సర్వసభ్య సమావేశము
అయ్యా, మేము యేసును చూడగోరుచున్నాము
2023 అక్టోబరు సర్వసభ్య సమావేశము


అయ్యా, మేము యేసును చూడగోరుచున్నాము

యేసు ఎవరో చూడాలని మరియు ఆయన ప్రేమను అనుభవించాలని మనమందరం కోరుకుంటున్నాము.

ముఖ అంధత్వం

1945వ సంవత్సరం వసంతకాలంలో ఒక రోజు, ఒక యువకుడు సైనిక ఆసుపత్రిలో మేల్కొన్నాడు. అతడు సజీవంగా ఉండటం అదృష్టం—అతడు చెవి వెనుక భాగాన కాల్చబడ్డాడు, వైద్యులు శస్త్రచికిత్స చేశారు, మరియు అతడు ఇప్పుడు సాధారణంగా నడవగలడు మరియు మాట్లాడగలడు.

విషాదకరంగా, బుల్లెట్ అతని మెదడులోని ముఖాలను గుర్తించే భాగాన్ని దెబ్బతీసింది. అతడు ఇప్పుడు తన భార్యను కాస్త గుర్తించనట్లుగా చూసాడు; తన సొంత తల్లిని కూడా గుర్తించలేకపోయాడు. అద్దంలో ముఖం కూడా అతనికి క్రొత్తదిగా వుంది—అది పురుషుడిదా లేదా స్త్రీదా అని అతడు గుర్తించలేకపోయాడు.1

అతను ముఖ అంధత్వంగా మారాడు—ఈ పరిస్థితి మిలియన్ల మంది ప్రజలను ప్రభావితం చేస్తుంది.2

తీవ్రమైన ముఖ అంధత్వం ఉన్న వ్యక్తులు నియమాలను గుర్తుంచుకోవడం ద్వారా ఇతరులను గుర్తించడానికి ప్రయత్నిస్తారు—వారు తమ కుమార్తెను ఆమె చిన్న చిన్నమచ్చల గురుతుల ద్వారా లేదా స్నేహితురాలిని ఆమె నడక ద్వారా గుర్తించే నియమం.

ఎదుగుతుండగా

ఇక్కడ రెండవ కథ ఉంది, నన్ను వ్యక్తిగతంగా ప్రభావితం చేసినది: చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు, నేను తరచుగా మా అమ్మను నియమ రూపకర్త‌గా చూసాను. నేను ఎప్పుడు ఆడుకోవాలో మరియు ఎప్పుడు పడుకోవాలో లేదా, చివరికి పెరట్లో కలుపు మొక్కలను ఎప్పుడు తీయాలో ఆమే నిర్ణయించేది.

ఆమె సహజముగా నన్ను ప్రేమించింది. నేను చాలా సార్లు ఇబ్బందిపడినాగానీ “ఆమెకు తప్పక లోబడాలి” అని మాత్రమే చూశాను.

సంవత్సరాల తరువాత మాత్రమే నేను ఆమెను నిజమైన వ్యక్తిగా చూడగాలిగాను. నేను నిజంగా ఎన్నడూ ఆమె త్యాగాన్ని గుర్తించలేదు, లేదా సంవత్సరాల తరబడి అదే రెండు పాత స్కర్ట్‌లను (నాకు కొత్త స్కూల్ దుస్తులు కొనిస్తూ) మాత్రమే ఎప్పుడూ ఎందుకు ధరిస్తూ ఉండేదో, లేదా రోజు చివరిలో, ఆమె చాలా అలసిపోయి తను త్వరగా పడుకోవాలని ఎందుకు ఆత్రుతగా వుంటుందో గమనించలేదని నేను సిగ్గుపడుతున్నాను

మనము ముఖ అంధులం కావచ్చు

బహుశా ఈ రెండు కథలు నిజంగా ఒకే కథలా ఉన్నాయని మీరు గమనించియుండవచ్చు—చాలా సంవత్సరాలు, నిజానికి, నేనూ ముఖ అంధుడిగా ఉన్నాను. నేను మా అమ్మను నిజమైన వ్యక్తిగా చూడటానికి విఫలమయ్యాను. నేను ఆమె నియమాలను చూశాను కానీ వాటిలో ఆమె ప్రేమను చూడలేదు.

ఒక విషయం చెప్పడానికి నేను మీకు ఈ రెండు కథలను చెబుతున్నాను: ఒక రకమైన ఆత్మీయ ముఖ అంధత్వంతో బాధపడుతున్న వారెవరైనా మీకు తెలుసునని నేను సంశయిస్తున్నాను (బహుశా మీరెవరైనా కావచ్చు).

