తర్వాత, ఆ బాధ వారిని అనుసరించాల్సిన దాని కోసం సిద్ధం చేస్తుంది, అందరూ పునరుత్థానం చేయబడతారు మరియు ప్రభువైన యేసు క్రీస్తు యొక్క తుది తీర్పుకు వెళతారు. అక్కడ, మనకు బోధించబడిన మన ప్రేమగల రక్షకుడు, “తండ్రిని మహిమపరచి, తన హస్తకృత్యములన్నింటిని ఆయన రక్షించును,”3 మరియు ఆయన దేవుని పిల్లలందరినీ వారి ఎంపికల ద్వారా వారు ప్రత్యక్షపరచిన కోరికల ప్రకారం మహిమ యొక్క రాజ్యాలలోనికి పంపుతారు.

పునఃస్థాపించబడిన సంఘము యొక్క మరొక ప్రత్యేకమైన సిద్ధాంతం మరియు అభ్యాసం ఏమిటంటే, దేవుని పిల్లలందరికీ సిలెస్టియల్ రాజ్యములో అత్యున్నత మహిమకి అర్హత పొందే పవిత్ర విశేషావకాశాన్ని అందించడానికీ ఆజ్ఞలు మరియు నిబంధనలు వెల్లడి చేయబడినవి. ఆ అత్యున్నత గమ్యస్థానం సిలెస్టియల్ రాజ్యములో ఉన్నతస్థితి అనేది యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము యొక్క కేంద్రము.

ఆధునిక బయల్పాటు నుండి, కడవరి దిన పరిశుద్ధులు తమ పిల్లల కోసం దేవుని సంతోషము యొక్క గొప్ప ప్రణాళిక గురించి ఈ ప్రత్యేకమైన అవగాహనను కలిగి ఉన్నారు. మనం పుట్టకముందు ఆత్మలుగా ఉన్నప్పుడే, మన జీవితంలో ఆ ప్రణాళిక ప్రారంభమవుతుంది మరియు ఇది అమర్త్యత్వములో మనం ఎంచుకున్న ప్రయాణం యొక్క ఉద్దేశ్యం మరియు పరిస్థితులను, ఆ తర్వాత మనం కోరుకున్న గమ్యాన్ని బయల్పరుస్తుంది.

II.

మన మర్త్య ప్రయాణంలో “అన్ని రాజ్యములకు ఒక ధర్మశాస్త్రము ఇవ్వబడెను” 4 మరియు అంతిమ తీర్పులో మనం పొందే మహిమ రాజ్యం మనం అనుసరించడానికి ఎంచుకున్న ధర్మశాస్త్రము ద్వారా నిర్ణయించబడుతుందని ఆధునిక బయల్పాటు ద్వారా మనకు తెలుసు ఆ ప్రేమపూర్వక ప్రణాళిక నందు, అనేక రాజ్యాలు—అనేక నివాసములు కలవు—అందువల్ల దేవుని పిల్లలందరూ మహిమగల రాజ్యాన్ని వారసత్వంగా పొందుతారు, దాని ధర్మశాస్త్రమునకు వారు హాయిగా “కట్టుబడివుండవచ్చు.”

తండ్రి యొక్క ప్రణాళికలో ప్రతి మూడు రాజ్యాల యొక్క స్వభావం మరియు అవసరాలను మనము వివరించేటప్పుడు, మనము అత్యున్నతమైన దానితో ప్రారంభిస్తాము, ఇది యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము ద్వారా దేవుడు బయలుపరచిన దైవిక ఆజ్ఞలు మరియు విధుల యొక్క కేంద్రము. “సిలెస్టియల్” మహిమలో5 మూడు స్థాయిలు ఉన్నాయి,6 వాటిలో సిలెస్టియల్ రాజ్యములో అత్యున్నతమైనది ఉన్నతస్థితి. ఇది “ఆయన సంపూర్ణత్వమును, ఆయన మహిమను పొందినవారి నివాసం,” కాబట్టి, “వారు దేవుళ్ళు, అనగా దేవుని కుమారులు, [మరియు కుమార్తెలు]”7 మరియు “వీరు దేవుని సన్నిధిలో నిరంతరము ఎప్పటికీ జీవిస్తారు.”8 బయల్పాటు ద్వారా, ఈ దైవిక సాధ్యతను గ్రహించడానికి మరియు దైవిక లక్షణాలను అభివృద్ధి చేయడానికి అవసరమైన శాశ్వతమైన చట్టాలను, విధులను మరియు నిబంధనలను దేవుడు వెల్లడించారు. యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము యొక్క ప్రధాన దృష్టి ఇదే, ఎందుకంటే ఈ పునఃస్థాపించబడిన సంఘము యొక్క ఉద్దేశ్యం దేవుని పిల్లలను సిలెస్టియల్ మహిమలో రక్షణకు సిద్ధం చేయడం మరియు మరిముఖ్యంగా, దాని అత్యున్నత స్థాయిలో ఉన్నతస్థితిని పొందేలా చేయడం.

నిత్యమైన సత్యముపై స్థాపించబడిన దేవుని ప్రణాళికకు, విశ్వాసులందరికీ అందుబాటులోవున్న పరిశుద్ధ దేవాలయంలో స్త్రీ మరియు పురుషుల మధ్య నిత్య వివాహం యొక్క నిబంధనలకు విశ్వసనీయంగా ఉండుట ద్వారా మాత్రమే ఉన్నతస్థితి పొందవచ్చు.9 అందుచేతనే, “లింగం అనేది వ్యక్తి యొక్క పూర్వమర్త్య, మర్త్య మరియు నిత్య గుర్తింపు మరియు ఉద్దేశ్యము యొక్క ముఖ్యమైన లక్షణం”10 అని మనం బోధిస్తాము.

ఉన్నతస్థితి కొరకు సిద్ధపడడంలో మనకు సహాయపడే ప్రత్యేకమైన విలువైన బోధన ఏదనగా 1995లో కుటుంబము పై ప్రకటన.11 తండ్రి అయిన దేవునితో మరియు ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో జీవించడానికి మనల్ని సిద్ధం చేసే అర్హతలను ఆ ప్రకటనలు స్పష్టం చేస్తాయి. తన పిల్లల కోసం తండ్రి యొక్క ప్రేమపూర్వక ప్రణాళికను పూర్తిగా అర్థం చేసుకోలేని వారు ఈ కుటుంబ ప్రకటనను మార్చగల విధానము యొక్క ప్రకటనగా పరిగణించవచ్చు. దీనికి విరుద్ధంగా, కుటుంబ ప్రకటన మార్చలేని సిద్ధాంతంపై స్థాపించబడినదని, మన నిత్య అభివృద్ధిలో అత్యంత ముఖ్యమైన భాగము కాగల మర్త్య కుటుంబ సంబంధాలను నిర్వచిస్తుందని మేము ధ్రువపరుస్తున్నాము.

అపొస్తలుడైన పౌలు మహిమ యొక్క మూడు స్థాయిలను వివరించాడు, వాటిని సూర్యుడు, చంద్రుడు మరియు నక్షత్రాల మహిమలతో పోల్చాడు.12 అతను అత్యున్నతమైనది “సిలెస్టియల్” మరియు రెండవది “టెర్రెస్ట్రియల్” అని పేరు పెట్టాడు13 అతను అత్యల్పమైన దానికి పేరు పెట్టలేదు, కానీ జోసెఫ్ స్మిత్‌కు వచ్చిన ఒక బయల్పాటు దాని పేరును జోడించింది: “టిలెస్టియల్.”14 మరొక బయల్పాటు ఈ మహిమగల ప్రతి రాజ్యానికి కేటాయించబడే వ్యక్తుల స్వభావాన్ని కూడా వివరిస్తుంది. “సిలెస్టియల్ రాజ్యపు ధర్మశాస్త్రమును గైకొనలేని వారు”15 కానీ వారు ఎంచుకున్న చట్టాలకు తగినది మరియు సౌకర్యంగా “గైకొనే” మరొక మహిమ రాజ్యాన్ని వారసత్వంగా పొందుతారు. గైకొనుట, అనే పదము లేఖనాలలో సర్వసాధారణం, అంటే ఒక సురక్షితమైన ఉనికి.16 ఉదాహరణకు, టెర్రెస్ట్రియల్ రాజ్యములో ఉన్నవారు—పరలోకానికి సంబంధించిన ప్రసిద్ధ భావనతో పోల్చదగినవారు—“వీరు కుమారుని సన్నిధిని పొందుదురు గాని తండ్రి యొక్క సంపూర్ణత్వమును కాదు.”17 “వారు మనుష్యుల కపటము చేత గ్రుడ్డివారిగా చేయబడిరి,”18 కాగా “యేసు సాక్ష్యమందు శూరులుగా ఉండనివారు వీరే.”19