దేవుణ్ణి ఒక ప్రేమగల తండ్రిగా చూడడానికి మీరు ప్రయాసపడుతుండవచ్చు. మీరు పరలోకము వైపు చూస్తూ, ప్రేమ మరియు దయ యొక్క ముఖంను కాకుండా మీరు వెళ్లవలసిన మార్గంలోనున్న దట్టమైన నియమాల సముదాయమును చూడవచ్చు. బహుశా దేవుడు తన పరలోకంలో పరిపాలిస్తున్నాడని, ఆయన ప్రవక్తల ద్వారా మాట్లాడుతున్నాడని, మరియు మీ సహోదరిని ప్రేమిస్తున్నాడని మీరు విశ్వసించి ఉండవచ్చు, కానీ ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడా అని మీరు అంతరంగమున ఆశ్చర్యపడుచుండవచ్చు.3 బహుశా మీరు మీ చేతిలో ఇనుప దండము అనుభవించియుండవచ్చు కానీ అది దానిని నడిపించే మీ రక్షకుని ప్రేమను ఇంకా అనుభూతి చెందలేదని మీరు భావించవచ్చు.4

చాలాకాలంగా ఇలాంటి వ్యక్తులు మీకు తెలుసని నేను అనుమానిస్తున్నాను, ఎందుకంటే నేను ఈవిధంగా ఉన్నాను—నేను ఆత్మీయంగా ముఖ అంధత్వం కలిగియున్నాను.

నా జీవితం నియమాలను అనుసరించడం గూర్చినది మరియు ప్రత్యేకమైన ప్రమాణాలను కొలవడం అని నేను అనుకున్నాను. దేవుడు మిమ్మల్ని పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాడని నాకు తెలుసు కానీ నాకై నేను దానిని భావించలేదు. నా పరలోక తండ్రితో ఉండటం కంటే పరలోకానికి వెళ్లడం గురించి నేను ఎక్కువగా ఆలోచించానని భయపడుతున్నాను.

నాలాగే, మీరు కూడా కొన్నిసార్లు “విమోచించు ప్రేమ గీతమును 5 పాడకుండా,” గీతమును పాడినట్లు పెదవిని కదిలిస్తే, మనం ఏమి చేయగలం?

అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ మనకు గుర్తుచేస్తున్నట్లుగా, జవాబు ఎల్లప్పుడు యేసు క్రీస్తే.6 మరియు ఇది చాలా మంచివార్త.

అయ్యా, మేము యేసును చూడగోరుచున్నాము

యోహాను సువార్త‌లో నేను ఇష్టపడే ఒక చిన్న వచనం ఉంది ఇది ముఖ్యమైన అభ్యర్థనతో ఒక శిష్యుని వద్దకు వెళ్ళిన బయటి వ్యక్తుల సమూహం గురించి చెబుతుంది. “అయ్యా, మేము యేసును [చూడగోరుచున్నాము].” అని వారు చెప్పారు.7

మనమందరం కోరుకునేది అదే—యేసు ఎవరో చూడాలని మరియు ఆయన ప్రేమను అనుభవించాలని మనము కోరుతున్నాము. సంఘములో మనం చేసే అధికమైన దానికి—మరియు నిశ్చయంగా ప్రతి సంస్కార కూడికకు ఇది కారణమై ఉండాలి. మీరు ఎలాంటి పాఠం చెప్పాలి, ఎలాంటి సమావేశాన్ని ప్రణాళిక చేయాలి, మరియు పరిచారకులను వదిలి బంతి ఆట ఆడాలా అని మీరు ఆలోచిస్తున్నట్లయితే, మీరు ఈ వచనాన్ని మీ మార్గదర్శిగా తీసుకోవచ్చు: ఇది ప్రజలు యేసు క్రీస్తును చూసి ఆయనను ప్రేమించడానికీ సహాయపడుతుందా? లేనిచో, మరేదైనా ప్రయత్నించవచ్చు.

నేను ఆత్మీయంగా ముఖ అంధత్వం కలవాడిని , నియమాలను చూసాను కాని తండ్రి యొక్క కనికరమును కాదని నేను గ్రహించినప్పుడు అది సంఘము యొక్క తప్పు కాదని నాకు తెలుసు. అది దేవుని తప్పు కాదు, మరియు సమస్తము కోల్పోయామని దీని అర్థం కాదు; ఇది మనమందరం నేర్చుకోవలసిన విషయం. పునరుత్థానికి సంబంధించి ప్రారంభ సాక్షులు కూడా తరచుగా పునరుత్థానమైన ప్రభువుతో ముఖా ముఖిగా వచ్చి ఆయనను గుర్తించకపోవడం సమాధి తోట నుండి గలిలయ తీరము వరకు, ఆయనను మొదట అనుసరించినవారు, “యేసు నిలిచియుండుట చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు.”8 వారు ఆయనను గుర్తించడం నేర్చుకోవాల్సి వచ్చింది, అలాగే మనం కూడా.9

దాతృత్వము

నేను ఆత్మీయంగా ముఖ-అంధుడిని అని గ్రహించినప్పుడు, ఆయన శిష్యులకు వాగ్దానం చేయబడిన ప్రేమతో—ఆయన కొరకు నా ప్రేమ మరియు నా కొరకు ఆయన ప్రేమతో నేను నింపబడాలని, మరియు “ఆయన ఉన్నట్లుగానే … ఆయనను చూడాలని”, “హృదయము యొక్క పూర్ణ శక్తితో” ప్రార్థించమని చెప్పిన మోర్మాన్ యొక్క సలహాను అనుసరించడం ప్రారంభించాను.10 దేవుణ్ణి ప్రేమించాలనే మొదటి గొప్ప ఆజ్ఞను అనుసరించగలగాలని మరియు “, దేవుడు మనల్ని ఆయన పూర్ణ హృదయము, శక్తి, మనస్సు, మరియు బలముతో ప్రేమిస్తున్నారు” అనే మొదటి గొప్ప సత్యమును అనుభూతి చెందాలని నేను ఏళ్ళ తరబడి ప్రార్థించాను.11

సువార్తలు

నేను నాలుగు సువార్తలు చదివాను, మరలా పలుమార్లు కూడా చదివాను,—ఈసారి నియమాలను సంగ్రహించడానికి కాదుగానీ ఆయన ఎవరో మరియు ఆయన దేనిని ప్రేమిస్తున్నారో చూడడానికి. మరియు, కాలక్రమేణా, నేను ఆయన నుండి ప్రవహించే ప్రేమ నదిలో లీనమైపోయాను.

యేసు “చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపు కలుగునని ప్రకటించుటకును, నలిగినవారిని విడిపించుటకును” పంపబడ్డాడని ఆయన బహిరంగముగా ప్రకటించారు.12

ఇది కేవలం చేయవలసిన జాబితా లేదా మంచి పేరును స్థాపించడానికి వెదికే విధానము కాదు; అది ఆయన ప్రేమ యొక్క సహజమైన వ్యక్తీకరణ.

యాదృచ్ఛికంగా సువార్తలను తెరవండి; దాదాపు ప్రతి పేజీలో—సామాజికంగా, ఆధ్యాత్మికంగా మరియు భౌతికంగా బాధపడుతున్న వ్యక్తుల కోసం ఆయన శ్రద్ధ వహించడాన్ని మనం చూస్తాము. ఆయన కలుషితమైన మరియు అపవిత్రంగా పరిగణించబడే ప్రజలను ముట్టుకున్నారు 13 మరియు ఆకలితో ఉన్నవారికి ఆహారం ఇచ్చారు.14

యేసు గురించి మీకు ఇష్టమైన కథ ఏది? దేవుని కుమారుడు సమాజంచే పూర్తిగా అంగీకరించబడని వారిని హత్తుకోవడాన్ని లేదా నిరీక్షణను అందించడాన్నిఅది మీకు చూపిస్తుందా అని నా అనుమానము—కుష్ఠరోగి,15 సమరయ స్త్రీ,16 పాపాత్మురాలైన యొక స్త్రీ,17 లేదా జాతీయ శత్రువు.18 ఆ రకమైన కృప అద్భుతమైనది.

ఆయన బయటి వ్యక్తిని ప్రశంసించిన లేదా స్వస్థపరచిన లేదా బయటి వారితో తిన్న ప్రతిసారీ వ్రాయడానికి ప్రయత్నించండి, మీరు లూకా సువార్త‌ను ముగించే సమయానికి మీ కలములో సిరా తక్కువగా ఉండటం చూస్తారు.