మహిమ రాజ్యాలలో అత్యల్పంగా, టిలెస్టియల్‌కు కేటాయించబడిన వారి యొక్క బయల్పాటు వివరణ, “టెర్రెస్ట్రియల్ రాజ్యపు ధర్మశాస్త్రమును … గైకొనలేనివాడు.”20 ఇది రక్షకుని తిరస్కరించే వారిని మరియు వారి ప్రవర్తనకు దైవిక పరిమితులను పాటించని వారిని వివరిస్తుంది. దుష్టులు తమ పాపముల కొరకు అనుభవించిన తర్వాత వారు గైకొనే రాజ్యం ఇది. ఇవి ఆధునిక బయల్పాటులో ఇలా వివరించబడ్డాయి “క్రీస్తు సువార్తనైనను, సాక్ష్యమునైనను పొందని వారు వీరే. …

“అబద్ధికులు, సోదెగాండ్రు, వ్యభిచారులు, వేశ్యాసాంగత్యమును కోరువారు, అబద్ధమును ప్రేమించి దానిని సృష్టించువారు వీరే.”21

అధ్యక్షులు రస్సెల్ ఎం. నెల్సన్ తన ప్రవచనాత్మక దృష్టితో మూడు రాజ్యాల గురించి ప్రస్తావిస్తూ ఇటీవల ఇలా వ్రాశారు: “నిత్యత్వముతో పోలిస్తే మర్త్య జీవితకాలం కేవలం సెకనులో వెయ్యోవంతు మాత్రమే. అయితే ఈ సెకనులో వెయ్యోవంతు ఎంత కీలకం! ఇది ఎలా పని చేస్తుందో జాగ్రత్తగా పరిశీలించండి: ఈ మర్త్య జీవితంలో మీరు సిలెస్టియల్ రాజ్యం, లేదా టెర్రెస్ట్రియల్ లేదా టెలిస్టియల్ యొక్క చట్టాలలో ఏ చట్టాలను పాటించడానికి సిద్ధంగా ఉన్నారు మరియు అందువల్ల, మీరు ఏ మహిమ రాజ్యంలో శాశ్వతంగా జీవిస్తారో ఎంచుకోవచ్చు. ఏమి ప్రణాళిక! ఇది మీ కర్తృత్వమును పూర్తిగా గౌరవించే ప్రణాళిక”22

III.

అపొస్తలుడైన పౌలు, ప్రభువు యొక్క బోధలు మరియు ఆజ్ఞలు మనమందరం “క్రీస్తు యొక్క సంపూర్ణత యొక్క పరిమాణాన్ని” పొందునట్లు ఇవ్వబడినవని బోధించాడు.23 ఆ ప్రక్రియకు జ్ఞానాన్ని పొందడం కంటే చాలా ఎక్కువ అవసరం. ఇది సువార్తను గూర్చి ఒప్పించబడటానికి కూడా సరిపోదు; మనం దాని ద్వారా మార్చబడేలా చర్య తీసుకోవాలి. ఏదైనా తెలుసుకోవాలని మనకు బోధించే ఇతర బోధనలకు భిన్నంగా, యేసు క్రీస్తు సువార్త మనం ఏదో కావాలని హెచ్చరిక చేస్తుంది.

అటువంటి బోధనల నుండి మనం “అంతిమ తీర్పు అనేది మనం చేసిన మంచి చెడుల మొత్తానికి విలువ కట్టడం మాత్రమే కాదని మేము నిర్ధారించాము ఇది మన చర్యలు మరియు ఆలోచనల యొక్క అంతిమ ప్రభావం—మనం ఏమి అయ్యాము అనేదానిపై ఆధారపడి ఉంటుంది. పరివర్తన అనే ప్రక్రియ ద్వారా మనం నిత్యజీవితానికి అర్హత పొందుతాము. ఇక్కడ ఉపయోగించినట్లుగా, అనేక అర్థాల ఈ పదం, స్వభావం యొక్క లోతైన మార్పును సూచిస్తుంది. ఎవరైనా ఊరికే ఆలోచించకుండా ఏదోచెస్తే సరిపోదు. సువార్త యొక్క ఆజ్ఞలు, విధులు మరియు నిబంధనలు, పరలోకపు ఖాతాలో చేయవలసిన కొన్ని డిపాజిట్ల జాబితా కాదు. యేసు క్రీస్తు సువార్త అనేది మన పరలోక తండ్రి మనం ఎలా కావాలని కోరుకుంటున్నారో అలా మారటానికి చూపే ఒక ప్రణాళిక.24

IV.