నేను దీనిని చూసినప్పుడు నా హృదయం ప్రేమపూర్వక గుర్తింపుతో ఉరకలు వేసింది, మరియు ఆయన నన్ను ప్రేమిస్తున్నాడని భావించడం ప్రారంభించాను. అధ్యక్షులు నెల్సన్ బోధించినట్లుగా, “మీరు రక్షకుని గురించి ఎంత ఎక్కువగా నేర్చుకుంటే, అంత సులువుగా ఆయన కనికరమును, అనంతమైన ఆయన ప్రేమను నమ్ముతారు.”19 మరియు మీరు మీ పరలోక తండ్రిని ఎక్కువగా విశ్వసిస్తారు మరియు ప్రేమిస్తారు.

యేసు “మన నిత్యుడగు తండ్రి అయిన దేవుడు ఎవరు మరియు ఎలా ఉంటారో, ఆయన ప్రతి యుగములో మరియు ప్రతి దేశంలో తన పిల్లల కొరకు ఎంత పూర్తి అంకితభావంతో ఉన్నారో మనకు చూపించడానికి,”20 వచ్చారని ఎల్డర్ జెఫ్రీ ఆర్. హాలండ్ మనకు బోధించారు.

దేవుడు “కనికరము చూపు తండ్రి మరియు [సమస్తమైన] ఆదరణను అనుగ్రహించు దేవుడు” 21 అని పౌలు చెప్పెను.

మీరు ఆయనను భిన్నంగా చూస్తున్నట్లైతే, ఆయనను కనికరము మరియు ఆదరణగల దేవునిగా గుర్తించే వరకు ప్రయత్నిస్తూ ఉండండి.

నిబంధనలు మరియు దేవుని ప్రేమ

ఆయన సన్నిధిని వెతకమని ప్రవక్తలు మనల్ని ఆహ్వానిస్తున్నారు.22 మనం మన తండ్రిని ఆరాధిస్తాము, కాని ఒక సూత్రమును కాదు అని నేను గుర్తు చేస్తున్నాను;కేవలం ఆయన నియమాలను మాత్రమే కాకుండా మనం ఆయనను అనుసరించే వరకు మరియు యేసు చేసిన విషయాలను చూచుట ద్వారా పరలోక తండ్రి యొక్క ప్రేమను23 మనము గుర్చించి గ్రహించే వరకు మనం దానిని పూర్తి చేయలేము.24

ప్రవక్తలు మరియు అపొస్తలులు నిబంధనలు గురించి మాట్లాడినప్పుడు, వారు సౌకర్యంగల ప్రదేశంలో ఉండి క్రీడాకారుల పరిస్థితిని అర్ధం చేసుకోకుండా సూచనలిస్తూ, “కష్టపడి ప్రయత్నించండి!” అని అరిచే శిక్షకులుకారు లేదా కాంట్రాక్టు బేరం విషయంలో చెప్పినట్లు పనిచెయ్యాలి, జీవించాలి అని చెప్పేవారుకారు. మన నిబంధనలు ప్రాధమికంగా బంధాలకు సంబంధించినవని25 మరియు ఆత్మీయ ముఖ అంధత్వానికి నివారణగా ఉండాలని వారు కోరుకుంటున్నారు.26 ఇవి ఆయన ప్రేమను సంపాదించడానికి నియమాలు కావు; ఆయన ఇప్పటికే నిన్ను సంపూర్ణంగా ప్రేమిస్తున్నారు. ఆ ప్రేమను అర్థం చేసుకోవడం, అనుభూతి చెందడం మరియు దానికి అనుగుణంగా మన జీవితాన్ని తీర్చిదిద్దుకోవడమే మనకు సవాలు.27

ఒక కిటికీలో నుండి చూసినట్లుగా నిబంధనల ద్వారా వెనుక ఉన్న తండ్రి దయ యొక్క ముఖాన్ని చూడటానికి మనము ప్రయత్నిస్తాము.

నిబంధనలు దేవుడు మనల్ని తన వైపుకు ఆకర్షించే మరియు మనకు తన ప్రేమను చూపించే మార్గం

దేవుని ప్రేమ యొక్క ప్రవాహము

చివరిగా, ఆయనను సేవించడం ద్వారా మనం ఆయనను చూడటం నేర్చుకోవచ్చు. “అతడు సేవించియుండని యజమానిని ఒక మనుష్యుడు ఎట్లు ఎరుగగలడు?”.28

కొన్ని సంవత్సరాల క్రితం, నేను అర్హుడనని భావించని ఒక పిలుపు నాకు వచ్చింది. నేను భయంతో తొందరగా నిద్ర లేచాను—కాని నేను ఇంతకు ముందు వినని వాక్యాన్ని మనస్సులో పెట్టుకున్నాను: అది ఆయన పిల్లల పట్ల దేవుని ప్రేమ ఒక నది లాంటిదని, మరియు సంఘంలో సేవ చేయడం అనేది ఆ నదిలో నిలబడటం లాంటిదని, దేవుని పిల్లలకు ఆయన ప్రేమను అనుభూతి చెందడానికి సహాయం చేయడంలో మనం భాగమవుతామని. ఈ సంఘములో సేవ చేస్తున్న వ్యక్తులు నది పనితీరును మెరుగుపరిచే పనివారి సమూహం, దేవుని ప్రేమను అనుభవించాల్సిన అవసరమైన ఆయన పిల్లలను సమీపించడానికి ఆయన ప్రేమ యొక్క నది ప్రవాహమును స్పష్టంగా చేయడానికి ప్రయత్నిస్తుంది

మీరు ఎవరైనప్పటికినీ, మీ గతము ఏదైనప్పటికినీ, ఈ ప్రభువు యొక్క సంఘములో, మీకు ఒక స్థానమున్నది.29

పారలు మరియు గడ్డపారలు పట్టుకొని పనిచేసే జట్టులో చేరండి. ఇతరులు దేవుని ప్రేమను అనుభవించడానికి మనం సహాయపడినట్లయితే మనం కూడ ఆ ప్రేమను అనుభూతి చెందుతాము.30

ఆయన ప్రేమపూర్వక ముఖాన్ని, ఆయన నిబంధనల ప్రేమను వెతుకుదాం, ఆపై పరిశుద్ధులతో చేతులు కలపండి, మరియు మనము కలిసి “ఇజ్రాయెల్ యొక్క విమోచకుడు” అని పాడదాం:

పునరుద్ధరించండి, నా ప్రియమైన రక్షకా,

మీ ముఖ కాంతిని;

మీ ఆత్మ-ఉల్లాసకరమైన ఓదార్పునిస్తుంది;

మరియు మీ పవిత్ర స్థలం కొరకు

మధురమైన వాంఛను తెలపండి

నిర్జీవమైన నా హృదయానికి ఆశ తీసుకురండి.31

మనము ఆయన ప్రేమపూర్వక ముఖమును వెదకుముగాక మరియు ఆయన పిల్లలకు ఆయన దయ యొక్క పాత్రలుగా ఉందుముగాక.32 యేసు క్రీస్తు నామములో, ఆమేన్.

వివరణలు

  1. హాడిన్ డి. ఎల్లిస్ మరియు మెలానీ ఫ్లోరెన్స్, “Bodamer’s (1947) Paper on Prosopagnosia,” Cognitive Neuropsychology, vol. 7, no. 2 (1990), 84–91; Joshua Davis, “Face Blind,” Wired, Nov. 1, 2006, wired.com.

  2. డెన్నిస్ నీలాన్, “How Common Is Face Blindness?,” Harvard Medical School, Feb. 24, 2023, hms.harvard.edu; see also Oliver Sacks, “Face-Blind,” The New Yorker, Aug. 23, 2010, newyorker.com.

  3. “సమావేశ కేంద్రంలోని ఈ వేదిక నుండి మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్థానిక సమావేశాలలో పదేపదే ప్రకటించబడిన సిద్ధాంతము, నియమాలు, సాక్ష్యాలు నిజమని కొంతమంది సంఘ సభ్యులు అంగీకరిస్తారు—అయినప్పటికీ, ఈ నిత్య సత్యాలు ప్రత్యేకంగా వారి జీవితాల్లో, వారి పరిస్థితులకు అన్వయిస్తాయని నమ్మడానికి కష్టపడుతుంటారు.” (డేవిడ్ ఎ. బెడ్నార్, “నీవు నాయందును నేను నీయందును నిలిచియుందుములియహోనా, 2023 మే).

  4. 1 నీఫై 8:19; 15:23 చూడండి. “ఆయన పట్ల విశ్వాసం మరియు నమ్మకం లేకుండా ప్రభువు ఆజ్ఞలను పాటించడం కష్టం.” (హెన్రీ బి. ఐరింగ్, “ప్రార్థన ద్వారా అడుగుటకు, తరువాత పొందిన జవాబును అమలు చేయడానికి విశ్వాసము,” లియహోనా, నవం. 2021).

  5. ఆల్మా 5:26.

  6. రస్సెల్ ఎమ్. నెల్సన్, “జవాబు ఎల్లప్పుడు యేసు క్రీస్తే,” లియహోనా, 2023 మే, 127–28. చూడండి

  7. యోహాను 12:21.