యేసు క్రీస్తు మరియు ఆయన ప్రాయశ్చిత్తం కారణంగా, మనం ఈ జీవితంలో వెనుకబడి ఉన్నప్పుడు, మనము పశ్చాత్తాపపడి, మన పరలోకపు తండ్రి మన కోసం కోరుకునే దాని వైపు నడిపించే నిబంధన మార్గంలో తిరిగి చేరవచ్చు.

మోర్మన్ గ్రంథము ఇలా బోధిస్తుంది “ఈ జీవితము [మనం] దేవుని కలుసుకొనుటకు సిద్ధపడే సమయము”25 అధ్యక్షులు జోసెఫ్ ఎఫ్. స్మిత్‌కు ప్రభువు వెల్లడించిన దాని ద్వారా “ఈ జీవితానికి” ఆ సవాలు పరిమితి ఆశాజనకమైన సందర్భం (కనీసం కొంతమంది వ్యక్తులకు) ఇప్పుడు సిద్ధాంతము మరియు నిబంధనలు 138 లో నమోదు చేయబడింది. ప్రవక్త ఇలా వ్రాశాడు, విశ్వాసముగల ఈ యుగపు పెద్దలు, ఈ మర్త్య జీవితమును వదిలి వెళ్ళినప్పుడు, దేవుని అద్వితీయ కుమారుని త్యాగము ద్వారా విమోచన, పశ్చాత్తాప సువార్తను ప్రకటించుటలో తమ కార్యములను మృతుల ఆత్మలుండు ఆ గొప్ప లోకములో పాపపు బంధకములోను, అంధకారములోనున్న వారి మధ్య కొనసాగించెదరు.

“పశ్చాత్తాపపడిన మృతులు, దేవుని మందిరంలోని విధులకు విధేయులగుట ద్వారా విమోచించబడుదురు,

“వారు తమ అతిక్రమములకు పరిహారం చెల్లించిన తర్వాత, శుద్ధి చేయబడి, వారు రక్షణ యొక్క వారసులు కనుక వారి క్రియల ప్రకారము బహుమానమును పొందుదురు.”26

అదనంగా, రక్షకుని రెండవ రాకడను అనుసరించే వెయ్యి సంవత్సరాలు, వారి మర్త్య జీవితంలో వాటిని పొందని వారికి అవసరమైన విధులను నిర్వహించడానికి వెయ్యేండ్ల పరిపాలన సమయం వుందని అని మనకు తెలుసు.27

రక్షణ ప్రణాళికలో మూడు ప్రధాన కాలాలు: (1) పూర్వ మర్త్య ఆత్మ ప్రపంచం, (2) మర్త్యత్వము మరియు (3) తదుపరి జీవితం గురించి మరియు వాటి పరస్పర సంబంధం గురించి మనకు తెలియనివి చాలా ఉన్నాయి. కానీ మనకు ఈ నిత్యమైన సత్యాలు తెలుసు: “రక్షింపబడుట వ్యక్తగత విషయమైతే, మహోన్నతస్థితిని పొందుట కుటుంబ విషయమైయున్నది.”28 మన స్వంత కోరికలు మరియు ఎంపికలు అనుమతించే ప్రతి దీవెనను మరియు ప్రతి ప్రయోజనాన్ని మనము పొందుకొనేలా చూడడానికి మనకు ప్రేమగల పరలోక తండ్రి ఉన్నారు. అతను లేదా ఆమె ఇష్టానికి విరుద్ధంగా ఎవరినీ ముద్రవేయు బంధానికి ఆయన బలవంతం చేయరని కూడా మనకు తెలుసు. నిబంధనలను పాటించే వారందరికీ ముద్ర వేయబడిన సంబంధం యొక్క దీవెనలు హామీ ఇవ్వబడతాయి, అయితే అర్హత లేని లేదా ఇష్టపడని మరొక వ్యక్తితో ముద్రవేయు బంధానికి బలవంతం చేయకూడదు.

నా ప్రియమైన సహోదరి మరియు సహోదరులారా, ఈ విషయాల సత్యాన్ని గురించి నేను సాక్ష్యమిస్తున్నాను. , “మన విశ్వాసము యొక్క కర్తయు దానిని కొనసాగించువాడునైన”29 మన ప్రభువైన యేసు క్రీస్తు గురించి నేను సాక్ష్యమిస్తున్నాను, ఆయన ప్రాయశ్చిత్తం, పరలోకంలో ఉన్న మన తండ్రి ప్రణాళిక ప్రకారం, అన్నింటినీ సాధ్యం చేస్తుందని యేసు క్రీస్తు నామంలో ఆమెన్.