  8. యోహాను 20:14. ఎమ్మాయి‌కు వెళ్లే దారిలో (లూకా 24:16 చూడండి), తాళం వేసి ఉన్న గదిలో (లూకా 24:37 చూడండి), గలిలయ తీరముల వద్ద (యోహాను 21:4 చూడండి), మరియు తోట సమాధిలో, వారు యేసు నిలబడి ఉండడం చూసారు, కానీ అది యేసు అని తెలియదు (యోహాను 20:14చూడండి).

  9. మనము మన పూర్ణమనస్సుతో ఆయనను వెదకి విశ్వాసముతో కొనసాగితే, ఆయన కనుగొనబడును.

    “నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, అవి సమాధానకరమైన ఉద్దేశ్యములే గాని హానికరమైనవి కావు, ఇదే యెహోవా వాక్కు. …

    “మీరు నన్ను వెదకిన యెడల, పూర్ణమనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందరురు” (యిర్మీయా 29:11, 13).

    “ఒక దినము వచ్చును, ఆయన యందు ఆయన వలన బ్రతికింపబడిన మీరు అప్పుడు దేవుడిని కూడా చూచెదరు.

    అప్పుడు మీరు నన్ను చూచిరని, నేను ఉన్నవాడనని, మీయందున్న నిజమైన వెలుగని, మీరు నా యందు ఉన్నారని మీరు తెలుసుకొందురు” (సిద్ధాంతము మరియు నిబంధనలు 88:49–50).

    “తన పాపములను విడిచిపెట్టి, నా నామమును బట్టి ప్రార్థన చేయుచు, నా మాటకు లోబడి, నా ఆజ్ఞలను గైకొని నా యొద్దకు వచ్చు ప్రతీ ఆత్మ నా ముఖమును చూచి, నేను ఉన్నవాడను అని తెలుసుకొనును” (సిద్ధాంతము మరియు నిబంధనలు 93:1).

  10. మొరోనై 7:48. స్పష్టంగా చూడగలిగే మన సామర్థ్యంతో పౌలు దాతృత్వాన్ని కూడా అనుసంధానించాడు. దాతృత్వంపై తన గొప్ప ప్రసంగము ముగింపులో, అతను అలా వ్రాసాడు “ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము” అప్పుడు మనము “ముఖాముఖిగా చూస్తాము: … అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును” (1 కొరింథీయులకు 13:12).

  11. జెఫ్రీ ఆర్. హాలండ్, “Tomorrow the Lord Will Do Wonders among You,” లియహోనా, 2016 మే, 127. “’క్రీస్తు యొక్క స్వచ్ఛమైన ప్రేమ’ యొక్క గొప్ప నిర్వచనం ఏమిటంటే, క్రైస్తవులుగా మనం ప్రయత్నించేది కాదు, కానీ ఇతరులకు ప్రదర్శించడంలో విఫలమవడం కాదు కాని, క్రీస్తు మన పట్ల ప్రదర్శించడంలో పూర్తిగా విజయం సాధించారు. నిజమైన దాతృత్వం ఒక్కసారి మాత్రమే తెలుసు. క్రీస్తు మనపట్ల విఫలం కాని, అంతిమమైన మరియు ప్రాయశ్చిత్తం చేసే ప్రేమలో ఇది సంపూర్ణంగా మరియు పూర్తిగా చూపబడింది” (జెఫ్రీ ఆర్. హాలండ్, Christ and the New Covenant: The Messianic Message of the Book of Mormon, 336–37).

  12. లూకా 4:18, New King James Version.

  13. మత్తయి 8:3; 9:25. చూడండి.

  14. మత్తయి 14:13--21 చూడండి.

  15. మత్తయి 8:1--3 చూడండి.

  16. యోహాను 4:7–10; ఆయన సమరయుని ప్రశంసించాడు (లూకా 10:25–37 చూడండి).

  17. మత్తయి 21:31; లూకా 7:27–50; 15:6–10; యోహాను 6:2–12 చూడండి.

  18. మత్తయి 8:5--13 చూడండి.

  19. రస్సెల్ ఎమ్. నెల్సన్, “క్రీస్తు లేచియున్నాడు; ఆయనయందు విశ్వాసం పర్వతములను కదిలించును,” లియహోనా, మే 2021, 103.

  20. జెఫ్రీ ఆర్. హాలాండ్, “The Grandeur of God,” లియహోనా, నవం. 2003, 70. “నన్ను చూచినవాడు తండ్రిని చూచియున్నాడు” (యోహాను 14:9).

  21. 2 కొరింథీయులకు 1:3.

  22. కీర్తనలు 27:8; సిద్ధాంతము మరియు నిబంధనలు 88:68 చూడండి.

  23. 2 కొరింథీయులు 4:6; Pope Francis, “Misericordiae Vultus: Bull of Indiction of the Extraordinary Jubilee of Mercy,” Apostolic Letters, vatican.va.చూడండి.

  24. ఇది ఒక ముఖ్యమైన ఇతివృత్తం. ఇది కేవలం రక్షణ మరియు ఉన్నతస్థితి యొక్క కార్యము కాదు కానీ ఆయన రక్షణ మరియు ఉన్నతస్థితి యొక్క కార్యము (ప్రధాన చేతి పుస్తకం: యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘలో సేవ చేయుట, 1.2, సువార్త గ్రంథాలయము చూడండి). నేను కేవలం దేవాలయానికి కాదు ప్రభువు మందిరానికి వెళ్తాను; ఇది మోర్మన్ సంఘము కాదు, కానీ యేసు క్రీస్తు యొక్క సంఘము (రస్సెల్ ఎమ్. నెల్సన్, “సంఘము యొక్క సరియైన పేరు,” లియహోనా, 2018 నవం. 87–89 చూడండి). మన నాయకులు మనలను ఆయన వైపుకు సూచిస్తారు మరియు మనకు గుర్తుచేస్తూ ఉంటారు, “‘ప్రాయశ్చిత్తం’ అని పిలువబడే నిరాకార అస్తిత్వం ఏదీ లేదని, దాని మీద మనం సహాయం, స్వస్థత, క్షమాపణ లేదా అధికారం కోసం పిలుస్తాము. యేసు క్రీస్తు మూలాధారము” (రస్సెల్ ఎమ్. నెల్సన్, “మన జీవితాలలోనికి యేసు క్రీస్తు యొక్క శక్తిని పొందుట,” లియహోనా, మే 2017, 40).

  25. “నిబంధన మార్గం అనేది దేవునితో మన అనుబంధానికి సంబంధించినది”; అది “ప్రేమ యొక్క మార్గం— … ఒకరినొకరు శ్రద్ధ తీసుకోవడం మరియు చేరువగా ఉండటం( రస్సెల్ ఎమ్. నెల్సన్, “The Everlasting Covenant,” లియహోనా, అక్టో. 2022, 11).

    డేవిడ్ ఎ. బెడ్నార్, “The Blessed and Happy State” (address given at the seminar for new mission leaders, June 24, 2022); Scott Taylor, “Elder Bednar Shares 7 Lessons on ‘the Blessed and Happy State’ of Obedience,” Church News, June 27, 2022, thechurchnews.com.చూడండి

    “పవిత్రమైన నిబంధనలలోనికి ప్రవేశించడం మరియు యాజకత్వ విధులను యోగ్యతగా స్వీకరించడం మనలను ప్రభువైన యేసు క్రీస్తు మరియు పరలోకపు తండ్రితో కలుపుతుంది మరియు బంధిస్తుంది. దీని అర్థం మనం రక్షకుడిని మన న్యాయవాదిగా మరియు మధ్యవర్తిగా విశ్వసిస్తున్నాము మరియు జీవిత ప్రయాణంలో ఆయన యోగ్యతలు, దయ మరియు కృపపై ఆధారపడతాము. …

    నిబంధన కట్టుబాట్లను జీవించడం మరియు ప్రేమించడం అనేది ప్రభువుతో లోతైన వ్యక్తిగతమైన మరియు ఆధ్యాత్మికంగా శక్తివంతమైన సంబంధాన్ని సృష్టిస్తుంది … యేసు అప్పుడు లేఖనాల కథలలో ప్రధాన పాత్ర కంటే చాలా ఎక్కువ అవుతారు; ఆయన మాదిరి మరియు బోధనలు మన ప్రతీ కోరిక, ఆలోచన మరియు చర్యను ప్రభావితం చేస్తాయి” (డేవిడ్ ఎ. బెడ్నార్, “కానీ మేము వారిని లక్ష్యపెట్టలేదు,” లియహోనా, 2022.మే, 15).

    డి. టాడ్ క్రిస్టాఫర్సన్, “దేవునితో మన సంబంధము,” లియహోనా, 2022 మే 78–80.చూడండి.

  26. “దాని విధులు, యాజకత్వపు అధికారము లేకుండా, శరీరమందు మనుష్యులకు దైవత్వపు శక్తి ప్రత్యక్షపరచబడదు”

    “ఇది లేకుండా ఏ ఒక్కడును దేవుడైన తండ్రి ముఖమును చూచి, జీవించియుండలేడు” (సిద్ధాంతము మరియు నిబంధనలు 84:21–22). చూడండి).

  27. ప్యాట్రిసియా హాలండ్, “A Future Filled with Hope” (worldwide devotional for young adults, Jan. 8, 2023), గ్రంధాలయం:

    “మీరు [ఆయన మీకు సహాయం చేస్తాడనే ఆశ] వెంటపడి పరిగెత్తాల్సిన అవసరం లేదు; మీకు చేయరు మరియు మీరు దానిని తయారు చేయలేరు. దయ యొక్క రాజ్యంలో వలె, మీరు మీ స్వంత బలంపై లేదా మరొక వ్యక్తిపై ఆధారపడటం ద్వారా దానిని సంపాదించలేరు. ఇందులో రహస్య సూత్రాలు లేదా మంత్రాలు లేవు. …

    “వాస్తవానికి, మనం పోషించే పాత్ర ముఖ్యమైనది కానీ నిజానికి చాలా చిన్నది; దేవునికి పనిలో ఎక్కువ భాగం ఉంది. వినయం మరియు సరళతతో ఆయన వద్దకు రావడమే మన వంతు, అప్పుడు మనం చింతించనవసరములేదు మరియు భయపడనవసరములేదు.”

  28. మోషైయ 5:13; యోహాను 17:3 కూడా చూడండి.

  29. “సమస్త మానవ కుటుంబాన్ని హత్తుకోవడానికి మన ప్రేమ వృత్తాన్ని విస్తరించాలని” అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ పలుమార్లు మనల్ని అడిగారు (“సమాధానపరచువారు కావాలి,” లియహోనా, 2002 మే). 2022 మేలో ఆయన యువకులతో ఇలా అన్నారు, “లేబుల్‌లు తీర్పు తీర్చడానికి మరియు శత్రుత్వానికి దారితీస్తాయి. జాతీయత, జాతి, లైంగిక ధోరణి, లింగబేధము, విద్యా సంబంధమైన డిగ్రీలు, సంస్కృతి,లేదా ఇతర ముఖ్యమైన నిర్దేశకముల కారణంగా మరొకరి పట్ల ఏదైనా దురభిమానము లేదా దుర్భాష మన సృష్టికర్తకుఅభ్యంతరకరమైనది!”(“Choices for Eternity” [worldwide devotional for young adults, May 15, 2022], Gospel Library). ముఖ్యంగా ఆయన చెప్పారు: “ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన నల్ల సహోదర సహోదరీలు జాతివివక్ష మరియు దురభిమానపు బాధలను సహిస్తున్నందుకు నేను దుఃఖిస్తున్నాను. వేరు చేయు వైఖరులు మరియు దురభిమానపు చర్యల నుండి బయటకు నడిపించమని ప్రతిచోటనున్న మన సభ్యులకు నేడు నేను పిలుపునిస్తున్నాను. దేవుని పిల్లలందరి పట్ల గౌరవాన్ని ప్రోత్సహించమని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను” (“దేవునికి మిక్కిలి ప్రాధాన్యతనిమ్ము,” లియహోనా, 2020 నవం.).

    “దురభిమానము దేవుని యొక్క బయలుపరచబడిన వాక్యానికి అనుగుణంగా లేదు దేవుని అనుగ్రహము ఉండుట, లేకపోవుట అనేది దేవుని పట్ల మరియు ఆయన ఆజ్ఞల పట్ల మన భక్తిపై ఆధారపడుతుంది, కానీ మన చర్మపు రంగుపై కాదు లేదా మిగిలిన లక్షణాలపై కాదు.

    “… ఇందులో జాతి, స్వజాతీయత, జాతీయత, తెగ, లింగం, వయస్సు, వైకల్యం, సామాజిక ఆర్థిక స్థితి, మతపరమైన నమ్మకం లేదా అవిశ్వాసం మరియు లైంగిక ధోరణి ఆధారంగా దురభిమానము ఉంటుంది” General Handbook, 38.6.14, Gospel Library).

  30. 1 నీఫై 11:25 చూడండి.

  31. Redeemer of Israel,” Hymns, సంఖ్య. 6.

  32. రోమా 9:23 చూడండి.